
సినీ–టీవీ కార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన తనయుడు తలసాని సాయికిరణ్ ‘తలసాని ట్రస్ట్’ ద్వారా నిత్యావసర సరుకులు అందజేయడానికి ముందుకు వచ్చారు. 12 వేల మంది సినీ, 2 వేల మంది టీవీ కార్మికుల కుటుంబాలకు సాయం అందించే ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, ఎన్.శంకర్, సి.కళ్యాణ్ , ‘దిల్’ రాజు, కొరటాల శివ,రాధాకృష్ణ, రామ్మోహన్‌రావు, తలసాని సాయి చేతుల మీదుగా ఆయా యూనియన్ నాయకుల ద్వారా నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనాల్సి ఉంది. అయితే సమీప బంధువు చనిపోయిన కారణంగా హాజరు కాలేకపోయానని చిరంజీవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment