సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద సుదీర్ఘంగా కొనసాగుతున్న పౌరసత్వ వ్యతిరేక సవరణ చట్టం (సిఎఎ) నిరసనలో వరుసగా కాల్పుల ఉదంతంతో ఎన్నికల సంఘం కీలక చర్య తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, నాలుగు రోజుల వ్యవధిలో రెండు వరుస కాల్పుల సంఘటనలు జరిగిన తరువాత ఎన్నికల కమిషన్ సౌత్ ఈస్ట్ (ఆగ్నేయ) డిప్యూటీ కమిషనర్ చిన్మయ్ బిస్వాల్ ను పదవి నుండి తొలగించింది. అలాగే సీనియర్ అధికారి కుమార్ జ్ఞానేష్ తాత్కాలిక డీసీపీగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. తగిన అధికారి కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా ఢిల్లీ పోలీస్ కమిషనర్ మూడు పేర్లతో కూడిన ప్యానెల్ పంపవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. దేశ రాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసనకు కేంద్రంగా ఉన్న షాహీన్ బాగ్ వద్ద భద్రతా పరిస్థితిని ఆదివారం సమీక్షించింది. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించడానికి బిస్వాల్ చర్యలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది.
కాగా గురువారం, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి సమీపంలో ఒక యువకుడు నిరసనకారులపై కాల్పులు జరిపిన ఘటనలో ఒక విద్యార్థి గాయపడ్డాడు. నివారం షాహీన్ బాగ్ వద్ద పోలీసు బారికేడ్ల దగ్గర నిలబడి షాట్లు పేల్చడంతో కపిల్ గుజ్జర్ (25) "జై శ్రీ రామ్" అంటూ కాల్పులకు తెగబడ్డాడు. తన దేశంలో హిందువులు మాత్రమే వుంటారని నినదించాడు. జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆదివారం మరోసారి కాల్పుల సంఘటనతో ఉద్రిక్తత ఏర్పడింది. యూనివర్సిటీ 5వ నెంబర్ గేట్ దగ్గర కాల్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కుమార్ జ్ఞానేష్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాల్పులకు నిరసనగా సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు.
జామియా మిలియా వద్ద ఆదివారం కాల్పుల ఘటన
చదవండి : ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది
Comments
Please login to add a commentAdd a comment