
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమి తప్పదనే భయంతోనే టీఆర్‌ఎస్ అభ్యర్థి తల సాని సాయికిరణ్ ఎన్నికల ఏజెంట్ తప్పుడు ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు వెళ్లారని ఎమ్మెల్సీ రామచందర్‌రావు విమర్శించారు. పార్టీ అవసరాల మేరకు లీగల్‌గా బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేస్తే దాన్ని కుట్ర తో కిషన్‌రెడ్డికి ఆపాదించడం దురదృష్టకరమని, ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని బుధవా రం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.