senior police officer
-
ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీపై బదిలీ వేటు
చండీగఢ్: పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కాన్వాయ్‌ను అడ్డుకుని రైతులు ఆకస్మికంగా ఆందోళనకు దిగడం, ఫ్లై ఓవర్ మీదనే ప్రధాని ఆగాల్సిరావడం వంటి భద్రతా వైఫల్య ఘటనలపై పంజాబ్ రాష్ట్ర సర్కార్.. పోలీస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ప్రధానికి సరైన భద్రత కల్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై ఐపీఎస్ అధికారులను బదిలీచేశారు. బుధవారం రోజు ఘటన జరిగిన ఫిరోజ్‌పూర్ పోలీస్ పరిధి బాధ్యతలు చూసిన ఫిరోజ్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ), ఐపీఎస్ అధికారి హర్మన్దీప్ సింగ్ హాన్స్‌ను ట్రాన్స్ఫర్ చేశారు. హర్మన్దీప్ను లూథియానాలోని ఇండియన్ రిజర్వ్ బెటాలియన్(ఐఆర్బీ) మూడో కమాండెంట్‌గా బదిలీచేశారు. ఈయన స్థానంలో ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీగా నరీందర్ భార్గవ్‌ను నియమించారు. నౌనిహాల్ సింగ్, ఏకే మిట్టల్, సుఖ్చయిన్ సింగ్, నానక్ సింగ్, అల్కా మీనాలను బదిలీచేశారు. పీపీఎస్ అధికారులు హర్కమల్ప్రీత్ సింగ్, కుల్జీత్ సింగ్‌లనూ మరో చోటుకు బదిలీచేశారు. తప్పంతా ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీదే.. జాతీయ స్మారక స్తూపం వద్ద నివాళులర్పించేందుకు హుస్సైనీవాలాకు బయల్దేరిన ప్రధాని మోదీని మార్గమధ్యంలో రైతులు అడ్డుకున్న ఉదంతంపై కేంద్ర హోం శాఖకు పంజాబ్ సర్కార్ ఒక నివేదికను సమర్పించింది. జనవరి ఐదు నాటి ఘటనలో వివరణ ఇవ్వాలని బటిందా ఎస్ఎస్పీ అజయ్ మలూజాను కేంద్ర హోం శాఖ వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు శుక్రవారం పంపిన విషయం తెల్సిందే. దానిపై మలూజా ఇచ్చిన వివరణ.. హోం శాఖకు పంపిన నివేదికలో ఉంది. ఆ నివేదికలోని వివరాలు కొన్ని బహిర్గతమయ్యాయి. ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీ హర్మణ్ చేసిన తప్పు వల్లే మోదీకి భద్రత కల్పన విఫలమైందని మలూజా ఆరోపించారు. హుస్సైనీవాలాకు వెళ్లే మార్గంలో బటిందా పరిధిలోని తమ పరిధి వరకూ మోదీకి రక్షణ కల్పించామని, ఫిరోజ్‌పూర్ పరిధిలోకి కాన్వాయ్ వచ్చాకే ఈ ఘటన జరిగిందని మలూజా వివరణ ఇచ్చారు. ప్రధాని రాకకు ముందు జరిగిన ఘటనలు మొదలుకుని, రైతుల ఆందోళన, ప్రధాని బహిరంగ సభకు వెళ్లకుండా వెనుతిరగడం వరకు జరిగిన ఘటనలు, వాటి పర్యవసానాలను పంజాబ్ ప్రభుత్వం క్రమపద్ధతిలో నివేదించింది. రైతుల ఆందోళన అనేది ముందస్తు వ్యూహం కాదని, హఠాత్పరిణామం అని నివేదిక పేర్కొంది. -
వరుస కాల్పులు, సీనియర్ అధికారిపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద సుదీర్ఘంగా కొనసాగుతున్న పౌరసత్వ వ్యతిరేక సవరణ చట్టం (సిఎఎ) నిరసనలో వరుసగా కాల్పుల ఉదంతంతో ఎన్నికల సంఘం కీలక చర్య తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, నాలుగు రోజుల వ్యవధిలో రెండు వరుస కాల్పుల సంఘటనలు జరిగిన తరువాత ఎన్నికల కమిషన్ సౌత్ ఈస్ట్ (ఆగ్నేయ) డిప్యూటీ కమిషనర్ చిన్మయ్ బిస్వాల్ ను పదవి నుండి తొలగించింది. అలాగే సీనియర్ అధికారి కుమార్ జ్ఞానేష్ తాత్కాలిక డీసీపీగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. తగిన అధికారి కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా ఢిల్లీ పోలీస్ కమిషనర్ మూడు పేర్లతో కూడిన ప్యానెల్ పంపవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. దేశ రాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసనకు కేంద్రంగా ఉన్న షాహీన్ బాగ్ వద్ద భద్రతా పరిస్థితిని ఆదివారం సమీక్షించింది. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించడానికి బిస్వాల్ చర్యలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది. కాగా గురువారం, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి సమీపంలో ఒక యువకుడు నిరసనకారులపై కాల్పులు జరిపిన ఘటనలో ఒక విద్యార్థి గాయపడ్డాడు. నివారం షాహీన్ బాగ్ వద్ద పోలీసు బారికేడ్ల దగ్గర నిలబడి షాట్లు పేల్చడంతో కపిల్ గుజ్జర్ (25) "జై శ్రీ రామ్" అంటూ కాల్పులకు తెగబడ్డాడు. తన దేశంలో హిందువులు మాత్రమే వుంటారని నినదించాడు. జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆదివారం మరోసారి కాల్పుల సంఘటనతో ఉద్రిక్తత ఏర్పడింది. యూనివర్సిటీ 5వ నెంబర్ గేట్ దగ్గర కాల్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కుమార్ జ్ఞానేష్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాల్పులకు నిరసనగా సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. జామియా మిలియా వద్ద ఆదివారం కాల్పుల ఘటన చదవండి : ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది -
ఇవ్వడంలోనే ఉంది సంతోషం
ఉద్యోగం చేసేవారైనా, ఇంటిపట్టున ఉండేవారైనా ఆడవాళ్లు పొడవైన శిరోజాలను ఇష్టపడతారు. ఏ ఉద్యోగంలో ఉన్నా వాటిని వదులుకోవడానికి ఇష్టపడరు. అందుకే.. కేరళలో మహిళా పోలీస్ అధికారి అపర్ణ లవకుమార్ ఓ క్యాన్సర్ బాలిక విగ్గు కోసం పొడవాటి తన జడ కత్తిరించి ఇవ్వడం ఒక విశేషం అవడమే కాకుండా.. ఎందరికో ఆమె ప్రేరణగా నిలిచారు. త్రిశూర్ సమీపంలోని ఇరింజలకుడ మహిళా పోలీస్ స్టేషన్లో అపర్ణ సీనియర్ పోలీస్ అధికారి. 17 ఏళ్ల క్రితం పోలీసుగా విధులను చేపట్టారు అపర్ణ. ఆమె కురులు తల నుంచి మోకాలి పొడవు వరకు ఉండేవి. మూడేళ్ల క్రితం తొలిసారిగా ఆమె జుట్టును క్యాన్సర్ పేషంట్ల కోసం దానం చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ పనికి పూనుకున్నారు. ‘ముందు ఎవరికీ చెప్పలేదు. అలా చెబితే నాకు అడ్డు చెప్పేవారే ఎక్కువ ఉంటారు. ఆలోచన వచ్చిన వెంటనే సెలూన్‌కి వెళ్లిపోయాను. విగ్గులు తయారు చేసేవారికి ఆ వెంట్రుకలు ఇచ్చేశాను. ఆ విగ్గును క్యాన్సర్ బారిన పడిన పిల్లలకు చేరేలా చూశాను. ఇదో పెద్ద విషయంగా పరిగణించలేదు’’ అని చెబుతారు అపర్ణ. ప్రజలకు ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో లేను, ఇలా కొందరి పిల్లల ముఖాల్లో నవ్వులు చూడాలనుకున్నాను అంతే’’ అంటూ సంతోషంగా చెబుతున్నారు అపర్ణ. ఆత్మన్యూనతను పోగొట్టేందుకు క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగినా, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా చూడడం కష్టం. పిల్లలకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కీమో గురించి అంతగా తెలియదు. ‘‘క్యాన్సర్ బారిన పడిన పిల్లలు కీమోథెరపీ చేయించుకుని జుట్టు కోల్పోయిన తరువాత పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడ తోటి పిల్లల నుంచి ఎగతాళిని ఎదుర్కోవచ్చు. లేదంటే అందరికీ జుట్టు బాగా ఉండి తమకెందుకు ఇలా జరిగిందని బాధపడవచ్చు. ఈ ఆలోచనలు వారిలోని ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తాయి. క్యాన్సర్ బారిన పడి, కీమో థెరపీ చేయించుకున్న ఓ ప్రభుత్వ స్కూల్లో చదువుకునే అమ్మాయిని చూసినప్పుడు ఇలాగే బాధనిపించింది. అలాంటి పిల్లలు పడే బాధను తొలగించి, వారిలో ఆత్మ విశ్వాసం పెరిగేందుకు ఏం చేయచ్చు అనిపించినప్పుడు ఈ ఆలోచన వచ్చింది’’ అని చెప్పారు ఈ పోలీస్ అధికారిణి. అనుష్కా శర్మ : ‘అపర్ణ చేసిన పని సాధారణమైనదేమీ కాదు. అమెకు నా అభినందనలు’ అపర్ణకు ఇద్దరు కుమార్తెలు.ఎంఎస్సీ చదువుతున్న దేవిక, పదోతరగతి చదువుతున్న గౌరీ కూడా రెండేళ్ల క్రితం తల్లిలాగే విగ్గుల కోసం తమ పొడవైన కురులను దానం చేశారు. అపర్ణ బంధువు, తోటి మహిళా పోలీసు అధికారి కూడా ఆమె ధైర్యమైన చర్యతో ప్రేరణ పొంది తమ శిరోజాలను దానం చేశారు. బాలీవుడ్ నటి అనుష్కా శర్మ అపర్ణ పెద్దమనసుకు ప్రశంసలు కురిపించారు. వెల్లువలా వచ్చి పడుతున్న అభినందనలపై అపర్ణ స్పందిస్తూ.. తాను చేసింది పెద్ద ఘన కార్యమేమీ కాదని.. వెంట్రుకలు కత్తిరించుకుంటే ఏడాదికో, రెండేళ్లకో పెరుగుతాయని, నిజమైన త్యాగం అవయయ దానం చేసే వారిదేనని అన్నారు. – ఆరెన్నార్ -
పోలీసులంటే అందరికీ భయం..అందుకే
కేరళకు చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ అపర్ణ లవకుమార్ (46) సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్త్రీలకు సహజంగా ఉండే కేశ సౌందర్యాభిలాష గురించి ఏమాత్రం పట్టించుకోకుండా..ఔదార్యాన్ని ప్రదర్శించారు. ఇటువంటి చర్యలతో, పోలీసులు ప్రజల మధ్య అంతరం తగ్గుతుందని నమ్ముతున్నానని ఆమె చెప్పారు. సాధారణంగా పోలీసులంటే ప్రజలకు మంచి అభిప్రాయం ఉండదు. భయపడిపోతారు. కానీ మానవతా దృక్పథంతో దీన్ని మార్చాలనుకుంటున్నానని ఆమె చెప్పడం గమనార్హం. న్యూస్ మినిట్ అందించిన కథనం ప్రకారం అపర్ణ క్యాన్సర్ రోగి కోసం తన పొడవాటి జుట్టును త్యాగం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కృషి చేయాల్సి వచ్చింది. తన సీనియర్ అధికారులనుంచి ప్రత్యేక అనుమతి పొంది మరీ గుండు కొట్టించుకుని, పలువురి ప్రశంసలకు పాత్రలయ్యారు త్రిశూర్‌లోని ఇరింజలకుడలోని మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేసే ఇద్దరు బిడ్డల తల్లి క్యాన్సర్ బారిన పడినపుడు ఆమె తొలిసారి తన జుట్టును దానం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే క్యాన్సర్ అవేర్నెస్ డ్రైవ్‌లో భాగంగా స్థానిక పాఠశాలలో ఓ చిన్నారి (10) కలిసిన తరువాత తన నిర్ణయాన్ని మరింత దృఢపర్చుకున్నారు. క్యాన్సర్ రోగులకు విగ్స్ తయారు చేయడానికి తన పొడవాటి జుట్టును దానం చేశారు. కీమోథెరపీ తర్వాత జుట్టును పోగొట్టుకున్న బాధితుకు మద్దతుగా తన వంతు సాయం చేశానని అపర్ణ చెప్పారు. ఇంకో విషయం ఏమిటంటే అపర్ణ ఇంతకుముందు కూడా తన జుట్టును దానం చేశారు. అయితే అపుడు భుజాలవరకు మాత్రమే జుట్టును కత్తిరించుకున్నారు. కానీ ఈ సారి మాత్రం మొత్తం జుట్టును దానం చేయడం విశేషం. ముఖ్యంగా పిల్లలు క్యాన్సర్ బారిన పడినపుడు.. కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోతే, వారి పరిస్థితి మరీ బాధాకరం. తోటిపిల్లల వింతగా చూడటం, అవహేళన చేయడం వారి బాధను మరింత పెంచుతుంది. అందుకే మానసికంగా కృంగిపోయిన అలాంటి చిన్నారులకు సాయం చేయాలన్నదే తప్ప అందం గురించి తానెపుడూ పట్టించుకోలేదని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ఆమెకు కటింగ్ చేసిన పార్లర్ ఓనర్ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. 2008 లో, ఆసుపత్రి బిల్లు కట్టలేని బాధితునికి, అపర్ణ తన బంగారు గాజులను విరాళంగా ఇచ్చారట. అపర్ణ నిర్ణయంతో ఉన్నతాధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. కేరళ పోలీసు మాన్యువల్‌లో యూనిఫామ్‌కు సంబంధించి,ఇతర కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే మహిళలు మొత్తం గుండు చేయించు కోకూడదు. కానీ ఒక గొప్ప విషయంకోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆమె జుట్టును దానం చేయడానికి అనుమతినిచ్చినట్టు త్రిస్సూర్ పోలీసు చీఫ్ విజయకుమార్ చెప్పారు. అంతేకాదు ఒక పోలీసు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారని, ఇది నిజంగా ప్రశంసనీయమని ఆయన అభినందించారు. -
పాకిస్తాన్లో అగ్నిప్రమాదం: 10 మంది సజీవదహనం
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని తట్టా నగరంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 10 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రమాదవశాత్తూ అంటుకున్న మంటలు ఒక ఇంటి నుంచి మరొ ఇంటికి వ్యాపించాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని త్వరలో అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించి తెలియజేస్తామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. -
'గంటగంటకు ఆయన ఫోన్లు మారుస్తున్నారు'
న్యూఢిల్లీ: భార్యపై గృహహింసకు పాల్పడటమే కాకుండా హత్యయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమనాథ భారతీ గంటగంటకు తాను ఉండే చోటును, ఫోన్లను మారుస్తున్నట్లు తెలిసింది. ఒక కరడుగట్టిన నేరస్తుడిలా సోమనాథ ప్రవర్తిస్తున్నాడని పోలీసులు అన్నారు. ఎంత తప్పించుకు తిరుగుతున్నా ప్రస్తుతం ఆయన ఉన్న చోటు విషయంలో తమకు ఒక అవగాహన ఉందని, ఆగ్రా ప్రాంతంలో సోమనాథ ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు. 'సోమనాథ ఎక్కడ దాక్కున్నారో మాకు ఒక అవగాహన ఉంది. మేం త్వరలోనే ఆయనను చేరుకుంటాం. విచారణంలో భాగస్వామ్యం చేస్తాం' అని సీనియర్ పోలీసు అధికారి దీపేందర్ పాఠక్ చెప్పారు. తనను చిత్ర హింసలకు గురిచేయడమే కాకుండా హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారని సోమనాథ భారతీపై ఆయన భార్య లిపికా మిత్రా కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలని ఆయన స్ధానిక, హైకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు.