Citizenship Amendment Bill
-
‘జన్మతః పౌరసత్వ రద్దు’ బిల్లు సెనేట్‌కు
వాషింగ్టన్: అక్రమంగా లేదంటే తాత్కాలిక వీసాల మీద వలస వచ్చిన వాళ్లకు అమెరికాలో పిల్లలు పుడితే వారికి సంక్రమించే జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా పార్లమెంట్ ఎగువసభ(సెనేట్)లో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు గురువారం ప్రవేశపెట్టారు. పుట్టే పిల్లలకు ఎలాగూ పౌరసత్వం వస్తుందన్న ఏకైక కారణంతోనే అక్రమ వలసలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇది జాతీయ భద్రతను బలహీనపరుస్తోందని ఈ బిల్లును ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సభ్యులు లిండ్సే గ్రాహమ్, టెడ్ క్రజ్, కేటీ బ్రిట్‌లు సెనేట్‌లో వ్యాఖ్యానించారు. ‘‘ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వాన్ని ప్రసాదించిన ప్రపంచంలోని 33 దేశాల్లో అమెరికా కూడా ఒకటిగా కొనసాగింది. ఈ విధానం చివరకు ‘పుట్టుకల పర్యాటకం’లా తయారైంది. ఉన్నంతలో స్థితిమంతులైన చైనా, ఇతర దేశాల పౌరులు ఉద్దేశపూర్వకంగా అమెరికాకు వచ్చి ఇక్కడ పిల్లల్ని కనేసి తమ సంతానానికి అమెరికా పౌరసత్వం దక్కేలా చేస్తున్నారు. అమెరికాకు ఇంతమంది రావడానికి జన్మతః పౌరసత్వం కూడా ఒక ప్రధాన కారణం’’ అని రిపబ్లికన్ నేతలు చెప్పారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తుర్వును విపక్ష డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో సవాల్ చేసి ఉత్తర్వు అమలుపై స్టే తెచ్చుకున్న వేళ రిపబ్లికన్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. -
కేంద్రం కీలక నిర్ణయం.. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం
ఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి పౌరసత్వ సమరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్రం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా 2019 డిసెంబర్ 11న పార్లమెంట్లో సీఐఐ చట్టానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్, బంగ్లాదేష్, పాకిస్తాన్లో హింసకు గురై.. 2014కు ముందు భారత్‌కు వచ్చిన వారందరికీ భారత పౌరసత్వం వర్తించనుంది, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బైద్దులు, పార్మీలకు వర్తించనుంది. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. video courtesy: DD INDIA LIVE -
CAA: నెల రోజుల్లో పౌరసత్వ చట్టం అమలు!
ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అమలు అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఏఏను నెల రోజుల్లో దేశమంతటా అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్.. రిజిస్ట్రేషన్ల కోసం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైతం సీఏఏ అమలుపై డ్రై రన్లను పూర్తి చేసిందని విశ్వనీయవర్గాలు ద్వారా తెలుస్తోంది. గత నెల కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ అతిత్వరలో వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం(సీఏఏ) అమలులోకి వస్తుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అప్పడు మరోసారి వివాదాస్పద పౌరసత్వ చట్టంపై తీవ్ర దుమారం రేగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను మళ్లీ తెరమీదకు తీసుకువస్తుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. దేశవ్యాప్తంగా భారీ నిరసనల మధ్య 2019లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక.. చట్టం అమలు విషయంలో కూడా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అమలు చేయటంలో తాత్కాలికంగా జాప్యం చేస్తూ వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రవేశపెట్టక ముందే.. సీఏఏను అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. -
మళ్లీ పౌరసత్వ రగడ!
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అంశం మరోసారి దుమారం రేపుతోంది. సీఏఏను వారం రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇది లోక్‌సభ ఎన్నికల లబ్ధి కోసం చేసిన ఉత్తుత్తి ప్రకటన అంటూ తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. 2019లోనే మోదీ సర్కారు సీఏఏ చట్టం చేసినా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, ఆందోళనలతో దాని అమలు వాయిదా పడుతూ వస్తోంది. కానీ సీఏఏ అమలుపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పట్టుదలగా ఉందని ఇటీవలి వరుస పరిణామాలు చెబుతున్నాయి. ఎవరేమనుకున్నా దేశమంతటా దాని అమలు తప్పదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గత నెలలోనే స్పష్టం చేశారు. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కలి్పంచడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచి్చన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కలి్పస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. ఎందుకు వ్యతిరేకత... ఈశాన్య రాష్ట్రాలు, పశి్చమబెంగాల్తో పాటు దేశ రాజధాని ప్రాంతంలోనూ పాక్, బంగ్లా, అఫ్గాన్ల నుంచి వలస వచి్చన ముస్లిమేతర మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా బెంగాల్లో మతువా సామాజిక వర్గంలో అత్యధికులు బంగ్లాదేశ్‌లో తమపై ముస్లింల అణచివేత, తీవ్ర హింసాకాండను తట్టుకోలేక 1950ల నుంచీ వలస వచి్చన వారే. వీరంతా 1990ల నాటికే బెంగాల్లో ప్రబలమైన ఓటు బ్యాంకుగా స్థిరపడ్డారు. దాంతో వీరి మద్దతు కోసం పార్టీలన్నీ ప్రయతి్నంచడం పరిపాటిగా మారింది. నిజానికి సీఏఏ అమలుతో అత్యధికంగా లబ్ధి పొందేది మతువాలేనంటారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బంగ్లాదేశ్ నుంచి ఎంతోమంది అక్రమంగా ప్రవేశించారు. సీఏఏ అమల్లోకి వస్తే వీరంతా ఎలాంటి ధ్రువీకరణలతోనూ నిమిత్తం లేకుండా నేరుగా భారత పౌరసత్వం పొందుతారు. అలా చేస్తే వీరంతా మెజారిటీ పౌరులుగా మారతారని స్థానికులంటున్నారు. దాంతో హక్కులు, సంస్కృతీ సంప్రదాయాలకు భంగం కలగడమే గాక ఉపాధి అవకాశాలకూ దెబ్బ పడుతుందన్నది వారి వాదన. పైగా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి మరింత భారీగా వలసలకు ఇది బాటలు వేస్తుందని వారంటున్నారు. దాంతో 2019లో సీఏఏ బిల్లుకు చట్టబద్ధత రాగానే దాని అమలును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయి. ముస్లింలలోనూ ఆందోళన... ముస్లింల నుంచి కూడా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ప్రధానంగా తమనే లక్ష్యం చేసుకుని తెచి్చన చట్టమన్నది వారి అభ్యంతరం. ‘‘ఏ ధ్రువీకరణ పత్రాలూ లేని ముస్లింలపై అక్రమ వలసదారులుగా సీఏఏ సాయంతో ముద్ర వేస్తారు. ఈ కారణంగానే ఇతర దేశాల నుంచి వలస వచి్చన ముస్లిం మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయడం లేదు’’ అన్నది వారి వాదన. పాకిస్తాన్లో షియా తదితర ముస్లింలు కూడా తీవ్రమైన అణచివేతకు గురై భారత్ వలస వచ్చారని, సీఏఏ అమలుతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని వారంటున్నారు. సీఏఏను వ్యతిరేకిస్తూ పలు ముస్లిం వర్సిటీల్లో కూడా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. వాటిని అణచివేసే క్రమంలో జరిగిన ఘర్షణలు ప్రాణ నష్టానికీ దారి తీశాయి. కేంద్రం మాత్రం పాక్, బంగ్లా, అఫ్గాన్ వంటి దేశాల్లో ముస్లింలపై అకృత్యాల వాదనను తోసిపుచ్చుతోంది. మరోవైపు టిబెట్, మయన్మార్, శ్రీలంకల నుంచి వలస వచి్చన మతపరమైన మైనారిటీలకు సీఏఏను వర్తింపజేయకపోవడం అన్యాయమన్న విమర్శలూ ఉన్నాయి. సుప్రీంలో వివాదం: ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ తృణమూల్‌తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ, మజ్లిస్ తదితర పక్షాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. జమాయిత్ ఉలేమా ఇ హింద్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇంప్లీడయ్యాయి. వీటిపై విచారణ తుది దశకు చేరుతోంది. ఎన్ఆర్సీ రగడ... సీఏఏలో భాగంగా తెరపైకి వచి్చన జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) కూడా వివాదానికి మరింతగా ఆజ్యం పోసింది. అక్రమ వలసదారులను గుర్తించి వెనక్కు పంపడం దీని ప్రధానోద్దేశం. ఇందులో భాగంగా వలసదారుల నివాస తదితర ధ్రువీకరణ పత్రాలను నమోదు చేయడం తప్పనిసరి. తద్వారా పౌరసత్వానికి చట్టపరంగా అర్హులైన జాబితాను రూపొందిస్తారు. సరైన పత్రాలు లేనివారిని అక్రమ వలసదారులుగా నిర్ధారిస్తారు. 2020లో అసోంలో మాత్రమే అమలు చేసిన ఎన్ఆర్సీని దేశవ్యాప్తం చేస్తామని మోదీ సర్కారు ప్రకటించింది. దీనిపైనా రగడ కొనసాగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో చెలరేగిన అల్లర్ల (సీఏఏ)కు సంబంధించి అనుబంధ చార్జిషీట్లో సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి, స్వరాజ్ అభియాన్‌కు చెందిన యోగేంద్ర యాదవ్, ఇతర మేథావుల పేర్లను వెల్లడించిన ఢిల్లీ పోలీసులు నేర న్యాయవ్యవస్థను అపహాస్యం చేశారని కాంగ్రెస్ నేత పీ చిదంబరం అన్నారు. సమాచారం, చార్జిషీట్ మధ్య విచారణ, ధృవీకరణ వంటి కీలక దశలుంటాయని ఢిల్లీ పోలీసులు మర్చిపోయారా అని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఆదివారం ట్వీట్ చేశారు. చదవండి : ‘దేవుని చర్య’.. ఆగని విమర్శలు ఇంకా ఢిల్లీ పోలీసులు వెల్లడించిన డిస్క్లోజర్ స్టేట్మెంట్లో ఆర్థిక వేత్త జయతి ఘోష్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ రాహుల్ రాయ్‌ల పేర్లున్నాయి. కాగా వీరిని తాము నిందితులుగా పేర్కొనలేదని ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు అనుబంధ చార్జిషీట్ దాఖలు కావడంతో దీనిపై రాజకీయ దుమారం రేగింది. తమ పార్టీ ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయసభల్లో ప్రస్తావిస్తుందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 50 మందికి పైగా మరణించగా వందలాది మందికి గాయాలయ్యాయి. -
దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోంది
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) ప్రతిపాదనల అమలుపై సోమవారం అసెంబ్లీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్పీఆర్, ఎన్నార్సీ లాంటి చర్యల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. సోమవారం సభ ప్రారంభం కాగానే ప్రభుత్వ పక్షాన సీఎం కేసీఆర్ సభలో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం తీర్మానంపై మాట్లాడారు. ఆ తర్వాత ఎంఐఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు మాట్లాడి తీర్మానానికి మద్దతు తెలపగా, బీజేపీ మాత్రం వ్యతిరేకించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీర్మాన ప్రతులను చించేసి స్పీకర్ పోడియం ముందు ఆందోళన చేస్తుండగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీర్మానాన్ని సభ ముందు ఆమోదానికి ఉంచారు. మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడంతో సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ తీర్మానాన్ని మండలి సైతం ఆమోదించింది. నిప్పులు చెరిగిన కేసీఆర్.. తీర్మానంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏతో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోం దని మండిపడ్డారు. లౌకిక, ప్రజా స్వామిక, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కేంద్రం మంటగలుపుతోం దని నిప్పులు చెరిగారు. సీఏఏ కేవలం హిందూ, ముస్లింల సమస్య కాదని.. యావత్ దేశ సమస్య అని, నిమ్న వర్గాలు, సంచార జాతులు, మహిళలు, పేదలు, వలసదారులు ఈ చట్టంతో భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఓసారి విఫలమైన ఈ ప్రయోగాన్ని మళ్లీ అమలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. సీఏఏ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని, దీనిపై అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పునఃసమీక్ష చేయాలని విన్నవించారు. టీఆర్ఎస్ ఇప్పటికే పార్లమెంట్లో సీఏఏను వ్యతిరేకించిందని, దానికే కట్టుబడి అసెంబ్లీలోనూ వ్యతిరేకంగా తీర్మానిస్తున్నామని ప్రకటించారు. సీఏఏతో దేశం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటోందని, ప్రజాస్వామిక, లౌకికవాదులంతా దీన్ని నిరసిస్తున్నారని చెప్పారు. వసుధైక కుటుంబవాదానికి వ్యతిరేకం.. తెలంగాణ తన సొంత నిర్మాణం చేసుకుంటూనే, దేశ నిర్మాణంలో భాగస్వామి అవుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ సామాజిక భద్రతలో రాష్ట్ర భద్రత కూడా ఇమిడి ఉన్నందున సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. వసుధైక కుటుంబంగా కలలు కంటున్న తరుణంలో, సాంకేతికత సరిహద్దులను చెరిపేస్తున్న ఈ సమయంలో సీఏఏను తెరపైకి తేవడం సమంజసం కాదన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ పర్యటన సందర్భంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 50 మంది చనిపోయారు. కొందరు ఎంపీలు, కేంద్ర మంత్రులు దుర్మార్గంగా మాట్లాడారు. గోలీమారో సాలోంకు.. అంటూ బాధ్యత మరిచి వ్యహరించారు. దేశానికి ఇది వాంఛనీయం కాదు. దేశం ఇలాందిటి అంగీకరించదు. ఈ రాక్షాసానందం దేశానికి మంచిది కాదు. అంతర్జాతీయంగా మన ఖ్యాతి దెబ్బతింటుంది. దేశానికి వేరే ఇతర సమస్యలేవీ లేనట్లు, ఇదొక్కటే సమస్య అన్నట్లు కల్లోలం లేపొద్దు’అని పేర్కొన్నారు. బర్త్ సర్టిఫికేట్ లేని వారి సంగతేంటి? ‘సీఎంగా నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు. చింతమడక ఇంట్లో పుట్టిన. జన్మపత్రికే ఉంది. బర్త్ సర్టిఫికెట్ తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తేవాలి. దేశంలో నాలాగే కోట్లాది మంది సామాన్యులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల పరిస్థితేంటి? ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు. 130 కోట్ల ప్రజలకు సంబంధించిన సమస్య’అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేలా ఓటరు కార్డు ఇచ్చారు. సీఏఏకు ఓటింగ్ కార్డు పనికి రాదు. ఓటరు కార్డుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, రేషన్‌కార్డు పనిచేయదంటున్నారు. దేశ ప్రధానిని ఎన్నుకునే ఓటర్ కార్డు కూడా సీఏఏకు పనిచేయదంటే ఎలా? దేశంలోకి చొరబాటుదారుల్ని అనుమతించాలని ఎవరూ చెప్పట్లేదు. మెక్సికో నుంచి వలసలు రాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోడ కడతామన్నారు. మయన్మార్ నుంచి చొరబాట్లు రాకుండా భారత్‌లో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతామంటే మేమూ మద్దతిస్తాం’అని తెలిపారు. వ్యతిరేకిస్తే దేశద్రోహులేనా.. ‘ముస్లింలను మినహాయించి కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. భారత రాజ్యాంగం కులమతాలకు అతీతంగా ఉంటుంది. సీఏఏని ఎవరైనా వ్యతిరేకిస్తే వారు దేశ ద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లు అవుతారా? అసెంబ్లీ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానిస్తే అసెంబ్లీలోని సభ్యులంతా దేశద్రోహులేనా. మాజీ ప్రధాని వాజపేయి హయాంలో ఎల్కే అడ్వాణీ ఆధ్వర్యంలో సీఏఏపై 2003లో కమిటీ వేశారు. 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే కూడా చేశారు. 12 లక్షల మందికి మాత్రమే కార్డులు ఇవ్వగలిగారు. అప్పట్లోనే ఈ ప్రాజెక్టు విఫలమైందని యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు తేల్చాయి. అలాంటి విఫల ప్రయోగం మళ్లీ అవసరామా? ఇతర దేశాల నుంచి వచ్చిన కాందిశీకుల పరిస్థితేంటి? ఇతర ప్రాంతాల్లో వలసవచ్చి ఉంటున్న వారి పరిస్థితేంటి? విభజన రాజకీయాలు ఈ దేశానికి అవసరమా’అని సీఎం తీవ్రస్వరంతో ప్రశ్నించారు. ద్వంద్వ వైఖరి ఎందుకు.. ‘పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో ఎన్నార్సీ చేస్తామని ఉంది. ఎన్నార్సీ చేయం.. ఎన్పీఆర్ మాత్రమే చేస్తామని కేంద్ర హోంమంత్రి అంటున్నారు. నివేదిక ఒకటుంటే, చెప్పేది ఇంకోటుంది. దేన్ని నమ్మాలి. అందుకే అగ్గి పుట్టింది. కేంద్రానికి ద్వంద్వ వైఖరి అక్కర్లేదు. దేశంలో 50–60 శాతం మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం అవసరమా? చేయదలుచుకుంటే నేరుగా చేయాలి.. ద్వంద్వ వైఖరి ఎందుకు? పౌరసత్వం ఇవ్వాలనుకుంటే రాద్ధాంతం అవసరం లేదు. నేరుగా ఇంకో విధానంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఇవ్వండి. కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తే మద్దతిచ్చే అంశంపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఎంఐఎంతో కలసి పనిచేస్తున్నంత మాత్రాన అన్ని అంశాల్లో ఏకాభిప్రాయం ఉండదు. కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయన్నారు. కశ్మీర్ విషయంలో 370 అధికరణ విషయంలో మొట్టమొదట మద్దతిచ్చింది మేమే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి’అని సీఎం కేసీఆర్ వివరించారు. కాగా, ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చలో కూడా సీఎం కేసీఆర్ ఎన్పీఆర్ అంశాన్ని ప్రస్తావించారు. ఎన్పీఆర్పై స్టే తీసుకురావాలని అక్బరుద్దీన్ అడిగిన అంశంపై వివరణ ఇచ్చారు. దేశంలో ఒకే భావజాలం ఉన్న ఇతర రాష్ట్రాలను సమీకరించి పోరాడుతామని భరోసా ఇచ్చారు. ఎన్పీఆర్పై స్టే తెచ్చే విషయంలో కేరళ ప్రభుత్వంతో కూడా మాట్లాడతామని పేర్కొన్నారు. తక్షణమే అమలు నిలిపేయాలి: సీఎల్పీ నేత భట్టి ఎన్పీఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కేంద్రం కుట్రపూరితంగా తీసుకొచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తే సరిపోదని, ఆ చట్టం అమలు కాకుండా నిరోధించినప్పుడే తీర్మానానికి సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం సీఏఏ, ఎన్పీఆర్ వ్యతిరేక తీర్మాన చర్చలో భట్టి మాట్లాడుతూ.. 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ దేశ పౌరుడో కాదో నిరూపించుకోవాల్సి రావడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. బర్త్ సర్టిఫికెట్లు, మీ తల్లిదండ్రులు ఎక్కడివారనే సమాచారాలపై ధ్రువపత్రాలు ఇవ్వకపోతే.. శరణార్థి శిబిరాలకు పంపుతామనే కేంద్ర నిర్ణయం ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తన లాంటి వారెందరో ఎన్పీఆర్ నియామవళికి అనుగుణంగా ఈ దేశ పౌరులమో కాదో నిరూపించుకోవడం కష్టమన్నారు. ఈ దేశ పౌరులకు ఆందోళనకరంగా మారిన సీఏఏ, ఎన్పీఆర్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, మోదీ ప్రభుత్వం ఈ సమస్యను ఒక మత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. పౌరుల భద్రత, క్షేమం కోసం చట్టాలు చేయాల్సిన కేంద్రం కొన్ని వర్గాలను అణచివేసేలా చట్టాలను తీసుకురావడం దారుణమన్నారు. రాజ్యాంగానికి భిన్నంగా చట్టాలను తీసుకొస్తే ఒప్పుకునే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. కేరళ తరహాలో వాటి అమలు ప్రక్రియ నిలిపేస్తూ జీవో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్టు భట్టి చెప్పారు. మత ప్రాతిపదికన పౌరసత్యం సిగ్గుచేటు: సుమన్ మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే హక్కు ఎవరికీ లేదని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. అందరూ సమానమనే రాజ్యంగ సూత్రాన్ని కేంద్రం విస్మరించడం దురదృష్టకరమన్నారు. ఎన్పీఆర్, సీఏఏ చట్టాలతో కేంద్రం విభజన రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ గళం విప్పిన ప్రగతిశీల, మేధోవర్గాలపై దాడులు చేస్తోందని, ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. వసుధైక కుటుంబంలా జీవనం సాగిస్తున్న దేశ ప్రజల్లో పౌరసత్వ చట్టం కల్లోలం రేపిందన్నారు. కేసీఆర్‌లాంటి నాయకుడితోనే అన్నివర్గాల ప్రజలు సురక్షితంగా ఉంటారని సుమన్ అన్నారు. తెలంగాణ విడిచి వెళ్లిపోతా: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఏఏ, ఎన్పీఆర్ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందని తెలిసిన మరుక్షణమే తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి, తెలంగాణ విడిచి వెళ్లిపోతానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. ఒక వర్గం మెప్పు కోసం అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. సీఏఏ విషయంలో కేసీఆర్ సర్కారు తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తోందని విరుచుకుపడ్డారు. ఎవరికి అన్యాయం జరుగుతోందో చెప్పుకుండా.. ప్రజలను మోసం చేసేలా ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాక్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అల్పాసంఖ్యాకులు అణచివేతకు గురవుతున్నారని, అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిన శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తున్నామే తప్ప.. ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులు భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు. గతంలోనూ ఎన్నార్సీ, ఎన్పీఆర్ సర్వేలు జరిగాయని కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇప్పుడు ఏదో జరిగిపోతున్నట్లు రాద్ధాంతం చేయడం గర్హనీయమన్నారు. తెలంగాణ ప్రజలకు ధోకా చేయొద్దనే వ్యాఖ్యలపై అధికారపార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రకాశ్‌రెడ్డి మధ్యలో స్పీకర్‌ను కోరారు. మరోసారి రాజాసింగ్ మాట్లాడుతుండగా.. స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో తీర్మాన ప్రతులను చించి తన నిరసన తెలిపారు. పోడియం వద్దకు వెళ్లి ఆందోళన కొనసాగించారు. చదవండి: పౌరసత్వ సవరణ చట్టం దళితులకే వరం ఎన్పీఆర్పై అనుమానాలొద్దు: అమిత్ షా మైనార్టీల రక్షణ ముసుగులో దాడులు -
ఢిల్లీ అల్లర్లపై మూడొరోజూ దద్దరిల్లిన ఉభయసభలు
-
హస్తినలో హైటెన్షన్
-
నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ
న్యూఢిల్లీ: రెండు రోజులుగా తీవ్ర స్థాయి హింసాత్మక ఘటనలతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీలో బుధవారం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. వీధులన్నీ తగలబడిన వాహనాలు, ధ్వంసమైన, లూటీ అయిన దుకాణాలు, మూసివేసి ఉన్న ఇళ్లు, వాణిజ్య సముదాయాలతో నిర్మానుష్యంగా కనిపించాయి. గోకుల్‌పురిలో చోటు చేసుకున్న పలు చెదురుమదురు ఘటనలు మినహా బుధవారం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. మంగళవారం రాత్రి ఒకసారి, బుధవారం మరోసారి ఆందోళనలు జరిగిన ప్రాంతాల్లో జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ పర్యటించారు. (ట్రంప్ పర్యటిస్తున్న వేళ... సీఏఏపై భగ్గుమన్న ఢిల్లీ ) పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య జరిగిన హింసాకాండగా భావిస్తున్న ఈ అల్లర్లలో బుధవారం నాటికి మృతుల సంఖ్య 27కి చేరింది. రెండు వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. బుల్లెట్ గాయాలు, కత్తులు, ఇతర ప్రాణాంతక ఆయుధాల కారణంగా అయిన గాయాల కన్నా.. తరుముకొస్తున్న దుండగుల బారి నుంచి తప్పించుకోవడం కోసం ఇళ్ల పై అంతస్తుల నుంచి దూకడం వల్ల చోటు చేసుకున్న గాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు. (‘పిచ్చి అల్లర్లను వెంటనే ఆపేయాలి’) కాగా, అల్లర్ల కారణంగా చనిపోయిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మ మృతదేహాన్ని బుధవారం ఉదయం చాంద్‌బాగ్ ప్రాంతంలోని ఒక కాలువలో గుర్తించారు. రాళ్ల దాడిలో ఆయన చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ‘సాధ్యమైనంత త్వరగా ప్రశాంతత నెలకొనాలి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై లోతైన సమీక్ష జరిపాం. పోలీసులు, ఇతర భద్రత వ్యవస్థలు శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాయి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనలో ఉన్న రెండు రోజులు దేశ రాజధాని ఢిల్లీ అల్లర్లతో అట్టుడికిన విషయం తెలిసిందే. ఫ్లాగ్ మార్చ్ అల్లర్ల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఢిల్లీలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే బాధ్యతను అజిత్ దోవల్‌కు కేంద్రం అప్పగించిన నేపథ్యంలో.. అల్లర్ల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్, కొత్తగా నియమితులైన స్పెషల్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవతో కలిసి దోవల్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. హింసను అడ్డుకోవడంలో విఫలమయ్యారని అమూల్య పట్నాయక్ విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో.. శ్రీవాస్తవను దోవల్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య 22కి పెరిగిందని, 200 మందికి పైగా క్షతగాత్రులయ్యారని జీటీబీ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ వెల్లడించారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను పోలీసులు కాకుండా, వైద్యులు వెల్లడించడం గమనార్హం. అల్లర్ల కారణంగా ఈ ప్రాంతంలోని పాఠశాలలను, షాపులను మూసేశారు. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కూడా ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదు. దుకాణాలను లూటీ చేయడంతో జీవనోపాధి కోల్పోయిన పలు కుటుంబాలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవడం కనిపించింది. మరోవైపు, ఈ అల్లర్లకు సంబంధించి 106 మందిని అరెస్ట్ చేశామని, 18 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రజల సహాయం కోసం రెండు హెల్ప్‌లైన్ నెంబర్లు 011–22829334, 011–22829335 కూడా ఏర్పాటు చేశామన్నారు. అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఐబీ ఉద్యోగి మృతి ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఉద్యోగి అంకిత్ శర్మ మృతిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత అంకిత్ మళ్లీ బయటకు వెళ్లాడని, తిరిగి రాలేదని ఆయన తండ్రి దేవేంద్ర శర్మ తెలిపారు. అంకిత్ మృతదేహాన్ని మురికి కాలువలో వేయడాన్ని తమ కాలనీలోని కొందరు మహిళలు చూశారని, ఎవరికైనా చెపితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ మహిళలను వారు బెదిరించారని అంకిత్ సోదరుడు అంకుర్ వెల్లడించారు. అంకిత్ శరీరంపై కత్తిగాట్లు కూడా ఉన్నాయన్నారు. ఆర్మీని పిలిపించాలి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం ఆర్మీని పిలిపించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అల్లర్లను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. అల్లర్లకు కారణం బీజేపీ కార్యకర్తలేనని ఆప్ నేతలు సంజయ్ సింగ్, గోపాల్ రాయ్ ఆరోపించారు. ఢిల్లీ శాంతి భద్రతల అంశం కేంద్ర పరిధిలో ఉంటుందని, అల్లర్ల కట్టడికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజాయితీగా కృషి చేయడం లేదని వారు విమర్శించారు. ఢిల్లీ సరిహద్దులను ఇప్పటికైనా మూసేయాలని, పొరుగు ప్రాంతాల నుంచి కొందరు ఢిల్లీకి వచ్చి హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అమిత్ షా రాజీనామా చేయాలి రెండు రోజులుగా ఈశాన్య ఢిల్లీ అతలాకుతలమవడంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) బుధవారం సమావేశమైంది. ఈ ఘర్షణలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ హింసకు బాధ్యత వహించాలన్నారు. తర్వాత మీడియా సమక్షంలో కేంద్రానికి కొన్ని సూటిప్రశ్నలు సంధించారు. ► హింస జరుగుతుంటే అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎక్కడ? ఏం చేస్తున్నారు ? ► ఢిల్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటివరకు సీఏఏ నిరసనలపై ఇంటెలిజెన్స్ సంస్థలు ఎలాంటి నివేదికలు ఇచ్చాయి? ► ఢిల్లీలో చెలరేగిన హింస హోంశాఖ చెబుతున్నట్టు అప్పటికప్పుడు జరిగినవా? లేదంటే హోంశాఖ సహాయ మంత్రి చెబుతున్నట్టు ఎవరైనా రెచ్చగొట్టినవా? ► ఆదివారం రాత్రి అల్లర్లు చెలరేగుతాయని స్పష్టమైన సంకేతాలు వచ్చినప్పుడు ఢిల్లీలో ఎన్ని బలగాలను మోహరించారు? ► ఢిల్లీ పోలీసుల చేతుల్లోంచి పరిస్థితులు జారిపోయినట్టు గ్రహించినప్పుడు భద్రతా సిబ్బందిని ఎందుకు మోహరించలేదు? అమిత్ షా రాజీనామా కోరడం హాస్యాస్పదం: బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలనడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ విమర్శించింది. పోలీసులతో కలిసి నిరంతరంగా పనిచేస్తూ ఢిల్లీలో పరిస్థితుల్ని అదుపులో ఉంచడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఢిల్లీ అల్లర్ల విషయం ప్రస్తావనకు రాలేదన్నారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి సీఏఏపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనల నేపథ్యంలో రెచ్చగొట్టేలా ప్రసంగించిన బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బీజేపీ నేతలు అనురాగ్ ఠాకూర్, పర్వీష్ వర్మ, కపిల్ మిశ్రాలపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ఇందిరాగాం«ధీ హత్య సందర్భంగా 1984లో సిక్కులకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన హింసాకాండను ఈ దేశంలో పునరావృతం అయ్యేందుకు అనుమతించబోమని ఈ సందర్భంగా హైకోర్టు తేల్చి చెప్పింది. పౌరులందరికీ సంపూర్ణ భద్రత కల్పించాలని ఆదేశించింది. అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించాలని అధికారులకు సూచించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని ఆదేశించింది. అల్లర్లలో ఐబీ అధికారి మృతి చెందడం పట్ల కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈశాన్య ఢిల్లీలో తలెత్తిన హింస నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ప్రతిస్పందించిన తీరుని ఢిల్లీ హైకోర్టు ప్రశంసించింది. ‘మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్. మురళీధర్ వ్యాఖ్యానించారు. హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలని, నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాలని సూచించింది. బాధితులు, వివిధ సంస్థల మధ్య సమన్వయం కోసం అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది జుబేదా బేగంని నియమించింది. ఆ వీడియోలు చూశారా? సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ముగ్గురు బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలనీ జస్టిస్ మురళీధర్, జస్టిస్ తల్వంత్ బెంచ్ ఆదేశించింది. బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా రెచ్చగొట్టే విధంగా చేసిన ప్రసంగం వీడియోని చూశారా? అంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పోలీస్ కమిషనర్ (క్రైంబ్రాంచ్) రాజేష్ డియోలను కోర్టు ప్రశ్నించింది. అయితే ఆ వీడియో క్లిప్పింగ్స్‌ని తాను చూడలేదనీ తుషార్ మెహతా జవాబిచ్చారు. బీజేపీ నాయకులు అనురాగ్ ఠాకూర్, పర్వీష్ వర్మల వీడియోలను తాను చూశాననీ, మిశ్రా వీడియోను మాత్రం చూడలేదని రాజేష్ డియో కోర్టుకి వెల్లడించారు. అనంతరం కోర్టులో బీజేపీ నేతల వీడియో క్లిప్పింగ్స్‌ను ప్రదర్శించారు. సుప్రీం అక్షింతలు హింసను సకాలంలో గుర్తించడంలో, విధి నిర్వహణలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ నిర్లక్ష్యం 20కి పైగా పౌరుల మరణానికి దారి తీసిందని పోలీసులను ధర్మాసనం మందలించింది. అయితే సీఏఏపై చెలరేగిన హింసకు సంబంధించిన అప్పీళ్లను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హింస చెలరేగిన సందర్భంలో ఎవరి ఆదేశాల కోసమో వేచి చూడకుండా చట్టబద్దంగా వ్యవహరించాలని పోలీసులకు హితబోధ చేసింది. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. షహీన్ బాఘ్ నిరసనలకు సంబంధించిన విషయాల్లోకి వెళ్ళడానికి ‘అనుకూల వాతావరణం అవసరమని’ వ్యాఖ్యానించింది. ఘర్షణలు జరిగిన ప్రాంతం నుంచి వ్యాన్‌లో తరలిపోతున్న ముస్లింలు -
ఎంతటి వారైనా చర్యలు తప్పవు: గంభీర్
-
ఎంతటి వారైనా చర్యలు తప్పవు: గంభీర్
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలకు బీజేపీ నేత కపిల్ మిశ్రా కారణమని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో.. హింసను ప్రేరేపించేలా ప్రవర్తించిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని గంభీర్ స్పష్టం చేశారు. రెచ్చగొట్టే ప్రసంగం చేసినవారు తమ పార్టీకి చెందినవారైనా మరెవరైనా సరే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలకు స్థానం లేదంటూ స్పష్టతనిచ్చారు. ఒకవేళ తమ పార్టీకి చెందిన కపిల్ మిశ్రా ప్రమేయం ఇందులో ఉంటే అతనిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్ తదితర ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన.. ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా.. అందులో హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. చదవండి: అమిత్ షా సానుకూలంగా స్పందించారు : కేజ్రీవాల్ ‘వెనక్కి వెళ్లిపో లేదంటే.. కాల్చిపడేస్తా!’ -
రాష్ట్రమంతా ‘వికేంద్రీకరణ’ కోరుకుంటోంది
సాక్షి, తాడేపల్లి: పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రమంతా సమర్థిస్తుందని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అంశంపై ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా, మైనార్టీ శాసనసభ్యులు, 13 జిల్లాల అధ్యక్షులు, నగర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్యనేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయంపై సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్నామని, అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చర్చించడం జరిగిందన్నారు. అనేక దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఉత్తరాంధ్ర, వెనుకబడిన రాయలసీమ ప్రాంతాలకు సమాన న్యాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. కృష్ణా, గుంటూరు, ఒంగోలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు, నాయకులు కూడా సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు సమర్థిస్తున్నారని చెప్పారు. ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో వికేంద్రీకరణ నిర్ణయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. అదే విధంగా రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించడం జరిగిందన్నారు. (ఏపీలో ఇకపై ఆటో మ్యుటేషన్ సేవలు.. ) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షపాతిగా ఉంది. ఇప్పటికీ, ఎప్పటికీ అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ బిల్లుల విషయంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అన్ని వర్గాల ప్రజలు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరుల్లో అభద్రతా భావం ఏర్పడిందని, వీటిపై కూడా సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్‌లో ఉండే మైనార్టీలు అక్కడ ఇమడలేకపోతున్నారో.. వారికి రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం ఇస్తామని వారు చెప్పిన తీరును బట్టి వైఎస్సార్ సీపీ ఆ రోజున మద్దతు ఇచ్చిందని, ఇవాళ కేంద్రం వైఖరి వేరే విధంగా ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర బిల్లులను పూర్తిగా వ్యతిరేకించారన్నారు. ('తాను, కొడుకు బాగుంటే చాలు.. ఇంకేం అవసరం లేదు') ప్రజలకు అన్యాయం చేసే ప్రతీ చట్టాన్ని వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తుందన్నారు. ఎన్ఆర్సీ ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమని సీఎం వైఎస్ జగన్ కడప బహిరంగ సభలో చెప్పారని గుర్తు చేశారు. అదే విధంగా ఎన్పీఆర్ను కూడా వ్యతిరేకిస్తున్నామని, 2010, 2015 సంవత్సరాల్లో ఎన్పీఆర్ చేశారని, కానీ.. వాటికి భిన్నంగా 2020లో చేస్తోందని.. 13ఏ, 13బీ రెండు కాలమ్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేశారని, కేంద్రం ప్రస్తుతం తెచ్చిన ఫార్మట్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మైనార్టీ నాయకుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్తామని, ఎవరికీ హాని జరగకుండా సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. -
సీఏఏ, ఎన్పీఆర్పై రజనీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పౌరసత్వ సవరణ చట్టంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, అనుకూల గళాలు ముమ్మరంగా వినిపిస్తున్న నేపథ్యంలో బుధవారం వివాదాస్పద చట్టానికి మద్దతుగా నిలిచారు. సీఏఏ చట్టం ఏ భారతీయ పౌరుడిని ప్రభావితం చేయదని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశంలోని ముస్లింలకు సీఏఏ వల్ల ఎలాంటి ముప్పు ఉండదనీ, ఒకవేళ వారు ఇబ్బందులను ఎదుర్కొంటే, వారికి అండగా నిలబడే మొదటి వ్యక్తి తానే అవుతానని రజనీకాంత్ వెల్లడించారు. అలాగే జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్) చాలా అవసరమని కూడా వ్యాఖ్యానించారు. బయటివారు ఎవరో తెలుసుకోవడం అవసరమని ఆయన పేర్కొన్నారు. భారత, పాకిస్తాన్ విభజన సందర్భంగా భారతదేశంలో ఉండటానికే నిర్ణయించుకున్న ముస్లింలను దేశం నుండి ఎలా పంపిస్తారు?" అని రజనీకాంత్ ప్రశ్నించారు. సీఏఏకి వ్యతిరేకంగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలపై ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, దేశ భద్రత, సంక్షేమం కోసం ప్రజలు ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలంటూ గతంలో రజనీకాంత్ విజ్ఞప్తి చేయడం గమనార్హం. మోదీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏపై ఇప్పటివరకూ మౌనాన్ని ఆశ్రయించిన రజనీకాంత్ చివరకు మద్దతు పలకడం విశేషం. (ఎన్పీఆర్ అంటే ఏంటి.. ఆ రాష్ట్రానికి ఎందుకు మినహాయింపు?) కాగా దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా నిరసనల మధ్య గత డిసెంబర్లో భారతదేశంలో కొత్త పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద 50 రోజులుగా ఆందోళన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చదవండి : వరుస కాల్పులు, సీనియర్ అధికారిపై వేటు ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది Rajinikanth: Citizenship Amendment Act will not affect any citizen of our country, if it affects Muslims then I will be the first person to stand up for them. NPR is a necessity to find out about the outsiders. It has been clarified that NRC has not been formulated yet. pic.twitter.com/wyXMCY8pH9 — ANI (@ANI) February 5, 2020 -
దేశ సామరస్యతపై కుట్ర
సాక్షి న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనలు దేశ సామరస్యతను దెబ్బతీసేందుకు పన్నిన రాజకీయ కుట్రలో భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ నిరసనలు యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావని, వాటిని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు ఎగదోస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు సీఏఏ నిరసనల్లో రాజ్యాంగం, జాతీయ పతాకాలను ముందుపెట్టి అసలు కుట్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోమవారం ప్రధాని మోదీ తొలిసారి పాల్గొన్నారు. షహీన్బాఘ్ నిరసనల కారణంగా ఢిల్లీ పౌరులు ముఖ్యంగా సాటిలైట్ సిటీ ప్రజలు అనేక ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఢిల్లీ ప్రజలు కోపంగా, మౌనంగా ఈ ఓటుబ్యాంక్ రాజకీయాలను చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఈ అరాచకాన్ని ఆపేందుకు సహకరించాలని కోరారు. 21వ శతాబ్ది భారత్‌లో విద్వేష పూరిత రాజకీయాలు పనిచేయవని, అభివృద్ధి రాజకీయాలు మాత్రమే పనిచేస్తాయని కడ్కడూమా సీబీడీ గ్రౌండ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ వ్యాఖ్యానించారు. బాట్లా హౌజ్ ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నించినవారే ఇప్పుడు ‘తుక్డే తుక్డే’ నినాదాలు చేస్తున్నవారిని రక్షిస్తున్నారని కాంగ్రెస్‌పై పరోక్ష ఆరోపణలు చేశారు. పాక్ ఉగ్రవాదులపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. ఢిల్లీ ఒక నగరం కాదని, అది దేశ సాంస్కృతిక వారసత్వమని ప్రధాని పేర్కొన్నారు. ప్రతీ ఢిల్లీవాసి చెమటోడ్చి ఢిల్లీని ప్రస్తుతమున్న స్థాయికి తెచ్చారన్నారు. గత రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలు 21వ శతాబ్ది ప్రయోజనాలు ఢిల్లీకి అందకుండా చేశాయన్నారు. ఢిల్లీ వాసులు లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ఓటేసి దేశ భవిçష్యత్తు మారేందుకు బాట వేశారని, ఇప్పడు ఢిల్లీ భవిష్యత్తు మార్చడం కోసం మళ్లీ బీజేపీకే ఓటేయాలని కోరారు. ఢిల్లీ సురక్షితంగా, పరిశుభ్రంగా, ఆధునికంగా ఉండాలంటే తమ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ అనధికార కాలనీలను క్రమబద్దీకరిస్తామన్న తమ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామని ప్రధాని గుర్తు చేశారు. ఢిల్లీలోని ఆప్ సర్కారు పీఎం ఆవాస్ యోజనను అడ్డుకుని పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆప్‌కి మరోసారి అధికారమిస్తే కేంద్రం ప్రకటించిన ప్రజా సంక్షేమ పథకాలను అన్నింటినీ అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టం, కర్తార్‌పుర్ కారిడార్, 370 అధికరణం రద్దు, అయోధ్యపై కోర్టు తీర్పు, భారత బంగ్లాదేశ్ సరిహద్దు సమస్య పరిష్కారం.. తదితర అంశాలను ప్రసంగంలో ప్రస్తావించిన మోదీ.. ఇవన్నీ 70 ఏళ్ల తరువాత, తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు. తాజా బడ్జెట్లో తమ ప్రభుత్వం సామాన్యుల కోసం, వ్యాపారుల కోసం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా మోదీ వివరించారు. -
వరుస కాల్పులు, సీనియర్ అధికారిపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద సుదీర్ఘంగా కొనసాగుతున్న పౌరసత్వ వ్యతిరేక సవరణ చట్టం (సిఎఎ) నిరసనలో వరుసగా కాల్పుల ఉదంతంతో ఎన్నికల సంఘం కీలక చర్య తీసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, నాలుగు రోజుల వ్యవధిలో రెండు వరుస కాల్పుల సంఘటనలు జరిగిన తరువాత ఎన్నికల కమిషన్ సౌత్ ఈస్ట్ (ఆగ్నేయ) డిప్యూటీ కమిషనర్ చిన్మయ్ బిస్వాల్ ను పదవి నుండి తొలగించింది. అలాగే సీనియర్ అధికారి కుమార్ జ్ఞానేష్ తాత్కాలిక డీసీపీగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. తగిన అధికారి కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేదా ఢిల్లీ పోలీస్ కమిషనర్ మూడు పేర్లతో కూడిన ప్యానెల్ పంపవచ్చని ఎన్నికల సంఘం సూచించింది. దేశ రాజధానిలో సీఏఏ వ్యతిరేక నిరసనకు కేంద్రంగా ఉన్న షాహీన్ బాగ్ వద్ద భద్రతా పరిస్థితిని ఆదివారం సమీక్షించింది. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించడానికి బిస్వాల్ చర్యలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది. కాగా గురువారం, జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయానికి సమీపంలో ఒక యువకుడు నిరసనకారులపై కాల్పులు జరిపిన ఘటనలో ఒక విద్యార్థి గాయపడ్డాడు. నివారం షాహీన్ బాగ్ వద్ద పోలీసు బారికేడ్ల దగ్గర నిలబడి షాట్లు పేల్చడంతో కపిల్ గుజ్జర్ (25) "జై శ్రీ రామ్" అంటూ కాల్పులకు తెగబడ్డాడు. తన దేశంలో హిందువులు మాత్రమే వుంటారని నినదించాడు. జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆదివారం మరోసారి కాల్పుల సంఘటనతో ఉద్రిక్తత ఏర్పడింది. యూనివర్సిటీ 5వ నెంబర్ గేట్ దగ్గర కాల్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కుమార్ జ్ఞానేష్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాల్పులకు నిరసనగా సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. జామియా మిలియా వద్ద ఆదివారం కాల్పుల ఘటన చదవండి : ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది -
‘ఆర్థికం’పై సమగ్రంగా చర్చిద్దాం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో విపక్ష సభ్యులు లేవనెత్తారు. నిరసనకారుల ఆందోళనలపై స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన ఆర్థిక మాంద్యం సహా అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారికి స్పష్టం చేశారు. మెజారిటీ సభ్యులు కోరుతున్న విధంగా.. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక అంశాలకు సముచిత ప్రాధాన్యత ఇద్దామని, ప్రస్తుతం ప్రపంచమంతా నెలకొన్న ఆర్థిక మాంద్య పరిస్థితుల నుంచి భారత్ ఎలా ప్రయోజనం పొందగలదనే విషయంపై దృష్టిపెడదామని ప్రధాని సూచించారు. ‘కొత్త సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థకు సరైన దిశానిర్దేశం చేద్దాం’ అన్నారు. భేటీలో సభ్యులు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు. ‘ప్రతీ అంశంపైనా సాదాసీదాగా చర్చించడం కాకుండా.. సమగ్రంగా నిర్మాణాత్మకంగా చర్చ జరుపుదాం’ అని ప్రధాని సూచించారు. 26 పార్టీలు పాల్గొన్న ఈ అఖిలపక్ష సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. సీఏఏ వ్యతిరేక నిరసనలు, ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న నిరుద్యోగం.. తదితర అంశాలను ఈ భేటీలో విపక్షాలు లేవనెత్తాయి. జమ్మూకశ్మీర్‌లో మాజీ సీఎంలు, ఇతర రాజకీయ నేతలను నిర్బంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించామని భేటీ అనంతరం కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వీలుగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేయాలని డిమాండ్ చేశామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరామని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తెలిపారు. అంతా సహకరిస్తామన్నారు: స్పీకర్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని అన్ని పార్టీల నేతలు తనకు హామీ ఇచ్చారన్నారు. సభలో మాట్లాడేందుకు అన్ని పార్టీల సభ్యులకు తగిన సమయమిస్తానన్నారు. -
పౌర నిరసనలు : వారంతా ఏమైపోయినట్టు..?
లక్నో : పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిరసనల కారులపై విమర్శలు గుప్పించారు. లక్నోలో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత దేశ విభజన అనంతరం హిందువులు, సిక్కులు, బౌద్ధుల సంఖ్య బంగ్లాదేశ్‌లో 30 శాతం, పాకిస్తాన్ 23 శాతంగా ఉండేదని చెప్పారు. కానీ, ఆ జనాభా నేడు కేవలం బంగ్లాదేశ్‌లో 7శాతంగా, పాకిస్తాన్లో 3 శాతంగా ఉందన్నారు. మరి మిగతా జనాభా ఎటు పోయినట్టని అమిత్‌షా ప్రశ్నించారు. సీఏఏపై విమర్శలు చేస్తున్న ‘దేశ భక్తులు’ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, అఫ్గాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో అణచివేతకు గురవుతున్న ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులు సీఏఏ ద్వారా భారత పౌరసత్వం పొందే వీలు కల్పించారు. -
పౌర నిరసనలు : ‘పోలీసులే దొంగలయ్యారు’
లక్నో : నెల రోజులపాటు ఉధృతంగా సాగిన పౌరసత్వ నిరసనలు మరోసారి మొదలయ్యాయి. లక్నోలోని క్లాక్ టవర్ వద్ద శుక్రవారం రాత్రి సీఏఏకు వ్యతిరేకంగా సుమారు 50 మంది మహిళలు, విద్యార్థులు నిరవధిక నిరసనకు దిగారు. నిరసనకారుల సంఖ్య శనివారానికి మరింత పెరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. అయితే, పోలీసుల తీరు దొంగల మాదిరిగా ఉందని నిరసనకారులు విమర్శిస్తున్నారు. ధర్నా జరిగే చోటు నుంచి బ్లాంకెట్లు, ఆహార పదార్ధాలను దౌర్జన్యంగా తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై లక్నో పోలీసులు స్పందించారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే క్లాక్ టవర్ వద్ద ఆందోళన చేపట్టారని పోలీసులు తెలిపారు. టెంట్లు వేసేందుకు నిరసనకారులు ప్రయత్నించారని, అందుకనే వారి వద్ద నుంచి బ్లాంకెట్లు, ఇంతర సామాగ్రిని సీజ్ చేశామని వెల్లడించారు. వందల కొద్దీ బ్లాంకెట్లను పంచి పెడుతుండగా.. అడ్డుకుని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తమపై అసత్యాలు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. ఇదిలాఉండగా.. పోలీసులు బ్లాంకెట్లు, టిఫిన్ బాక్స్‌లు తీసుకెళ్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో మైనారిటీలుగా ఉన్న ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని కల్పించే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. Meanwhile this is the video of the ' kambals being taken into kabza ' by the @lkopolice at the clock tower 's #CAA_NRCProtests last night ... https://t.co/6rbLaRIKV9 pic.twitter.com/muvUMWlGlK — Alok Pandey (@alok_pandey) January 19, 2020 -
ఫేక్ ఫొటో: డిటెన్షన్ సెంటర్లో తల్లి..
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై నిరసలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశంలో డిటెన్షన్ సెంటర్లే లేవని ప్రధాని నరేంద్ర మోదీ చెప్తుండటంతో.. చోటు ఖాన్ అనే వ్యక్తి ఫేస్బుక్లో ఓ ఫొటో షేర్ చేశాడు. ‘డిటెన్షన్ సెంటర్లు లేవు కదా..!!’ అని పేర్కొంటూ.. కంచె లోపల నుంచి బిడ్డకు పాలు పడుతున్న ఓ తల్లి ఫొటోను దాంతోపాటు బెంగాళీలో దాని నేపథ్యాన్ని రాసుకొచ్చాడు. ‘పౌరసత్వ చట్టం కారణంగా బంగ్లాదేశ్‌కు చెందిన ఈ దంపతుల వేదన చూడండి. అతనేమో హిందువు, ఆమెనేమో ముస్లిం. ఎన్నార్సీ కారణంగా ఆ మహిళ డెటెన్షన్ క్యాంప్‌లో బందీ అయింది. అందుకే ఈ దుస్థితి. నరేంద్ర మోదీ పాలనలో ఇలాంటి మరెన్నో చూస్తాం’అని చోటు ఖాన పేర్కొన్నాడు. అయితే, ఈ ఫొటో ఫేక్ అని తేలింది. అర్జెంటీనా దంపతులకు చెందిన ఈ ఫొటో గత ఆరేళ్లుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోందని ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.‘controappuntoblog.org’ అనే బ్లాగ్‌లో 2013 జనవరి13న ఈ ఫొటో తొలిసారిగా అప్లోడ్ అయిందని పేర్కొంది. అర్జెంటీనాలోని ఒక ప్రాంతంలో ఉద్రిక్తలు చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడ కంచె ఏర్పాటు చేశారని, ఆ సమయంలో కొన్ని కుటుంబాలు కంచెకు ఆవల మరికొన్ని ఇవతలి వైపున ఉండిపోయానని స్పష్టం చేసింది. భారత్‌లో ఉన్న డిటెన్షన్ సెంటర్లకు, సీఏఏ ఆందోళనలకు ఈ ఫొటోతో ఎలాంటి సంబంధం లేదని ఇండియా టుడే వెల్లడించింది. -
ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే లక్ష ఆఫర్లు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 8866288662....నా పేరు అరోహి త్రిపాటి. నన్ను కలుసుకోవాలంటే 8866288662కు ఫోన్ చేయండి....నన్ను ప్రేమించాలన్నా, నాతో డేటింగ్ చేయాలన్నా, ఇదే సమయం ఫోన్ నెంబర్ 8866288662...సన్నీ లియోన్ అభిమానులారా! ఆమెను 8866288662 ఫోన్ నెంబర్లో కలుసుకోవచ్చు.....ఇలాంటి ట్వీట్లతోపాటు 15 జీబీ డేటా ఉచితంగా కావాలంటే.....నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఆరు నెలలపాటు ఆరు నెలల పాటు ఉచితం. మొదటి వెయ్యి కాల్స్‌కు మాత్రమే పరిమితం....అమెజాన్ప్రైమ్ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితం....ఒక పిజ్జా కొంటే ఒక పిజ్జా ఉచితం, ఈ ఫోన్ నెంబర్ 8866288662కు ఫోన్ చేయండి....’ అంటూ ఒకే నెంబర్‌తో అనేక ఆఫర్లు ట్విట్టర్లో శనివారం నుంచి వచ్చి పడుతున్నాయి. ఇంతకు ఈ టోల్‌ఫ్రీ నెంబర్ ఎవరిదంటే...‘పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)ను సమర్థించేవాళ్లు ఈ టోల్‌ఫ్రీ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి!’ అంటూ భారతీయ జనతా పార్టీ ఇటీవల దీన్ని ఆవిష్కరించింది. సీఏఏను అపహాస్యం చేయడానికా లేదా ఈ రీతిగానైనా సీఏఏకు మద్దతు సమీకరించాలన్న ఉద్దేశమా తెలియదుగానీ ఇది ట్విటర్ల చేతిలో మాత్రం వ్యంగ్యాస్త్రం అయింది. -
భీమ్ ఆర్మీ చీఫ్ ఆరోగ్యంపై ఆందోళన..
సాక్షి, న్యూఢిల్లీ : పౌర చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొని అరెస్టై జైలులో ఉన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆరోగ్యం బాగాలేదని, తక్షణమే వైద్యసాయం అందించకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆజాద్‌కు ప్రతి రెండు వారాలకు ఒకసారి అదనపు ఎర్ర రక్త కణాలను రక్తం నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టాల్సి ఉందని ఆయన వ్యక్తిగత వైద్యులు హర్జీత్ సింగ్ భట్టీ చెప్పారు.గత వారం కిందటే ఆయనకు వైద్య చికిత్స అందించాల్సి ఉందని, ప్రస్తుతం ఆజాద్ తలనొప్పి, కడుపునొప్పితో బాధిపడుతున్నారని డాక్టర్ భట్టి తెలిపారు. సత్వరమే ఆయనకు చికిత్స అందించకుంటే అతడి రక్తం మందమై గుండె పోటుకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలు అధికారులు ఆయనను ఎయిమ్స్‌కు తరలించేందుకు అనుమతించడలేదని అన్నారు. కాగా గత ఏడాదిన్నరగా ఈ వ్యాధికి ఆజాద్ వైద్యచికిత్స తీసుకుంటున్నారని, అదే విషయం ప్రస్తుతం ఆయన ఉంటున్న తీహార్ జైలు అధికారులకు తెలిపామని భీమ్ ఆర్మీ ప్రతినిధి కుష్ అంబేడ్కర్‌వాది తెలిపారు. మరోవైపు ఆజాద్ ఆరోగ్యం బాగానే ఉందని, ఆయనను పరిశీలించిన జైలు వైద్యుడు నిర్ధారించారని జైలు అధికారులు పేర్కొనడం గమనార్హం. -
భిన్నత్వంలో ఏకత్వం భారత్ బలం
-
పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?
సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం: పౌరసత్వ సవరణ బిల్లు చట్ట రూపం దాల్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రతరమవుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే లౌకిక భావనకు, రెండో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్న భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తికి ఈ చట్టం విరుద్ధమని మేధావులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కునుహరించివేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిబెంగాల్ ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. అధిక సంఖ్యలో విద్యార్థులు, సామాన్యులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు చేపడుతున్న చర్యల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిణామాలన్నింటికీ కేంద్ర బిందువైన పౌరసత్వ సవరణ చట్టం నిజంగానే భారతీయుల హక్కులకు భంగం కలిగిస్తుందా.. లేదా కేంద్రం హోం మంత్రి అమిత్ షా చెప్పినట్లు దేశంలోని మైనార్టీలకు ఎటువంటి హాని కలిగించదా.. అదే విధంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఒక వర్గం ప్రయోజనాలు దెబ్బతింటాయా.. వీటిలో ఎన్నార్సీ పాత్ర ఏమిటి అనే అంశాలను ఒకసారి గమనిద్దాం. వారికి మాత్రమే మినహాయింపు కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దు, ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాఖ్ తదితర బిల్లులను ఆమోదించిన తర్వాత నరేంద్ర మోదీ సర్కారు పౌరసత్వ చట్టం- 1955కు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లును రూపొందించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రవేశపెట్టగా అనేక చర్చల అనంతరం బిల్లు లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల ఆమోదం పొందింది. ఈ క్రమంలో డిసెంబరు 12న రాష్ట్రపతి సంతకంతో చట్టరూపం దాల్చింది. కాగా పౌరసత్వ చట్టం-1955 ప్రకారం అక్రమంగా వలస వచ్చిన వారు భారత పౌరసత్వాన్ని పొందలేరన్న విషయం తెలిసిందే. ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించిన వారు లేదా వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటున్నవారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. అయితే ఇందుకు సంబంధించిన నిబంధనలు సడలిస్తూ..పాస్‌పోర్ట్ అండ్ ఫారినర్స్ చట్టాలకు 2015లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది. వీటికి అనుగుణంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించింది. (‘పౌర’ ఆందోళనలు హింసాత్మకం) పౌరసత్వ సవరణ చట్టం గెజిట్‌లో పేర్కొన్న అంశాలు ‘డిసెంబరు 31, 2014 నాటికి ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిస్తుంది. పాస్‌పోర్టు చట్టం 1920లో సీ క్లాజులో సెక్షన్ 3లో ఉన్న సబ్‌సెక్షన్ 2 ప్రకారం లేదా విదేశీయుల చట్టం 1946లోని కొన్ని ప్రొవిజన్లు తదితర నిబంధనల ప్రకారం వారిని అక్రమ వలసదారులుగా గుర్తించకపోవడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 2లోని సబ్ సెక్షన్1 బీ క్లాజులో ఈ అంశాన్ని చేర్చడం జరిగింది’ అని భారత న్యాయ శాఖ విడుదల చేసిన గెజిట్‌లో పేర్కొంది. అదే విధంగా ప్రాథమిక చట్టంలోని సెక్షన్ 6ఏకు సవరణ చేసి 6బీలో కొన్ని ప్రత్యేక నిబంధనలు చేర్చినట్లు వెల్లడించింది. అదే విధంగా భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలు ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని గిరిజన ప్రాంతాల్లో ఇందులోని నిబంధనలేవీ వర్తించవని పేర్కొంది. అంతేకాకుండా సెక్షన్ 7డీ, సెక్షన్ 18కు సవరణలు చేసినట్లు తెలిపింది. అదే విధంగా కొత్త చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను అనుసరించి ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన వారు కనీసం ఐదేళ్లకు పైగా ఇక్కడే నివాసం ఉంటున్నట్లు లేదా ఉద్యోగం చేసుకుంటున్నట్లు పత్రాలు కలిగి ఉండాలని తెలిపింది. ఇంతకుముందు ఈ పరిమితి 11 ఏళ్లుగా ఉండేది. (సీఏఏ : మరో కీలక పరిణామం) ముస్లింలకు వ్యతిరేకం కాదు: అమిత్ షా పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా... ముస్లింలను ఈ బిల్లు నుంచి మినహాయించడం పట్ల ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేశారు. మతతత్వ రాజకీయాలకు ఇదో ఉదాహరణ అని మండిపడ్డారు. ఇందుకు స్పందించిన అమిత్ షా.. ఇతర దేశాల నుంచి వచ్చి భారత పౌరసత్వం పొందాలనుకునే ముస్లింలు ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకునే అవకాశముందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 566 మంది ముస్లింలు అలా పౌరసత్వం పొందారన్నారు. పాక్, బంగ్లా, అఫ్గాన్‌ల్లో మత వివక్షను ఎదుర్కొన్న మైనారిటీలకు భారతీయ పౌరసత్వం కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం కాబట్టి, ఆ దేశాల్లో మెజారిటీలైన ముస్లింలను బిల్లులో చేర్చలేదని వివరణ ఇచ్చారు. అదేవిధంగా శ్రీలంక నుంచి వచ్చిన తమిళులకు పౌరసత్వం కల్పించడం గతంలో జరిగిందని.. అయితే ఈ బిల్లు ప్రత్యేక సమస్య పరిష్కారం కోసం రూపొందించిందని వివరించారు. ఈ విషయంలో ముస్లింలు ఎలాంటి భయాందోళలకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు గతంలో కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో వేరే ఇతర మతాల గురించి పట్టించుకోకుండా పాకిస్తాన్ నుంచి వచ్చిన 13 వేల హిందువులు, సిక్కులకు పౌరసత్వం ఇచ్చింది అని విమర్శించారు. చీకటి రోజు: సోనియా గాంధీ ఇక పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే, మైలురాయి లాంటిరోజని అభివర్ణించారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాత్రం భారత రాజ్యాంగ చరిత్రలో చీకటి రోజని వ్యాఖ్యానించారు. దీనిని విభజన శక్తుల, సంకుచిత మనస్తత్వం ఉన్నవారి విజయంగా ఆమె అభివర్ణించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. (సీఏఏపై కేంద్రానికి మమత సవాలు) ఎన్నార్సీ అమలైతే.. ఇక ప్రస్తుతం సీఏఏతో పాటు ఆందోళనలకు కారణమవుతున్న మరో ముఖ్య అంశం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్నార్సీ). జాతీయ స్థాయిలో అర్హులైన పౌరులందరితో కూడిన జాబితాను క్లుప్తంగా ఎన్నార్సీ అంటారు. పౌరుల దగ్గర ఉన్న వివిధ పత్రాల ఆధారంగా వారు భారత పౌరులేనని నిర్ధారిస్తారు. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ చట్టం అమల్లోకి వస్తే.. ఈ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించడంతోపాటు ప్రభుత్వం వారిని అదుపులోకి తీసుకునేందుకు అవకాశముంటుంది. అదే విధంగా వారిని స్వదేశాలకు తిప్పి పంపేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు లభిస్తాయి. అయితే నిజానికి ఎన్నార్సీ అనేది ఓ ప్రతిపాదన మాత్రమే. ఇది గనుక చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తే అక్రమ వలసదారులు మాత్రమే లక్ష్యంగా మారతారు. అయితే ఇందులో ఓ చిక్కు ఉంది. ప్రస్తుత పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు తక్కువ. మతపరమైన హింసను స్వదేశాల్లో ఎదుర్కొన్నందుకే ఇక్కడకు వచ్చామని వారు చెప్పుకుంటే.. సీఏఏ ప్రకారం వారికి సులభంగానే భారత పౌరసత్వం లభించే అవకాశాలు ఉంటాయి. (ఎన్ఆర్సీపై ఆందోళన వద్దు..) ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు చెబుతున్నట్లుగా ఎన్నార్సీ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే పైన చెప్పుకున్న మూడు దేశాలు మినహా మిగిలిన ఏ దేశం నుంచైనా భారత్‌లో అక్రమంగా ప్రవేశించిన వారూ దేశంలో ఉండటానికి వీలు ఉండదు. దీంతో ఈ దేశాల నుంచి వచ్చిన మెజారిటీ వర్గ ప్రజలు మాత్రమే చిక్కుల్లో పడతారు. ఈ నేపథ్యంలోనే సీఏఏ ప్రకారం భారతీయులు ఎవరికీ నష్టం లేదని చెబుతున్నప్పటికీ ఎన్నార్సీ ద్వారానే అక్రమ వలసదారులను గుర్తిస్తారు కాబట్టి.. ఇది కచ్చితంగా కొన్ని ప్రత్యేక వర్గాల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే సరైన పత్రాలు లేని వారికి మాత్రమే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి కదా అని.. అలాంటప్పుడు ఇందులో సమస్య ఏముందని సీఏఏ, ఎన్నార్సీని సమర్థించేవారు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ సైతం దేశ శ్రేయస్సు కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. అక్రమవలస దారులకు మాత్రమే తాము వ్యతిరేకం అని పేర్కొంది. పౌరసత్వ సవరణ చట్టం: సమగ్ర కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి రణరంగంగా జామియా వర్సిటీ ‘పౌరసత్వం’పై అపోహలు.. నిజాలు తెలుసుకోండి..! కొన్ని రాజకీయ శక్తులు వారిని రెచ్చగొడుతున్నాయి: గడ్కరీ అనవసర భయాలు సృష్టిస్తున్నారు: మోదీ -
ఆ బిల్లు పూర్తిగా చదవలేదు: గంగూలీ
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై టీమిండియా మాజీ సారథి, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తాజాగా స్పందించాడు. తను సీఏఏకు సంబంధించిన బిల్లు పూర్తిగా చదవలేదని.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాలని విఙ్ఞప్తి చేశాడు. సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. చట్టానికి సంబంధించి సోషల్ మీడియాలో సైతం పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో గంగూలీ కుమార్తె సనా.. సీఏఏను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో సందేశాన్ని పోస్ట్ చేసిందంటూ వార్తలు ప్రచారమయ్యాయి. దీంతో సనా ట్రోల్స్ బారిన పడింది. అయితే ఆ పోస్టు నిజం కాదని, సనా చిన్నపిల్ల కాబట్టి తనను రాజకీయాల్లోకి లాగొద్దని గంగూలీ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో సీసీఏపై అభిప్రాయాన్ని చెప్పకుండా గంగూలీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నెటిజన్లు ఆయనను ప్రశ్నించారు.(పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలపై కేంద్రం వివరణ) ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఓ జాతీయ మీడియాతో గంగూలీ మాట్లాడుతూ.. ‘ ప్రతీ ఒక్కరు శాంతి కలిగి ఉండాలని కోరుకుంటున్నా. రాజకీయాల గురించి నేను మాట్లాడదలచుకోలేదు. నిజానికి పౌరసత్వ సవరణ బిల్లును నేను చదవలేదు. కాబట్టి పూర్తి అవగాహన లేకుండా ఆ విషయం గురించి మాట్లాడటం సరికాదు. అయితే అందరూ ప్రశాంతంగా ఉండాలి. ఈ చట్టంతో ఎవరికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఎవరు నష్టపోతారు అనే విషయాల గురించి చర్చ జరగాలి. అయితే నాకు ప్రతీ ఒక్కరి సంతోషమే ముఖ్యం’ అని పేర్కొన్నాడు.(‘పౌర’ ఆందోళనలు హింసాత్మకం) -
మజ్లిస్‌కు భయపడి వ్యతిరేకంగా ఓటేసిన టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: మతోన్మాద మజ్లిస్ పార్టీకి భయపడే పౌరసత్వ చట్టం సవరణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓటు వేసిందని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, వామపక్షాలు, అర్బన్ నక్సలైట్లు, టీఆర్ఎస్, మజ్లిస్ కలిసి పౌరసత్వ సవరణ చట్టంపై గందరగోళం సృష్టిస్తున్నాయని, ఆలోచన రహితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. 12 శాతం ఓట్ల కోసం సీఎం.. ఒవైసీకి వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవాచేశారు. -
వలస పాలనకు ప్రతిరూపమీ చట్టం
ఒక విదేశీ శక్తి.. పాలనకు సంబంధించి విభజించి పాలించు సూత్రాన్ని కోరుకుందంటే దానికి కారణాల్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జాతీయవాద పార్టీ ఆ పని ఎందుకు చేయాలి? దేశంలోని నిజమైన సమస్యలను పరిష్కరించడంలో అసమర్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారాన్ని ఎలాగోలా బలోపేతం చేసుకోవడానికేనా? ‘‘జాతీయతా స్ఫూర్తిని చైతన్యవంతంగా కలిగి ఉన్నవారు మరొకరి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అలా జోక్యం చేసుకుంటే వారు ఒక జాతిగా గుర్తించబడరు. భారత్‌లో తాము మాత్రమే ఉండాలని హిందువులు భావించినట్లయితే వారు ఒక కలల లోకంలో జీవిస్తున్నట్లే లెక్క’’ అని ఏనాడో గాంధీజీ ‘హిందూ స్వరాజ్’లో రాసిన అంశాన్ని జాతి ఎన్నటికీ మర్చిపోకూడదు. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ) ఇప్పుడు చట్టమైంది. న్యాయస్థానాలు ఈ చట్టాన్ని తోసిపుచ్చినా లేక దాని అమలుపై స్టే విధించినా జాతీయ రాజ్యమైన భారతదేశం స్వభావం గురించి ఇది కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇతర దేశాల భూభాగాల్లో అణచివేతను ఎదుర్కొంటున్న వారికి భారత్‌లో ఆశ్రయమిచ్చి, ఉపశమనం కలిగించి, పౌరసత్వాన్ని మంజూరు చేయడం అనే భావనను ఏ ఒక్కరూ వ్యతిరేకించరు. సమస్యల్లా ఏమిటంటే, భారత్ వంటి ఉదార ప్రజాస్వామిక దేశంలో ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశాన్ని మతం నిర్ణయించవచ్చా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అంశంపై మూడు భావధారలు వ్యాప్తి చెందుతున్నాయి. మొదటగా, సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినవారు.. ఇరుగుపొరుగు ఇస్లామిక్ దేశాల్లో మతపర మైనారిటీలను తొక్కిపెడుతున్నారని, వీరికి రక్షణ కల్పించాలనే ప్రాతిపదికను ఎంచుకున్నారు. ఇస్లామిక్ దేశాల్లో ముస్లింలను అణిచివేయరు కాబట్టి వీరిని పౌరసత్వ సవరణ బిల్లునుంచి మినహాయించవచ్చని వీరి వాదన. శ్రీలంక హిందువులకు మినహాయింపు ఎందుకు? పైగా, ఇతరదేశాల్లో ప్రత్యేకించి శ్రీలంకలోని హిందూ, ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వకుండా ఈ బిల్లులో ఎందుకు మినహాయించారు అంటే 1964లో నాటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారనాయకే, నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కొన్ని లక్షల మంది శ్రీలంక తమిళులకు భారతీయ పౌరసత్వం ఇవ్వడానికి అంగీకరించారు కాబట్టి, ఇప్పుడు వారికోసం మరొక నిబంధన చేర్చాల్సిన అవసరం లేదని వీరి వాదన. పైగా, నాటి భారత, పాక్ ప్రధానులు నెహ్రూ, లియాఖత్ మధ్య 1950లో కుదిరిన ఒప్పందానికి భారత్ కట్టుబడగా, పాకిస్తాన్ దాన్ని గౌరవించలేదని వీరు వాదిస్తున్నారు. భారత్‌లోని మైనారిటీలను ఇండియా పరిరక్షిస్తూ రాగా, పాకిస్తాన్ నుంచి భారీ సంఖ్యలో హిందువులు భారత్‌కి వలస వచ్చారని వీరి వాదన. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని హిందువుల జనాభా శాతం బాగా తగ్గిపోతూండగా, భారత్ లోని ముస్లింల జనాభా పెరుగుతూ వచ్చిందన్న వాస్తవమే తమవాదనకు నిదర్శనం అని చెబుతున్నారు. అంటే ముస్లింలు కోరుకుంటే ఇస్లామిక్ దేశాల్లో ఆశ్రయం తీసుకోవచ్చు కానీ ఇతర దేశాల్లో అణచివేతకు గురైన హిందువులు మాత్రం ఆశ్రయం కోరి భారత్‌కి మాత్రమే రాగలరు కాబట్టి వారి పట్ల జాతి సానుభూతితో ఉండాలని వీరు చెబుతున్నారు. ఇక రెండోవాదన ఈశాన్య భారత రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారి నుంచి వస్తోంది. భారతదేశంలోకి ఏ మతానికి సంబంధించినవారైనా సరే.. వలస రావడాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. వలసలు వెల్లువెత్తితే తమ ప్రాంతం వనరులను ఊడ్చేస్తారని, తమ భాష, సంస్కృతి కూడా క్షీణించిపోతుందని వీరి భయం. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీలు ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే జనాభా స్వరూపాన్ని ప్రభావితం చేశారు. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తే వలసలు మరింతగా పెరిగి స్థానిక ప్రజలు అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదముందని వీరి భావన. అందుకే వలస వచ్చే విదేశీయులను దేశంలోని ఇతర ప్రాంతాల్లో సర్దుబాటు చేస్తే ఈశాన్య రాష్ట్రాల ప్రజల భయాలు చాలావరకు సద్దుమణుగుతాయి. దేశంలో పేలవమైన పాలన, జాతీయ పౌర పట్టిక అమలు సమయంలో తలెత్తిన కల్లోల పరిస్థితుల వల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలపై విశ్వాసం చూపడం లేదు. ఇక్కడి స్థానిక ప్రజలు కానీ, హిందువులు, ముస్లింలు కానీ రానున్న సంవత్సరాల్లో తమకు న్యాయం జరుగుతుందని విశ్వసించడం లేదు. పైగా, ఈశాన్య రాష్ట్రాల్లోని ఆర్థిక దుస్థితి రీత్యా, ఇప్పటికే తక్కువగా ఉన్న ఉద్యోగాలను వలస ప్రజలు కొల్లగొడతారని, స్థానికుల ఆర్థిక అవకాశాలను తగ్గించివేస్తారని ప్రజలు భయపడుతున్నారు. దేశ లౌకిక, సామాజిక నిర్మాణంపైనే దాడి ఇక మూడో వాదన మతపరమైన వివక్ష ప్రాతిపదికన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న వారినుంచి వస్తోంది. ఈ బిల్లు నుంచి ముస్లింలను మినహాయించాలని వీరు కోరుకోవడం లేదు. పైగా ఈ చట్టం దేశ లౌకిక సామాజిక నిర్మాణంపైనే దాడిగా వీరు భావిస్తున్నారు. పొరుగుదేశాలనుంచి అణచివేత కారణంగా భారత్‌కు వస్తున్నవారు మతపర కారణాలతోటే కాకుండా జాతి, భాషా పరమైన కారణాల వల్ల కూడా వలస వస్తున్నారని వీరి వాదన. దారిద్య్రం వంటి ఆర్థిక కారణాలే వలసలను ప్రభావితం చేస్తుం టాయి. పైగా బలహీనపడుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి దృష్టి మరల్చడానికి పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. పైగా ఈ చట్టం దేశంలో మతపరమైన విభజనను మరిం తగా పెంచి ముస్లిం కమ్యూనిటీని ఏకాకులను చేస్తుంది. దేశంలో మతతత్వపరమైన వాతావరణం పెరుగుతున్న తరుణంలో మైనారిటీలు అణచివేతకు పాలబడి రెండో తరగతి పౌరులుగా వ్యవహరించబడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో ఏ ముస్లిం పైన అయినా విదేశీయుడిగా ముద్రవేయడమే కాకుండా తాము విదేశీయులం కామని వారే నిరూపించుకోవలసి ఉంటుంది. జాతీయ పౌర పట్టీ ప్రక్రియ సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో చాలామంది తగిన డాక్యుమెంటేషన్ కలిగిలేరు. ఇలాంటి వ్యక్తులను పొరుగుదేశాలు అంగీకరించవు కాబట్టి వీరిని శాశ్వతంగా నిర్బంధ శిబిరాల్లోనే ఉంచాల్సి వస్తుందేమో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఇలాంటి వారి జనాభా కూడా అధికంగా ఉంటోంది. పైగా నిర్బంధ శిబిరాలను ఏర్పర్చి అసంఖ్యాక ప్రజలను వాటిలో పెట్టి నిర్వహించడం భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి కారణంగా ఇంత అదనపు భారాన్ని మోయడం సాధ్యమేనా? ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల వల్ల మదుపు, ప్రత్యేకించి విదేశీ మదుపులు వెనక్కి పోతాయి. దీనివల్ల ఇప్పటికే మాంద్యంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోయే ప్రమాదముంది. మరోవైపున ఎన్నికల మేనిఫెస్టోలో తాము చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని బీజేపీ వాదిస్తోంది. ఒక పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇస్తే అధికారంలోకి వచ్చాక దాని పూర్వాపరాలను పట్టించుకోకుండా దాన్ని అమలు చేయవలసిందేనా? పైగా కేంద్రం లోని మోదీ ప్రభుత్వం చాలా వాగ్దానాలు చేసింది. కానీ అవి అమలుకు నోచుకోలేదు. పైగా ఎన్నికల సమయంలో చేసిన వందలాది హామీలలో ఒక ప్రత్యేక హామీ కోసం ప్రజలు పార్టీలకు ఓటు వేయరు కూడా. పైగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి పౌరసత్వ సవరణ చట్టం కారణం కాదు. అనేక ఇతర అంశాలు, ప్రత్యేకంగా ఆర్థిక దుస్థితిని నేర్పుగా పక్కన బెట్టేశారు. అందుకే పాలకపార్టీ హిందూ అనుకూల, ముస్లిం అనుకూల వైఖరిలలో ఏదో ఒకదానిని ప్రజలు స్వీకరించే ఎజెండాతో పనిచేస్తోందా? ఏకజాతిగా మనుగడ సాగించలేం! గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను భారత్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆనాడు హిందూ స్వరాజ్‌లో ‘‘ది హిందూస్ అండ్ మహమ్మదియన్స్’ పదవ అధ్యాయంలో గాంధీ ఇలా చెప్పారు. ‘భారత్ ఏక జాతిగా మనుగడ సాగించలేదు. ఎందుకంటే అనేక మతాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. విదేశీయులు ప్రవేశించడం అనే ఒక్క కారణం జాతిని ధ్వంసం చేయలేదు. వారు దేశంలో భాగం అవుతారు... జాతీయతా స్ఫూర్తిని చైతన్యవంతంగా కలిగి ఉన్నవారు మరొకరి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అలా జోక్యం చేసుకుంటే వారు ఒక జాతిగా గుర్తించబడరు. భారత్‌లో తాము మాత్రమే ఉండాలని హిందువులు భావించినట్లయితే వారు ఒక కలల లోకంలో జీవిస్తున్నట్లే లెక్క’’ అందుచేత, దేశాన్ని మతపరంగా విభజించి పాలించాలనే బ్రిటిష్ వలస పాలకుల అసంపూర్ణ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇప్పుడు మనం మతపరంగా విభజించే ఎజెండాను అమలు చేసుకుంటూ పోతున్నామా? ఒక విదేశీ శక్తి విభజించి పాలించు సూత్రాన్ని కోరుకుందంటే దానికి కారణాల్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జాతీయవాద పార్టీ ఆ పని ఎందుకు చేయాలి? దేశంలోని నిజమైన సమస్యలను పరిష్కరించడంలో అసమర్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారాన్ని ఎలాగోలా బలోపేతం చేసుకోవడానికేనా? అరుణ్ కుమార్ (ది వైర్ తోడ్పాటుతో) వ్యాసకర్త మాల్కొమ్ ఎస్ ఆదిశేషయ్య చైర్ ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, రచయిత -
‘చేసేదేంలేక కారు అక్కడే వదిలేసి..’
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై ఢిల్లీలో నిరసనలు ఉధృతమైన నేపథ్యంలో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. దేశ రాజధానికి వచ్చే వాహనాల్లో తనిఖీలు చేశారు. అయితే, గురుగ్రామ్ నుంచి వచ్చే వాహనాలను చెక్ చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు మొదలైన ఈ తనిఖీలతో వాహనదారులతో పాటు పాదాచారులకు కూడా అసౌకర్యం కలిగింది. తనిఖీలపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఇంటి నుంచి బయల్దేరిన కొద్ది నిముషాలకే దాదాపు గంటపాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను. ఎన్‌హెచ్-8పై రెండు వైపులా ట్రాఫిక్ మయమే. వాహనాల మధ్య కనీసం మూరెడంతో ఖాళీ కూడా లేదు. పెద్దా చిన్నా అని తేడాలేకుండా అన్ని వాహనాలు అతుక్కుపోయినట్టుగా ఉన్నాయి. ఈ కష్టాలు భరించలేక కొందరు తమ కార్లను రోడ్డుపైనే వదిలేసి కాలినడకన ఇళ్లకు చేరారు. నేను కూడా కారును అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాను. గురుగ్రామ్-ఢిల్లీ హైవేపై ట్రాఫిక్ జామ్ సాధారణమే. కానీ, ఇంత ట్రాఫిక్‌ను ఎప్పుడూ చూడలేదు’అని గురుగ్రామ్ వాసి ఒకరు వాపోయారు. ఉదయం పూట భారీ వాహనాలను గురుగ్రామ్-ఢిల్లీ హైవేపైకి అనుమతించడమే భారీ ట్రాఫిక్‌కి మరో కారణమని ఆయన పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. జామియా యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతునిచ్చేందుకు మేవాత్ నుంచి కొంతమంది సమూహం వస్తున్నట్టు పక్కా సమాచారం ఉండటం.. శాంతి భద్రతల దృష్ట్యా వాహన తనిఖీలు చేపట్టినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీ-గురుగ్రామ్ దారిని తాత్కాలికంగా మూసేశామని చెప్పారు. -
పౌరసత్వ చట్ట నిరసనలతో స్తంభించిన ఢిల్లీ
-
నినాదాలతో హోరెత్తించిన మహిళా విద్యార్థులు
-
డప్పు దరువులతో.. ‘విప్లవం వర్థిలాలి’
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జామియా మిలియా ముస్లిం యూనివర్సిటీ మహిళా విద్యార్థులు గురువారం నిరసనలతో కదం తొక్కారు. ‘జామియా మహిళల విప్లవం వర్థిల్లాలి’ అంటూ నినాదాలు, పాటలతో హోరెత్తించారు. కాగా, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జామియా విశ్వవిద్యాలయ విద్యార్థులపై గత ఆదివారం పోలీసులు లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు, పోలీసులు గాయాలపాలయ్యారు. అయితే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని విద్యార్థులు ఆరోపించారు. మహిళా విద్యార్థుల గదుల్లోకి వెళ్లి మరీ బయటకు తరిమికొట్టారని వాపోయారు. కాగా, జామియా విద్యార్థులకు దేశవ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది. -
నన్ను ఎన్కౌంటర్ చేస్తారనుకున్నా..
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ ఘటనల్లో ఎంతో మంది పౌరులు తీవ్ర గాయాల పాలవుతున్నారు. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై పలువరు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అనుమతి లేకుండా ఆదివారం జెఎంఐలోకి ప్రవేశించి, విద్యార్థుల తరగతి గదుల్లో చొరబడి మరీ వెంబడించి కొట్టారని పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లైబ్రరీలో చదువుకుంటున్న అమాయకులపై దౌర్జన్యం చేశారంటూ ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది జామియా విద్యార్థులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి జాతీయ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. మహ్మద్ ముస్తఫా అనే విద్యార్థి మాట్లాడుతూ... ‘ నేను లైబ్రరీలో చదువుకుంటున్న సమయంలో టియర్ గ్యాస్ వాసన వచ్చింది. పోలీసులు వచ్చి లైబ్రరీలో ఉన్నవాళ్లందరినీ కొట్టారు. నా లాప్టాప్ పగులగొట్టారు. నన్ను కొట్టడం మొదలుపెట్టారు. దేవుడిని తలచుకోండి అంటూ ఆఙ్ఞలు జారీ చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే నన్ను పోలీసు స్టేషనుకు తరలించారు. కాళ్లు, చేతులపై తీవ్రంగా కొట్టారు. నా రెండు చేతులు ఫ్రాక్చరయ్యాయి. మందుల కోసం అడిగే వాళ్లను చచ్చిపోనివ్వండి అంటూ విద్యార్థులను ఉద్దేశించి పోలీసులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నన్ను ఆరోజు ఎన్కౌంటర్ చేస్తారేమోనని భయంతో చచ్చిపోయా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.(‘నేను ముస్లిం కాదు.. అయినా సీఏఏని వ్యతిరేకిస్తున్నాను’) ఇక మరో విద్యార్థి హమ్జాలా ముజీబీ(21) మాట్లాడుతూ.. ‘ఆరోజు లైబ్రరీ మొత్తాన్ని పోలీసులు చుట్టుముట్టారు. సీసీటీవీలను పగులగొట్టారు. మమ్మల్ని అందరినీ లైన్లో నిల్చోబెట్టి కొట్టారు. మా ఫోన్లు పగులగొట్టారు. మీరెంత మీ వయసెంత. మీకు స్వాతంత్ర్యం కావాలా అంటూ ప్రశ్నించారు. వారి వైపు తీక్షణంగా చూస్తుంటే కళ్లు దించరా అంటూ నా కళ్లజోడు లాక్కొన్నారు అంటూ భయానక అనుభవం గురించి ఇండియా టుడేతో చెప్పుకొచ్చాడు. కాగా పార్లమెంటు ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. -
రగులుతున్న భారతం
-
‘ఇదే నా సవాల్.. దమ్ముంటే అలా చెప్పాలి’
రాంచి : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కావాలనే కాంగ్రెస్ నేతలు సీఏఏపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలలో భయాల్ని రెచ్చగొట్టి అల్లర్లకు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లోని బెర్హైత్ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సభ ద్వారా కాంగ్రెస్.. దాని అనుబంధ పార్టీ నాయకులకు ఛాలెంజ్ విసురుతున్నా. వాళ్లకు దమ్ముంటే.. పాకిస్తానీయులకు భారత పౌరసత్వం ఇవ్వడం తమకు సమ్మతమేనని, ఆర్టికల్ 370 కూడా తిరిగి తీసుకొస్తామని చెప్పాలి. అప్పుడు వారినేం చేయాలో భారత ప్రజలే నిర్ణయిస్తారు’అని అన్నారు. ఏ ఒక్క భారతీయుడి హక్కులకు పౌరసత్వ చట్టం విఘాతం కలిగిందని ప్రధాని పునరుద్ఘాటించారు. ‘పొరుగు దేశాల్లో ఉన్న.. పీడనకు గురవుతున్న మైనారిటీల కోసం ఈ చట్టం తెచ్చాం. 2015కు ముందు భారత్‌కు వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మైనారిటీలకు పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టం. దీంతో భారత ప్రజల హక్కులకు భంగం ఎలా కలుగుతుంది..? కాంగ్రెస్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. కావాలనే ముస్లిం ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ విభజించు పాలించు విధానంతో ఇప్పటికే దేశం ఓసారి ముక్కలైంది. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మళ్లీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ’అని ప్రధాని వ్యాఖ్యానించారు. -
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణం
-
‘పౌర’ ఆగ్రహం తీవ్రం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వ్యతిరేకత రోజురోజుకీ తీవ్రమవుతోంది. మొదట అస్సాం, త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన ఆందోళనలు సోమవారం నాటికి దేశవ్యాప్తమయ్యాయి. దేశ రాజధానిలోని జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు పలు ఇతర యూనివర్సిటీలు, ఐఐటీలు సంఘీభావం ప్రకటించి, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జామియా వర్సిటీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి. బాధ్యతారహితంగా చట్టాన్ని తీసుకువచ్చిన కేంద్రానిదే ఈ హింసకు బాధ్యత అని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో అసాధారణంగా ప్రత్యర్థి పక్షాలు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ నిరసనల్లో పాల్గొన్నాయి. ఢిల్లీ, లక్నో, ముంబై, హైదరాబాద్, బెంగళూరుల్లోని పలు వర్సిటీల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ విద్యార్థులు సైతం ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. కోల్‌కతాలో మమతాబెనర్జీ టీఎంసీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బెంగాల్లో ఎన్నార్సీ, సీఏఏలను అడ్డుకునేందుకు తన ప్రాణాలైనా ఇస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో రహదారులు, రైల్వే లైన్లను ఆందోళనకారులు నిర్బంధించారు. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు, లూటీలు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. జామియా వర్సిటీలో..: ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై ఆదివారం పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ సోమవారం వేలాది విద్యార్థినీ, విద్యార్థులు వర్సిటీ ప్రధాన ద్వారం ముందు బైఠాయించారు. వర్సిటీ ముందున్న రోడ్లపై ఆందోళనలు నిర్వహించారు. వర్సిటీ అధికారుల అనుమతి లేకుండా పోలీసులు లోపలికి వచ్చి, విద్యార్థులపై లాఠీచార్జి చేసి, టియర్‌గ్యాస్ ప్రయోగించడాన్ని ప్రశ్నించారు. పోలీసుల దౌర్జన్యంపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కొందరు విద్యార్థులు తీవ్రమైన చలిలో, చర్మాన్ని కోసేసే చలిగాలుల మధ్య షర్ట్ లేకుండా నిల్చుని నిరసన తెలిపారు. నిరసనకారులు జాతీయ పతాకాన్ని పట్టుకుని, మానవహారంగా నిలిచి, కేంద్రం, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, ఆదివారం అదుపులోకి తీసుకున్న విద్యార్థుల్లో 50 మందిని సోమవారం పోలీసులు విడుదల చేశారు. ఆదివారం నాటి హింసపై దర్యాప్తు జరుపతామని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు 4 డీటీసీ బస్సులు, 100 ప్రైవేటు వాహనాలు, 10 పోలీస్ బైకులు ధ్వంసం చేశారన్నారు. కాగా, జామియా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ నజ్మా అఖ్తర్ కూడా విద్యార్థులకు మద్దతుగా మాట్లాడారు. నియంతృత్వంపై పోరాడుతాం: ప్రియాంక జామియా మిలియా విద్యార్థులకు సంఘీభావంగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ఇండియా గేట్ వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారని కేంద్రంపై ప్రియాంక మండిపడ్డారు. పౌరసత్వ చట్టం పరిణామాలపై రాష్ట్రపతి కోవింద్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ తెలిపాయి. ఇండియా గేట్ వద్ద ధర్నాకు దిగిన ప్రియాంక నిబంధనలకు లోబడే పౌరసత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర అక్రమ వలసదారులకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించదని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని నియమ నిబంధనలకు లోబడే పౌరసత్వ కల్పిస్తామని పేర్కొంది. ఇతర విశ్వవిద్యాలయాల్లో.. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టంపై సోమవారం నిరసనలు చేపట్టారు. జామియా వర్సిటీ విద్యార్థులపై పోలీసుల తీరును ఖండించారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. లక్నోలోని నాడ్వా కాలేజీ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్‌లోని మౌలానా నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఆదివారం అర్ధరాత్రి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాశిలోని బనారస్ హిందూ యూనివర్సిటీ, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీల్లోనూ విద్యార్థులు జామియా వర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా నిరసన జరిపారు. విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్పూర్, మద్రాస్, బొంబాయి ఐఐటీల్లో, అహ్మదాబాద్ ఐఐఎం, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ల్లో తొలిసారి విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ముంబైలోని టిస్(టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్) విద్యార్థులు ‘ఢిల్లీ పోలీస్.. షేమ్ షేమ్’ అని నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలోని జేఎన్‌యూ విద్యార్థులు ఆందోళనల్లో భారీగా పాల్గొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, కాసర్‌గఢ్, పుదుచ్చేరి యూనివర్సిటీల విద్యార్థులు తరగతులను బహిష్కరిం చారు. ఆదివారం అలీగఢ్ వర్సిటీలో పోలీసులతో జరిగిన ఘర్షణలో దాదాపు 60 మంది విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. చాలా బాధగా ఉంది పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు జరగడం దురదృష్టకరమని, ఈ పరిణామాలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజాన్ని చీల్చేందుకు కొందరు స్వార్థపరులు చేస్తున్న కుట్రలకు ప్రజలు బలికారాదని, వదంతులు వ్యాప్తి చెందకుండా చూడాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం పలు ట్వీట్లు చేశారు. పౌరసత్వ చట్ట సవరణ కారణంగా భారతీయులకుగానీ, ఏ మతం వారికి కానీ అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. దీనిపై జరుగుతున్న ఉద్యమాలు పలు రాష్ట్రాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని తన ట్వీట్ల ద్వారా శాంతి సందేశాలను పంపే ప్రయత్నం చేశారు. ఇది శాంతి భద్రతలను కాపాడుకోవాల్సిన సమయమని, అందరూ ఐకమత్యంతో సోదరభావంతో మెలగాలని హితవు పలికారు. తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. -
అనర్థదాయకం
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల్లో చోటుచేసుకుంటున్న విధ్వంసం, పోలీసుల చర్యలు ప్రజాస్వామ్యవాదులందరినీ కలవరపరుస్తున్నాయి. ఒక నగరమని కాదు, ఒక విశ్వవిద్యాలయమని కాదు... దేశవ్యాప్తంగా ఎన్నోచోట్ల ఈ చట్టంపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతు న్నాయి. న్యూఢిల్లీ, లక్నో, వారణాసి, ముంబై, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం నగరాల్లో విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ఈ ఆందోళనలకు దిగినవారంతా ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా అందుకు ఎవరి కారణాలు వారికున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ చట్టం పౌరుల్ని మత ప్రాతిపదికన విభజిస్తోందని ఆరోపిస్తున్నవారితోపాటు తమ రాష్ట్రాల్లోకి అక్ర మంగా వలస వచ్చినవారిలో కొందరిని ఇక్కడే ఉంచడానికి ఈ చట్టం వీలు కల్పిస్తోందని ఈశాన్య రాష్ట్రాల పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులో శ్రీలంక తమిళ శరణార్థుల ప్రస్తావన లేక పోవడంతో తమిళనాడులో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఈ ఆందోళన ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఎన్డీఏ మిత్రపక్షాలు అసోం గణ పరిషత్(ఏజీపీ), జేడీ(యూ)లు కూడా ఇప్పుడు పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలంటూ ఏజీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని తెలిపింది. ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం విద్యార్థులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారడం, పోలీసులపై దాడులు చేసి వారిని రక్తలు కారేలా కొట్టడం, దాన్ని నియంత్రించే పేరు మీద పోలీసులు దాడి చేయడం వంటి దృశ్యాలు చానెళ్లలో చూసి అందరూ దిగ్భ్రాంతి చెందుతున్నారు. విశ్వవిద్యాలయం వెలుపల జరిగిన విధ్వం సంపైనా, తమపై జరిగిన దాడులపైనా దర్యాప్తు చేయడం పోలీసుల బాధ్యతే. దాన్నెవరూ కాదనరు. కానీ ఆ పేరు మీద జామియాలోని లైబ్రరీపై, అక్కడి వాష్‌రూంపై దాడి చేసి దొరికినవారిని దొరికి నట్టు కొట్టి తీవ్రంగా గాయపర్చడం, విద్యార్థినులను సైతం కొట్టడం సరైన చర్య కాదు. ఈ ఆందోళన సాకుగా తీసుకుని సంఘ వ్యతిరేక శక్తులు విధ్వంసానికి దిగాయని జామియా విద్యార్థులు కూడా ఆరోపించారు. తాము శాంతియుతంగా ఆందోళన చేయదల్చుకున్నాం తప్ప, హింసకు దిగే ఉద్దేశం లేదని వారు చెప్పారు. బహుశా సరైన చర్యలు తీసుకుని ఉంటే సోమవారంనాటికి ఈ ఉద్రిక్త వాతా వరణం ఎంతో కొంత సడలేది. కానీ అందుకు విరుద్ధంగా అది మరింత తీవ్ర రూపం దాల్చింది. జామియాలోనూ, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలోనూ పోలీసులు దాడులు చేయడాన్ని నిర సిస్తూ దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఇతర విద్యాసంస్థల విద్యార్థులు నిరసన లకు దిగారు. తాము ఎంతో సహనంతో ఉన్నామని పోలీసులు చెబుతున్నారు. కానీ జామియాలో ముగ్గురు విద్యార్థులకు తగిలిన బుల్లెట్ గాయాలకు కారకులు ఎవరు? ఉద్యమాల్లో అధిక సంఖ్యలో జనం పాల్గొంటున్నప్పుడు నిర్వాహకులకు వారిపై అదుపు ఉండదు. ఇది ఆసరా చేసుకుని సంఘ వ్యతిరేక శక్తులు ఆ ఉద్యమాలను పక్కదోవపట్టించే ప్రయత్నం చేస్తాయి. ఈ ప్రమాదాన్ని ఊహించబట్టే విశ్వవిద్యాలయం ఆవరణలోనే ఆందోళనలు నిర్వహించమని తాను విద్యార్థులకు సూచించానని జామియా మిలియా వైస్ చాన్సలర్ నజ్మా అఖ్తర్ చెబుతున్నారు. కారణం ఏమైనా విద్యార్థుల ఆందోళన రోడ్లపైకి వచ్చింది. కనీసం పోలీసులైనా విశ్వ విద్యాలయ అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొంది అందులోకి ప్రవేశించి ఉంటే బాగుం డేది. అప్పుడు లైబ్రరీని ధ్వంసం చేశారని, వాష్‌రూంలోకి చొరబడి విద్యార్థులను గాయపరిచారని ఆరోపణలొచ్చేవి కాదు. ఏ సమస్యపైన అయినా ఆందోళన జరుగుతున్నప్పుడు వీలైనంతవరకూ ఉద్రిక్తతలు తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలి. కానీ జామియాలో అందుకు విరుద్ధంగా జరి గింది. ఫలితంగా విద్యార్థుల ఆందోళన దేశవ్యాప్తంగా విస్తరించింది. రాజీవ్‌గాంధీ హయాంలో అస్సాం విద్యార్థులు అక్రమ వలసలను అరికట్టాలని కోరుతూ 1985లో జరిపిన ఉద్యమాన్ని ఈ తరహాలోనే అణచడానికి ప్రయత్నించినప్పుడు అదెలా విస్తరించిందో పాలకులకు గుర్తుండే ఉంటుంది. గత వారమంతా ఉద్రిక్తంగా ఉన్న అస్సాం సోమవారానికి కాస్త ఉపశమించింది. గువాహటిలో జరిగిన పోలీసు కాల్పుల్లో నలుగురు మరణించగా, 29 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. పశ్చిమ బెంగాల్లో కూడా ఆందోళన హింసాత్మకం అయింది. కేవలం వదంతులు నమ్మి జనం ఆందోళనకు దిగుతున్నారని, విపక్షాలు వారిని పక్కదోవపట్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు. కానీ ఈ చట్టం తీసుకొచ్చేముందు సమాజంలోని అన్ని వర్గాల వారితో చర్చించివుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్ఆర్సీ)ని ఏదోమేరకు అంగీకరించిన అస్సాంలో సైతం ఇప్పుడు కొత్త చట్టంపై ఇంత బలమైన వ్యతిరేకత ఎందుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. పరాయి దేశాల నుంచి వచ్చినవారిలో కొందరికి పౌరసత్వం ఇవ్వడానికి కొత్త చట్టం తీసుకొస్తున్నారని, ఇది తమ భాష, సంస్కృతి వగై రాలపై బలమైన ప్రభావం చూపడమేకాక... తమ ఉపాధిని సైతం దెబ్బతీస్తుందని అస్సాం పౌరులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో తలెత్తిన సందేహాలు నివృత్తి చేయడానికి బదులు ఎవరో కారకులని నిందించడం వల్ల ఉపయోగం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న ఆందోళనల్ని ఉపశమింపజేయడానికి ఏం చేయాలని ఆలోచించాల్సిన తరుణంలో మేఘాలయ గవర్నర్ తథాగత్ రాయ్ ‘ఇక్కడుండటం ఇష్టంలేనివాళ్లు ఉత్తర కొరియా పోవచ్చు’ అంటూ ట్వీట్ చేయడం బాధ్యతారాహిత్యం. ఇలాంటి నేతలను అదుపు చేయడంతోపాటు జరుగుతున్న ఆందోళనలపై దృష్టి పెట్టి, సందేహ నివృత్తి కోసం తగిన చర్యలు తీసుకోవడం అవసరమని కేంద్రం గుర్తించాలి. ప్రశ్నించడం దానికదే నేరం కాదు. ప్రజాస్వామ్యానికి అది ఎంతో అవసరం కూడా. ప్రశ్నించడానికి అవకాశం ఇచ్చినప్పుడు, సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నించినప్పుడు ఉద్యమాలు బయల్దేరవు. అవి ఉగ్రరూపం దాల్చవు. -
పౌరసత్వ బిల్లుపై ‘నకిలీ ట్వీట్లు’
సాక్షి, న్యూఢిల్లీ: ‘నేను ఓ ముస్లింను. క్యాప్‌బిల్ (పౌరసత్వ సవరణ చట్టం)కు నేను సంపూర్ణంగా మద్దతిస్తున్నాను. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నా ముస్లిం సోదరులు చేస్తున్న ఆందోళనను అంతే బలంగా ఖండిస్తున్నాను. వారు బిల్లును సరిగ్గా అర్థమైన చేసుకొని ఉండరు లేదా రాజకీయ చర్యలో భాగంగా ఉద్దేశపూర్వకంగానే బిల్లును వ్యతిరేకిస్తూ ఉండాలి. నేను మాత్రం బిల్లును సమర్థిస్తున్నందుకు గర్వపడుతున్నాను. జైహింద్’ ఓ ముస్లిం మహిళ పేరిట ఇటీవల ఓ ట్వీట్ వచ్చింది. ఇదే సరళలు పలువురు యువతీ యువకులు ముస్లింల పేరిట వరుసగా ట్వీట్లు చేశారు. ఇలా ట్వీట్లు చేసిన వారి ప్రొఫైల్స్‌ను ‘ఆల్ట్ న్యూస్’ వెతికి పట్టుకోగా వారిలో 99 శాతం మంది హిందువులని, వారు గతంలో తాము హిందువులం అంటూ చేసిన ట్వీట్లు కూడా దొరికాయి. చివరలో ‘నేను ఓ ముస్లింను, చివరలో జై హింద్’ అంటూ ట్వీట్ చేసిన యువతి పేరు ఆర్తిపాల్గా తేలింది. ఆర్తిపాల్ చేసిన ట్వీట్‌కు 500 రీట్వీట్లు వెళ్లాయి. అలాగే గతంలో హిందువునని చెప్పుకున్న అర్పిత గౌతమ్ ఇప్పుడు ఖదీజా పేరిట ముస్లింనంటూ రీట్వీట్ చేశారు. ‘నేను ఒక హిందువును. హిందువు, క్రైస్తవులు, ముస్లింల పట్ల నాకు భేద భావం లేదు. వారు మాత్రం హిందువులను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు’ అంటూ గత ఏప్రిల్ 16వ తేదీన ‘బాషా భాయ్’ పేరిట ట్వీట్ చేసిన వ్యక్తి ఈ డిసెంబర్ 14వ తేదీన అదే పేరుతో ‘నేను ఓ ముస్లింను. పౌరసత్వ సవరణ బిల్లును సమర్థిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ‘నీచే సే టాపర్’ శీర్షికతో ‘నేనొక ముస్లింను, పౌరసత్వ బిల్లుకు సంపూర్ణ మద్దతిస్తున్నాను’ అంటూ డిసెంబర్ 14వ తేదీన ట్వీట్ చేసిన వ్యక్తి గతంలో ఏప్రిల్ 26వ తేదీన ‘నేనొక హిందువును’ అంటూ ట్వీట్ చేశారు. మిగతా పలు ట్వీట్లు కూడా ఇదే కోవకు చెందినవి. -
అసోం బీజేపీలో ముసలం!
న్యూఢిల్లీ : హింసాత్మక నిరసనల అనంతరం అసోంలో ఆదివారం నాడు కాస్త ప్రశాంత పరిస్థితులు ఏర్పడ్డాయి. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గత వారం రోజులుగా కొనసాగిన ఆందోళనలో ఐదుగురు మరణించడంతో బీజేపీలో అంతర్గత అసమ్మతి రాజుకుంది. ఈ బిల్లును డిసెంబర్ 11వ తేదీన రాజ్యసభ ఆమోదించిన నాటి నుంచి నేటి వరకు పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు తమ ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ వైఖరిని సమర్థించేందుకు బీజేపీ అధికార ప్రతినిధులెవరూ ప్రజల ముందుకు రాలేక పోతున్నారు. అసోంలోని బీజేపీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు వ్యతిరేకంగా కూడా ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ‘నేనిప్పుడు ప్రజల పక్షానే ఉండదల్చుకున్నాను. ప్రజల మనోభావాలను కేంద్ర ప్రభుత్వం తప్పకుండా గౌరవిస్తుందన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు స్పందించకుండా ఓపిక పట్టాను. ఇక లాభం లేదనుకొని ప్రజల ముందుకు వచ్చాను’ అని బీజేపీ నాయకుడు, అసోం పెట్రోకెమికల్స్ లిమిటెడ్ చైర్మన్ జగదీష్ భుయాన్ శనివారం నాడు ప్రజాముఖంగా ప్రకటించారు. కేంద్రం తన నిర్ణయాన్ని పునర్ పరిశీలించాలని కోరుకుంటున్నానని జోర్హాట్ బీజేపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి వ్యాఖ్యానించారు. వివాదాస్పర పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించడం పొరపాటని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా తాము రాజకీయంగా, చట్టబద్ధంగా పోరాడతామని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామిగా కొనసాగుతున్న అసోం గణ పరిషద్‌కు చెందిన ఎమ్మెల్యే రామేంద్ర నారాయణ్ కలిట ప్రకటించారు. ఈ పరిస్థితిని కేంద్రానికి వినిపించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సోనోవాల్, మరి కొందరు సీనియర్ నాయకులు త్వరలో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విదేశీ వలసదారులకు వ్యతిరేకంగా ఆరేళ్లపాటు సాగిన ఆందోళన ఫలితంగా 1985లో అప్పటి కేంద్ర ప్రభుత్వంతో అస్సామీ జాతీయ వాదులకు మధ్య కుదిరిన ఒప్పందాన్ని గౌరవించాలని అక్కడి ప్రజలు, పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. అసోం సంస్కృతి, సామాజిక, భాషా పరమైన గుర్తింపును పరిరక్షించడం ఆ ఒప్పందంలో భాగం. 1971. మార్చి 24వ తేదీ తర్వాత అస్సాంలోవి వలసవచ్చిన ప్రతి విదేశీయుడు ఎప్పటికీ విదేశీయుడే. అందుకు విరుద్ధంగా పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు మినహా మిగతా హిందు, జైన, బుద్ధ, క్రైస్తవ, సిక్కులకు పౌరసత్వం కల్పించేందుకు కేంద్రం వివాదాస్పద బిల్లును తీసుకొచ్చింది. సంబంధిత వార్తలు.. జామియా విద్యార్థులపై క్రికెటర్ ఆందోళన విద్యార్థులపై హింస: స్పందించిన సుప్రీం గదుల్లోకి చొరబడి మరీ కొట్టారు.. దేశవ్యాప్త ఎన్ఆర్సీకి త్వరలో బిల్లు? -
జామియా విద్యార్థులపై క్రికెటర్ ఆందోళన
న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా విద్యార్థుల పరిస్థితిపై భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆందోళన వ్యక్తం చేశారసు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామియా విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హింస చెలరేగింది. పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి మరీ తమను చితకబాదినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ‘రాజకీయ నిందారోపణలు ఎప్పుడూ ఉండేవే. కానీ జామియా విద్యార్థుల పరిస్థితి గురించే ఇప్పుడు నేను, మన దేశం ఆందోళన చెందుతోంది’ అని ట్వీట్ చేసిన ఇర్ఫాన్.. జామియా మిలియా, జామియా ప్రొటెస్ట్ అనే యాష్‌ట్యాగ్‌లు జోడించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం సాయంత్రం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనలో విద్యార్థులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా సుమారు 40 మంది గాయపడ్డారు. దక్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆందోళనకారులు నాలుగు బస్సులు, రెండు పోలీసు వాహనాలు దగ్ధం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు జెఎంఐ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చొరబడటంతో బలగాలు కూడా క్యాంపస్‌లోకి వెళ్లాయి. ఈ క్రమంలో పోలీసు బలగాలు తమను పట్ల దురుసుగా ప్రవర్తించాయని, కనీసం క్యాంపస్ పరిధిలో ఉన్న మసీదులో ప్రార్థనలు చేసుకోవడానికి కూడా అనుమతించలేదని, తమ లైబ్రరీ, క్యాంటీన్‌ను ధ్వంసం చేశాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో జెఎంఐని వచ్చే నెల 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇంటికి పంపించేశారు. చదవండి: చేతులు పైకెత్తమన్నారు.. నేరస్తుల్లా చూశారు! -
విశ్వవిద్యాలయాల్లో విద్యార్ధుల ఆందోళన
-
పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దీదీ మెగార్యాలీ!
కోల్‌కతా: బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు కోల్‌కతాలో మెగార్యాలీని నిర్వహించనున్నారు. రెడ్రోడ్లోని బాబాసాహేబ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జోరాసంకో ఠాకుర్బారి వద్ద ముగుస్తుందని మమత ట్విటర్లో పేర్కొన్నారు. అంతేగాక ప్రజలు శాంతియుతంగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ.. కొల్‌కతాలోని ఆందోళనకారులు రహదారి, రైలు మార్గాలను దిగ్బందనం చేసి అడ్డుకుంటుండంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరసనల కారణంగా అనేక రైళ్లు ఆలస్యం కాగా.. మరికొన్ని రద్దయ్యాయి. A mega rally will be held today in #Kolkata to protest against unconstitutional #CABBill & #NRC. It will begin at 1pm near the statue of Babasaheb Ambedkar on Red Road & end at Jorasanko Thakurbari.(1/2) — Mamata Banerjee (@MamataOfficial) December 16, 2019 ఇక వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకారులు బెంగాల్‌లోని ముర్షిదాబాద్, మాల్డా, హౌరా జిల్లాల్లోని రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకొని నిప్పంటించి.. తీవ్రంగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్డా, ఉత్తర దినజ్‌పూర్, ముర్షిదాబాద్, హౌరా, నార్త్ 24 పరగణాలు, సౌత్ 24 పరగణ అనే ఆరు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. ఈ జిల్లాల్లో సవరించిన చట్టంపై ఆందోళనలు తీవ్రతరం కావడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇక పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ ఆదివారం సీఎం మమతా బెనర్జీ తీరును తప్పుబడుతూ.. పోలీసుల కోసం ఖర్చు చేయాల్సిన ప్రజా ధనాన్ని.. చట్టానికి వ్యతిరేకంగా టెలివిజన్లలో ప్రచారానికి వృథా చేస్తున్నారని విమర్శించారు. -
విద్యార్థులపై హింస: స్పందించిన సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ యూనివర్సిటీలో పోలీసులు విద్యార్థులపై దాడి చేసిన అంశంపై సుమోటోగా విచారణ చేపట్టాలన్న అభ్యర్థనపై సుప్రీంకోర్టు స్పందించింది. మొదట అల్లర్లు ఆగిపోయి.. శాంతి నెలకొల్పాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే స్పష్టం చేశారు. ఈ అంశంపై మంగళవారం వాదనలు వింటామని ఆయన స్పష్టం చేశారు. ‘మొదట అల్లర్లు ఆగాలని మేం కోరుకుంటున్నాం. అలర్లు ఎలా జరుగుతున్నాయో మాకు తెలుసు. ఇలాంటి వాతావరణంలో మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. ముందు ఇది ఆగాలి’ అని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా జామియా, అలీగఢ్ యూనివర్సిటీల్లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కోలిన్ గోన్సాల్వే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రిటైర్డ్ న్యాయమూర్తులను ఆ రెండు యూనివర్సిటీలకు పంపి.. విద్యార్థులపై జరిగిన హింస పట్ల దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరారు. ‘ఎందుకు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు? బస్సులను తగులబెడుతున్నారు. శాంతియుత వాతావరణం నెలకొన్న తర్వాతే ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. అల్లర్లు చేస్తున్నవారు వెంటనే వాటిని ఆపాలి’ అని జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. -
ఇప్పుడెక్కడికి వెళ్లాలి...
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలతో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ అట్టుడుకుతోంది. ఆదివారం యూనివర్సిటీలో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. సీఏఏపై విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసించడంతో.. అక్కడ అల్లర్లు చెలరేగాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులపై లాఠీ ఝళిపించారు. ఇక ఈ ఘటనతో మహిళా విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. దేశ రాజధానిలో ఉన్న జామియా యూనివర్సిటీ అత్యంత సురక్షితంగా భావించి ఇక్కడ చేరామని.. కానీ నిన్న రాత్రంతా తమకు నరకం కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన విద్య, రక్షణ లభిస్తుందని ఇక్కడికి వచ్చానని జార్ఖండ్‌కు చెందిన ఓ విద్యార్థిని మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ‘దేశవ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులను చూస్తుంటే.. మన దేశమే సురక్షితం కాదేమేనని అనిపిస్తుంది. హాస్టళ్లు వదిలి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్లాలో.. అర్థం కావడం లేదు. ఎవరి చేతిలో దాడికి గురౌతానో తెలియద’ని ఆమె వాపోయారు. ‘నా స్నేహితులు రేపు భారతీయులుగా ఉంటారో లేదో తెలియయడం లేదు. నేను ముస్లిం కాదు. అయినా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను. సత్యం వైపునకు నిలబడని చదువులు ఎందుకు’ అని ప్రశ్నించారు. కాగా, విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసులు దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకుని.. విడిచిపెట్టారు. ఘర్షణలో విద్యార్థులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా సుమారు 40 మంది గాయపడ్డారు. (చదవండి : చేతులు పైకెత్తమన్నారు.. నేరస్తుల్లా చూశారు!) -
మోదీపై నిప్పులు చెరిగిన ప్రియాంకగాంధీ
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆందోళనలు తీవ్రతరమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజల గొంతును వినేందుకు కేంద్రం భయపడుతోందని, అందుకే విద్యార్థులను, జర్నలిస్టులను అణచివేయడం ద్వారా తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. యువత ధైర్యాన్ని, గొంతును అణచివేసేందుకు నరేంద్రమోదీ సర్కార్ నిరంకుశంగా ప్రవర్తించాలని చూస్తోందని, కానీ, ఒకనాటికి యువత గళాన్ని కేంద్రం వినకతప్పదని ఆమె హెచ్చరించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆమె ట్విటర్లో మోదీ సర్కార్‌పై మండిపడ్డారు. ‘దేశంలోని యూనివర్సిటీల్లోకి ప్రవేశించి విద్యార్థులను కొడుతున్నారు. ప్రజలు గొంతు వినాల్సిన సమయంలో బీజేపీ సర్కారు విద్యార్థులు, జర్నలిస్టుల అణచివేత ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది పిరికిపంద ప్రభుత్వం’ అని ఆమె విమర్శించారు. ‘మోదీజీ భారతీయ యువత గళాన్ని వినండి. వారి గొంతును మీరు అణచివేయలేరు. ఎప్పటికైనా మీరు వినాల్సిన పరిస్థితి వస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. చదవండి: చేతులు పైకెత్తమన్నారు.. నేరస్తుల్లా చూశారు! -
చేతులు పైకెత్తమన్నారు.. నేరస్తుల్లా చూశారు!
న్యూఢిల్లీ: చేతులు పైకెత్తి క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ పోలీసులు మమ్మల్ని ఆదేశించారు. నిజానికి మేం ఆందోళనలు జరిగిన ప్రదేశానికి వెళ్లలేదు. ఆ సమయంలో క్యాంపస్‌లో ఉన్నాం. అయినా పోలీసులు మమ్మల్ని నేరస్తుల్లా చూశారు.. ఇది జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని ఆవేదన. పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి మరీ తమను చితకబాదారని, తమను నేరస్తుల్లా చూశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినులని చూడకుండా మగపోలీసులు తమను నెట్టేశారని, తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఆ సమయంలో మహిళా పోలీసులు కూడా లేరని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం సాయంత్రం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనలో విద్యార్థులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా సుమారు 40 మంది గాయపడ్డారు. దక్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఆందోళనకారులు నాలుగు బస్సులు, రెండు పోలీసు వాహనాలు దగ్ధం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు జెఎంఐ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చొరబడటంతో బలగాలు కూడా క్యాంపస్‌లోకి వెళ్లాయి. ఈ క్రమంలో పోలీసు బలగాలు తమను పట్ల దురుసుగా ప్రవర్తించాయని, కనీసం క్యాంపస్ పరిధిలో ఉన్న మసీదులో ప్రార్థనలు చేసుకోవడానికి కూడా అనుమతించలేదని, తమ లైబ్రరీ, క్యాంటీన్‌ను ధ్వంసం చేశాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో జెఎంఐని వచ్చే నెల 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించి.. విద్యార్థులను ఇంటికి పంపించేశారు. చదవండి: గదుల్లోకి చొరబడి మరీ కొట్టారు.. -
వాళ్ల దోస్తీ ఎలాంటిదో చెప్పాలి : మాయావతి
లక్నో : కాంగ్రెస్ పార్టీ దంద్వ వైఖరిపై బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శలు గుప్పించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతునిచ్చిన శివసేనతో కాంగ్రెస్ దోస్తీ ఎలాంటిదో చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో కలిసి అధికారం పంచుకుంటూనే రాహుల్ వీర సావర్కర్ వ్యాఖ్యలను శివసేన తప్పుబట్టడుతోందని అన్నారు. కాగా, ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శనివారం జరిగిన ‘భారత్ బచోవో ర్యాలీ’లో రాహుల్ గాంధీ ‘నేను రాహుల్ సావర్కర్‌ను కాదు’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై శివసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. భరత జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన సావర్కర్‌ను అందరూ గౌరవించాలని స్పష్టం చేసింది. ‘కాంగ్రెస్ వ్యతిరేకించిన పౌరసత్వ సవరణ బిల్లుకు శివసేన మద్దతు పలికింది. ఇప్పుడు అదే శివసేన రాహుల్ గాంధీ సావర్కర్ వ్యాఖ్యలను తప్పుబడుతోంది. మళ్లీ మహారాష్ట్రలో రెండు పార్టీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ దంద్వ విధానాలకు నిదర్శనం’ అని మాయావతి ట్విటర్లో విమర్శలు గుప్పించారు. అసలు కాంగ్రెస్ విధానమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ తన బలహీనతను కప్పిపుచ్చుకునేందుకు నాటుకాలు ఆడుతోందని ప్రజలు భావిస్తారని అన్నారు. -
పౌరసత్వ బిల్లుతో అనిశ్చితి: తపన్‌సేన్
మల్లాపూర్: దేశ విభజన దిశగా బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును తీసుకువచ్చిందని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఆరోపించారు. ఈ బిల్లు వల్ల దేశంలో అనిశ్చితి వాతావరణం నెలకొందని మండిపడ్డారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు ఆదివారం మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తపన్‌సేన్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం సమాజాన్ని, దేశాన్ని విభజించే దిశగా అడుగులు వేస్తోందని విమర్శించారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సహా పలు విషయాల్లో ఒంటెత్తు పోకడలకు పోయి దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్రావు, చుక్కా రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఆర్సీ అంటే ఏమిటి.. నష్టం ఎవరికి?
న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణ బిల్లు కాస్తా పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టమైంది మొదలు.. దేశవ్యాప్త ఎన్ఆర్సీపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ఈ అంశంపై తన వైఖరిని స్పష్టం చేయగా, ప్రతిపక్షాలు సైతం ఈ అంశంపై పోరుకు సన్నద్ధమవుతున్నాయి. ఎన్ఆర్సీ అంటే..? జాతీయ స్థాయిలో అర్హులైన పౌరులదరితో కూడిన జాబితాను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్.. క్లుప్తంగా ఎన్ఆర్సీ అంటారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ వలసదారుల ఏరివేత కోసం ఇటీవలే ఈ ఎన్ఆర్సీ ప్రక్రియను ఈశాన్య రాష్ట్రం అస్సాంలో పూర్తి చేశారు కూడా. ప్రత్యేక జాతులపై ప్రభావం పడరాదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను అస్సాంలో చేపట్టారు. అయితే అక్కడ ఎన్ఆర్సీ పూర్తయినప్పటి నుంచి జాతీయ స్థాయిలో అమలుకు డిమాండ్లు పెరుగుతున్నాయి. హోం మంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ అగ్రనేతలు పలువురు ఇందుకు బహిరంగంగానే మద్దతిచ్చారు. ఈ మేరకు జాతీయ స్థాయిలో ఓ చట్టం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నట్లు అంచనా. దేశవ్యాప్త ఎన్ఆర్సీ చట్టం అమల్లోకి వస్తే.. ప్రభుత్వం ఈ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించడంతోపాటు అదుపులోకి తీసుకునేందుకు అవకాశముం టుంది. వారిని స్వదేశాలకు తిప్పి పంపేందుకూ అధికారాలు లభిస్తాయి. నష్టం ఎవరికి? ప్రస్తుతానికి ఎన్ఆర్సీ చట్టం అనేది ఓ ప్రతిపాదన మాత్రమే. అమల్లోకి వస్తే అక్రమ వలసదారులే లక్ష్యంగా మారతారు. అయితే అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైన్, పార్శీలకు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. మతపరమైన హింసను స్వదేశాల్లో ఎదుర్కొన్నందుకే ఇక్కడకు వచ్చామని వారు చెప్పుకుంటే సరిపోతుంది. ఇంకోలా చెప్పాలంటే ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే పైన చెప్పుకున్న మూడు దేశాలు మినహా మిగిలిన ఏ దేశపు అక్రమ వలసదారు కూడా ఇక్కడ ఉండేందుకు అవకాశం ఉండదు. అంతేకాకుండా.. ఈ దేశాల నుంచి వచ్చిన ముస్లింలూ చిక్కుల్లో పడతారు. ఎందుకంటే వీరు పౌరసత్వ చట్ట సవరణ నిబంధనల్లో లేరు కాబట్టి. దీంతో వీరందరినీ అదుపులోకి తీసుకుని డిటెన్షన్ కేంద్రాలకు తరలించాల్సి వస్తుంది. అస్సాంలో ఇప్పటికే గుర్తించిన 19 లక్షల మంది అక్రమ వలసదారులను ఇలాగే డిటెన్షన్ కేంద్రాల్లోనే ఉంచారు. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను ఇలా డిటెన్షన్ కేంద్రాలకు తరలించిన తరువాత విదేశీ వ్యవహారాల శాఖ ఆయా దేశాలకు సమాచారం ఇస్తుంది. ఆయా దేశాలు అంగీకరిస్తే వారిని తిప్పి పంపుతారు. దేశవ్యాప్త ఎన్ఆర్సీకి కట్టుబడి ఉన్నామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెడతారా? అన్నది ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశం అవుతోంది. ఎన్ఆర్సీపై ప్రశాంత్ కిషోర్ భగ్గు! అక్రమ వలసదారులను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ నిర్వహిస్తామన్న అధికార బీజేపీ ప్రకటనలపై ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ భగ్గుమంటున్నారు. ఈ చర్య పెద్దనోట్ల రద్దు మాదిరిగానే పేదలు, దిగువ తరగతి వారికి తీవ్ర నష్టం చేయనుందని ఆయన ట్వీట్ చేశారు. -
కాంగ్రెస్ అగ్నికి ఆజ్యం పోస్తోంది
డుమ్కా (జార్ఖండ్): కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పౌరసత్వ(సవరణ) చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆదివారం జార్ఖండ్‌లోని డుమ్కాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. అగ్నికి ఆజ్యం పోస్తున్న వారిని వారి దుస్తుల ఆధారంగానే గుర్తించవచ్చునని పార్టీ, సామాజిక వర్గాల పేర్లు నేరుగా ప్రస్తావించకుండా మోదీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘ఆస్తులకు నిప్పు పెడుతున్న వారిని టీవీల్లో చూడవచ్చు. ధరించిన దుస్తుల ఆధారంగానే వారిని గుర్తు పట్టవచ్చు’అని ఆయన అన్నారు. పౌరసత్వ(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలతోపాటు బెంగాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలన్నింటికీ ప్రతిపక్షాలు వ్యూహాత్మక సహకారం అందిస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే, కాంగ్రెస్ కుట్రలకు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ప్రభావితం కాలేదని అన్నారు. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు కొందరు ప్రదర్శన నిర్వహించడంపై ఆయన.. ‘దేశం పరువు తీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ ఏళ్లుగా చేస్తున్న పనిని ఇప్పుడు కాంగ్రెస్ మొదటిసారిగా చేపట్టింది’ అని ఆరోపించారు. పార్లమెంట్లో ఎంపీలు సంతాలీ తదితర ప్రాంతీయ భాషల్లో మాట్లాడేందుకు అవకాశం కల్పించిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో సంతాలీ భాష తర్జుమాకు కూడా వీలు కల్పించారన్నారు. -
ఆగని ‘పౌరసత్వ’ ప్రకంపనలు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. దేశ రాజధానితో పాటు పశ్చిమబెంగాల్, అస్సాంల్లో ఆదివారం ఉధృతంగా నిరసన ప్రదర్శనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో ఆందోళనకారులు బస్సులకు, అగ్నిమాపక వాహనానికి నిప్పుపెట్టారు. గువాహటిలో పోలీసుల కాల్పుల్లో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. లండన్‌లోని భారతీయ హైకమిషన్ కార్యాలయం ఎదుట కొందరు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కాగా, సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలని యోచిస్తున్నట్లు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వెల్లడించింది. మరోవైపు, పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ‘ముస్లింల హక్కులకు భంగం కలిగే ఒక్క అంశం కూడా చట్టంలో లేదు’ అని పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర స్పష్టం చేశారు. రాజధానిలో.. ఆగ్నేయ ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ దగ్గరలో ఆందోళనకారులు పలు బస్సులను తగలబెట్టారు. మంటలను ఆర్పేందుకు వస్తున్న అగ్నిమాపక వాహనాలను కూడా ధ్వంసం చేశారు. పోలీసుల లాఠీ చార్జిలో పలువురు విద్యార్థులు, ఆందోళనకారులకు గాయాలయ్యాయి. ఒక పోలీసుకు, ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. కాగా, తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని విద్యార్థి సంస్థ ఎన్ఎస్యూఐ తెలిపింది. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఉద్యమంలో చేరి హింసకు పాల్పడుతున్నాయని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులు ఆరోపించారు. వర్సిటీలో ఉంటూ విద్యార్థులను రెచ్చగొడ్తున్న విద్యార్థేతరులను అదుపులోకి తీసుకునేందుకు ఆదివారం పోలీసులు జామియా మిలియా వర్సిటీలో సోదాలు జరిపారు. బెంగాల్లో.. :పశ్చిమబెంగాల్లోని నాడియా, బీర్భుమ్, నార్త్ 24 పరగణ, హౌరా జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు రహదారులపై టైర్లు, కట్టెలను తగలబెట్టారు. ముర్షీదాబాద్, మాల్డా, నార్త్ 24 పరగణ, హౌరా జిల్లాల్లో ఇంటర్నెట్ను అధికారులు నిలిపేశారు. అస్సాంలోని గువాహటిలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఆందోళనకారుల సంఖ్య ఆదివారానికి నాలుగుకి చేరింది. ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ మాత్రం ఐదుగురు చనిపోయారని, పలువురి పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిపింది. బుధవారం నుంచి తమ ఆసుపత్రిలో బుల్లెట్ గాయాలతో 29 మంది చేరారని గువాహటి మెడికల్ కాలేజీ తెలిపింది. లండన్‌లోని భారతీయ హై కమిషన్ ముందు కొందరు అస్సాం వాసులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సంప్రదాయ అస్సామీ వస్త్రధారణలో పిల్లలతో పాటు వచ్చిన యువత ఈ కార్యక్రమంలో పాల్గొంది. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ యూకే శాఖ కూడా నిరసన ప్రదర్శన చేపట్టింది. పార్టీ పెడతాం: ఏఏఎస్‌యూ పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఏఏఎస్‌యూ) సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభించాలని యోచిస్తోంది. శిల్పి సమాజ్తో కలిసి పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఏఏఎస్‌యూ సంకేతాలిచ్చింది. సుప్రీంకోర్టుకు ఏజీపీ పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అధికార బీజేపీ భాగస్వామ్య పక్షమైన అస్సాం గణపరిషద్ (ఏజీపీ) నిర్ణయించిందని ఏజీపీ నేత దీపక్ దాస్ తెలిపారు. అస్సాం ప్రజల సెంటిమెంట్‌ను ఏజీపీ గౌరవిస్తుందని ఈ చట్టం తమ ఉనికిని, అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తుందని భావిస్తున్నారని ఆయన చెప్పారు. మరోవైపు ఈ చట్టాన్ని ఏజీపీ ఎప్పుడూ సమర్థించలేదని మంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత స్పష్టం చేశారు. -
భగ్గుమంటున్న దేశ రాజధాని
-
భగ్గుమంటున్న దేశ రాజధాని
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుపై దేశ రాజధాని ఢిల్లీలో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి. బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కు చెందిన రెండు బస్సులను దగ్ధం చేశారు. భరత్ నగర్లో డీటీసీ బస్‌కు ఆందోళనకారులు నిప్పంటించగా ఆ ప్రాంతానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి. మరోవైపు ఫైరింజన్లు ఘటనా స్ధలానికి చేరుకుంటుండగా ఓ ఫైరింజన్‌ను జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్ధులు అడ్డగించి ధ్వంసం చేశారని ఢిల్లీ ఫైర్ సర్వీసు అధికారులు తెలిపారు. ఘటన చోటుచేసుకున్న మధురా రోడ్డుకు వెళ్లకుండా ఆ మార్గాన్ని ఆందోళనకారులు దిగ్బంధించారు. ఫైరింజన్‌ను దగ్ధం చేసిన ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. ఆందోళనల నేపథ్యంలో సరితా విహార్‌కు వెళ్లే ఓఖ్లా అండర్‌పాస్‌పై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రహదారి నిర్బంధంతో బదార్పూర్, ఆశ్రమ్ చౌక్ నుంచి వచ్చే వాహనాలను దారిమళ్లించారు. చదవండి: ‘పౌరసత్వం’ అపోహలు.. నిజాలు తెలుసుకోండి..! -
‘అల్లర్లు ఆగకపోతే రాష్ట్రపతి పాలనే’
కొల్కత్తా: సవరించిన పౌరసత్వ చట్టంపై అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం బెంగాల్లో ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌కు, బస్సులకు నిప్పుపెట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకొని నిరసనకారులు దాడులకు దిగుతున్నారు. శనివారం బర్రక్పూర్కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్‌సింగ్ కారుపై గుర్తు తెలియని నిరసనకారులు దాడి చేశారు. కారుపై రాళ్లు రువ్వుతూ దాడికి తెగపడ్డారు. వారి దాడి నుంచి తప్పించుకున్న ఎంపీకి ఎటువంటి గాయాలు కాలేదు. దీనిపై స్పందించిన ఎంపీ మాట్లాడుతూ.. ‘ఖాక్కినారా నుంచి వస్తున్న నా కారుపై ఆందోళనకారులు రాళ్లు విసురుతూ దాడికి తెగపడ్డారు. పశ్చిమబెగాల్లో శాంతి భద్రతలు అదుపులో లేవు. ఇలాగే ఆందోళనకారుల అల్లర్లు కొనసాగితే సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. నిరసనకారల అల్లర్లు ఆగకపోతే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించాలి’అని ఎంపీ అర్జున్‌సింగ్ అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ.. ఆందోళనకారలు తీవ్రంగా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో పలు ప్రభుత్వ కార్యాలయాలు దగ్ధం అయ్యాయి. నిరసనకారులు ముఖ్యంగా ముర్షిదాబాద్, మాల్డా, హౌరా జిల్లాల్లోని రైల్వే స్టేషన్లను లక్ష్యంగా చేసుకొని వాటికి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విధంగా హింసాత్మంగా మారిన నిరసనల వల్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ శాంతిని కాపాడలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆస్తులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె నిరసనకారులను హెచ్చరించారు. హింసను ఆశ్రయించకూడదని ప్రజలకు మమతా విజ్ఞప్తి చేశారు. కాగా బంగ్లాదేశ్ ముస్లిం చొరబాటుదారుల అల్లరి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించటం తప్ప కేంద్రానికి మారో మార్గం లేదని ఎంపీ అర్జున్‌సింగ్ పేర్కొన్నారు. -
రోహింగ్యాల దారెటు?
-
‘పౌరసత్వం’పై కాంగ్రెస్ రెచ్చగొడుతోంది: అమిత్
గిరిధ్ బాఘ్మారా: పౌరసత్వ సవరణ చట్టం గురించి కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెప్పారు. శనివారం ఆయన జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాము తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం కాంగ్రెస్‌కు కడుపునొప్పి తెప్పించిందని, అందుకే ఆ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రజలను రెచ్చగొడుతోందని అన్నారు. రాహుల్ గాంధీ జార్ఖండ్‌ను ఇటాలియన్ కళ్లజోడుతో చూస్తున్నారని, అందుకే అభివృద్ధి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, అయితే వారికి మద్దతుగా ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చిన ఘనత ఎన్డీయేదేనని స్పష్టంచేశారు. డిసెంబర్ 16న జార్ఖండ్‌లో నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. -
2018లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్ షట్‌డౌన్
కశ్మీర్లో కల్లోలం.. ఇంటర్నెట్ కట్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తం.. సమాచారం షట్ డౌన్ సున్నిత అంశాలపై కీలక తీర్పు.. బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవ్ ఏ ఆందోళనకైనా, ఏ నిరసనకైనా అదే తంత్రం, అదే వ్యూహం న్యూఢిల్లీ/వాషింగ్టన్: పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అస్సాంలో అంతకంతకూ ఆందోళనలు అధికమవడంతో పది జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని 24 గంటల సేపు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పుడే కాదు 2018లో భారత్‌లో పలు సందర్భాల్లో 100 సార్లకుపైగా ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. భద్రతా కారణాల రీత్యా సమాచార సంబంధాలను నిలిపివేయడం ఇవాళ, రేపు చాలా దేశాల్లో జరుగుతోంది. ఆందోళనల్ని అణచివేయాలంటే ప్రజలకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకుండా చేయడమే మార్గమన్న ఉద్దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయి.భారత్‌తో పాటు చైనా, ఇరాన్, ఇథియోపియా దేశాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫ్రీడమ్ హౌస్ సర్వేలో ఈ అంశం వెల్లడైంది. ఇంటర్నెట్, డిజిటల్ మీడియా స్వేచ్ఛపై 65కు పైగా దేశాల్లో ఈ సంస్థ సమగ్ర అధ్యయనాన్నే నిర్వహించింది. ఎప్పుడెప్పుడు ఇంటర్నెట్ షట్డౌన్లు మన దేశంలో మొదటిసారిగా 2010లో గణతంత్ర దినోత్సవాలకు ముందు కశ్మీర్ లోయలో ఇంటర్నెట్, ఫోన్ సేవల్ని నిలిపివేశారు. ► 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బర్హన్ వనిని హతం చేసిన తర్వాత కశ్మీర్‌తో బయట ప్రపంచానికి 133 రోజుల పాటు సంబంధాలు తెగిపోయాయి. ► కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముందు రోజు ఆగస్టు 4 నుంచి కశ్మీర్లో ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిపివేశారు. ఇప్పుడు ఫోన్ సేవలు పునరుద్ధరించారు కానీ, 130 రోజులు గడుస్తున్నా ఇంటర్నెట్ ఇంకా వాడకంలోకి రాలేదు. ► 2016లో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లో ప్రత్యేక గూర్ఖాలాండ్ ఆందోళన సమయంలో 100 రోజులు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. ► 2015లో గుజరాత్లో విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తూ పటీదార్ ఉద్యమం సందర్భంలోనూ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ► గత నెలలో రామజన్మ భూమి తీర్పుకు ముందు ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర, రాజస్తాన్‌లో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ బంద్ అయింది. ఏ ఏడాది ఎన్నిసార్లు 2017 79 2018 134 2019 90 2012 నుంచి లెక్కల్ని చూసుకుంటే 360సార్లకు పైగా దేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. హోంశాఖకి అధికారాలు ప్రజల భద్రత కోసం ఇంటర్నెట్, టెలిఫోన్ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి, ఆంక్షలు విధించడానికి 2017లో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని కొన్ని నిబంధనల్ని చేర్చారు.. దీని ప్రకారం కేంద్ర హోంశాఖ, హోంశాఖ కార్యదర్శులకు తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసే అధికారం ఉంటుంది. అయితే అయిదు రోజుల తర్వాత పరిస్థితుల్ని తప్పనిసరిగా సమీక్షించాలి. ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు భారత్‌లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని చిన్నపాటి అనిశ్చితి పరిస్థితులకి కూడా ఇంటర్నెట్ సేవల వినియోగాన్ని నిలిపివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేరళ హైకోర్టు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అన్నది ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించింది. రోజుల తరబడి ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడం చట్టవ్యతిరేకమని సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సొసైటీ సభ్యుడు ప్రణేష్ ప్రకాశ్ అంటున్నారు. -
‘పౌరసత్వం’పై మంటలు
గువాహటి/కోల్‌కతా: సవరించిన పౌరసత్వ చట్టంపై అస్సాం, పశ్చిమబెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం బెంగాల్లో ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌కు, బస్సులకు నిప్పుపెట్టారు. అస్సాంలోని సోనిపట్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఆయిల్ ట్యాంకర్‌కు నిప్పుపెట్టడంతో అందులోని డ్రైవర్ మృతి చెందాడు. పౌరసత్వ చట్ట సవరణను రద్దు చేయాలంటూ ఈనెల 18వ తేదీన విధులు బహిష్కరించనున్నట్లు అస్సాం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. పౌరసత్వ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమంటూ దీనికి నిరసనగా ఈ నెల 21వ తేదీన బిహార్ బంద్ పాటించాలని ఆర్జేడీ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆందోళనల నేపథ్యంలో జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ఈనెల 16 నుంచి జనవరి 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. పలు పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇలా ఉండగా, అస్సాంలోని డిబ్రూగఢ్, గువాహటిలతోపాటు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో అధికారులు శనివారం కర్ఫ్యూను సడలించారు. వదంతులు వ్యాపించకుండా అస్సాంలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించారు. మంటల్లో రైల్వే స్టేషన్, బస్సులు బెంగాల్లో రెండో రోజూ ఉద్రిక్తతలు కొనసాగాయి. ముర్షీదాబాద్, ఉత్తర 24 పరగణాల జిల్లాలు, హౌరా గ్రామీణ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్‌కు, బస్సులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. హౌరా– ముంబై, ఢిల్లీ–కోల్‌కతా హైవేపై రెచ్చిపోయిన ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన 15 బస్సులకు నిప్పుపెట్టడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బగ్నాన్లో 20 దుకాణాలు లూటీకి గురయ్యాయి. వందలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు శనివారం మధ్యాహ్నం సంక్రాయిల్ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌కు నిప్పుపెట్టారు. పట్టాలపై బైఠాయించడంతో సెల్డా–హస్నాబాద్, షొండాలియా–కాక్రా మిర్జాపూర్, హౌరా–ఖరగ్‌పూర్ సెక్షన్లలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ పరిస్థితుల్లో ఈశాన్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. అస్సాంలో మరొకరు మృతి అస్సాంలో శనివారం వివిధ సంఘాలు, సంస్థల ఆందోళనల కారణంగా రైళ్ల రాకపోకలు, రవాణా వ్యవస్థ స్తంభించాయి. విద్యాసంస్థలు, కార్యాలయాలు పనిచేయలేదు. సోనిపట్ జిల్లా ధెకియాజులి వద్ద శుక్రవారం రాత్రి ఖాళీ ఆయిల్ ట్యాంకర్‌కు ప్రజలు నిప్పుపెట్టడంతో అందులోని ట్యాంకర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం ఉదయం అతడు ఆస్పత్రిలో కన్నుమూశాడని పోలీసులు తెలిపారు. గురువారం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో రాష్ట్రంలో ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. కామాఖ్య రైల్వే స్టేషన్‌కు దిగ్బంధించడంతో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి గువాహటి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజులపాటు సత్యాగ్రహం పాటించాలని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఆందోళనలకు మద్దతుగా ఈనెల 18వ తేదీన విధులు బహిష్కరించనున్నట్లు అస్సాం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఎస్ఏకేపీ) అధ్యక్షుడు వాసవ్ కలిటా వెల్లడించారు. 16వ తేదీ నుంచి జరిగే సత్యాగ్రహ నిరసనలకు కూడా ఆయన మద్దతు ప్రకటించారు. తమ పౌరులకు అమెరికా, బ్రిటన్ హెచ్చరిక వాషింగ్టన్/లండన్: ఇంటర్నెట్ సేవలపై నిషేధం.. రవాణా వ్యవస్థకు అంతరాయం.. కొనసాగుతున్న ఆందోళనలు.. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అమెరికా, బ్రిటన్‌తోపాటు కెనడా, సింగపూర్, ఇజ్రాయెల్ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఆందోళనలకు కేంద్ర బిందువుగా ఉన్న అస్సాంలో అధికార పర్యటనలను అమెరికా తాత్కాలికంగా రద్దు చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న తమ పౌరులకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం పలు సూచనలు చేసింది. ఆందోళనలు, అస్థిర పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు వెళ్లవద్దని, సాధ్యమైనంత వరకు జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో సంచరించవద్దని, చుట్టుపక్కల జరిగే పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లరాదని బ్రిటన్, కెనడా, ఇజ్రాయెల్ తమ దేశస్తులను హెచ్చరించాయి. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ ఆయన శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కాగా పౌరసత్వ సవరణ బిల్లు చర్చ సందర్భంగా అసదుద్దీన్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆ బిల్లు ప్రతులను కూడా ఆయన చింపివేశారు. లోక్‌సభలో పౌరసత్వ బిల్లు సందర్భంగా మాట్లాడిన ఒవైసీ.. ఈ బిల్లు ద్వారా దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అనంతరం సభలోనే బిల్లు పేపర్లు చింపివేసి.. ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. కాగా పౌరసత్వ సవరణ బిల్లు సోమవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. అలాగే ఈ బిల్లును బుధవారం రాజ్యసభ ఆమోదించింది. మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అస్సాం, త్రిపురల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అస్సాంలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ బిల్లును సవాల్ చేస్తూ ఇప్పటికే పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాతోపాటు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఆసు), పీస్ పార్టీ, కొన్ని ఎన్జీవోలు, న్యాయవాది ఎంఎల్ శర్మ, కొందరు న్యాయ విద్యార్థులు కూడా శుక్రవారం పిటిషన్లు దాఖలు చేశారు. చదవండి: రణరంగంగా జామియా వర్సిటీ -
‘తొలుత ఇక్కడే అమలు.. ఎవరూ ఆపలేరు’
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకోవడం ఎవరితరం కాదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బెంగాల్లోనే తొలుత ఈ చట్టం అమలు జరిగి తీరుందని వ్యాఖ్యానించారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనో అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ చట్టంపై నిరసన వ్యక్తం చేస్తున్న ఈశాన్య రాష్ట్రాల ఆందోళనకారులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో దిలీప్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడానికి గల కారణలేమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు గల్లంతవుతుందనే భయంతోనే ఆమె ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. ‘మమత ఇదివరకు ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దును కూడా వ్యతిరేకించారు. అయితే కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయడాన్ని ఆపలేకపోయారు. ఇప్పడు కూడా అంతే.. మమతా బెనర్జీ గానీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గానీ ఈ చట్టం అమలును అడ్డుకోలేరు. నిజానికి ఈ రాష్ట్రంలో తొలుత పౌరసత్వ సవరణ చట్టం అమలు జరుగుతుంది. అయినా మమతకు అక్రమవలసదారుల పట్ల ఉన్న ప్రేమ.. హిందూ శరణార్థుల పట్ల ఎందుకు లేదో అర్థంకావడం లేదు. అక్రమ వలసదారుల గురించే ఆమె బాధ పడుతున్నారు’ అని దిలీప్ ఘోష్ మమతను విమర్శించారు. ఇక మరో బీజేపీ నేత కైలాశ్ విజయ్‌వర్గియా సైతం మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఖండించారు. ఆమె వ్యాఖ్యలు ఈశాన్య రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. కాగా పార్లమెంటు ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. -
‘క్యాబ్’పై పీకే వ్యతిరేకతకు కారణం ఇదే !
పాట్నా : పౌరసత్వ సవరణ చట్టంపై జేడీయూ వైఖరితో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఆర్జేడీ బిల్లును వ్యతిరేకించగా, మొదట్లో వ్యతిరేకించినా అనంతర పరిణామాలతో అధికార జేడీయూ రెండు సభల్లోనూ బిల్లుకు మద్దతిచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ వైఖరిలో మార్పు పట్ల జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ నిర్ణయాన్ని బహింరంగంగా వ్యతిరేకించడం ప్రాధాన్యత సంతరించుకొంది. పార్టీ సమావేశంలో ముందుగా తీసుకున్న నిర్ణయానికి ఎందుకు వ్యతిరేకంగా వెళ్లారని పీకేతో పాటు రవివర్మ ప్రశ్నించగా, తాజాగా పార్టీ ఎంపీలు రాంచందర్ సింగ్ స్పందిస్తూ పార్టీలో నితీష్‌కుమార్ నిర్ణయమే ఫైనల్ అని నచ్చనివాళ్లు పార్టీని వదిలి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. మరో ఎంపీ రాజీవ్ రంజన్ అధినేత తీసుకున్న నిర్ణయాలను ధిక్కరించే అధికారం పార్టీలో ఎవరికీ లేదని పీకేనుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఈ పరిణామం పట్ల విశ్లేషకులు మరో భాష్యాన్ని చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ భార్య అస్సామీ. ఈ బిల్లు వల్ల ఆ రాష్ట్రం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీకే బిల్లును వ్యతిరేకిస్తున్నారని భావిస్తున్నారు. మరోవైపు నితీష్ కుమార్ బిల్లుకు మద్దతివ్వడంపై మరో కోణాన్ని తెలుపుతున్నారు. ఇటీవల బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ప్రతిపక్ష ఆర్జేడీకే పడ్డాయని, ఆర్జేడీ ముస్లింలకు ఎప్పుడు కూడా ప్రథమ ప్రాధాన్యంగా ఉంటుందని నితీష్ పసిగట్టారు. వచ్చే ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనునక్నాయి. ఈ నేపథ్యంలో పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తే అటు ముస్లింల ఓట్లు పడకపోగా, ఇటు బలమైన హిందూ ఓటు బ్యాంకు కూడా దూరమైపోతుందని నితీష్ గ్రహించారు. అందుకే యూటర్న్ తీసుకొని బిల్లుకు మద్దతిచ్చారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల్లో తమ పార్టీ దెబ్బతింటుందని నితీష్‌కు తెలుసు. అయినా కూడా బీహార్‌లో హిందూ ఓట్లను కోల్పోకూడదనే ఉద్దేశంతో మద్దతిచ్చారని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై జేడీయూ సీనియర్ నాయకుడు నీరజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘ముస్లింలకు ఎంతో చేసినప్పటికీ వారి నుంచి మాకు పడే ఓట్ల శాతంలో పెద్ద తేడాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంపై మాకు ఎవరి సలహా అక్కర్లేద’ని పీకేనుద్దేశించి వ్యాఖ్యానించారు. -
నచ్చని వాళ్లు ఉత్తర కొరియాకు వెళ్లిపోవచ్చు
షిల్లాంగ్ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ శుక్రవారం వివాదాస్పద ట్వీట్ చేశారు. అలాంటి వారు నార్త్ కొరియాకు వెళ్లిపోవచ్చని సూచించారు. పౌరసత్వ చట్టంపై నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ట్విటర్లో స్పందిస్తూ.. రెండు వాస్తవ విషయాలను వివాదాస్పదంగా ఎప్పుడూ చూడకూడదు. 1. దేశ విభజన మతం కారణంగా జరిగింది. 2. విభజిత ప్రజాస్వామ్యం ఈ దేశానికి అవసరం. ఈ రెండింటిపై ఎవరైనా విభేదిస్తే వారు నిరభ్యంతరంగా ఉత్తర కొరియాకు వెళ్లొచ్చు అని ట్వీట్ చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై ఆగ్రహించిన నిరసనకారులు రాజభవన్ను ముట్టడించడానికి ప్రయత్నించారు. భద్రతా బలగాలను దాటి లోపలికి ప్రవేశించాలని యత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు నిరసనకారులపై లాఠీచార్జ్ జరిపారు. అనంతరం టియర్ గ్యాస్‌ను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులతో పాటు ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. Two things should never be lost sight of in the present atmosphere of controversy. 1. The country was once divided in the name of religion. 2. A democracy is NECESSARILY DIVISIVE. If you don’t want it go to North Korea. — Tathagata Roy (@tathagata2) December 13, 2019 -
‘వాడు అమాయకుడు.. అమరుడయ్యాడు’
గువాహటి/అసోం: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న నిరసనల్లో సామ్ స్టాఫర్‌్డ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. సంగీతాన్ని ప్రాణంగా భావించే అతడు.. తూటాల దాహానికి బలయ్యాడు. పౌరసత్వ చట్టానికి నిరసనగా ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో సామ్ మరణం నిరసనకారుల ఆవేదనను రెట్టింపు చేసింది. ‘నీవు అమరుడివయ్యావు. నీకు వందనం. జై అసోం’ అంటూ అశ్రునయనాలతో అతడికి శాశ్వత వీడ్కోలు పలికారు. ఇక బాధితుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన అసోంలో శుక్రవారం చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. మేఘాలయకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సైతం ఆందోళనకారులకు మద్దతు తెలుపుతూ సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం అసోంలోని నామ్‌గఢ్ ప్రాంతంలో నిరసనకారులకు సంఘీభావం తెలిపేందుకు ఓ కన్సర్ట్ ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు మైదానంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సామ్.. ఈ విషయం తెలుసుకుని అక్కడికి పరిగెత్తాడు. ఈ క్రమంలో అక్కడ నిలిపి ఉన్న కారులో నుంచి గుర్తు తెలియని దుండగులు సామ్‌పై కాల్పులకు తెగబడి.. అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో స్థానికులు అతడిని ఆస్పత్రిలో చేర్పించగా.. అప్పటికే సామ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే నిరసనకారులు మాత్రం ఇది పోలీసుల పనే అని ఆరోపిస్తున్నారు. ఈ విషయం గురించి సామ్ అక్క మౌసుమీ బేగం మాట్లాడుతూ... ‘ నా తమ్ముడు అమాయకపు పిల్లాడు. నిజానికి వాడికి పౌరసత్వ సవరణ చట్టం గురించి పూర్తిగా తెలియదు. సంగీతం అంటే వాడికి ఆసక్తి. డ్రమ్మర్‌గా ఎదగాలనేది వాడి ఆశయం. అందుకే జుబిన్ వస్తున్నాడని తెలియగానే అక్కడికి పరిగెత్తాడు. గుర్తు తెలియని దుండగుల తూటాలకు బలయ్యాడు. ఇది మాకు జీవితకాలపు విషాదం. టూటూ(సామ్ ముద్దుపేరు)కి ఫోన్ చేయగానే డాక్టర్ ఫోన్ ఎత్తి.. సామ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పాడు. వెంటనే అక్కడికి పరిగెత్తుకువెళ్లాం. కానీ అప్పటికే వాడు చచ్చిపోయాడు’ అంటూ బోరున విలపించింది. ఇక సామ్ తల్లిదండ్రులు సైతం ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా సామ్ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున నిరసనకారులు, లాయర్లు, విద్యార్థి నాయకులు హాజరయ్యారు. సూర్యాస్తమయం తర్వాత అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ఇక ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు... లోతుగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. సామ్ మరణంతో అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో నామ్‌గఢ్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. -
రణరంగంగా జామియా వర్సిటీ
న్యూఢిల్లీ/గువాహటి/ఈటానగర్: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో శుక్రవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే, గత రెండు రోజులతో పోలిస్తే.. అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొంత తగ్గుముఖం పట్టాయి. కానీ ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం రణరంగంగా మారింది. పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో ఉన్న బెల్డాంగ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌ను ఆందోళనకారులు తగలబెట్టారు. అస్సాంలోని డిబ్రూగఢ్‌లో, మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ల్లో శుక్రవారం కొద్దిసేపు కర్ఫ్యూ సడలించారు. అస్సాంలో నిరసనలకు కేంద్రమైన గువాహటిలో శుక్రవారం హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. లాఠీచార్జ్.. టియర్ గ్యాస్ పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌కు ర్యాలీగా వెళ్లాలనుకున్న జామియా మిలియా వర్సిటీ విద్యార్థులను పోలీసులు వర్సిటీ గేటు వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల పైకి విద్యార్థులు రాళ్లు రువ్వడంతో, ప్రతిగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారని, రాళ్లు కూడా మొదట పోలీసులే రువ్వారని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులే బారికేడ్లను ధ్వంసం చేసి తమపైకి దూసుకువచ్చారని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యారు. దాదాపు 50 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ ప్రాంత ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్(ఆప్) ఘటనాస్థలికి వెళ్లి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రైల్వే స్టేషన్‌కు నిప్పు పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో ఉన్న బెల్డాంగ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌ను శుక్రవారం ఆందోళనకారులు తగలబెట్టారు. వేలాదిగా అక్కడికి వచ్చిన నిరసనకారులు రైల్వే కార్యాలయానికి, ఆర్పీఎఫ్ అవుట్‌పోస్ట్‌కు, ట్రాక్స్‌కు నిప్పంటించారు. అక్కడ రైల్వే పోలీసులపై తిరగబడ్డారు. బెల్డాంగ పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. రఘునాథ్గంజ్ పోలీస్ స్టేషన్‌లోని వాహనాలకు నిప్పంటించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ముస్లిం జనాభా ఎక్కువ. అలాగే, ముస్లిం జనాభా అధికంగా ఉన్న గ్రామీణ హౌరా, బిర్భుమ్, బుర్ద్వాన్ల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అరుణాచల్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పరీక్షలను బహిష్కరించి, వీ«ధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ఈటానగర్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ నుంచి రాజ్‌భవన్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ జరిపారు. 30 కి.మీల దూరం సాగిన ఈ ర్యాలీలో పాల్గొని, గవర్నర్ బీడీ మిశ్రాకు వినతిపత్రం ఇచ్చారు. గువాహటిలో ఏఏఎస్‌యూ ర్యాలీ అస్సాంలోని గువాహటిలో తాత్కాలికంగా కర్ఫ్యూను తొలగించారన్న సమాచారంతో నిత్యావసర సరుకుల కోసం ప్రజలు వేలాదిగా దుకాణాల ముందు బారులు తీరారు. నగరంలోని దాదాపు అన్ని చోట్ల భద్రతా బలగాలు మోహరించాయి. పలు చోట్ల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. నగరంలో శుక్రవారం ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నగరంలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించింది. అమిత్ షా పర్యటన రద్దు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో ఆది, సోమవారాల్లో హోంమంత్రి అమిత్ షా జరపనున్న పర్యటన రద్దయింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. జపాన్ ప్రధాని పర్యటన రద్దు జపాన్ ప్రధాని షింజో ఆబే భారత పర్యటన రద్దయింది. పౌరసత్వ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా గువాహటిలో ప్రధాని మోదీతో ఈనెల 15 నుంచి జరగాల్సిన భేటీ రద్దయినట్లు తెలిపింది. అల్ప సంఖ్యాకుల హక్కులకు రక్షించండి వాషింగ్టన్: పౌరసత్వ చట్ట సవరణ..తదనంతర పరిణామాలపై అమెరికా స్పందించింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి అల్పసంఖ్యాక మతాల వారి హక్కులకు రక్షణ కల్పించాలని భారత్‌ను కోరింది. పౌరసత్వ చట్టంపై సుప్రీంలో పిటిషన్లు పౌరసత్వ చట్ట సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాతోపాటు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఆసు), పీస్ పార్టీ, కొన్ని ఎన్జీవోలు, న్యాయవాది ఎంఎల్ శర్మ, కొందరు న్యాయ విద్యార్థులు కూడా శుక్రవారం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ చట్ట సవరణలపై తక్షణం విచారణ చేపట్టాలని మహువా మొయిత్రా తరఫు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. అయితే, ధర్మాసనం నిరాకరించింది. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు ఈ చట్టం ద్వారా భంగం కలుగుతోందని జైరాం రమేశ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
మేఘాలయలో ఇంటర్నెట్ సేవలు బంద్
షిల్లాంగ్: రాజ్యసభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. అస్సాం, త్రిపుర, మేఘాలయలో పెద్ద ఎత్తున చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. నిరసనల నేపథ్యంలో మేఘాలయలో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించింది. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం నుంచి 48 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంటర్నెట్ సేవలతో పాటు ఎస్ఎంఎస్, వాట్సప్, ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ సేవలను సైతం నిలిపివేశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారుతుండటంతో తూర్పు కాశీ హిల్స్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు గురువారం కర్ఫ్యూ విధించారు. అస్సాంలోని పది జిల్లాల్లో బుధవారం నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేయగా ప్రభుత్వం ఈ నిషేధాన్ని మరో 48 గంటల పాటు పొడిగించింది. గుహవటి, డిబ్రూగర్లో కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సుప్రీంకోర్టుకు పౌరసత్వ బిల్లు -
బీజేపీయేతర సీఎంలు వ్యతిరేకించాలి : పీకే
సాక్షి, ఢిల్లీ : పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన పౌరసత్వ సవరణ బిల్లు అమలుపై బీజేపీయేతర ముఖ్యమంత్రులు తమ వైఖరిని స్పష్టం చేయాలని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ శుక్రవారం వ్యాఖ్యానించారు. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇచ్చే ఈ బిల్లు వల్ల భారతదేశ ఆత్మ దెబ్బతింటుందని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. పంజాబ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఈ చట్టంతోపాటు ఎన్నార్సీని తమ రాష్ట్రంలో అమలుచేయబోమని ప్రకటించారని, మిగతా 16 రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రులు తమ వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ బిల్లుకు జేడీయూ పార్టీ లోక్‌సభలో మద్దతు తెలపడంపై పీకే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా జేడీయూ రాజ్యసభలోనూ ఈ బిల్లుకు మద్దతు తెలపడం గమనార్హం. మరోవైపు ఈ బిల్లును ఈశాన్య రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదిలా ఉండగా, దేశంలో ఉన్న శరణార్థులు ఈ బిల్లుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి : (మా పార్టీ వైఖరిపై నిరాశ చెందా : పీకే) -
సుప్రీంకోర్టుకు పౌరసత్వ బిల్లు
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును సవాలు చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పౌరసత్వ బిల్లు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటైన సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోందని ఆ పిటిషన్లో ఐయూఎంఎల్ ఆరోపించింది. మత ప్రాతిపదికన ఒక వర్గానికి చెందిన అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించే ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. తాజాగా, గురువారం రాత్రి ఈ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దాంతో ఈ బిల్లు పౌరసత్వ (సవరణ) చట్టంగా మారింది. ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఐయూఎంఎల్ తరఫున న్యాయవాది పల్లవి ప్రతాప్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తక్షణమే బిల్లుకు సంబంధించిన కార్యాచరణపై స్టే విధించాలని కోర్టును కోరారు. ఏ చట్టమైనా అక్రమ వలసదారులను ఉద్దేశించి రూపొందించాలంటే.. మతం, కులం, జాతీయత ఆధారంగా కాకుండా.. మొత్తం అక్రమ వలసదారులను ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించి చట్టాన్ని రూపొందించాలని పేర్కొన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనదే కాదు, అమానవీయమైనది కూడా అని అన్నారు. కాగా, ఈ బిల్లు సుప్రీంకోర్టు కొట్టివేయడం తథ్యమని కాంగ్రెస్ నాయకుడు మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో రభస పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ హింసను రాజేస్తోందని అధికార పక్షం వ్యాఖ్యానించడంతో గురువారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజ్వరిల్లుతున్న హింస అంశాన్ని జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌధురి లేవనెత్తారు. ఈ బిల్లు వల్ల మొత్తం ఈశాన్య ప్రాంతమంతా అట్టుడుకుతోందన్నారు. ‘ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఈశాన్యం మరో కశ్మీర్‌లా మారింది’ అన్నారు. వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ఈ రెండు ప్రాంతాల్లో సాధారణ స్థితి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పందిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే హింసను రాజేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జోషి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు. వారితో పాటు డీఎంకే సభ్యులు కూడా సభ నుంచి వెళ్లిపోయారు. -
ఆందోళన వద్దు సోదరా..
ధన్‌బాద్: పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్) పార్లమెంటు ఆమోదించడాన్ని నిరసిస్తూ అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు అంతకంతకూ ఉధృతంగా మారడంతో ప్రధాన మంత్రి మోదీ వారిని శాంతింప జేసే ప్రయత్నాలు చేశారు. కొత్త చట్టంపై ఎలాంటి ఆందోళన వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ధన్‌బాద్ ఎన్నికల ర్యాలీలో గురువారం ప్రసంగించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈశాన్య రాష్ట్ర ప్రజలకున్న ప్రత్యేక గుర్తింపుని, సంస్కృతిని, భాషని కాపాడతా మని హామీ ఇచ్చారు. క్యాబ్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈశాన్య ప్రాంతంలో అస్సాం సహా ప్రతీ రాష్ట్రంలో ఆదివాసీ సమాజ సంస్కృతీ సంప్రదాయాల్ని, వారి జీవన విధానాన్ని పరిరక్షిస్తామన్నారు. అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కిందకు వచ్చే ఆదివాసీ ప్రాంతాలను కొత్త చట్టం నుంచి మినహాయించినట్టు మోదీ చెప్పారు. అంతకు ముందు ప్రధాని ఇంగ్లీషు, అస్సామీ భాషల్లో వరస ట్వీట్లు చేస్తూ స్థానిక హక్కులు కాపాడే నిబంధన 6 స్ఫూర్తికి భంగం కలిగించబోమన్నారు. -
అట్టుడుకుతున్న అస్సాం
న్యూఢిల్లీ/గువాహటి: పార్లమెంట్ తాజాగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువాహటిలో యుద్ధ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూను సైతం లెక్కచేయకుండా రోడ్ల దిగ్బంధం, గృహ దహనాలు, దుకాణాల లూటీకి పాల్పడుతుండటంతో పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు చెబుతుండగా ముగ్గురు మరణించారని ఆందోళనకారులు అంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం విద్యా, వాణిజ్య సంస్థలు పని చేయలేదు. రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికారులు ముందు జాగ్రత్తగా త్రిపుర, అసోంలకు రైలు సర్వీసులను రద్దు చేశారు. విమాన సర్వీసులను సైతం పలు ప్రాంతాలకు రద్దు చేశారు. సైనికులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఇంటర్నెట్ సేవలపై మరో 48 గంటలపాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అస్సాం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా పలు హామీలిచ్చారు. ఇంటర్నెట్పై నిషేధం ఉండగా ట్విట్టర్లో హామీల విషయం ప్రజలకెలా తెలుస్తుందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గువాహటి యుద్ధరంగం రాష్ట్ర రాజధాని గువాహటిలోనే ఆందోళనల ప్రభావం ఎక్కువగా ఉంది. నగరంలో ఆందోళనకారులు భవనాలు, దుకాణాలకు నిప్పు పెట్టడం, ధ్వంసం చేయడం, రోడ్లపై టైర్లు కాల్చడం, అడ్డంకులు కల్పించడం, పోలీసులతో ఘర్షణలకు దిగారు. దీంతో పలుచోట్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని అధికారులు అంటున్నారు. అయితే, ముగ్గురు మృతి చెందారని ఆందోళన కారులు అంటున్నారు. గువాహటిలో పర్యటిస్తున్న అస్సాం పోలీస్ చీఫ్ భాస్కర్ జ్యోతి మహంత కాన్వాయ్‌పై కొందరు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదు. పోలీసు ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆసు(ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్) పిలుపు మేరకు గువాహటిలోని లతాశిల్ మైదానంలో సినీ, సంగీత పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా వందలాదిగా ప్రజలు, విద్యార్థులు హాజర య్యారు. ఆందోళనకారులు దిగ్బంధించడంతో వేలాది మంది ప్రయాణికులు గువాహటి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. రహదారుల దిగ్బంధం కారణంగా దిబ్రూగఢ్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. డిబ్రూగఢ్‌లో ముఖ్యమంత్రి సోనోవాల్, ఎమ్మెల్యే బినోద్ హజారికా నివాసాలకు, వాహనా లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పోలీసు సర్కిల్ అధికారి కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. కామ్రూప్ జిల్లాలో దుకాణాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. 31వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. జోర్హాత్ జిల్లాలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. 39వ నంబర్ జాతీయరహదారిపై బైఠాయించిన వారిని చెదరగొట్టేందుకు గోలా ఘాట్ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. రంగియాలో కూడా పోలీసు కాల్పులు జరిగాయి. విమాన సర్వీసుల రద్దు అస్సాంలో శాంతిభద్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు ఇండిగో, విస్తారా, ఎయిరిండియా, స్పైస్‌జెట్ ప్రకటించగా గో ఎయిర్, ఎయిర్ ఏషియా ఇండియా షెడ్యూల్‌ను మార్చుతున్నట్లు తెలిపాయి. ప్రభుత్వ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. జాతీయతను, దేశ సమగ్రతను దెబ్బతీసేవి, హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయవద్దని శాటిలైట్ టీవీ చానెళ్లను కేంద్రం కోరింది. ఇంటర్నెట్పై నిషేధం కొనసాగింపు సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపించకుండా ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులపై మరో 48 గంటలపాటు నిషేధం పొడిగించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యల్లో భాగంగా ప్రభుత్వం గువాహటి పోలీస్ అదనపు కమిషనర్ దీపక్ కుమార్‌ను తొలగించి మున్నాప్రసాద్ గుప్తాను నియమించింది. అదేవిధంగా, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) ముకేశ్ అగర్వాల్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో జీపీ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. త్రిపుర,అస్సాంలకు రైళ్లు బంద్ ఆందోళనల దృష్ట్యా అస్సాం, త్రిపుర వైపు వెళ్లే రైళ్లను రద్దు చేయడమో లేక కుదించడమో చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఆందోళనల కారణంగా ప్రయాణికులు పలు ప్రాంతాల్లో చిక్కుకు పోయారని తెలిపింది. 12 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను తరలిస్తున్నట్లు వెల్లడించింది. -
పౌరసత్వ బిల్లుపై నిరసన.. ముగ్గురు మృతి
గువాహటి : పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, త్రిపుర, మేఘాలయా రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గువాహటిలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గురువారం సాయంత్రం రోడ్లపైకి చేరుకున్న నిరసనకారులపై భద్రత బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పులో గాయపడ్డ ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఘర్షణల్లో గాయపడ్డ మరికొందరికి గువాహటి మెడికల్ కాలేజ్‌లో చికిత్స అందిస్తున్నారు. అస్సాం వ్యాప్తంగా పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి, అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ నివాసాలపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. బుధవారం సాయంత్రం నుంచి అస్సాంలోని 10 జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. గువాహటిలో కర్ఫ్యూ విధించారు. అస్సాంలో ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆందోళనలను అదుపు చేయడానికి ఈశాన్య రాష్ట్రాలలో ఆర్మీని మోహరించారు. మేఘాలయాలో కూడా 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్టు హోంశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పర్యటనలు రద్దు చేసుకున్న బంగ్లా మంత్రులు పౌరసత్వ బిల్లుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జాన్ ఖాన్ తన షిల్లాంగ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అంతకుముందు బంగ్లా విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ కూడా ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు తెలిపారు. భారత్ పౌరసత్వ సవరణ బిల్లును తీసుకురావడంపై మోమెన్ విమర్శలు గుప్పించారు. -
ప్రైవేటు టీవీ చానళ్లకు కేంద్రం వార్నింగ్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందండంతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రైవేటు శాటిలైట్ టీవీ చానళ్లకు కీలక సూచనలు చేసింది. హింసను ప్రేరేపించేలా, దేశ వ్యతిరేక వైఖరిని ప్రోత్సహించేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్న దృశ్యాలను ప్రసారం చేయవద్దని హెచ్చరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఘర్షణల దృశ్యాలను కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో సమాచార, ప్రసార శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అంశాలను ప్రసారం చేయరాదని స్పష్టం చేసింది. హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయకుండా అన్ని చానళ్లు అప్రమత్తతో ఉండాలని, దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని మంత్రిత్వ శాఖ కోరింది. గతంలో కూడా పలుమార్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ టీవీ చానళ్లపై అంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
‘కేంద్రం మతాల మధ్య చిచ్చు పెడుతోంది’
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మత విభజన ద్వారా ఓట్లు పొందేందుకు కేంద్రం ఆరాటపడుతోందని విమర్శించారు. గురువారం భారత కమ్యూనిస్టు నేత నీలం రాజశేఖర్ రెడ్డి 25వ వర్ధంతి కార్యక్రమాల్లో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ బిల్లు ఆమోదంతో మైనార్టీలు అభద్రతా భావంలోకి వెళ్లిపోయారన్నారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మతాల మధ్య కేంద్రం చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశం ఆర్థిక మాంద్యంతో అల్లాడుతుంటే పార్లమెంట్లో కనీస చర్చ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్యం విషయంలో బీజేపీ అనుకరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి 7వ తేదీ వరకు నిరసనలు చేపడుతామని రామకృష్ణ స్పష్టం చేశారు. -
ప్రముఖ మహిళా ఎడిటర్ సంచలన నిర్ణయం
ముంబై: బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు -2019 ను నిరసిస్తూ ప్రముఖ ఉర్దూ జర్నలిస్టు, రచయిత షిరీన్ దాల్వి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అమానవీయ చట్టానికి నిరసనగా తనకు ప్రదానం చేసిన సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ బిల్లును పాస్ చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని, సెక్యులరిజానికి విరుద్ధమని విమర్శించారు. ఈ పరిణామం తనను తీవ్రమైన విచారానికి, షాక్‌కు గురించేసిందని షిరీన్ వ్యాఖ్యానించారు. ''అవధ్‌నామా'’ ఉర్దూ పత్రిక ముంబై ఎడిషన్ ఎడిటర్‌గా పనిచేసిన ఆమెకు సాహిత్య రంగంలో చేసిన విశేష సేవకు గాను 2011లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అయితే చార్లీ హెబ్డో కార్టూన్‌ను తిరిగి ముద్రించిన వివాదంలో ఎడిటర్ పదవి నుంచి తప్పుకున్న ఆమె ఉర్దూన్యూస్ ఎక్స్‌ప్రెస్. కామ్ అనే న్యూస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. మరోవైపు మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అబ్దుర్ రహమాన్ ముంబై (రాష్ట్ర మానవ హక్కుల కమిషన్) తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఆయన నిరాశ చెందారు. పౌరుల హక్కులకు విఘాతంగా కలిగిస్తుందంటూ బిల్లును ఖండించిన ఆయన తన సర్వీసులకు గుడ్ బై చెబుతున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాగా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించుకన్న నరేంద్ర మోదీ సర్కార్, బుధవారం రాజ్యసభ ఆమోదాన్ని కూడా సాధించింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన 14 సవరణలు వీగిపోయాయి. సుదీర్ఘ వాదనలు, వాకౌట్లు తరువాత రాజ్యసభ బుధవారం నాడు ఈ బిల్లుకు ఆమోదించింది. దీంతో ప్రజాస్వామ్యానికి ఇది దుర్దినమని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ పరిణామంతో ఈశాన్య రాష్ట్రాలు నిరసనలు, అల్లర్లతో అట్డుడుకుతున్నాయి. ముఖ్యంగా అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు కేంద్రం సైన్యాన్ని రంగంలోకి దించింది. గువహటి, డిబ్రూగర్ ప్రాంతాల్లో ఇప్పటికే కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంటర్నెట్ సేవలతోపాటు పలు రైళ్ల, విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. -
అందుకే నేను రాజీనామా చేస్తున్నా!
ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ ఓ ఐపీఎస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ఈ బిల్లు విరద్ధమంటూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అబ్దుర్ రహమాన్ ప్రస్తుతం ముంబై(రాష్ట్ర మానవ హక్కుల కమిషన్)లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఆయన నిరాశ చెందారు. ఈ మేరకు... ‘రాజ్యాంగ ప్రాథమిక లక్షణానికి పౌరసత్వ సవరణ బిల్లు 2019 పూర్తి వ్యతిరేకంగా ఉంది. పౌరుల హక్కులకు విఘాతంగా కలిగించేదిగా ఉన్న ఈ బిల్లును నేను ఖండిస్తున్నా. నా సర్వీసును వదిలేస్తున్నా. రేపటి నుంచి విధులకు హాజరుకాను’ అంటూ ట్విటర్లో తన రాజీనామా లేఖను పోస్ట్ చేశారు. భారత లౌకికవాద భావనకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలని విఙ్ఞప్తి చేశారు. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన వివాదాస్పద పౌరసత్వ (సవరణ) బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పెద్దల సభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఇక ఈ బిల్లును లోక్‌సభ సోమవారమే ఆమోదించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్శీ, జైన్, బౌద్ధ, సిక్కు మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముస్లింల హక్కులకు విఘాతం కల్పించేదిగా ఉందంటూ విమర్శిస్తున్నాయి. ఇక ఈ బిల్లుపై నిరసనలతో ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. This Bill is against the religious pluralism of India. I request all justice loving people to oppose the bill in a democratic manner. It runs against the very basic feature of the Constitution. @ndtvindia@IndianExpress #CitizenshipAmendmentBill2019 pic.twitter.com/1ljyxp585B — Abdur Rahman (@AbdurRahman_IPS) December 11, 2019 -
ముస్లింలకు వ్యతిరేకం కాదు
-
అట్టుడుకుతున్న ఈశాన్యం
గువాహటి: పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. అస్సాం, త్రిపురల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అస్సాంలో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పౌర నిరసనలకు కేంద్రంగా మారిన అస్సాం రాజధాని గువాహటిలో బుధవారం నిరవధిక కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూని ధిక్కరిస్తూ నిరసనకారులు వీధుల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. గువాహటి, దిస్పూర్, డిబ్రూగఢ్, జోర్హాత్, త్రిపుర రాజధాని అగర్తల తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో విద్యార్థులు, నిరసనకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అస్సాం రాజధాని దిస్పూర్లో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సెక్రటేరియట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు దిస్పూర్లో ఆదివారం భేటీ కానున్న వేదికను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆందోళనల కారణంగా తేజ్‌పూర్ నుంచి వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కొద్దిసేపు గువాహటి విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. పలు రైళ్లను రద్దు చేశారు. త్రిపుర, అస్సాంలలో ఆర్మీని మోహరించారు. అస్సాంలోని 10 జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచి ఇంటర్నెట్ను నిలిపేశారు. త్రిపురలో మంగళవారం నుంచే ఇంటర్నెట్తో పాటు ఎస్ఎంఎస్ సదుపాయాన్ని కూడా నిలిపేశారు. ఆందోళన ఎందుకు? ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి భారీ సంఖ్యలో హిందువులు కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు వారందరికీ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పౌరసత్వం వస్తుంది. ఇది ఆ ప్రాంతంలోని జనాభా స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ బిల్లు ముస్లిం శరణార్థులకు వర్తించదు. ఇప్పటికే అస్సాం పౌర రిజిస్టర్ ద్వారా ఎందరో దేశ పౌరసత్వాన్ని కోల్పోయారు. దశాబ్దాల తరబడి ఇక్కడ ఉంటున్న మైనారిటీల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన కొందరిలో నెలకొంది. -
పౌరసత్వ బిల్లుకు పార్లమెంట్ ఓకే
న్యూఢిల్లీ: మరో వివాదాస్పద బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం, ఆ స్థాయిలో విమర్శలు, నిరసనలు ఎదుర్కొన్న పౌరసత్వ (సవరణ) బిల్లు బుధవారం రాజ్యసభ అడ్డంకిని విజయవంతంగా అధిగమించింది. సభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 125, వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, పార్శీ, జైన్, బౌద్ధ, సిఖ్ మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై రాజ్యసభలో దాదాపు ఆరున్నర గంటల పాటు వాడి వేడి చర్చ జరిగింది. ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని విపక్షాలు తూర్పారబట్టాయి. బిల్లును ప్రవేశపెడ్తూ, ఆ తరువాత చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్ షా బిల్లుపై నెలకొన్న భయాందోళనలను, అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఈ బిల్లు గురించి భారతీయ ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, వారు భారతీయ పౌరులుగా కొనసాగుతారని, ఈ బిల్లుతో వారికి ఏ సంబంధమూ లేదని వివరణ ఇచ్చారు. సునాయాసంగానే: రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేని పరిస్థితుల్లో.. ఈ బిల్లు ఆమోదం పొందడంపై కొంత ఉత్కంఠ నెలకొంది. మిత్రపక్షాలు జేడీయూ, శిరోమణి అకాలీదళ్‌తో పాటు అన్నాడీఎంకే, బీజేడీ, వైఎస్సార్సీపీ, టీడీపీ బిల్లుకు మద్దతివ్వడంతో మెజారిటీ ఓట్లు సాధించింది. అంతకుముందు, బిల్లును సమగ్ర అధ్యయనం కోసం సెలెక్ట్ కమిటీకి పంపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై ఓటింగ్ జరగ్గా, ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 124 ఓట్లు, అనుకూలంగా 99 ఓట్లు వచ్చాయి. విపక్ష సభ్యులు ప్రతిపాదించిన పలు ఇతర సవరణలను సభ మూజువాణి ఓటుతో తిరస్కరించింది. ఓటింగ్‌కు కొద్దిసేపు ముందు, శివసేనకు చెందిన ముగ్గురు సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. ఎస్పీ, ఎన్సీపీలకు చెందిన ఇద్దరు చొప్పున ఎంపీలు, ఒక టీఎంసీ సభ్యుడు గైర్హాజరయ్యారు. ఉభయసభల ఆమోదం అనంతరం, బిల్లును రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాత అది చట్టరూపం దాలుస్తుంది. ముస్లింలకు వ్యతిరేకం కాదు: బిల్లులో ముస్లింలను మినహాయించడంపై పలువురు సభ్యులు విమర్శలు చేశారు. దానిపై స్పందిస్తూ.. ఇతర దేశాల నుంచి వచ్చి భారత పౌరసత్వం పొందాలనుకునే ముస్లింలు ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకునే అవకాశముందని షా చెప్పారు. 566 మంది ముస్లింలు అలా పౌరసత్వం పొందారన్నారు. పాక్, బంగ్లా, అఫ్గాన్‌ల్లో మత వివక్షను ఎదుర్కొన్న మైనారిటీలకు భారతీయ పౌరసత్వం కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం కాబట్టి, ఆ దేశాల్లో మెజారిటీలైన ముస్లింలను బిల్లులో చేర్చలేదని వివరణ ఇచ్చారు. శ్రీలంక నుంచి వచ్చిన తమిళులకు పౌరసత్వం కల్పించడం గతంలో జరిగిందని, ఈ బిల్లు ప్రత్యేక సమస్య పరిష్కారం కోసం రూపొందించిందని వివరించారు. ఆర్టికల్ 14కి ఉల్లంఘన కాదు కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ నాయకుల్లా మాట్లాడుతున్నారని అమిత్ షా విమర్శించారు. ‘ఈ బిల్లు కానీ, గతంలో సభ ఆమోదం పొందిన ట్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370 రద్దు బిల్లులు కానీ.. ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈ బిల్లు పౌరసత్వం కల్పించేదే కానీ.. పౌరసత్వాన్ని లాక్కొనేది కాదు. ఈ విషయంలో ముస్లింలు ఎలాంటి భయాందోళలకు గురి కావాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ‘1947లో మత ప్రాతిపదికన దేశ విభజన జరిగింది. ఆ తప్పును సరిదిద్దేందుకే ఈ బిల్లును తీసుకురావాల్సి వచ్చింది’ అన్నారు. కాంగ్రెస్ ఈ విషయంలో రెండు నాలుకలతో మాట్లాడుతోందన్నారు. ‘గతంలో ఇదే కాంగ్రెస్ తమ పాలనలో వేరే ఇతర మతాల గురించి పట్టించుకోకుండా పాకిస్తాన్ నుంచి వచ్చిన 13 వేల హిందువులు, సిక్కులకు పౌరసత్వం ఇచ్చింది’ అని విమర్శించారు. సమానత్వ హక్కును ప్రసాదించే రాజ్యాంగ అధికరణ 14కి కూడా ఈ బిల్లు ఉల్లంఘన కాదని అమిత్ షా స్పష్టం చేశారు. సహేతుక కారణాలతో పార్లమెంట్ చట్టాలు చేయడాన్ని ఆర్టికల్ 14 నిరోధించదన్నారు. మా మేనిఫెస్టోలోనే చెప్పాం అంతకుముందు, బిల్లును సభలో ప్రవేశపెడ్తూ అమిత్ షా.. ఈ బిల్లు విషయంలో భారతీయ ముస్లింలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వారు భారతీయులుగానే కొనసాగుతారన్నారు. అనవసరంగా ముస్లింలకు తప్పుడు సమాచారం పంపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. పౌరసత్వ బిల్లు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోలోనే ఉందని, దానికి అనుకూలంగానే బీజేపీకి ప్రజలు ఘనవిజయం అందించారన్నారు. ఓటుబ్యాంక్ రాజకీయాలకు పాల్పడలేదని, ఎన్నికలకు ముందే ఈ విషయమై హామీ ఇచ్చామని తెలిపారు. ఈ బిల్లు కేవలం మూడు పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వివక్షకు, వేధింపులకు గురైన హిందూ, పార్శీ, జైన్, సిఖ్, క్రిస్టియన్, బౌద్ధ మతస్తులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించినదేనని వివరించారు. పొరుగుదేశాల్లో దారుణమైన వివక్ష ఎదుర్కొని, భారత్‌కు వచ్చిన ఆ ఆరు మతాలకు చెందిన లక్షలాది శరణార్ధులకు భారత్‌లో విద్య, ఉద్యోగం, జీవనోపాధి కల్పించే సదుద్దేశంలో ఈ చరిత్రాత్మక బిల్లును తీసుకువచ్చామన్నారు. వారు భారత్‌లో ఏర్పాటు చేసుకున్న దుకాణాలను రెగ్యులరైజ్ చేసే ప్రతిపాదన బిల్లులో ఉందన్నారు. ‘పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వ కల్పించాలని కోరుకుంటున్నారా? ఇది ఎలా సాధ్యం?’ అని విపక్షాలను ప్రశ్నించారు. ప్రసారాల నిలిపివేత విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు ఈ బిల్లును సమగ్రంగా అధ్యయనం చేసేందుకు సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విపక్ష సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో కొద్దిసేపు సభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. చరిత్రలో మైలురాయి: మోదీ పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే, మైలురాయి లాంటిరోజని అభివర్ణించారు. బిల్లుకు అనుకూలంగా ఓటేసిన సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కాగా, బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన ఈ రోజు భారత రాజ్యాంగ చరిత్రలో చీకటి రోజని బుధవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అభివర్ణించారు. ఇది విభజన శక్తుల, సంకుచిత మనస్తత్వం ఉన్నవారి విజయం అన్నారు. మరోవైపు, ఈ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సంకేతాలిచ్చారు. పార్టీ తరఫున కోర్టుకెళ్తామని సీనియర్ నేత కపిల్ సిబల్ వెల్లడించారు. బిల్లు రాజ్యాంగబద్ధతపై పలు అనుమానాలున్నాయని, అందువల్ల కోర్టులో సవాలు చేసే అవకాశముందని అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. కోర్టు కొట్టివేస్తుంది ఈ బిల్లును కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు తీవ్రంగా నిరసించాయి. మత ప్రాతిపదికన రూపొందిన ఈ బిల్లు న్యాయ సమీక్షకు నిలవబోదని హెచ్చరించాయి. ‘ఈ బిల్లు భారత రాజ్యాంగ మౌలిక భావనలకు వ్యతిరేకం. ఇది వివక్షాపూరితంగా, విబేధాలు సృష్టించేలా ఉంది’ అని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ విమర్శించారు. ‘హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లేందుకే ఈ బిల్లును తీసుకువచ్చారు. అదృష్టవశాత్తూ మీరు రాజ్యాంగ సవరణ చేయడం లేదు. చట్టాన్ని చేస్తున్నారంతే. ఇది న్యాయసమీక్షకు నిలవబోదు అనే విషయం నాకు స్పష్టంగా తెలుసు. దీన్ని కోర్టు కచ్చితంగా కొట్టేస్తుంది’ అని కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు పి.చిదంబరం పేర్కొన్నారు. ఈ బిల్లు బీజేపీ హిందూత్వ ఎజెండాలో భాగంగా, నాజీ కాఫీ బుక్ నుంచి స్ఫూర్తి పొందినట్లుగా ఉందని టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ వ్యాఖ్యానించారు. బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల కాగడాల ప్రదర్శన -
పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 117 మంది సభ్యులు, వ్యతిరేకంగా 92 మంది సభ్యులు ఓటు వేశారు. ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఉభయ సభలు ఆమోదం తెలుపడంతో పౌరసత్వ సవరణ బిల్లు చట్ట రూపం దాల్చనుంది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ చట్టం అమలులోకి రానుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన హిందూ, సిక్కు, బుద్ద, జైన్, పార్శీ, క్రైస్తవ మతాలకు చెందిన శరణార్థులకు భారత పౌరసత్వం లభించనుంది. అంతకుముందు ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలా వద్దా అన్నదానిపై రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించారు. సెలెక్ట్ కమిటీకి పంపాలని 99 మంది, పంపొద్దని 124 మంది సభ్యులు ఓటు వేశారు. దీంతో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిన అవసరం లేదని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అనంతరం బిల్లుపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు కూడా వీగిపోయాయి. అయితే లోక్‌సభలో పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలిపిన శివసేన.. రాజ్యసభలో మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఓటింగ్ జరుగుతన్న సమయంలో శివసేన సభ్యులు సభలో నుంచి వాకౌట్ చేశారు. -
ఓ సారి ఆలోచించండి : ప్రశాంత్ కిషోర్
పట్నా : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ నాయకులు ప్రశాంత్ కిషోర్ పౌరసత్వ సవరణ బిల్లుపై తన అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తీకరించారు. పౌరసత్వ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరనుండగా.. ఆయన తన పార్టీ నేతలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లుకు మద్దతిచ్చే అంశంపై ఓ సారి ఆలోచించాలని కోరారు. 2015 ఎన్నికల సమయంలో జేడీయూ గెలుపుకు కృషి చేసిన వారి గురించి ఆలోచించాలంటూ ఆయన ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ప్రశాంత్ కిషోర్‌తో పాటు మరికొందరు జేడీయూ నేతలు కూడా పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలుపడంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ పునరాలోచన చేయాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే లోక్‌సభలో పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలిపిన జేడీయూ.. రాజ్యసభలో కూడా అదే వైఖరితో ముందుకు సాగాలని పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల క్రితం కూడా ఈ బిల్లుపై ట్విటర్ వేదికగా స్పందించిన ప్రశాంత్ కిషోర్.. మతం ఆధారంగా పౌరసత్వ హక్కును కల్పించే బిల్లుకు జేడీయూ లోక్‌సభలో మద్దతు తెలుపడం నిరాశకు గురిచేసిందన్నారు. -
50 ఏళ్ల క్రితమే ఈ బిల్లు తీసుకురావాలి
-
పౌరసత్వ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
-
పౌరసత్వ బిల్లుపై శివసేన యూటర్న్
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతిచ్చే అంశంపై శివసేన యూటర్న్ తీసుకుంది. లోక్‌సభలో పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలిపిన శివసేన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన వైఖరి మార్చుకుంది. పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలుపని వారిపై దేశద్రోహులనే ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. తమ జాతీయవాదానికి, హిందూత్వ వాదానికి ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సామర్థ్యాలపై తమకు నమ్మకం ఉందని చెప్పిన రౌత్.. కానీ ఈ బిల్లు పాస్ అయ్యాక.. చొరబాటుదారులను నియంత్రిస్తుందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ శరణార్థులను అంగీకరిస్తే.. వారికి ఓటు హక్కు కల్పిస్తారా అని ప్రశ్నించారు. కాగా, శివసేన లోక్‌సభలో పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలుపడంపై కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలోనే.. ఆ పార్టీ తన వైఖరిని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. అంతకుముందు కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ తోరట్ మాట్లాడుతూ.. శివసేన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో శివసేన భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీలతో కుదిరిన ఒప్పందాన్ని పాటించాలని తెలిపారు. బుధవారం ఉదయం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. సంఖ్య బలం విషయంలో లోక్‌సభతో పోల్చితే రాజ్యసభలో పరిస్థితి వేరుగా ఉందని తెలిపారు. ప్రభుత్వం తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు మంచివి కావని హితవు పలికారు. మరోసారి హిందూ, ముస్లింలను విభజించే ప్రయత్నం జరుగుతుందన్నారు. తమపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి లేదని రౌత్ చెప్పారు. తమ మనసులో ఉన్న మాటలనే బయటకు చెపుతున్నామని అన్నారు. ఓటింగ్‌కు దూరంగా శివసేన! పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరిగితే శివసేన అందులో పాల్గొనే అవకాశం లేదని ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం. శివసేన ఓటింగ్‌కు దూరంగా ఉంటే పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పౌరసత్వ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. లోక్‌సభ ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొన్న వైఎస్సార్సీసీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తమ పార్టీ తరఫున పౌరసత్వ బిల్లుకు మద్దతిస్తున్నట్టు వెల్లడించారు. అయితే అన్ని మతాలను సమానమైన ఆదరణతో చూడాలన్నది తమ పార్టీ అభిమతం అని చెప్పారు. ఇంకా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతమైన రాష్ట్రానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలిపారు. హింస, దౌర్జన్యం, అత్యాచారాలకు గురవుతూ ప్రశాంత జీవనానికి నోచుకోని బాధితులు, శరణార్థులకు భారతీయ పౌరసత్వం కల్పించాలన్నదే తమ పార్టీ సిద్ధాంతం అని అన్నారు. అంతవరకు ఈ బిల్లులోని స్పూర్తిని తాము ఆహ్వానిస్తున్నామని అన్నారు. దురుద్దేశపూర్వకంగా వలసను ప్రోత్సహించి జాతీయ భద్రతకు ముప్పు కలిగించడాన్ని ఎంత మాత్రం తాము అంగీకరించబోమని ఆయన తెలిపారు. -
పాకిస్తాన్ లాగే మాట్లాడుతున్నారు..
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుపై కొన్ని రాజకీయ పార్టీలు పాకిస్తాన్ రాగాన్నే ఆలపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ బిల్లును వ్యతిరేకించడం సరికాదని హితవు పలికారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. అయితే ఈ బిల్లు వల్ల లౌకిక రాజ్య భావనకు భంగం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించేదిగా ఉందంటూ మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆందోళనల మధ్య పౌరసత్వ సవరణ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతూ... ‘ పౌరసత్వ బిల్లు ద్వారా విదేశాల్లో శరణార్థులుగా ఉన్న ఎంతో మందికి ఊరట లభిస్తుంది. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ బిల్లు. అయితే కొన్ని పార్టీలు మాత్రం ఈ బిల్లుపై పాకిస్తాన్ తీరునే అనుసరిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఇక లోక్‌సభలో భారీ మెజారిటీ ఉన్న బీజేపీకి రాజ్యసభలో సంఖ్యా బలం తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో బిల్లు ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. కాగా పౌరసత్వ సవరణ బిల్లుపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడిన విషయం తెలిసిందే. ఈ బిల్లుతో భారత్ అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లుతో పాకిస్తాన్‌తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి భారత్ తూట్లు పొడిచిందని విమర్శించారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో సైతం ఈ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. -
నేడు రాజ్యసభ ముందుకు పౌరసత్వ బిల్లు
-
నేడు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు
న్యూఢిల్లీ: సుదీర్ఘమైన చర్చలు, తీవ్ర నిరసనలు, వాదోపవాదాలు, సవరణలకు డిమాండ్ల మధ్య పౌరసత్వ సవరణ బిల్లుకి 311–80 ఓట్ల తేడాతో లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది కానీ, పెద్దల సభలో ఏం జరుగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. పొరుగు దేశాల్లో ఉన్న ముస్లిమేతరులకు భారత్ పౌరసత్వాన్నిచ్చే పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ) బుధవారం ఎగువ సభలో ప్రవేశపెడుతున్నట్టు రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి. ఈ బిల్లుపై చర్చకు 6 గంటలు కేటాయించినట్టు తెలుస్తోంది. బిల్లుపై సందేహాలు తీర్చాలి: ఉద్ధవ్ ఠాక్రే హిందూత్వ పార్టీ శివసేన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లోక్‌సభలో బిల్లుకి మద్దతు తెలిపినప్పటికీ మంగళవారం యూ టర్న్ తీసుకుంది. బిల్లుపై నెలకొన్న సందేహాలను తీర్చనట్లయితే రాజ్యసభలో మద్దతివ్వబోమని పార్టీ అ«ధినేత ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీ తమకు మద్దతు పలికేవారిని దేశభక్తులని, వ్యతిరేకించే వారందరినీ దేశద్రోహులని ముద్ర వేస్తోందని ధ్వజమెత్తారు. ఠాక్రే వ్యాఖ్యల్ని స్వాగతించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పౌరసత్వ సవరణ బిల్లు పాసయితే రాజ్యాంగంపైన దాడి జరిగినట్లేనని వ్యాఖ్యానించారు. మరోవైపు జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాల్లోని ముస్లింలలో తీవ్ర అభద్రత నెలకొంటుందని జేడీ(యూ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఈ బిల్లుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముస్లింల పట్ల ఈ బిల్లు వివక్ష చూపుతోందన్నారు. అయినప్పటికీ రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతివ్వాలని జేడీ(యూ) నిర్ణయించింది. బీజేపీ అంచనాలివి రాజ్యసభలో అధికార బీజేపీకి మెజారిటీ లేకపోవడంతో మిత్రపక్షాలు, ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే బిల్లును గట్టెక్కించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యూహాలు పన్నుతున్నారు. బిల్లుకు అనుకూలంగా కనీసం 124–130 ఓట్లు వస్తాయని బీజేపీ ధీమాగా ఉంది. విపక్షాల బలం 90–93కి పరిమితమైపోతుందని అంచనా వేస్తోంది. ఇన్నాళ్లూ ఎన్టీయే ప్రభుత్వం పెట్టిన ప్రతీ బిల్లుకి టీఆర్ఎస్ మద్దతు ఇస్తూ వచ్చింది. కానీ ఈ సారి మైనారిటీ ముస్లింల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నదని పేర్కొంటూ ఈ బిల్లుకి లోక్‌సభలోనూ టీఆర్ఎస్ మద్దతివ్వలేదు. ఈశాన్య రాష్ట్రాల బంద్ సక్సెస్ ముస్లిం మైనారిటీల ప్రయోజనాలను కాలరాసేలా ఉందంటూ పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం చేపట్టిన బంద్ సక్సెస్ అయింది. లెఫ్ట్ పార్టీలు, ఇతర ప్రజాస్వామ్య సంస్థలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బంద్‌తో అసోంలో జనజీవనం స్తంభించింది. పెద్దల సభలో ఎవరు ఎటు వైపు ? మొత్తం సభ్యుల సంఖ్య: 245 ప్రస్తుతం ఉన్న సభ్యులు: 240 మేజిక్ ఫిగర్: 121 బిల్లుకి అనుకూలం 115 బీజేపీ (83), ఏఐఏడీఎంకే (11), జేడీయూ (6), శిరోమణి అకాలీదళ్ (3), స్వతంత్ర, నామినేటెడ్ అభ్యర్థులు (7), ఒక్కో సభ్యుడు ఉన్న చిన్న పార్టీలు (5) ఎన్డీయేతర పక్షాలు బిల్లుకి అనుకూలం 11 బీజేడీ (7), వైసీపీ (2), టీడీపీ (2), మొత్తం: 115 + 11 = 126 బిల్లుకి వ్యతిరేకం 95 కాంగ్రెస్ (46), తృణమూల్ కాంగ్రెస్ (13), సమాజ్‌వాదీ పార్టీ (9), లెఫ్ట్ పార్టీలు (6), టీఆర్ఎస్ (6), ఎన్సీపీ (4), బీఎస్పీ (4), ఆర్జేడీ (4), ఆప్ (3), మొత్తం: 95 ►ఇవి కాకుండా ముగ్గురు సభ్యులున్న శివసేన, ఒక్కో సభ్యుడున్న చిన్న పార్టీల మద్దతుతో విపక్షాల సంఖ్య 100 వరకు చేరుకోవచ్చునని ఓ అంచనా అమిత్ షాపై ఆంక్షలు విధించాలి పౌరసత్వ సవరణ బిల్లును యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్సీఐఆర్ఎఫ్) తప్పు పట్టింది. ఈ బిల్లు తప్పుడు మార్గంలో వెళుతూ అత్యంత ప్రమాదకరంగా మారిందని వ్యాఖ్యానించింది. భారత లౌకికతత్వాన్ని ఈ బిల్లు దెబ్బ తీస్తోందని, సమాన హక్కుల్ని కాలరాస్తోందని పేర్కొంది. మత ప్రాతిపదికన చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న హోం మంత్రి అమిత్, ఇతర నాయకులపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిగణించాలని యూఎస్సీఐఆర్ఎఫ్ అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి సూచించింది. ఎదురుదాడికి దిగిన భారత్ అమెరికా కమిషన్‌పై భారత్ మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పౌరసత్వ సవరణ బిల్లుపై కనీస అవగాహన లేకుండా ఆ కమిషన్ సూచనలు చేస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. ఈ అంశంలో ఆ సంస్థ ఈర్ష్య, పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఎదురు దాడికి దిగారు. ఆంక్షలు విధించాలంటూ సిఫార్సులు చేయడం అత్యంత విచారకరమన్న రవీష్ కుమార్ భారత్‌లో చట్టాలపై వ్యాఖ్యలు చేసే హక్కు ఆ సంస్థకు లేదని అన్నారు. గోద్రా ఘర్షణల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి టూరిస్ట్ వీసా నిరాకరణకు యూఎస్సీఐఆర్ఎఫ్ మద్దతునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
#CAB2019: మరోసారి ఆలోచించండి!
పట్నా: లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడంపై జేడీ(యు)లో నిరసన గళాలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. జాతీయ అధికార ప్రతినిధి పవన్ కే వర్మ కూడా తాజాగా నిరసన గళం విప్పారు. పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుపై పునరాలోచన చేయాలని జేడీ(యు) జాతీయ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు వర్మ సూచించారు. ‘పౌరసత్వ సవరణ బిల్లు(#CAB2019)కు రాజ్యసభలో మద్దతు ఇచ్చే విషయంలో మరోసారి ఆలోచించాలని నితీశ్ కుమార్‌ను కోరుతున్నాను. ఈ బిల్లు రాజ్యాంగం విరుద్ధంగా, వివక్షతో పాటు దేశ ఐక్యమత్యం, సౌభ్రాతృత్వానికి వ్యతిరేకంగా ఉంది. జేడీ(యు) లౌకిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంది. గాంధీజీ ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించార’ని పవన్ కే వర్మ మంగళవారం ట్వీట్ చేశారు. జేడీ(యు)కు లోక్‌సభలో 16 మంది, రాజ్యసభలో 6 మంది ఎంపీలు ఉన్నారు. కాగా, మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇవ్వడం నిరాశ కలిగించిందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లుకు లౌకికవాదానికి వ్యతిరేకంగా లేదనందువల్లే తాము మద్దతు ఇచ్చామని జేడీ(యు) ఎంపీ రాజీవ్ రంజన్ అలియాస్ లాలన్ సింగ్ లోక్‌సభలో చెప్పారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిల్లును సమర్థించడం మినహా తమకు మరో మార్గం లేదని జేడీ(యు) సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్ఆర్సీ, పౌరసత్వ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకించి చివరకు జేడీ(యు) మద్దతు పలకడం తమకు ఆశ్చర్యం కలిగించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘యూటర్న్ తీసుకోవడం జేడీ(యు)కు కొత్త కాదని, గతంతో మూడు సార్లు ఈవిధంగా చేసింది. ట్రిఫుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఎలా వ్యవహరించిందో ఇప్పుడు పౌరసత్వ బిల్లుపై అదే విధంగా ప్రవర్తించింది. బీజేపీ ప్రవేశపెట్టిన అంశాలను వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రజలు, ఓటర్లలో భ్రమలు కల్పిస్తుంది. చివరకు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్ దూరంగా ఉండటమో లేదా సమర్థించమో చేస్తుంద’ని ఏఎన్ సిన్హా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ రాజకీయ విశ్లేషకుడు డీఎం దివాకర్ పేర్కొన్నారు. (మా పార్టీ వైఖరిపై నిరాశ చెందా : పీకే) -
అమెరికా అభ్యంతరాలు అర్థరహితం
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును ఖండిస్తూ అమెరికన్ కమిటీ యూఎస్సీఐఆర్ఎఫ్ ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. అమెరికా వాదన అసమంజసం, అవాస్తవమని ఆక్షేపించింది. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందితే పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం లభిస్తుంది. కాగా ఈ బిల్లు తప్పుడు దిశగా పయనించే ప్రమాదకర మలుపుగా అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) అభివర్ణించింది. పార్లమెంట్ ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందితే బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా సహా ఇతర నేతలు, అధికారులపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించాలని వ్యాఖ్యానించింది. కాగా అమెరికన్ కమిటీ అభ్యంతరాలను భారత్ తోసిపుచ్చుతూ మతపరమైన మైనారిటీ శరణార్ధుల కష్టాలను తొలగించడం, వారి కనీస మానవ హక్కులను గౌరవించేందుకే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేసింది. పౌరసత్వ బిల్లు, ఎన్ఆర్సీల ద్వారా ఏ ఒక్కరి పౌరసత్వానికి విఘాతం కలగదని తెలిపింది. పౌరసత్వ విధానాలను క్రమబద్ధీకరించే హక్కు అమెరికా సహా ప్రతి దేశానికీ ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తేల్చిచెప్పింది. -
పౌరసత్వ బిల్లుపై రాహుల్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ బిల్లు దేశ పునాదులను ధ్వంసం చేస్తుందని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో తమ కొత్త భాగస్వామ్య పక్షం శివసేన పౌరసత్వ బిల్లు దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తుందని ప్రశంసించిన నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యాంగంపై దాడిగా రాహుల్ అభివర్ణించారు. ఈ బిల్లుపై సర్కార్‌ను సమర్ధించిన వారు దేశ పునాదులను విచ్ఛిన్నం చేయడానికి సహకరించిన వారవుతారని రాహుల్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం కల్పించేందుకు వెసులుబాటు ఇచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. మరోవైపు మహారాష్ట్రలో పాలక సంకీర్ణ సర్కార్‌కు సారథ్యం వహిస్తున్న శివసేన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతిచ్చింది. జాతి ప్రయోజనాల కోసం తాము ఈ బిల్లుకు మద్దతిచ్చిందని ఆ పార్టీ నేత, ఎంపీ అర్వింద్ సావంత్ చెప్పారు. -
అందుకే ఆ బిల్లుకు మద్దతు: శివసేన
ముంబై: పౌరసత్వ సవరణ బిల్లుపై శివసేన పార్టీ బీజేపీని తీవ్రంగా విమర్శించింది. అయితే సోమవారం బీజేపీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు అనూహ్యంగా శివసేన మద్దతు పలికింది. ఈ బిల్లు ద్వారా హిందువులు, ముస్లిముల మధ్య ‘అదృశ్య విభజన’ సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సోమవారం శివసేన తన అధికారపత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించిన విషయం తెలిసిందే. కానీ అదే రోజు శివసేన పార్టీ పౌరసత్వ బిల్లుపై యూటర్న్ తీసుకుంది. ఈ విషయంపై స్పందించిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్.. దేశ ప్రయోజనాల కోసం ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇచ్చిందని తెలిపారు. దీంతోపాటు ‘కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)’ అనేది కేవలం మహారాష్ట్ర రాజకీయాల వరకే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సిద్ధాంత పరంగా చాలా వ్యత్యాసాలు ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి.. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ‘మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం’ ఏర్పటు చేసిన విషయం తెలిసిందే. శివసేన పార్టీ.. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం తమ పార్టీ ఎంపీకి బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రి పదవి కూడా వదులుకుంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుతో దేశంలో మత యుద్ధానికి దారి తీసే ప్రమాదం ఉందని సామ్నా తన సంపాదకీయంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన శివసేన పార్టీకి.. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా శివసేన పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వటం వల్ల మహారాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం ఉంటుందన్న మీడియ ప్రశ్నకు.. ‘అది శివసేన పార్టీనే అడగాలి’ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరణ ఇచ్చారు. -
పౌరసత్వ సవరణ బిల్లుపై ఇమ్రాన్ ఫైర్
ఇస్లామాబాద్: పౌరసత్వ సవరణ బిల్లుకు భారత లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఈ బిల్లు ద్వారా అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాన్ని భారత్ ఉల్లంఘించిందని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లుతో పాకిస్తాన్‌తో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి భారత్ తూట్లు పొడిచిందని విమర్శించారు. అదే విధంగా బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను సైతం ఇమ్రాన్ తప్పుబట్టారు. హిందూ రాష్ట్ర భావనను విస్తరించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందంటూ ఆరెస్సెస్ వ్యాఖ్యానించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వాడి, వేడి చర్చల మధ్య స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ చేపట్టగా బిల్లుకు అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 మంది సభ్యులు ఓటేశారు. దీంతో మూడు పొరుగు దేశాలు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లైంది. (పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం) ఇక ఈ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. విపక్ష విమర్శలను తిప్పికొట్టారు. ‘రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే ఈ బిల్లు ఉంది. సమానత్వ హక్కును కల్పించే ఆర్టికల్ 14 సహా రాజ్యాంగంలోని ఏ అధికరణకు కూడా ఈ బిల్లు ఉల్లంఘన కాదు’ అని అన్నారు. భారత్‌లోని ముస్లింలకు ఈ బిల్లుతో ఏ విధమైన సంబంధం లేదని, ప్రధానిగా మోదీ ఉన్నంతవరకు మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమిత్ షా హామీ ఇచ్చారు. -
మా పార్టీ వైఖరిపై నిరాశ చెందా : పీకే
సాక్షి, ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుకు తమ పార్టీ జనతాదళ్(యు) మద్దతు తెలపడంపై ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఈ బిల్లును మొదట్లో వ్యతిరేకించిన జనతాదళ్, బిల్లు ప్రవేశపెట్టే ముందు రోజు (ఆదివారం) మద్దతివ్వాలని నిర్ణయించింది. ఈ పరిణామం పట్ల ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ.. ఇది తనకు నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించారు. మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని సోమవారం ట్విటర్లో పేర్కొన్నారు. మరోవైపు బిల్లుకు జనతాదళ్ పార్టీ మద్దతు తెలపడంపై బీహార్‌లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ విమర్శించింది. నితీష్‌కుమార్ ప్రధాని మోదీకి బానిసలా వ్యవహరిస్తున్నారని, 370 రద్దు, ట్రిపుల్ తలాక్, ఎన్నార్సీలకు మద్దతు తెలపడంతో ఈ విషయం రూడీ అయిందని వాగ్బాణాలు సంధించింది. -
పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. వాడి, వేడి చర్చ అనంతరం, విపక్ష సభ్యుల నిరసనల మధ్య బిల్లుపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌లో అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 ఓటేశారు. దాంతో, మూడు పొరుగు దేశాలు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్తైంది. అంతకుముందు, పలువురు ఎంపీల సవరణ ప్రతిపాదనలను సభ మూజువాణి ఓటుతో తోసిపుచ్చింది. ఈ బిల్లుపై సభలో దాదాపు 7 గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం, చర్చకు సమాధానమిస్తూ హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. విపక్ష విమర్శలను తిప్పికొట్టారు. ‘రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే ఈ బిల్లు ఉంది. సమానత్వ హక్కును కల్పించే ఆర్టికల్ 14 సహా రాజ్యాంగంలోని ఏ అధికరణకు కూడా ఈ బిల్లు ఉల్లంఘన కాదు’ అని అన్నారు. భారత్‌లోని ముస్లింలకు ఈ బిల్లుతో ఏ విధమైన సంబంధం లేదని, ప్రధానిగా మోదీ ఉన్నంతవరకు మైనారిటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. రోహింగ్యాలకు నో.. ఎన్నార్సీకి ఎస్ రోహింగ్యాలకు పౌరసత్వం కల్పించే ప్రసక్తే లేదని అమిత్ షా మరోసారి తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. పొరుగుదేశాల్లో మతపరమైన వేధింపులకు గురై భారత్‌కు వచ్చి, బాధాకర జీవనం గడుపుతున్నవారికి ఊరట కల్పించేందుకే ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు. 1947లో మత ప్రాతిపదికన దేశ విభజన జరిగి ఉండకపోతే.. ఇప్పుడు ఈ బిల్లు అవసరమే ఉండేది కాదని అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మత వివక్ష ఎదుర్కొంటూ 2014, డిసెంబర్ 31 లోపు భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులను అక్రమ శరణార్ధులుగా భావించం. వారికి భారత పౌరసత్వం కల్పిస్తాం’ అని ఆ బిల్లులో పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. శతాబ్దాల సంప్రదాయమైన ఆత్మీయీకరణ, మానవీయతలో భాగంగానే ఈ బిల్లు రూపొందిందన్నారు. డివిజన్ ఓట్‌తో.. అంతకుముందు, విపక్షాల తీవ్ర నిరసనల మధ్య ఈ బిల్లును అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులు, మతహింస ఎదుర్కొన్న ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం కల్పించే ఈ ప్రతిపాదనకు 130 కోట్ల భారతీయుల ఆమోదం ఉందని ఈ సందర్భంగా షా స్పష్టం చేశారు. డివిజన్ ఓట్ అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డివిజన్ వోట్లో అనుకూలంగా 293 ఓట్లు, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింలకు వ్యతిరేకమని విపక్ష సభ్యులు ఆధిర్ రంజన్ చౌధురి(కాంగ్రెస్), సౌగత రాయ్(టీఎంసీ), ఎన్కే ప్రేమ్‌చంద్రన్(ఆర్ఎస్పీ), గౌరవ్ గొగొయి(కాంగ్రెస్), శశిథరూర్(కాంగ్రెస్), అసదుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం) తదితరులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లును ప్రవేశపెడ్తూ.. కాంగ్రెస్‌పై షా మండిపడ్డారు. ‘శరణార్ధులు, చొరబాటుదారుల మధ్య తేడాను మనమంతా గుర్తించాల్సి ఉంది. ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదు.ఎవరి హక్కులనూ లాక్కోదు’ అని అన్నారు. ‘ఇన్నర్ లైట్ పర్మిట్’లోకి మణిపూర్ ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల ఆందోళనలపై స్పందిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉందని షా తెలిపారు. ఈ బిల్లు పరిధిలో లేని ‘ఇన్నర్ లైన్ పర్మిట్’ ప్రాంతంలోకి మణిపూర్‌ను కూడా చేరుస్తున్నామన్నారు. మూడు పొరుగుదేశాల్లో మత వేధింపులను ఎదుర్కొన్న ముస్లిమేతరులకు రేషన్ కార్డ్ సహా ఎలాంటి పత్రాలు లేనప్పటికీ.. భారతీయ పౌరసత్వం కల్పిస్తామన్నారు. గతంలోనూ ఇలాంటి హక్కులు కల్పించారని, ఆ కారణంగానే ప్రస్తుత పాకిస్తాన్ నుంచి వచ్చిన మన్మోహన్ సింగ్ ప్రధాని, ఎల్కే అడ్వాణీ ఉప ప్రధాని కాగలిగారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సభలో వాడివేడి చర్చ చోటు చేసుకుంది. ఈ బిల్లు లౌకికత అనే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ విమర్శించారు. ‘సమానులను సమానం కాని వారుగా గుర్తించకూడదు. భారత్‌కు ఎవరు వచ్చినా వారు శరణార్ధులే. మతం ప్రాతిపదికన వారిని వేరువేరుగా చూడకూడదు’ అన్నారు. బిల్లుకు ఎన్డీయే మిత్ర పక్షాలైన జేడీయూ, ఎల్జేపీలు మద్దతు తెలిపాయి. ఈ బిల్లులో ముస్లింలను కూడా చేర్చాలని, బిల్లుకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్ సూచించాయి. ఈ బిల్లును వ్యతిరేకించే వారంతా హిందూ వ్యతిరేకులు అనే ప్రచారాన్ని ప్రభుత్వం చేస్తోందని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి విమర్శించారు. ‘ఈ బిల్లు వివక్షాపూరితం. రాజ్యాంగ పునాదులనే ఇది దెబ్బతీస్తుంది. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇది తొలి అడుగు’ అని మండిపడ్డారు. మా రాష్ట్రంలో ఒప్పుకోం: మమత... ఈ బిల్లును కానీ, జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని కానీ తమ రాష్ట్రంలో అనుమతించబోమని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ పునరుద్ఘాటించారు. పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడ్తున్న నేపథ్యంలో.. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బిల్లుపై ఆందోళనలు ఊపందుకున్నాయి. బిల్లు ప్రతిని చించేసిన ఒవైసీ పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. తన ప్రసంగం చివరలో ఈ బిల్లు ప్రతిని చించేశారు. ‘ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాను. మేమూ మనుషులమే. ఈ వివక్షకు కారణమేంటి? అస్సాం ఎన్ఆర్సీలో 19 లక్షల మంది పేర్లు లేవు. ముస్లింలకు స్వదేశమంటూ లేకుండా చేయడం వీరి ఉద్దేశం. రెండోసారి విభజన జరగాలని మీరు కోరుకుంటున్నారా? ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది’ అంటూ ప్రతిని చించేసి తన ప్రసంగాన్ని ముగించారు. -
ఎవరికీ నష్టం లేదు : సమానత్వాన్ని కాలరాస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాలు, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా మాత్రం పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుగా తన వాదనను వినిపించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు 130 కోట్ల మంది భారతీయుల మద్దతు ఉందని, 2014, 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని నిందించిన అమిత్ షా.. పౌరసత్వ సవరణ బిల్లుతో ఎవరికీ అన్యాయం జరగబోదని, ఈ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకం కాదని అన్నారు. ఈ బిల్లు వెనుక ఎలాంటి రాజకీయాలు, అజెండా లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా నిజానికి మైనారిటీలు హక్కులు పొందుతారని, విదేశాల నుంచి దేశంలోకి శరణార్థులుగా వచ్చిన మైనారిటీలు హక్కులు పొందుతారని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పౌరసత్వ సవరణ బిల్లుపై ధ్వజమెత్తారు. ఈ బిల్లు అతి పెద్ద తప్పిదమని, ఈ అసమగ్ర బిల్లు కొన్ని వర్గాలపై వివక్ష చూపేలా ఉందన్నారు. ఆర్టికల్ 14, 15, 21, 25, 26లకు వ్యతిరేకంగా బిల్లు ఉందని, రాజ్యాంగంలోని సమానత్వ హక్కును ఈ బిల్లు కాలరాస్తుందని మండిపడ్డారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లును కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
నేడు లోక్‌సభకు పౌరసత్వ బిల్లు
న్యూఢిల్లీ: పౌరసత్వ (సవరణ) బిల్లుతోపాటు చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా పొడిగింపునకు ఉద్దేశించిన బిల్లును సోమవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరు లకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లును హోం మంత్రి అమిత్ షా దిగువ సభలో ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం సభలో ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ, అనంతరం ఓటింగ్ జరగనుందని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా, లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగించేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా ప్రభుత్వం నేడు సభలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోటా 2020 జనవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తమ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులకు విప్ జారీ చేసింది. సోమవారం నుంచి మూడు రోజులపాటు సభకు తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశించింది. పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్ నేత శశిథరూర్ విరుచుకుపడ్డారు. గాంధీజీ ఆలోచనా విధానం పై జిన్నా వాదానికి గెలుపు వంటిదే పౌరసత్వ బిల్లు అని విమర్శించారు. ఈ బిల్లును నిరసిస్తూ 10వ తేదీన బంద్ పాటించాలని ఈశాన్య విద్యార్థుల సమాఖ్య పిలుపునిచ్చింది.