Talasani Sai Kiran Yadav
-
మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు
సాక్షి, ఖైరతాబాద్ (హైదరాబాద్): మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్‌పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలివీ... ఖైరతాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగిన సదర్ ఉత్సవాలకు హాజరయ్యేందుకు మంత్రి తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ తన కారులో వస్తున్నారు. ఈ క్రమంలో రైల్వే గేటు సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నడుచుకుంటూ వెళ్లున్న ఇందిరానగర్‌కు సంతోష్(32) ఎడమ పాదం పైనుంచి మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న కారు టైరు వెళ్లింది. ఈ ఘటనలో సంతోష్ గాయపడ్డాడు. ఆయనను వెంటనే కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కారు నడుపుతున్న తలసాని సాయికిరణ్ యాదవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైఫాబాద్ పోలీసులు తెలిపారు. చదవండి: (నేను జయలలిత కుమార్తెనే.. అమ్మ కంటే ఆస్తి పెద్దది కాదు: జయలక్ష్మి) -
త్వరలో షూటింగ్స్‌కి అనుకూలంగా జీవో
‘‘తలసానిగారితో నాది 30ఏళ్ల అనుబంధం. రాజకీయంగా ఆయన ఎదిగినా మాతో రిలేషన్ మాత్రం అలానే ఉంది. సినీ కార్మికులకు అండగా ఉండి నిత్యావసరాలను ఇచ్చారు. సీఎం కేసిఆర్‌గారు కూడా పరిశ్రమ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. త్వరలోనే సినిమా చిత్రీకరణలకు అనుకూలంగా జీవోను ఇవ్వనున్నారు’’ అన్నారు ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని సాయికిరణ్ సినీ కార్మికులకు నిత్యావసరాలు అందిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికిరణ్ మాట్లాడుతూ –‘‘తెలంగాణాను సాధించటంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా కేసిఆర్‌గారు నడిపిస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమ మీద కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తలసాని శ్రీనివాస్ గారికి సినిమాలంటే ప్రేమ. ప్రతి సినిమానూ తొలి రోజే చూస్తారు. చిరంజీవి, నాగార్జున, మిగతా అసోషియేష¯Œ ్స అంతా కలిసి లీడ్ తీసుకుని సినిమాల చిత్రీకరణ గురించి మాట్లాడటానికి సమావేశాలు ఏర్పాటు చేశారు. సీసీసీ ద్వారా, మా ట్రస్ట్ ద్వారా సినీ కార్మికులను ఆదుకుంటాం’’ అన్నారు. నిర్మాత అభిషేక్ నామా కూడా పాల్గొన్నారు. -
నిత్యావసర సరుకులు అందజేత...
సినీ–టీవీ కార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన తనయుడు తలసాని సాయికిరణ్ ‘తలసాని ట్రస్ట్’ ద్వారా నిత్యావసర సరుకులు అందజేయడానికి ముందుకు వచ్చారు. 12 వేల మంది సినీ, 2 వేల మంది టీవీ కార్మికుల కుటుంబాలకు సాయం అందించే ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, ఎన్.శంకర్, సి.కళ్యాణ్ , ‘దిల్’ రాజు, కొరటాల శివ,రాధాకృష్ణ, రామ్మోహన్రావు, తలసాని సాయి చేతుల మీదుగా ఆయా యూనియన్ నాయకుల ద్వారా నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనాల్సి ఉంది. అయితే సమీప బంధువు చనిపోయిన కారణంగా హాజరు కాలేకపోయానని చిరంజీవి తెలిపారు. -
బాడీ బిల్డర్స్‌కు మంత్రి తనయుడి చేయూత
మారేడుపల్లి : చైనా దేశంలోని మంగోలియాలో సెప్టెంబర్ 12 నుండి 18 వరకు జరుగనున్న మిస్టర్ ఏషియన్, మిస్టర్ వరల్డ్ బాడీబిల్డింగ్ పోటీలకు ఎంపికైన బాడీ బిల్డర్స్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ చేయూతనిచ్చారు. కార్ఖానా కాకగూడకు చెందిన కిరణ్‌కుమార్ సాధించిన పతకాలతో పాటు మిస్టర్ వరల్డ్ బాడీబిల్డింగ్ పోటీల ఎంపికకు సంబంధించి ‘సాక్షి’ దినపత్రికలో ‘చేయూతనందిస్తే సత్తా చాటుతా’ అనే కథనం సోమవారం ప్రచురితమైంది. తలసాని సాయికిరణ్ యాదవ్ స్పందించి కిరణ్‌కుమార్‌ను మంగళవారం తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలను సేకరించారు. పోటీలకు ఎంపికైన కిరణ్‌కుమార్‌తో పాటు మహ్మద్ నిజాముద్దీన్లకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటున్న వారికి రానుపోను 6 లక్షల రూపాయలు చెల్లించి విమాన టిక్కెట్లను బుక్‌చేశారు (ఒక్కొక్కరికి 3 లక్షలు చొప్పున). ఈ సందర్బంగా సాయికిరణ్‌యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు చేయూతనందిస్తుందని ఆయన అన్నారు. -
ఓటమి భయంతోనే కిషన్‌రెడ్డిపై ఆరోపణలు’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమి తప్పదనే భయంతోనే టీఆర్ఎస్ అభ్యర్థి తల సాని సాయికిరణ్ ఎన్నికల ఏజెంట్ తప్పుడు ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు వెళ్లారని ఎమ్మెల్సీ రామచందర్‌రావు విమర్శించారు. పార్టీ అవసరాల మేరకు లీగల్‌గా బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేస్తే దాన్ని కుట్ర తో కిషన్‌రెడ్డికి ఆపాదించడం దురదృష్టకరమని, ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారని బుధవా రం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
కిషన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు నుంచి రూ.8 కోట్లు డ్రా చేసిన సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిపై ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ ఎన్నికల ఏజెంట్ పవన్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. కిషన్‌రెడ్డిపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, సికింద్రాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్బీఐ, ఇండియన్ బ్యాంక్, భారతీయ జనతా పార్టీలతో పాటు కిషన్‌రెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇండియన్ బ్యాంక్ నారాయణగూడ బ్రాంచ్‌లో కిషన్‌రెడ్డి బీజేపీ ఖాతా నుంచి రూ.8 కోట్లు విత్‌డ్రా చేశారని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు, ప్రలోభాలకు గురి చేసేందుకే ఇంత మొత్తం తీసుకున్నారని పిటిషనర్ తెలిపారు. ఎన్నికల సమయంలో నిబంధనల ప్రకారం రూ.2 లక్షల కంటే ఎక్కువ డ్రా చేయడానికి వీల్లేదన్నారు. అయితే బ్యాంక్ అధికారులు ఏకంగా రూ.8 కోట్లు డ్రా చేసి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అలాగే ఆదాయ పన్ను చట్ట నిబంధనలకు కూడా విరుద్ధమని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహించిన బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరినా, ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదన్నారు. అందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశామని, ఇందులో జోక్యం చేసుకుని ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. -
నగరంలో రూపాయి పెట్టుబడికి రెట్టింపు రాబడి
హైదరాబాద్: దేశంలోనే అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్ వరుసగా ఐదోసారి ఎంపికైందని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌లో రూపాయి పెట్టుబడి పెడితే అంతకు రెట్టింపు రాబడి వస్తుందని అన్నారు. శుక్రవారం ఇక్కడి తాజ్ డెక్కన్‌లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి కేటీఆర్‌తోపాటు సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బిల్డర్స్ ఫెడరేషన్ సాయికిరణ్‌యాదవ్‌కు మద్దతు తెలిపింది. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ బిల్డర్స్‌కు స్వీయ నియంత్రణ ఉండాలని, లంచాలతో మేనేజ్ చేస్తే వారి బ్రాండ్ దెబ్బతింటుందని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. నిర్మాణ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. ఈ రంగంలో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఐదేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో బిల్డర్స్‌కు లాభం కలిగిందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా భూరికార్డుల ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ గట్టి సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తే మన లక్ష్యాలను సాధించవచ్చని పేర్కొన్నారు. కేసీఆర్‌లాగా యువరైతుకు ఫోన్ చేసి అరగంట సేపు మాట్లాడి సమస్యను పరిష్కరించిన సీఎం దేశంలో మరెవరూ లేరన్నారు. కేసీఆర్‌కు వేరే ఎజెండాలు కూడా లేవని, రాష్ట్ర అభివృద్ధే ఆయన ఎజెండా అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బిల్డర్స్ ఫెడరేషన్ చీఫ్ అడ్వైజర్ జక్కా వెంకట్‌రెడ్డి, చైర్మన్ పద్మారెడ్డి, అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి, ట్రెజరర్ సతీశ్‌రెడ్డి, కార్యనిర్వాహక సభ్యులు సత్యనారాయణ, యాదవరెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నార -
సాయికిరణ్ సికింద్రా'బాద్షా’ అవుతారా?
హైదరాబాద్ : బోనాల ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన కీలకమైన సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలు ఈసారి ఆసక్తి రేపుతున్నాయి. పూర్తిగా సిటీ ఓటర్లున్న ఈ లోక్‌సభ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు, యువ నాయకుడు తలసాని సాయికిరణ్ టీఆర్ఎస్ తరఫున తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంతో సాయికిరణ్ గెలుపు ఈసారి నల్లేరు మీద నడకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న సాయికిరణ్ అన్ని వర్గాల ఆదరణను చూరగొంటూ.. ప్రజలతో మమేకమవుతున్నారు. యువనేత తలసాని సాయికిరణ్ ప్రొఫైల్ ఇది.. తలసాని శ్రీనివాస్, స్వర్ణ దంపతులకు 1986, మే 13లో జన్మించారు. ఆస్ట్రేలియాలోని హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రీయల్ రిలేషన్స్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రజలకు సేవలందించే తత్వమున్న సాయికిరణ్, అందులో భాగంగా భారత్‌కు తిరిగొచ్చాక.. ఆశాకిరణ్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. అనాథ పిల్లలు, అత్యాచార బాధితులకు ఆశ్రయమివ్వడమే ఈ సంస్థ ఆశయం. అలాగే తలసాని సాయి సేవాదళ్ పేరుతో అనాథ పిల్లలకు ఆహారం పంపిణీ కూడా మొదలుపెట్టారు. 2014లో టీఆర్ఎస్లో చేరిన సాయికిరణ్, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. గతేడాది జరిగిన ముందస్తు ఎన్నికల్లో.. సనత్‌నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లోని ఇంటింటికీ తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం చాలా కృషి చేశారు. ఇలా పలు కార్యక్రమాలతో, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజల్లోనూ సాయికిరణ్ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. దీన్నిగుర్తించిన సీఎం కేసీఆర్, లష్కర్ ఎంపీ సీటుకు సాయికిరణ్ సరైన అభ్యర్థని, ఆయనను ఎంపిక చేసినట్టు గులాబీ వర్గాలు తెలిపాయి. ఒకవైపు తండ్రి శ్రీనివాస్ యాదవ్ వారసత్వం, మరోవైపు వరుస విజయాలతో దూసుకెళ్తున్న కారు పార్టీ, అధినాయకుడు కేసీఆర్ చరిష్మా.. సాయి కిరణ్‌ను సికింద్రా'బాద్'షాను చేస్తాయని గులాబీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. (సాక్షి అడ్వర్ట్‌టోరియల్)