
సాక్షి, హైదరాబాద్: మతోన్మాద మజ్లిస్ పార్టీకి భయపడే పౌరసత్వ చట్టం సవరణకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఓటు వేసిందని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, వామపక్షాలు, అర్బన్ నక్సలైట్లు, టీఆర్‌ఎస్, మజ్లిస్ కలిసి పౌరసత్వ సవరణ చట్టంపై గందరగోళం సృష్టిస్తున్నాయని, ఆలోచన రహితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. 12 శాతం ఓట్ల కోసం సీఎం.. ఒవైసీకి వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవాచేశారు.