ramachandra Rao
-
కూతురి స్మగ్లింగ్‌లో డీజీపీ పాత్ర ఉందా?
బనశంకరి: నటి రన్య రావు పెంపుడు తండ్రి, రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ డీజీపీ రామచంద్రరావు చిక్కుల్లో పడ్డారు. రన్యకు బెంగళూరు విమానాశ్రయంలో ప్రోటోకాల్ ఇవ్వడం గురించి విచారణ చేపట్టి వారంలోగా నివేదిక అందించాలని హోంశాఖను సర్కారు ఆదేశించింది. బంగారం స్మగ్లింగ్ లో ఆయన కుమ్మక్కయ్యారా, ప్రోటోకాల్ దుర్వినియోగానికి పాల్పడడం వెనుక ఆయన హస్తం ఉందా అనే దానిపై వారంలోగా విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఆదేశించింది. నటి రన్య తన ప్రయాణాల్లో రామచంద్రరావు పేరును విరివిగా వాడుకున్నారు. రన్య కేసు శాసనసభ సమావేశాల్లో తీవ్ర చర్చకు రావడం తెలిసిందే. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రతిపక్ష బీజేపీ మండిపడడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. రన్య ప్రోటోకాల్‌పై నివేదిక మరోపక్క రన్య రావు ప్రోటోకాల్ దుర్వినియోగం పట్ల పోలీస్ కమిషనర్ దయానంద్‌కు డీసీపీ నివేదిక అందజేశారు. రన్య రావ్ అరెస్టైనరోజు ప్రోటోకాల్‌లో ఉన్న కానిస్టేబుల్ బసవరాజుకు ఆమె కాల్ చేసి విమానాశ్రయంలో టెరి్మనల్ వన్ వద్దకు రావాలని తెలిపింది. ఇప్పుడు రాలేను మేడం, వేరే ఆఫీసర్ వస్తున్నారు, రిసీవ్ చేసుకోవాలి అని బసవరాజు చెప్పాడు. నువ్వే రావాలి లేకపోతే, అప్పాజీ కి చెబుతానని రన్య హెచ్చరించినట్లు నివేదికలో ప్రస్తావించారు. పోలీస్ స్టిక్కర్ వాడొద్దు: హోంమంత్రి దొడ్డబళ్లాపురం: పోలీసులు, వారి కుటుంబ సభ్యులు సొంత వాహనాలపై పోలీస్ అనే స్టిక్కర్లు వేసుకోవడం మామూలే. ఇది ఏ మాత్రం మంచిది కాదని, ఇది కచ్చితంగా చట్టాన్ని , నిబంధనలను ఉల్లంఘించడమేనని హోంమంత్రి పరమేశ్వర్ చెప్పారు. 2022 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇలా స్టిక్కర్లు వేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని మంగళవారం అసెంబ్లీలో చెప్పారు. శ్రవణబెళగోళ ఎమెల్యే సీఎస్ బాలక్రిష్ణ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు తెలిపారు. రన్య అరెస్టు వెనుక...బనశంకరి: బంగారం దొంగరవాణా కేసులో నటి రన్య రావు పట్టుబడటం వెనుక ఆమె భర్త, ఢిల్లీలో అరెస్టైన ఇద్దరు స్మగ్లర్లు, పలువురు పెద్దలు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జతిన్ హుక్కేరి అనే వ్యక్తితో రన్యకు బెంగళూరులో ఆర్భాటంగా వివాహం జరిగింది. కానీ వారి మధ్య గొడవలు వచ్చాయి. రన్య పదేపదే విదేశాలకు వెళ్లడం గురించి భర్త ప్రశ్నించేవాడు. ఆయనే డీఆర్ఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. కొన్నిరోజుల కిందట ఢిల్లీలో డీఆర్ఐ అధికారులకు ఇద్దరు స్మగ్లర్లు దొరికారు. రన్య అనే యువతి కూడా బంగారం దొంగ రవాణా చేస్తోందని ఉప్పందించారు. దీంతో ఢిల్లీ నుంచి బెంగళూరు డీఆర్ఐ విభాగానికి అలర్ట్ వచ్చింది. 3వ తేదీ రాత్రి రన్య బెంగళూరు విమానాశ్రయంలో దిగగానే అదుపులో తీసుకున్నారు. రన్య అంటే పడని బంగారు వ్యాపారులు, ఓ మంత్రి కూడా సమాచారం ఇచ్చారని ప్రచారం సాగుతోంది. 28 సార్లు విదేశీ ప్రయాణం నటి రన్య కేసులో తరుణ్‌రాజు అనే వ్యక్తి అరెస్టు కావడం బెంగళూరులో చర్చనీయాంశమైంది. రన్య వెనుక తరుణ్‌రాజు ఉన్నాడని తెలుస్తోంది. బెంగళూరు కు బంగారం తెప్పించి హవాలా ద్వారా దుబాయికి డబ్బు పంపించేవారు. రన్య ఖర్చులన్నింటినీ తరుణ్‌రాజు చూసుకునేవాడు. ఐపీఎస్ అధికారి కూతురు కావడంతో రన్య ద్వారా సులభంగా బంగరాన్ని తెప్పించవచ్చని గుర్తించాడు. రన్య ఒక ఏడాదిలో 28 సార్లు విదేశీ పర్యటనలు చేసింది. గత 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చింది. ఐదోసారి దుబాయ్‌కి వెళ్లి వస్తుండగా జాతకం మారిపోయింది. -
జార్ఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మామిడన్న సత్యరత్న రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రామచంద్రరావును జార్ఖండ్ హైకోర్టుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బదిలీ చేశారు. అలాగే మరికొందరు న్యాయమూర్తులను ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ, జమ్మూకశీ్మర్–లడఖ్, మద్రాస్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు. మరో ముగ్గురు జ్యుడీíÙయల్ అధికారులను మద్రాస్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమించారు.ఈ నెల 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో శనివారం కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2012లో ఏపీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు... 2013లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2021 ఆగస్టు 31న తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించారు.2021 అక్టోబర్ 12న పంజాబ్–హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అనంతరం 2023 మే 30న హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. రామచంద్రరావు తండ్రి జస్టిస్ ఎం.జగన్నాథరావు 1997–2000 మధ్య సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. -
పొలం బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వమని ఎమ్మెల్యే భర్త దౌర్జన్యం
-
కమలానికి కొత్త సారథి.. ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడి నియామకపు అంశం మరోసారి చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర పార్టీలో సమన్వయ లేమి సమస్య, ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం, కేడర్‌లో నిరాసక్తత, నిస్తేజం పెరుగుతున్న నేపథ్యంలో... కొత్త అధ్యక్షుడిని జాతీయ నాయకత్వం ఇంకా ఎప్పుడు నియమిస్తుందా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవితో పాటు, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన రాష్ట్ర పార్టీకి పూర్తి సమయాన్ని కేటాయించ లేకపోతున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. కిషన్‌రెడ్డి కూడా వీలైనంత తొందరగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను తప్పించాలని అధిష్టానానికి ఇప్పటికే విన్నవించినట్టు సమాచారం. దీంతో పాటు మరో మూడు నాలుగు నెలల్లో స్థానికసంస్థల ఎన్నికలు జరగొచ్చుననే రాజకీయవర్గాల అంచనాల నేపథ్యంలో గ్రామ, మండల ,జిల్లా స్థాయిల్లో పార్టీ పటిష్టతతో పాటు స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచుకోవడమనేది బీజేపీకి తక్షణ అవసరంగా మారింది.స్థానిక ఎన్నికల్లో... జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అంతగా కేడర్, స్థానిక నాయకుల బలం లేని బీజేపీ.. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఎదుర్కొని గణనీయమైన సంఖ్యలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఎలా గెలిపించుకోగలుగుతుందనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా రాష్ట్ర రాజకీయాలపై పట్టున్న నేతను కొత్త అధ్యక్షుడిని నియమిస్తే...ఎన్నికల్లోగా సంస్థాగతంగా పార్టీ బలం పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.ఈటల వైపే మొగ్గు...?బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం..పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు గట్టిగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ పదవి కోసం ఎంపీలు డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, టి.రాజాసింగ్, ముఖ్యనేతలు ఎన్.రామచంద్రరావు, చింతల రామచంద్రా రెడ్డి, టి.ఆచారి, యెండల లక్ష్మీనారాయణ, ఎం.ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డా. కాసం వెంకటేశ్వర్లు పోటీపడుతున్నారు.బీజేఎల్పీ నేతగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇచ్చినందున, రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వర్గానికి చెందినవారినే అధిష్టానం నియమిస్తుందని పార్టీలో పలువురు నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ వాదన రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన ఈటల రాజేందర్‌కు అడ్వాంటేజ్‌గా మారొచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈటల వైపే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి సునీల్ బన్సల్ వంటి వారు మొగ్గుచూపుతున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.బీసీ వర్గాల నుంచే ఎంపికచేస్తే ఈటలతో పాటు అర్వింద్ ధర్మపురి, పాయల్‌శంకర్, టి.ఆచారి, యెండల లక్ష్మీనారాయణ, కాసం వెంకటేశ్వర్లు పేర్లను సైతం పరిశీలిస్తారని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల క్రితమే పార్టీలో చేరిన ఈటలకు అధ్యక్ష పదవి ఎలా ఇస్తారనే ప్రశ్నను కొందరు లేవనెత్తుతున్నారు. పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచాక కొత్త, పాత అంటూ ఉండదని, రాష్ట్రంలో పార్టీ గ్రామస్థాయి వరకు సంస్థాగతంగా విస్తరించి, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే ఇది అడ్డంకి కాకూదని వాదిస్తున్న వారూ పార్టీలో ఉన్నారు.అలాగైతే రామచంద్రరావుకే.. సైద్ధాంతిక అంశాలకు ప్రాధాన్యతని స్తే... మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావును అధ్యక్షుడిగా ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర లేదని పార్టీ వర్గాలంటున్నాయి. కొత్త వారికి అధ్యక్ష పదవి వద్దన్న కొందరి అభ్యంతరాల నేపథ్యంలో సంఘ్ పరివార్ కూడా మద్దతిస్తే రామచంద్రరావుకు అవకాశం దక్కవచ్చని అంటున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని పార్టీ నాయకులు కోరుతున్నారు. మొత్తంగా చూస్తే పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కొత్త అధ్యక్షుడిని నియమిస్తారా లేదా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. -
జింకల కొమ్ములు, చర్మం తరలిస్తున్న ముఠా అరెస్ట్
-
మరోసారి గాజువాకలో వైఎస్సార్సీపీ జెండా: వరికూటి రామచంద్రరావు
-
దయాగుణానికి మారుపేరు వైఎస్ఆర్
-
హీరోగా రాబోతున్న డైరెక్టర్ కుమారుడు తేజ్
తేజ్ బొమ్మ దేవర, రిషిక లోక్రే జంటగా బొమ్మ దేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 2. ఈ మూవీ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నాగ చైతన్య హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రాజు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్ట్ ఏ.సి.యస్ కిరణ్ అందించారు. దర్శకుడు సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత బొమ్మ దేవర రామచంద్ర రావు మాట్లాడుతూ.. మేము పిలవగానే వచ్చిన హీరో నాగ చైతన్య కు, సి కళ్యాణ్, సముద్ర గార్లకు, నాకు ఈ సినిమా చేసే అవకాశం కల్పించిన నాగార్జున గారికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా ఈ కథ ఉంటుంది. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న మా అబ్బాయిని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 10 నుంచి 21వ తేదీ వరకు మొదటి షెడ్యూల్ చేసుకుని జులై ఫస్ట్ నుంచి అరకులో మిగిలిన షూటింగ్ జరుపుకుని సెప్టెంబర్‌లో షూటింగ్ పూర్తి చేసుకొని అదే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అన్నారు. చిత్ర హీరో తేజ్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్యాషన్. మా నాన్న గారు నన్ను ఫోర్స్ చేయలేదు. నాకు ఏది ఇష్టమో అది చేయమన్నారు. నాకు నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాకు కావాల్సిన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్ని నేర్చుకొని నా ఇంట్రెస్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు భిన్నమైన చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. నేను చేస్తున్న ఈ మొదటి చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. చదవండి: బిగ్‌బాస్ ఆరో సీజన్లోకి హర్ష సాయి? సినిమాల్లోకి రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నమ్రత -
‘ఎన్డీయే.. నో డేటా అవైలబుల్’
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. ‘ఎన్డీయే అంటే నో డేటా అవైలబుల్’ అని ఎద్దేవా చేశారు.తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న టీఆర్ఎస్ ప్రకటనపై.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉస్మానియా వర్సిటీకి వెళ్లిన బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ రామచంద్రరావు గ్రాడ్యుయేట్లను ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు సవాల్ చేస్తూ ట్వీట్ పెట్టారు. ‘‘నేను ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉన్నాను. కేటీఆర్ మీరు ఎక్కడున్నారు? రాష్ట్రంలో లక్ష కొలువుల కల్పనపై చర్చకు రండి’’ అని పోస్టు చేశారు. దీనికి మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘‘గౌరవనీయులు ప్రధాని మోదీ హామీ ఇచ్చిన 12 కోట్ల ఉద్యోగాలు (ఏడాదికి రెండు కోట్లు చొప్పున), పేదల జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తామన్న హామీలకు సంబంధించిన సమా చారాన్ని సేకరించడంలో బిజీగా ఉన్నా.. ఇప్పటి వరకు సమాధానం ‘ఎన్డీఏ’ అని వస్తోంది. ఎన్డీఏ అంటే ‘నో డేటా ఎవైలబుల్’ (ఎలాంటి సమా చారం అందుబాటులో లేదు). మీ దగ్గర సమాధా నాలు ఉంటే మాకు ఇవ్వండి’’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.ఈ ట్వీట్లు ట్విట్టర్లో వైరల్‌గా మారాయి. మంత్రి కేటీఆర్‌తో ఫ్రెంచ్ రాయబారి భేటీ ఫ్రెంచ్ రాయబారి ఎమాన్యు యేల్ లీనెయిన్ ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావుతో సోమవారం ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ మార్జోరీ వంబేలింగమ్, ఐటీ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ పాల్గొన్నారు. I am busy gathering information on the 12 crore jobs (2Cr per year) & ₹15 lakhs in all Jandhan accounts promised by Hon’ble PM Shri Modi Ji NDA is the answer so far N - No D - Data A - Available Please share if you have any answers https://t.co/NQf2FFF74z — KTR (@KTRTRS) March 1, 2021 -
ఉద్యోగాలపై ఆర్థికశాఖ కాకిలెక్కలు
తెలంగాణ ఉద్యమం పుట్టింది ఉద్యోగాల కోసం. 1,200 మంది నిరుద్యోగులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డది తెలంగాణ వొస్తే ఉద్యోగాలొస్తాయని. తెలంగాణ వొచ్చి ఏడేండ్లు కావస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలకు లోనై మళ్లీ ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు (నాగులు, రవీంద్ర నాయక్). ఏ ఉద్యమమైనా తన లక్ష్యాన్ని సాకారం చేసుకున్న పిదప ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి. అప్పుడే ఉద్యమం సఫలీకృత మైనట్లు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నీళ్లు, నిధులు, నియా మకాల గురించి కొనసాగింది. నియామకాలకు సంబంధించిన ఈ కీలక అంశాన్ని ప్రభుత్వం ఏ మేరకు పరిష్కరించింది అన్నది ప్రశ్న. ప్రభుత్వ ఆర్థికశాఖ ఇచ్చిన ఉద్యోగ వివరాలను చూద్దాం. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం అనుమతించిన 1,50,326 పోస్టు లకుగానూ 1,32,898 పోస్టులను నోటిఫై చేయగా అందులో 1,26,641 భర్తీ అయ్యాయనీ, మిగిలింది కేవలం 23,685 ఖాళీలు మాత్రమేననీ పేర్కొన్నారు. భర్తీ చేసినవాటిల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 30,594; పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుద్వారా 31,972; విద్యుత్ సంస్థల్లోని ఆర్టిజన్లను క్రమబద్ధీకరించడం ద్వారా 22,972; పంచాయతీరాజ్ శాఖలో 10,763 పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా; శాఖాపరమైన పదోన్నతుల ద్వారా 11,278 పోస్టులను భర్తీ చేసినట్లు పేర్కొంది. పోలీస్ శాఖలోని నియామకాల్లో కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న హోం గార్డులు ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి, అవిపోగా కొత్తగా ఉద్యోగాలు లభించింది ఎంతమందికో ఆర్థికశాఖ వివరిస్తే బాగుం డేది. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించడం కొత్త నియామకాల కిందకి రాదు. పంచాయతీ రాజ్‌లో శాఖాపరమైన పదోన్నతులద్వారా 11,278 పోస్టులను భర్తీచేసినట్లు చెప్తున్నరు. శాఖాపరమైన పదో న్నతులలో కిందిస్థాయిలో ఏర్పడే ఖాళీలను భర్తీచేస్తేనే ఆ పోస్టులు భర్తీ అయినట్లు. కేవలం ఉద్యోగ ప్రకటనలిచ్చి తద్వారా భర్తీచేసిన నియామకాలే లెక్కలోకి వస్తాయన్న విషయం ఆర్థికశాఖకు తెలువదనుకోవాలా? పాఠశాల విద్యలో 8,463 పోస్టులు భర్తీచేసినట్లు, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలోని 1,061 ఖాళీల భర్తీకి అనుమతులి చ్చినా ఇప్పటి వరకు ఒక్కపోసు ్టకూడా భర్తీ చేయలేదని తెలిపారు. పాఠశాల విద్యలో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడు టీచర్స్‌తో పాటు, హెడ్మాస్టర్లు, డీఈఓలు, ఎంఈఓలు, బోధనేతర సిబ్బం దితో కలిపి 25,000 ఖాళీలున్నట్లు లోగడ విద్యాశాఖమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి శాసనసభలో ప్రకటించారు. ఇందులో భర్తీ చేసింది. 8,463. చేయవలసింది 16,537. ఆర్థికశాఖ మాత్రం విద్యాశాఖలో 10వేల ఉద్యోగాల వరకే ఉంటాయంటున్నది. అదేం లెక్కో. యూనివర్సిటీలలో భర్తీ చేయమని 1,061 పోస్టులకు అనుమతులిచ్చినా ఒక్కపోస్టుకూడా భర్తీ చేయలేదంటున్నారు. గత ఆరు సంవత్సరాల్లో ఎప్పుడూ సకాలంలో బ్లాక్ గ్రాంటు, జీతాలు, పెన్షన్లు, బకాయిలివ్వని ఆర్థికశాఖ యూనివర్సిటీలపై నిందమోపడం అన్యాయం. రాష్ట్రంలోని 13 యూనివర్సిటీలకు రెండున్నర సంవత్సరాలనుండి వైస్ చాన్స్లర్లు, పాలకమండళ్లు లేవు. అలాంటప్పుడు నియామకాల ప్రక్రియ ఎలా చేపడతారో ఆర్థికశాఖనే వివరించాలి. ఒక్క యూనివర్సిటీలలోనే కాదు ఖాళీలున్నది, డిగ్రీ కాలేజీల్లో 2,730 లెక్చరర్ పోస్టులుంటే ప్రస్తుతమున్నది 1,419. ఖాళీలు 1,311. జూనియర్ కళాశాలల్లో మంజూరు అయిన పోస్టులు 5,278. ఇందులో పనిజేస్తున్న వారు 836. ఖాళీలు 4,442. మొత్తంగా ఉన్నత విద్యలోని బోధన, బోధనేతర ఉద్యోగాలన్నీ కలిపి ఉన్నవి 14,006. ఇందులో పనిచేస్తుంది మాత్రం 3,685. ఖాళీలు 10,321. యూనివర్సీటీలు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కళాశాలలు నడుస్తున్నది పార్ట్ టైమ్, కాంట్రాక్ట్ అధ్యాపకులతోనే అన్నది నగ్నసత్యం. రాష్ట్రం ఏర్పడి ఆరున్నరేళ్లు కావస్తున్నా ఒక్క గ్రూప్1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. అటెండర్, డ్రైవర్, వాచ్‌మన్, స్వీపర్, స్కావెంజర్ లాంటి ఉద్యోగాల భర్తీ చేపట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారం రాష్ట్రంలోని నిరుద్యోగులు 24 లక్షల 54 వేలు. ఇందులో సాంకేతిక విద్యకు సంబంధించినవారు 5,30,128. మిగతావాళ్లు పీజీ, డిగ్రీ, ఇంటర్మీడియెట్, పదోతరగతి వాళ్లు. దేశంలో నిరుద్యోగిత పోస్టు గ్రాడ్యుయేట్లలో 21.6 శాతంగా ఉంటే మనరాష్ట్రంలో మాత్రం అది ఏకంగా 33.9 శాతం. 2013– 14 సంవత్సరాల్లో రాష్ట్రం ఏర్పడే ముందు వీరిలో నిరుద్యోగిత 7.3 శాతం. నాలుగురెట్లకు పైగా పెరిగిందన్న మాట. దీనికి కారకులు ఎవరు? రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు తోడు తాజాగా నిరు ద్యోగుల ఆత్మహత్యలు మొదలైన ఈ తరుణంలో ప్రభుత్వం తాత్సారం చేయకుండా తక్షణమే ఉద్యోగాల భర్తీకై చర్యలు చేపడుతుందని ఆశిద్దాం. ఎన్. రాంచందర్ రావు వ్యాసకర్త ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ -
మాజీ అడ్వొకేట్ జనరల్ మృతి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ న్యాయవాది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్ ఎస్ రామచంద్రరావు గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండె నొప్పితో నేడు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎన్నో సంచలన కేసులను ఆయన వాదించారు. రామచంద్రరావు మరణం పట్ల వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు. -
మీ రాతలు విద్వేషపూరితం కావా?
అమెరికాలో నల్లజాతీయులపై వివక్ష, ఇక్కడ ముస్లి ముల పట్ల వివక్ష ఒక్కటే అని చూపించడం లోనే రచయితల దురుద్దేశం స్పష్టమవుతోంది. హిందూ ముస్లిముల మధ్య గీత గీసి, ఇద్దరూ వేర్వేరు అని చూపించి మతచిచ్చు రగల్చాలనే కుయుక్తులను కుహనా లౌకికవాదులు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఉగ్రవాదులు, మరి కొంతమంది అతివాదుల (పర్వె ర్టెడ్)ను మినహాయిస్తే, హిందూ– ముస్లిం మత సామరస్యానికి ప్రతీక భారతదేశం. గణేశ్ శోభాయాత్రలో ముస్లిములు పాలుపంచుకుంటారు. రంజాన్ రోజు ముస్లిముల ఖీర్‌ను హిందువులు ఆస్వాదిస్తారు. మసీ దులు, దర్గాలకు హిందువులు వెళ తారు. హిందూ దేవాలయాలను ముస్లిములు సందర్శి స్తారు. హిందూ ముస్లిం అనే కాదు; క్రైస్తవులు, సిక్కులు, జైనులు... ఇలా అందరి మధ్య మత సామరస్యం నెలకొన్నది ఒక్క భారతదేశంలోనే. ఇటువంటి సామరస్య భారతంలో మతచిచ్చు రగిలించి, చలి కాచుకోవాలనుకునే నైచ్యం, పైత్యం కొంతమంది కుహనా మేధావులది. అటువంటి రాత లను రాజ్యసభ మాజీ ఎంపీ హుస్సేన్ దల్వాయి, జిందాల్ గ్లోబల్ లా స్కూలు ప్రొఫెసర్ సమీనా దల్వాయి ‘ముస్లింల ప్రాణాలు విలువైనవి కావా?’ పేరిట వండి వార్చారు. అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ హత్య తర్వాత వెల్లువెత్తిన నిరసన వంటిది భారతదేశంలో రావాలని వీళ్లు ఆకాంక్షిస్తు న్నారు. ఇందుకు భారతీయ మెజారిటీ వర్గాలు, ప్రభుత్వాలు నడుం కట్టాలని కూడా కోరుకున్నారు. ఇందుకు కారణం లేక పోలేదు. తమిళనాడులో లాకప్ డెత్ ఘటన అమెరికాలోని జార్జి ఫ్లాయిడ్ కేసును తలపిస్తోందనీ, జార్జి హత్యకు వ్యతి రేకంగా అమెరికాలో మొదలైన ఉద్యమం వంటిది భారత్‌లో కనిపించదేమనీ విద్వేషం రగిలించడానికి ప్రయత్నించారు. తమ అవగాహనా రాహిత్యాన్ని, మనసులోని విషాన్ని బయటపెట్టుకున్నారు. కానీ, తమిళనాడు ఘటనలో చని పోయిన తండ్రీకొడుకులు ముస్లిములు కారు. ఇక, పోలీసుల క్రూరత్వం అనేది ఇప్పుడే మొదలు కాదు. ఇది కొన్ని దశా బ్దాలుగా చర్చల్లో ఉంది. ముస్లిములు మాత్రమే కాదు, అన్ని వర్గాల వారూ కొంతమంది పోలీసుల దుశ్చేష్టలకు బాధి తులే. అందుకే, పోలీసు శాఖలో సంస్కరణలు అనేవి నిరం తర ప్రక్రియగా సాగుతున్నాయి. కొంతమంది వ్యక్తిగత నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యానికి దేశాన్నో మతాన్నో వర్గాన్నో శత్రువుగా చేయడం అత్యంత ఆక్షేపణీయం. ఈ ఘటనకు నిరసనగా అమెరికా తరహాలో దేశంలోనూ ఉద్యమం రావా లని పిలుపునివ్వడం నిస్సందేహంగా దేశద్రోహమే. అమెరికా నల్లజాతీయులపై వివక్ష, ఇక్కడ ముస్లిముల పట్ల వివక్ష ఒక్కటే అని చూపించడంలోనే రచయితల దురు ద్దేశం స్పష్టమవుతోంది. హిందూముస్లిముల మధ్య గీత గీసి, ఇద్దరూ వేర్వేరు అని చూపించి మతచిచ్చు రగల్చాలనే కుయుక్తులను కుహనా లౌకికవాదులు, కుహనా మేధావులు, అర్బన్ నక్సల్స్, కాంగ్రెస్ వాదులు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. షాహీన్‌బాగ్ పేరిట ఇటువంటి ప్రయత్నాన్ని ముమ్మరంగానే చేశారు. కానీ, చివరికి ఓడిపోయారు. ఇటు వంటి ప్రయత్నంలో భాగమే తాజా వ్యాసం కూడా. ఇందు లోనూ శూన్యం నుంచి అగ్గి రగల్చాలనే కుట్ర చేశారు. దేశ విభజనకు ముందు ప్రారంభమైన హిందూముస్లిం ఘర్ష ణకు కారణమెవరో ఈ కుహనా మేధావులే తేల్చాలి. ఆ తర్వాత ఏడు దశాబ్దాలుగా కొనసాగడానికి కారణమెవరో కూడా గుర్తించాలి. అంతే తప్ప, మొత్తం చరిత్రకు వక్ర భాష్యం చెప్పి వాస్తవాల వక్రీకరణకు పూనుకోవడం నిస్సం దేహంగా ఆక్షేపణీయమే. అంతేనా, రచయితల అవగాహన రాహిత్యానికి కూడా ఈ కథనం అద్దం పడుతోంది. నాయ కత్వపరంగా పోలీసు బాసులు బాధ్యత వహించేలా చేసే వ్యవస్థ భారతదేశంలో లేదని ఇద్దరు మేధావులూ పేర్కొ న్నారు. సామాన్యులు పోలీసు అధికారిపై దావా వేయడానికి చట్టం అనుమతించడం లేదని రాశారు. వారిపై చార్జిషీటు ఉండదనీ, ప్రభుత్వమే ప్రాసిక్యూట్ చేసినా అది బల హీనంగా ఉంటుందనీ పేర్కొన్నారు. ఇంతకుమించిన హాస్యాస్పద వాదన మరొకటి ఉండదు. ఇటువంటి ఘట నలు జరిగిన దాదాపు ప్రతి సందర్భంలోనూ బాధ్యులపై చర్యలు ఉంటూనే ఉన్నాయి. కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. శిక్షలు కూడా పడుతున్నాయి. ఎటువంటి రాజకీయ, మత కల్లోలాలకు అవకాశం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలూ గత ఆరేళ్లుగా సుఖసంతోషాలతో కలసిమెలసి జీవిస్తున్నారు. చరిత్రను తిరగరాస్తూ ఐదేళ్ల కిందటి ఎన్నికల ఫలితాలతో పోలిస్తే మరింత మెరుగైన ఫలితాలను 2019లో బీజేపీ సాధించింది. బీజేపీ సొంతంగా 303 సీట్లను సాధిస్తే ఎన్డీయే 353 సీట్లను సాధించింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో అయితే 62 సీట్లను సాధించింది. ముస్లిములు సహా అన్ని వర్గాల ప్రజలూ మోదీ నాయకత్వాన్ని ఆదరించడమే ఇందుకు కారణం. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ నినా దంతో 2014 ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న మోదీ దేశ ప్రజలందరిలో విశ్వాసం కల్పించడమే ధ్యేయంగా ‘సబ్ కా విశ్వాస్’ను 2019 ఎన్నికల సమయంలో జోడించారు. మోదీ మానస పుత్రిక ముద్ర రుణాల పథకంతో లబ్ధి పొందిన ముస్లిములు, ఇతర వర్గాలు ఎందరో. ఉజ్వల వంటి పథకాలను అందిపుచ్చుకున్నవారు ఎందరో. అంతేనా, ముస్లిం మహిళల మెడపై ఎప్పుడూ తలాక్ అనే కత్తి వేలాడుతూ ఉండేది. భర్త ఎప్పుడు వదిలేస్తాడో, తన బతుకు ఏమిటో అనే అయోమయం నెలకొనేది. కానీ, ముస్లిం మహిళల రక్షణకు ప్రధాని మోదీ ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంతోమంది ముస్లిముల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇది ముస్లిములకు వ్యతిరేకంగా రాజ్యం పని చేయడం అవుతుందా? హజ్ కోటా సంఖ్యను రెండు లక్షలకు పెంచారు. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాల్లోని జైళ్లలో మగ్గు తున్న ఎంతోమందిని తిరిగి స్వదేశానికి రప్పించారు. ఏకంగా 5 కోట్లమంది ముస్లిం విద్యార్థులకు వర్తించేలా ప్రత్యేక స్కాలర్షిప్ పథకాన్ని మోదీ అమలు చేస్తున్నారు. వీటి లోనూ 50 శాతం ముస్లిం మహిళలకు కేటాయించారు. ఇది ముస్లింలకు వ్యతిరేకమా? జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేశారు. తద్వారా, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రజలు పొందే ప్రయోజనాలను కూడా జమ్మూ కశ్మీర్‌లోని బీద ముస్లింలు పొందడానికి అవకాశం దక్కింది. ఇది వేర్పాటువాదానికి మద్దతు ఇవ్వడమా? దేశం లోని ముస్లింలలోనూ, పాకిస్తాన్ మినహా ప్రపంచంలోని ముస్లిం దేశాలలోనూ మోదీ పాలన పట్ల విశ్వాసం వ్యక్తమవు తోంది. దీనిని జీర్ణించుకోలేని కొంతమంది కుహనా లౌకిక వాదులు మోకాలికి, బోడిగుండుకు ముడి వేసినట్లు, ముస్లిం వ్యతిరేక భావన తీసుకొచ్చి జాతి విద్వేషానికి ఆజ్యం పోసి చలి కాచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ప్రజల మధ్య విద్వేషాలు ఉంటే వాటిని ఎలా తగ్గించాలని మేధా వులు అనుకునేవాళ్లు ప్రయత్నించాలి. అంతే తప్పితే, విద్వేషాలకు ఏమాత్రం ఆస్కారం లేనిచోట్ల వాటిని ఎగదోసి కృత్రిమంగా పురిగొల్పే ప్రయత్నాలు చేయడం నిర్ద్వంద్వంగా ఖండనార్హమే. వ్యాసకర్త: ఎన్. రామచంద్రరావు, బీజేపీ ఎమ్మెల్సీ, తెలంగాణ -
ట్రాన్స్‌కో సీఎండీని కలిసిన బీజేపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధిక విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ బీజేపీ నేతలు ట్రాన్స్ కో సీఎండీ రఘమా రెడ్డిని బుధవారం కలిశారు. వీరిలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు. సీఎండీని కలిసిన అనంతరం మోత్కుపల్లి మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా ప్రజలెవ్వరూ మూడు నెలలుగా బయటకు రాలేదన్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు వేల రూపాయల కరెంట్ బిల్లులు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం కరెంట్ బిల్లులను మాఫీ చేయాలని కోరారు. కరోనా నియంత్రణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ మొదట్లో ఒక మాట ఇప్పడు ఒక మాట మాట్లాడుతున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. కరోనా రోగులందరికి ప్రభుత్వమే చికిత్సనందించాలని డిమాండ్ చేశారు. (‘కోవిడ్’ కేసుల్లో చార్జ్‌షీట్స్! ) అదేవిధంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ, రావాల్సిన కరెంట్ బిల్లులకంటే రెండు రెట్లు అధికంగా కరెంట్ బిల్లు వచ్చిందన్నారు. కరెంట్ బిల్లులను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సముచితం కాదన్నారు. దీని గురించి ట్రాన్స్‌కో సీఎండీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. (వాహనాలను ఆ మార్గంలో అనుమతించడం లేదు) -
‘టీఆర్ఎస్ మత రాజకీయాలకు పాల్పడుతోంది’
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించిందని ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అన్నారు. ఆయన తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాతూ.. రాష్ట్రంలో టెస్టులు చేయకపోవడాన్నితప్పుపడుతున్నామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తోందని, విమర్శలు కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి 590 టెస్టులు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ఇంత తక్కువ టెస్టులు తెలంగాణలోనే జరుగుతున్నయని అన్నారు. మహారాష్ట్రలో 10 లక్షల మందికి రెండు వేల టెస్టులు జరుతున్నాయని రామచంద్రరావు చెప్పారు. పాతబస్తీలో ఎంఐఎం పార్టీ చేస్తున్న అరాచకాలపై స్పందించకుండా టీఆర్ఎస్ మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు బాధ్యతాయుతంగా తమ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారని రామచంద్రరావు తెలిపారు. (కరోనాతో సహ జీవనం చేయాల్సిందే : మంత్రి) అదేవిధంగా జేపీ నేత డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీసూచనలను పరిగణలోకి తీసుకోకుండామంత్రులు రాజకీయం చేస్తున్నారని ఇది సమంజసం కాదన్నారు. సీఎం కేసీఆర్స్వయంగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని మొత్తం ధాన్యాన్ని 45రోజుల్లో పూర్తి చేస్తామని ఏప్రిల్ 8నప్రకటించారని గుర్తు చేశారు. ఈ రోజు వరకు ధాన్యం ఎంత కొనుగోలు చేశారని ఆమె ప్రశ్నించారు. కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని ఆమె తెలిపారు. మిగతా 75 శాతం ఎప్పుడు కొంటారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది, రోజుల తరబడి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను నష్టాలకు గురిచేస్తోందని ఆమె మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ మొదటి నుంచి హెచ్చరిస్తున్న పెడ చెవిన పెట్టారని ఆమె విరుచకుపడ్డారు. రాజకీయాలు మేం చేయదలిస్తే ఏ ఒక్క మంత్రి బయట తిరగలేరని డీకే అరుణ హెచ్చరించారు. కేంద్రం చర్యల వల్లే రైతులకు నాణ్యమైన కరెంట్ అందుతోందని ఆమె గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ మంచి జరుగుతే తనదే క్రెడిట్ అని, చెడు జరిగితే మాత్రం ఇతరులపైకి నెపం వేయడం అలవాటుగా మారిందని ఆమె మండిపడ్డారు. అవసరమైతే ధాన్యం నిలువకు ఫంక్షన్‌హాల్ తీసుకుంటామన్న వాళ్లు ఎందుకు చేయడం లేదని డీకే అరుణ తీవ్రంగా విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద పట్టికలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదుని ప్రశ్నించారు. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు దీక్షలు చేస్తే దాన్ని కూడా తప్పుపట్టారని అమె మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేయాలని డీకే ఆరుణ డిమాండ్ చేశారు. -
మజ్లిస్‌కు భయపడి వ్యతిరేకంగా ఓటేసిన టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: మతోన్మాద మజ్లిస్ పార్టీకి భయపడే పౌరసత్వ చట్టం సవరణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓటు వేసిందని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, వామపక్షాలు, అర్బన్ నక్సలైట్లు, టీఆర్ఎస్, మజ్లిస్ కలిసి పౌరసత్వ సవరణ చట్టంపై గందరగోళం సృష్టిస్తున్నాయని, ఆలోచన రహితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. 12 శాతం ఓట్ల కోసం సీఎం.. ఒవైసీకి వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవాచేశారు. -
‘టీఆర్ఎస్వి అనైతిక రాజకీయాలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ధ్వజమెత్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీని సాధించాక కూడా విపక్ష పార్టీల ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించి టీఆర్ఎస్లో కలుపుకున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడటం వల్లనే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. -
కిష్కింద కాండ
మా ఊరిలో కోతుల పీడ చాలాఎక్కువ. అలా అంటే కోతులకు కోపం వస్తుందేమోనని నాకు అనుమానం. తట్టుకుని పడితే హంపి. వాలి, సుగ్రీవుడు, ఆంజనేయుడు పాలించిన కిష్కింధ. వారి సామ్రాజ్యాన్నే మేము ఆక్రమించి ఇప్పుడు దాడి అంటే ఎలా? ఆంగ్లేయులే భారతీయులను ‘భారతాన్ని వదలి వెళ్ళండి’ అని చెప్పినట్టు. అందువల్ల మేమందరం ఈ కోతులకు సర్దుకున్నాం. మా మధ్యన అవి కూడా సర్దుకున్నాయి. ఎంతగా సర్దుకున్నా కోతులు కోతులే! పుట్టుకతో వచ్చిన గుణాలను అవి వదులుకుంటాయా? గవాక్షాల ద్వారా తొంగి చూసి, వంటింట్లో పెట్టిన ఆహారాన్ని చూసుకుని, మెల్లగా ఇంట్లోకి దూరి కావలసినదాన్ని పాత్రలతో సహా తీసుకునిపోయి, మళ్ళీ కడగవలసిన అవసరమే లేకుండా తిని, మరొకరి పెరట్లో ఆ పాత్రను పారవేసి, ‘‘మేమేమీ దొంగలం కాదండి...’’ అని రెండిండ్లవారూ కొట్టుకునే జగడపు సన్నివేశాన్ని సృష్టిస్తాయి. ఎవరి పెరట్లో ఏ చెట్టులో ఎలాంటి పళ్ళున్నాయో తెలుసుకుని, ఆ పళ్ళను సరిగ్గా మాగే కాలానికి వచ్చి అన్నీ తిని తేన్చి వెళతాయి. నిప్పులు చెరిగే వేసవిలో ఎక్కడా నీళ్ళు దొరకక నోరు ఎండిపోయి, మేము కొళాయి నీళ్ళు పట్టుకునే కాలానికి మా దగ్గరికి వచ్చి, మేము గుంతలో నిలిచిన నీళ్ళను బకెట్లో పట్టి పెడితే, మేమున్నామనే çస్పృహనే లేకుండా ఒక్కొక్కటిగా వచ్చి నీళ్ళు తాగి వెళతాయి. దీపావళి పండుగ వేళలో టపాసుల ఆర్భాటానికి బెదిరి కంగారు పడి చెట్లలో వణుకుతూ కూర్చుంటాయి. మా ఊరి ఆడవాళ్ళకు వడియాలు, అప్పడాలు చేసే సంబరం.ఆ బళ్ళారి ఎండకు వేరే ఇంకేమి చేయగలరు? వర్షం వచ్చినపుడు పురి విప్పుకుని నృత్యం చేసే నెమళ్ళ సంభ్రమంతో ఆడవాళ్ళు మండే ఎండలో వారి వారి మిద్దెల మీద వడియాలు, అప్పడాలను ఎండకు ఆరబెట్టేవారు. అత్తగారు సేమ్యాలు, వడియాలు, పువ్వు వడియాలు ఎండకు ఆరబెడుతుంటే, చెట్టుకొమ్మ మీద, ఇంటి చూరు మీద కోతులు తమ సంసార సమేతంగా ఎదురుచూస్తుంటాయి. పిల్లలు బెత్తం, ఖాళీడబ్బా, జేగంట, క్యాటర్‌బాల్ పట్టుకుని గొప్పయుద్ధరంగంలో సిద్ధమైన సిపాయిల్లా నిలబడినప్పటికీ వానర సైన్యం ముందు వాళ్ళేం లెక్కకు వస్తారు? అవి పిల్లలనే బెదిరించి వడియాలు, అప్పడాలను ఖాళీ చేస్తాయి. ఒకసారి మా పక్కింటి గృహిణి ఎక్కడో చదివి కోతులకు ఇంగువ మింగుడుపడదనే చిదంబర రహస్యాన్ని అందరికి చెప్పేసింది. ఆడవాళ్ళందరూ రాశులు రాశులుగా ఇంగువ వేసి వడియాలు, అప్పడాలు చేయసాగారు. దాంతో కోతులు ఒక ముక్క కూడా తినలేక ఉమ్మేసి వెళ్ళిపోయాయి. ఆ గృహిణి అయితే ‘నేను చెప్పలేదా?’ అని అందరి దృష్టిలో హీరోయిన్ అయిన సంభ్రమంతో మెరిసిపోయింది. మా అమ్మ, ‘‘అదికాదు, కోతిలాంటి కోతే అసహ్యపడే ఇంగువను మనం కోరికోరి తింటాం కదా... లొట్టలేసుకుంటూ తింటాం కదా...’’ అని సణుగుతూ, మరొక కొత్త శంకను అందరి ముందు పెట్టింది. ఆ రోజు నుంచి ఊరి ఆంజనేయుడికి పంపే నైవేద్యపు వంటకంలో ఇంగువ వేయటం ఆపేసింది. అయితే కోతులు ఎన్ని రోజులు వడియాలు, అప్పడాలు తినకుండా ఉంటాయి? కొద్ది రోజుల్లోనే ఇంగువను అలవాటు చేసుకున్నాయి. వడియాలు, అప్పడాలను తినటం మొదలుపెట్టాయి. అప్పుడు మా అమ్మకు సంతృప్తి కలిగింది. ‘‘బ్రాహ్మణుల వంట అంటే తమాషానా? ఎవరైనా లొంగాల్సిందే’’ అని దర్పంగా మాట్లాడింది. మళ్ళీ ఆంజనేయుడి నైవేద్యానికి ఇంగువ వేయసాగింది. ఊరికి కొత్తగా టీవీ వచ్చినపుడు ప్రజలకు కోతుల దాడి భరించటం అసాధ్యమైంది. వీధిలోని జనమంతా కన్నీరు ప్రవహింపజేసే ఏదో ధారావాహికను చూస్తూ కూర్చునివుంటే, కోతులు యాంటెనా మీద దూకి తెర మీద కేవలం చుక్కలను ఏర్పరిచేవి. జనమంతా ‘హో...’ అని గోలపెట్టసాగారు. మళ్ళీ ఎవరో ఒకరు మేడ ఎక్కి యాంటెనను దశదిక్కులకు తిప్పి, కింద నుంచి, ‘‘సరిగ్గా వచ్చింది, సరిగ్గా వచ్చింది...’’ అంటూ కేక పెట్టిన తరువాత టీవీ చూడానికి పరుగెత్తిపోతే మళ్ళీ పదినిముషాలకంతా మరొక కోతి దాని మీద ఎగిరేది. కొందరు తుమ్మ ముళ్ళను యాంటెనా మీద వేసి చూశారు. ఇంకొందరు భయంకరమైన రంగుల బట్టలను దానిమీద పరిచారు. మరికొందరు ఎత్తయిన కర్రను బిగించి యాంటెనా ఎత్తును పెంచారు. ఏమి చేసినా కోతుల దాడి ఆగలేదు. ప్రజలకు కోతులు ఎంతగా అలవాటైపోయాయంటే, ‘అది మొండితోక కోతికొడుకు’, ‘ఇది కుంటి కాలు కోతి కూతురు’, మొదలైన పేర్లతో గుర్తించేవారు. (కోతి పిల్లలకు తల్లి ఎవరని గుర్తిస్తారే తప్ప తండ్రి ఎవరో గుర్తించే మూర్ఖత్వాన్ని ఎవరూ చేయరు) మా అమ్మ కూడా ఒక కోతిని చాలా అలవాటు చేసుకుంది. మరీ సంప్రదాయపరులమైనందువల్ల స్నానం చేసి, పూజాపునస్కారాలు ముగించే వరకు నోట నీళ్ళు కూడా వేసుకునేవారు కాదు. అయితే దోసకాయ, బీరకాయలు కోసేటప్పుడు దాని రుచిచూసి తీపు–చేదు అని చెప్పడానికి ఎవరో ఒకరి సహాయం కావలసి వచ్చేది. మా చిన్నతనంలో మేము ఆశతో ఆ పని చేస్తున్నప్పటికీ కాస్త పెద్దవారమైన తరువాత లేని పొగరు చూపిస్తూ ’’పోమ్మా, నీవొకటి...’’ అని తప్పించుకునేవాళ్ళం. ఆ పనిని ఈ కోతి సంతోషంగా చేసేది. తియ్యగా ఉంటే చప్పరిస్తూ తినేది. చేదుగా ఉంటే బయిటికి వెళ్ళి ఉమ్మేసేది. అంతా ముగిసిన తరువాత సగం దోసకాయ దానికి ఇస్తే తీసుకునిపోయేది. ఒకసారి మా అమ్మ దురదృష్టానికి కోసిన దోసకాయలన్నీ చేదుగా ఉండాలా? కోతి కోపంతో మా అమ్మ మీద అరవటంతో అమ్మ భయపడిపోయింది. చివరికి గూట్లోఉన్న ఒక కొబ్బరి చిప్పను ఇచ్చి పంపింది. వకీలు సుందరావుగారి తల్లి కాశవ్వకు కోతులంటే చాలా ఇష్టముండేది. ఇంట్లో మిగిలిన సద్ది పదార్థాలన్నీ దాచిపెట్టి కోతులకు ఇచ్చేది. కాయగూరలు అమ్మేవారి దగ్గర కుళ్ళిన టమోటాలు, వంకాయలు వేడుకుని తెచ్చి కోతులకు ఇచ్చేది. మేడ మీద కుండలో ఒకటి రెండు కడవల నీళ్ళు వేసిపెట్టేది. అలాంటి కాశవ్వ చనిపోయినపుడు సుందరరావు హంపిలోని తుంగభద్ర ఒడ్డున కార్యక్రమాలను చేపట్టారు. మిగలిన కార్యక్రమాలన్నీ సుసూత్రంగా జరిగిపోయినా ఎంత ప్రయత్నించినా పిండాన్ని కాకి ముట్టలేదు. ఇంట్లో వాళ్ళందరూ ఏవేవో ఆశలు చూపించి వేడుకున్నా కాకరాయుడు వచ్చి పిండం ముట్టలేదు. పురోహితులు ’’ఈ రోజు చాలామంది కర్మలు చేశారు. అందుకే కాకులంతా పిండాలు తిని తిని పొట్ట నింపుకున్నట్టు కనిపిస్తోంది. ఏదీ రావటం లేదండి’’ అని ఓదార్చారు. సుందరరావుగారు చివరికి విసిగి ‘‘తొందరగా వచ్చి భోజనం చేయమ్మా, మా భోజనానికి ఆలస్యం చేయకు’’ అని వేడుకుని నిస్సహాయంగా కూర్చున్నారు. కొద్దిసేప్లోనే ఒక కోతివచ్చి ఆ పిండాన్ని ఎత్తుకునిపోయింది. జనం ‘‘ఏ...ఏ...’’ అని అరిచేలోపే కోతి పరారయ్యింది. జరిగిన సంఘటన వల్ల బెదిరిపోయిన పురోహితులు ‘‘కాకి పిండానికి బదులుగా కోతి పిండం అయిపోయింది కదండి’’ అని చేతులు నలుపుకున్నారు. అందుకు సుందరరావుగారు, ‘‘మా అమ్మకు కాకుల కన్నా కోతులమీద ప్రేమ ఎక్కువలెండి. మంచే జరిగింది’’ అని జవాబిచ్చారు. ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ గుహలో నరసింహస్వామి దేవస్థానం ఉంది. నరసింహుడు కొండ గుహలో కాకుండా ఇంకెక్కడ ఉండానికి సాధ్యం? చుట్టుపక్కల అడవి ఉన్న కారణంగా ఇక్కడ కోతులు గుంపులు గుంపులుగా ఉండేవి. పట్టణ కోతులకన్నా ఇవి బలమైనవి. భక్తాదులు ఇచ్చే కొబ్బరి, అరిటిపళ్ళ కారణంగా దేవస్థానం చుట్టుపక్కలంతా సంచరిస్తుంటాయి. మేము పిల్లలం వాటి చేష్టలను చూడటంలోనే సంతోషపడేవాళ్ళం. ఒకసారి ఒక చిన్న కోతిపిల్ల గరుడస్తంభం దగ్గర కూర్చునివుంది. చుట్టుపక్కల ఏ కోతి కనిపించకపోవటంతో నాకు ధైర్యం వచ్చింది. అరుగు కింద వేలాడబడిన దాని తోకను సద్దు చేయకుండా వెళ్ళి లాగాను. చెట్టుమీద ఆ కోతిపిల్ల తల్లి ఎక్కడ కూర్చునివుందో తెలియదు. ఎగిరొచ్చి నా చేతిని రక్తం వచ్చేలా గోళ్ళతో గీరి తన బిడ్డను ఎత్తుకుని పారిపోయింది. నేలానింగీ ఏకమయ్యేటట్టు ఏడ్చాను. గుడిలో ఉన్నవారందరూ పరుగున వచ్చారు. రక్తం కారుతున్న నా చెయ్యి చూసి మా అమ్మకు దుఃఖం కలిగింది. ‘‘నువ్వేం చేశావు?’’ అని అడిగింది. నేను అత్యంత అమాయకంగా, ‘‘నేనేమీ చేయలేదు. మౌనంగా నుంచున్నాను. అదేవచ్చి గీరి వెళ్ళింది’’ అని అబద్ధం చెప్పాను. అమ్మ బాధను భరించలేక నా రక్తం కారుతున్న చెయ్యిని చెట్టు మీద తన బిడ్డతో కూర్చున్న కోతికి చూపించి ‘‘నీ ఇల్లు పాడైపోను. పిల్లల్ని కన్న నువ్వూ ఇలా బిడ్డకు గాయం చేశావుకదా?’’ అని దానికి శాపనార్థాలు పెట్టింది. గాయానికి తడిబట్టను కట్టి, నా ఏడ్పులోని ఆర్భాటమంతా తగ్గిన తరువాత ఎందుకో మా అమ్మకు అనుమానం వచ్చి ‘‘నువ్వేం చేశావో నిజం చెప్పు. అబద్ధాలు చెప్పకు’’ అని గద్దించటంతో మెల్లగా పిల్లకోతి తోకను లాగిన విషయం కక్కాను. మా అమ్మకు కోతిని శపించిన తన కృత్యానికి భయంవేసి మరుసటి రోజున ఆంజనేయస్వామికి శెనగపప్పు వడల దండను వేయించింది. ఇప్పటికీ నా చేతి మీద ఆ కోతి గీరిన గాయపు మచ్చ అలాగే ఉంది. అప్పటి నుంచి పిల్లకోతి తంటాలకు వెళ్ళలేదు. కోతి పిల్లనుకానీ, చిన్నపిల్లల బుగ్గలు నిమిరేటప్పుడూ వాళ్ళ అమ్మల వైపు ఓరచూపు చూసి గట్టిగా నిమిరానని కోప్పపడలేదని నిర్ధారించుకునేవాణ్ణి. ఈ నరసింహస్వామి దేవస్థానం దగ్గర్లోనే ఒక అరుగు ఉంది. ఆడవాళ్ళు తల జుట్టు విప్పుకుని ఈ అరుగుకింద కూర్చుంటే చాలు ఏదో ఒక కోతి అరుగుమీద కూర్చుని పేలు చూస్తుంది. దొరికిన పేనును గుటుక్కున నోట వేసుకుంటుంది. పక్కన దాని పిల్ల వచ్చి కూర్చుంటే దాని నోటికి ప్రేమగా ఒకటి రెండు పేన్లను ఇస్తుంది. అయితే ఇలా పేలు చూస్తున్నప్పుడు ఆడవాళ్ళు తలెత్తి అటూ ఇటూ కదిలిస్తే దానికి చాలా కోపం. ప్చ్‌మని తలమీద ఒక్కటిచ్చేది. దాని దెబ్బకు ఆడవాళ్ళు భయపడుతున్నప్పటికీ, అది తన సూక్ష్మమెన కళ్ళతో మరీ చిన్నగా వున్న పేనును సహితం పట్టి కుక్కుతుండటం వల్ల అరుగు కిందికి వెళ్ళి కూర్చునేవారు. సీతక్క అని మా పెద్దమ్మ ఒకరుండేవారు. ఆమె హరపనహళ్ళి ఆడపిల్ల. మహా గయ్యాళి. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ఆమె నోరుకి భయపడుతారు. అలా సీతక్క ఒకసారి తన తలజుత్తు విరబోసుకుని వెళ్ళి అరుగుకింద కూర్చుంది. కోతి యథాప్రకారం వచ్చి పేలు చూడసాగింది. ఎందుకో తలా కదిలించినందుకు కోపగించుకున్న కోతి ప్చ్‌మని ఆమె తల మీదొక దెబ్బ వేసింది. సీతక్క ఊరుకుంటుందా? అక్కడే పక్కనే ఉన్న చింత బరికెను తీసుకుని దానికి బొబ్బలు లేచేలా వాయించేసింది. కలవరపడ్డ కోతి బాధతో అరుస్తూ పారిపోయింది. ఆడవాళ్ళంతా ‘‘చూశారేమే ఆమె గట్టితనం? కోతిని కూడా వదల్లేదు మహాతల్లి...’’ అని మాట్లాడుకున్నారు. మొదటే దైవభక్తిగల మా అమ్మకు కోతిని సీతక్క ఇలా కొట్టడం భయాన్ని కలిగించింది. ‘‘అదికాదు సీతక్కా, కోతి అంటే సాక్షాత్ ఆంజనేయస్వామి ఉన్నట్టేకదా, నువ్వు ఇలా కొట్టవచ్చా?’’ అని అడిగింది. సీతక్క ఎలాంటి సంకోచం లేకుండా ‘‘అది సాక్షాత్ ఆంజనేయస్వామి అయితే నేను సాక్షాత్ సీతమ్మను. తోక ఊపితే కత్తిరిస్తాను’’ అని చెప్పటంతో మా అమ్మ మళ్ళీ నోరెత్తలేదు. సంవత్సరానికి ఒకటి రెండుసార్లు బంధుబలగంతో, స్నేహితులతో కలిసి నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళి నైవేద్యమిచ్చి రావడం మాలో అలవాటు. బియ్యం, బెల్లం, మొదలైన ఆహార సామాగ్రులు, పాత్రలు ఎద్దుల బండిలో వేసుకుని పోయి, అక్కడే వంట చేసుకుని, నైవేద్యం సమర్పించి, కాలువ నీళ్ళతో పాత్రలు కడుక్కుని తిరిగొస్తాం. ఉదయం వెళితే సాయంత్రం వరకు అక్కడే ఉంటాం. అక్కడ మేమంతా మైదానంలో భోజనానికి కూర్చుంటే కోతులు ఊరుకుంటాయా? అందుకు మా దగ్గర ఒక ఉపాయం ఉంది. అడవిలో భోజనానికి కూర్చునే సమయానికి నాలుగైదు సేర్ల వేరుశెనగకాయలను దగ్గర్లోని సరిగ్గా చల్లి వస్తాం. కోతులకు మా ఇంగువ వాసన భోజనం కన్నా వేరుశెనక్కాయలు ఇష్టం. తమ సంసార సమేతంగా అడవిలో ఈ కాయలను ఏరుకుని తినడానికి వెళతాయి. మా అందరి భోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతాయి. రోజూ ఉష్...ఏయ్...అని కోతులను కసురుకున్నా, అవి మరణించినపుడు వాటికి ఎక్కడలేని డిమాండ్. మామూలుగా వయస్సు మీరి చనిపోయిన కోతులను ఎవరూ అంతగా గమనించకపోయినా విద్యుత్ఘాతానికి గురై మరణించిన కోతుల శవాలకు వైభవం ఎక్కువ. భిక్షగాళ్ళు కూడా శవసంస్కారానికి పదిపైసలు ఇస్తారు. పూలహారంతో అలంకరించి, అగరొత్తులు వెలిగించి, కొత్తబట్టలో చుట్టి, నలుగురు మనుషులు భుజాల మీద శవాన్ని మోసుకుని వెళుతుంటే, చెట్లమీద, ఇండ్ల చూరుమీద కూర్చున్న కోతులు కలవరపాటుతో చూస్తాయి. ఈ మధ్యన చాలా సంవత్సరాల తరువాత ఊరికి వెళ్ళినపుడు నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళాను. యథాప్రకారం కోతులు అక్కడ ఉన్నప్పటికీ బాగా చిక్కిపోయినట్టు కనిపించాయి. మునుపట్లా కోతిచేష్టలూ లేకుండా నిశ్శక్తితో బలహీనంగా కనిపించాయి. ఎందుకో వాటి పరిస్థితి చూసి చాలా బాధవేసింది. అర్చకులను విచారించినపుడు కొన్ని వాస్తవాలు తెలిపారు. ‘‘అడవిలో ఉండే అన్ని పండ్లచెట్లను ప్రభుత్వం కౌలుకు ఇస్తూ ఉంది. సీతాఫలం, ఉసిరికాయ, వెలగకాయలు, చింతకాయలు... అన్ని రకాల పండ్ల చెట్లనూ జనం కౌలుకు తీసుకున్నారు. రాత్రీపగలూ కాపలాకాసి పంటను కోసుకుని పోతారు. అంతేకాకుండా కొండను తవ్వితవ్వి మైన్స్‌గా మార్చి చెట్లన్నీ నరికి కూర్చున్నారు. కోతులు ఏం తినివుంటాయో చెప్పండి? ఇదొక్కటే చాలదన్నట్టు వన్యమృగ సంరక్షణ చేయాలని నాలుగైదు చిరుతలను తెచ్చి అడవిలో వదిలారు. అవి రోజూ రాత్రి ఒకో రెండో కోతులను చంపి తింటాయి. భయంతో కోతులు నిద్రకూడా పోకుండా హెచ్చరికతో రాత్రి గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొరబాటున నిద్రపోయినా, చిరుత ఒక్కసారి గర్జిస్తే చాలు. భయపడి చెట్టు మీది నుంచి పట్టుతప్పి కింద పడిపోతాయి’’ అని బాధపడ్డారు. కేవలం భక్తాదులు ఇచ్చే కొబ్బరి, అరిపళ్ళతోనే కోతులు ఎలా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమో చెప్పండి? సీతక్క ఎలాంటి సంకోచం లేకుండా ‘‘అది సాక్షాత్ ఆంజనేయస్వామి అయితే నేను సాక్షాత్ సీతమ్మను. తోక ఊపితే కత్తిరిస్తాను’’ అని చెప్పటంతో మా అమ్మ మళ్ళీ నోరెత్తలేదు. ఈ మధ్యన చాలా సంవత్సరాల తరువాత ఊరికి వెళ్ళినపుడు నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళాను. యథాప్రకారం కోతులు అక్కడ ఉన్నప్పటికీ బాగా చిక్కిపోయినట్టు కనిపించాయి. కన్నడ మూలం : వసుధేంద్ర అనువాదం: రంగనాథ రామచంద్రరావు -
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. విష జ్వరాలపై వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించారని తెలిపారు. ఒక్కో ఆసుపత్రి మంచంపై ముగ్గురు పేషంట్లని పడుకోబెడుతున్నారని అన్నారు. ప్లేట్ లెట్స్ పడిపోవడంతో నిరుపేదలు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీలో విష జ్వరాలకు మెరుగైన చికిత్స లేదని, పేదలకు ప్రైవేట్‌లో వీటి చికిత్సకు భారం అవుతుందని అన్నారు. విష జ్వరాలపై జిల్లా కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వాలని, బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. విషజ్వరాలపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రారావు కోరారు. శనివారం మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో వందలాది మంది రోగులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. విష జ్వరాలు, డెంగ్యూల అంశంపై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం బాధాకరమన్నారు. -
బీజేపీకి 300 సీట్లు ఖాయం
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు నాయుడు, సీఎం కేసీఆర్ ఇద్దరూ ఓటమికి భయపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు మండిపడ్డారు. గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కోర్ కమిటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు ప్రణాళిక మీద ఈ సమావేశంలో చర్చించామని అన్నారు. అనంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ... పశ్చిమ బెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా మీద జరిగిన దాడిని కోర్ కమిటీ తీవ్రంగా ఖండించిందని తెలిపారు. మమతా బెనర్జీ.. ఒక ప్రధాన మంత్రి మోదీని సైతాన్, రౌడీ అనడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 300 పైగా సీట్లుతో బీజేపీ గెలుస్తుందని అన్నారు. తెలంగాణలో రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా సీట్లు, ఓట్లు పెంచుకుంటుంది. కేసీఆర్ ప్రభుత్వం మీద.. పోరాటాలు తయారు చేస్తున్నామని చెప్పారు. ఇంటర్ విద్యార్థుల వ్యవహారం లో.. ఉద్యమం కొనసాగుతుంది. త్వరలోనే హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలుస్తామని చెప్పారు. -
ఓటమి భయంతోనే కిషన్‌రెడ్డిపై ఆరోపణలు’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమి తప్పదనే భయంతోనే టీఆర్ఎస్ అభ్యర్థి తల సాని సాయికిరణ్ ఎన్నికల ఏజెంట్ తప్పుడు ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు వెళ్లారని ఎమ్మెల్సీ రామచందర్‌రావు విమర్శించారు. పార్టీ అవసరాల మేరకు లీగల్‌గా బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేస్తే దాన్ని కుట్ర తో కిషన్‌రెడ్డికి ఆపాదించడం దురదృష్టకరమని, ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని బుధవా రం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
తెల్లమొహం
ఇప్పుడిప్పుడు కొందరు తెల్లకోటూ, నల్లలాగూ వేసుకుని డాన్సులకీ ఈవినింగ్ పార్టీలకీ వెడుతున్నారు కానీ స్వచ్ఛమైన బ్రిటిషర్ దాన్ని డిజె కింద లెక్కకట్టడు... బోయ్ విశాలమైన డ్రాయింగ్ రూమ్‌లో ప్రవేశించి అణకువగా ఒక పక్కన నుంచున్నాడు. టీ ముగించి మెత్తని సోఫాలో మునిగిపోయి బి.బి.సి. రేడియో వింటున్న పేట్రావ్ ‘‘ఏం కావాలి?’’ అన్నట్టు అతనివైపు చూశాడు. ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకునే రోజుల్లో స్నేహితులు ప్రతాపరావుని పేట్ అని ఇంగ్లీషు సంప్రదాయంలో పిలిచేవారు. ఇండియా వచ్చిన తర్వాత పేట్రావ్ అయింది. ‘‘మాస్టర్, బాత్ రెడీ’’. పడక గదికి ఆన్చికట్టిన స్నానాల గదికి వెళ్లడానికి పేట్రావ్ లేచాడు. అప్పుడే ఇస్త్రీ చేసిన డిన్నర్ జాకెట్ పక్కమీద పరిచి ఉంది. డ్రెస్సింగ్ టేబిల్ పక్కనున్న సోఫాకి ముందు పోలిష్ చేసిన నల్లజోళ్లూ, వాటిమీద నలుపురంగు సాక్సూ ఉన్నాయి. ‘‘బోయ్’’ అరిచాడు పేట్రావ్. ‘‘తెల్లషార్క్ స్కిన్కోటు ఎందుకు తీశావ్?’’ ఒక్క నిమిషం బోయ్ తటపటాయించాడు. ‘‘మాస్టర్ పోయినసారి నల్ల డి.జె. వేసుకున్నారు’’ అన్నాడు. ఒక పార్టీకి నల్లడిన్నర్ జాకెట్ వేసుకుంటే, తరువాత దానికి తెల్ల డి.జె. తీసి ఉంచమని తనే ఆదేశించాడు. అయితే ఈ పార్టీ ప్రత్యేకమైంది. బోయ్‌కి చెప్పడం మర్చిపోయాడు. అయినా అప్పుడప్పుడు ఆ మాత్రం కోప్పడ్డంలో తప్పులేదు. పేట్రావ్కి బోయ్ అంటే అభిమానం. బోయ్ తెలుగువాడే, పేరు లోపరాజు. ఎన్నో ఏళ్లు దొరలకింద పనిచేసి బోయ్ అన్నపేరు గడించుకున్నాడు. పదిహేనేళ్ల క్రితం హంటర్ దొర రిటైరై ఇండియా నుండి ఇంగ్లండు వెళ్లిపోతూ పేట్రావ్కి బోయ్ని సిఫార్సు చేశాడు. ‘‘ఫరవాలేదు, పనికొస్తాడు. ఇంగ్లీషు అర్థం అవుతుంది. కొంచెం మాట్లాడగలడు కూడా. అయితే నీ విస్కీ ఒక కంట కనిపెట్టుకో పేట్’’ అని నవ్వాడు హంటర్. మాస్టర్ పొద్దున మేడమ్ గది విడిచి, తన గదిలోకి వచ్చినప్పటినుండీ ఆఫీసుకు పోయేవరకూ అన్ని అవసరాలూ బోయ్ చూస్తాడు. మాస్టరు నైట్‌గౌన్, పైజమాలు విప్పడం దగ్గర నుండి తలకి నూనె, ఆఫీసు బట్టలు వేసుకోడం వరకూ ప్రతి విషయంలోనూ సాయపడతాడు. మాస్టర్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం తింటాడో వంటవాడికి చెబుతాడు. మాస్టర్‌కి ఎన్ని గంటలకి కారు తయారుగా ఉండాలో డ్రైవర్‌కి చెబుతాడు. ‘‘నేను తప్ప ఇవాళ పార్టీకి వచ్చేవాళ్లంతా తెల్లవాళ్లే.’’ నల్ల డి.జె. వేసుకోవడానికి కారణం వివరించడానికి ప్రయత్నించాడు పేట్రావ్. ఇటువంటి విషయాలు చెప్పేటప్పుడు బోయ్ ఎంతో సన్నిహితుడనిపించేది. పేరు పెట్టి పిలవాలనిపించేది. ఏళ్ల తరబడి అలవాటుపడ్డ సంస్కారం, ఇండియాలో పనిచేసిన ఇంగ్లీషువాళ్ల సంస్కారం అడ్డు వచ్చేది. ‘‘ఇప్పుడిప్పుడు కొందరు తెల్లకోటూ, నల్లలాగూ వేసుకుని డాన్సులకీ ఈవినింగ్ పార్టీలకీ వెడుతున్నారు కానీ స్వచ్ఛమైన బ్రిటిషర్ దాన్ని డిజె కింద లెక్కకట్టడు’’ అన్నాడు. బోయ్ ముగ్ధుడై వింటున్నాడు. ఇది కొత్త విజ్ఞానం. రేపు స్నేహితుల్తో కబుర్లలో దొర్లించవచ్చు. బోయ్ షార్క్స్కిన్ కోటు తీసి పార్టీరోబ్లో తగిలించి వికూవాగుడ్డతో కుట్టిన నల్ల డి.జె. కోటు బయటికి తీశాడు. తొట్టిలో మూడువంతులు వేడినీళ్లు పట్టి ఉంచాడు బోయ్. వేడిచూసుకొని తృప్తిగా దిగాడు పేట్రావ్. శరీరం బయటా, లోపలా సుఖంగా ఉంది. ఆలోచనలు రాత్రి కాక్టైల్ పార్టీమీదికి పోయాయి. మిస్టర్ అండ్ మిసెస్ స్టూవర్ట్, రగ్గర్ ఫుట్‌బాల్ పోటీల్లో గెలిచిన క్లబ్బు జట్టుకి రాత్రి ఏడూ, పదకొండూ గంటల మధ్య క్లబ్ బ్రిడ్జిరూమ్లో పార్టీ ఇస్తున్నారు. అతిథుల్లో తనొక్కడే ఇండియన్. రగ్గర్ జట్టులో ఇండియన్ లేనేలేడు. ఇండియన్ మెంబర్లకి ఇది అసంతృప్తి కలిగించింది. తెల్లవాళ్లంతా కలిసి ఇండియన్లకి చోటు లేకుండా చేసేరన్నారు. ‘‘చేత కాని కబుర్లు’’ అనుకున్నాడు పేట్రావ్. ఈమధ్య వ్యాపారంలో పడి పట్టించుకోకపోవడం వల్ల నిజానిజాలు చెప్పలేడు. కానీ పదిహేనేళ్ల క్రితం తను రగ్గర్ జట్టులో ఉన్నాడు. సమాజంలో సరైన స్థానం ఉన్న ఇండియన్కీ బ్రిటిషరు ప్రాణం పెట్టగలడు. వచ్చిన చిక్కల్లా సంస్కారం సరిపోకుండా పెద్ద ఎత్తుల మీద మనసు పెట్టుకుని కూచున్నవాళ్లకే. ఏడు అవుతోంది. తొట్టిలో నీళ్లు బయటికి వదిలి, షవర్ తిప్పి తొందరగా బయటపడ్డాడు. పేట్రావ్ డిన్నర్ జాకెట్ వేసుకుని నిలువుటద్దం లో చూసుకుని మురిసిపోయాడు. కోటు ఫేసింగ్ తళతళ మెరుస్తోంది. పాంట్ బ్రైడింగ్ సున్నితంగా ఉంది. షర్టు కాలరూ, బౌ టై, తీర్చిదిద్దినట్టు అమరాయి. తక్కువయిందల్లా కోటు కాలరుకున్న బటన్ హోలులో కార్నేషన్ పువ్వు. ఈ వేడి దేశంలో కార్నేషన్ మొక్కలు మొలవవు. ఎర్రగులాబీని అలంకరించుకున్నాడు. పోర్టికోలోకి దారి తీశాడు. డ్రైవరు, జాగ్వార్ కారు వెనుక తలుపు తీసి పక్కగా నుంచున్నాడు. ∙∙l పేట్రావ్ వెళ్లేసరికే బ్రిడ్జిరూమ్ జనంతో కిటకిటలాడుతూ ఉంది. అయితే అంతా నల్లకోట్లలో లేరు. లౌంజ్సూట్లలో వచ్చినవాళ్లూ, సాదాకోటు పేంటులవాళ్లూ ఉన్నారు. మిస్టర్ స్టూవర్డ్ అతన్ని ఆహ్వానించి బార్ దగ్గరికి తీసుకు వెళ్లాడు. ‘‘నీ డ్రింక్ ఏమిటి పేట్?’’ ‘‘విస్కీ అండ్ సోడా’’ పేట్రావ్ గదంతా కలయజూశాడు. వెళ్లి ఎవరితోనైనా చేరడానికి సందేహించాడు. పేట్రావ్ దృష్టి గోడమీద నోటీసు మీదకి పోయింది. ‘‘గదిలో పర్మిట్ ఉన్నవాళ్లు మాత్రమే తాగవచ్చు’’. అతనికి నవ్వొచ్చింది. పర్మిట్ లేకుండా ఎందరు ఇక్కడ తాగడం లేదు? తనకి మాత్రం ఉందా? తనకి పర్మిట్ లేని సంగతి ఏ కొద్దిమందికో కానీ తెలియదు. ‘‘పేట్ని పర్మిట్ అడిగితే ప్రొహిబిషనే ఎత్తించేస్తాడు’’ అని నవ్వుతారు. తనకి గుండెజబ్బు. ‘‘నీకు నేను సర్టిఫికెటు ఇవ్వను, ఇంకే డాక్టరూ ఇవ్వకుండా చూస్తాను’’ అని ప్రతిజ్ఞ పట్టేడు డాక్టరు. ‘‘ఇంతమందిలో ఒంటరిగా కాలం వెళ్లబుచ్చేస్తున్నానే’’ అనిపించింది. రీటా ఢిల్లీలో ఏం చేస్తుందో? రీటా, సుశీ ఇద్దరూ రెండేళ్లు తండ్రితో ఇంగ్లాండులో గడిపివచ్చారు. పెళ్లయేవరకు ఒకే సమాజంలో పెరిగారు. అయినా ఇద్దరి మనఃప్రవృత్తుల్లో ఎంత భేదం! రీటాకి ఇంగ్లీషు అలవాట్లంటే అభిమానం. సుశీకి గిట్టదు. ‘‘ఈ ఆకతాయి వెధవలంతా హక్కు ఉన్నట్టు నీతో డాన్సు చెయ్యడానికి తగవులాడుకుంటూ ఉంటే నవ్వుతూ ఊరుకుం టావేం?’’ అని రీటాని అడిగింది సుశీ. పెళ్లికాని కుర్రకారుకి సరదాగా ఉండే ఆడవాళ్లని చూస్తే మతిపోయే మాట నిజమే. ‘‘బ్రిటిష్ కమ్యూనిటీలో నాకున్న స్థానం రీటావల్ల కాదుగదా?’’ నీరసంగా ఒక మూల చేరి విస్కీ చప్పరించడం మొదలుపెట్టాడు. ∙∙l పార్టీ హెచ్చుతోంది. కబుర్లు అరుపుల్లోకి దిగాయి. బీర్, రమ్, షెర్రా హరించుకుపోతున్నాయి. రగ్గర్ ఫుట్‌బాల్ పోటీలో అగ్రస్థాయి ఆట ఆడిన డంకన్ హార్వీని తమాషాగా దుయ్యబడుతున్నారు. ‘‘ఇన్ని ఫ్రీకిక్స్ని గోలులోకి తన్నేవే, ఈ విస్కీ బుడ్డీని తన్నగలవా?’’ మత్తులో తల ఎగరేశాడు డంకన్. కాలిజోడుతో గోడకి తన్ని ముక్కముక్కలుగా చేసేశాడు. అకస్మాత్తుగా డంకన్ కళ్లు ఎడంగా ఉన్న పేట్రావ్ మీదకి పోయాయి. ‘‘ఇక్కడికి నల్లవాడెలా వచ్చాడు?’’ అందరి మొహాలూ పేట్రావ్ వైపు తిరిగాయి. ‘‘ఈ హోటల్లో నల్లవాళ్లకి తావులేదు.’’ ‘‘నేనిక్కడికి ఆహ్వానం మీద వొచ్చేను’’ ‘‘ఏదీ ఆహ్వానం?’’ అతను తీసుకురాలేదు. స్టూవర్ట్ని అడగమన్నాడు. ‘‘మేం ఎవర్నీ అడగం. నీకు తాగడానికి పర్మిట్ ఉందా?’’ చిక్కులో పడ్డాడు. ‘‘నాకు పర్మిట్ అక్కర్లేదు’’ ‘‘ఊరికే పేలకు’’ అని పేట్‌రావు రెక్క పట్టుకుని ఈడ్చడం ప్రారంభించాడు డంకన్. ‘‘నా అతిథిని అవమానపరచడానికి డంకన్‌కి ఏం అధికారం ఉంది?’’ గర్జించాడు స్టూవర్ట్. ‘‘పేట్రావ్కి క్షమాపణ చెప్పుకోండి’’. ‘‘నల్లతోలుకి క్షమాపణ చెప్పుకోవలసిన అగత్యం మాకులేదు’’ పేట్రావ్ ఇంట్లో తెగతాగే డంకన్ హార్వీయేనా మాట్లాడుతున్నది! స్టూవర్ట్ తెల్లబోయాడు. మిసెస్ స్టూవర్ట్ మొగుణ్ని లాంజ్‌లో కూర్చోబెట్టి హితబోధ చేసింది. ‘‘నీకు డంకన్ ముఖ్యమా, పేట్ ముఖ్యమా? డంకన్‌కి మనవాళ్లలో ఉన్నస్థానం నీకు తెలుసుకదా. పమీలా కోసమైనా నువ్వీ మొండిపట్టు మానెయ్యాలి.’’ పమీలా వాళ్ల కూతురు. డంకన్ మీద మనసు పెట్టుకుని కూచుంది. హార్వీకి పెద్ద ఉద్యోగం ఉంది. అందం ఉంది. స్టూవర్ట్ గొంతు మూగపోయింది. మిసెస్ స్టూవర్ట్ యువకుల దగ్గరకు వెళ్లి అంది. ‘‘జాన్‌కి కొంచెం తలనొప్పిగా ఉంది. ఇక్కడికి రాలేనందుకు క్షమాపణ చెప్పమన్నాడు. మిమ్మల్ని మిగిలిన డ్రింక్ తాగేసి మజా చేసుకోమన్నాడు.’’ వాళ్ల మొహాలు కళకళలాడాయి. తృప్తిగా గ్లాసులు నింపుకుని పాట ప్రారంభించారు. ‘‘హి ఈజ్ ఎ జోలీ గుడ్ ఫెల్లో’’. బయట ఆవరణలో కారుకోసం వెతుక్కుంటున్న పేట్రావ్ని పాట కలత పెట్టింది. తన ఇంట్లో ఇవే గొంతుకలు, ఇదే పాట తన గురించి పాడాయి. నల్లటి జాగ్వార్ కారు చిక్కని చీకట్లో కనిపించలేదు. దానిమీద పడి చేతికి చిన్నగాయం తగిలించుకున్నాడు. సి.రామచంద్రరావు (సాటి ఇండియన్‌కు మాస్టర్ అయినా, ఎంత ఇంగ్లీషీకరణ చెందినా భారతీయుడికి ఇంగ్లీషువాడి దగ్గర ‘బోయ్’కి మించిన గౌరవం దక్కదని చెప్పే కథ సి.రామచంద్రరావు ‘నల్లతోలు’. దాని సంక్షిప్తం ఇది. ప్రధానంగా టీ ఎస్టేట్ అనుభవాల నేపథ్యంలో పొదుపుగా కథలు రాసిన సి.రా. కథాసంపుటి ‘వేలుపిళ్లై’. 1931లో జన్మించిన ఆయన నివాసం హైదరాబాద్.) -
రాంచందర్‌రావు టీఆర్ఎస్ ఎమ్మెల్సీనా!
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావును ఉన్నతాధికారులు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధిగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో మాత్రం ఆయనను బీజేపీ ఎమ్మెల్సీ అని అధికారికంగా పేర్కొన్నా రు. సిబ్బంది, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ఇలా బయటపడింది. కేరళ వరద బాధితులకు రాష్ట్రం లోని 34 మంది ఎమ్మెల్సీలు నెల వేతనాన్ని విరా ళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్సీల తరఫున సీఎం కేసీఆర్‌కు శుక్రవారం అంగీకారపత్రం ఇచ్చారు. దీని ప్రకారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్ శనివారం ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులో 34 మంది ఎమ్మెల్సీ పేర్లను వరుసగా పొందుపరిచింది. జాబితాలో చివరలో ఎన్.రాంచందర్‌రావు పేరు పక్కన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అని పేర్కొన్నారు. ఐపీఎస్ అధికారుల విరాళం కేరళలో సహాయ, పునరావాస చర్యల కోసం రాష్ట్రంలోని ఐపీఎస్, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చా రు. ఈ విరాళాన్ని కేరళ సహాయ నిధి కోసం కేటాయిస్తూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి(ఎఫ్పీ) ఎన్.శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
'టీడీపీ హత్యా రాజకీయాలకు పుట్టినిల్లు'
-
రాష్ట్రంలో రాచరికం వైపు పాలన
బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాలన ప్రజాస్వామ్యం నుంచి రాచరికం వైపు వెళ్తోందని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భద్రాచలంలో సీతారాముల కల్యాణం సందర్భంగా తమ కుటుంబం వారే పూజలు జరపాలని, తలంబ్రాలు అందించాలని సీఎం కేసీఆర్ భావించడం సరికాదన్నారు. సీఎం హాజరుకాలేకపోతే మరో మంత్రికి అవకాశం ఇవ్వకుండా, కేసీఆర్ మనవడు అక్షింతలు అందజేయడం సరికాదన్నారు. -
బకాయిల తెలంగాణగా మార్చొద్దు
-
బకాయిల తెలంగాణగా మార్చొద్దు
బడ్జెట్‌పై చర్చలో బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయడం సంగతేమోగానీ, బకాయిల రాష్ట్రంగా మాత్రం మార్చొద్దని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ప్రభుత్వానికి సూచించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శుక్రవారం శాసనమండలిలో మాట్లాడారు. ప్రభుత్వం తెచ్చిన రుణాలు భవిష్యత్తులో ప్రజలకు భారంగా పరిణమించకూడదని సూచించారు. గత మూడేళ్లుగా బడ్జెట్ అంచనాలకు, వ్యయానికి ఎంతో వ్యత్యాసం కనిపిస్తోందని పేర్కొన్నారు. 2016–17 బడ్జెట్లో చేసిన కేటాయింపుల్లో నీటిపారుదలకు 39 శాతం, సాంఘిక సంక్షేమానికి 51 శాతం, పంచాయతీరాజ్‌లో 34.7 శాతం, పాఠశాల విద్యలో 4 శాతం నిధులు ఖర్చు చేయలేదన్నారు. యూపీలో రైతు రుణమాఫీకి కేంద్రం నిధులిస్తే రాష్ట్రానికి కూడా నిధులివ్వాలని కేంద్రాన్ని అడిగేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మజ్లీస్ ఎమ్మెల్సీ రజ్వీ మాట్లాడుతూ.. మైనార్టీలకు గత బడ్జెట్లో కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదన్నారు. -
రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి
హైకోర్టులో ఎమ్మెల్సీ రామచంద్రరావు పిల్ సాక్షి, హైదరాబాద్: రాజధానితో పాటు తెలంగాణలో రోడ్ల దుస్థితిపై బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. రాష్ట్రంలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని, వెంటనే వీటి మరమ్మతులు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించనుంది. ఇటీవలి వర్షాలకు రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, వీటిపై వెళ్లాలంటే వాహనదారులకు నరకం కనిపిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ గుంతల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డారని తెలిపారు. రోడ్లను వేసే సమయంలో నాణ్యత పాటించడం లేదని, నాసిరకం మెటీరియల్‌ను వాడటం వల్ల తక్కువ కాలానికే దెబ్బతింటున్నాయన్నారు. ఇవికాక విద్యుత్, సీవరేజీ, నీటి అవసరాల నిమిత్తం రోడ్లను తవ్వేస్తున్నారని, వాటికి తిరిగి రిపేర్లు చేయడం లేదని వివరించారు. -
విమోచన వేడుకలపై హైకోర్టు స్టే నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విమోచన దినోత్సవాలు నిర్వహించకుండా ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని వరంగల్ జిల్లా కలెక్టర్, కమిషనర్, డీజీపీలను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ విమోచన వేడుకలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చానని, దానిని పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని శుక్రవారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. వేడుకల వల్ల మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినా ప్రయోజనం లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి వేడుకల నిర్వహణపై స్టే విధించేందుకు నిరాకరించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ తదితరులను ఆదేశించారు. -
అర్థరాత్రి సీఐడీ సీఐ వీరంగం
-
అర్ధరాత్రి సీఐడీ సీఐ వీరంగం
విజయవాడ: ఓ పక్క ప్రభుత్వాలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఊదర కొడుతున్న కొందరు అధికారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ప్రజలకు సేవ చేయాల్సిన ఓ ఉన్నతాధికారే అడ్రస్ అడిగితే చెప్పలేదనే కోపంతో ఓ పౌరుడిపై విరుచుకుపడిన సంఘటన విజయవాడలో శనివారం అర్ధరాత్రి వెలుగుచూసింది. వివరాలు.. ఏలూరు రోడ్డులోని రామమందిరం వద్ద నిల్చొని ఉన్న భాను అనే యువకుడిని మఫ్టీలో ఉన్న సీఐడీ సీఐ రామచంద్రరావు ఓ అడ్రస్ అడిగాడు. దీనికి ఆ యువకుడు తనకు అడ్రస్ తెలియదని కావాల్సి వస్తే.. గూగుల్ మ్యాప్‌లో చూసుకోవాలని ఓ ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో సదరు సీఐ గారికి చిర్రెత్తుకొచ్చింది. నాకే సలహా ఇస్తావా అంటూ అతని పై ముష్టిఘాతాలు కురిపించాడు. పోలీస్ జులుం చూపిస్తూ.. జీపులో వేసి చితకబాదాడు. ఇది గుర్తించిన స్థానికులు యువ కుడిని రక్షించేందుకు ప్రయత్నించగా.. అప్రమత్తమైన సీఐ స్థానిక సూర్యారావుపేట పోలీసులను పిలిపించుకొని వారి రక్షణలో అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు. అంతటితో ఆగకుండా.. తన్నులు తిన్న యువకుడిని కూడా స్టేషన్‌కు తీసుకెళ్లి తనదైన స్టైల్లో బెదిరించి మీడియా కంట పడకుండా పంపేశాడు. -
మీడియా ద్వారానే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది
- అమెరికన్ కాన్సులేట్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ - ఐజేయూ ఆధ్వర్యంలో విస్తరిస్తున్న మీడియా- జర్నలిస్టుల నైతిక విలువలపై చర్చ హైదరాబాద్ ప్రజలు తమలోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని, అలాంటి వాతావరణ మీడియా ద్వారానే సాధ్యమవుతుందని అమెరికన్ కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ వ్యాఖ్యానించారు. మీడియా చైతన్యం లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ సందర్భంగా గురువారమిక్కడ ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విస్తరిస్తున్న మీడియా- జర్నలిస్టుల నైతిక విలువలు’ అనే అంశంపై చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్, ముఖ్య అథితిగా పాల్గొని ప్రసంగించారు. -
'టీడీపీతో పొత్తు వద్దంటున్న బీజేపీ నేతలు'
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కోర్‌కమిటీ సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, అచ్చంపేట ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ...మున్సిపల్ ఎన్నికలలో టీడీపీతో పొత్తు వద్దని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారని అన్నారు. టీడీపీతో పొత్తు అంశం స్థానిక నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రామచంద్రరావు తెలిపారు. -
ఎందుకు ఇంప్లీడ్ అవ్వరు?
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ, వరంగల్ ఎన్నికల కోసమే టీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ఇందుకోసమే హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తుతోందని అన్నారు. టీడీపీ ఓటుకు కోట్లు కేసులో ఇంప్లీడ్ అయిన టీఆర్ఎస్ సర్కారు హైకోర్టు విభజన అంశంలో ఎందుకు ఇంప్లీడ్ అవడం లేదని ఆయన ప్రశ్నించారు. కొంతమంది న్యాయవాదులు ఈ అంశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సహాయంపై టీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. -
’సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది’
-
టీఆర్ఎస్కు ఝలక్!
మండలి ఫలితాల్లో అధికార పార్టీకి చేదు ఫలితం మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో ఓటమి దేవీప్రసాద్‌పై బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపు, 13,318 ఓట్ల ఆధిక్యం మొదటి ప్రాధాన్య ఓటుతోనే ఘన విజయం టీఆర్ఎస్ను గట్టెక్కించలేకపోయిన హామీలు నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో మాత్రం ఆధిక్యం నేటి మధ్యాహ్నానికి ఫలితం తేలే అవకాశం సాక్షి, హైదరాబాద్, నల్లగొండ: శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఖంగుతిన్నది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్ధి దేవీప్రసాద్ ఓటమిపాలయ్యారు. మొదటి ప్రాధాన్య ఓటుతోనే బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుపొందారు. 13,318 ఓట్ల ఆధిక్యతతో విజయభేరి మోగించారు. మొత్తం 1,11,739 ఓట్లు పోలవగా రామచంద్రరావుకు 53,881 ఓట్లు, దేవీప్రసాద్‌కు 40,563 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి రవికుమార్ గుప్తాకు 2,856 ఓట్లు మాత్రమే పడ్డాయి. లెక్కింపు పూర్తయి ఫలితం తెలిసినప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతితో వివరాలను గురువారం ప్రకటించనున్నారు. కాగా, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజక వర్గంలో ఓట్ల లెక్కింపు మందకొడిగా సాగుతుండడంతో గురువారం మధ్యాహ్నానికి తుది ఫలితం వస్తుందని అధికార వర్గాలు చెప్పాయి. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం కోసం టీఆర్ఎస్ తీవ్రంగా శ్రమించింది. మంత్రులు హరీశ్‌రావు, కె.తారకరామారావులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో మంత్రులు పూర్తిగా ప్రచారంపైనే దృష్టి పెట్టారు. హాల్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. తొమ్మిది నెలలుగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేశారు. ఎమ్మెల్యేలను సైతం పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి దించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో ఏకంగా డిప్యూటీ సీఎం సహా ఐదుగురు మంత్రులు విస్తృత ప్రచారం చేశారు. ఇంత చేసినా ఫలితం ప్రతికూలంగా రావడంపై టీఆర్ఎస్ వర్గాలు అంతర్మథనంలో పడ్డాయి. పనిచేయని ‘పీఆర్సీ’ ప్రభుత్వంపై సుమారు రూ. 5 వేల కోట్ల ఆర్థిక భారం పడుతున్నా, ఉద్యోగ వర్గాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా 43 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించింది. ఉత్తర్వులు ఇవ్వడంలో జాప్యం చేసినా.. పట్టభద్రుల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా మూడు జీవోలను సర్కారు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆ వర్గాలు పూర్తిగా తమ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తాయని టీఆర్ఎస్ నాయకత్వం భావించింది. తెలంగాణ ఉద్యమంలో ముందుండి ఉద్యోగులను నడిపించిన టీఎన్జీవోల నేత దేవీప్రసాద్‌ను అభ్యర్థిగా ఎంచుకోవడంలో కూడా టీఆర్ఎస్ వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. కానీ, చివరకు పీఆర్సీ మంత్రం కూడా పారకపోవడం పార్టీ నాయకత్వాన్ని షాక్‌కు గురిచేసింది. అలాగే హైదరాబాద్‌లో పట్టభద్రుల ఓట్లను దృష్టిలో పెట్టుకునే ఆంధ్రా ఉద్యోగులను, సెటిలర్స్‌ను టీఆర్ఎస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా, ప్రయోజనం లేకపోయిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు చేయిచ్చాయా? టీఎన్జీవోల పెత్తనాన్ని ఉపాధ్యాయ సంఘాలు జీర్ణించుకోలేదని, అందుకే రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉపాధ్యాయ సంఘాలు దేవీప్రసాద్‌కు వ్యతిరేకంగానే ఓట్లేశాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు ‘ కేవలం ఉద్యోగాలు ఇవ్వడం కోసం డీఎస్సీ ప్రకటించం’ అంటూ సీఎం కే సీఆర్ శాసనమండలిలో చేసిన ప్రకటన కూడా కొంత ప్రతికూల ప్రభావం చూపినట్లు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క ప్రకటనా వెలువడ కపోవడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం కూడా పట్టభద్రుల ఆగ్రహానికి కారణంగా పేర్కొంటున్నారు. మొత్తానికి ఈ ఫలితంతో టీఆర్ఎస్ వర్గాలు పునరాలోచనలో పడ్డాయి. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆ ధీమాతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలన్న పార్టీ నేతల ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిట్టీలు ప్రభుత్వంపై గూడుకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కుతూ కొందరు నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిట్టీలను బ్యాలెట్ బాక్సుల్లో వేశారు. ‘తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు-నిధులు- నియామకాల కోసం.. కుటుం బ పాలన కోసం కాద’ని కొందరు ఓటర్లు చిట్టీలు వేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని, వెంటనే డీఎస్సీ ప్రకటన చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఎలాంటి సాకులు చూపొద్దని కూడా చిట్టీలు పడ్డాయి. ప్రభుత్వ పెద్దల తీరు మారకపోతే ఎన్నికల్లో ఇక ముందు కూడా బుద్ధి చెబుతామంటూ కొందరు ఓటర్లు చిట్టీల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈసారి భారీగా చెల్లని ఓట్లు పోలవడం గమనార్హం. ఒక్క ‘హైదరాబాద్’ ఎమ్మెల్సీ స్థానంలోనే 8,433 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో 7.54 శాతం. దీంతో అభ్యర్థుల భవితను ఇవి కూడా ప్రభావితం చేశాయి. మరో స్థానంలో టీఆర్ఎస్ ఆధిక్యం నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు మూడు రౌండ్ల ఫలితాలు వెల్లడి కాగా టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి 10,886 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహనరావుకు 8,935 ఓట్లు వచ్చాయి. వామపక్షాల అభ్యర్థి సూరం ప్రభాకర్‌రెడ్డికి 2,947 ఓట్లు, కాంగ్రెస్ పక్షాన పోటీ చేసిన తీన్మార్ మల్లన్నకు 2,639 ఓట్లు లభించాయి. మొత్తంమీద చూస్తే టీఆర్ఎస్కు బీజేపీ గట్టిపోటీ ఇస్తుం డగా, కాంగ్రెస్, వామపక్షాలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. మొత్తం 13 రౌండ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే, ఈ ఎన్నికల్లో పోలైన 1.50 లక్షల ఓట్ల లెక్కింపునకు కేవలం 20 టేబుళ్లనే ఏర్పాటు చేయడంతో లెక్కింపు ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోంది. తుది ఫలితం గురువారం మధ్యాహ్నానికి వెల్లడయ్యే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, తొలి ప్రాధాన్యత ఓటులో విజేత తేలకుండా రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి వస్తే మరింత ఆలస్యం కానుంది. బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానంలో గెలుపుతో బీజేపీలో నూతనోత్సాహం నిండింది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం తమ పార్టీకే ఉందని బీజేపీ నేతల్లో ధీమా పెరిగింది. మూడు జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికల్లో వచ్చిన గెలుపును పార్టీ విస్తరణకు అనువుగా మార్చుకోవాలని, పక్కా వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే సానుకూ ల ఫలితాలు ఉంటాయని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్పై ఉద్యోగుల్లోనూ, విద్యావంతుల్లోనూ పేరుకున్న వ్యతిరేకత ఈ ఫలితాలతో వెల్లడైందని వారు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీకే అనుకూలం గా మారతాయని స్పష్టమైందని సంబరపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాత్మకంగా ఉంటూనే, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చినందుకు ఇప్పుడు సత్ఫలితాలు వస్తున్నాయని సీనియర్ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో అనవసరంగా పోటీ చేశామని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ మూడో స్థానానికి పడిపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం నిండింది. ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు ‘ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు. మూడు జిల్లాల్లోని పట్టభద్రులు, విద్యావంతులు, ఓయూ విద్యార్థుల పాత్ర నా గెలుపులో ఉంది. టీడీపీ, లోక్‌సత్తా, కొన్ని సంస్థలు, విద్యార్థి సంఘాలు నా గెలుపు కోసం కృషి చేశాయి. గెలుపు కోసం అధికార పార్టీ డబ్బులు వెద జల్లింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లను బెదిరింపులకు గురి చే సినప్పటికీ నాకు ఓటేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు. ఖాళీ పోస్టుల భర్తీకి, ఇతర నోటిఫికేషన్ల కోసం శాసనమండలిలో నా గళాన్ని వినిపిస్తా. దేవిప్రసాద్ పోటీ చేయనని చెప్పినా... టీఆర్ఎస్ బరిలోకి దింపింది. చివరకు ఆయన్ను బలిపశువును చేశారు’ - ఎన్. రామచంద్రరావు, బీజేపీ అభ్యర్థి ప్రజలు మాకు వ్యతిరేకం కాదు ఇది ప్రభుత్వ వ్యతిరేక తీర్పు కాదు. అభ్యర్థిత్వం ఆలస్యం కావడంతో ఓటర్ల దగ్గరకు వెళ్లలేకపోయాం. రామచంద్రరావు రెండు సార్లు మండలి, ఒకసారి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓడిపోయారు. దీని వల్ల ఓటర్లను ఎక్కువసార్లు కలుసుకున్న నేత గా ఆయనకు అధిక ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలు ఒక్కటై టీఆర్ఎస్ను ఓడించాయి. నా గెలుపు కోసం వంద శాతం కట్టుబడి టీఆర్ఎస్ పని చేసింది. కార్మికులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు కష్టపడి పనిచేశారు. ఓటర్ల ను అనేక రకాలుగా ప్రలోభ పెట్టారు. ఓటమిపై విశ్లేషణ చేసుకుంటా. భవిష్యత్ కార్యాచరణతో ముందుకు సాగుతాం. - దేవీప్రసాద్, టీఆర్ఎస్ అభ్యర్థి -
రెండో రౌండ్లోనూ బీజేపీ ముందంజ
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో పట్టుభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్లో ముందంజలో ఉన్న రామచంద్రరావు రెండో రౌండ్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రామచంద్రరావు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ కంటే 6వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఫలితాల సరళి ఇలాగే కొనసాగితే గెలుస్తామని బీజేపీ వర్గాల ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి ఎర్రబెల్లి రామ్మోహన్ రావు పోటీ చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో నిలిచారు. -
అమిత్‌షా తెలంగాణ పర్యటన వాయిదా
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈనెల 27, 28వ తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమాలతోపాటు, పార్టీ పటిష్టానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించాల్సి ఉంది. తెలంగాణలో త్వరలో రెండు పట్టభద్రుల నియోజకర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున వాటికి సంబంధించి కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర నాయకత్వం బిజీగా ఉంది. ఈ విషయాన్ని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లటంతో పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. జనవరి చివరలో పర్యటన కు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి రామచంద్రరావు అభ్యర్థిగా ప్రకటించింది. -
తెలంగాణ గుర్తింపుకార్డులు ఎందుకో?
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.రామచంద్రరావు హైదరాబాద్: ప్రజలకు తెలంగాణ గుర్తింపు కార్డులుకాదు, కరెంటు కావాలని కోరుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్. రామచంద్రరావు అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫాస్ట్ పథకంలో ఫీజు రీయింబర్స్మెంట్ పొందగోరే విద్యార్థులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రా లను ఈ నెల 15లోగా.. కేవలం 6 రోజుల వ్యవధిలో ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయడం సబబు కాదన్నారు. మొన్న సమగ్ర సర్వే, నిన్న ఫాస్ట్, నేడు గుర్తింపు కార్డులు అని ప్రజలను పరేషాన్ చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. గుర్తింపు కార్డులు ఎందుకు ఇస్తున్నారు? ఎవరికి ఇస్తారు? ఒక వేళ తెలంగాణ ప్రజలకైతే తెలంగాణేతరుల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజులు కరెంటు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఈ నెల 11, 13, 14 తేదీలలో మండల కేంద్రాల్లో బీజేపీ ధర్నాలు నిర్వహిస్తుందని ఆయన వివరించారు. సమావేశంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అమర్‌సింగ్, ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తారుమారు
తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్‌కు అక్కడి రాజ్యసభ సభ్యులు ఇక్కడికి ‘లాటరీ’ కేటాయింపులో మారిన వైనం సాక్షి, సిటీబ్యూరో: రాజ్యసభ సభ్యుల్ని లాటరీ పద్ధతిలో ఇరు రాష్ట్రాలకు కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు తెలంగాణలో.. తెలంగాణకు చెందిన కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యుల సంఖ్య కూడా మారనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్లుగా ఉండే పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు రాజ్యసభ సభ్యులు కూడా జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారు. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన పలువురు రాజ్యసభ సభ్యులు హైదరాబాద్‌లో ఓటర్లుగా ఉండటంతో వారు జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగారు. అలాంటి వారిలో కేవీపీ రామచంద్రరావు,సీఎం రమేశ్, నందమూరి హరికృష్ణ, జైరాం రమేశ్ తదితరులున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు లేకపోవడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాటరీ ద్వారా ఎంపిక చేసిన వారిలో ఉన్న కె. కేశవరావు, ఎంఏ ఖాన్, జైరాం రమేశ్, టి.సుబ్బిరామిరెడ్డి, చిరంజీవిలు జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ఎంపిక కా వడంతో... తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం లేదు. అంటే.. వారు జీహెచ్ఎంసీలోఎక్స్అఫీషియో సభ్యులు కారు. కాగా, ప్రస్తుత లాటరీలో తెలంగాణ రాష్ట్రానికి ఎంపికైన కేవీపీ రామచంద్రరావు, వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్, సీఎం రమేశ్‌లు ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉన్నారు. వారు యథావిధిగా కొనసాగుతారు. కాగా, తెలంగాణ రాష్ట్రానికి ఎంపికైన పాల్వాయి గోవర్ధనరెడ్డి, గుండు సుధారాణి, గరికపాటి మోహనరావులు జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా లేరు. వారు గ్రేటర్లో ఓటర్లుగా లేనందున వారి జిల్లాల్లోని స్థానిక సంస్థల్లో ఎక్స్అ ఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ఎంపికైన దేవేందర్‌గౌడ్ గ్రేటర్‌కు చెందిన వారైనప్పటికీ జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉండే అవకా శం లేదు. జీహెచ్ఎంసీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉండేవారు జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాలకు హా జరై తమ వాణి వినిపించవచ్చు. ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు ఎంపికైన మిగతా రాజ్యసభ స భ్యులు రేణుకాచౌదరి, సుజనాచౌదరి, సీతారామలక్ష్మి, జేడీ శీ లంలు ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. -
భయపెట్టే జాబాలి
‘‘అడవిలో హారర్ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన తెలుగు సినిమా ఇది. గ్రాఫిక్స్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది’’ అని దర్శకుడు హేమరాజ్ చెప్పారు. ఎం.అరుణ్, షరిష్ట, అనన్య త్యాగి ముఖ్య తారలుగా జె.ఆర్.ఇ. గ్రూప్ పతాకంపై టి.జయచంద్ర నిర్మించిన ‘జాబాలి’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ దర్శకుడు పీయన్ రామచంద్రరావు పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని నిర్మాత ప్రసన్న కుమార్‌కి అందించారు. పీఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ -‘‘ఈ చిత్ర దర్శకుడు నా శిష్యుడు. సినిమా మేకింగ్‌పై విపరీతమైన ప్రేమానురాగాలు ఉన్నాయి తనకు. ఈ సినిమా తనకు మంచి పేరు తేవాలి’’ అన్నారు. తమ సంస్థలో ఇది తొలి చిత్రమని, అందరికీ నచ్చుతుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వినోద్, సురేష్ కొండేటి, సాయి వెంకట్, రామసత్యనారాయణ తదితరులు మాట్లాడారు. -
పొసగని పొత్తు!
టీడీపీ- బీజేపీ శ్రేణుల మధ్య సఖ్యత శూన్యం ప్రచారంలో ఎవరికే వారే ఇరుపార్టీల అభ్యర్థుల్లో ఆందోళన విఫలమవుతున్న సయోధ్య యత్నాలు రోజురోజుకూ నీరుగారిపోతున్న ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు దూసుకుపోతున్న ప్రత్యర్థులు సాక్షి,రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మనుషులు కలిసినా.. మనసులు కలవలేదు. పొత్తు అంటూ చేతులు కలిపారు.. చేతల్లో విబేధిస్తున్నారు. ప్రాథమిక చర్చలు మొదలు.. సీట్ల ఖరారు వరకు అద్యంతరం గందరగోళంగా సాగిన టీడీపీ- బీజేపీ పొత్తు వ్యవహారం ప్రచారపర్వంపైనా తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ఒప్పందంలో భాగంగా జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించారు. వికారాబాద్, పరిగి, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో కమలంతో దోస్తీని వ్యతిరేకిస్తున్న తెలుగు తమ్ముళ్లు ప్రచారపర్వంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తామేమీ తక్కువ తినలేదన్నట్లు బీజేపీ శ్రేణులు కూడా సైకిల్‌పై సవారీకి దూరంగా ఉంటున్నారు. కార్యకర్తల మధ్య నెలకొన్న అగాధాన్ని తొలగించేందుకు అగ్రనాయకత్వాలు రంగంలోకి దిగినా ఫలితం లేదు. దీంతో ఇరుపక్షాలు ఎవరికివారే యమునా తీరే అన్నట్లు ప్రచారాన్ని సాగిస్తున్నాయి. నాలుగు సెగ్మెంట్లను బీజేపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్‌బై చెప్పారు. ‘గిరి’లోనూ కిరికిరే.. పొత్తులో భాగంగా బీజేపీకి మల్కాజిగిరి సీటును కేటాయించడంతో స్థానిక తెలుగు తమ్ముళ్లు పార్టీని వీడారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సహా పలువురు కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేసి కారెక్కారు. మిగిలిన ఒకరిద్దరు నేతలు కూడా మిత్రపక్షంతో దూరం పాటిస్తున్నారు. దీంతో ఇక్కడ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టీడీపీతో స్నేహం కలిసివ స్తుందని అంచనా వేసిన ఆయనకు ఆ పార్టీ స్థానిక నాయకత్వం రిక్తహస్తం చూపడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుపై పొడచూపిన అభిప్రాయబేధాలు.. టీడీపీ ఎంపీ అభ్యర్థికి ఓటేసే విషయంలో బీజేపీ వ్యక్తపరుస్తోంది. ఈ కిందిస్థాయి నాయకుల వ్యూహా ప్రతివ్యూహాలు ఇరుపార్టీల హైకమాండ్‌లకు తలనొప్పిగా మారింది. ‘వికార’ంగా ప్రచారం! బీజేపీకి కేటాయించిన వికారాబాద్లోనూ ఇరుపార్టీల శ్రేణుల మధ్య సఖ్యత కుదరడంలేదు. ‘ప్రత్యేక’వాదం నేపథ్యంలో ముఖ్యనేతలు పార్టీని వీడడంతో కుదేలైన టీడీపీ.. ఈ సీటును బీజేపీకి వ దలడానికి తనంతట తానుగా ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే ఇక్కడి నుంచి బరిలో దిగిన మాజీ మంత్రి కొండ్రు పుష్పలీలకు తొలిరోజు నుంచే కష్టాలు మొదలయ్యాయి. గతంలో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆమెకు ఆ పార్టీ సీనియర్ల నుంచి సహకారం కొరవడడం, ప్రచారపర్వంలో తమ్ముళ్లు కలిసిరాకపోవడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఏదో మొక్కుబడిగా ఆమె ప్రచారాన్ని సాగిస్తున్నారు. స్థానికంగా టీడీపీ బలహీనం కావడం, బలమైన ప్రత్యర్థులను తట్టుకోవడం ఆమెకు కష్టతరంగా మారింది. ఇక అధినాయకత్వం మద్దతు కూడా ఆశించినస్థాయిలో దక్కడంలేదనే అసంతృప్తి పార్టీశ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సీట్ల సంఖ్యకు పట్టుబట్టిన రాష్ట్ర కమిటీ, అభ్యర్థుల విజయావకాశాలపై దృష్టి సారించకపోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉప్పల్.. తిప్పల్! ఉప్పల్ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు స్థానిక తమ్ముళ్లు ముఖం చాటేశారు. ప్రభాకర్ అభ్యర్థిత్వంపై మొదట్నుంచి అభ్యంతరం వ్యక్తంచేస్తున్న టీడీపీ శ్రేణులు ఇప్పటికే ఇతర పార్టీలోకి జంప్ చేయగా, మిగిలిన మరికొంత మంది నేతలు తటస్థంగా వ్యవహరిస్తున్నారు. పొత్తుతో సీటు కోల్పోయామనే నిరాశలో ఉన్న ‘దేశం’ నేతలను తమవైపు తిప్పుకోవడంలో స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సఫలమయ్యారు. మరోవైపు టీడీపీతో జతకట్టడాన్ని వ్యతిరేకించిన ప్రభాకర్.. ఇటీవల ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లారెడ్డి ప్రచార రథాన్ని కూడా ఎక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీజేపీ- టీడీపీల మధ్య అంతరం బాగా పెరిగింది. ఓట్ల విషయంలోనూ పరస్పరం వెన్నుపోటు పొడుచుకునేందుకు పావులు కదుపుతున్నాయి. క్రాస్ ఓటింగ్‌కు తెరలేపడం ద్వారా మిత్రపక్షానికి షాక్ ఇవ్వాలని ఇరుపార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. పరిగిలోనూ పొసగడం లేదు ఎన్నికల వేళ బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి కమతం రాంరెడ్డి చమటోడ్చుతున్నారు. స్థానిక కమలనాథుల మద్దతు కూడగట్టుకున్న కమతంకు.. ‘దేశం’ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడంలేదు. మరీ ముఖ్యంగా చేవెళ్ల టీడీపీ ఎంపీ అభ్యర్థి వీరేందర్‌గౌడ్ ఇటీవల జరిపిన ఎన్నికల ప్రచారం బీజేపీ నేతల్లో మరింత అసంతృప్తి రాజేసింది. తమ పార్టీ అభ్యర్థిని కలుపుకుపోకుండా స్థానిక ‘దేశం’ నాయకుడి ఇంట్లో గంట సేపు వీరేందర్ గడపడం ఈ వివాదానికి దారితీసింది. యువకుడైన వీరేందర్.. రాజకీయ కురువృద్ధుడు కమతంను దూరంగా పెట్టడం ఎంతవరకు సబబని బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అంతేగాకుండా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆర్థిక సాయం విషయంలోనూ వివక్ష పాటిస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. -
'ఈబిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం తక్కువ'
-
‘పెద్ద’రికం దక్కేనా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ :పెద్దల సభ (రాజ్యసభ)లో స్థానం కోసం జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో ఆశావహుల ఆరాటం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. టీడీపీలో ఎప్పటి నుంచో రాజ్యసభ సీటు కోసం పోరాడి, పోరాడి న యనమల రామకృష్ణుడు చివరకు ఎమ్మెల్సీతో సరిపెట్టుకోక తప్పిం ది కాదు. ఇప్పుడు ఆ పార్టీ తరఫున రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశంపై మరో సీనియర్ నేత మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ఆశ పెట్టుకున్నారు. మూడు రోజుల క్రితం చిక్కాల హైదరాబాద్‌లో అధినేత చంద్రబాబును కలిసి తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉండడం, నిజాయితీపరుడనే పేరు, రామచంద్రపురం ఉప ఎన్నికలో ఇష్టం లేకున్నా పార్టీ ఆదేశాన్ని శిరసావహించి, పోటీ చేసి ఓటమి పాలవడం, కోస్తా జిల్లాల్లో కాపు సామాజికవర్గానికి పెద్దపీట వేస్తామంటున్న చంద్రబాబు మాటలు...వీటన్నింటినీ ప్రామాణికంగా తీసుకుని తనకు అవకాశం ఇవ్వాలని చిక్కాల కోరుతున్నారు. ముందు జిల్లాలో పార్టీ ముఖ్యులైన యనమల రామకృష్ణుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు వంటి నాయకులతో మాట్లాడాకే రాజ్యసభ సీటు కోసం చంద్రబాబును అభ్యర్థించారని చిక్కాల అనుచరులు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీలా బీసీలకు అవకాశం ఇవ్వాలి.. కాగా బలహీనవర్గాలకు చెందిన కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్ఎస్) కూడా పెద్దల సభకు వెళ్లాలని ఆశ పడుతున్నారు. అధికారంలో లేకున్నా పార్టీ వెన్నంటి నిలుస్తూ వస్తున్న తమ సామాజికవర్గానికి సరైన గుర్తింపు లభించడం లేదనే ఆవేదన బీసీల్లో బలమైన శెట్టిబలిజల నుంచి వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పునరేకీకరణలతో వచ్చే ఎన్నికల్లో కొత్తపేట అసెంబ్లీ టిక్కెట్టును త్యాగం చేయాల్సి వస్తుందని సుబ్రహ్మణ్యం భావిస్తున్నారు. దాదాపు ఇవే సంకేతాలు అందుతున్న క్రమంలో ఎప్పుడో ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న భరోసాపై పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రెసిడెంట్‌గా కూడా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంకు పెద్దగా నమ్మకం లేదని అనుచరవర్గం అంటోంది. దీని కంటే రాజ్యసభలో చోటిస్తే జిల్లా నుంచి తొలిసారి బీసీలకు ఆ అవకాశం ఇచ్చినట్టయి, బీసీలు పార్టీకి చేరువవుతారని అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రస్థాయిలో వచ్చిన ఒక్కగానొక్క ఎమ్మెల్సీ పదవినీ బీసీలలో వెలమ సామాజికవర్గం నుంచి ఆదిరెడ్డి అప్పారావుకు ఇవ్వడాన్ని ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం వర్గం గుర్తుకు తెస్తోంది. ‘ఆత్మప్రబోధం’పై చైతన్యరాజు ఆశ! టీడీపీలో పరిస్థితి ఇలా ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీలో మరో రకమైన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర శాసనసభలో ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా రాజ్యసభలో మూడు స్థానాలు ఖాయమంటున్నారు. నాలుగో స్థానం కోసం తాను రేసులో ఉంటానని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మంగళవారం అసెంబ్లీ లాబీలో పాత్రికేయుల సమక్షంలో ప్రకటించడం గమనార్హం. నాలుగో అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలను కోరనున్నట్టు ఆయన చెప్పారు. క్షత్రియ సామాజికవర్గంలో పట్టున్న చైతన్యరాజు తన కుమారుడు, అమలాపురం కిమ్స్ ఎండీ రవికిరణ్వర్మను ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. తండ్రీ, కుమారులు ఇద్దరూ ఏకకాలంలో ఎమ్మెల్సీలుగా ఉన్న క్రమంలో చైతన్యరాజు రాజ్యసభకు వెళ్లాలని అభిలషిస్తున్నారు. తన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించకున్నా ఎమ్మెల్యేల మద్దతుతో బరిలో నిలుస్తానన్న చైతన్యరాజు ప్రకటన జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అధిష్టానానికి తమ సమైక్య అభిమతాన్ని చాటేందుకు రాజ్యసభ ఎన్నికలను అవకాశంగా చేసుకోవాలంటున్న ఎమ్మెల్యేల మద్దతు తనకు లభిస్తుందన్న ధీమా ఆయనలో వ్యక్తమవుతోంది. చైతన్యరాజు ప్రకటించిన సమయంలో అసెంబ్లీ లాబీలోనే ఉన్నపెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ గతంలో ఇందిరాగాంధీ సూచించినట్టు ఆత్మప్రబోధానుసారం ఓటేద్దామనడం కూడా చైతన్యరాజు అభిమతానికి అనుగుణంగా ఉంది. జిల్లా నుంచి టి.రత్నాబాయి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తుండగా, గతంలో.. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత, దివంగత బోళ్ల సత్యనారాయణ రాజ్యసభలో ప్రాతినిధ్యంవహించారు. ఈసారి ఆ రెండు పార్టీల నుంచి పెద్దల సభలో అవకాశం ఎవరికైనా దక్కుతుందో వేచి చూడాల్సిందే. -
ఒకటే మాట.. ఒకటే బాట
నకరికల్లు, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆపార్టీ బీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు స్పష్టం చేశారు. అదిలాబాద్ నుంచి అనంతపురం వరకు, ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఒకే మాటపై నిలిచిందన్నారు. తమ పార్టీ గుర్తు ఫ్యానులోని మూడు రెక్కలు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు చిహ్నాలుగా పేర్కొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లులో శనివారం రాత్రి సమై క్య శంఖారావం బహిరంగ సభ నిర్వహిం చారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాబాబు అధ్యక్షతన జరిగిన సభ లో రామచంద్రరావు ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ర్ట విభజన అంటే ఇటలీ బన్ను ముక్క కాదన్నారు. రాష్ట్రాన్ని ము క్కలు చేయడానికి పల్నాటి పౌరుషం, రాయలసీమ రౌద్రం అంగీకరించవన్నారు నాది వేరు తెలంగాణ కాదు.. తనది వీర తెలంగాణనే కాని వేరు తెలంగాణ కాదని, అభివృద్ధి కోరుకుంటాం కాని ముక్కలు చేస్తానంటే ఊరుకోబోమని గట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం విభజన బస్సు అసెంబ్లీలో ఆగి ఉందని ఈనెల 23 నాటికి డిల్లీ పార్లమెంట్‌కు చేరుకుంటుందన్నారు. ఈలోగా విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేయాల్సింది పోయి బస్సులో చాయ్ తాగుతూ కాలక్షేపం చేస్తే బస్సు పార్లమెంట్‌కు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ సమైక్యాంధ్ర కోరుకుంటున్నానని చెబుతున్నారని, పోరాడాల్సింది పోయి కోరుకోవడమేమిటని గట్టు ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కోడెలకు తెలుగువారిపై ప్రేమ ఉంటే చంద్రబాబుతో సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టాలన్నారు. విడిపోతే సంస్కృతి విచ్ఛిన్నమే.. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే ఐదువేల సంవత్సరాల సంస్కృతి విచ్ఛిన్నమవుతుందన్నారు. కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేయడం కోసం రాజ్యాంగస్పూర్తికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని చీల్చడానికి సోనియా కుట్రపన్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ సోనియాగాంధీ తాబేదారుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ర్టంలో పయ్యావులకేశవ్, కోడెల శివప్రసాదరావులు ఇక్కడ సమైక్యమంటున్నారని దమ్ముంటే చంద్రబాబు చేత తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఉపసంహరింపజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విచ్ఛిన్నంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్, రెండో ముద్దాయి టీడీపీ అని చెప్పారు. రాష్ట్ర సమైక్యంగా ఉండటం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పార్టీ రాష్ట్రనేత శివకుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగితే నష్టపోయేది తెలంగాణే అని చెప్పారు. చంద్రబాబు, కిరణ్ నకిలీ సమైక్యవాదులు.. అంబటి రాంబాబు మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద అనకొండ చంద్రబాబేని విమర్శించారు. ఎన్టీఆర్ నాడు చంద్రబాబు అనే చిన్నపామును తెచ్చిపెంచితే అది ఎన్టీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని మింగిందన్నారు. తెలంగాణ, సీమాంధ్ర నాయకులను ఒకే వేదికపై కూర్చొబెట్టి సమైక్యాంధ్రకు జై కొట్టే దమ్ము చంద్రబాబు ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, చంద్రబాబు నకిలీ సమైక్య వాదులని విమర్శించారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే భావితరాలకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు పక్కా విభజన వాదని విమర్శించారు. సమైక్య ముసుగులో టీడీపీ విభజన కోరుకుంటోందని ఆరోపించారు. కార్యక్రమంలో వేమూరు, నరసరావుపేట, నియోజకవర్గ సమన్వయకర్తలు మేరుగ నాగార్జున, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లు సయ్యద్ మహబూబ్, దేవళ్ల రేవతి. బండారు సాయిబాబు. మేరావత్ హనుమంతునాయక్, ఉత్తమ కుమార్‌రెడ్డి, కోడిరెక్క దేవదాసు, కొత్తా చిన్నపరెడ్డి, మామిడి రాము, బిలాల్ కరీం, దూదేకుల మీరావలి, నాయకులు ఆరిమండ వరప్రసాదరెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు మేడికొండ ప్రకాశరెడ్డి(నకరికల్లు) తోట ప్రభాకర్(రాజుపాలెం) మదమంచి రాంబాబు (సత్తెనపల్లి రూరల్) గార్లపాటిప్రభాకర్(సత్తెనపల్లి టౌన్), రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి(ముప్పాళ్ల) తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు కథలు జీవిత సవుస్యలకు దర్పణం
ఖైరతాబాద్, న్యూస్‌లైన్: వర్తమాన ఆకాంక్షలకు, జీవిత సమస్యలకు, రాజకీయ ఆర్థిక సామాజిక పరిణామాలకు తెలుగు కథ దర్పణం పడుతోందని సుప్రసిద్ధ రచయిత, చిత్రకారులు శీలా వీర్రాజు అన్నారు. సోమవారం సాయంత్రం రంజని తెలుగు సాహితీ సమితి ఆధ్వర్యంలో ఏజీ ఆఫీసు ఆరుబయట రంగస్థలంలో 2013 రం జని నందివాడ భీమారావు కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమానికి ఆయు న ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు చెందిన రచయితలు తెలుగు కథను పరిపుష్టం చేస్తున్నారని చెప్పారు. పదేళ్ల క్రితం అవార్డును ఏర్పాటుచేసిన రచయిత నందివాడ భీమారావు మాట్లాడుతూ కథల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని.. గతేడాది ఆస్తమించిన తన శ్రీమతి నందివాడ శ్యామల సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాది రచయిత్రి జ్వలితకు ప్రదానం చేయడం మరింత ఆనందంగా ఉందన్నారు. పోటీలు కొత్తవారిని బాగా ప్రోత్సహిస్తాయని, రంజని వాటిని క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయమని జ్వలిత చెప్పారు. విజేతలు వీరే.. నందివాడ భీమారావు కథల పోటీలో మొదటి బహుమతిగా రచయిత ఆర్. కశ్యప్ (రామదుర్గం మధుసూదనరావు) రాసిన ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ’ కథ ఎంపికైంది. రచయితకు బహుమతిగా రూ. 4వేలు అందజేశారు. రెండవ బహుమతిగా రచయిత పి. శ్రీనివాస్‌గౌడ్ రాసిన ‘మార్జినోళ్ళు’ గెల్చుకుంది. నగదు బహుమతి రూ. 3వేలు అందజేశారు. మూడో బహుమతిని రంగనాధ రామచంద్రరావు సొంతం చేసుకున్నారు. నాల్గో స్థానంలో ఉపేందర్ రాసిన ‘జ్ఞాపకం’ నిల్చింది. రంజని అధ్యక్షుడు సుందరయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రంజని ప్రధాన కార్యదర్శి మట్టిగుంట వెంకటరమణ, ఉపాధ్యక్షుడు నంద్యాల మురళీకృష్ణ, కోశాధికారి ఆదిశేషు పాల్గొన్నారు. -
'కాంగ్రెస్ రెండు నివేదికలతో డ్రామాలాడుతోంది'
-
గట్టు రామచంద్రరావు మీడియా సమావేశం 21st Aug 2013
-
గట్టురామచంద్రరావు మీడియా సమావేశం 27th JUly
-
మీడియా అత్యుత్సాహంపై మండిపడ్డ గట్టు