Essential goods
-
ఇంటింటికి వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దేవినేని అవినాష్
-
వరద బాధితుల కోసం రంగంలోకి దిగిన YSRCP నేతలు
-
నాసిరకం సరుకు... బ్రాండెడ్ ముసుగు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వివిధ మార్కెట్లలో లభించే ముడిసరుకుతో నాసిరకం నిత్యావసర వస్తువుల తయారీ... ఉత్తరాది నుంచి తీసుకువచ్చిన ప్రముఖ సంస్థల పేర్లతో ఉన్న కవర్లు, డబ్బాల్లో ప్యాక్ చేయడం... శివార్లలోని కిరాణా దుకాణాల ద్వారా బ్రాండెడ్ సరుకుల పేర్లతో విక్రయం... ఈ పంథాలో రెండేళ్లుగా దందా చేస్తున్న ఘరానా ముఠా గుట్టును మధ్య మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు సభ్యులున్న ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశామని, వీరి నుంచి రూ.2 కోట్ల విలువైన సరుకు స్వాదీనం చేసుకున్నట్లు టాస్‌్కఫోర్స్ డీసీపీ ఎస్.రష్మి పెరుమాల్ పేర్కొన్నారు. ఈస్ట్‌జోన్ డీసీపీ ఆర్.గిరిధర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఏళ్లుగా ఇదే దందా... పలు కేసులు... రాజస్థాన్‌కు చెందిన శ్యామ్ బాటి, కమల్ బాటి కొ న్నేళ్ల క్రితం బతుకుతెరువు కోసం నగరానికి వల సచ్చి కాచిగూడ ప్రాంతంలో స్థిరపడ్డారు. తొలినాళ్లల్లో కిరాణా వ్యాపారం చేసిన ఈ ద్వయం ఆపై తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం బేగంబజా ర్కు చెందిన జయరాంతో జట్టు కట్టింది. ఈ ము గ్గురూ బ్రాండెడ్ వస్తువుల పేరుతో నాసిరకం సరు కులు ప్యాక్ చేసి విక్రయించాలని పథకం వేశారు. గుజరాత్, బెంగళూరు, ఢిల్లీల నుంచి నాసిరకం ముడిసరుకు ఖరీదు చేసే వాళ్లు. కాచిగూడలో ఏర్పాటు చేసిన కార్ఖానాలో వీటిని ప్రాసెస్ చేసి... బెంగళూరు, ఢిల్లీ, నాసిక్ నుంచి తీసుకువచ్చిన వివిధ బ్రాండ్ల పేరుతో ఉన్న కవర్లు, కార్టన్లు, డబ్బాల్లో నింపి స్టిక్కర్లు వేసి మార్కెట్లో విక్రయించే వాళ్లు. 2019, 2022 కాచిగూడ, మైలార్‌దేవ్‌పల్లితో పాటు నల్లగొండలోనూ కేసులు నమోదయ్యాయి. తెరవెనుక ఉండిపోయిన ముగ్గురూ తమ స్నేహితుడైన మహేందర్ సింగ్‌ను రంగంలోకి దింపారు. రాజస్థాన్‌కే చెందిన ఇతగాడు నాగారంలో కిరాణా వ్యాపారం చేస్తున్నాడు. అక్కడ తయారు చేసి.. ఇక్కడ నిల్వ ఉంచి... ముడిసరుకుని బ్రాండెడ్ కవర్లలో ప్యాక్ చేయడానికి కాటేదాన్‌లో ఓ కార్ఖానా ఏర్పాటు చేశారు. అక్కడ స్థానికులను పనిలో పెట్టుకుని మిథులేష్ కుమార్, త్రియన్ కుమార్ నేతృత్వలో వీటిని ప్యాక్ చేయిస్తున్నారు. ఇలా తయారైన నిత్యావసర వస్తువుల్ని దాచడానికి మహేందర్ ఇంటి సమీపంలో ఓ గోదాం అద్దెకు తీసుకున్నారు. తొలుత సరుకు మొత్తం ఇక్కడకు తీసుకువెళ్లి... ఆపై శివార్లలో ఉన్న కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. వీటిలో నాసిరకం సరుకుతో పాటు కల్తీ సరుకు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. వీరి వ్యవహరంపై మధ్య మండల టాస్‌్కఫోర్స్‌కు ఉప్పందింది. ఇన్స్పెక్టర్ బి.రాజునాయక్ నేతృత్వంలో ఎస్సైలు ఎస్.సాయికిరణ్, కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎస్ఆర్ఎల్ రాజు తమ బృందాలతో వలపన్నారు. అక్కడకు సరుకుతో వచ్చిన మహేందర్‌ను పట్టుకోగా... గోదాం, కార్ఖానా విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ రెంటి పైనా దాడి చేసిన పోలీసులు మిథులేశ్, త్రియన్లను పట్టుకుని మొత్తం రూ.2 కోట్ల విలువైన సరుకు స్వా«దీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్న అధికారులు ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరు ఉన్నారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. వీటితో ఆరోగ్యానికీ ముప్పు వీళ్లు సరఫరా చేస్తున్న నాసిరకం, నకిలీ సరుకుల వల్ల వినియోగదారులకు ఆరోగ్యానికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ప్యారాచూట్, సర్ఫ్, వీల్, బ్రూక్ బాండ్, హార్పిక్, లైజోల్, ఎవరెస్ట్ తదితర కంపెనీలకు చెందిన 30 రకాల ఉత్పత్తుల్ని వీళ్లు తయారు చేస్తున్నారు. వీటిని ఎవరూ గుర్తించకుండా ఉండటానికే శివార్లలోని కిరాణా దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. ఇవి నాసిరకం, నకిలీ అని తెలిసే వాళ్లు అమ్ముతున్నారా? లేదా వారినీ మోసం చేస్తున్నారా? అనే అంశాలు ఆరా తీస్తున్నాం. ఈ తరహా ముఠాలపై నిఘా, దాడులు కొనసాగుతాయి. – రష్మి పెరుమాల్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ -
సామాన్యులకు కేంద్రం శుభవార్త..తగ్గిన 11 రకాల నిత్యావసర వస్తువుల ధరలు
సామాన్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ నెలలో 11 రకాలైన నిత్యావసర వస్తువుల ధరల్ని తగ్గించినట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 2022 సెప్టెంబర్ 2న లీటరుకు రూ.132గా ఉన్న పామాయిల్ సగటు ధర అక్టోబర్ 2న గరిష్టంగా 11 శాతం తగ్గి రూ.118కి చేరింది. వనస్పతి నెయ్యి కిలో రూ.152 నుంచి 6 శాతం తగ్గి రూ.143కి చేరింది. त्यौहारों के समय में खाद्य पदार्थों के दामों में गिरावट, घर में उत्सव, बजट में राहत। pic.twitter.com/oklqSiOn3U — Piyush Goyal (@PiyushGoyal) October 3, 2022 సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్‌కు రూ.176 నుంచి రూ.165కి 6 శాతం తగ్గి రూ.165కి చేరగా, సోయాబీన్ ఆయిల్ లీటరుకు రూ.156 నుంచి రూ.148కి 5 శాతం తగ్గింది. ఆవనూనె ధర లీటరు రూ.173 నుంచి 3 శాతం తగ్గి రూ.167కి చేరింది. వేరుశెనగ నూనె లీటరు రూ.189 నుంచి 2 శాతం తగ్గి రూ.185కి చేరింది. ఉల్లి ధర కిలో రూ.26 నుంచి 8 శాతం తగ్గి రూ.24కి, బంగాళదుంప ధర 7 శాతం తగ్గి కిలో రూ.28 నుంచి రూ.26కి చేరింది. పప్పు దినుసులు కిలో రూ.74 నుంచి రూ.71కి, మసూర్ దాల్ కిలో రూ.97 నుంచి 3 శాతం తగ్గి రూ.71కి, మినప పప్పు కిలో రూ.108 నుంచి రూ.106కి 2 శాతం తగ్గాయి. గ్లోబల్ ధరల పతనంతో దేశీయంగా ఆహార చమురు ధరలు తగ్గుముఖం పట్టాయని ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్లోబల్ రేట్లు తగ్గడం,దిగుమతి సుంకాలు తగ్గడంతో, భారతదేశంలో వంట నూనెల రిటైల్ ధరలు గణనీయంగా పడిపోయాయని పేర్కొంది. చదవండి👉 సామాన్యులకు కేంద్రం శుభవార్త..తగ్గనున్న వంటనూనె ధరలు! -
గబ్బర్ సింగ్ ట్యాక్స్.. అరె ఓ సాంబా.. ఇంకా ఏం వదిలినమో రాసుకోరా!
ఉచితంగా విద్యుత్, రెండు గ్యాస్ సిలిండర్లు, కాలేజీ అమ్మాయిలకు టూ వీలర్స్ ఇస్తాం.. ఇది బీజేపీ మొన్నటి ఎన్నికల హామీ తీయని మిఠాయిల మాదిరి ఉచితాల ద్వారా ఓట్లు దండుకునే సంస్కృతి చాలా ప్రమాదకరం.. ఇది నిన్నటి మోదీ మాట ఈ రెండు వాక్యాలకు పుట్టినిల్లు ఉత్తరప్రదేశే.. ఈ రెండు వాక్యాల మధ్య ఏజ్ గ్యాప్ ఐదు నెలలు మాత్రమే.ఇంత తక్కువ వ్యవధిలోనే మాట, మూడ్ మారిపోతుందా? ఒక్కోసారి అంతే.. ఈ కథ చదవండి పాత కథే.. అనగనగా ఒక ఊర్లో ఒకాయన ఉన్నారు. ఆయనకు అత్యవసరంగా ఓ పని పడింది. ఆ పని అయితే ఊర్లో ఉన్న ఇల్లు అమ్మి ప్రజలందరికీ ఫ్రీగా డబ్బు కానీ, బహుమతి కానీ ఇస్తానని రాములోరికి మొక్కుకున్నాడు. ఇంత మంచి ఆలోచనను దేవుడు కాదంటాడా.. తథాస్తు అన్నాడు.. పనైపోయింది.. ఆల్ హ్యాపీస్. కానీ ఇక ఫ్రీగా ఇచ్చే టైం వచ్చింది. మాటైతే ఇచ్చాడు.. కానీ ఫ్రీగా ఇవ్వటానికి మనసు రావడం లేదు. ఉత్తి పుణ్యానికి ఇల్లమ్మి అందరికీ ఇవ్వాలా అని మథన పడసాగాడు. కానీ రాములోరి మొక్కు కదా తప్పదు.. ఎలా అని ఆలోచించగా మనోడికి పొలిటికల్ లీడర్ లెవెల్లో ఓ ఐడియా వెలిగింది. ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ధర ఒక్క రూపాయి మాత్రమేనని ఎనౌన్స్ చేశాడు.. కానీ, తన పిల్లిని కొంటేనే ఇల్లు అమ్ముతానని షరతు పెట్టాడు.. పిల్లి ధర రూ.25000 అన్నాడు. వేలం నడిచింది.. ఇల్లు అమ్ముడుపోయింది. ఇంటి మీద వచ్చిన ఒక్క రూపాయిని మాత్రం ఫ్రీగా పంచేశాడు. రాముడికి మాటిచ్చింది అదే కదా.. న్యాయం ప్రకారం పిల్లికి వచ్చిన డబ్బులు పంచక్కర్లేదు. అవి జేబులో వేసుకున్నాడు. ఇది చదివి ఉచిత హామీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ జాగా అమ్మకాలు అని ఏవేవో అన్వయించుకోకండి.. ఊరికే ఓ కథ అంతే.. పంజాబ్‌లో ‘ఉచిత విద్యుత్’అచ్చొచ్చిన కేజ్రివాల్ ఇప్పుడు చీపురు పట్టుకొని గుజరాత్లో తిరుగుతున్నాడు.. ‘ 300 యూనిట్ల ఫ్రీ పవర్’ అంటూ. అందుకే మన పెద్దమనిషి మోదీకి ఉచితాలపై చిర్రెత్తుకొస్తోందని ఓ టాక్.. అవును.. ఇప్పుడు పన్నులు మాత్రమే ‘ఉచితం.’ఎన్ని కావాలంటే అన్ని, దేనిమీద కావాలంటే దానిమీద వేసుకోవచ్చు. కావాల్సినంత ఫ్రీగా. దేశానికేం ప్రమాదం లేదు. ‘డబుల్’ఇంజన్ల భారం.. ‘ఉచితాల’సంగతి సరే గానీ తక్కువ ధరల్లో మా బతుకు నడవనీయండి.. ‘డబుల్ ఇంజన్లు’(ఒకటి మోదీ ది.. మరొకటి కేసీఆర్ ది) లాగలేక పోతున్నామని జనం గోల. బండి ఎక్కితే మోదీ.. బస్సు ఎక్కితే కేసీఆర్.. గ్యాస్ ఆన్ చేస్తే మోదీ, కరెంట్ స్విచ్ ఆన్ చేస్తే కేసీఆర్ గుర్తుకు వస్తున్నారు. (కరెంటు, డీజిల్, బస్ చార్జీలతో..) ఇక మన నిర్మలా సీతారామన్ అయితే నట్టింట్లో.. ఇంకా చెప్పాలంటే వంటింట్లో కూడా మనతో తిరుగుతున్నట్టుగా ఉంటుంది.. పప్పు, ఉప్పు, పెరుగు, బియ్యం.. ఇలా ఏం టచ్ చేసిన ఆమె గుర్తుకొస్తున్నారు. జీఎస్టీ రుచి తెలుస్తోంది .. ‘‘ఈ డబుల్ ఇంజన్లు మన బతుకు బండిని లాగుతున్నాయా.. మనమే మన బతుకు బండితో పాటు ఈ డబుల్ ఇంజన్లను లాగుతున్నామా?’’.. అని మిడిల్ క్లాసులో ఓ ప్రశ్న. అచ్చం కిరాణా దుకాణంలా.. ఇప్పుడు గడ్కరీకి రాజకీయాలపై విరక్తి పుట్టినట్టే.. ఓ జర్నలిస్టు మిత్రుడికి తన ఉద్యోగంపై ఆసక్తి పోయింది. కిరాణా షాపు పెట్టుకుని బతుకుదాం అనుకున్నాడు. తెలిసిన ఒక సీనియర్ షావుకారు దగ్గరికి వెళ్లి ఒపీనియన్ అడిగాం. ఆయన మమ్మల్ని కిందా మీదా చూసి.. ఏం అమ్మితే ఎంత పర్సంటేజ్ వస్తుందో, ఏయే సరుకుల్లో ఎంత మిగులుతుందో తెలుసా? అని అడిగారు. మా వెర్రి ముఖాలు చూసి ఆయనే సమాధానం చెప్పారు. ఓవరాల్ 13–14% వరకు మిగిలే కిరాణా వ్యాపారంలో చిన్న చిన్న వస్తువులు.. ఆవాలు, జీలకర్రలాంటి చిన్న చిన్న సరుకులపై 20% మిగులుతుందని చెప్పాడు.. వాటితో పాటు ఎక్కువ పర్సంటేజ్ మిగిలే వస్తువుల లిస్టు చకచకా వల్లెవేశాడు. లూజుగా అమ్మితే ఎంత, ముందే ప్యాక్ చేసి పెట్టుకుంటే ఎంత టైమ్, డబ్బులు మిగులుతాయో చెప్పారు. పాలు, పెరుగు అమ్మితే ఎంత మిగులుతుందో.. 5 నుంచి 20 శాతం మార్జిన్లలో ఉన్న సరుకుల లిస్టు చెప్పేశారు. కిరాణా వెనుక ఇంత గణాంకాల గొడవ ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు.. ఇంతకీ కిరాణా షాప్ పెట్టాడో లేదో మీకు తెలిసే ఉంటుంది. వాడే.. తాజాగా ఫోన్ చేసి ‘మన షావుకారును నిర్మలా సీతారామన్ ఏమైనా కలిసిందేమిట్రా’అని ఫోన్ చేశాడు. రకరకాల వస్తువులపై ఆమె వేసిన జీఎస్టీ లిస్ట్ షేర్ చేశాడు. పెరుగు, లస్సీ, బట్టర్ మిల్క్, పనీర్, బెల్లం, తేనె, చక్కెర, బియ్యం, గోధుమలు, మరమరాలు.. ఇలా ఏ ఆహార పదార్థాన్ని వదలకుండా అనేక వస్తువులపై ఐదు శాతం జీఎస్టీ వేసేశారు.. ప్యాక్ చేస్తే చాలు బ్రాండెడ్ కానక్కర్లేదు.. అన్ బ్రాండెడ్ అయినా సరే. (..ఇలాంటివే 80 శాతం ఇండియన్లు కొంటారని ఓ అంచనా) ‘‘అంటే నిర్మలమ్మకు డబ్బులు ఎక్కడినుంచి రాబట్టాలో, ఎలా కిరాణా కొట్టు నడపాలో బాగా తెలుసన్నమాట. మన షావుకారు లాగే’’ అని జోకేశాడు. శ్మశానంతో సహా.. ఎక్కడా తగ్గలే.. ఫోర్క్‌లు, కత్తులు, పెన్సిల్ షార్పెనర్లు.. ఇలా ఒక్కటీ వదలలేదు.. 12 నుంచి 18 శాతం జీఎస్టీ బాదేశారు.. ఇల్లంతా తిరుగుతూ ఉంటే నిర్మలమ్మ టచ్ చేయని ఒక్క వస్తువూ ఇంట్లో కనిపించడం లేదు. ఎల్ఈడీ లైట్స్ పై కూడా 18శాతం.. గోడకు వేలాడే పిల్లలు చదువుకునే చార్టుల నుంచి అట్లాసుల దాకా 12శాతం వేసేశారు. చివరికి బ్యాంకు చెక్కులకు చెల్లించే డబ్బులపైన 18 శాతం జీఎస్టీ ఉంది. డైమండ్స్ పై 1.5 శాతం,బంగారంపై 3 శా తం హాస్పిటల్ బెడ్స్ రూ.5,000 దాటితే, హోటల్ రూమ్ రెంట్ రూ.1,000 దాటితే 5శాతం.. చివరికి శ్మశాన సేవల్ని కూడా 18 శాతానికి పెంచారు.. సోషల్ మీడియా.. పాలిటిక్స్ ఇంత బాదినా గుంతల్లో పడిన హైదరాబాదీలాగా కిందా మీదా పడి బతుకును నడిపేస్తున్నారేగానీ.. ఒక్కరూ నోరు తెరవడం లేదు. గతంలో డీజిల్ పావలా పెరిగితే.. సిలిండర్ రూపాయి పెరిగితే.. కరెంటు చార్జీలు పెంచుతారని తెలిస్తే చాలు ధర్నాలు, కేకలూ వినపడేవి. పక్కన కాసిన్ని ఎర్ర జెండాలు కనిపించే సరికి యువ రక్తం పొంగి బస్సు అద్దాలపై నాలుగు రాళ్లు పడేవి.. ఇప్పుడు అదేం లేదు. పైగా మన ఆక్రోశాన్ని ఏ ఫేస్‌బుక్‌లోనో, ట్విట్టర్ లోనో పోస్ట్ చేద్దామంటే ఆ ‘నాలుగు రాళ్లు’మనపై పడుతున్నాయి. ‘ఏందీ అన్యాయం.. గ్యాసు ధర, డీజిల్ ఇలా పెరిగితే ఎలా బతకడం.. తినే ప్రతిదానిపైనా జీఎస్టీ అంటే ఎలా..’అని అంటే చాలు. వందల కామెంట్స్ విరుచుకుపడుతున్నాయి. ‘కేసీఆర్ పెంచిన బస్సు రేట్లతో సామాన్యులపై ఎక్కువ భారం పడుతోంది తెలుసా’అని రోజువారీ లెక్కలు వేసి నెలకు ఎంత ఖర్చవుతుందో చెప్తున్నారు. కరెంట్ బిల్లులు షేర్ చేస్తున్నారు. మనను కేసీఆర్ టీమ్‌లో కలిపేస్తున్నారు. ‘అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న కౌన్సిలే కదా జీఎస్టీ పెంచేది.. మీ సీఎం మీ ఆర్థిక మంత్రులు ఏం చేస్తున్నారు?’అని ప్రశ్నిస్తున్నారు. పోనీ కరెంటు చార్జీలపై, బస్సు చార్జీలపై క్వశ్చన్ చేస్తే.. ‘జీఎస్టీ ధరలు పోస్ట్ చేసి మోదీ ఏం చేశాడో చూశారా..?’అంటూ కాసిన్ని బూతులు కలిపి, డీజిల్ చార్జీలు, పెట్రోల్ చార్జీలు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని చూపుతూ విరుచుకుపడుతున్నారు. మనను మోదీ టీమ్‌లోనో, బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న వాడిలాగానో చూస్తున్నారు. కేంద్రం బాదినా, రాష్ట్రం బాదినా మోగేది మన మన వీపే కదా.. అంటే వినేదేలే.. ఇంకోటుంది.. ‘భారతీయుడి’టైప్ సెక్షన్. పన్నుల గురించి చర్చ చేస్తే చాలు.. ‘‘అసలు పన్నుల్లేకుండా దేశాన్ని నడపడం ఎట్లా?.. శ్రీలంక లాగా మన దేశాన్ని దిగజారుస్తారా? రూ.500 పెట్టి సినిమాకు వెళ్తారు గానీ, వంద పెట్టి పెట్రోల్ పోయించుకోలేరా?’’అని వెటకారాలు గుమ్మరిస్తున్నారు. నెటిజన్లు రాజకీయ వర్గాలుగా డివైడ్ అవుతున్నారా? రాజకీయ వర్గాలే సోషల్ మీడియాను ఆపరేట్ చేస్తున్నాయా?.. ఇదో డౌట్.. ఇదంతా ఎందుకనీ.. ఈ కడుపు మంటని మీమ్స్ లాగా, జోక్స్ లాగా షేర్ చేసుకుని ఏడవలేక నవ్వుతున్నారు. అన్నట్టు ఇప్పుడు జీఎస్టీ అంటే గబ్బర్‌సింగ్ ట్యాక్స్‌గా సోషల్‌మీడియాలో హల్చల్ అవుతోంది. ఇది బాగుంది.. జీఎస్టీ ధమ్ బిర్యానీ జీఎస్టీ ధమ్ బిర్యానీ అట. నెట్లో హల్చల్ చేస్తోంది.. ‘‘12 శాతం జీఎస్టీ పెట్టి కొన్న పాత్రలో.. 5 శాతం జీఎస్టీ వేసిన ప్యాకేజ్డ్ చికెన్, పెరుగు, కారం, మసాలాలు వేసి.. ప్రస్తుతానికి జీఎస్టీ లేని ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. దాన్ని 28 శాతం జీఎస్టీ పెట్టి కొన్ని ఫ్రిడ్జ్ లో అరగంట పెట్టాలి. తర్వాత 18శాతం జీఎస్టీ చెల్లించి కొన్న స్టవ్‌ను 12 శాతం జీఎస్టీతో కొన్న అగ్గిపెట్టెతో వెలిగించి.. 12 శాతం జీఎస్టీ వేసిన అల్యూమినియం పాత్ర పెట్టాలి. ఫ్రీగా వచ్చే నీళ్లు, జీఎస్టీ లేని హోల్ స్పైసెస్ వేసి.. 5శాతం జీఎస్టీ బాస్మతి రైస్ వేసి ఉడికించుకోవాలి. ప్రస్తుతం బేగంబజార్‌లో జీఎస్టీ లేకుండా దొరుకుతున్న బిర్యానీ పాత్ర తెచ్చుకుని.. అడుగున 12 శాతం జీఎస్టీ ఉన్న బట్టర్ ను రాసి, ముందే రకరకాల జీఎస్టీ లెక్కలతో సిద్ధమైన చికెన్ ముక్కలను, ఆపై బాస్మతి రైస్‌ను వేసుకోవాలి. చివరిగా 5 శాతం జీఎస్టీ ఉన్న మైదాతో ‘ధమ్’పెట్టి.. బిర్యానీ సిద్ధం చేసుకోవాలి.’’అని.. మరొకటి ఏంటంటే.. ‘ఈ వంటంతా రూ.1,150 పెట్టి తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ మీద చేసుకోవాలి..’ ఓ నెటిజన్ ఆవేదన చూడండి.. ‘పల్మోరిక్స్ట్ అనే టాబ్లెట్ జీఎస్టీకి ముందు రూ.1,100 కు వచ్చేది. ఇప్పుడు రూ.1,370 అవుతోంది. అప్పట్లో బిల్లు నెలకు రూ. 7,000 అయ్యేది. ఇప్పుడు రూ..10,000 అవుతోంది. ఈ ట్యాబ్లెట్లు మింగకపోతే చస్తావని డాక్టర్లు అంటున్నారు.. ఇది నాకు భారమే కదా..’ -
నిత్యావసర సరుకులపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
-
పకడ్బందీగా కర్ఫ్యూ
సాక్షి, అమరావతి/గరికపాడు/వత్సవాయి/చింతూరు: రాష్ట్రంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రోజూ 18 గంటల చొప్పున ఈ నెల 18వ తేదీ వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి ఇచ్చారు. ప్రజలు నిత్యావసరాలకు ఆ సమయాన్ని వినియోగించుకున్నారు. పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలోనే రోడ్లపైకి వచ్చారు. అయితే కర్ఫ్యూ అమలులో లేని సమయంలో ఐపీసీ 144 సెక్షన్ అమలు చేస్తుండటంతో ఎక్కడా ఐదుగురికి మించి గుమిగూడి ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కర్ఫ్యూ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, రెస్టారెంట్లను మూసివేశారు. ప్రజా రవాణా సైతం నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను నిలిపివేశారు. అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వాహనాలను అనుమతించారు. ఆస్పత్రులు, వ్యాధి నిర్ధారణ చేసే ల్యాబ్‌లు, ఔషద దుకాణాలు తదితర అత్యవసర సేవలకు అనుమతి ఇచ్చారు. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై విపత్తుల నిర్వహణ చట్టం–2005 సెక్షన్ 51 నుంచి 60, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అన్ని జిల్లాల్లోను కర్ఫ్యూ అమలు తీరును వర్చువల్ పద్ధతిలో పరిశీలించారు. జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లు కర్ఫ్యూ అమలు తీరును స్వయంగా పర్యవేక్షించారు. కర్ఫ్యూ సమయంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర ప్రధాన నగరాలతోపాటు గ్రామాల్లోని రోడ్లు సైతం నిర్మానుష్యంగా మారాయి. సరిహద్దుల్లోను ‘చెక్’పోస్టులు ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన జగ్గయ్యపేట–కోదాడ, నాగార్జునసాగర్–మాచర్ల, పొందుగల–వాడపల్లి వద్ద చెక్‌పోస్టులతో రోడ్లను మూసివేశారు. వాహనాల రాకపోకలపైన ఆంక్షలు వి«ధించారు. అత్యవసరాలకు సంబంధించిన వాహనాలను మాత్రమే రాష్ట్ర పోలీసులు అనుమతించారు. విమాన, రైల్వే, బస్ టికెట్లు ఉన్నవారిని, ఆస్పత్రి ఇతర అత్యవసర పరిస్థితులు ఉన్నవారిని గుర్తింపు కార్డులను తనిఖీలు చేసి రాష్ట్రంలోకి అనుమతించారు. ఏపీ చెక్‌పోస్టు తమ భూ భాగంలో ఉందంటూ తెలంగాణ పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఏపీకి చెందిన చెక్‌పోస్టును అక్కడి నుంచి తొలగించి జగ్గయ్యపేట వైపునకు కొత్తగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని జిల్లా సరిహద్దులోను, ప్రధాన నగరాల్లోను పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద మధ్యాహ్నం 12 గంటల తరువాత తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు వెంకటేశ్వరరావు, సోమేశ్వరరావు, మహాలకు‡్ష్మడు వెనక్కుతిప్పి పంపారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలానికి ఆనుకుని వున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. చింతూరు మండలం చిడుమూరు వద్ద ఛత్తీస్‌గఢ్ నుంచి, కల్లేరు వద్ద ఒడిశా నుంచి మన రాష్ట్రంలోకి వాహనాలు ప్రవేశించకుండా తహశీల్దార్ కరక సత్యన్నారాయణ, ఎంపీడీవో వెంకట రత్నం, ఎస్ఐ సురేష్‌బాబు పర్యవేక్షించారు. -
సంక్షేమ పాలనకే ‘కొటియా’ ఓటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల ప్రజల మనోగతంపై ‘ఒడిశా వద్దు మొర్రో’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం ఇరు రాష్ట్రాల్లోని పాలకులను కదిలించింది. సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కొటియా ప్రజలకు ప్రయోజనాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవడానికి దోహదపడింది. కొటియా వివాదంపై ట్విట్టర్లో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆదివారం స్పందించారు. ‘కొటియా గ్రామాలన్నీ ఆంధ్రాలోనే ఉంటాం. ఒడిశా వద్దు మొర్రో అంటున్నాయి. సీఎం జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు ఇదే సాక్ష్యం. వైఎస్సార్ తర్వాత ఆ గిరిజన గ్రామాలను పట్టించుకున్న నాయకుడు సీఎం జగనే. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం వల్ల ఆంధ్ర స్కూల్స్‌లోనే వారి పిల్లల్ని చేర్పిస్తున్నారు’ అని ట్వీట్లో పేర్కొన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ కొటియా గ్రామాల్లో ప్రతి గిరిజన కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా ఐడీటీఏ పీఓ కూర్మనాథ్ చర్యలు చేపట్టారు. పట్టుచెన్నూరులో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి పట్టుచెన్నూరు, సల్ఫగుడ, ఎగువ మెండంగి గ్రామాలకు, పగులు చెన్నూరులో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి పగులు చెన్నూరు, డోలియాంబ, ముడకారు గ్రామాలకు, నేరెళ్లవలసలో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి పనుకువలస, దొరలతాడి వలస, రణశింగి, ఫణికి, సింహాగెడ్డ, గాలిగబడారు, మూలతాడివలస గ్రామాలకు, దూలిభద్రలోని స్టాక్ పాయింట్ నుంచి ఎగువ శంభి, కొటియ, దూలిభద్ర, ఎగువ గంజాయి భద్ర, దిగువ గంజాయి భద్ర గ్రామాలకు నిత్యావసర సరుకులు అందజేయాలని అధికారులకు సూచించారు. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఒడిశా ప్రభుత్వం, అక్కడి పోలీసులు కొటియా ప్రజలను అడ్డుకోవడాన్ని ఆంధ్రా పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో కొటియా సర్కిల్ ఇన్స్పెక్టర్ వీఎంసీఎం ఎర్రంన్నాయుడు వివాదాస్పద గ్రామాల్లో పర్యటించారు. -
నూనె మిల్లులపై దాడులు
నరసరావుపేట/తెనాలి రూరల్/భవానీపురం (విజయవాడ పశ్చిమ)/గుంటూరు (మెడికల్): ఆహార పదార్థాల కల్తీలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికన కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలోను, విజయవాడలోను ప్రత్యేక బృందాలు బుధవారం దాడులు జరిపాయి. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని నూనె మిల్లులపై ఆహార కల్తీ నియంత్రణ శాఖ, పౌర సరఫరాలు, తూనికల, కొలతల శాఖల అధికారులు బుధవారం దాడులు జరిపారు. కొబ్బరి, వేరుశనగ, సన్‌ప్లవర్ ఆయిల్స్‌ను రీ ప్యాకింగ్ చేస్తున్న మిల్లుల్లో రూ.4.51,665 విలువైన 3,152 లీటర్ల ఆయిల్ ప్యాకెట్లను సీజ్ చేసి, ఏడు శాంపిళ్లను సేకరించినట్టు ఆహార కల్తీ నియంత్రణ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ షేక్ గౌస్‌మొహిద్దీన్ తెలిపారు. కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు ఆహార వివిధ శాఖల అధికారులతో ఆరు బృందాలుగా ఏర్పడి ఆయిల్ మిల్లులపై నిర్వహించామని ఆయన చెప్పారు. సత్తెనపల్లి రోడ్డులోని కనకదుర్గ ఇండస్ట్రీస్‌లో రూ.77,765 విలువ చేసే 480 లీటర్ల వేరుశనగ నూనె ప్యాకెట్లను, కోటప్పకొండ రోడ్డులోని వెంకటలక్ష్మి ట్రేడర్స్ మిల్లులో రూ.3,28,900 విలువైన 2,192 లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను, హోం గాయత్రి ఇండస్ట్రీస్‌లో హెల్దీ ఆయిల్ కమ్ హెల్దీ లైఫ్ అని రాసిన రూ.45 వేల విలువైన 480 లీటర్ల సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను సీజ్ చేశామన్నారు. సత్తెనపల్లి రోడ్డులోని బొడ్డు నాగేశ్వరరావుకు చెందిన ధనలక్ష్మి నీమ్ ఆయిల్ మిల్లు, దివ్య నాగసాయి ఆయిల్ మిల్లులో వేరుశనగ నూనె, ఆంజనేయ ట్రేడింగ్ కంపెనీలో కొబ్బరినూనె శాంపిల్స్ సేకరించామన్నారు. నూనె తయారీ కేంద్రాలపై కేసులు ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తెనాలిలోని నూనె తయారీ కేంద్రాలపై బుధవారం దాడులు నిర్వహించారు. గంగానమ్మపేటలోని శ్రీనివాస ఆయిల్ అండ్ ప్రొవిజన్స్ సంస్థపైన, పూజ అండ్ నంది దీపారాధన తైలం తయారీ సంస్థపైనా కేసు నమోదు చేశారు. విజయవాడలో కొనసాగిన దాడులు విజయవాడ నగరంలో చేపట్టిన దాడులు బుధవారం కూడా కొనసాగాయి. భవానీపురం గాం«దీ»ొమ్మ రోడ్‌లోని వెంకటదుర్గ, మహేశ్వరి డాల్ మిల్స్‌పై ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు. రెండు మిల్లులలో రూ.3 లక్షల విలువైన పెసరపప్పు బస్తాలను సీజ్ చేసి నమూనాలను సేకరించారు. మహాత్మాగాంధీ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని రాకేష్ ట్రేడర్స్ ఆయిల్ కంపెనీ రాయలసీమ నుంచి దిగుమతి చేసుకున్న విడి నూనెను, నూనె ప్యాకెట్ల నమూనాలను సేకరించారు. భవానీపురం ఐరన్ యార్డ్‌లో పప్పు ధాన్యాల నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. దాల్ మిల్స్‌లోని పెసరపప్పులో నిషేధిత రంగు కలుపుతున్నట్టు గుర్తించామన్నారు. కల్తీ చేసే వారిపై చర్యలు తప్పవు.. నిత్యావసర సరుకులు, ఆహార పదార్ధాలను కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఆహారం .. హాహాకారం’, ‘బయో మాయా’ శీర్షికలతో ప్రచురితమైన కథనాలపై స్పందించిన కలెక్టర్ సివిల్ సప్లైస్, ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతల శాఖ అధికారులు, మునిసిపల్ కమిషనర్లతో కలెక్టర్ వివేక్‌యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సివిల్ సప్లైస్, ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతలు, పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు, మండలాల్లో తహసీల్దార్లతో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. రెస్టారెంట్లలో మాంసం కల్తీ ఎక్కువగా జరుగుతోందని, మునిసిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కల్తీ పురుగు మందులు, విత్తనాలు విక్రయించకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. -
ప్రజా పంపిణీ వ్యవస్ధలో నూతన విధానం
అమరావతి : నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో చెప్పిన ప్రతీ మాటను అక్షరాలా చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనేక సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలుచేస్తూ తనదైన పాలన అందిస్తున్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసిన ఆయన.. ముఖ్యమంత్రి అవగానే వాటిని పరిష్కరిస్తూ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు. నాడు పాదయాత్రలో ప్రజాపంపిణీ వ్యవస్ధలో కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్దులు, రోగులు పడుతున్న కష్టాలను గమనించి సమూలంగా మార్పులు తీసుకువస్తానని హమీ ఇచ్చిన వైఎస్ జగన్ ఇప్పుడు ఆ హమీని కూడా నెరవేరుస్తున్నారు. ఇంటివద్దకే రేషన్ సరుకులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా మెరుగుపరిచిన నాణ్యమైన స్వర్ణ రకం బియ్యాన్ని కార్డు దారుని ఇంటి వద్దే మొబైల్ వాహనం ద్వారా పంపిణీ చేయడమే లక్ష్యంగా సంవత్సరానికి రూ. 830 కోట్లు అదనంగా వెచ్చించి ఈ పధకం రూపొందించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వేదికగా గురువారం నాడు (21.01.2021) కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 డోర్ డెలివరీ వాహనాలను వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. నాణ్యమైన బియ్యం.. ఇప్పటివరకూ ప్రజా పంపిణీ వ్యవస్ధలో కార్డుదారులకు పంపిణీ చేయబడుతున్న బియ్యంలో నూకల శాతం, రంగుమారిన శాతం అధికంగా ఉండడం వల్ల కార్డుదారులు తినని బియ్యం రకాలు ఉండడం వల్ల ఎక్కువశాతం మంది వినియోగించడం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా కార్డుదారులు ఇష్టంగా తినగలిగే మెరుగపరిచిన నాణ్యమైన స్వర్ణ రకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా నాణ్యతపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తిని తొలగించి ఎక్కువ శాతం ప్రజలు ఇష్టంగా తినే స్వర్ణ రకం బియ్యాన్ని పంపిణీ చేయుటకు పౌరసరఫరాల శాఖ మొట్టమొదటి సారిగా బియ్యం సేకరణ సమయంలోనే సమూలమైన మార్పులు చేసి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసే సమయంలోనే స్వర్ణ రకం బియ్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాటిని మిల్లింగ్ సమయంలోనే నూకలు 15 శాతం, దెబ్బతిన్న బియ్యం 1.5 శాతంకు తగ్గించి మెరుగుపరిచిన స్వర్ణ మధ్యస్ధ రకం సార్టెక్స్ బియ్యాన్ని సేకరించి కార్డుదారులకు అందించడం జరుగుతుంది. నాణ్యత వివరాలు... సార్టెక్స్ బియ్యం – గతంలో ఇవ్వలేదు – ఇప్పుడు 100 శాతం నూకలు – గతం 25 శాతం – ఇప్పుడు 15 శాతం ఇసుక, మట్టి, రాళ్ళు – గతం 0.5 శాతం – ఇప్పుడు 0 శాతం చెడిపోయిన బియ్యం గింజలు – గతం 3 శాతం, ఇప్పుడు 0.75 శాతం రంగుమారిన బియ్యం గింజలు – గతం 3 శాతం, ఇప్పుడు 0.75 శాతం పరిపక్వం కాని బియ్యం గింజలు – గతం 5 శాతం, ఇప్పుడు 1 శాతం పట్టు తక్కువ బియ్యం – గతం 13 శాతం, ఇప్పుడు 10 శాతం ఇంటి వద్దనే రేషన్ డెలివరీ... ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్ధలో చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడంలో కొంతమంది దుకాణదారులు సరైన సమయపాలన చేయకపోవడం, సరుకులను సక్రమంగా పంపిణీ చేయకపోవడం, సరుకులను నల్లబజారుకు తరలించడం వంటి వాటి వల్ల కార్డుదారులకు కలుగుతున్న ఇబ్బందుల దృష్ట్యా వారి సౌకర్యం కోసం ముఖ్యంగా వృద్దులు, రోగులు, వేతనాలు కోల్సోతున్న రోజువారీ కూలీల కోసం ప్రభుత్వం నిత్యావసర సరుకులను మొబైల్ వాహనం ద్వారా ఇంటివద్దకే అందించే విధానం ప్రవేశపెట్టడం జరుగుతుంది.పాత విధానంలో నిత్యావసర సరుకులు పొందాలంటే గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండడం వల్ల రోజువారీ కూలీలు వేతనాలు కోల్పోయేవారు. కానీ కొత్త విధానంలో కార్డుదారులకు ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ జరగడం వల్ల కూలీ పనులకు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో చౌకదుకాణం ద్వారా పంపిణీ చేయడం వల్ల సరుకుల పరిణామంలో తగ్గుదలపై అనేక ఫిర్యాదులు వచ్చేవి. కానీ కొత్త విధానం ద్వారా కార్డుదారుల సమక్షంలోనే సంచులు తెరిచి, ఖశ్చితమైన తూకంతో సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది వలంటీర్ వ్యవస్ధను ఉపయోగించి కార్డుదారుల ఇంటి వద్దనే ప్రజల సమక్షంలో కార్డుదారుల వేలిముద్రల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని, ఖశ్చితమైన తూకంతో తిరిగి ఉపయోగించగలిగే సంచుల ద్వారా పంపిణీ చేయనున్నారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇవ్వనున్నారు. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతీ బియ్యం బస్తాకూ సీల్ వేయబడి ఉంటుంది, ప్రతీ సంచికీ కూడా యూనిక్ కోడ్ ఉండడం వల్ల ఆన్లైన్ ట్రాకింగ్ చేయబడుతుంది. అన్ని మొబైల్ వాహనాలకూ జిపిఎస్ అమర్చడం వల్ల కార్డుదారులు మొబైల్యాప్ ద్వారా పంపిణీ వివరాలు రియల్‌టైంలో తెలుసుకోవచ్చు. అంతేకాదు మొబైల్ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారుల సౌకర్యార్ధం సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతీ రోజూ సగటున 90 కార్డులకు తగ్గకుండా పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీనిపై నిరంతరం సోషల్ ఆడిట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ తూకం ద్వారా ఖశ్చితమైన తూకంతో సరుకుల పంపిణీ చేయనున్నారు. మొబైల్ వాహనం... బియ్యం, నిత్యావసర సరుకులు కార్డుదారులకు ఇంటివద్దే అందించేందుకు 9,260 మొబైల్ వాహనాలను రూ. 539 కోట్లతో కొనుగోలు చేయడం జరిగింది. ఈ వాహనాలను నిరుద్యోగ యువకులకు ఉపాధిహమీ కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా అర్హులైన లబ్దిదారులకు సంబంధిత సంస్ధల నుంచి 60 శాతం సబ్సిడీ ధరకు ప్రభుత్వం అందించింది. ఒక్కో వాహనం విలువ రూ. 5,81,000, ఇందులో 60 శాతం అనగా ప్రతీ వాహనం మీద రూ. 3,48, 600 సబ్సిడీగా వివిధ వెల్ఫేర్ కార్పొరేషన్ల నుంచి అందించడం జరిగింది. ఈ వాహనాలకు పౌరసరఫరాల సంస్ధ ప్రతీ నెలా అద్దె చెల్లిస్తూ ఆరు సంవత్సరాల పాటు వినియోగించుకోనున్నది. ఎస్టీ కార్పొరేషన్ – 700 ఎస్సీ కార్పొరేషన్ – 2,300 బీసీ కార్పొరేషన్ – 3,800 మైనారిటీస్ కార్పొరేషన్ – 660 ఈడబ్యూ, ఈబీ కార్పొరేషన్ – 1,800 మొత్తం మొబైల్ వాహనాలు – 9,260 బియ్యం కార్డులు... ఇప్పటివరకూ ప్రజలకు రేషన్ కార్డులు పొందడానికి సరైన విధానం అందుబాటులో లేక కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం సంక్షేమ పధకాలు పొందడానికి ప్రధానమైన బియ్యం కార్డును అర్హులైన ప్రజలకు అందించేందుకు సీఎం శ్రీ వైఎస్ జగన్ గ్రామ, వార్డు సచివాలయాల్లో 5 రకాల బియ్యం కార్డు సంబంధిత సేవలను అందిస్తూ కేవలం 10 రోజుల లోపు బియ్యం కార్డును అందించడం జరుగుతుంది. 5 రకాల బియ్యం కార్డు సంబంధిత సేవలు... 1. కొత్త రైస్ కార్డు 2. రైస్ కార్డు విభజన 3. రైస్ కార్డులో సభ్యుల చేరిక 4. రైస్ కార్డులో సభ్యుల తొలగింపు 5. రైస్ కార్డు అప్పగించుట జూన్, 2020 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన రేషన్ కార్డ్‌ల వివరాలు కొత్త బియ్యం కార్డ్‌లు – 4,93, 422 కొత్త బియ్యం కార్డ్‌లలో సభ్యులను చేర్చుట – 17,07,928 కొత్త బియ్యం కార్డ్‌ను విభజించుట – 4,38,013 మొత్తం – 26,39,363 -
వరద బాధితులకు అండగా ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: గత వారం రోజులుగా సంభవిస్తున్న వరదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉభయగోదావరి జిల్లాల్లో వరద బాధితులకు నిత్యావసర సరుకులను ఉచితంగా పింపిణీ చేయాలని ప్రభుత్వం సోమవారం ఆదేశించింది. ఈ మేరకు ముఖ్యమ్యంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలలో నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని అధికారలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో 25 కిలోల రైస్(బియ్యం)తో పాటు మొత్తం ఆరు రకాల సరుకులు అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వరదల కారణంగా వారానికి పైగా జలమయమైన ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచిత రేషన్ అందించాలని ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొంది. -
గంటన్నరలోనే నిత్యావసరాల డెలివరీ
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ మార్కెట్లో జియోమార్ట్, అమెజాన్‌డాట్‌కామ్‌లకు దీటైన పోటీనిచ్చే దిశగా ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా 90 నిమిషాల్లోనే నిత్యావసరాలు డెలివరీ చేసే కొత్త సర్వీసు ప్రారంభించింది. ’ఫ్లిప్‌కార్ట్ క్విక్’ పేరిట హైపర్‌లోకల్ డెలివరీ సేవలు ఆవిష్కరించింది. దీని ద్వారా తాజా కూరగాయలు, మాంసం, మొబైల్ ఫోన్లను గంటన్నర వ్యవధిలోనే అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కర్వా మంగళవారం తెలిపారు. ముందుగా బెంగళూరులో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఈ సర్వీసులు ఉంటాయని, క్రమంగా ఈ ఏడాది ఆఖరు నాటికి ఆరు పెద్ద నగరాలకు విస్తరిస్తామని ఆయన వివరించారు. ‘ఇంటి దగ్గరుండే కిరాణా దుకాణంలో ఉండే ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, మాంసం వంటి కేటగిరీలు కూడా చేర్చాం. విక్రేతలు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు అవసరమైన భారీ గిడ్డంగుల్లాంటివి కూడా ఏర్పాటు చేశాం‘ అని కర్వా వివరించారు. హైపర్‌లోకల్ డెలివరీ విభాగంలో మిగతా పోటీ సంస్థలతో పోలిస్తే మరింత నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తామన్నారు. ఇందుకోసం నాణ్యత, సర్వీస్ ప్రమాణాలకు ప్రాధాన్యమిచ్చే స్థానిక స్టోర్స్‌తో చేతులు కలపనున్నట్లు వివరించారు. అలాగే, నింజాకార్ట్, షాడోఫ్యాక్స్ వంటి కంపెనీలతో గల భాగస్వామ్యాన్ని కూడా ఈ సర్వీసుల కోసం ఉపయోగించుకోనున్నట్లు కర్వా చెప్పారు. షాడోఫ్యాక్స్ భాగస్వామిగా బెంగళూరులో సేవలు ప్రారంభించామని, తమ సొంత లాజిస్టిక్స్ విభాగం ఈకార్ట్ సర్వీసులు కూడా దీనికి ఉపయోగించుకుంటామని ఆయన పేర్కొన్నారు. 2,000 పైచిలుకు ఉత్పత్తులు.. తొలి దశలో నిత్యావసరాలే కాకుండా స్టేషనరీ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు, మొదలైన 2,000 పైచిలుకు ఉత్పత్తులను అందిస్తామని కర్వా తెలిపారు. కొనుగోలుదారులు తమ అవసరాన్ని బట్టి తదుపరి 90 నిమిషాల స్లాట్ లేదా 2 గంటల స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఉదయం 6 గం.లు మొదలుకుని అర్ధరాత్రి దాకా సర్వీసులు ఉంటాయని, నామమాత్రంగా రూ. 29 డెలివరీ చార్జీలు ఉంటాయని కర్వా పేర్కొన్నారు. -
పేదలకు నిత్యావసర సరుకులు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ 50వ జన్మదినోత్సవాన్ని పురçస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, అన్నదానం, రక్తదాన కార్యక్రమాలతో పాటు, కరోనా ఫ్రంట్ వారియర్స్‌కు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం గాంధీ భవన్లో రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్రావు నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారం భించగా గ్రేటర్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు మనోజ్ కుమార్ కుటుంబానికి ఎన్ఎస్యూఐ తరఫున 50వేల రూపాయల చెక్కును వారి బంధువులకు అందచేశారు. ఈ సందర్భం గా ఉత్తమ్ మాట్లాడుతూ రాహుల్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులను అభినందించారు. గాల్వాన్ అమరవీరుల ఆత్మ శాంతి కోసం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. -
నిత్యావసర సరుకులు అందజేత...
సినీ–టీవీ కార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన తనయుడు తలసాని సాయికిరణ్ ‘తలసాని ట్రస్ట్’ ద్వారా నిత్యావసర సరుకులు అందజేయడానికి ముందుకు వచ్చారు. 12 వేల మంది సినీ, 2 వేల మంది టీవీ కార్మికుల కుటుంబాలకు సాయం అందించే ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, ఎన్.శంకర్, సి.కళ్యాణ్ , ‘దిల్’ రాజు, కొరటాల శివ,రాధాకృష్ణ, రామ్మోహన్రావు, తలసాని సాయి చేతుల మీదుగా ఆయా యూనియన్ నాయకుల ద్వారా నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనాల్సి ఉంది. అయితే సమీప బంధువు చనిపోయిన కారణంగా హాజరు కాలేకపోయానని చిరంజీవి తెలిపారు. -
అహ్మదాబాద్‌లో 700 మంది సూపర్ స్ప్రెడర్స్
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో నిత్యావసర సరుకులు, కూరగాయలు అమ్ముకునేవారికి వారం రోజుల పాటు భారీ స్థాయిలో కోవిడ్ పరీక్షలు జరపగా, వారిలో 700 మంది ‘సూపర్‌స్ప్రెడర్స్’(వైరస్‌ను విస్తృతంగా వ్యాపింపజేసేవారు) ఉన్నారని అధికారులు గుర్తించారు. మే 7 నుంచి 14 వరకు పాలు, మందుల షాపులు మినహా మిగిలిన షాపులన్నింటినీ మూసివేసి, ఈ పరీక్షలు జరిపారు. వైరస్ వ్యాప్తికి కారణమని భావిస్తున్న కూరగాయలు, నిత్యావసరాలు, పాలు అమ్మేవారు, పెట్రోల్ బంకుల్లో పనిచేసేవారు, చెత్త ఏరుకునే వారిని ‘సూపర్ స్ప్రెడర్స్’గా గుర్తించారు. గత వారం రోజుల్లో 33,500 మందిని స్క్రీనింగ్ చేసి, అందులో 12,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 700 మందికి కోవిడ్ పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌లో ఉంచినట్టు అహ్మదాబాద్ కోవిడ్ బాధ్యతలు నిర్వర్తిస్తోన్న అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ వెల్లడించారు. -
సరుకు రవాణా వాహనాలకు పాస్‌లు అవసరం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాల మధ్య నడిచే ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలు, అన్లోడ్ చేసి వెళ్లే ఖాళీ వాహనాలకు పాస్‌లు అవసరం లేదని హోం శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ ఏప్రిల్ 15న జారీ చేసిన ఉత్తర్వుల్లోని నిబంధన 12(1), నిబంధన 12(6)లపై స్పష్టత ఇచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో సరుకు రవాణా వాహనాలు, అన్లోడ్ చేసిన వాహనాలను పాస్‌ల పేరిట అడ్డుకుంటున్నట్లు ఫిర్యాదు లు వచ్చాయని, వీటికి పాస్‌లు అవసరం లేదని, డ్రైవర్‌కు లైసెన్స్ ఉంటే చాలునని తేల్చి చెప్పింది. దేశంలో వస్తువుల సరఫరా సజావుగా సాగేందుకు ఇది తప్పనిసరి అని వివరించింది. రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలు ఈ ఆదేశాలు పాటించేలా సూచనలు జారీ చేయాలని కోరింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులను స్వస్థలాలకు పంపే విషయంలో జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. కరోనా ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని, వీరిని రోడ్డు మార్గంలో శానిటైజ్ చేసిన వాహనాల్లో తరలించాలని తెలిపింది. సంబంధిత రాష్ట్రాల అధికారులు ఈ విషయంలో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకుంటూ ఉండాలని సూచించింది. -
తగ్గని కరోనా ప్రకోపం
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట పడడం లేదు. దేశంలో కరోనా సంబంధిత మరణాల సంఖ్య వెయ్యికి, పాజిటివ్ కేసుల సంఖ్య 30 వేలకు చేరుకుంటోంది. ఈ వైరస్ బారినపడి సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు.. ఒక్కరోజులో 51 మంది కన్నుమూశారు. అలాగే కొత్తగా 1,594 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటిదాకా కరోనా సంబంధిత మరణాలు 937కు, పాజిటివ్ కేసులు 29,974కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. భారత్‌లో యాక్టివ్ కరోనా కేసులు 22,010 కాగా, 7,026 మంది(23.44 శాతం) బాధితులు చికిత్సతో కోలుకున్నారు. దేశంలో కరోనా వైరస్ బాధితుల్లో 111 మంది విదేశీయులు ఉన్నారు. వ్యాపార రంగాన్ని ఆదుకోవాలి: ఎస్.జయశంకర్ కరోనా మహమ్మారి కారణంగా చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు వ్యాపార రంగానికి సహకారాన్నందించి, ఎవరూ ఉపాధి అవకాశాలు కోల్పోకుండా చూడాల్సిన అవసరం ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ చెప్పారు. ఆయన బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంపై, మానవ సంక్షేమంపై ప్రభావం చూపడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ఈ మహమ్మారి ప్రభావితం చేస్తోందని, ఫలితంగా ప్రపంచ వాణిజ్యం, వస్తువుల సరఫరాకి తీవ్ర ఆటంకం కలుగుతోందని వెల్లడించారు. సాయుధ దళాల్లో తొలి మరణం కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో తొలి కరోనా మరణం నమోదయింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు చెందిన ఎస్ఐ స్థాయి అధికారి కోవిడ్–19తో మంగళవారం మరణించారని అధికారులు తెలిపారు. అస్సాంలోని బార్పేటకు చెందిన ఈయన ఇప్పటికే రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారన్నారు. కోవిడ్–19తో మరో 31 మంది చికిత్స పొందుతున్నారన్నారు. 55ఏళ్లు దాటిన పోలీసులకు సెలవులు 55 ఏళ్లు దాటిన పోలీసులు సెలవులు తీసుకోవాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇటీవల కోవిడ్ బారిన ముగ్గురు పోలీసుల్లో ఒకరు మరణించారు. ముగ్గురూ 50 ఏళ్లు దాటిన వారే కావడం గమనార్హం. కాగా, పోర్టు ఉద్యోగులు విధినిర్వహణలో ఉండగా కరోనా బారినపడి మరణిస్తే వారి కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశ రాజధానిలో నీతి ఆయోగ్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారికి కరోనా వైరస్ సోకింది. దీంతో నీతి భవన్‌ను 48 గంటల పాటు మూసివేశారు. సుప్రీంకోర్టు ఉద్యోగికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా న్యాయస్థానంలోని 36 మంది భద్రతా సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. సనంద్ పారిశ్రామికవాడలో కార్యకలాపాలు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సనంద్ పారిశ్రామికవాడలో ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు కార్యకలాపాలు పున:ప్రారంభించాయని హోంశాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ చెప్పారు. ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని అన్నారు. ప్లాస్మా థెరపీతో నయంపై ఆధారాల్లేవు కరోనా వైరస్ సోకితే ప్లాస్మా థెరపీతో పూర్తిగా నయమవుతుందంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం తేల్చిచెప్పింది. ప్లాస్మా థెరపీ ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని, కరోనా నివారణకు ఈ థెరపీ పనికొస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. ఈ చికిత్స శాస్త్రీయంగా నిరూపితమయ్యే వరకూ రీసెర్చ్, క్లినికల్ ట్రయల్స్‌లో తప్ప ఇతరులు ఉపయోగించడం చట్ట రీత్యా నేరమని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ సాధ్యాసాధ్యాలపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) జాతీయ స్థాయిలో అధ్యయనం నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతానికి కరోనా నుంచి బయటపడడానికి ధ్రువీకరించిన చికిత్సా విధానాలేవీ లేవని తెలిపారు. గతంలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డ 17 జిల్లాల్లో గత 28 రోజులుగా కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో ఇతర దేశాల కంటే భారత్ ముందంజలో ఉందని చెప్పారు. లాక్డౌన్ కంటే ముందు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు కావడానికి 3 నుంచి 2.25 రోజులు పట్టేదని, ప్రస్తుతం 10.2 రోజులు పడుతోందని లవ్ అగర్వాల్ వెల్లడించారు. -
ఇ-కామర్స్ కంపెనీలకు మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19, లాక్డౌన్ సమయంలో ఇ-కామర్స్ సంస్థలకు షాకిచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అత్యవరసమైన సరుకులు తప్ప, మిగిలిన సరుకు పంపిణీ కుదరదని తేల్చి చెప్పింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నాన్ ఎసెన్షియల్ వస్తువుల విక్రయంపై నిషేధం దేశవ్యాప్తంగా కొనసాగుతుందని హోం మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేసింది. అయితే నివాస ప్రాంతాల్లోని, మార్కెట్ కాంప్లెక్స్‌లలోని అన్ని దుకాణాలను తిరిగి తెరుచుకునేందుకు శనివారంనుంచి అవకాశం కల్పించింది. ఇ-కామర్స్ సంబంధించి అవసరమైన వస్తువుల విక్రయాలకు మాత్రమే అనుమతి వుంటుందని మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. అయితే ప్రభుత్వం ఆయా వెబ్సైట్ల గురించి ప్రస్తావించనప్పటికీ, ప్రధానంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలకు దెబ్బే. (జియోకు పోటీగా దూసుకొస్తున్న అమెజాన్) లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో నివాస సముదాయాలు, పరిసరాల్లోని దుకాణాలతో సహా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవాలని కేంద్రం తెలిపింది. అయితే ఈ సడలింపులు, కరోనావైరస్ హాట్స్పాట్లు లేదా కంటైన్మెంట్ జోన్లకు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కిరాణా దుకాణాలు, కూరగాయలు, మందులు లాంటి నిత్యావసర దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంది. తాజా సడలింపులతో స్టేషనరీ, బ్యూటీ సెలూన్స్, డ్రైక్లీనర్స్, ఎలక్టికల్ దుకాణాలకు తెరుచుకునేందుకు అవకావం వుంది. అయితే ఇవన్నీ ఆయా రాష్ట్రా ప్రభుత్వాల అనుమతితో మాత్రమే జరగాలని కేంద్ర స్పష్టం చేసింది. (కరోనా : టాప్-10 నుంచి స్టాక్ మార్కెట్ ఔట్) లాక్డౌన్ కారణంగా పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో గత వారం మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, బట్టలు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి వస్తువులను ఆన్లైన్లో విక్రయించడానికి అనుమతి ఇచ్చిన కేంద్రం మరికొన్నింటిపై ఆంక్షలు కొనసాగించడం గందరగోళానికి దారితీసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతో కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖందేల్వాల్ లేఖ రాశారు. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయాన్ని ప్రవీణ్ స్వాగతించారు కూడా. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే స్మార్ట్ఫోన్ల కోసం కొత్త ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించడం గమనార్హం. కాగా దేశంలో లాక్డౌన్.2 మే 3వ తేదీవరకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. (ప్రపంచంలోనే టాప్ సుందర్ పిచాయ్) చదవండి : కరోనా: ప్రమాదంలో 29 లక్షలకు పైగా ఉద్యోగాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు షాకివ్వనున్న జియో మార్ట్ కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం! 5 సెకన్లలో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు! -
నిత్యావసర సరుకులు పంపిణీ
కరోనా వైరస్ ప్రభావంతో నెలకొన్న లాక్ డౌన్ నేపథ్యంలో ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’లోని 100 మంది కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సంస్థ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ‘‘గతంలో కొంత మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మళ్లీ ఈరోజు మరో వందమందికి పంపిణీ చేయడం అభినందనీయం’’ అన్నారు బూర నర్సయ్య గౌడ్. ‘‘పది కేజీల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందించాం. త్వరలో మరికొంత మందికి అందిస్తాం’’ అన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ కార్యక్రమంలో ‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్’ కార్యదర్శి కాచం సత్యనారాయణ, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. -
రైతులను ఆదుకుంటున్నాం
సాక్షి, అమరావతి: రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని ఆదుకునేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కనీస మద్దతు ధర చెల్లించి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసరాల రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. వ్యాపారులు నిత్యావసరాల రేట్లను పెంచకుండా జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయించిన ధరలకే విక్రయాలు నిర్వహించేలా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. గ్రామ సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. లాక్డౌన్ నేపథ్యంలో వ్యవసాయ కార్యకలాపాలు, పంట ఉత్పత్తుల రవాణా, విక్రయాలకు ఇబ్బంది లేకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తరఫున వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ వై.మధుసూదన్‌రెడ్డి కౌంటర్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. కౌంటర్‌కు తిరుగు సమాధానం ఇవ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ కౌంటర్లోని ముఖ్యాంశాలు ► అర్హులందరికీ నిత్యావసరాలు అందించేలా ప్రభుత్వం బహుముఖ ప్రణాళికలను అమలు చేస్తోంది. రైతులు పండించిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేస్తోంది. ► వ్యవసాయ ఉత్పత్తులతోసహా నిత్యావసర సరుకులు తరలించే వాహనాలు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతులిచ్చాం. ► కనీస మద్దతు ధర చెల్లించి పొలాల వద్దే జొన్న, మొక్కజొన్న, కంది, శనగ, పసుపు తదితర పంటలను కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటివరకు 460 మెట్రిక్ టన్నుల టమోటా, 7వేల మెట్రిక్ టన్నుల అరటి పళ్లను రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ–కొనుగోళ్లు కూడా చేపడతాం. ► ఇప్పటివరకు 419 వికేంద్రీకరణ రైతు బజార్లు, 502 సంచార రైతు బజార్లు ఏర్పాటు చేశాం. కూరగాయల డోర్ డెలివరీని కూడా ప్రోత్సహిస్తున్నాం. ► రైతులు, వినియోగదారులు, ప్రజలు ఇబ్బందులను పరిష్కరించేందుకు 1902 టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ► ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వ్యాజ్యాన్ని కొట్టివేయాలని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. -
పేద పురోహితులకు నిత్యావసరాల పంపిణీ
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి, అమరావతి: విజయవాడ కృష్ణానది దుర్గాఘాట్‌లో పితృకర్మలు నిర్వహించే పేద పురోహితులకు బియ్యం, నిత్యావసర సరుకులను దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పురోహితులకు తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్సీపీ గౌరవధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సూచన మేరకు వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కరోనా ప్రభావంతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంటే హైదరాబాద్ వాసి చంద్రబాబు, అజ్ఞాతవాసి పవన్‌కల్యాణ్ విమర్శలు చేయడం సరికాదన్నారు. మోడల్ గెస్ట్‌హౌస్, కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పితృకర్మలు నిర్వహించే పురోహితులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. విజయమ్మకు ధన్యవాదాలు పితృకర్మలు నిర్వహించే పేద బ్రాహ్మణుల సమస్యపై వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పందించడంపై అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. పేద బ్రాహ్మణుల సమస్యపై శుక్రవారం విజయమ్మ స్పందించి మంత్రి వెలంపల్లికి సూచించడంతో శనివారం నిత్యావసరాలు పంపిణీ చేశారని, బ్రాహ్మణ సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీ: చకచకా పర్మిట్లు
సాక్షి, అమరావతి: నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించడంతో రాష్ట్రంలో ఉద్యాన పంటల ఎగుమతులకు మార్గం సుగమమైంది. రాష్ట్రం నుంచి ఏయే ప్రాంతాలకు పండ్లు, కూరగాయలు రవాణా అవుతాయో గుర్తించి ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సీఎం సంప్రదింపులు జరపడంతో మంగళవారం నుంచి పెద్దఎత్తున పండ్లు, కూరగాయల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా.. ► నిల్వ ఉంచితే పాడైపోయే పచ్చి సరుకును గుర్తించి ఉద్యాన శాఖాధికారులు రైతులకు వెంటవెంటనే పర్మిట్లు ఇప్పిస్తున్నారు. ► అలాగే, మార్కెటింగ్, రెవెన్యూ శాఖాధికారుల సహకారంతో త్వరితగతిన వాహనాలను ఏర్పాటుచేస్తున్నారు. ► ఫలితంగా ఉద్యాన పంటలు పొలం నుంచి వినియోగదారుల దరికి చేరుతున్నాయి. ► రాయలసీమ జిల్లాల నుంచి అరటి, బత్తాయి, పుచ్చ, టమాటా, ద్రాక్ష.. కోస్తా జిల్లాల నుంచి మామిడి, నిమ్మ, బొప్పాయితో పాటు ఇతర జిల్లాల నుంచి కూరగాయలు వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నట్లు ఉద్యాన శాఖ తెలిపింది. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇదిలా ఉంటే.. దళారీ వ్యవస్థను రూపుమాపే క్రమంలో ప్రభుత్వం పండ్లు, కూరగాయల వంటి వాటి రవాణాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆ శాఖాధికారులు చెబుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో శక్తి వంచన లేకుండా కృషిచేస్తున్నామని ఉద్యాన శాఖ అధికారి రత్నకుమార్ చెప్పారు. అంతేకాక.. ► అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి డీఆర్డీఏ సహకారంతో పెద్దఎత్తున అరటిని ఎగుమతి చేశామన్నారు. ► నూజివీడు నుంచి మామిడిని, మదనపల్లె నుంచి టమాటాను, నెల్లూరు నుంచి పుచ్చ, విజయనగరం, శ్రీకాకుళం నుంచి అరటి తదితర పంటలను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు తరలించారు. ► ఇందుకు వ్యవసాయం, అనుబంధ రంగాలతో పాటు మార్కెటింగ్, రెవెన్యూ శాఖ కూడా ఎంతో తోడ్పడుతోందని హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.హనుమంతరావు వివరించారు. ► పర్మిట్లు ఇప్పించడంలో, వాహనాలను సమకూర్చడంలో, సరుకును ఏయే ప్రాంతాలకు పంపవచ్చో విశ్లేషించడంలో ఉద్యాన శాఖ గ్రామ సహాయకులు, ఏడీఓలు, జేడీలు, డీడీ స్థాయి అధికారులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని చెప్పారు. ► కమిషనర్ చిరంజీవి చౌధురి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ రైతుల ఇక్కట్లను తొలగించేలా సూచనలు ఇస్తున్నారన్నారు. ఎక్కడికక్కడ మిర్చి కొనుగోళ్లు కరోనా కేసులు వెలుగులోకి రావడం, రెడ్‌జోన్‌లో ఉన్న నేపథ్యంలో మిర్చి విక్రయాలను గుంటూరు యార్డుకు బదులుగా ఇతర ప్రాంతాల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రోజుకు సగటున లక్ష టిక్కీల వరకు విక్రయాలు జరిగే గుంటూరు మార్కెట్ యార్డుకు రైతులు, వ్యాపారులు, హమాలీలు 10వేల మంది వస్తారు. భౌతిక దూరం పాటించే అవకాశాలు ఇక్కడ లేనందున ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ► రైతులకు ఇబ్బంది లేకుండా కోల్డు స్టోరేజి ప్లాంట్లు, జిన్నింగ్ మిల్లులు, మార్కెట్ యార్డులు, గ్రామాల్లో మిర్చి విక్రయాలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రద్యుమ్న వ్యాపారులు, ఎగుమతిదారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ► రాష్ట్రంలో 410 కోల్డు స్టోరేజి ప్లాంట్లు ఉండగా ఒక్క గుంటూరు జిల్లాలోనే 220 వరకు ఉన్నాయి. వీటితోపాటు జిన్నింగ్ మిల్లులు, మార్కెట్ యార్డుల్లో మిర్చి అమ్మకాలు చేపట్టనున్నారు. వ్యాపారులు, ఎగుమతిదారులు అక్కడే కొనుగోళ్లు చేపడతారు. ► ప్రస్తుతం దాదాపు 80 వేల టిక్కీలు రైతుల వద్దనే ఉన్నాయి. ► గత నెల మూడో వారం నుంచి మిర్చి అమ్మకాలు జరగకపోయినా ధరలో మార్పు లేకపోవటం రైతులకు కొంత ఊరట కలిగిస్తోంది. -
కరోనా: జోన్ల వారీగా కాల్ సెంటర్లు
సాక్షి, కృష్ణా: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి దిగ్బంధం చేశారు. పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు ఇంటికే పంపేలా చర్యలు చేపట్టారు. రెడ్జోన్ల వారీగా కాల్సెంటర్లను ఏర్పాటు చేశారు. సరుకులు అవసరమైన వారు ఫోన్ చేస్తే చాలు ఇంటికే పంపిస్తున్నారు. ఇళ్ల వద్దకే నిత్యావసరాలు.. నిత్యావసర సరుకులు ఇళ్ల వద్దకే పంపిణీ చేసేందుకు కిరాణా, కూరగాయలు, పండ్లు, పాల దుకాణాలను ఎంపిక చేశారు. ఒక్కో రెడ్‌జోన్‌లో 15–20 వరకు దుకాణాలను ఎంపిక చేసి వాటి యజమానులకు పాసులు జారీ చేస్తున్నారు. వారు బాయ్స్‌ను ఏర్పాటు చేసుకుని.. ఫోన్ చేసిన వారికి సరుకులు ప్యాక్ చేసి డోర్ డెలివరీ చేస్తున్నారు. బెజవాడలో టోల్ ఫ్రీ నంబరు.. విజయవాడ నగరంలో రాణిగారితోట, పాయకాపురం, విద్యాధరపురం, కుమ్మరపాలెం, ఖుద్దూస్గనర్, ఓల్డ్ రాజరాజేశ్వరీపేట ప్రాంతాలను రెడ్జోన్లుగా ప్రకటించారు. కరోనా వ్యాప్తి ప్రబలకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాలను బారికేడ్లతో మూసేసి.. రాకపోకలను నిలిపివేశారు. అక్కడ నివసిస్తున్న వారికి ఇళ్ల వద్దకే నిత్యావసరాలు, పాలు, పండ్లు, కూరగాయలను వీఎంసీ అధికారులు అందజేస్తున్నారు. ఇందుకోసం వీఎంసీ 0866–2427485 టోల్ ఫ్రీ నంబరును ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఈ నంబరుకు ఫోన్ చేసి తమ కావల్సినవి చెబితే సూపర్మార్కెట్ల ద్వారా డోర్ డెలివరీ చేయిస్తున్నారు. అదేకాకుండా ఆయా ప్రాంతాల్లోకి బస్సుల ద్వారా నిత్యావసరాలు, మొబైల్ రైతుబజార్ల ద్వారా కూరగాయలు కాలనీల్లోకి తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అలాగే పాలు, పండ్లు, మెడికల్ సంబంధించినవి కూడా అందజేస్తున్నారు. రూరల్ జిల్లాలో వలంటీర్లతో.. కృష్ణా రూరల్ జిల్లా మచిలీపట్నం, నందిగామ, నూజివీడు, జగ్గయ్యపేట, పెనమలూరు పట్టణాల్లో ఇంటింటికీ సరుకులు, మందులు వంటివి వలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. ∙జగ్గయ్యపేట పట్టణం, నందిగామ నియోజకవర్గంలోని రాఘవాపురం, ముప్పాళ్ల గ్రామాలను రెడ్జోన్లుగా ప్రకటించినప్పటి నుంచి ఆయా గ్రామాల్లో వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకు నిత్యావసరాలు, పాలు, పండ్లు, మందులను అధికారులు పంపిణీ చేయిస్తున్నారు. నూజివీడు పట్టణంలో నిత్యావసర, పాలు, మెడికల్ షాపుల యజమానుల నంబర్లును అందరికీ అందజేశారు. అవసరమైన సరుకులను ఫోన్ చేస్తే వారే డోర్ డెలివరీ చేస్తున్నారు. కూరగాయలను మున్సిపాలిటీ సిబ్బంది నాలుగు వాహనాల్లో తీసుకొచ్చి ఆయా వార్డుల్లో విక్రయిస్తున్నారు. ∙ఇక నూజివీడులో మాత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంటింటికీ పాలు అమ్ముతున్నారు. కూరగాయలు, పాలు, నిత్యావసరాలు మాత్రం ఎంపిక చేసిన దుకాణాల నుంచి డోర్ డెలివరీ చేయిస్తున్నారు. నిత్యావసరాలు డోర్ డెలివరీ జోన్ల వారీగా కాల్ సెంటర్లు కంటైన్మెంట్ ఏరియాల్లో భద్రత కట్టుదిట్టం అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ హెచ్చరికలు -
సరుకుల కొరతపై మేల్కొనండి!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ఉత్పత్తి తగ్గడం, సరుకు రవాణాలో ఆటంకాలు, కార్మికుల కొరత, గోదాముల మూత కారణంగా సరుకుల కొరత తీవ్రమవుతోంది. ముఖ్యంగా సూపర్ మార్కెట్లు, స్టోర్స్, కిరాణా దుకాణాలకు సరుకు రవాణా గొలుసు (సప్లయ్ చెయిన్) తెగిపోవడంతో స రుకుల లభ్యత తగ్గింది. ఈ దృష్ట్యా నిత్యావసరాలపై దృష్టిపెట్టిన కేంద్రం ఆహార ఉ త్పత్తులు, రవాణాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయిం చింది. వాటి ధరలను కట్టడి చేసేలా తక్షణ చర్య లు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. 50 శాతం కొనలేకపోయారు.. నిత్యావసర వస్తువుల లభ్యతను పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. పెద్దసంఖ్యలో విని యోగదారులు తమ వస్తువులను ఆఫ్‌లైన్, ఆన్లై న్లో పొందలేకపోతున్నారని తాజా సర్వే వెల్లడిం చింది. స్థానిక కిరాణా దుకాణాల ద్వారా నిత్యావసరాలను 35 శాతం కొనలేకపోయారని, ఈ–కామర్స్ సంస్థలైన అమెజాన్, బిగ్‌బాస్కెట్, జొమా టో వంటి ఆన్లైన్ సంస్థల ద్వారా నిత్యావసరా లు కొనలేని వినియోగదారులు 50 శాతం వరకు ఉన్నారంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారా ల మంత్రిత్వశాఖ, సోషల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫాం సంయుక్తంగా 16వేల మంది వినియోగదారుల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది. ఆన్లైన్ ద్వారా గోధుమలు, బియ్యం, పప్పు ధా న్యాలు, ఉప్పు, చక్కెర వంటి సరుకుల్లోనూ 39 శాతం మంది మాత్రమే పూర్తి వస్తువులు పొందగలి గారని, మిగతా వారిలో కొందరికి కొన్ని వస్తువులు దొరకగా, చాలామందికి అవసరమైన సరుకులు లభించలేదంది. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకత్వం.. మిల్లులు, గిర్నీలు పనిచేయకపోవడంతో గోధుమ, శనగ, జొన్న పిండ్ల లభ్యత తగ్గింది. దీంతో వీటి ధరలు పెరిగాయి. గోధుమ పిండి ధర రూ.10 మేర పెరిగి రూ.36కి చేరింది. మహారాష్ట్ర నుంచి చక్కెర దిగుమతులు తగ్గడంతో దాని ధర కూడా బాగా పెరిగింది. కార్మికుల కొరతతో ప్యాకేజ్డ్ ఆహార వస్తువుల సరఫరా డిమాండ్‌కు తగ్గట్లు మార్కెట్లో కనబడట్లేదు. ముఖ్యంగా బిస్కెట్స్, బ్రెడ్, స్నాక్స్, సబ్బులు, షాంపూలు, రవ్వ, నూనెలు వంటి వాటి సరఫరా అటు కిరాణాలకు, సూపర్ మార్కెట్లకు త క్కువగా ఉందని వర్తకులు చెబుతున్నారు. ఈ దృ ష్ట్యా, సరుకుల సరఫరా గొలుసు రవాణాకు ఎక్క డా ఇక్కట్లు రాకుండా చూడాలని రాష్ట్రాలను కేం ద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. రాష్ట్రీ యంగా, అంతర్రాష్ట్రాల నుంచి నిత్యావసరాలను రవాణా చేసే కార్గో సర్వీసులు, ట్రక్కులు, కా ర్మికులు, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు సజా వుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా రాష్ట్రాలకు లేఖలు రాశారు. హెల్ప్ లైన్ నంబరు.. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, ఆహార ఉత్పత్తుల రవాణాకు ఇబ్బందులు లేకుండా.. పోలీసు శాఖ 04023434343 నంబరుతో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సమస్యలు ఎదురైతే పరిష్కరించేలా చర్యలు తీసుకుంది. -
పేద సినీ కార్మికులకు సహాయం
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్‌లు నిలిచిపోవడంతో సినీకార్మికుల్ని ఆదుకునేందుకు చిరంజీవి ఆధ్వర్యంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం’ (సీసీసీ) ప్రారంభించారు. నటీనటుల సహా పలువురు దాతల నుంచి సీసీసీకి విరాళాలు వెల్లువెత్తాయి. ముందే ప్రకటించినట్లు ఈ ఆదివారం నుంచి 24 శాఖల్లోని పేద కార్మికులకు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుల సంఘం అధ్యక్షుడు శంకర్ బృందం నిత్యావసరాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ –‘‘సినీపరిశ్రమలోని ప్రతి కార్మికుడి ఇంటికి నెలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకుల్ని అందిస్తున్నాం. అందులో భాగంగా ఆదివారం స్టూడియోస్ విభాగం కార్పెంటర్స్కి సరుకులు అందించాం. నిరంతరం సాగే ప్రక్రియ ఇది. ప్రతి నెలా సరుకులు కార్మికుల ఇంటికే చేరతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య కర్త అయిన చిరంజీవిగారితో సహా దాతలందరికీ కృతజ్ఞతలు. ‘సీసీసీ మనకోసం’ కమిటీ సభ్యులైన తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్ , బెనర్జీ.. ఇలా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దర్శకుడు మెహర్ రమేష్ అందిస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేనిది’’ అన్నారు. -
రైల్వే పోర్టర్లకు ఆపన్నహస్తం
సాక్షి, హైదరాబాద్: రైళ్లు నిలిచిపోవటంతో పనుల్లేక ఇబ్బంది పడుతున్న రైల్వే కూలీలకు ఆ శాఖ సిబ్బంది ఆపన్నహస్తం అందించారు. లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రైళ్లు నిలిచిపోయాయి. దీంతో పనుల్లేక రైల్వే పోర్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులు ఇచ్చే డబ్బులు తప్ప వీరికి ప్రత్యేకంగా జీతం అంటూ ఉండదు. దీంతో వీరికి ఆదాయం లేక వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. దీన్ని గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే కమర్షియల్ విభాగం సిబ్బంది డబ్బులు పోగు చేసి నిత్యావసర వస్తువులు కొని వారికి అందించారు. కొంత నగదు కూడా అందజేశారు. హైదరాబాద్ డివిజన్లో 101 మందికి బియ్యం, పప్పు, నూనె ప్యాకెట్లు, గోధుమ పిండి, ఉప్పు, సబ్బులు, శానిటరీ కిట్లతో పాటు మరికొన్ని వస్తువులను ప్యాకెట్లుగా చేసి వారికి అందజేశారు. వీటితోపాటు ఒక్కొక్కరికి రూ. 2,600 చొప్పున నగదు కూడా అందజేశారు. గుంతకల్లు డివిజన్లో 40 మందికి సరుకులతోపాటు రూ.500 నగదు, గుంటూరు డివిజన్ పరిధిలో 33 మందికి సరుకులతోపాటు రూ. 1,500 నగదు, నాందేడ్ డివిజన్ పరిధిలో 33 మందికి సరుకులు అందజేశారు. కమర్షియల్ విభాగం సిబ్బంది వితరణను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు. -
కిరాణా రవాణా : చేతులు కలుపుతున్న దిగ్గజాలు
సాక్షి, ముంబై: కరోనా వైరస్, లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులను ఆదుకునేందుకు పలు సంస్థలు నడుం బిగించాయి. ఇంటికి పరిమితమైపోయిన ప్రజల ఇంటిముందుకే నిత్యాసరాలను చేరవేసేందుకు పరస్పర భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాయి. ముఖ్యంగా పలు ఫుడ్ డెలివరీ సంస్థలు, క్యాబ్ సర్వీసుల సంస్థలు ఈ కోవలో ముందున్నాయి. ఉబెర్, డామినోస్ పిజ్జా , ర్యాపిడో, జైప్, స్విగ్గీ, జొమాటో, స్కూట్సీ లాంటి సంస్థలు బిగ్ బజార్, స్పెన్పర్ , బిగ్ బాస్కెట్ గ్రోఫర్స్ లాంటి సంస్థలతో నిత్యావసరాల పంపిణీకి ఈ భాగ స్వామ్యాలను కుదుర్చుకున్నాయి. అంతేకాదు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి దిగ్గజాలతో ఈ విషయంలో జరుపుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ప్రముఖ రిటైల్ సంస్థ స్పెన్సర్స్..క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ భాగస్వామ్యంతో వినియోగదారులకు సరుకులను చేరవేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా స్పెన్సర్స్ నిత్యావసరాలను వినియోగదారుల ఆర్డర్ల మేరకు క్యాబ్‌లలో డోర్ డెలివరీ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్పెన్సర్స్ స్టోర్ల నుంచి ఈ సేవలు అందిచనున్నారు. ఇప్పటికే కోల్‌కతా, లక్నో, ఘజియాబాద్ వంటి నగరాల్లో ట్రైల్ రన్ నిర్వహించగా అది విజయవంతమైందని స్పెన్సర్స్ వెల్ల్లడించింది. ద్విచక్ర వాహనాలకంటే అధిక మొత్తంలో సరుకులను వినియోగదారులకు అందచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు నిత్యవసర సరుకులకు ఎటువంటి లోటు లేకుండా అందించేందుకు క్యాబ్ అగ్రిగేటర్ ఊబర్‌తో కలిసి పనిచేస్తున్నట్లు స్పెన్సర్స్ రిటైల్, నేచుర్స్ బాస్కెట్ ఎండీ దేవేంద్ర చావ్లా వెల్లడించారు. ఈ భాగస్వామ్యంతో ఆన్లైన్, ఫోన్ల ద్వారా వచ్చే ఆర్డర్లను ఊబర్ క్యాబ్‌లలో సరఫరా చేస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బైక్‌లకంటే క్యాబ్‌లలోనే అధిక మొత్తంలో నిత్యవసరాలను సుదూర ప్రాంతాల్లోని కస్టమర్ల ఇళ్లకు సైతం చేరవేసే సదుపాయం ఉండడంతో ఈ సర్వీసులపై మొగ్గుచూపుతున్నట్లు ఆయన వివరించారు. (కరోనా : వారికి ఉబెర్ ఉచిత సేవలు) కరోనా లాక్డౌన్ కాలంలో ప్రజలకు నిత్యవసరాల కొరత ఏర్పడకుండా ఉండేందుకు స్పెన్సర్స్ రిటైల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ఉబర్ ఇండియా అండ్ సౌత్ ఏషియా డైరెక్టర్ పరభ్‌జీత్ సింగ్ వెల్లడించారు. అంతేగాకుండా ఈ కష్టకాలంలో తమ ఊబర్ క్యాబ్ డ్రైవర్లకు ఆదాయం సమకూర్చేందుకు ఇది ఉపయోగపడుతున్నందున ఎటువంటి చార్జీలు గానీ కమీషన్లు గాని తమ సంస్థ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇంకా జొమాటో సంస్థ గ్రోఫర్స్తోనూ, డామినోస్ ఐటీసీతో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఇంకా లక్షలమంది రీటైల్ వర్తకులతో చర్చలు జరుపుతున్నట్టు జొమాటో వెల్లడించింది. అలాగే స్పెన్సర్స్ కు చెందిన నేచుర్స్ బాస్కెట్ సంస్థ బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్, బిగ్ బజార్, పండ్లు, కూరగాయల పంపిణీకి నింజాకార్ట్ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా దాదాపు రెండు లక్షల మంది డ్రైవర్లలో 70 శాతం మందికి ఉపాధి లభించడంతోపాటు, వినియోగదారులకు అవసరాలు కూడా తీరతాయని ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు అరవింద్ శంక వ్యాఖ్యానించారు. (లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది) చదవండి : కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్ -
మానవత్వపు పరిమళాలు
సాక్షి, హైదరాబాద్: ఇవీ.. డీజీపీ కార్యాలయంలో ‘గుడ్ సమారిటన్, పోలీస్ గ్రూప్’నకు వస్తున్న వినతులు. రాష్ట్రంలోని నిత్యావసరాల సరఫరాకు ఎక్కడా ఆటంకం కాకూడదని డీజీపీ మహేందర్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ‘కమోడిటీస్ కంట్రోల్ రూము’ను అధికారులు ఏర్పాటు చేశారు అందులో ‘గుడ్ సమారిటన్, పోలీస్’పేరిట వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. పౌరసరఫరాల శాఖ, మెప్మా, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, పలు ఎన్జీవోలు, యువ వలంటీర్లు, వ్యాపారులు, అధికారులు ఈ విపత్కర సమ యంలో చిక్కుకున్న పలువురి ఆకలి తీర్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ గ్రూపులో అనాథాశ్రమాలు, వృద్ధజనాశ్రమాల నిర్వాహకులను కూడా సభ్యులుగా చేర్చారు. ఫలితంగా ఎలాంటి వినతి వచ్చినా.. వెంటనే వారికి కావాల్సిన ఆహారం, ఇతర నిత్యావసరాలను అప్పటికప్పుడు దాతలతో మాట్లాడి వారికి చేరవేసేలా చూస్తున్నారు. సాధారణ వ్యాపారుల నుంచి బహుళజాతీయ కంపెనీల సీఈఓల వరకు అన్నార్తులకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్న తీరును చూసి పోలీసులే ఆశ్చర్య పోతున్నారు. విపత్కర పరిస్థితుల్లో తోటి మానవుడిని ఆదుకునేందుకు ముందుకు వస్తోన్న వారినిచూసి గర్వంగా ఉందని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విరాళాలను చూసి తాము పడుతున్న శ్రమను మర్చిపోతున్నామన్నారు. ► సార్.. నేను ఆసిఫాబాద్ నుంచి మాట్లాడుతున్నా.. నేనో చిరువ్యాపారిని. ఈరోజు మా ప్రాంతంలో కనీసం ఐదుగురికి భోజనం పంపాలనుకుంటున్నా. ► సార్..! నేనో బహుళజాతి కంపెనీకి సీఈఓను.. నిరాశ్రయులు, యాచకులకూ కడుపు నింపేందుకు రెండు క్వింటాళ్ల బియ్యం పంపాలనుకుంటున్నా. విరాళాల వెల్లువ.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 230కి పైగా వృద్ధజనాశ్రమాలు, అనాథాశ్రమాలకు ఆహారం, బియ్యం, ఉప్పు, పప్పు, నూనె కావాలని ‘గుడ్ సమారిటన్ , పోలీస్’గ్రూపును ఆశ్రయిస్తున్నారు. ఈ సమాచారాన్ని వెంటనే విమెన్ అండ్ చైల్డ్ విభాగం, సివిల్ సప్లై విభాగం, ఇతర దాతలు, ఎన్జీవోలకు చేరవేసి కావాల్సిన నిత్యావసరాలు సరఫరా చేయిస్తున్నారు. అలాగే ఇటుక బట్టీ కార్మికులు, యాచకులు, ఇతర రాష్ట్రాల కూలీలు, నిరాశ్రయులకు చాలామంది క్వింటాళ్ల కొద్దీ బియ్యాన్ని, ఇతర పప్పులు, నూనె, మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు తదితర నిత్యావసరాలను విరాళంగా ఇస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చిన నిత్యావసరాలను ఆయా పోలీసుల ద్వారా సజావుగా పంపిణీ చేయిస్తున్నారు. కొందరు స్వచ్ఛంద సంస్థలు దూరమైనా శ్రమకోర్చి అన్నార్తులకు నిత్యావసరాలను చేరవేస్తున్నాయి. -
నిత్యావసరాలకు ఆందోళన వద్దు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో వినియోగదారులు నిత్యావసర వస్తువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. విక్రేతల వద్ద సరిపడ నిల్వ ఉందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) తెలిపింది. స్పెన్సర్, వీ–మార్ట్ వంటి కొన్ని కొన్ని సంఘటిత రిటైలర్లు పలు రకాల సరుకుల మీద నియంత్రణ పెట్టారని ఆర్ఏఐ సీఈఓ కుమార్ రాజగోపాలన్ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో సరుకుల సరఫరా మీద ప్రభావం ఉందని స్పెన్సర్ రిటైల్ ఎండీ దేవేంద్ర చావ్లా తెలిపారు. ‘ప్రస్తుతం మా స్టోర్లలో నిత్యావసరాల పూర్తి స్థాయి స్టాక్ ఉంది. కొన్ని రకాల బ్రాండ్ల తయారీ సంస్థలతో మాట్లాడుతున్నాం. త్వరలోనే అవి కూ డా అందుబాటులోకి వస్తాయి’ అని పేర్కొన్నారు. కొనుగోళ్ల మీద నియంత్రణ.. గ్రాసరీల నిల్వ సరిపడా ఉన్నా సరే ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఫుడ్ అండ్ గ్రాసరీ స్టోర్ చెయిన్ ఈజీడే క్లబ్, వీ–మార్ట్ కొనుగోళ్ల మీద నియంత్రణ పెట్టాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని వీ–మార్ట్ స్లోర్టలోనూ సరుకుల కొరత లేదని, వినియోగదారులు కొనుగోలు మీద నియంత్రణ పెట్టామని వీ–మార్ట్ రిటైల్ చైర్మన్ అండ్ ఎండీ లలిత్ అగర్వాల్ తెలిపారు. ఉదాహరణకు బియ్యం 20 కిలోలు, పిండి 10 కిలోలు, పప్పు దినుసులు 4 కిలోలు, బిస్కెట్స్ 12 ప్యాకెట్లు, చక్కెర 5 కిలోలు మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంది. బిగ్ బజార్ స్టోర్లలో ఎలాంటి నియంత్రణ లేదని తెలిపింది. కార్మికుల కొరత.. ఫ్యాక్టరీలలో కార్మికుల కొరత, సరుకుల రవాణా వాహనాల లభ్యత ప్రధాన సవాళ్లుగా మారాయని హెచ్‌యూఎల్, ఐటీసీ, డాబర్ ఇండియా, పార్లే, జీసీపీఎల్, జ్యోతి ల్యాబ్స్ వంటి ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు తెలిపాయి. వచ్చే 2–3 వారాల పాటు సరిపడే నిత్యావసరాల నిల్వ ఉందని, ఆ తర్వాత తయారీ ప్లాంట్ల కార్యకలాపాలకు, ఆయా ఉత్పత్తుల సరఫరా వాహన అనుమతులకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నాయి. ‘లాక్డౌన్ నేపథ్యంలో కొన్ని ప్లాంట్ల ఉత్పత్తి మీద ప్రభావం పడింది. అయినా ఇతరత్రా మార్గాల ద్వారా రోజువారీ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత చర్యలు తీసుకుంటున్నాం’ అని హెచ్‌యూఎల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీనివాస్ పాటక్ తెలిపారు. ముడిసరుకుల వాహనాలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ సప్లయి ఆగిందని డాబర్ ఇండియా ఆపరేషన్స్ ఈడీ షారుఖ్ ఖాన్ తెలిపారు. స్థానిక ప్రభుత్వం అనుమతితో కొద్ది మంది కార్మికులతో నిత్యావసర సరుకుల తయారీ ప్లాంట్లలో మాత్రం ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తున్నామని, పూర్తి స్థాయి అనుమతులకు మరికొంత సమయం పట్టే సూచనలున్నాయని ఐటీసీ తెలిపింది. ఉత్పత్తులకు కొరత రాకుండా ప్రభుత్వ అనుమతులతో 50% కార్మికులు, షిఫ్ట్‌ల వారీగా ప్లాంట్ నిర్వహణ చేస్తున్నామని పార్లే తెలిపింది. దేశవ్యాప్తంగా 90 లక్షల ట్రక్స్ ఉండగా.. కేవలం 5% మాత్రమే నడుస్తున్నాయని ఆల్ ఇండియా మోటార్ టాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) తెలిపింది. లాక్‌డౌన్‌తో డ్రైవర్ల కొరతతోపాటూ లోడింగ్, అన్లోడింగ్ చేసే కార్మికుల కొరత ఉందని పేర్కొంది. ఉబెర్ ద్వారా ఇంటికి సరుకులు ట్యాక్సీ సేవల్లో ఉన్న ఉబెర్ తన కస్టమర్లకు కావాల్సిన సరుకులను డెలివరీ చేయనుంది. బిగ్‌బాస్కెట్‌తో ఈ మేరకు చేతులు కలిపింది. హైదరాబాద్ సహా బెంగళూరు, చండీగఢ్, నోయిడాలో ఈ సేవలను అందించనుంది. ద్విచక్ర వాహనాలు (ఉబర్ మోటో), కార్ల ద్వారా (ఉబెర్ గో, ఉబెర్ ఎక్స్ఎల్) సరుకులను వినియోగదార్ల ఇంటికే చేరవేస్తామని ఉబెర్ తెలిపింది. ఇటువంటి సేవల కోసం ఇతర సూపర్ మార్కెట్లు, ఫార్మాసీలతోనూ చర్చిస్తున్నట్టు వివరించింది. -
నిరంతరాయంగా.. నిత్యావసరాల సరఫరా
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని తరిమేయడానికి కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ను సజావుగా సాగేలా చూస్తూనే.. మరోవైపు నిత్యావసరాల కొరత, సరఫరాకు ఇబ్బంది రాకుండా చూస్తున్నారు తెలంగాణ పోలీసులు. సరఫరాలో ఎలాంటి అవాంతరం ఎదురైనా క్షణాల్లో పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సరుకులను ఉత్పత్తి దారుడి నుంచి వినియోగదారుడికి ఎలాంటి ఆటంకం లేకుండా చేరేలా చూడటమే ఈ రూం ప్రధాన లక్ష్యం. ఆహారపుగొలుసు తెగితే అది శాంతి భద్రతలకు, ప్రజల ప్రశాంత జీవనానికి భంగం వాటిల్లజేస్తుంది. ఫలితంగా లాక్డౌన్ ఉద్దేశం నెరవేరకపోగా, విపరీత పరిణామాలకు దారి తీసే ప్రమాదముంది.అందుకే, జీవో నం.45లో పేర్కొన్న విధంగా నిత్యావసరాల నిరంతరాయ సరఫరాకు పోలీసుశాఖ పెద్దపీట వేసింది. ఇందుకు సంబంధిత శాఖలతో కలిసి పనిచేస్తోంది. కంట్రోల్ రూమ్ నేపథ్యమిదీ.. లాక్డౌన్ నేపథ్యంలో జనసంచారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షల నేపథ్యంలో రెండోరోజే కూరగాయలు, నిత్యావసరాల ధరలు అమాంతంగా పెంచారు వ్యాపారులు. ఒక్కరోజు లాక్‌డౌన్‌కే ధరలు పదింతలు పెరగడాన్ని ప్రభుత్వం, పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది. తరువాత ధరలు పెంచకపోయినా.. నిత్యావసరాల రవాణాకు పలుచోట్ల ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి కమోడిటీస్ కంట్రోల్ రూంను డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. సీఐడీ ఏడీజీ గోవింద్ సింగ్, విమెన్‌సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా, విమెన్‌సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతిలకు ఈ కంట్రోల్ రూం బాధ్యతలు అప్పగించారు. ఆహారం, మందులు, నూనె, బియ్యం, కూరగాయలు, పౌల్ట్రీ, పండ్లు, మాంసం తదితర నిత్యావసరాల రవాణాకు సజావుగా సాగేలా చూస్తారు ఎలా పనిచేస్తుందంటే..? ఇందుకోసం జీవో నెం.45లో పేర్కొన్న విధంగా ఆరోగ్య, సివిల్‌సప్లయ్, వైద్య, వ్య వసాయ, పౌల్ట్రీ, మార్కెటింగ్, సూపర్‌మార్కెట్, రైస్‌మిల్లర్ల వ్యాపారులు– అధికారులతో కలిసి ప్రత్యేక వాట్సాప్‌గ్రూప్ ఏ ర్పాటు చేశారు. ప్రతీ జిల్లాకు ఒక డీఎస్పీ ర్యాంకు అధికారిని నోడల్ అధికారులుగా నియమించారు. రాష్ట్రంలో ఎక్కడ నిత్యావసరాలు సరఫరా చేసే వాహనం ఆగినా.. సదరు వ్యాపారులు కమోడిటీస్ కంట్రోల్‌రూమ్‌కు సమాచారమిస్తారు. వారు సదరు జిల్లా నోడల్ ఆఫీసర్‌ను అప్రమత్తం చేస్తా రు. సదరు అధికారి స్థానిక పోలీసులతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించి.. వాహనం సాఫీగా వెళ్లేలా చూస్తారు. ము ఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల మధ్య నిత్యావసరాల రవాణాకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ప్రతీరోజూ సాయంత్రం నోడల్ అధికారులతో టెలికాన్ఫ రెన్స్ నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను తెలుసుకుని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
లాక్డౌన్: నిత్యావసర సరుకుల రవాణాపై చర్యలు
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశమంతట లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడకుండా వాటిని అందుబాటులోకి తెచ్చే విషయంలో పర్యవేక్షణ కోసం కమాండ్ కట్రోల్ను ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్నా తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యావసర సరుకుల విషయంలో జిల్లాల్లో కూడా జేసీల అధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరుకుల రవాణ, అధిక ధరలపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్ నెంబర్ 1902కు డయల్ చేయాలని చెప్పారు. సరుకుల రవాణకు ఇబ్బంది లేకుండా ఈ-పాస్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టామని, పంటలను మార్కెట్టుకు తెచ్చే విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (రేషన్' ఫ్రీ') అంతేగాక నిత్యావసరాలకు సంబంధించి ప్రైవేటు రంగంలో పని చేసే ఉద్యోగులకు, సిబ్బందికి ఈ-పాస్ అందచేస్తున్నామని ఆయన తెలిపారు. సరుకులను ప్రజలకు అందజేసే విషయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఇందుకోసం రైతు బజార్లను వికేంద్రీకరించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 101 రైతు బజార్లు ఉంటే.. మరో 350 రైతు బజార్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేగాక 130 మొబైల్ రైతు బజార్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 753 మంది మాత్రమే డోర్ డెలివరీని వివియోగించుకుంటున్నారని, ఈ సంఖ్యను పెంచాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కిరాణా షాపుల యజమానులు డోర్ డెలివరీకి సిద్దంగా ఉన్నారని, సప్లై చైన్ బ్రేక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నమని తెలిపారు. ఉల్లి, అరటి వంటి పంటలకు మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా పొరుగు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. (కరోనా చికిత్సకు కొత్త పరికరం) -
నిత్యావసరాల రవాణాలో రైల్వేదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాల ఇబ్బందులు తలెత్తకుండా రైల్వేశాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినప్పటి నుంచి నిత్యావసర సరుకుల రవాణా కోసం ప్రత్యేకంగా గూడ్స్ రైళ్లను తిప్పుతోంది. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ నిత్యావసరాల కొరత రాకుండా చూస్తోంది. గత ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా లక్షన్నర వ్యాగన్ల నిత్యావసరాలు రవాణా చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఇందులో బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలు, ఉల్లి, పండ్లు, కూరగాయలు, పాలు, వంట నూనె తదితర నిత్యావసరాలున్నాయి. వీటితో పాటు థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు, వ్యవసాయ రంగానికి ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు మొదలైనవి రవాణా చేస్తోంది. కరోనాను జాతీయ విపత్తుగా భావించి సరుకు రవాణాలో డెమరేజ్, వార్ఫేజ్ ఛార్జీలను ఎత్తేసింది. అవసరాన్ని బట్టి మరిన్ని రాయితీలు కల్పిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. - ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినప్పటినుంచి దక్షిణ మధ్య రైల్వే అదనంగా 270 గూడ్స్ రైళ్లను నడిపి రికార్డు సాధించింది. - ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య పట్టణాల్లో ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్లకు రోజుకు సగటున 1.80 మిలియన్ టన్నుల చొప్పున నిత్యావసర సరుకులు సరఫరా చేస్తోంది. - ఒక్కో వ్యాగన్‌కు 60 టన్నుల వరకు సరుకును చేరవేసే సామర్థ్యం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. - రేణిగుంట నుంచి వ్యాగన్ ద్వారా ఢిల్లీకి పాలు సరఫరా చేసి అక్కడి ప్రజల అవసరాలు తీర్చింది. - రైల్వే ఉద్యోగులకు రొటేషన్ పద్ధతిలో ఎమర్జెన్సీ డ్యూటీల కింద సరుకు రవాణా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. - లాక్ డౌన్ ఎత్తేసేవరకు గూడ్స్ రవాణాలో అదనపు ఛార్జీలు (డెమరేజ్, వార్ఫేజ్ ) విధించకూడదని రైల్వేశాఖ నిర్ణయించింది. - కంటైనర్ టారిఫ్‌లో కూడా స్టేకింగ్, డిటెన్షన్ వంటి ఛార్జీలు విధించడం లేదు. -
ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండాలి
సరుకులు, నిత్యావసర వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ రంగాలకు చెందిన వాహనాలను నిలిపేస్తున్నారంటూ సమాచారం వస్తోంది. దీనిపై వెంటనే డీజీపీ దృష్టి పెట్టి, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి పర్యవేక్షణలో ఉన్న ప్రతి 10 మందికీ ఒక డాక్టర్‌ను కేటాయించాలి. వీరిని పల్మనాలజిస్ట్ పర్యవేక్షించాలి. వీరి పని సాఫీగా సాగేందుకు, అనువైన సలహాలు, సూచనలు, వైద్య ప్రక్రియలపై అవగాహనకు డాక్టర్లు, స్పెషలిస్టుల మధ్య వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించాలి. ప్రతి 50 ఇళ్లకు చెందిన ప్రజల పరిస్థితులను ఎప్పటికప్పుడు వలంటీర్లు నమోదు చేసే విధానాన్ని నిరంతరం కొనసాగించాలి. వలంటీర్లు, ఆశా వర్కర్లు, వైద్యులకు వైరస్ సోకకుండా ప్రొటెక్షన్ సూట్లు, పరికరాలు అందించాలి. కరోనా కేసుల టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచడంపైన కూడా దృష్టి పెట్టాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో ప్రజలకు సరిపడా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు తొలుత అందుబాటులోకి తేవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అవి ప్రజల సంఖ్యకు తగినట్లుగా ఉన్నాయా లేదా అనే దానిపై శాస్త్రీయంగా పరిశీలించి మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఆ తర్వాత సంతృప్తి చెందితేనే లాక్డౌన్ సడలింపు సమయం తగ్గించడంపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిపై శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న తీరు, దాని నివారణ కోసం అందుబాటులో ఉన్న వైద్య విధానాలు, డేటా విశ్లేషణ ద్వారా చేపట్టాల్సిన ప్రణాళికపై సమావేశంలో సీఎం విస్తృతంగా చర్చించారు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, అమలవుతుండటం గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ముఖ్యమంత్రికి వివరించారు. లాక్ డౌన్ నేపథ్యంలో రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న సమయాన్ని తగ్గించాలనే అంశాన్ని అధికారులు ప్రస్తావించారు. అనంతరం సీఎం పలు ఆదేశాలు, సూచనలు చేశారు. హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం వైద్యం – జిల్లాల్లో కోవిడ్–19 నివారణ చర్యల కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే డాక్టర్లను గుర్తించి వారి సేవలను తీసుకోవాలి. – తమ సర్వే ద్వారా వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు గుర్తించిన వారిని డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లి... నిర్దేశించుకున్న హెల్త్ ప్రొటోకాల్ ప్రకారం వారికి వైద్యం అందించాలి. – విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. కరోనా వైరస్ విస్తరించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ మరింత పటిష్టంగా నివారణా చర్యలు చేపట్టాలి. ఇదే సమయంలో ప్రజలకు నిత్యావసరాలు, తాగు నీరు, మందులు, పారిశుధ్యం తదితర ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలి. లాక్‌డౌన్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణ ప్రాంతాలపై మరింత దృష్టి – దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులకు సంబంధించి 10 కేసుల్లో 9 పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 1 కేసు లెక్కన నమోదవుతున్నాయని, అందుకే పట్టణ ప్రాంతాలపై మరింత దృష్టి సారిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. – కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా వీలైనంత ఎక్కవ మంది వైద్యులు, సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావడంపై చర్చ. హౌస్ సర్జన్ల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం. – వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఆక్వాకు సంబంధించి కరోనా కారణంగా ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించడంపై సంబధిత అధికారులు దృష్టి సారించాలని సీఎం ఆదేశం. సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు చేసుకునే వారికి అవకాశం కల్పించాలని సూచన. – ఎవరికి కరోనా లక్షణాలు కనిపించినా ఐసోలేషన్‌లో పెట్టాలని గట్టి నిర్ణయం. – ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (ఆరోగ్య శాఖ మంత్రి) ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గూడ్స్, నిత్యావసర వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ రంగాలకు చెందిన వాహనాలను నిలిపేస్తున్నారంటూ సమాచారం వస్తోంది. దీనిపై వెంటనే డీజీపీ దృష్టి పెట్టి, ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి పర్యవేక్షణలో ఉన్న ప్రతి 10 మందికీ ఒక డాక్టర్‌ను కేటాయించాలి. వీరిని పల్మనాలజిస్ట్ పర్యవేక్షించాలి. వీరి పని సాఫీగా సాగేందుకు, అనువైన సలహాలు, సూచనలు, వైద్య ప్రక్రియలపై అవగాహనకు డాక్టర్లు, స్పెషలిస్టుల మధ్య వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించాలి. ఏర్పాట్లు బాగుండాలి.. - కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎక్కడి వారు అక్కడే ఉండాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వారి బాగోగులు చూసుకుంటాయి. అయినా పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి చెందిన కొందరు కూలీలు, కార్మికులు తరలి వస్తే సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో మాట్లాడాలి. - సరిహద్దుల వద్దకు వచ్చి ఆగిపోయిన వారు 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడితేనే రాష్ట్రంలోకి అనుమతివ్వాలి. అక్కడ ఉన్న మన ప్రజలకు వసతి, భోజనం అందేలా చూడాలి. - పొరుగు రాష్ట్రాల్లో ఏపీ ప్రజల బాగోగులను చూసేందుకు, ఆయా రాష్ట్రాల అధికారులు, ప్రధాన కార్యదర్శులతో సమన్వయం చేయడానికి, రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిన వారి బాగోగులు (ఏర్పాట్లు, క్వారంటైన్ సదుపాయాలు) చూసుకోవడానికి ఇద్దరు ఐఏఎస్ అధికారులు సతీష్ చంద్ర, పీయూష్ కుమార్ల నియామకం. పర్యవేక్షణ, సమన్వయానికి ప్రతి క్యాంపునకూ ఒక రెసిడెంట్ అధికారిని నియమించాలి. ఏర్పాట్లు బాగోలేవు అనే మాట రాకూడదు. - సరిహద్దుల్లో ఉన్న కళ్యాణ మండపాలు, హోటళ్లు తదితర వాటిని గుర్తించి, శానిటైజ్ చేసి అందుబాటులోకి తీసుకురావాలి. -
కరోనాపై ప్రజాయుద్ధం
కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావడం తగ్గించడంతో అన్నిచోట్లా ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అనుగుణంగా ప్రజలు కూడా నడుచుకుంటుండటంతో శుక్రవారం నుంచి వీధుల్లోని పరిస్థితులు చక్కబడుతున్నాయి. ప్రతిచోటా బహిరంగ ప్రదేశాల్లో కూరగాయల దుకాణాలను ఏర్పాటు చేయడం, పలుచోట్ల వివిధ మాల్స్, దుకాణదారుల ద్వారా నిత్యావసర వస్తువులను డోర్ డెలివరీ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా కరోనాపై ప్రజాయుద్ధం మొదలైంది. – సాక్షి నెట్వర్క్ విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి గుంటూరులో ఒకచోట పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించి ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆ వ్యక్తి ఎవరెవరిని కలిశాడనేది ఆరా తీసి.. సన్నిహితంగా మెలిగిన 34 మందిని క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. గుంటూరు నగరంతో పాటు, జిల్లాలోని ఇతర పట్టణాల్లోనూ నిత్యావసర సరుకులను డోర్ డెలివరీ చేసేలా ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. పొందుగల, నాగార్జున సాగర్ చెక్‌పోస్టుల వద్ద శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. - పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడికక్కడే క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం 1,640 బెడ్లు సిద్ధం చేశారు. విదేశాల నుంచి జిల్లాకు 4,146 మంది వచ్చినట్లు గుర్తించి వారందరినీ 28 రోజులపాటు గృహ నిర్బంధంలో ఉంచి వారి ఇళ్ల వద్ద పోస్టర్లు అతికిస్తున్నారు. - కడప జిల్లాలో లాక్ డౌన్ అమలును కట్టుదిట్టం చేయటంతో జనాలు బయటకు రాలేదు. విజయనగరం జిల్లాలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాలేదు. జిల్లాలో సుమారు 200 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. - ప్రకాశం జిల్లాలో లాక్డౌన్ పటిష్టంగా అమలైంది. చీరాల ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తొలగించి అనుమానిత లక్షణాలతో ఎవరైనా కనిపిస్తే వారిని చీరాల ఏరియా హాస్పిటల్‌కు తరలించేలా నిర్ణయం తీసుకున్నారు. - ప్రభుత్వ ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో మాల్స్ యాజమాన్యాలతో మాట్లాడి నిత్యావసర సరుకుల డోర్ డెలివరీని ప్రారంభించారు. మండపేట మున్సిపల్ అధికారులు మూడు రంగులతో కూడిన పాస్‌లను ప్రజలకు అందజేస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎవరు ఏ సమయాల్లో వెళ్లాలో నిర్దేశిస్తూ ఈ పాస్‌లను వలంటీర్ల ద్వారా జారీ చేస్తున్నారు. - కర్నూలు జిల్లాలో వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. డిపార్ట్మెంటల్ స్టోర్స్‌కు ఫోన్ చేస్తే ఇంటికే సరుకులు పంపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అంబేడ్కర్ వర్సిటీలో నిర్వహిస్తున్న క్వారంటైన్లో 61మంది ఉన్నారు. వీరిలో విదేశీయులే ఎక్కువమంది. ముస్లింలు ఇంటి వద్దే నమాజ్ చేసుకోవాలని శ్రీకాకుళం జామియా మసీదు వద్ద బోర్డు ఏర్పాటు చేశారు. - నెల్లూరులోని సర్వజనాస్పత్రిని అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలకు రీజినల్ కోవిడ్ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. 600 బెడ్స్‌తో కూడిన ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శేషగిరిబాబు సూచించారు. జిల్లాలో 1,554 మందిని హోం క్వారంటైన్ చేశారు. - చిత్తూరు జిల్లా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చిత్తూరు నగరానికి ఇటలీ నుంచి ఓ వ్యక్తి రావడంతో అతడిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. -
ఫోన్ చేస్తే ఇంటికే సరుకులు
దేశమంతా లాక్డౌన్.. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల కొనుగోలుకు మధ్యాహ్నం 1 గంటలోపే బయటకు వెళ్లాలి. నగరాలు, పట్టణాల్లో దుకాణాలు మరీ దూరంగా ఉంటున్నాయి.. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిత్యావసరాల కొనుగోలు ఎలా అని దిగులు చెందుతున్నారా?... మరేం ఫర్వాలేదు.. మీరు ఫోన్ చేస్తే చాలు.. కావాల్సిన సరుకుల వివరాలు వాట్సాప్‌లో పంపితే చాలు.. నేరుగా మీ ఇంటికే సరుకులు వచ్చేస్తాయి. సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో నగరాలు, పట్టణాల్లో ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిత్యావసర సరుకులను సూపర్ మార్కెట్ల నుంచి నేరుగా వినియోగదారుల ఇళ్లకే సరఫరా చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ప్రజలు బయటకొచ్చి సూపర్ మార్కెట్ల వద్ద గుమిగూడకుండా ఉండటానికే ఈ ఏర్పాటు చేసింది. ముందుగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. తర్వాత అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు సరుకుల డోర్ డెలివరీ కోసం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఆయా సూపర్ మార్కెట్ల యాజమాన్యాలతో చర్చించారు. డీమార్ట్, రిలయన్స్ మార్ట్, బిగ్ బజార్, స్పెన్సర్, బెస్ట్ ప్రైస్, మెట్రో, మోడర్న్ సూపర్ మార్కెట్.. ఇలా పలు సూపర్ మార్కెట్ల వివరాలతో ప్రకటనలు ఇచ్చారు. వినియోగదారులు తమకు కావాల్సిన సరుకుల వివరాలు, తమ చిరునామాను ఆ సూపర్ మార్కెట్ల వాట్సాప్ నంబర్లకు పంపి ఫోన్ చేస్తే చాలు. 24 గంటల్లో సరుకులను వినియోగదారుల ఇళ్లకు సరఫరా చేస్తారు. సరుకులు ఇంటికి చేరాక నగదు చెల్లించే వెసులుబాటును కల్పించారు. అయితే.. కనీసం రూ.వెయ్యి విలువైన సరుకులు కొంటేనే ఇంటికి సరుకులను సరఫరా చేస్తారు. విజయవాడలో మొదటి రెండు రోజుల్లోనే 5 వేల ఇళ్లు, విశాఖలో 8 వేల ఇళ్లకు సరుకులను డోర్ డెలివరీ చేశారు. కాకినాడ, రాజమహేంద్రవరంలలో గురువారం నుంచి ఈ సదుపాయం ప్రారంభం కాగా మొదటి రోజే 2 వేల ఇళ్ల చొప్పున సరుకులను డోర్ డెలివరీ చేశారు. తిరుపతి, కర్నూలు తదితర చోట్ల కూడా వినియోగదారులు ఈ సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తమకు ఇబ్బంది లేకుండా సూపర్ మార్కెట్ల నుంచి నేరుగా ఇళ్లకే సరుకులను సరఫరా చేస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ మార్కెట్ల సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు కోవిడ్ వ్యాప్తి చెందకుండా వైద్యుల సూచనల మేరకు డోర్ డెలివరీ చేసే సిబ్బంది పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కులు ధరించడంతోపాటు చేతికి ప్రతి గంటకు శానిటైజర్లు రాసుకుంటున్నారు. ఒకరికొకరు దూరాన్ని కూడా పాటిస్తున్నారు. వినియోగదారులకు వైద్యుల సూచనలు.. సూపర్ బజార్ల నుంచి వచ్చిన సరుకులను వెంటనే ఇంటిలో డబ్బాల్లో వేయవద్దని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. సరుకులను ఏడెనిమిది గంటల పాటు ఎండలో పెట్టాలని చెబుతున్నారు. అనంతరమే డబ్బాల్లో వేయాలని స్పష్టం చేస్తున్నారు. ఖాళీ ప్యాకెట్లను కూడా ఇంటిలో ఉంచకుండా బయట డస్ట్బిన్లలో వేయాలని పేర్కొంటున్నారు. ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది సూపర్ మార్కెట్ల నుంచి వినియోగదారుల ఇళ్లకు సరుకుల సరఫరా విధానానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరంలలో ఈ విధానాన్ని ప్రారంభించాం. వైద్యుల సూచనలతో సూపర్ మార్కెట్ల యాజమాన్యాలు, సిబ్బంది, డెలివరీ బాయ్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో కూడా ఈ విధానాన్ని ప్రారంభిస్తాం. –డి.మురళీధర్‌రెడ్డి, కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా నిత్యావసరాల కోసం ఆందోళన లేదు విజయవాడలో లాక్డౌన్ ప్రకటించిన రోజు నిత్యావసరాల కోసం ప్రజలు దుకాణాల వద్ద బారులు తీరారు. సామాజిక దూరం కూడా పాటించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సూపర్ మార్కెట్ల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి డోర్ డెలివరీకి ఒప్పించాం. – ప్రసన్న వెంకటేశ్, కమిషనర్, విజయవాడ నగరపాలక సంస్థ -
‘మీ–సేవ’ 2.0!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 180 రకాల పౌర సేవలను మొబైల్ ద్వారా అందించేందుకు ‘టీ యాప్ ఫోలియో’ పేరుతో త్వరలో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. ఇది మీ–సేవ ప్రాజెక్టుకు 2.0 (ఆధునిక వెర్షన్) అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో సోమవారం జరిగిన ఈ–గవర్నెన్స్ జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. డిజిటల్ ప్రజాస్వామ్యానికి ప్రజలు డిజిటల్ విప్లవం బాట వేయాలని, సాంకేతిక విజ్ఞాన ఫలాలను ప్రజలు ఆర్థికాభివృద్ధికి వినియోగి ంచుకోవాలని పిలుపునిచ్చారు. ఏడేళ్ల కిందట ప్రారంభమైన మీ–సేవ కేంద్రాల ద్వారా రాష్ట్రంలో జరిగిన లావాదేవీల సంఖ్య ఇటీవలే 10 వేల కోట్లు దాటిందని చెప్పారు. రాష్ట్రంలో 4,500 మీ–సేవ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 1.5 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా పౌర సేవల్లో ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించి పరిపాలన పాత్రను విస్తృతం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రి వివరించారు. వాహన యజమానుల సమస్యలను తొలగించేందుకు ‘ఆర్టీఏ ఎం–వ్యాలెట్’పేరుతో యాప్‌ను ప్రవేశపెట్టగా తొలి మూడు నెలల్లోనే 13 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన కొత్త పారిశ్రామిక విధానం ‘టీఎస్ ఐపాస్’కింద పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని, ఇప్పటివరకు 6 వేల పరిశ్రమలకు అనుమతులు జారీ చేయగా రూ. 1.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయన్నారు. సులభతర సంస్కరణల అమలులో రాష్ట్రం గతేడాది అగ్రస్థానంలో నిలిచిందన్నారు. భవన నిర్మాణ అనుమతులకు కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, 21 రోజుల గడువులోగా అనుమతులు జారీ చేసేందుకు కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. టీ–ఫైబర్ కార్యక్రమం ద్వారా 15 ఎంబీపీఎస్ల వేగంతో రాష్ట్రంలోని ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలకు 2 జీబీ వేగంతో నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నామని, ఈ ప్రాజెక్టు ద్వారా టీవీలనే స్మార్ట్ కంప్యూటర్లుగా వినియోగించుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. 2.95 కోట్ల బోగస్ రేషన్‌కార్డులు తొలగించాం: కేంద్ర మంత్రి చౌదరి పౌర సేవలను వేగంగా, పారదర్శకంగా అందించడంతోపాటు వ్యవస్థలో అవినీతి నిర్మూలనకు ఈ–గవర్నెన్స్ దోహదపడుతోందని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి సీఆర్ చౌదరి తెలిపారు. ఆధార్‌తో అనుసంధానం కాని 2.95 కోట్ల రేషన్ కార్డులకు నిత్యవసర వస్తువులను నిలిపివేశామన్నారు. దీంతో ఏటా రూ. 17 వేల కోట్ల విలువైన నిత్యవసర సరుకులు అర్హుల చేతికి అందుతున్నాయన్నారు. ఐటీ, ఈ–గవర్నెన్స్‌లో తెలంగాణ పనితీరు బాగుందని ప్రశంసించారు. కార్యక్రమంలో కేంద్ర ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి కె.వి. ఇయాపెన్, ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్ని, యూఐ డీఏఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, జీఎస్టీఎన్ చైర్మన్ అజయ్ భూషణ్ పాండే, ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
తూకంలో దగా..
నిబంధనలు పాటించని వ్యాపారులు వినియోగదారుల జేబులకు చిల్లు ‘మామూలు’గా తీసుకుంటున్న తూనికలు, కొలతల అధికారులు మంచిర్యాలలోని మజీద్‌వాడకు చెందిన ఓ చిరు వ్యాపారి.. హోల్‌సెల్ దుకాణంలో ఈ మధ్య క్వింటాల్ బియ్యం, 5 కిలోల పెసరపప్పు, 5 లీటర్ల పల్లి నూనె (టిన్), 5 కిలోల ఉల్లిగడ్డలు, 5 కిలోల పంచదార, 5 కిలోల గోధుమలు ఇలా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసింది. ఇంటికి వచ్చాక తమ కిరాణం షాపులో ఉన్న కాంటాలో తూకం వేసి పరిశీలించగా.. 5 కిలోలు కొనుగోలు చేసిన పంచదార నాలుగు కిలోలే వచ్చింది. ఈ విషయమై జిల్లా కేంద్రంలోని తూనికలు, కొలతల అధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వారం రోజుల క్రితం కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేస్తుండగా ఆ వ్యాపారి తూనికలు వేసేందుకు రాళ్లను వినియోగించాడు. దీంతో ఆ మహిళ సదరు వ్యాపారిని ప్రశ్నించింది. దీంతో ‘నీ ఇష్టం ఉంటే కొను. లేకుంటే లేదు’ అంటూ వ్యాపారి సమాధానం ఇచ్చాడు. ఎవరి దగ్గరికెళ్లినా ఈ బండ రాళ్లే కనిపిస్తాయని చెప్పడం విడ్డూరం. మంచిర్యాల క్రైం : జిల్లాలో సరుకుల కొనుగోలు చేస్తున్న వినియోగదారులు పలుచోట్ల తూనికల్లో భారీగా మోసపోతున్నారు. కిరాణం, రేషన్, పండ్లు, కిరోసిన్ దుకాణాల్లో తూకాల్లో మోసాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే విధంగా.. బియ్యం వ్యాపారులు కూడా 50 కిలోల బ్యాగులో ఒకటి నుంచి రెండు కిలోలు తక్కువగా తూకం వేస్తున్నారు. వీటికితోడు పెట్రోల్, డీజిల్ కొలతల్లోనూ నిత్యం మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిపై తూనికలు, కొలతల అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదన్న ఆరోపణలున్నాయి. అడపాదడపా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘మామూలు’గా తీసుకుంటున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కానరాని చట్టాలు.. తూనికల కొలతల్లో వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు రూపొందించిన చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. ఎవరికైనా తూకంలో తేడా వస్తే ఫిర్యాదు చేస్తే అధికారులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు.. మారుతున్న కాలంలో ప్రతి దుకాణంలో ఎలక్ట్రానిక్ కాంటాలు వాడుతున్నారు. ఈ కాంటాలో మోసం జరుగుతూనే ఉంది. కాంటాలో కేజీలకు బదులు మిల్లీమీటర్లలో తేడా వచ్చే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు. కాంటాలో సాంకేతిక తేడాలు రావడంతో వినియోగదారులు భారీగా నస్టపోతున్నారు. నిబంధనలు బేఖాతర్.. నిబంధలనల ప్రకారం ప్రతి ఏడాడి వ్యాపారులు వారివారి కాంటాలను సంబంధిత తూనికలు, కొలతల శాఖ కార్యాలయానికి తీసువెళ్లి అధికారులతో తనిఖీ చేయించి వాటిపై ముద్ర వేయించాలి. కానీ.. వ్యాపారులు మాత్రం ఏళ్ల వరకు తనిఖీలు చేయించుకోకుండానే యథేచ్చగా వ్యాపారం సాగిస్తున్నారు. కిలోబాటు ఏడాదికి 50 గ్రాముల వరకు అరుగుదల ఉంటుంది. కానీ.. వ్యాపారులు పట్టించుకోవడంలేదు. దీంతో కిలోకు తూకంలో 50 గ్రాముల తేడా వస్తుంది. ఈ రకంగా వినియోగదారులు పెద్దఎత్తున ఆర్థికంగా నష్టపోతున్నారు. అంతేకాక కొంతమంది వ్యాపారులు వివిధ రకాల వస్తువులను ముందుగానే ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఆ ప్యాకింగ్ కవర్లపై తయారీ తేదీ, కంపెనీ వివరాలు పొందుపరచడం లేదు. ఇప్పటికైనా అధికారులు తూకంలో జరిగే మోసాలను అరికట్టి వినియోగదారులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు. జిల్లాలో మూడు సంవత్సరాలుగా నమోదై కేసులు, వచ్చిన ఆదాయం.. 2014లో.. కాంటాలకు, బాట్లకు ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.6,54,410 ► దుకాణలపై దాడి చేయగా రాజీకి వచ్చి జరిమానాతో కలిపి ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.6,76,600 ►బాట్లపై ముద్ర లేకపోవడంతో చేసిన కేసులు 146 ►వస్తువులపై ఎమ్మార్పీ రేటు, సరైన చిరునామా లేకపోవడంతో నమోదు చేసిన కేసులు 120 2015లో.. ►కాంటాలకు, బాట్లకు ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.6,60,190 ►దుకాణలపై దాడి చేయగా రాజీకి వచ్చి జరిమానాతో కలిపి ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.5,10,600 ► బాట్లపై ముద్ర లేకపోవడంతో చేసిన కేసులు 92 ►వస్తువులపై ఎమ్మార్పీ రేటు, సరైన చిరునామా లేకపోవడంతో నమోదు చేసిన కేసులు 101 2016లో.. ► కాంటాలకు, బాట్లకు ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.7,20,630 ► దుకాణాలపై దాడి చేయగా రాజీకి వచ్చి జరిమానాతో కలిపి ముద్ర వేయగా వచ్చిన ఆదాయం రూ.5,40,300 ►బాట్లపై ముద్ర లేకపోవడంతో చేసిన కేసులు 102 ►వస్తువులపై ఎమ్మార్పీ రేటు, సరైన చిరునామా లేక పోవడంతో నమోదు చేసిన కేసులు 70 సమాచారం ఇస్తే చర్యలు కిరాణం షాపులు, కూరగాల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నాం. గడిచిన సంవత్సరం 172 కేసులు నమోదు చేశాం. కొన్ని దుకాణాలలో ఎలాంటి అడ్రస్ లేకుండా, వాటిపై ఎమ్మార్పీ రేటు లేకుండా అమ్ముతున్నారు. వినియోగదారులు సైతం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వస్తువులను కొనుగోలు చేయరాదు. తూనికలు, కొలతల్లో అనుమానం కలిగితే సమాచారం ఇవ్వాలి. వారిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు. నిర్భయంగా 9849430056 నెంబర్‌కు ఫోన్ చేయొచ్చు. వారి పేర్లు వెల్లడించం. – ఎండీ రియాజ్హైమద్ఖాన్, జిల్లా తూనికలు,కొలతల అధికారి, మంచిర్యాల -
సర్వర్ డౌన్
సాక్షి, విజయవాడ : పెద్ద పండుగ సంక్రాంతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇస్తున్న కానుకలు, నిత్యావసరాలు అందుకునేందుకు తెల్లకార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ-పోస్ యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో రేషన్‌షాపుల వద్ద కార్డుదారులు పడిగాపులు కాస్తున్నారు. నగదు రహిత సేవలను అమలుచేయాల్సి రావడంతో డీలర్లకు చుక్కలు కనపడుతున్నాయి. మొరాయిస్తున్న సర్వర్ జిల్లాలోని 11.80 లక్షల మంది తెల్లకార్డుదారులు 2,161 రేషన్ షాపుల నుంచి నెలనెలా నిత్యావసర సరకులు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో వాడే ఈ-పోస్ యంత్రాలు అన్నీ ఒకే సర్వర్‌కు అనుసంధానమై పనిచేస్తున్నాయి. నెలవారీ సరకులతోపాటు సంక్రాంతి కానుకలను ఒకే సారి ఇవ్వాల్సి రావడంతో సర్వర్‌పై భారం పెరిగింది. దీంతో ఈ-పోస్ యంత్రాలు పని చేయడంలేదు. ఈ నేపథ్యంలో రోజుకు కనీసం 20 మందికి మించి సరకులు ఇవ్వలేకపోతున్నామని డీలర్లు పేర్కొంటున్నారు. సరకులు ఇవ్వడం ప్రారంభించిన పావుగంటకే ఈ-పోస్ యంత్రాలు ఆగిపోతున్నాయని, తిరిగి గంటకో, రెండు గంటలకో పనిచేస్తున్నాయని, మళ్లీ అరగంటే పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించే నాథుడే కరువయ్యారని ఆరోపిస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోరుున తరువాత సర్వర్ పనిచేస్తోందని డీలర్లు పేర్కొంటున్నారు. ఒకేసారి చంద్రన్న కానుక, నెలవారీ సరుకుల పంపిణీ సంక్రాంతికి ప్రత్యేకంగా ఇచ్చే కానుకతోపాటు నెలవారీ సరకులను కూడా ఒకే సారి ఇవ్వాల్సి వచ్చింది. అరుుతే ఒక సారి కాకుండా రెండు సార్లు వేలిముద్రలు తీసుకుని కానుక, నెలవారీ సరుకులు ఇస్తున్నారు. దీంతో సరకుల పంపిణీలో జాప్యం జరుగుతోందని కార్డుదారులు ఆరోపిస్తున్నారు. నగదు రహితంగా సరకులు పంపిణీ చేస్తున్నందున కార్డుదారుడి వేలిముద్ర తీసుకున్న తరువాత అతని బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసి అందులో తగినంత సొమ్ము ఉందో లేదో చూసుకుని ఆ తరువాత బిల్లు జారీ చేసేం దుకు సమయం పడుతోందని డీలర్లు చెబుతున్నారు. దీనివల్ల గంటకు ఐదారుగురు కంటే ఎక్కువ మందికి ఇవ్వలేకపోతున్నామని వివరిస్తున్నారు. కార్డుదారుడికి రెండు మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నా.. అందులో ఏ ఒక్కటీ పనిచేయక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. ఎప్పటికి పూర్తయ్యేనో..? విజయవాడ నగరంలో ఆరేడు వందల కార్డులు ఉన్న దుకాణాల్లో ఇప్పటి వరకు కేవలం రెండు వందల కంటే ఎక్కువ మంది కార్డుదారులకు సరకులు ఇవ్వలేకపోయారు. 15వ తేదీతో చంద్రన్న కానుక ఇవ్వాల్సిన గడువు పూర్తవుతుంది. ఆ లోగా కానుక అందుకోలేమోనని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో కార్డుదారులకు సరకులు ఇవ్వకపోతే అటు అధికారులు అనుమానిస్తారని, ఇటు కార్డుదారుల నుంచి విమర్శలు తప్పవని డీలర్లు పేర్కొంటున్నారు. అందువల్ల ఆదివారం, పండుగ రోజులు, రాత్రి, పగలు అని చూడకుండా సరకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వేర్వేరుగా ఇవ్వడం వల్లనే. రేషన్ దుకాణాల్లో సరకులు సకాలంలో అందక ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి వచ్చింది. సర్వర్ డౌన్ అవ్వడం వల్ల ఈ ఇబ్బంది రాలేదు. ఈ సారి సంక్రాంతి కానుక, నెలవారీ సరకులు ఒకేసారి ఇస్తున్నాం. అందువల్ల రెండుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తోంది. దీంతో జాప్యం జరుగుతోంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకే కార్డుదారుడు రెండుసార్లు వేలిముద్ర వేసి సరుకులు తీసుకోవడం వల్ల ఈ-పోస్ మిషన్లు, సర్వర్లపై ఎక్కువ భారం పడుతోంది. అరుునా రికార్డుస్థారుులో అవి పనిచేస్తూనే ఉన్నాయి. - బాబు.ఎ, కలెక్టర్ గంటల తరబడి వేచి ఉంటున్నాం రేషన్ అందక గంటల తరబడి వేచి ఉంటున్నాం. సర్వర్ పని చేయక మూడు రోజుల నుంచి దుకాణం చుట్టూ తిరుగుతున్నాం. పట్టించుకునే నాథుడే లేడు. పనులు మానుకుని పడిగాపులు కాస్తున్నాం. రేషన్ సరకులు ఎప్పడు అందుతాయో? - సాయి లక్షి, సతన్యనారాయణపురం కాళ్లరిగేలా తిరుగుతున్నాం రేషన్ సరుకుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం. రేషన్ దుకాణానికి వెళ్లే సర్వర్ పనిచేయడం లేదని డీలర్ అంటున్నారు. అర్ధరాత్రి వరకు వేచి ఉన్నా సరుకులు అందడం లేదు. సంక్రాంతి పండుగకు నిత్యావసర సరకులు అందించాలి. - కోనా మహలక్ష్మి, చుట్టుగుంట -
స్టోర్లలో సరుకులు ఉచితం కాదు
అనంతపురం అర్బన్: ప్రభుత్వ చౌక దుకాణా(స్టోర్ల)ల్లో నిత్యావసర సరుకులు ఈ నెల ఉచితంగా ఇవ్వడం లేదు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సరుకులు తీసుకునేందుకు వచ్చే కార్డుదారులు డబ్బులు ఇవ్వలేకపోతే వారికి అప్పు కింద ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వీలైనంత వరకు అందరికీ ఈ నెల అప్పు పద్ధతిలోనే సరుకులు పంపిణీ చేయాలని డీలర్లను అధికారులు ఆదేశించారు. ఈ నెల సరుకులకు కార్డుదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని, జనవరి నెలలో సరుకులు తీసుకున్నప్పుడు రెండు నెలల మొత్తాన్ని స్వైపింగ్ ద్వారా కార్డుదారుల ఖాతాల నుంచి తీసుకోవాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. -
పౌరుల హక్కులకు భంగం వాటిల్లుతోంది
పెద్ద నోట్ల రద్దుపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన ఎంపీ కేవీపీ సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల కష్టార్జితాన్ని అవసరాలకు సకాలంలో వినియోగించనివ్వకుండా నోట్ల రద్దుతో పౌరుల రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడిచారంటూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాంచంద్రరావు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ)కు సోమవారం ఫిర్యాదు చేశారు. ‘పౌరుల గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం నడిరోడ్డున నిలబెట్టింది. నోట్ల రద్దు కారణంగా షాక్‌కు గురై లేదా ఏటీఎం, బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోరుున వారి కుటుంబాలకు రూ.10 లక్షల మేర నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలి. డిసెంబర్, జనవరి నెలల్లో నిత్యావసర వస్తువులు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పౌర సరఫరా శాఖలు తీసుకుంటున్న చర్యలపై నివేదిక కోరండి. రూ.50, రూ.100 నోట్ల సరఫరా పెంచాలి. వేతన జీవులు ఇంటి అద్దె, స్కూలు ఫీజు, ఇంటి అవసరాలకు వెచ్చిం చేందుకు వీలుగా నెలలో ఒకేసారి రూ.50 వేలు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించాలి. వీటన్నింటినీ అమలుచేసేలా ఆదేశాలు జారీచేయాలి..’ అని కోరారు. -
క్యూల్లోనే వారాంతం!
- మూడోరోజూ బారులు తీరిన ప్రజలు... పలుచోట్ల బ్యాంకు అధికారులతో వాగ్వాదం - మరో 8-10 రోజులు ఇదే పరిస్థితంటున్న బ్యాంకర్లు - గుజరాత్, కర్ణాటకల్లో లైన్లోనే కుప్పకూలిన ఇద్దరు వృద్ధులు న్యూఢిల్లీ: పాతనోట్లను మార్చుకునేందుకు వరుసగా మూడోరోజూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల ముందు ప్రజలు బారులు తీరారు. వారాంతం కావటం, బ్యాంకులు అదనపు గంటలు పనిచేస్తుండటంతో శనివారం రద్దీ కాస్త ఎక్కువగా కనిపించింది. దీంతో గంటల తరబడి ప్రజలు డిపాజిట్లు, విత్‌డ్రాల కోసం వేచిచూశారు. కేరళ, గుజరాత్‌లలో క్యూలైన్లో వేచి ఉన్నవారికి బ్యాంకు ఉద్యోగులకు మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. చాలా బ్యాంకుల వద్ద పోలీసులతో బందోబస్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద బందోబస్తు కోసం 3,400 మంది పారామిలటరీ బలగాలు, 200 క్విక్ రెస్పాన్స టీమ్స్‌ను రంగంలోకి దించారు. అటు మధ్యప్రదేశ్‌లో చిల్లరలేక నిత్యావసర వస్తువులు అందకపోవటంతో ఆగ్రహించిన ప్రజలు ఓ రేషన్ షాపును కొల్లగొట్టినట్లు తెలిసింది. ముంబైలో పలు బ్యాంకులు ముఖ్యమైన కూడళ్లలో మొబైల్ ఏటీఎంలు అందుబాటులో ఉంచారు. కాగా, బ్యాంకులకు వస్తున్న రద్దీని, నోట్లు మార్చుకునేందుకు ప్రజల్లో ఉన్న ఆతృతను చూస్తుంటే.. మరో 8-10 రోజుల పాటు ఇదే పరిస్థితి తప్పదని బ్యాంకర్లు అంటున్నారు. బ్యాంకుల వద్ద సరైన డబ్బుల్లేవని ప్రజలు అపోహపడుతున్నారన్నారు.కాగా, పింఛనుదారులు రూ. 10వేలకన్నా ఎక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ (భువనేశ్వర్) స్పష్టం చేసింది. ఏటీఎంలు ఖాళీ వారాంతం వేడి ఏటీఎం వద్ద కూడా కనిపించింది. చాలా ఏటీఎంలను అర్దరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు డబ్బులతో నింపారు. అరుుతే తెల్లారిన కాసేపటికే ఇవన్నీ ఖాళీ అరుుపోయారుు. అసలే డబ్బుల్లేక ఇబ్బందులు పడుతుంటే సాంకేతిక కారణాలతో ఏటీఎంలు పనిచేయకపోవటం జనాగ్రహానికి కారణమైంది. దేశవ్యాప్తంగా 2 లక్షల ఏటీఎంలుండగా.. అందులో సగానికి పైగా పనిచేయటం లేదని తెలిసింది. కాగా, గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండటం వల్లచాలా చోట్ల కొందరు లైన్లలోనే కుప్పకూలిపోయారు. శుక్రవారం మహారాష్ట్రలో ముగ్గురు, కేరళలో ఇద్దరు చనిపోగా.. శనివారం గుజరాత్లో బర్కాత్ షేక్ అనే వృద్ధుడు లైన్లోనే గుండెపోటుతో కుప్పకూలాడు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఓ 93 ఏళ్ల వృద్ధుడు కూడా క్యూలోనే గుండెపోటుతో మృతిచెందాడు. ఆదివారం కూడా బ్యాంకులు తెరిచి ఉండటంతో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. తిరగబడ్డ జనం బ్యాంకుల్లో పాతనోట్లు మార్చుకునేందుకు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోవటంతో.. కేరళలోని కొల్లాం జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ బ్రాంచ్ ఉద్యోగులు షెటర్లు మూసేసేందుకు ప్రయత్నిం చారు. దీంతో బ్యాంకు ఆవరణలో ఉన్న 200 మంది కోపంతో బ్యాంకు అద్దాలను పగులగొట్టారు. దీంతో బ్యాంకు ఉద్యోగులకు, ప్రజలకు వాగ్వాదం ముదిరింది. పోలీసులు జోక్యం చేసుకోవటంతో పరిస్థితి సద్దుమణిగింది. గుజరాత్‌లోనూ పలుచోట్ల బ్యాంకు అధికారులు, ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బాణస్కంఠ, కచ్ జిల్లాల్లో అధికారులు నోట్ల మార్పిడికి తిరస్కరించటంతో ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో చిల్లర నోట్లు లేక ఎదురవుతున్న సమస్యలతో ప్రజల్లో ఆగ్రహజ్వాలలు పెరిగిపోయారుు. బర్దాహా అనే గ్రామంలో స్థానికులు పౌరసరఫరాల దుకాణాన్ని కొల్లగొట్టి తమకు కావాల్సిన వస్తువులు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. -
లోయలో జనజీవనం అతలాకుతలం
అందని నిత్యావసర వస్తువులు.. కొనసాగుతున్న కర్ఫ్యూ - మొబైల్ సేవల నిలిపివేతతో మరిన్ని కష్టాలు.. ఆర్మీక్యాంపు ముట్టడి - ప్రెస్ మూసివేతపై పత్రికల ఆగ్రహం.. ఖండించిన జర్నలిస్టు సంఘాలు శ్రీనగర్ : కశ్మీర్లో వరుసగా పదోరోజూ కర్ఫ్యూ అమలు, మొబైల్ సేవల నిలిపివేతతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్‌తో మొదలైన అల్లర్లను అదుపుచేసే క్రమంలో కశ్మీర్‌లోయలో అడుగడుగునా పోలీసులు, భద్రతా బలగాల పహారా కొనసాగుతోంది. నిత్యావసర వస్తువులు కూడా ప్రజలను చేరటం లేదు. సెల్‌ఫోన్స్ పనిచేయకపోవటంతో.. చాలా మంది తమ కుటుంబ సభ్యులను చేరుకోవటం కష్టమవుతోంది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 39 మంది మరణించగా.. 3,100 మంది గాయపడ్డారు. ఓ వైపు కర్ఫ్యూ కొనసాగుతుండగానే.. శనివారం కుప్వారా జిల్లాలో జరిగిన అల్లర్లలో ఒకరిని చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఒక అల్లరిమూక బండిపోరా జిల్లాలోని ఆర్మీ క్యాంపును ముట్టడించింది. ఆత్మరక్షణ కోసం భద్రతా దళాలు కాల్పులు జరపగా ముగ్గురు ఆందోళన కారులకు గాయాలయ్యాయి. వదంతులు ప్రచారం కాకుండా.. కశ్మీర్ లోయలో మూడో వంతు ప్రాంతంలో టెలిఫోన్ సర్వీసులను, ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులను వారం పాటు పొడిగించారు. రెండో రోజూ పత్రికలు బంద్! కశ్మీర్ లోయలో వరుసగా రెండోరోజూ స్థానిక దినపత్రికలు మార్కెట్లోకి విడుదల కాలేదు. శనివారం రాత్రి కొందరు పోలీసులు రెండు ప్రింటింగ్ ప్రెస్‌లపై దాడి చేసి వార్తా పేపర్లలను, న్యూస్ పేపర్ ప్లేట్లను సీజ్ చేశారు. దీనిపై ఎడిటర్లు, ప్రింటర్లు, పబ్లిషర్లు తీవ్రంగా మండిపడ్డారు. కాగా, శనివారం అర్ధరాత్రి తర్వాత అధికారులు కేబుల్ టీవీ ప్రసారాలను పునరుద్ధరించారు. ప్రింటింగ్ ప్రెస్‌లపై దాడుల ఘటనను ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఇది భావప్రకటనపై దాడి అని ఐజేయూ అధ్యక్ష, జనరల్ సెక్రటరీలు ఎస్ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్, అంతర్జాతీయ జర్నలిస్ట్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సబినా ఇంద్రజిత్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె.అమర్నాథ్, ప్రభాత్‌దష్ అభివర్ణించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పీసీఐకి లేఖ రాశారు. -
ఏ ముక్క ముట్టలేం
► భారీగా పెరిగిన మటన్, చికెన్ ధరలు ► కూరగాయల ధరలతో పోటీ ► నిలకడగా చేపల ధరలు ► సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాంసాహారానికి దూరం శ్రీకాకుళం: మటన్, చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలతో పోటీ పడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో, ఈ ప్రభావం వీటిపై పడింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాంసాహారానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. వారాంతరాల్లో కూడా మాంసాహారం తినే పరిస్థితి కనిపించడం లేదు. కూరగాయల ధరలు పెరగడంతో ఇదే అదునుగా వ్యాపారులు చికెన్, మటన్ ధరలును మరింత పెంచేశారు. చేపల ధరలే కాస్త అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అందరి చూపు చేపలవైపే ఉంది. చికెన్ స్కిన్లెస్ కిలో రూ.200 ఉంది. మటన్ ధర మరింత పైపైకి పోతోంది. ప్రస్తుతం కిలో రూ.500పైగా పలుకుతోంది. ఈ ధరలు ఎందుకు పెరుగుతాయి, ఎవరు పెంచుతారు, ఎప్పుడు పెంచుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ధరలపై అధికారుల నియంత్రణ ఉందా? లేక వ్యాపారులే నచ్చినపుడు పెంచుకోవచ్చునా తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం కూరగాయలు తిందామంటే ధరలు మండుతున్నాయి. చికెన్, మటన్ ముట్టకోలేం. ఎలా బతకాలని సామాన్య, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ధరల నియంత్రణలో విఫలమయ్యాయని మండిపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా నిత్యవసర సరుకుల ధరలు, కూరగాయలు, చికెన్, మటన్ ధరలు అకాశానంటాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పేదలు బతకడం కష్టమని వాపోతున్నారు. వ్యాపారాలు అంతంత మాత్రమే ప్రస్తుతం ఎండలు కారణంగా కోళ్లు అంతగా సరఫరా కావడం లేదు. ఇదే చికెన్ ధర పెరగడానికి కారణం. ఫౌల్ట్రీ నుంచి తెచ్చేటప్పుడు కొన్ని కోళ్లు చచ్చిపోతున్నాయి. ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే ధర పెంచక తప్పదు. ప్రస్తుతం వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. - వై.రాజు, చికెన్ సెంటర్ యజమాని, శ్రీకాకుళం కాళీ సంచితో తిరిగి వస్తున్నాం ప్రస్తుతం అరకొర జీతంతో బతకాలంటేనే చాలా కష్టంగా ఉంది. మార్కెట్లో ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.40పై మాటే. ధరలకు భయపడి ఏమి కొనకుండా ఖాళీ సంచితో తిరిగి వస్తున్నాం. చికెన్, మటన్ ధరలంటే మరి చెప్పనక్కర్లేదు. -ఎం.త్రినాథరావు, ప్రైవేటు ఉద్యోగి, శ్రీకాకుళం -
ఇలాగైతే చప్పిడన్నమే
చుక్కల్లో నిత్యావసర వస్తువులు కొండెక్కిన కూరగాయలు లబోదిబోమంటున్న పేద, మధ్యతరగతి వర్గాలు ధరలమోతతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. కాయగూరలు పేద వర్గాలకు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. కనీసం వెయ్యి రూపాయలు వెచ్చిస్తే.. కానీ వారానికి సరిపడా సరుకులు రావడం లేదని జనం వాపోతున్నారు. ఇక పప్పులు, నూనెల ధరలైతే ఉద్యోగస్తులకు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. ధరల దెబ్బకు చప్పిడన్నం.. నీళ్ల సాంబారే గతిగా మారుతోందని జనం వాపోతున్నారు. చిత్తూరు: జిల్లావాసులకు మార్కెట్ భయం పట్టుకుంటోంది. వందలు రూపాయలు వెచ్చిస్తున్నా.. పూటగడవడం కష్టంగా మారుతోందని వినియోగదారులు బెం బేలెత్తిపోతున్నారు. కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని సగటుజీవి ఆవేదన చెందుతున్నాడు. ముఖ్యంగా కందిపప్పు సామాన్యుడి ఇంట్లోకి రానంటోంది. కిలో రూ. 145 వరకు పలుకుతోంది. టమాటా మాటంటేనే భయపడుతున్నాడు. మిర్చిఘాటుకు దాని దగ్గరికి వెళ్లాంటేనే భయపడిపోతున్నాడు. బెండకాయ నుంచి కాకరకాయ వరకు అన్ని కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మేమేం తక్కువ లేమంటూ ఆకు కూరలు కూడా మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నాయి. వారం క్రితం రూ. 5లకే కట్ట వచ్చిన ఆకుకూరలు ఇప్పుడు రూ.10 పలుకుతున్నాయి. నింగినంటుతున్న కూరగాయల ధరలను కిందికి దించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఘాటెక్కిస్తున్న మిర్చి.. మిర్చి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. నెల క్రితం రూ. 20 ఉన్న ధర ఒకానొక దశలో రూ. 80 పలికింది. ఇప్పుడు కొంచెం శాంతించి రూ.50 దగ్గర స్థిరపడింది. టమాటా ధర నెల క్రితంతో పోలిస్తే సుమారు ఎనిమిది రెట్లు పెరిగింది. నెల రోజుల క్రితం రూ.10 పలికింది. ఇక బెండకాయ, కాకర, క్యాబేజీ, క్యారెట్ , దోస వంటి కాయగూరలు రూ.40కు తగ్గడం లేదు. నాణ్యమైన కందిపప్పు కిలో సుమారు రూ.145 పలుకుతోంది. దీంతో ‘ఇంట్లో పప్పు వండు అని భార్యకు చెప్పలేకున్నామ’ని కూరగాయలు కొనడాకి వచ్చిన ఓ చిరుద్యోగి వాపోయాడు. కిలో ఉద్దిపప్పు ధర రూ.175కు తగ్గడం లేదు. ఇడ్లీ, దోసె చేసుకోవాలంటే పండుగలకు చూద్దాంలే.. అని గృహిణులు నిట్టూరుస్తున్నారు. అమ్మో మార్కెట్.. పెరిగిన ధరల ప్రభావం రోజువారీ వినియోగంపై పడింది. ఏదో కొద్డిపాటి సరుకులు కొని పూట గడుపుకుంటున్నాడు. అర,పావు కిలో కొని సరిపెట్టుకుంటున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల వల్ల కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తినాలని డాక్టర్లు చెబుతున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో వినియోగాన్ని తగ్గించుకుంటున్నాడు. వినియోగం తగ్గింది.. గతంతో పోలిస్తే ప్రజలు కొనుగోలు తక్కువ చేస్తున్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలే కాదు వ్యాపారులు కూడా నష్టపోతున్నారు. గతంలో కిలో కూరగాయలు కొనేవారు ప్రస్తుతం అర కేజీ కొనడాకి కూడా భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు.- జీఆర్ మోహన్, కూరగాయల వ్యాపారి, చిత్తూరు మార్కెట్‌కు రావాంలంటేనే భయంగా ఉంది కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.మార్కెట్‌కు రావాలంటేనే భయంగా ఉంది. కూరగాయల ధరలను ప్రభుత్వం నియంత్రించాలి. సామాన్యుడికి అందుబాటులో ఉంటే ఎక్కువ కొనుగోలు చేస్తాడు.- పుష్పలత, ఉద్యోగిని -
పప్పుధాన్యాలపై స్థానిక పన్నులొద్దు
రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన కేంద్రం న్యూఢిల్లీ: పప్పుధాన్యాలపై స్థానిక పన్నులేవీ విధించొద్దని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. నిత్యావసర వస్తువులు, నూనె ధరలపై కేంద్ర ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ శనివారం మీడియాతో మాట్లాడారు. రానున్న నెలల్లో పప్పుధాన్యాలపై ధరలు పెరగనున్నాయన్న ఆందోళనల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు లెవీ టాక్స్, మార్కెట్ ఫీజు, వ్యాట్ వంటి స్థానిక పన్నులను వాటిపై వేయవద్దని కోరారు. ప్రస్తుతం 1.5 లక్షల టన్నుల పప్పుధాన్యాల నిల్వలున్నాయని వీటిని 9 లక్షల టన్నులకు పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. స్థానిక పన్ను మినహాయింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు సొంత ధరల స్థిరీకరణ నిధులను నిత్యావసర, పప్పుదాన్యాల ధరలను తనిఖీ చేసుకునేందుకు ఉపయోగించుకోవాలన్నారు. పప్పుధాన్యాలను దిగుమతి చేసుకునే వారు, మిల్లర్లు, వ్యాపారులు, ఉత్పత్తి దారులకు పప్పు ధాన్యాల నిల్వ స్థాయుల్ని నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. పప్పుధాన్యాల ఉత్పత్తి 17 మిలియన్ టన్నులుంటే వినియోగం మాత్రం 23.6 మిలియన్ టన్నులుందని మంత్రి తెలిపారు. 3 రాష్ట్రాలకు అదనపు ఆహారధాన్యాలందిస్తాం: కేంద్రం కరువుతో సతమతమవుతున్న మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు అదనపు ఆహారధాన్యాలను సమకూర్చడంతో పాటు, ఆ రాష్ట్రాల్లోని రేషన్ కార్డుల్లేని వారికీ ఆహార ధాన్యాలని అందించేందుకు కేంద్రం సమ్మతించింది. ఇంకే రాష్ట్రానికైనా ఆహార ధాన్యాలు కొరత ఉంటే ప్రతిపాదనలు పంపమని తెలిపింది. ఎన్జీవో స్వరాజ్ అభియన్ పిటిషన్ మేరకు సుప్రీం కోర్టు కరువు రాష్ట్రాలకు అదనపు ఆహారధాన్యాలని ఇవ్వాలని కేంద్రానికి గతవారమే సూచించింది. -
రేషన్.. కమీషన్
ప్రజా పంపిణీ వ్యవస్థలో ‘రెవెన్యూ’ దందా షాపుల నుంచి నెలవారీ వసూళ్లు మొగుళ్లపల్లి మండలంలో ఎక్కువగా.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే యోచన పేదలకు సరుకులు ఎగవేస్తున్న డీలర్లు వరంగల్ : పేదలకు సబ్సిడీపై నిత్యావసర సరుకులు అందించే ప్రజాపంపిణీ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ అధికారులు.. దాన్ని ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు. రేషన్ షాపుల నుంచి నెలవారీగా మామూళ్లు తీసుకుంటూ ప్రజాపంపిణీ వ్యవస్థను నాశనం చేస్తున్నారు. పేదలకు సరుకుల పంపిణీ విషయాన్ని పట్టించుకోకుండా సొంత ప్రయోజనాల కోసం ప్రయత్నించి గతంలో ఒక తహశీల్దార్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కాడు. ఈ ఘటనతోనైనా రెవెన్యూ ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. తాజాగా పౌర సరఫరాల శాఖలో వచ్చిన మార్పుల నేపథ్యంలో రెవెన్యూ శాఖ వారి అక్రమాల వ్యవహారం ఇంకా పెరుగుతోంది. ఆహార భద్రత పథకంతో రేషన్ డీలర్లకు నెలవారీ సరుకుల కోటా కొంత మేరకు పెరిగింది. ఈ అంశాన్ని సాకుగా చూపుతూ రేషన్ షాపుల నుంచి తమకు వచ్చే నెలవారీ మామూళ్ల మొత్తాన్ని పెంచాలని కొందరు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. వారే స్వయంగా ఇంత మొత్తం అని నిర్ణయించి ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సాధారణంగా జరుగుతున్న ఈ దందా ప్రజా పంపిణీ వ్యవస్థకు ఇబ్బందికరంగా మారింది. మొగుళ్లపల్లిలో బరితెగింపు మొగుళ్లపల్లి మండలంలో రేషన్ షాపుల నెలవారీ మామూళ్ల వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఈ మండలంలో దాదాపు 32 రేషన్ షాపులు ఉన్నాయి. మిగిలిన మండలాల తరహాలోనే ఇక్కడ ఒక్కో షాప్ నుంచి రూ.500 వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం తక్కువగా అనిపించడంతో అక్కడి అధికారులు తాజాగా ఈ నిబంధనను మార్చారు. ఒక్కో షాప్ నుంచి వెయ్యి రూపాయల చొప్పున రావాలని, దీని కోసం ప్రయత్నించాలని రెవెన్యూ సిబ్బందికి అధికారుల నుంచి అనధికార ఆదేశాలు వచ్చాయి. తాజా నిబంధన ప్రకారం మొత్తాన్ని పెంచాలని సిబ్బంది డీలర్లుకు ఈ సమాచారం ఇచ్చారు. దీనికితోడు అవసమైనప్పుడల్లా రేషన్ షాపులనే లక్ష్యంగా చేసుకుంటుండడంతో అక్కడి వారు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. పేదలకు డీలర్ల టోకరా... ప్రస్తుతం రేషన్ షాపులలో బియ్యం, కిలో కందిపప్పు, కిలో గోధుమలు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. చాలా చోట్ల డీలర్లు పూర్తి సరుకుల కోసం డీడీలు తీయడంలేదు. తమ దగ్గర పప్పులు, గోధుమలు ఎవరూ కొనడంలేదని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులతో పేదలకు సబ్సిడీ సరుకులు చేరేందుకు చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు, డీలర్లతో ఉన్న సంబంధాలతో ఏమీ చేయడం లేదు. ఫలితంగా ఎక్కువ మంది పేదలకు ఈ సరుకులు అందడం లేదు. నగర ప్రాంతాల్లోని కొందరు డీలర్లు పప్పులు, గోధుమలకు డీడీలు చెల్లించి వచ్చిన సరుకులను పక్కదారి పట్టిస్తున్నారు. బియ్యం పంపిణీ విషయంలోనే అధికారులు లెక్కలు పరిశీలిస్తున్నారు. మిగిలిన సరుకుల పంపిణీ తీరును పట్టించుకోకపోవడంతో పేదలకు అన్యాయం జరుగుతోంది. ఉన్నతాధికారులు చొరవ తీసుకుంటేనే రెవెన్యూ అధికారుల దందాకు ముగింపు పడుతుంది. రేషన్ డీలర్ల అక్రమ వ్యవహారాలకు కూడా అడ్డుకట్ట పడుతుంది ఒక్కో షాపునకు రూ.500 రేషన్ షాపుల నుంచి ప్రతీ నెల ఎంత ముట్టజెప్పలనేది రెవెన్యూ శాఖకు వారే నిర్ణయిస్తున్నారు. ఇది.. మండలానికో తీరుగా ఉంటోంది. సగటున మాత్రం ఒక్కో రేషన్ షాపు నుంచి ప్రతీ నెల రూ.500 వసూలు చేస్తున్నారు. ఆయా మండలాల్లోని రేషన్ డీలర్ల సంఘం నేతలు...మిగతా డీలర్ల దగ్గర వసూలు చేసి రెనెన్యూ అధికారులకు సమర్పిస్తున్నారు. మండలాల్లో ఉండే పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్ని మండలాల్లో ఉన్నతాధికారులు కూడా డిమాండ్ చేస్తున్నారని... ఇలాంటి చోట్ల ప్రతి షాపునకు వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. నెలవారీ మామూళ్ల విషయంలో ఆలస్యం జరిగినా, జరగకపోయినా... అధికారులు రకరకాల నోటీసులు, దాడులతో దారికి వచ్చేలా చేస్తున్నారని చెబుతున్నారు. సాధారణం గా జరుగుతున్న వ్యవహారమే అయినా.. ఎవరూ బయటపడకపోతుండడంతో ఉన్నతాధికారులు పట్టించుకోనట్లుగానే ఉంటున్నారు. -
వరద బాధితులకు సరుకుల పంపిణీ
వైఎస్సార్ జిల్లా: రాజంపేటలో వైఎస్సార్సీపీ నాయకులు వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మండలంలోని ముకుందారిగడ్డలో వరద నీటిలో చిక్కుకున్న బాధితులను పరామర్శించి సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకొని ఉన్నాయి. -
శనగపప్పు...
తిండి గోల మిర్చి బజ్జీ, ఆలూబజ్జీ, ఎగ్‌బజ్జీ, పకోడీ... ఇలా చాలా స్నాక్స్‌కి శనగపిండే కావాలి. లడ్డూ, బూందీ.. వంటి కొన్ని సంప్రదాయ స్వీట్లలో శనగపిండే కావాలి. ఆకుకూరలు, కూరగాయలు వండేటప్పుడు శనగపప్పు వాడితే అదో రుచి. నిత్యావసర సరుకులలో శనగపప్పు పాత్ర ఎంతటిదో మనందరికీ తెలిసిందే. చిక్పీ, బెంగాల్‌గ్రామ్ అని శనగపప్పుకు ఇంగ్లిష్‌లో పేర్లున్నాయి. శనగపప్పుకు తల్లి శనగలు. ఈ శనగలతో మనం చోళేమసాలా, సలాడ్.. వంటి వంటకాలెన్నో చేస్తుంటాం. బాగా ఎండబెట్టిన శనగల నుంచే శనగపప్పును తయారుచేస్తారు. ఉత్తరభారతదేశంలో దీని వాడకం చాలా ఎక్కువ. సాగుబడిలోనూ ఈ ప్రాంతమే ముందుంది. దాదాపు 7-8 వేల ఏళ్లక్రితమే దీన్ని మనవారు ఆహారపదార్ధంగా గుర్తించారు. లాటిన్ అమెరికా, స్పెయిన్ చిక్పీస్ అనే పదాన్ని ఉపయోగించారు. టర్కీ, గ్రీసు దేశాలలో క్రీ.పూ.6790 నుంచి శనగలు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. మూత్రపిండాలలో రాళ్లు కరిగించడానికి, రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యలను నివారించడంలోనూ శనగల కషాయం మహత్తరంగా పనిచేస్తుందని, ఇది ఔషధకారిణి అని కూడా చెప్పుకునేవారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో శక్తి కోసం శనగలతో పానీయం తయారుచేసుకొని సేవించేవారట. ఇప్పటివరకు ఇక్రిశాట్ 28,000 రకాల జన్యువులను శనగలలో గుర్తించింది. వీటిలో 77 రకాల పంటలను ప్రపంచవ్యాప్తంగా రైతులు సాగు చేస్తున్నారు. ఈ 30 ఏళ్లలో పశ్చిమ ఆసియా దేశాలు ప్రపంచంలోనే అత్యధిక దిగుబడితో ముందున్నాయి. వాటిలో భారతదేశానిదే అగ్రస్థానం. కాబూలీ శనగలను అఫ్గనిస్తాన్ అత్యధికంగా పండిస్తుంది. ఆకుపచ్చని శనగలు మహారాష్ట్రీయులు పంట. అరుదుగా నల్లని శనగలు మాత్రం ఇటలీలోని ఆగ్నేయప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. -
కస్సుబుస్సు
పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు బాదుడు నెలకు రూ.కోటి! ఇక పల్లె వెలుగూ భారమే {పయాణికుల్లో తీవ్ర ఆగ్రహం విశాఖపట్నం: ఒకపక్క నింగిలో నిత్యావసర సరకులు విహరిస్తున్నాయి. పప్పులు, ఉప్పులూ, కూరగాయలు అందనంత ఎత్తుకు పెరిగిపోయాయి. వాటితోనే కుటుంబాన్ని ఈదలేకపోతున్న జనానికి తాజాగా ఆర్టీసీ చార్జీలు వచ్చిపడ్డాయి. ప్రయాణికుడి నడ్డి విరచడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు భారంగా మారాయి. ప్రభుత్వం శుక్రవారం అర్థరాత్రి నుంచి 5 నుంచి 10 శాతం వరకు చార్జీలను పెంచేసింది. ఇందులో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, ఇంద్ర, గరుడ వంటి బస్సులతో పాటు సామాన్యుడికి అందుబాటులో ఉన్న పల్లె వెలుగు బస్సులనూ వదల్లేదు. పెంచిన చార్జీలతో విశాఖ ఆర్టీసీ రీజియన్‌కు నెలకు ఎంత ఆదాయం సమకూరుతుందో తెలుసా? రోజుకు రూ.3 నుంచి 4 లక్షలు! సగటున నెలకు రూ.కోటికి పైమాటేనన్న మాట!! అంటే నెలకు రూ.కోటి రూపాయల భారం ప్రయాణికులపై పడుతున్నట్టు లెక్క. విశాఖ రీజియన్ పరిధిలో తొమ్మిది డిపోల్లో సుమారు 1060 బస్సులున్నాయి. వీటి ద్వారా రోజుకు సగటున రూ.80 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. పండగలు తదితర సీజన్లలో మరో రూ. ఐదు లక్షలు అదనంగా రాబడి వస్తుంది. ఇప్పటికే విశాఖ రీజియన్ ఆదాయంలో సంతృప్తికరంగా ఉంది. తాజాగా పెరిగిన చార్జీలతో ప్రయాణికులకు బాదుడే అయినా ఈ రీజియన్‌కు మాత్రం మరింతగా ఊరట కలగనుంది. అయితే దసరా పండగ వెళ్లి 24 గంటలైనా గడవక ముందే సర్కారు దొంగ దెబ్బతీసినట్టుగా ఆర్టీసీ చార్జీలు మోతమోగించిందంటూ ప్రయాణీకుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్యాకేజీ రాలేదని ప్రజలపై పడ్డారు..! ప్రత్యేక ప్యాకేజీ కోసం ఇన్నాళ్లు ఎదురు చూసిన సీఎం చంద్రబాబు ఆఖరికి అది వచ్చే దారి కనిపించకపోవడంతో ప్రజలపై భారం వేసేందుకు సిద్ధపడ్డాడు. అందుకే ప్రధాని మోడీ ఆంధ్ర నుంచి వెళ్లిన వెంటనే ప్రజలపై తన అక్కసు వెళ్లగక్కేలా రూ. 10 శాతం భారం మోపాడు. ప్రజలపై ఇప్పుడు వేస్తున్న వడ్డనకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. -గుడివాడ అమరనాథ్, జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన కానుక రాష్ట్ర రాజధాని శంకుస్థాపన తరువాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకిచ్చిన కానుక. ఆర్టీసీ నష్టాలలో ఉందనటం వాస్తవం. దానిని బయటపడటానికి ప్రభుత్వం ఆర్టీసీకి సబ్సిడీ ఇవ్వాలి. ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు. ప్రజల ఆదాయ వనరులు పెరిగేటటువంటి మార్గం లేకుండా అన్నింటికి ధరలు పెంచుకుంటూ పోవటం అన్నది ప్రజలమీద భారం మోపటమే. -జేవీ సత్యనారాయణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధరలు పెంచాల్సిన అవసరం లేదు ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సిన అవసరంలేదు. ప్రజలమీద భారం వేయడానికి ప్రభుత్వం ధరలు పెంచుతుంది. ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన సహకారం ఇవ్వటంలేదు. రాష్ట్ర విభజనలో ప్రభుత్వం నష్టాన్ని భరిస్తామని హామినిచ్చింది. తాజాగా ప్రజలపై పన్నులు, ఛార్జీల రూపంలో భారం మోపటం సరికాదు. దీనిని సీపీఎం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. -సి.హెచ్.నరసింగరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు భారం మోపనన్నారు.. అదే చేస్తున్నారు..! ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలప్పుడు ప్రజలపై భారం వేయనన్నాడు. కానీ ఇప్పుడు తినడానికే తిండి లేకుండా బాధ పడుతుంటే ఆర్టీసీ ఛార్జీలు పెంచి తన పైశాచికత్వాన్ని చాటుకుంటున్నాడు. రూ. వందల కోట్లు రాజధాని శంకుస్థాపన కోసం ఖర్చు చేయడం కన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే బాగుండేది. ఎన్నికలప్పటికీ ఇప్పటికీ చంద్రబాబులో చాలా మార్పు కనిపిస్తోంది. ప్రజలను వంచించడానికే ఇప్పుడు ఉన్నాడనిపిస్తోంది. -ద్రోణంరాజు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఒకే సారి భారీగా పెంచడం సరికాదు..! ఒకే సారి భారీగా ఛార్జీల భారం పడేలా పెంచడం సరికాదు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రీ ఆర్గనైజ్ చేయడానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టకుండా నేరుగా ప్రజలనే లక్ష్యంగా చేసుకోవడాన్ని నిరసిస్తున్నాం. సామాన్య ప్రజానీకానికి ఆర్టీసీ బస్సు ఒక్కటే రవాణా అవసరాలను తీర్చుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఛార్జీలు వడ్డన బాధాకరం. ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలి. -పి.వి.నారాయణ రావు, నగర అధ్యక్షుడు బీజేపీ ఎక్కడ నుంచి ఎక్కడకు: పాత కొత్త విశాఖపట్నం-విజయవాడ (సూపర్‌లగ్జరీ) 420 460 విశాఖపట్నం-తిరుపతి (ఇంద్ర ఏసీ) 1109 1202 విశాఖపట్నం-చెన్నై (గరుడ) 1367 1482 విశాఖపట్నం- హైదరాబాద్ (సూపర్‌లగ్జరీ0 726 797 విశాఖపట్నం-హైదరాబాద్ (గరుడ) 1061 1182 విశాఖపట్నం-రాజమండ్రి (డీలక్స్)సింగిల్స్టాప్ 218 255 విశాఖపట్నం-కాకినాడ (సూపర్‌లగ్జరీ) 195 215 విశాఖపట్నం-విజయనగరం (డీలక్స్) 47 51 విశాఖపట్నం-శ్రీకాకుళం (నాన్‌స్టాప్ డీలక్స్) 107 116 విశాఖపట్నం-పాడేరు (ఎక్స్‌ప్రెస్) 92 100 విశాఖపట్నం-పాడేరు (డీలక్స్) 101 112 -
పప్పన్నం కరువే..!
మరో మూడు రోజుల్లో వినాయక చవితి పండుగ వస్తోంది. పేదలకు పరమాన్నం లేకపోయినా కనీసం పప్పన్నం తినే భాగ్యం కూడా లేకుండా పోతోంది. చౌక దుకాణాల్లో ఇప్పటికీ చాలా చోట్ల కందిపప్పు.. పామోలిన్ సరఫరా కాలేదు. కేవలం మూడు వస్తువులతోనే సరిపెడుతున్నారు. ఇలాగైతే పండుగ ఎలా జరుపుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కడప : చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలకంతా మేలు జరుగుతుందని ఊదరగొట్టిన టీడీపీ నేతల మాటలు నీటి మూటలయ్యాయి. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు మాటలు ఉత్తుత్తివే అని తేలిపోయాయి. కనీసం ప్రజలకు నిత్యావసర సరుకులు కూడా సక్రమంగా పంపిణీ చేయలేకుపోతున్నారంటే ‘దేశం’ పాలన ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. జిల్లాకు సంబంధించి సరుకుల పంపిణీలో ప్రతిసారి కోత పడుతూనే ఉంది. తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పామోలిన్‌కు మంగళం పాడింది. 20 నెలలుగా పంపిణీకి నోచుకోని పామోలిన్ : అంతకుముందు రాష్ట్రపతి పాలన, ఎన్నికలు కలుపుకుని 5 నెలలు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కలుపుకొని దాదాపు 20 నెలలుగా పామోలిన్ పంపిణీకి నోచుకోలేదు. చౌక వస్తువుల్లోనూ కోత : జిల్లాలో 1735 రేషన్‌షాపులు ఉండగా దాదాపు ఏడు లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. అందులో 25 లక్షలకు పైగా కుటుంబ సభ్యులు నిత్యావసర సరుకులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 19 గోడౌన్లకు బియ్యం, చక్కెర, గోధుమ పిండి మాత్రమే పంపి రేషన్ షాపులన్నింటికీ అందించారు. కందిపప్పు కొరత... జిల్లాలో చాలా రేషన్ షాపులకు నిత్యావసర సరుకుల్లో కీలకమైన కందిపప్పు చేరలేదు. జిల్లాకు 7 లక్షల కేజీలకు పైగా కందిపప్పు రావాల్సి ఉండగా...కేవలం 3లక్షల కేజీలు మాత్రమే వచ్చినట్లు పౌర సరపరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికీ పామోలిన్ అందకపోగా, మిగతా సరుకులు కూడా అంతంత మాత్రంగానే అందుతున్నాయి. -
నాడు 9.. నేడు 3..
తెల్లకార్డు దారులకు నిత్యావసర సరుకుల్లో కోత ఏడాదిగా లభించని పామాయిల్ ధర్మవరం : రేషన్ దుకాణాల్లో సరుకులు లేక వెలవెలబోతున్నాయి. గతంలో అమ్మహస్తం పేరుతో తొమ్మిది రకాల సరుకులను రూ. 185లకే పేదలకు సరఫరా చేసేవారు. చక్కెర అరకిలో, కందిపప్పు అరకిలో, పామాయిల్ అరలీటర్, గోధుపిండి కిలో, ఉప్పు కిలో, చింత పండు అరకిలో, నెయ్యి 100 గ్రాములు, కారం పొడి 200 గ్రాములు, పసుపు 100 గ్రాముల చొప్పున తెల్లకార్డు దారులకు పంపిణీ చేసేవారు. ఇవి కాకుండా కిలో రూపాయి చొప్పున ఒక్కో లబ్ధిదారునికి నెలకు నాలుగు కిలోల బియ్యం, కిరోసిన్ కూడా ఇచ్చేవారు. ప్రస్తుతం సరుకుల సంఖ్య తగ్గింది. మూడు రకాల సరుకులను మాత్రమే ఇస్తున్నారు. ఆహార భద్రత చట్టాన్ని అనుసరించి తెల్ల కార్డుల్లో పేర్కొన్న లబ్ధిదారులకు నెలకు ఐదు కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అలాగే పంచదార అరకిలో, కిరోసిన్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మూడు నెలలుగా గోధుమపిండి పంపిణీ నిలిపేశారు. పట్టణాల్లో తెల్లకార్డు దారులకు వంట గ్యాస్ కనెక్షన్ ఉంటే ఒక లీటరు, లేకపోతే నాలుగు లీటర్ల చొప్పున, గ్రామాల్లో అయితే గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి లీటర్, లేని వారికి 2 లీటర్ల చొప్పున కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. అయితే.. రెండు నెలలుగా కిరోసిన్ కోటాను కూడా కుదించారు. నిబంధనల మేరకు పంపిణీ చేయాల్సిన దాంట్లో సగం మాత్రమే ఇస్తున్నారు. ఒక్కో రేషన్ కార్డుపై కిలో కందిపప్పు రూ.50 చొప్పున చౌకదుకాణాల్లో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ దుకాణాలకు పామాయిల్ సరఫరా నిలిపి వేశారు. గతంలో రేషన్ షాపుల్లో లీటరు పామాయిల్ రూ.40కి లభించేది. -
రేషన్ బ్లాక్ మార్కెట్‌కు ఈ-పాస్‌తో చెక్
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకుల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పౌర సరఫరాల శాఖ సన్నద్ధమవుతోంది. అక్రమాలకు అలవాటుపడ్డ డీలర్లు, అధికారులు అర్హులకు దక్కాల్సిన సరుకులను నల్లబజారుకు తరలించే చర్యలకు ఫుల్స్టాప్ పెట్టాలని యోచిస్తోంది. పక్కదారి పడుతున్న రేషన్ సరుకులను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అడ్డదారి నిరోధానికి ఇదొక్కటే దారి రాష్ట్రంలోని సుమారు రెండున్నర కోట్ల బీపీఎల్ లబ్ధిదారులకు ఏటా రూ.2,200 కోట్ల సబ్సిడీతో ప్రభుత్వం నిత్యావసరాలను పంపిణీ చేస్తోంది. రూ.30 విలువ చేసే బియ్యాన్ని ఒక్క రూపాయికి, రూ.50 ఉండే కిరోసిన్‌ను రూ.15కే అందిస్తున్నారు. వీటితో పాటే గోధుమలు, చక్కెర, కందిపప్పును సబ్సిడీపై ఇస్తున్నారు. పక్కాగా పేదలకు అందించాల్సిన ఈ సరుకులను కొంతమంది డీలర్లు కాసులకు కక్కుర్తిపడి బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. గత జూన్ నుంచి ఇప్పటివరకు 30 వేల క్వింటాళ్ల బియ్యాన్ని, 2లక్షల లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి తోపాటు గోధుమలు, కందిపప్పు సైతం పెద్దఎత్తున తనిఖీల్లో పట్టుబడుతూనే ఉన్నాయి. పట్టుబడని సరుకుల విలువ వీటికి మూడింతలు ఉంటుంది. ఏటా 25 నుంచి 34 శాతం వరకు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నందున దీని కట్టడికి అన్ని రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈపాస్ యంత్రాల ఏర్పాటును తెరపైకి తెచ్చింది. అయితే వీటికి సుమారు రూ.230కోట్లు వ్యయమవుతుండటంతో ఈ భారాన్ని భరించాలని కేంద్రాన్ని కోరినా వారి నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో రాష్ట్ర నిధులతోనే వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అంతా ఆన్లైన్...: ఈ పాస్‌తో పాటే పౌర సరఫరాలో అక్రమాల నిర్వహణకు ‘సరఫరా వ్యవస్థ నిర్వహణ (సప్లై చైన్ మేనేజ్మెంట్)’ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి సరుకుల సరఫరా మొదలు పంపిణీ వరకు మొత్తం ఆన్లైన్ ద్వారా జరిగేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 172 మండల స్థాయి స్టాక్ పాయింట్లలో కంప్యూటర్లు ఉన్నందున వాటికి యుద్ధప్రాతిపదికన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి అన్ని వివరాలు పొందుపరిచేలా చర్య లు తీసుకుంటున్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నుంచి చౌక ధరల దుకాణం వరకు సరుకుల పంపిణీ అడ్డదారి పట్టకుండా ఈ విధా నం ఉపయుక్తంగా ఉండనుంది. ఆన్లైన్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చి సరుకు రవాణా చేసే ట్రక్కుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎమ్మార్వో మొదలు కింది స్థాయి అధికారి వరకు చేరేలా ఎస్ఎంఎస్ వ్యవస్థను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
ఆప‘రేషన్ బినామీ’
అడ్డగోలు దందా.. జిల్లాలో గాడితప్పిన రేషన్ వ్యవస్థ బినామీల చేతుల్లో దుకాణాలు అవినీతిలో అధికారులకు వాటా ‘సాక్షి’ సర్వేలో వెలుగుచూసిన వాస్తవాలు జిల్లాలో పౌరసరఫరాల వ్యవస్థ గాడి తప్పింది. నిత్యావసర సరుకులు బినామీ, ఇన్చార్జీల గుప్పిట్లో చిక్కి.. ఆహార భద్రత మిథ్యగా మారింది. వీళ్లు కన్ను గీటితేనే సరుకులందుతాయి. అధికారులు కదులుతారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర్నుంచి ఉన్నతాధికారి వరకు బినామీలకు చుట్టాలే. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లో, 5 మున్సిపాల్టీల్లో, 3 నగర పంచాయితీల్లో ఏకకాలంలో సాక్షి నెట్వర్క్ ఒక సర్వే నిర్వహించింది. అందులో వెలుగుచూసిన వాస్తవాలు.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ నెట్వర్క్ : జిల్లాలోని 1860 రేషన్ దుకాణాల్లో దాదాపు 40 శాతం బినామీలు, ఇన్‌చార్జీలతోనే నడుస్తున్నాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో సాక్షి నెట్వర్క్ ఒక సర్వే నిర్వహించిం ది. ప్రతి మండలం, మున్సిపాల్టీ, నగర పంచాయితీల్లో కనీసం 2 రేషన్ దుకాణాలకు తగ్గకుండా 175 దుకాణాలను పరిశీలించింది. డీలర్లకు తెలియకుండా వినియోగదారుల నుంచి వివరాలను సేకరించింది. ప్రభుత్వ నివేదికల్లో అం తా సవ్యంగా సాగుతున్నట్టున్నా.. పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకొన్న అవి నీతి బయటపడింది. బినామీల రాజ్యం, వారితో అంటకాగుతున్న అధికారుల గుట్టు రట్టయింది. చూడ్డానికి చిల్ల ర దందాగానే కనిపిస్తున్నా ఒక్కో అవి నీతి రూపాయిని పోగేస్తే రూ కోట్లలో కుంభకోణం జరుగుతోంది. పల్లెల్లో వేలాది మంది నిరుద్యోగ యువకులు ఉండగా.. అధికారులు 55 పోస్టులు ఖాళీగా పెట్టి ఇన్‌చార్జీలకు అప్పగించ డం దీనికి పరాకాష్ట. సగటున ప్రతి మూడు దుకాణలకు ఒక బినామీ డీలర్ ఉన్నట్టు తేలింది. రెవెన్యూ అధికారులకు తెలిసే ఈ బినామీ దందా కొనసాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉండాల్సినవి 6 వేలు.. జిల్లాలో 1066 పంచాయతీలు, 580 శివారు గ్రామాలు, దాదాపు 199 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. మొత్తం 30.34 లక్షల మంది ప్రజలు ఉన్నారు. నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో ప్రతి 500 మందికి ఒక రేషన్ దుకాణం ఉండాలి. అర్బన్ ప్రాంతంలో 800లోపు జనాభాకు ఒక దుకాణం చొప్పున ఉండాలి. ఈ లెక్కన చూస్తే జిల్లాలో కనీసం 6 వేల రేషన్ దుకాణాలు అవసరం. కానీ 1841 దుకాణాలు మాత్రమే ఉన్నాయి (తాజాగా 23 దుకాణాలు మంజూరైనా.. వాటిని ఇంకా నడపటం లేదు). దీంతో ప్రతి రేషన్ దుకాణం వద్ద రద్దీ ఎక్కువైపోతోంది. దీనికి తోడు రేషన్ డీలర్ నెలలో కేవలం 10 రోజులే దుకాణం తెరవడం, అందునా నాలుగైదు గంటలకు మినహాయించి సరుకులు ఇవ్వకపోవడంతో జనం రేషన్ తీసుకోవడానికి ఒకేసారి ఎగబడుతున్నారు. ఈ రద్దీని తట్టుకుని నిలబడలేక కనీసం 7 నుంచి 10 శాతం మంది ప్రజలు సరుకులు తీసుకోకుండానే వెనుదిరిగిపోతున్నట్లు తేలింది. తనిఖీలు అంతంతే.. పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే, అదీ తూతూ మంత్రంగా రేషన్ దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. డీలర్ల వద్ద ఉన్న రేషన్‌కార్డుల నెంబర్లు నమోదు చేసుకొని కార్డు యజమానితో మాట్లాడినట్టుగా, పంపిణీ అంతా సవ్యంగా జరుగుతున్నట్టుగా నివేదిక తయారు చేసి దాని మీద ఒక వేలిముద్ర తీసుకుని వెళ్లిపోతున్నారు. అధికారులు పరిశీలనకు వచ్చిన రోజునే ఒక్కో డీలర్ తన స్థాయిని బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ముట్టచెబుతారని అంచనా. గ్రామంలో రెవెన్యూ సదస్సులప్పుడు డీలరే భోజనం ఏర్పాట్లు చూస్తున్నారు. చిన్నాచితక ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా అధికారులు డీలర్‌నే పురమాయిస్తున్నారు. ఇక అధికారులు వచ్చిపోయేటప్పుడు దారి ఖర్చులు, డీజిల్ ఖర్చులు డీలర్లే భరిస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు కాబట్టే డీలర్లపై అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. మచ్చుకివి.. ► జిల్లాలో పాతవి 1,841 రేషన్ దుకాణాలుండగా, ఈ ఏడాది కొత్తగా 23 మంజూరయ్యాయి. మొత్తం 1,860 దుకాణాలున్నాయి. ► 55 దుకాణాలు ఇన్చార్జీల అజమాయిషీలో ఉన్నాయి. 475 దుకాణాలు బినామీల గుప్పిట్లో నడుస్తున్నాయి. ► భార్యల పేరిట ఉన్న 500 దుకాణాల్లో భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారు. ►{Vేటర్ హైదరాబాద్ పరిధిలోని పటాన్చెరు మండలంలో 59 దుకాణాలున్నాయి. వీటిలో పటాన్చెరు పట్టణంలో 16 ఉండగా మిగిలినవి గ్రామాల్లో ఉన్నాయి. ఈ 59లో 14 దుకాణాలు బినామీలవే.. ► జిన్నారంలో 45 డీలర్‌షిప్‌లకు గాను 10 షాపులు బినామీలతో నడుస్తున్నాయి. ► రామచంద్రాపురంలో 38 డీలర్‌షిప్‌లలో 11 బినామీలున్నాయి. ► నారాయణఖేడ్ నియోజవర్గంలోని 70 శాతం దుకాణాల్ని బినామీలే నడిపిస్తున్నారు. ► మెదక్ పట్టణంలోని 20 రేషన్ షాపుల్లో ఆరు బినామీల చేతిలోనే ఉన్నాయి. ► ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన దుకాణాలు అగ్రవర్ణ సామాజిక వర్గాలు నడిపిస్తున్నాయి. ► వైకల్యం ఉన్న వారికి కేటాయించిన 39 దుకాణాలను సైతం ఇతరులు హస్తగతం చేసుకున్నారు. ► {పజాప్రతినిధులుగా ఉన్న వారు తమ దుకాణాల్ని ఇతరులకు అప్పగించారు. మహిళల పేరిట ఉన్నవీ ఇతరులే నిర్వహిస్తున్నారు. -
ధరల దడ
రెండు వారాల క్రితం రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. ఈ పరిస్థితిలో గుడ్డు రేటు అమాంతం పడిపోతుందని ఊహించారు. హోల్‌సేల్‌గా ఒక్కో గుడ్డుకు రూ. 2.64 ధర ఉంది. రెండు వారాలుగా ధరలో మార్పు రాకపోవడం విశేషం. - అమాంతం పెరిగిన పప్పు దినుసుల రేట్లు - వేడెక్కుతున్న నూనె - బెంబేలెత్తుతున్న సామాన్యులు వర్ధన్నపేట : ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టులేదు.. రాములో రామన్న అన్నట్లుగా ఉంది జిల్లావాసుల పరిస్థితి. పప్పులు, వంట నూనెల ధరలు పేదలను బెంబేలెత్తిస్తున్నారుు. సామాన్యులకు పప్పు నిత్యావసర వస్తువు.. అలాంటి పప్పు దినుసుల ధర వారం క్రితం పదుల సంఖ్యను దాటలేదు. ప్రస్తుతం వీటి ధర వందల్లోకి చే రుకుంది. అమాంతం పెరిగిన పప్పు దినుసుల రేట్లతో సామాన్యుడు బుక్కె డు బువ్వ తినలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రూపారుుకి కిలో బియ్యం సరఫరా చేస్తు న్నా.. రూ.1000 నుంచి రూ.1500 పింఛన్ ఇస్తున్నా.. నిత్యావసర ధరలను తగ్గించే ప్రయత్నం చేయకపోవడంతో సామాన్యుడు రెండు పూటలా కడుపునిండా తినడం లేదు. గత వారం, తాజా పరిస్థితిని పోలిస్తే ఒక్కో రకం పప్పునకు పది శాతం పైగా రేటు పెరిగింది. హోల్‌సేల్ రేటులోనే ధర ఇలా ఉంటే మార్కెట్ రేటు మరో ఐదు శాతం ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా వినియోగదారుడిపై పెనుభారం పడుతోంది. వారం క్రితం హోల్‌సేల్‌లో కందిపప్పు కిలో రూ.85 ఉండగా ప్రస్తుతం రూ.100కు పెరిగింది. రెండో రకం కందిపప్పు రూ. 78 నుంచి రూ. 90 వరకు అమ్ముతున్నారు. ఇదే దారిలో పెసరపప్పు రూ. 100 నుంచి రూ.110, శనిగపప్పు రూ. 45 నుంచి రూ. 52, మైసూర్‌పప్పు (ఎర్రపప్పు) రూ. 70 నుంచి రూ.80 వరకు , మినప గుండ్లు రూ. 90 నుంచి రూ.120, మినపపప్పు రూ.80 నుంచి రూ.110కి పెరిగింది. రిటేల్ మార్కెట్లో వినియోగాదారుడు ఒక్కో రకం పప్పుపై కిలోకు రూ. 3 నుంచి రూ. 7 వరకు అధికంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేడెక్కుతున్న నూనె.... వంట నూనెల రేట్లు కొద్దికొద్దిగా పెరుగుతున్నారుు. వారం క్రితం కిలో పల్లి నూనెకు రూ.90 ఉండగా ప్రస్తుతం 105కు చేరింది. కిలో శుభం ప్యాకెట్‌ను రూ. 95 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. కాటన్ నూనె ధర రూ. 55 నుంచి 60కి చేరింది. వేసవిలో పచ్చళ్ల సీజన్ కావడంతో నూనె రేట్లు పెరుగుతున్నట్లు వ్యాపారులు వెల్లడిస్తున్నారు. వేసవి ముగిసేలోగా పప్పు, నూనెల రేట్లు వినియోగదారుడిపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వారి మాటలను బట్టి తెలుస్తోంది. కాగా, జిలకర సైతం వినియోదారుడిపై ప్రభావం చూపిస్తోంది. కిలో జిలకర్ర ధర రూ.180 నుంచి రూ.200 వరకు చేరుకుంది. గుడ్డుపై ప్రభావం చూపని ‘బర్డ్‌ఫ్లూ’ పప్పు ధాన్యాలపై పెరుగుతున్న ప్రభావం గుడ్డుపై పడింది. సాధారణంగా కూరగాయలు, పప్పు దినుసుల రేటు పెరుగుతున్నప్పుడు వినియోగదారుడు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టడం సాధారణం. ప్రస్తుతం మార్కెట్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రెండు వారాల క్రితం రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. ఈ పరిస్థితిలో గుడ్డు రేటు అమాంతం పడిపోతుందని ఊహించారు. హోల్‌సేల్‌గా ఒక్కో గుడ్డుకు రూ. 2.64 ధర ఉంది. రెండు వారాలుగా ధరలో మార్పు రాకపోవడం విశేషం. పప్పు దినుసుల రేటు పెరుగుతుండడంతో సామాన్యులు ప్రత్యామ్నాయంగా గుడ్డును ఎంచుకోవడంతో మార్కెట్లో వాటి అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. -
మే నుంచి ఆన్లైన్లో నిత్యావసర సరుకులు
- నూతన విధానంపై డిపోల్లో ప్రయోగాలు - ఈ పాస్ విధానంలో పెరుగుతున్న లోపాలు - మే నెల కూడా 242 డిపోల్లోనే ఈపాస్ అమలు శ్రీకాకుళం పాతబస్టాండ్ : పౌర సరఫరాల విభాగంలో పీఎఫ్ షాపుల ద్వారా బీపీఎల్ కార్డుదారులకు నిత్యవసరుకులు అందజేసేందుకు ప్రవేశపెట్టిన ఈ పాస్ విధానం పూర్తిగా విఫలమయింది. ఏప్రిల్‌లో జిల్లాలో 242 డిపోల్లో ఈ పాస్ విధానం ప్రారంభించిన కనీసం 30 శాతం కూడా సఫలీకృతం కాలేదు. ఈ విధానంలో ఉన్న లోపాల వల్ల డీలర్లు, ప్రజలు అవస్థలు పడ్డారు. చివరికి గతి లేక ఆధికారులు గతంలో వలే మ్యన్యువల్గా లబ్ధిదారులకు సరుకులు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పాస్ ప్రయోగం వల్ల మంచి ఫలితాలు వస్తే, మే నెల నుంచి మరిన్ని డిపోల్లో నూతన విధానం అమలు చేయాలని ఆధికారులు భావించారు. ఆశించిన రీతిలో ఈ పాస్ విధానం అమలు కాకపోవడంతో ఇబ్బందులు అధిగమించేందుకు మరో ప్రయత్నం అధికారులు ప్రారంభిస్తున్నారు. ఏప్రిల్‌లో సుమారుగా 30 డిపోల్లో ఈ పాస్ యంత్రాలు మొరాయించాయి. నెట్ వర్కు సమస్యల వల్ల ఈ పాస్ యంత్రాలు పనిచేయ లేదు. ఎస్ఆర్డీ హెచ్ అనుసంధానం లేకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. నెట్ వర్కు సమస్యను ఆధిగమించేందుకు మే నెల నుంచి ఏపీ ఆన్లైన్ విధానంలో ఈ సరుకులు ఈపాస్ విధానంలో అందజేసేందుకు ప్రయోగాలు ప్రారంభించారు. ఏప్రిల్‌లో ఈ పాస్ విధానం అమలు చేసిన డిపోల్లోనే మే నెలలో కూడా అన్లైన్లో ఈ సరుకులు అందజేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. గతంతో ఈ నెట్ వర్కును నేషనల్ ఇన్పర్మేటివ్ సెంటర్ ద్వారా చేశారు. ఈ విధానం అమలులో సమస్యలు రావడంతో ఆన్లైన్ విధానంలో చేయాలని అధికారులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఈపాస్ విధానం అమలు చేస్తున్న డిపోలకు దగ్గరలో ఉన్న అన్లైన్ కేంద్రాల ద్వారా సరుకులకు సంబంధించిన అనుమతులు పొంది, ఆ రసీదు ఆధారంగా ఈ పాస్‌లో డిపోల వద్దకు వచ్చి సరుకులు తీసుకు వెళ్లాల్సింటుంది. ఇది లబ్ధిదారులకు కూడా భారంగా, కాలయాపనగా మారనుంది. పీఎస్ షాపుల డీలర్లకు కూడా ఇబ్బందులు అధికమయ్యే ప్రమాదాలు ఉన్నాయి. ఆచరణలో సాధ్యంకాని, సంపూర్ణ స్థాయిలో నెట్ వర్కుని ఏర్పాటు చేయకుండా ఆదరాబాదరాగా రాష్ర్ట ప్రభుత్వం ఈ పాస్ విధానం తీసుకురావడంతో లబ్ధిదారులు, డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్‌లో పాత విధానంలోనే పంపిణీ జిల్లాలో 1990 డిపోలు ఉన్నాయి, ఈ డిపోల పరిధిలో బీపీఎల్ కార్డులు 7,66,611 ఉన్నాయి. ఏప్రిల్‌లో జిల్లాలో 242 డిపోల్లో ఈ పాస్ విధానం అమలు చేశారు. 242 డిపోల పరిధిలో 1,24,754 బీపీఎల్ కార్డులు ఉన్నాయి. వీటిలో కేవలం 36వేలు కార్డులకు మాత్రమే ఈ పాస్ ద్వారా సరుకులు అంద జేశారు. మిగిలిన కార్డులకు గతంలో వలే మ్యాన్యువల్‌గా సరుకులు అందజేశారు. మే నెలలో 242 డిపోల్లో ఈ పాస్ విధానంలో సరుకులు ఏపీ ఆన్లైన్ సాయంతో అందజేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. -
వామ్మో... కందిపప్పు !
సాక్షి, సిటీబ్యూరో : భాగ్యనగరంలో సామాన్యుల బతుకులు భారంగా మారాయి. నగర మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు నింగికి ఎగబాకుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు నిత్యం వినియోగించే బియ్యం, పప్పులు, నూనెల ధరలు అనూహ్యంగా పెరిగిపోతుండగా, హోల్‌సేల్.. రిటైల్ ధరలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. ప్రత్యేకించి కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ధరలు సామాన్యులకు అందనంతంగా పెరిగిపోయాయి. జనవరిలో కేజీ రూ.72లున్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ.102లకు చేరుకుంది. దీనికితోడు పెసరపప్పు, మినపప్పు, బియ్యం, ఎండుమిర్చి, చింతపండు, పసుపు, దనియాల ధరలు సైతం దడ పుట్టిస్తున్నాయి. రెండు నెలల క్రితం సోనా మసూరి (కొత్త) బియ్యం ధర క్వింటాల్ రూ.3వేలు ఉండగా ప్రస్తుతం రూ.3400లకు చేరింది. కొందరు రిటైల్ వ్యాపారులు బెస్ట్ క్వాలిటీ పేరుతో అదే బియ్యాన్ని క్వింటాల్‌కు రూ.3500 అంటగడుతున్నారు. పాతబియ్యం క్వింటాల్ రూ.4800- 5000లు ధర పలుకుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.48-50లు వెచ్చించనిదే కిలో ఫైన్ రకం బియ్యం లభించట్లేదు. వంట నూనెల ధరలు హోల్‌సేల్‌గా తగ్గినా, చిల్లర మార్కెట్లో మాత్రం భగ్గునమండుతున్నాయి. పల్లీ నూనె ధర హోల్‌సేల్ మార్కెట్లో లీటర్ రూ. 95లుండగా, అదే రిటైల్ మార్కెట్లో రూ.5-6లు అదనంగా వసూలు చేస్తున్నారు. అన్ని రకాల నూనెల ధరలు రూ.4-6ల వరకు పెరిగాయి. పామాయిల్ ధర కూడా అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. వీటికితోడు కారం, చింతపండు, దనియాలు, పల్లీలు, పుట్నాలు, బెల్లం, పంచదార ధరలు కూడా కేజీకి రూ.6-10 పెరిగాయి. రాష్ట్రంలో ఆయిల్ పంట, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుండటమే ఈ పరిస్థితి కారణంగా కన్పిస్తోంది. కొన్నిరకాల సరుకులను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొంటుండటంతో వ్యాపారులు ధరలు పెంచి సొమ్ము చేసుకొంటున్నారన్నది బహిరంగ రహస్యమే. ఈ పరిస్థితుల్లో నెల బడ్జెట్లో అధికభాగం బియ్యం, వంటనూనె, పప్పులకే కేటాయించాల్సి వస్తోందని చిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇక సామాన్య, మధ్యతరగతి ప్రజల బతుకులు మరింత భారంగా మారాయి. కృత్రిమ కొరతకు యత్నం : నగర మార్కెట్లో నిత్యావసర వస్తువులకు కృత్రిమ కొరత సృష్టించేందుకు కొందరు అక్రమార్కులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ప్రధానంగా వివిధ రకాల పప్పులు, వంటనూనె, కొబ్బరి, మసాలాలు వంటివాటిని గోదాములకు తరలించి మార్కెట్లో కృత్రిమ కొరత సృషించేందుకు సన్నద్ధమయ్యారు. నగరంలోని మెహబూబ్ మేన్షన్, సిద్ధిఅంబర్‌బజార్, బేగంబజార్, ముక్తియార్‌గంజి తదితర హోల్‌సేల్ మార్కెట్లలో కొందరు వ్యాపారులు సరుకును దాచిపెట్టి మార్కెట్లో కొరతను సృష్టిస్తున్నారు. అక్రమ వ్యాపారులను కట్టడి చేయడంలో అధికారుల వైఫల్యం కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. -
డీలర్ల మాయాజాలం
యాక్టివేట్‌లోకి బోగస్ కార్డులు ఆధార్ యూఐడీ నెంబర్లు హైజాక్ బోగస్‌కార్డులకు సీడింగ్ భారీగా అవకతవకలు చేతులు మారుతున్న సొమ్ములు విశాఖపట్నం: ఆధార్‌ను అడ్డంపెట్టుకుని డీలర్లు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. అర్హులైన అల్పాదాయ వర్గాల వారికి అందాల్సిన నిత్యావసర సరకులును లూటీ చేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. నిరుపేదల బలహీనతలను ఆసరాగా చేసుకుని వేలాది కార్డులను తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రతినెలా టన్నుల కొద్దీ నిత్యావసరాలను పక్కదారి పట్టించే ఈ అక్రమార్కులు ఇప్పుడు తమ కడుపు కొడుతున్న ఆధార్‌నే అస్త్రంగా చేసుకుని బోగస్‌కార్డులను..ఇన్‌యాక్టివ్ కార్డులకు జీవం పోస్తున్నారు. జిల్లాలో 2012రేషన్‌షాపుల పరిధిలో 11,15,106 కార్డులున్నాయి. వీటి పరిధిలో 39,50,420మంది అల్పాదాయవర్గాల వారున్నారు. ఒక్కొక్క షాపు పరిధిలో 200 నుంచి 3,500 వరకు రేషన్‌కార్డులున్నాయి. ఒక్కొక్క షాపు పరిధిలో 50 నుంచి 500 వరకు బోగస్‌కార్డులు (తనఖా పెట్టిన, వలసపోయిన వారి) ఉంటాయని అంచనా. వీటికి సంబంధించిన సరకులను ఇప్పటివరకు ఆయా రేషన్ డీలర్లే డ్రా చేసుకుని పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకునే వారు. ఇప్పుడు ఆధార్ ఈ అక్రమార్కుల పాలిట బ్రహ్మాస్త్రంగా తయారైంది. మొన్నటి వరకు ఈఐడీ సీడింగ్ ఉంటే చాలు సరకులు ఇచ్చేవారు. ప్రస్తుతం యూఐడీ సీడింగ్ ఉంటే కాని సరకులు ఇవ్వడం లేదు. యూఐడీ సీడింగ్ ఉన్న కార్డులకే డిజిటల్ కీ రిజిస్ట్రర్ ప్రకారం సరకులు రిలీజ్ అవుతున్నాయి. దీంతో రేషన్‌షాపు డీలర్ల వద్ద ఉన్న బోగస్ కార్డుల్లో 80 శాతం ఇన్‌యాక్టివ్ అయిపోయాయి. ఇటీవల జిల్లా జాయింట్ కలెక్టర్ నివాస్ జనార్ధనన్ ప్రకటించిన 70,066 ఇన్‌యాక్టివ్ కార్డుల్లో ఎక్కువగా వీరి వద్దే ఉన్నాయి. వీటన్నింటిని ఇప్పుడు యాక్టివ్‌లోకి తీసుకొచ్చేందుకు డీలర్లు కొత్త ఎత్తుగడ వేశారు. ఇందుకు తాజా ఉదాహరణే ఈ ఘటన. జీవీఎంసీలోని సర్కిల్-3 పరిధిలోని ఉన్న ఓ రేషన్‌షాపులో 3వేలకు పైగా కార్డులున్నాయి. ఆధార్ సీడింగ్ కూడా ఈ షాపులో దాదాపు వంద శాతం పూర్తయింది. అలాంటిది ఉన్నట్టుండి ఈ షాపులో ఫిబ్రవరి నెలకొచ్చేసరికి ఏకంగా 1612 కార్డులు ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లిపోయాయి. ఆరా తీస్తే అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ డీలర్ చుట్టుపక్కల మరో 10వరకు రేషన్‌షాపులున్నాయి. ఆయా షాపుల వరిధిలో కూడా పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులున్నాయి. వాటన్నింటిని యాక్టివ్‌లోకి తీసుకొచ్చేందుకు ఈ షాపులోని సీడింగ్ అయిన కార్డులకు చెందిన యూఐడీ నంబర్లను తొలగించి అన్సీడింగ్ జాబితాలో చేర్చి ఆ యూఐడీ నంబర్లను తమ పరిధిలోని బోగస్‌కార్డుల్లోని యూనిట్లతో సీడింగ్ చేశారు. దీంతో ఆయా షాపులపరిధిలోని సుమారు 1500కు పైగా బోగస్‌కార్డులు యాక్టివ్‌లోకి వచ్చేశాయి. వీటికి ఫిబ్రవరి నెలకు సరకులు కూడా రిలీజ్ అయ్యాయి. సర్కిల్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్లతో డీలర్లు కుమ్మక్కై ఈ అవకతవకలకు పాల్పడినట్టు తెలియవచ్చింది. ఈ ఒక్క షాపు లోనే కాదు..దాదాపు సర్కిల్ పరిధిలోని వందకు పైగా ఉన్న షాపుల్లో ఈ విధమైన అక్రమాలు జరిగినట్టుగా సమాచారం. జిల్లా వ్యాప్తంగా గత రెండుమూడునెలల్లో వేలాదికార్డులు యాక్టివ్ లోకి రావడం కూడా పలు అనుమానాలకుతావిస్తోంది. కొన్ని డిపోల్లో అయితే ఏపీఎల్ కార్డు దారుల యూఐడీ నంబర్లను బోగస్‌కార్డుల్లోని యూనిట్లతో సీడింగ్ చేసి ఇన్‌యాక్టివ్ కార్డులను పెద్ద సంఖ్యలో యాక్టివ్‌లోకి తీసుకొస్తున్నట్టుగా తెలియవచ్చింది. యూఐడీ నంబర్ సరైనదైతే చాలు ఆటోమేటిక్‌గా సీడింగ్ అయిపోతుంది. దీన్ని సాకుగా చూపే ఈ అక్రమార్కులు చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. -
సరిహద్దులు దాటుతున్న సరుకు..?
కోటపల్లి : ప్రాణహిత నది మీదుగా నిత్యావసర సరుకులు సరిహద్దు దాటుతున్నాయి. లక్షలాది రూపాయలు వాణిజ్య పన్నులకు ఎగనామం పెడుతూ యథేచ్ఛగా తరలిస్తున్నారు. నిత్యావసర సరుకులు, పప్పు దినుసులు, నూనె డబ్బాలు మహారాష్ట్రకు రవా ణా చేస్తున్నారు. మండలంలోని అర్జునగుట్ట ప్రాణహిత నదీ తీరం సరిహద్దు మహారాష్ట్రకు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంతో అవతలి, ఇవతలి తీరంగా ఉంది. ఆ రాష్ట్రం లోని గడ్చిరోళి జిల్లా సిర్వంచ కేంద్రంగా అర్జునగుట్ట తీరం నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. నది అవతలి ఒడ్డున పాత తాలూకా కేంద్రం సిర్వంచ గ్రామం ఉంది. జిల్లాలోనే వెనుకబడిన ఆదివాసీ ప్రాంతం. ఇక్కడ ఏ వ్యాపార, వాణిజ్య అవసరాలు ఏర్పడినా మన రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను ఆశ్రయించాల్సిందే. ఇదే అదునుగా చెన్నూర్‌లోని వ్యా పారులు సిర్వంచ వాణిజ్య కేంద్రంగా వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. అంతర్రాష్ట్ర నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులను విక్రయాల కోసం తరలించాలంటే పన్నులు చెల్లించాల్సిందే. కానీ ఇక్కడి వ్యాపారులు కొందరు ఆ నిబంధనలేవీ పాటించడం లేదు. నిత్యం టన్నుల కొద్దీ పప్పుదినుసులు, వందలాది లీటర్ల నూనె డబ్బాలు, నాణ్యమైన సన్నబియ్యం సహా ఇతర వస్తువులు ప్రాణహిత నది మీదుగా పడవల్లో సరిహద్దు దాటుతున్నాయి. సరుకుల రవాణాకు వ్యాపారులు ప్రత్యేకంగా జీపులు సమకూర్చుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. ప్రతీ రోజు సుమారు ఐదు నుంచి పది జీవుల సరుకు లోడ్ నాటు పడవల్లో తరలిపోతోంది. జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు పట్టిం చుకోవడం లేదనే విమర్శలున్నాయి. అడపా దడపా సరకుల రవాణాను నిలువరించి కేసులు నమోదు చేస్తున్న విజిలెన్స్ అధికారులు నిబంధనలు అతిక్రమించి అక్రమంగా రవాణా అవుతున్న నూనె, పప్పుదినుసులు, బియ్యం తదితర సరకుల అక్రమాలపై విచారణ చేపడితే భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
నిత్యావసరాలకు సిఫార్సు లేఖ తప్పని సరి
నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా చర్యలు ఏ గుర్తింపుకార్డు లేకపోయినా సరకులు ఎమ్మెల్యే లేదా జన్మభూమి కమిటీ లేఖ తప్పనిసరి వస్తువుల సరఫరాపై విజిలెన్స్ నిఘా నేడు లక్ష మందికి సరకుల పంపిణీ విశాఖ రూరల్: రేషన్ కార్డు లేని వారికి ఫొటో తీసి నిత్యావసర సరకులు అందించేందుకు అధికారులు నిర్ణయించారు. సరకులు పక్కదారి పట్టకుండా, తీసుకున్న వారే మళ్లీ తీసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎటువంటి గుర్తింపు కార్డు లేకపోయినప్పటికీ... స్థానిక ఎమ్మెల్యే లేదా జన్మభూమి కమిటీల నుంచి లేఖ తీసుకువస్తే సరకులు అందజేస్తారు. ఆ లేఖలను పరిశీలించడంతో పాటు రేషన్ దుకాణంలో ఫొటోగ్రాఫర్‌తో అభ్యర్థికి ఫొటో తీసిన తరువాత వస్తువులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం 400 మంది ఫొటోగ్రాఫర్లకు శిక్షణ ఇచ్చారు. సోమవారం ఒక్క రోజే నగరంలో లక్ష మంది కార్డులు లేని వారికి సరకులు పంపిణీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి రేషన్ షాపునకు 200 నుంచి 400 మందికి సరిపడా సరకులు పంపిణీ చేశారు. విజిలెన్స్ నిఘా: హుదూద్ తుపాను కారణంగా 13 లక్షల మంది నష్టపోయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో తెలుపు, గులాబీ కార్డులు ఉన్న సుమారు 12 లక్షల మందికి ఇప్పటికే సరకులు పంపిణీ జరుగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు వలస వచ్చిన వారు, కార్డులు లేని వారు లక్ష మంది వరకు ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వారందరికీ సోమవారం రేషన్ దుకాణాల ద్వారా సరకులు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ కార్డులు, ఎటువంటి గుర్తింపు కార్డు లేకపోయినా సరకులు ఇస్తుండడంతో ఇవి కొంత పక్కదారి పట్టే అవకాశాలు ఉండడంతో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి విజిలెన్స్ బృందాలను అదనంగా జిల్లాకు రప్పిస్తున్నారు. రెండో సారి సరకులు తీసుకుంటే చర్యలు తొలుత గుర్తింపు కార్డులు చూపిస్తే సరకులు ఇవ్వాలని భావించినప్పటికీ... తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఒక కుటుం బంలో ఇద్దరు, ముగ్గురు సభ్యులు గుర్తింపు కార్డులు చూపించి సరకులు తీసుకొనే అవకాశముండడంతో ఎమ్మెల్యే, జన్మభూమి కమిటీల నుంచి లేఖలను తప్పనిసరి చేశారు. ఎమ్మెల్యేల నుంచి ఈ లేఖలు పొందలేని వారు జన్మభూమి కమిటీల నుంచయినా లేఖ తీసుకుంటే సరకులు ఇస్తారని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. ఎవరూ రెండోసారి రేషన్ తీసుకొనే అవకాశంలేకుండా ఆ లేఖలను పరిశీలిస్తారు. ఆ లేఖల్లో లబ్ధిదారుడితో పాటు, వారి కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోను కూడా జత చేయనున్నారు. తెలుపు, గులాబీ కార్డుదారులు ఎవరైనా మళ్లీ సరకులు తీసుకోడానికి వస్తే ఫోటోల ఆధారంగా గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
ఉచితం సరే.. సరకులేవీ?
తుపాను బాధితులకు బియ్యంతో పాటు 9 సరకులు పంపిణీ చేస్తామని సీఎం హామీ అంత స్థాయిలో జిల్లాలో స్టాకు లేక అధికారుల మల్లగుల్లాలు విశాఖ రూరల్ : హుదూద్ తుపాను బాధితులకు బియ్యంతో పాటు 9 రకాల నిత్యావసర సరకులు ఉచితంగా అందిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చి న హామీ నేరవేరడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ప్రకటించిన వస్తువుల్లో ఏ ఒక్కటీ జిల్లాలో పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. దీంతో వాటిని ఇతర జిల్లాల నుంచి సేకరించాలని నిర్ణయించారు. తుపాను కారణంగా ఎంత మంది తెల్లరేషన్‌కార్డుదారులకు నష్టం జరి గిందో అంచనాలు సిద్ధం చేశారు. ఆ స్థాయిలో ని త్యావసరాల సేకరణ నివేదిక తయారు చేయగా.. తాజాగా సీఎం ఆ వస్తువులను కేవలం కార్డుదారులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. దీంతో ఎంత మేర నిత్యావసరాలను సేకరించాలో తెలియక అధికారులు కిందామీదా పడుతున్నారు. సగం స్థాయిలో కూడా సరకులు లేవు తుపానుకు నష్టపోయిన ప్రతి కార్డుదారునికి 25 కిలోల బియ్యం, కిలో పంచదార, 2 కిలోల కంది పప్పు, అరకిలో కారం, అరకిలో ఉప్పు, పామాయిల్ లీటర్, కిరోసిన్ 5 లీటర్లు, బంగాళదుంపలు 3 కిలోలు, ఉల్లి 2 కిలోలు ఉచితంగా ఇస్తామని సీ ఎం హామీ ఇచ్చారు. దీని ప్రకారం పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తే తెల్ల కార్డుదారుల కు సగం స్థాయిలో సరకులు లేవని గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి సేకరణ ప్రస్తుతం జిల్లాలో ఉన్న మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో బియ్యం 6857.292 మెట్రిక్ టన్ను లు, పంచదార 152.750 మెట్రిక్ టన్నులు, కా రం 5 మెట్రిక్ టన్నులు, ఉప్పు 25 వేలు మెట్రిక్ టన్నులు, కిరోసిన్ 76 కిలోలీటర్లు మాత్రమే ఉన్నాయి. పామాయిల్, కృదిపప్పు లేవు. ఆయి ల్ గత ఏడు నెలలుగా తెల్లరేషన్‌కార్డులకు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. కానీ తుపాను బాధితులకు వీటిని ఇతర ప్రాంతాల నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యం సరిపడా లేనప్పటికీ ఎఫ్‌సీఐ నుంచి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎఫ్‌సీఐలో బియ్యం అవసరాలకు సరిపడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన వస్తువులను మాత్రం ఇతర ప్రాంతాల నుంచి సేకరించాల్సి ఉంది. కార్డుదారులకే కాకుండా అపార్టుమెంట్లలో ఉన్న వారికి కూడా ఈ వస్తువులను ఉచితంగా ఇస్తామని సీఎం ప్రకటించారు. మొత్తం 9 లక్షల మందికి అందజేస్తామని చెప్పడంతో అంత స్థాయిలో సేకరణ సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతటి స్థాయిలో అధికారులు సైతం ఇంకా ప్రణాళికలు కూడా రూపొందించలేదు. -
చిరునవ్వును పంచండి
‘నిరుపేదల మోముల్లో చిరునవ్వులు పూయిస్తాయనుకునే దేనినైనా దానం చేయొచ్చు. వస్త్రాలు, పుస్తకాలు, నిత్యావసర వస్తువులను మా మాల్లో అందించవచ్చు’ అని అంటున్నారు మంజీరా మాల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గజ్జల వివేకానంద. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ముందుగానే ఆయా వస్తువులను ‘యువత’ సంస్థ సహకారంతో నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మంజీరా మజా పేరిట ‘చిరునవ్వును పంచండి’ అంటూ కూకట్‌పల్లిలోని మంజీరా మాల్లో బుధవారం ‘సంప్రదాయ గోలు’ను తెరిచారు. ఇది అక్టోబర్ 1 నుంచి 18వ తేదీ వరకు తెరిచి ఉంటుంది. ‘రోమియో’ చిత్రం హీరో సాయిరామ్‌శంకర్ తన యూనిట్‌తో ఇందులో పాల్గొన్నారు. -
జోగుతున్న నిఘా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని సరుకుల ధరలూ రెట్టింపయ్యాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఆహార పంటల సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఫలితంగా ఉత్పత్తుల తక్కువగా వచ్చే పరిస్థితి ఉండటంతో వ్యాపారులు, రైస్ మిల్లర్లు నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేస్తున్నారు. దీంతో ధరల పెరుగుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయినా పౌర సరఫరాల శాఖ, నిఘా విభాగం అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. అక్రమ నిల్వలు, సర్కారు సబ్సిడీ బియ్యం పక్కదారి పడుతున్న విషయంలో పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధరలు పెరిగినప్పుడు తనిఖీలు ఎక్కువగా జరగాలి. జిల్లాలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. గత ఏడాది తనిఖీలో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గాయి. ఇదే సమయంలో నిత్యావసరాల ధరలు మాత్రం పెరగడం గమనార్హం. ధరలు పెరిగినప్పుడు తనిఖీలు పెరగకపోవడానికి జిల్లా ఉన్నతాధికారుల ఉదాసీనతే కారణంగా కనిపిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ(రేషన్)లో పారదర్శకత పెంచడం, నిత్యావసర వస్తువల ధరల నియంత్రణపై చర్యలు లక్ష్యంగా జిల్లాలో ఉన్న ఆహార సలహా కమిటీ(ఎఫ్ఏసీ) సమావేశం నిర్వహణపైనా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మూడు నెలలకు ఒకసారి ఎఫ్ఏసీ సమావేశం జరగాల్సి ఉంది. చివరగా 2014 జనవరిలో జరిగింది. తనిఖీలు నామమాత్రమే.. పౌర సరఫరాల శాఖకు సంబంధించి జిల్లాలో ఐదుగురు సహాయ సరఫరా అధికారులు(ఏఎస్వో), ఐదుగురు ఆహార ఇన్స్పెక్టర్లు, ఉప తహశీల్దార్లు ఉన్నారు. జిల్లా స్థాయిలో ఒక ధాన్యం కొనుగోలు అధికారి(జీపీవో), సహాయ అధికారి ఉన్నారు. నిత్యావసరాల అక్రమ నిల్వలను నిరోధించడం, ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను నివారించడం లక్ష్యంగా వీరు నిత్యం తనిఖీలు నిర్వహించాలి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు చేయాలి. ఇలా ప్రత్యేకంగా తనిఖీలు, దాడులు చేసే పౌర సరఫరాల అధికారులు సిబ్బంది కాకుండా ప్రతి మండంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉంటారు. ఇద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లు ఉంటారు. వీరు కూడా ఈ పనులు చేయవచ్చు. నిత్యావసర సరుకుల బడా వ్యాపారులతో, రైస్ మిల్లర్లతో అధికారులకు, కింది స్థాయి ఉద్యోగుల వరకు ఉన్న సత్సంబంధాల కారణంగా ఎవరూ తనిఖీలు చేయడంలేదని తెలుస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేసినా... సంబంధిత వ్యాపారులకు అధికారుల నుంచి ముందుగానే సమాచారం అందుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు సరఫరా చేసే సరుకులను కొనుగోలు చేయాలంటే కొన్ని ఇతర వస్తువులు తీసుకోవాల్సిందేనని కొందరు రేషన్ డీలర్లు ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినా పౌర సరఫరాల అధికారులు స్పందించడంలేదు. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ సైతం దాడులు, తనిఖీల విధులను దాదాపుగా పక్కనబెట్టింది. ఏదైనా ఫిర్యాదు వస్తే కింది స్థాయి సిబ్బంది అక్కడి వెళ్లి, తర్వాత పౌర సరఫరాల అధికారులకు సమాచారం ఇచ్చి రావడం జరుగుతుందే తప్ప చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. -
మూడంటే మూడే..!
ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు ప్రతి నెల నిత్యావసర సరుకులు ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి నెల కార్డుదారులకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. ప్రస్తుతం సరుకుల సరఫరా సక్రమంగా జరగడం లేదు. ప్రభుత్వం నుంచి సరఫరా కావాల్సిన పామోలిన్ కమిషనరేట్ స్థాయిలోనే సరఫరా నిలిచిందని అధికారులు పేర్కొంటున్నారు. సుమారు ఐదు నెలలుగా పామోలిన్ జిల్లాకు రావడం లేదు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో కార్డుదారులకు ఉన్న సరుకులు సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. సెప్టెంబర్ నెల కోటా కింద కార్డుదారుడికి బియ్యం, చక్కెర, ఉప్పు మూడే సరుకులు పంపిణీ చేయడం శోచనీయం. ఇదిలా ఉండగా చింతపండు, పసుపు, గోధుమలు, కందిపప్పు, కారంపొడి సరుకులు గోదాముల్లో అందుబాటులో ఉన్న సంబంధిత డీలర్లు సరఫరా చేసుకోవడం లేదు. దీంతో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. పండుగలకు ప్రభుత్వం అదనపు కోటా ఇవ్వకున్నా.. ఉన్న సరుకులను సక్రమంగా పంపిణీ చేస్తే బాగుంటుందని కార్డుదారులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్‌లో ‘మూడే’ పంపిణీ జిల్లాలోని రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ నెల కోటా కింద మూడే సరుకులు పంపిణీ అవుతున్నాయి. జిల్లాలో అన్నయోజన, అంత్యోదయ, తెలుపు రేషన్ కార్డులు 6,10,236 ఉన్నాయి. వీరికి సెప్టెంబర్ కోటా కింద 91,346.35 క్వింటాళ్ల బియ్యం, 3051.18 క్వింటాళ్ల చక్కెర, 6,09,660 పసుపు పాకెట్లు, 6,09,187 గోధుమ పిండి ప్యాకెట్లు, 6,09,584 ఉప్పు ప్యాకెట్లు, 6,09,479 కారంపొడి ప్యాకెట్లు, 6,098.51 క్వింటాళ్ల కందిపప్పు, 6.09 లక్షల చింతపండు ప్యాకెట్లు, 6,099.9 క్వింటాళ్ల గోధుమలు నెల కోటాగా కేటాయించారు. కోటా సరుకుల కేటాయింపు జరుగుతున్నా గ్రామాల్లో రేషన్ ద్వారా కార్డుదారుడికి నిత్యావసర సరుకులు సరఫరా కావడం లేదు. ప్రభుత్వం ఆగస్టు నుంచి ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(ఈ-పీడీఎస్) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో సరుకుల కేటాయింపు ఆన్లైన్లో జరుగుతుంది. ఈపీడీఎస్తో నిత్యావసర సరుకులు సరఫరా పటిష్టం అని ప్రభుత్వం భావించినా పరిస్థితి అందుకు భిన్నంగా కన్పిస్తోంది. ‘బోగస్ కార్డులకు’ కోటా కట్.. గత నెలలో ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ చేపట్టింది. ఈ ఏరివేతలో బోగస్‌గా తేలిన కార్డులకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన కోటా విడుదల చేయలేదు. అయితే అధికారులు చేపట్టిన బోగస్ ఏరివేతలో అర్హులైన రేషన్ కార్డుదారులు ఉన్నారు. దీంతో వారు ఈ నెల రేషన్ కోల్పోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ నెల కోటా సరుకులు తీసుకువెళ్లేందుకు డీలర్ల వద్దకు వచ్చిన అర్హులైన కార్డుదారులు అధికారులు తొలగించారనే విషయం తెలియడంతో ఆందోళన చెందాల్సి వస్తోంది. ఈ ఏరివేతలో చనిపోయిన వారి పేర్లు, వలసలు వెళ్లిన వారి పేర్లు తొలగించారు. జిల్లాలో సుమారు 83,887 రేషన్ కార్డులు బోగస్ గుర్తించి తొలగించారు. వీటికి సెప్టెంబర్ నెల కోటా సరుకుల కేటాయింపు నిలుపుదల చేశారు. సరఫరా నిలిచింది.. - ఆనంద్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మేనేజరు నిత్యావసర సరుకులతోపాటు పంపిణీ చేసే పామోలిన్ సరఫరా ప్రభుత్వం నుంచే రావడం లేదు. మే నెల నుంచి సెప్టెంబర్ వరకు ఐదు నెలలుగా పామోలిన్ జిల్లాకు రాలేదు. ప్రభుత్వం నుంచి సరఫరా అయితే తప్పకుండా కార్డుదారులకు పంపిణీ చేస్తాం. -
గణేష్ మహోత్సవం ఎఫెక్ట్
సాక్షి, ముంబై: గణేష్ ఉత్సవాల సమయంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ముంబై-గోవా జాతీయ రహదారిపై భారీ వాహనాలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రజలు ఉత్సవాలు సంతోషంగా జరుపుకుని తిరిగి ముంబైకి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణ శాఖ తెలిపింది. గణేష్ ఉత్సవాలు ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచి ఈ రహదారిపై భారీ ట్రక్కులు, ట్రెయిలర్లు, కంటైనర్లు, అయిల్ ట్యాంకర్లు తదితర భారీ వాహనాలను నిషేధించనున్నారు. మళ్లీ ఉత్సవాలు ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. దీన్ని బట్టి ఈ రహదారిపై ప్రయాణికుల రాకపోకలు ఏ స్థాయిలో ఉంటాయో ఇట్టే ఊహించుకోవచ్చు. అయితే పాలు, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ సిలిండర్లు, మెడికల్ ఆక్సిజన్, కూరగాయలు, నిత్యావసర సరుకులు తరలించే భారీ వాహనాలకు మినహాయింపు నిచ్చినట్లు ఆర్టీఓ అధికారులు వెల్లడించారు. ముంబై-గోవా రహదారిపై సాధారణ రోజుల్లోనే విపరీతంగా వాహనాల రద్దీ ఉంటుంది. గణేష్ ఉత్సవాలకు ముంబై నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఇప్పటికే రెగ్యూలర్ సర్వీస్‌లతో పాటు ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ బస్సుల బుకింగులు ఫుల్ అయ్యాయి. ఇక జీపు, కార్లు, టాటా సుమోలు, క్వాలిస్, బస్సు లాంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం మిగిలిపోయింది. ఉత్సవాలకు మూడు రోజుల ముందు నుంచి ముంబై-గోవా రహదారిపై ప్రయాణికులను చేరవేసే వాహనాల సంఖ్య గణనీయంగా ఉంటుంది. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా ఎక్కువే ఉంటుంది. దీన్ని దష్టిలో ఉంచుకుని ఏటా ఉత్సవాలకు ముందు, ముగిసిన తరువాత కొన్ని నిర్ధేశించిన రోజుల్లో భారీ వాహనాలకు నిషేధం విధిస్తారు. గతంలో ఉత్సవాల సమయంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రాణ, ఆస్తి నష్టం కూడా చాలా జరిగింది. రోడ్డు ప్రమాదాలవల్ల రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. దీంతో మిగతా వారు సకాలంలో తమ గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. వీరి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని గత పదేళ్ల నుంచి ఉత్సవాల సమయంలో ఆర్టీఓ అధికారులు ఈ రహదారిపై భారీ వాహనాలను నిషేధిస్తూ వస్తున్నారు. -
అస్తవ్యస్తం !
ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుతున్నాయా.. లేదా.. అని చూసేందుకు సరిపడా అధికారులు లేరు. ఫలితంగా ప్రజా పంపిణీ సజావుగా సాగడం లేదు. జిల్లాలో ఒక్కో డివిజన్‌కు ఒక ఏఎస్వో స్థాయి అధికారి విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే వీరు జిల్లాలో అవసరమైనంత మంది లేకపోవడంతో పర్యవేక్షణ పడకేసింది. జిల్లాలో ఉన్న రేషన్ షాపులు, కిరోసిన్, వంటగ్యాస్ సంస్థలపై తరచుగా ప్రత్యేక బృందాలు దాడులు చేస్తేనే పౌరసరఫరాలో లోటుపాట్లు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి దాడులు లేకపోవడంతో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం కిరాణం షాపుల్లో, మిల్లర్ల వద్ద దర్శనమిస్తున్నాయి. వంట గ్యాస్ సిలెండర్లను కమర్షియల్ సిలెండర్లుగా, వివిధ కార్లకు ఇంధనంగా వినియోగిస్తున్నారు. ఏఎస్వో స్థాయి అధికారులు సరిపడా లేకపోవడంతో మండల కేంద్రాల్లో ఉన్న సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదుగురికి ఒక్కరే... ప్రజా పంపిణీ వ్యవస్థపై పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో ఒక అధికారి ఉంటారు. జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు, డీఎస్వో కార్యాలయంలో పాలన పరమైన అంశాలు చూసేందుకు మరొకరు జిల్లా కేంద్రంలో ఉంటారు. అయితే జిల్లాలో ఐదుగురు ఏఎస్వోలకు గాను ప్రస్తుతం ఒక్కరే డీఎస్వో కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నా రు. మిగిలిన నాలుగింటిలో భద్రాచలం డివి జన్‌లో పోస్టు ఖాళీగా ఉంది. ఇక ఖమ్మం ,కొత్తగూడెం, పాల్వంచలలో పని చేస్తున్న వారు డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాలో పరిస్థితి అధ్వానంగా తయారైంది. అలాగే భద్రాచలం డివిజన్లో ఒక్క డీటీ మాత్రమే పనిచేస్తున్నారు. బూర్గం పాడు మండలంలో సైతం సివిల్ సప్లై డీటీ పోస్టు ఖాళీగానే ఉంది. పర్యవేక్షణ కరువు.... డివిజన్ పరిధిలో ఏఎస్వో స్ధాయి అధికారి విధుల్లో కొనసాగితే ఆ పరిధిలోని డిప్యూటి తహశీల్దార్లను అప్రమత్తం చేస్తూ అక్రమ మార్గంలో తరలే నిత్యావసర వస్తువులకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. అయితే పై స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మండలస్ధాయిలో సివిల్ సప్లై డీటీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ దందా ..... సరైన పర్యవేక్షణ లేని కారణంగా రేషన్ బియ్యం అక్రమ దందా యథేచ్చగా కొనసాగుతోంది. ప్ర జా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం భారీ ఎత్తున ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. కిరోసిన్ అక్రమదందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎప్పుడో ఒకసారి జరిగే దాడుల్లో దొరుకుతున్నప్పటికీ అంత గా చర్యలు లేకపోవడంతో అక్రమ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయల్లా కొనసాగుతోంది. పెద్దల ముసుగులో అక్రమ వ్యాపారం... జిల్లాలో బియ్యం, కిరోసిన్, గ్యాస్ తదితర నిత్యావసర వస్తువులు అక్రమ మార్గంలో తరలివెళ్లడంలో పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పెద్దల ముసుగులో కొందరు అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం జిల్లా అధికారులకు తెలుసో.. తెలియదో కానీ కిందిస్థాయి ఉద్యోగులు మాత్రం అక్రమార్కుల జోలికి వెళ్లడంలేదు. ఒకవేళ ఎవరినైనా పట్టుకుంటే ‘పెద్దాయన.. అదే మీబాస్ మా దగ్గరి చుట్టం.. ఆయనతో మాట్లాడించాలా’ అని అనడంతో మాకెందుకులే అని సిబ్బంది నోరు మెదపకుండా వస్తున్నారు. ఈ తరహా వ్యవహారం ఖమ్మంలో అధికంగా సాగుతోందని పౌరసరఫరాల అధికారులే పేర్కొనడం కొసమెరుపు. -
రండి బాబూ రండి..
సాక్షి, కడప : ప్రజలకు పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా గోడౌన్లో రూ. లక్షలు విలువైన సరుకులు మగ్గుతున్నాయి. ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు..ఏకంగా ఏడాది కాలంగా రూ. రూ. 60 లక్షల విలువైన సరుకులు మగ్గుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం మిల్లర్లకు అమ్మేందుకు కూడా చొరవ చూపడం లేదు. ఇటీవల జిల్లాకు వచ్చిన పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ఈ విషయంలో తీవ్రంగా మండిపడినా అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏడాదికి కాలంగా గోడౌన్లో..అమ్మహస్తం సరుకులు... అమ్మహస్తం పథకంలో భాగంగా అప్పటి కిరణ్ సర్కార్ 2013 జనవరిలో 9 వస్తువులకు సంబంధించిన సరుకులను లారీల ద్వారా జిల్లాకు పంపించారు. అప్పట్లో అధికారులు పరిశీలించుకున్నారో లేదో తెలియదుగానీ గోడౌన్లో దించుకుని...తర్వాత తాపీగా చూసుకుంటే ప్రజలకు పంపిణీ చేసే వస్తువుల్లో నాణ్యత లోపించినట్లు స్పష్టమైంది. 2013 జనవరి నుంచి ఇప్పటివరకు గోడౌన్లోనే సరుకులు నిల్వ ఉన్నాయి. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ విషయాన్ని ఇంతవరకు బయటికి పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నా.. ఇటీవలే ఓ సమీక్షా సమావేశంలో బహిర్గతమైంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఇక్కడి అధికారులు పేర్కొంటున్నారు. గోడౌన్లో రూ. 60 లక్షల విలువైన సరుకులు పౌరసరఫరాలశాఖ గోడౌన్లో ఉన్న అమ్మహస్తం సరుకులు నాణ్యతగా లేవని ఏడాది కాలంగా అక్కడే ఉంచారు. చింతపండు 47.690 టన్నులు...దీని విలువ దాదాపు రూ. 33,59,354, కారంపొడి 21.274 టన్నులు..దీని విలువ రూ. 20,64,428, పసుపు 5.474 క్వింటాళ్లు కాగా దీని విలువ రూ. 5,47,900 కలుపుకుంటే దాదాపు రూ. 60 లక్షల విలువైన సరుకులు గోడౌన్లో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి మందలించినా.... గోడౌన్లో ఉన్న సరుకుల విషయం బయటపడి పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత స్వయంగా జిల్లా అధికారులను మందలించినా మార్పు కనిపించడం లేదు. సరుకులను మిల్లర్లకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అయినా ఇంతవరకు పురోగతి కనిపించడం లేదు. గతంలో ఎండీ స్థాయి అధికారులకు తెలిపినా పట్టించుకో లేదని.. మా తప్పేమి లేదని..మాకేమి కాదంటూ కొంతమంది అధికారులు కార్యాలయంలోనే కూర్చొని లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఎండీ స్థాయి అధికారికి తెలిపినా ఎందుకు అలాగే గోడౌన్లోనే నిల్వ పెట్టించారన్న విషయం అర్థం కావడం లేదు. సరుకులో నాణ్యత లోపించిన సందర్భంలో మిల్లర్లకు విక్రయించడమో, లేకపోతే వెనక్కి తెప్పించుకోవడమో జరుగుతుందని... అలాగే గోడౌన్లో నిల్వ చేయడం వల్ల సరుకులు మరింత క్షీణించి నాణ్యత మరింత తగ్గుతుందని శాఖకు చెందిన సిబ్బందే చెప్పుకుంటున్నారు. అమ్మినా కొనుగోలు చేసేవారు కరువే చింతపండు, కారంపొడి, పసుపు గోడౌన్‌కు వచ్చి ఏడాదిన్నర దాటింది. ఇన్ని రోజులు గోడౌన్లో నిల్వ చేసిన సరుకులలో నాణ్యత ఎంతవరకు ఉంటుందన్నది ప్రశ్నార్థకం. పౌరసరఫరాలశాఖ అధికారులు విక్రయించేందుకు సిద్ధపడినా కొనుగోలు చేసేందుకు మిల్లర్లు రావడం అనుమానంగా మారింది. అధికారులు మాత్రం ఎవరో ఒకరు వస్తే ఎంతో కొంతకు అమ్మేస్తామని పేర్కొంటున్నా....కర్ణాటక, అనంతపురం ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యాపారులు చింతపండును కేవలం కిలో రూ. 16 చొప్పున సరుకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరు కూడా అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. జిల్లా మేనేజర్ ఏమంటున్నారంటే! ప్రస్తుతం గోడౌన్లో రూ. 50 లక్షలకు పైగా విలువ చేసే చింతపండు, కారంపొడి, పసుపు నిల్వలున్న ఉన్న మాట వాస్తవమే. నాణ్యత లేకపోవడంతో ఏడాది కాలంగా ఇక్కడే ఉంచాం. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. ఎవరైనా మిల్లర్లు ముందుకొస్తే విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాం. - బుల్లయ్య, జిల్లా మేనేజర్, పౌరసరఫరాలశాఖ,కడప నేడు ఎండీతో సమావేశం హైదరాబాదులోని సోమాజిగూడలో ఉన్న సివిల్ సప్లయ్ కార్యాలయంలో ఎండీ అనిల్‌కుమార్‌తో సోమవారం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులకు సమావేశం జరగనుంది.జిల్లాకు సంబంధించిన గోడౌన్లతోపాటు స్టాకు నిల్వల విషయం, ఇతర అనేక అంశాలపై ఎండీతో జిల్లా అధికారులు చర్చించనున్నట్లు తెలియవచ్చింది. -
అక్రమాల సరఫరా!
రేషన్ సరుకుల దోపిడీ సాక్షి, కర్నూలు : పేదల ఆకలి తీర్చాల్సిన సబ్సిడీ సరుకులు.. అక్రమార్కుల బొజ్జలు నింపుతున్నాయి. పేదల ఇళ్లకు చేరాల్సిన నిత్యావసర వస్తువులు.. బ్లాక్ మార్కెట్లో చిందులేస్తున్నాయి. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు, డీలర్లు కుమ్మక్కై సాగిస్తున్న అవినీతి పర్వంతో ఖజానా లూటీ అవుతోంది. పౌరసరఫరాల శాఖలో జరుగుతోన్న అవినీతిని చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే. బోగస్ తెలుపు రేషన్‌కార్డుల పేరుతో జిల్లాలో జరిగిన అవినీతి లెక్కలు చూసినవారెవరికైనా కళ్లు బైర్లు కమ్ముతాయి. ఇప్పటి వరకు 3 లక్షలకుపైగా రేషన్‌కార్డులు బోగస్ అని తేలాయి. ఈ కార్డులపైనే రూ. 171.81 కోట్లు దుర్వినియోగం అయ్యాయి. రేషన్‌కార్డులను అడ్డం పెట్టుకొని జరగకూడని అక్రమాలన్నీ జరిగాయి. జిల్లాలో పౌరసరఫరాల శాఖ పరిధిలో చూస్తే.. 11,34,551 రేషన్‌కార్డులు ఉన్నాయి. 2,409 చౌక డిపోల ద్వారా ఈ కార్డులపై నిత్యావసర సరుకుల పంపిణీ సాగుతోంది. ఇటీవల రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం పేరిట బోగస్ కార్డుల ఏరివేతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఇప్పటి వరకు 3,19,751 బోగస్ రేషన్‌కార్డులు బయటికొచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరగడం ఖాయం. ఇంకా బయటికొచ్చే బోగస్‌కార్డుల సంగతి అటుంచితే.. ఈ మూడు లక్షల రేషన్‌కార్డులపై జరిగిన అవినీతి కోట్ల రూపాయల్లో ఉంది. ఏడాది కాలంగా ‘అమ్మహస్తం’ పథకం అమలవుతోంది. తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఈ పథకం కింద పంపిణీ చేస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా.. కేవలం పేదల బియ్యం, చక్కెర, కిరోసిన్‌పై జరిగిన నిధుల దుర్వినియోగం అక్షరాల రూ. 171.81 కోట్లు కావడం గమనార్హం. నేతల ప్రమేయంతో.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. బోగస్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. అదే తరుణంలో కొత్తగా రేషన్ కార్డులను ఇవ్వడానికి దరఖాస్తులు సేకరిస్తారు. ఇదే తరుణంలో దళారులు రంగప్రవేశం చేసి తమ నేతల ద్వారా కార్డులను పొందడం పరిపాటే. గతంలో రూ. 24 వేల వరకు వార్షిక ఆదాయం ఉన్నవాళ్లకే తెల్లరేషన్ కార్డులను ఇచ్చే పరిస్థితులుండగా.. ఇప్పుడు రూ. 75 వేల వరకు పెంచారు. దీంతో పేద, గొప్ప తేడా లేకుండా ధనవంతులు, ఉద్యోగులు సైతం తెల్లరేషన్ కార్డులను పొందారు. ఖజానాపై రూ. కోట్ల భారం.. పేద ప్రజలకు కిలో బియ్యాన్ని రూపాయికి, కిలో చక్కెరను రూ. 13.50కు, లీటరు కిరోసిన్‌ను రూ. 15కు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అదే ప్రభుత్వం బియ్యాన్ని కిలోకి రూ. 21.69కు, చక్కెరను రూ. 21.50కు, కిరోసిన్‌ను రూ. 15కు కొనుగోలు చేస్తోంది. జిల్లాలో 3,19,751 బోగస్ రేషన్‌కార్డులపై ఏడాదికి 7,67,402 క్వింటాళ్ల బియ్యం(ఒక్కో కార్డుకు 20 కిలోల చొప్పున) పక్కదారి పట్టాయి. వాటి విలువ రూ. 158.77 కోట్లు కావడం గమనార్హం. అదే క్రమంలో 3,19,751 కార్డులపై నెలకు రెండు లీటర్ల చొప్పున 6,39,502 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేశారు. ఈ లెక్కన గడిచిన ఏడాదిలో 76,74,024 లీటర్ల కిరోసిన్ నల్లబజారుకు తరలిపోయింది. ఈ కిరోసిన్ విలువ రూ. 11.51 కోట్లు. ఇక ఇవే బోగస్ కార్డులపై నెలకు అర కిలో చొప్పున చక్కెర పంపిణీ చేశారు. నెలకు 1,59,875 కిలోల చొప్పున ఏడాదిలో 19,18,506 క్వింటాళ్ల చక్కెర పక్కదారి పట్టింది. దాని విలువ రూ. 1.53 కోట్లు కావడం గమనార్హం. కేవలం మూడు రకాల సబ్సిడీ సరుకులపైనే రూ. 171.81 కోట్ల అవినీతి జరిగింది. మార్కెట్ ధరలకు అనుగుణంగా లెక్క లేస్తే ఈ అవినీతి పర్వం రూ. 250 కోట్లు దాటుతుంది. పప్పు..తప్పు! సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎక్కడైనా.. ఏపనైనా ప్రభుత్వం తరఫున చేపడితే, వ్యయం లక్ష రూపాయలు దాటితే టెండరు వేయాలి. బహిరంగ టెండరు ద్వారా ఇవ్వాలి. అయితే కర్నూలు జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ కార్యాలయం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. టెండర్ లేకుండానే రూ.కోట్లు విలువ చేసే పప్పు దినుసులు సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు అప్పజెప్పింది. అంతే కాకుండా నాణ్యత లేని సరుకుకు మొదటి రకం క్వాలిటీ ధర చెల్లిస్తున్నారు. ఇదేమని అడిగితే పప్పు సరఫరా చేసే సంస్థ ప్రభుత్వానికి చెందిందని.. జీఓ ప్రకారం ఇస్తున్నామంటూ అధికారులు సమర్థించుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి కింద 3,476 అంగన్వాడీ కేంద్రాలు, 64 మినీ అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో 73,440 మంది పిల్లలు ఉన్నారు. వీరికి ప్రతి రోజూ ఒక్కొక్కరికి 15 గ్రాముల కందిపప్పు అవసరం. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు భోజనంలో కందిపప్పు అందించాలి. పిల్లలకు ఇచ్చే భోజనం కోసం బియ్యం ఒక చోట, నూనె మరో చోట, కందిపప్పు మరో చోట కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోళ్లు ఎక్కడైనా చేయవచ్చు కానీ.. నిత్యావసర సరకులు సరఫరా చేసేవారిని మాత్రం టెండరు ద్వారా నిర్ణయించుకోవాలి. అది కూడా రూ.లక్ష దాటితో ఖచ్చితంగా టెండరు వేయాలి. కానీ కర్నూలు స్త్రీ శిశు సంక్షేమశాఖ మాత్రం రూ.9 కోట్లు విలువ చేసే కందిపప్పును ఎటువంటి టెండరు లేకుండానే హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు కట్టబెట్టినట్లు అధికార వర్గాలు తెలిపారు. ఇవ్వటమే కాకుండా నాసిరకం కందిపప్పుకు మొదటి క్వాలిటీ ధరను చెల్లిస్తున్నట్లు వారు తెలియజేశారు. మూడో క్వాలిటీ రకం కందిపప్పు ధర మార్కెట్లో రూ.55 నుంచి రూ.60 మధ్యలో ఉంది. స్త్రీ శిశు సంక్షేమశాఖ మాత్రం రూ.69 చొప్పున ధర చెల్లిస్తుండటం గమనార్హం. ఇదేమని ఆ శాఖకు సంబంధించిన అధికారులను అడిగితే.. ఆ సంస్థ ప్రభుత్వానికి చెందినదేనని, నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతున్నారు. అయితే క్వాలిటీ, ధర విషయంలో మాత్రం సమాధానం దాటవేస్తున్నారు. జిల్లాలో పేరుకుపోయినా.. : జిల్లాలో విస్తారంగా కంది పంట సాగవుతోంది. ఏటా రైతులు వేలాది క్వింటాళ్ల దిగుబడులు సాధిస్తున్నారు. సరైన గిట్టుబాటు ధరలు లేక కంది పంట గోదాముల్లో మగ్గుతోంది. రైతులకు సగం ధర చెల్లించినా సంతోషంగా విక్రయించేవారు. అయితే అధికారులు అటువంటి ప్రయత్నాలేవీ చేయకుండా వేరే రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవటం తెలిసి జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ‘సరే’ అనుకోవచ్చు. విడిపోయి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్లుగా ఏర్పడ్డాయి. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కూడా హైదరాబాద్ నుంచి క్వాలిటీ లేని కందిపప్పును ఎందుకు తెప్పిస్తున్నట్లు? పాత సంస్థకే టెండర్ లేకుండా ఎందుకు ఇచ్చినట్లు? స్థానికంగా దాల్ మిల్లులు ఉన్నా వాటి విషయం పట్టించుకోకుండా సుమారు 200 కి.మీ దూరంలో ఉన్న హైదరాబాద్ నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నట్లు అర్థంకావడంలేదని, తెలంగాణ నుంచి కొనుగోలు చేయటంపై దాల్మిల్లు యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు ఆ సంస్థతో కుమ్మక్కై మామూళ్లకు తలొగ్గి ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో పండుతున్న కందిపప్పును కొనుగోలు చేస్తే రైతులకు.. ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. -
రైతు బజార్ల ద్వారా ఇక నిత్యావసరాలు
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని రైతు బజార్ల ద్వారా నిత్యావసర సరుకులను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో పా టు జిల్లాలోని ఇతర వ్యాపారులు కూడా సహకరించాలని జేసీ రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మి నీ కాన్ఫరెన్స హాల్లో శుక్రవారం సాయంత్రం జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన వినియోగదార్ల సంఘాల ప్ర తినిధులు, వర్తక సంఘాలను నిత్యావసరాలను త క్కువ ధరలకే విక్రయించేలా ఒప్పించారు. ప్రజలకు అందుబాటు ధరలకు నిత్యావసర సరుకులను అందించాలన్నారు. బియ్యంతో పాటు మంచినూనె, పంచదార, చింతపండు, పప్పులు తదితర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడానికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. పట్టణంలోని మూ డు రైతుబజార్లతో పాటు పార్వతీపురం రైతుబజార్లో కూడా శనివారం నుంచి అందుబాటు ధరల్లో నిత్యావసరాలు విక్రయించాలన్నారు. వర్తక సంఘాల ఒప్పం దం మేరకు కిలో రూ.70 నుంచి 80 రూపాయలు పలుకుతున్న కందిపప్పు కిలో 67 రూపాయలకు విక్రయిస్తామన్నారు.అదేవిధంగా *90 పలుకుతున్న మినపగుళ్లను కిలో *75కు సరఫరా చేస్తామన్నారు. పెసరపప్పును కిలో *86కు ఇస్తామన్నారు. ఈ ధరలు వ్యాపారులు రైతుబజార్లకు విక్రయించగా వాటిని వినియోగదారులకు మహిళా సంఘాలు 50 పైసల మార్జిన్‌తో విక్రయిస్తారన్నారు. అలాగే పామాయిల్‌ను కిలో *58 కు విక్రయిస్తారన్నారు. టమోటాను *26కు, సన్నబి య్యం *30లకు విక్రయిస్తున్నామనీ, వీటిని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామన్నారు. బంగాళాదుంపల ధర అధికంగా ఉన్నప్పటికీ రెండు రోజుల్లో తగ్గే అవకాశముండటంతో వాటిని మినహాయించారు. చింతపం డు జీసీసీ ద్వారా *25కు సరఫరా అవుతోందనీ, దాన్ని విక్రయించడానికి వర్తకులు ముందుకు వస్తే వారికి మార్జిన్ మనీ అందిస్తామన్నారు. అలాగే ఎక్కువ ధర ఉన్న ఎండుమిర్చిని భద్రాచలం నుంచి తెప్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను కూడా సబ్సిడీపై అందిస్తున్నట్టు జేసీ తెలిపారు. జిల్లాలో ప్ర స్తుతానికి ఎరువుల కొరతలేదన్నారు. మార్క్‌ఫెడ్, ఇతర డీలర్ల ద్వారా కూడా ఎరువులు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 5,300 టన్నుల యూరియా, 4వేల టన్నుల డీఏపీ, 1300 టన్నుల ఎంఓసీ, 2200 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వరి విత్తనాలు కిలోకి *5, వేరుశనగ విత్తనాలు కిలోకు *15, పెసర, మినుము, కంది, పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందిస్తామన్నారు. ధరల నియంత్రణకు సహకరించి రైతుబజార్లలో విక్రయాలకు అంగీకరించిన వర్తక సంఘాలకు జేసీ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ జే వెంకటరావు, వ్యవసాయ శాఖ జేడీ డి.ప్రమీల, డీఎస్ఓ హెచ్వీ ప్రసాద్, పౌరసరఫరాల సంస్థ డీఎం రమేష్‌రెడ్డి, చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు జి శివకుమార్, ఎంవీ చలం,పప్పులు, నూనెల వర్తక సంఘాల ప్రతినిధులు సంతోష్, కె.సతీష్, అనీష్, ఉల్లి వ్యాపార సంఘం ప్రతినిధి డి.రమేష్‌కుమార్, బియ్యం వర్తక సంఘ ప్రతినిధి పి.నాగేశ్వరరావు, ధరల నియంత్రణ కమిటీ సభ్యుడు జే.సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
నిత్యావసర వస్తువుల పూర్తి బాధ్యత డీటీలదే
చిత్తూరు(సెంట్రల్): జిల్లాలో నిత్యావసర వస్తువులకు సంబంధించి నిల్వ, నాణ్యత, వంద శాతం పంపిణీ బాధ్యత ఎంఎల్ఎస్ పాయింట్లల్లో పనిచేసే పౌరసరఫరాల డెప్యూటీ తహశీల్దార్లదేనని జిల్లా సంయుక్త కలెక్టర్ సీహెచ్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మండల స్థాయి స్టాక్‌పాయింట్ల (ఎంఎల్ఎస్) డీటీలు, మండల పౌరసరఫరాల శాఖ డీటీలతో సమీక్ష నిర్వహించారు. స్టాకు పాయిం ట్లకు సరుకులు వచ్చిన 10 రోజుల్లోపు డీలర్లకు సరఫరా చేయాలన్నారు. సరుకుల రవాణా, పరిమాణం, నాణ్యత విషయాల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. బియ్యం స్టాకు వచ్చినప్పుడు నాణ్యతను పరిశీలించాలని చెప్పారు. గోడౌన్లలో పనిచేసే హమాలీలు, ఇతర ఉద్యోగులు బీడీలు, సిగరెట్లు కాల్చరాదని గతంలోనే ఆదేశాలు జారీ చేశామని, దీన్ని పక్కాగా అమలుచేయాలని చెప్పారు. బోగస్‌కార్డులను తొందరగా ఏరివేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఆధార్ సీడింగ్ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. రంజాన్, శ్రావణమాసం, వినాయకచవితి పండుగలకు చక్కెరను కిలో రూ.33 వంతున ప్రత్యేక కౌంటర్ల ద్వారా కార్డుదారులు, ఇతర గుర్తింపుకార్డులు కలిగిన వారికి విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డీఎస్ఓ విజయరాణి, పౌరసరఫరాల శాఖ మేనేజర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
‘పస్తులే’ ప్రత్యామ్నాయం..!
శంకర్పల్లి: కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకుతోడు కరెంట్ కోతలతో కూరగాయల దిగుబడి ఒక్కసారిగా పడిపోయింది. దీంతో పది రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు రెట్టింపై సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. వీటికి తోడు బియ్యం ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దినసరి కూలీలు కనీసం కూరగాయల వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు అలుగడ్డ, ఉలిగడ్డ తదితర కూరగాయలను బ్లాక్ చేయడంతో ధరలు మరింత రెట్టింపవుతున్నాయి. పది రోజుల క్రితం పాలకూర, కొత్తిమీర మూడు కట్టలు ఉంటే ఇప్పుడు రూ. 10కి కూడా ఒక కట్ట దొరకని పరిస్థితి. దీంతో కొందరు పచ్చళ్లతో కాలం వెళ్లదీస్తుండగా మరికొందరు కారం మెతకులతోనే కాలం గడపాల్సిన పరిస్థితి. ఇక కొందరు కూలీలైతే ఈ ధరలకు తాము ఏమీ కొనలేమని, పస్తులుండటమే ప్రత్యామ్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘాటెక్కిన పచ్చి మిర్చి అన్ని కూరగాయల్లోకెల్లా పచ్చి మిర్చిధర అమాంతం పెరిగింది. 10 రోజుల క్రితం రూ.30 ఉన్న కిలో పచ్చిమిర్చి ధర ఇప్పుడు రూ.80కు అమ్ముతున్నారు. దీంతో మిర్చి కొనాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. రూ. 300 తీసుకెళితే కనీసం వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదని కొందరు వాపోతున్నారు. ధరలు మళ్లీ తగ్గే వరకు కూరగాయల జోలికి వెళ్లకపోవడమే మంచిదని వారు చెబుతున్నారు. -
అమ్మహస్తం ఆగింది!
అదనపు సరుకులకు చెక్ బియ్యం, చక్కెర, గోధుమపిండి, కిరోసిన్ మాత్రమే పంపిణీ డిమాండ్ లేనందునే సరఫరా నిలిచిందంటున్న అధికారులు అతి తక్కువ ధరకే నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు తలపెట్టిన అమ్మహస్తం పథకానికి సర్కారు మంగళం పాడింది. రోజువారీ అవసరాల్లో ప్రధానమైన తొమ్మిది రకాల సరుకులను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందించే సాధారణ సరుకులైన బియ్యం, కిరోసిన్, చక్కెరతో పాటు అదనంగా కారం, పసుపు, చింతపండు, పామాయిల్, గోధుమపిండి తదితర సరుకులను రూ.185కే అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం హంగు, ఆర్భాటాలతో ప్రవేశపెట్టిన ఈ పథకం కథ ప్రస్తుతం ముగిసింది. దీంతో అదనపు సరుకుల పంపిణీ పూర్తిగా నిలిచిపోవడంతో సాధారణ సరుకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. నాలుగు ‘కట్’.. జిల్లాలో 10.78లక్షల రేషన్ కార్డుదారులకు నెలవారీగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అమ్మహస్తం పథకంలో భాగంగా ఈ కార్డుదారులకు ప్రతినెల తొమ్మిది రకాల సరుకులు ఇస్తున్నారు. అయితే అమ్మహస్తం సరుకుల్లో నాణ్యత కొరవడడంతో కార్డుదారులు ఆదినుంచి కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. నాణ్యమైన సరుకులు అంది స్తున్నామంటూ అప్పటి నేతలు ప్రగల్భాలు పలికినప్పటికీ.. క్షేత్ర స్థాయిలో మాత్రం సరుకుల పట్ల తీవ్ర వ్యతి రేకత ఎదురైంది. ఫలితంగా రేషన్ డీలర్లు క్రమంగా ఈ స్టాకును పక్కనపెట్టారు. బాగా డిమాండ్ ఉన్న బియ్యం, కిరోసిన్, చక్కెర, ఆటా, పామాయిల్ సరుకులకు మాత్రమే డీడీలు క ట్టి స్టాకు తెప్పించుకోవడంతో అదనపు సరుకుల ప్రాధాన్యం క్రమంగా పడిపోయింది. నిల్వలు ముక్కిపోయి... అమ్మహస్తం పథకం కింద జిల్లాకు కేటాయించిన కారం, పసుపు, చింతపండు సరుకులకు డిమాండ్ లేకుండా పోయి ంది. ఈ నేపథ్యంలో ఈ స్టాకును రేషన్ డీలర్లు తీసుకోకపోవడంతో వాటిని పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లా గోదాముల్లో నిల్వ చేశారు. దీంతో క్రమంగా ఈ స్టాకు గోదాముల్లో ముక్కిపోయి పాడవడంతో భారీ నష్టమే సంభవించింది. దాదాపు 2లక్షల కారంపొడి ప్యాకెట్లు పాడైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అదనపు సరుకుల సంగతి పక్కనబెట్టి సాధారణ సరుకులైన బియ్యం, చక్కెర, కిరోసిన్, గోధుమలు, పిండి మాత్రం పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు 17వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 7వందల మెట్రిక్ టన్నుల గోధుమలు, గోధుమపిండి, 550 మెట్రిక్ టన్నుల చక్కెర కోటాను ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరవేశారు. పామాయిల్ ‘నిల్’.. రేషన్ కార్డుదారులకు కిలో చొప్పున అందించే పామాయిల్‌కు కొరత ఏర్పడింది. పామాయిల్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా నిల్చిపోయింది. జిల్లాలో నెలకు 1,078 మెట్రిక్ టన్నుల పామాయిల్ స్టాకు అవసరం. అయితే ఏప్రిల్ నెలతోనే పామాయిల్ సరఫరాకు కాలం చెల్లడంతో కార్డుదారులకు అందలేదు. ఏప్రిల్ నెలలో అందుబాటులో ఉన్న స్టాకు పంపిణీ చేయగా.. ఆ తర్వాత ఎన్నికల తంతు మొదలు కావడంతో పామాయిల్ కథకు తెరపడింది. తాజాగా ఈ నెలలో కూడా పామాయిల్ పంపిణీ నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై పామాయిల్ సరఫరా ఆధారపడి ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. -
నిలువు దోపిడీ
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : మామిడి తోటలకు నిలయమైన జిల్లాలో మార్కెట్ సౌకర్యం కరువైంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు, దళారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొద్దో గోప్పో పంట చేతికందినా గిట్టుబాటు ధర లభించడం లేదు. జిల్లాలోని 23వేల హెక్టార్ల లో రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. వీటిలో 18 వేల హెక్టార్లలో కాపు వచ్చే మామిడితోటలు ఉండగా.. ఐదు వేల హెక్టార్లలో ఐదేళ్ల వయసు గల తోటలు ఉన్నాయి. ప్రకృతి అనుకూలిస్తే ఎకరాకు ఏడు టన్నుల చొప్పున మామిడి కాయ దిగుబడి వస్తుంది. కానీ అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల ఏటా పూత, పిందె రాలిపోయి తోటలకు నష్టం వాటిల్లుతోంది. దీంతో కాయ దిగుబడి హెక్టారుకు సగటున 3 టన్నులకు మించి రావడం లేదు. ఈసారీ మామిడి రైతులను ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీశాయి. మామిడి చెట్లకు పూత విరగబూసి పిందె దశకు చేరే క్రమంలో అకాల వర్షాలతో పిందెలు సగానికి పైగా రాలిపోయింది. కొద్దో గొప్పో మిగిలిన పంటను అమ్ముకుందామనుకున్న రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్కెట్ సౌకర్యం లేక.. మామిడి తోటలకు నిలయమైన జిల్లాలో మార్కెట్ సౌకర్యం లేదు. మంచిర్యాల కేంద్రంగా మార్కెట్ ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలు బుట్ట దాఖలయ్యాయి. రెండేళ్ల నుంచి ఆ ప్రతిపాదనలు మరుగున పడిపోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. దీంతో రైతులు మామిడి కాయలను మాహారాష్ట్రలోని నాగ్‌పూర్, నాందేడ్ మార్కెట్లకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని వ్యాపారులు, దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. మామిడికాయలను తీసుకెళ్లే క్రమంలో ధర ఆకాశంలో ఉన్నట్లు నమ్మబలికి.. తీరా తీసుకెళ్లాక ఒక్కసారిగా ధర దించి రైతులను వంచనకు గురి చేస్తున్నారు. వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా మారి దోచుకుంటున్నారు. మామిడికాయలు, పండ్లను వేలం పాడి విక్రయించి ఇచ్చినందుకు రూ.లక్షకు రూ.10వేల చొప్పున దళారులు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. మరోవైపు టన్నుకు 50 కిలోల తరుగు తీస్తున్నారు. రైతులు ఎదురుతిరిగితే కొనుగోలు చేయడం లేదు. తడిసి మోపెడవుతున్న చార్జీలు మార్కెట్ సౌకర్యం అందుబాటులో లేక మామిడి రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కాయలను చెట్లపై నుంచి తెంపడం నుంచే ఇబ్బందులు మొదలవుతాయి. గతంలో రోజువారీ కూలీకి వచ్చే కూలీలు ప్రస్తుతం టన్ను లెక్కన డబ్బులు తీసుకుంటున్నారు. ఆరు టన్నుల కాయలు కోస్తే రూ.10వేలు కూలిగా ఇవ్వాల్సి వస్తోంది. కాయలు తెంపిన తర్వాత మార్కెట్‌కు తరలించడానికి రవాణా చార్జీ అదనపు భారమవుతోంది. బెల్లంపల్లి ప్రాంతం నుంచి నాగ్‌పూర్‌కు మామిడికాయలు తరలిస్తే డీసీఎం వ్యాన్‌కు రూ.18వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. నెన్నెల, జైపూర్, భీమారం తదితర ప్రాంతాల నుంచి తరలిస్తే రూ.22వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో రవాణా భారం రైతులకు తడిసి మోపెడవుతోంది. మద్దతు ధర కరువు.. రోజు రోజుకు మార్కెట్లో నిత్యావసర వస్తువులు, పండ్ల ధరలు ఆకాశాన్నంటుతుండగా.. మామిడి కాయలు పండించే రైతులకు మాత్రం మద్దతు ధర కరువవుతోంది. ఏయేటికాయేడు గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్నారు. ఈయేడు తొలుత బంగినపల్లి మామిడి పండ్లకు టన్నుకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, దశేరికి రూ.35 వేల నుంచి రూ.40 వేలు మద్దతు ధర చెల్లించి రైతులను వ్యాపారులు ఊరించారు. మద్దతు ధర లభిస్తోందని ఆశపడిన రైతులు ఒక్కసారిగా మామిడికాయలు, పండ్లను మార్కెట్లో ముంచెత్తగా ఆకాశంలో ఉన్న ధరను పాతాళానికి దించారు. ప్రస్తుతం బంగెనపల్లి మామిడికాయలు టన్నుకు రూ.13 వేల నుంచి రూ.16 వేల వరకు, దశేరి టన్నుకు రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకు ధర పలుకుతోంది. ఇతర రసాల పండ్లను టన్నుకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న మద్దతు ధర కూలీల ఖర్చు, ట్రాన్స్‌పోర్టు చార్జీలు, రైతుల శ్రమను తీసివేస్తే ఏ మాత్రం గిట్టుబాటు కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. చేయూత కరువు.. మామిడి రైతులకు మార్కెట్ సదుపాయం కల్పించి కష్టాలు తొలగించడంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలకులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ ఒక్కనాడూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మార్కెట్ సౌకర్యం కోసం చేసిన ప్రతిపాదనలను ఇప్పటికైనా కార్యారూపం దాల్చేలా చర్యలు తీసుకుని మద్దతు ధర దక్కేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
పామా..యిల్లే
నిలిచిపోయిన సరఫరా ప్రజా పంపిణీ అస్తవ్యస్తం నెలకో నిత్యావసర వస్తువుకు మంగళం తెల్లకార్డుదారుల అవస్థలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తెల్లరేషన్ కార్డుదారులకు చుక్కలు చూపిస్తోంది. ఏ వస్తువు ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తరువాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోను.. ప్రస్తుత రాష్ట్రపతి పాలనలోనూ దీనిని పట్టించుకున్న నాథులే లేకుండా పోయారు. నెలాకో నిత్యావసర వస్తువు సరఫరా నిలిచిపో తోంది. తాజాగా పామాయిల్ సరఫరా ఆగిపోయింది. బహిరంగ మార్కెట్లో అధిక ధరకు వంటనూనెను కొనుగోలు చేయలేక కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో దాదాపుగా 12.5 లక్షల మంది తెల్లరేషన్‌కార్డుదారులు ఉన్నారు. వైఎస్ హయాంలో ప్రతినెలా నిత్యావసర సరుకులు సక్రమంగా సరఫరా అయ్యేవి. ఆయన మరణానంతరం ఈ పంపిణీ వ్యవస్థను రాజకీయ లబ్ధికి వినియోగించుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా అమ్మహస్తం పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.185కే తొమ్మిది సరుకులంటూ ఊదరగొట్టింది. గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఒక్క నెల కూడా సక్రమంగా నిత్యావసర వస్తువులను కార్డుదారులకు అందించ లేదు. ప్రతి నెలా జిల్లాకు కేటాయింపులు తగ్గిస్తూ వచ్చింది. ఇప్పటికే కారం, పసుపు, చింతపండు కేటాయింపులను నిలిపి వేసింది. సరఫరా చేసే వస్తువుల్లో కూడా నాణ్యత లోపించడంతో కార్డుదారులు కొన్ని సరుకులపై అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉప్పు, గోధుమ పిండి అధ్వానంగా ఉండడంతో వాటిపై ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. ఒక్కోసారి కందిపప్పు కూడా బాగోవడం లేదని కార్డుదారులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా జిల్లాకు నెల నెలా కేటాయింపులు తగ్గిపోతూ వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇప్పటివరకు చౌక దుకాణాల ద్వారా కార్డుదారులు బియ్యం, పామాయిల్లనే అధికంగా తీసుకుంటున్నారు. తాజాగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. సాధారణంగా పామాయిల్‌ను మలేషియా నుంచి ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంది. ఒక షిప్ పామ్క్రూడ్కు సుమారు రూ. 80 కోట్లు ఖర్చు చేస్తోంది. మలేషియా నుంచి ఆ షిప్ కాకినాడకు వస్తుంది. అక్కడ రిఫైన్ చేసిన తరువాత ప్యాకింగ్‌లు చేసి జిల్లాలకు సరఫరా చేస్తుంది. గత నెలలో పామాయిల్‌ను కొనుగోలు చేసే విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా చౌక దుకాణాల్లో రూ.40జుజ లభించే ఈ వంటనూనెను కార్డుదారులు బహిరంగ మార్కెట్లో రూ.70 వరకు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేద, బలహీనవర్గాల వారు అంత ధరకు నూనెను కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. వచ్చే నెలలో కూడా పామాయిల్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీనిపై అధికారుల వద్ద ఎటువంటి సమాచారం లేదు. ఎలా బతకగలం రేషన్ డిపోలో ఆరునెలలుగా నూనె ఇవ్వడంలేదు. రూ. 40లకు ఇచ్చే దానిని బయట మార్కెట్లో రూ.70 లకు కొనుగోలు చేస్తున్నాం. అంచెలంచెలుగా సరుకులన్నీ ఇలాగే ఇవ్వడం మానేస్తే మాలాంటి పేదోళ్ళం ఎలా బతకగలం. ప్రభుత్వం రేషన్ గురించి పట్టించుకోవడంలేదు. - అట్ట ఈశ్వరమ్మ, ఖాజీపాలెం ఎప్పుడేమిస్తారో తెలియదు రేషన్‌డిపోలో ఏ నెలలో ఎన్ని సరుకులు ఇస్తారో తెలి యడంలేదు. నూనె ఇవ్వడం మానేశారు. బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అధికారులు ఇవ్వడంలేదో డీలర్లు అమ్మేసుకుంటున్నారో అర్థం కాలేదు. పలానా సరుకులు ఇస్తామని అధికారుల చెప్పడంలేదు. డీలర్ల ఇష్టారాజ్యమైపోతోంది. - సీరపు లక్ష్మి, మార్టూరు -
అగ్నిప్రమాదంలో గుడిసె దగ్ధం
బోర్లం(బాన్సువాడరూరల్), న్యూస్‌లైన్ : బోర్లంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన సందుల పోశయ్య గుడిసె దగ్ధమైంది. పోశయ్య కుటుంబ సభ్యులు రాత్రి వేళ గుడిసె పక్కన ఉన్న ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే బాన్నువాడలోని ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే గుడిసెలోని కలప, వంట సామగ్రి, దుస్తులు, నిత్యావసర వస్తువులు, ఎరువులు కాలిబూడిదయ్యాయి. తామంటే గిట్టనివారు గుడిసెకు నిప్పంటించి ఉంటారని బాధితులు ఆరోపించారు. వీఆర్ఓ సంజీవ్ సంఘటన స్థలాన్ని సందర్శించి ఆస్తినష్టాన్ని అంచనా వేశారు. రూ. 60 వేల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. పసుపు కుప్ప దగ్ధం రెంజర్ల(బాల్కొండ): రెంజర్ల గ్రామంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. బుల్లె రాంరెడ్డికి చెందిన పసుపు కుప్ప కాలిపోయింది. వివరాలిలా ఉన్నాయి. రాంరెడ్డి పసుపును ఉడికించడానికి కళ్లం వద్ద కుప్పగా పోశారు. పక్కన మరో రైతు పసుపును ఉడికిస్తుండగా నిప్పు రవ్వలు వచ్చి రాంరెడ్డికి చెందిన పంటపై పడ్డాయి. దీంతో మంటలు వ్యాపించాయి. రైతులు దీనిని గమనించి మంటలను ఆర్పడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. 5 ట్రాక్టర్ల పసుపు కొమ్ము కాలిపోయిందని, సుమారు లక్షన్నర రూపాయాల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. -
రేషన్ సరుకులు పక్కదారి పట్టొద్దు
వికారాబాద్, న్యూస్‌లైన్ : చౌక ధరల దుకాణాల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందేలా అధికారులు తనిఖీలను ముమ్మరం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వెంకట్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, పౌరసరఫరాలు, ఎన్నికలు తదితర అంశాలపై డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రేషన్ డీలర్లు సరుకులను బ్లాక్‌మార్కెట్ తరలిస్తున్నారన్న ఫిర్యాదులు తరచూ తన దృష్టికి వస్తున్నాయని, అధికారులు ఎప్పటికప్పుడు దుకాణాలను తనిఖీ చేస్తూ సరుకులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిత్యావసర సరుకులు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. కొందరు డీలర్లు బియ్యం, పంచదార, పామాయిల్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని, సంబంధిత అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టాలని సూచించారు. స్టాక్ పాయింట్లో అక్రమాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తనిఖీలకు అధికారులు ఉపక్రమించకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వస్తుందని, తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని జేసీ హెచ్చరించారు. వికారాబాద్‌లో వంట గ్యాస్ కనెక్షన్ల మంజూరు, సిలిండర్ల సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డీలర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలకు సిద్ధం కండి.. త్వరలో ఎన్నికలు జరుగనున్నందున అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేసి అధికారులు సిద్ధంగా ఉండాలని జేసీ సూచించారు. ఓటరు జాబితాలు సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, అవసరమైన సిబ్బంది నియామకంపై దృష్టి సారించాలన్నారు. వికారాబాద్‌లో సబ్ కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల కొత్త భవనాల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సబ్‌కలెక్టర్ ఆమ్రపాలిని జేసీ ఆదేశించారు. అల్ట్రా మోడల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి 30 ఎకరాలు.. వికారాబాద్ మండలం కామారెడ్డిగూడలో ఆర్టీసీ ఏర్పాటు చేయదలచిన అల్ట్రా మోడల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి 30ఎకరాల ప్రభుత్వ భూమిని త్వరలోనే అందజేయనున్నట్టు జేసీ ఎంవీరెడ్డి తెలిపారు. ఈ భూమిలో కొందరు ప్రైవేట్ పట్టాదారులకు 4.35 ఎకరాలు ఉన్నందున వారికి పరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోనున్నట్టు వివరించారు. సమీక్ష సమావేశంలో సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, డీఎస్వో నర్సింహారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ అరుణకుమారి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ప్రభుదాస్, భూ సర్వే అసిస్టెంట్ డెరైక్టర్ అనంతరెడ్డి, తహసీల్దార్లు గౌతంకుమార్, రాములు, డిప్యూటీ తహసీల్దార్ అమరలింగం గౌడ్, ఆర్ఐలు పాల్గొన్నారు. -
రేషన్ షాపుల్లో కాంగ్రెస్ మార్కు రాజకీయం
సాక్షి, బెంగళూరు : ప్రజలకు చౌకధరల్లో నిత్యావసర వస్తువులను సరఫరా చేసే రేషన్ షాపుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతోందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కాగేరి తీవ్ర విమర్శలు చేశారు. విధానసౌధలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చౌకధరల దుకాణాల పనితీరు, లబ్ధిదారుల ఎంపిక స్థానిక సంస్థలు పర్యవేక్షించేవన్నారు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌షాపుల పర్యవేక్షణకు ‘జాగృతి సమితి’లను ఏర్పాటు చేసి అందులోని సభ్యుల ఎంపిక జిల్లా ఇన్ఛార్జ్మంత్రులకు అప్పగించిందన్నారు. జిల్లా ఇన్ఛార్జ్మంత్రులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే ఉంటారని అందువల్ల ‘జాగృతి సమితి’ సభ్యుల్లో గరిష్టంగా కాంగ్రెస్ కార్యకర్తలకే స్థానం దక్కుతుందన్నారు. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది కాంగ్రెస్ వ్యూహమన్నారు. అదేవిధంగా ‘కళాశాల అభివృద్ధి సమితి’ సభ్యుల ఎంపిక కూడా జిల్లా ఇన్ఛార్జ్మంత్రుల సిఫార్సుల మేరకు జరగాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజాస్వామ్య మూలసూత్రాలైన అధికారిక వికేంద్రీకరణ, స్థానిక సంస్థలకే నిర్ణాయాధికారాలు అనే విషయాలు వ ురుగున పడిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి కిమ్మన రత్నాకర్‌తో పాటు అధికారుల నిర్లక్ష్యం వల్ల పాఠశాలల భవనాల మౌలిక సదుపాయాలు, విద్యాప్రమాణాల పెంపునకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,000 కోట్లకు గండిపడిందన్నారు. దీనివల్లే బోధన పరికరాల తయారీ కోసం ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రూ.500లకు కూడా ప్రభుత్వం కోత విధించిందన్నారు. ఎటువ ంటి ముందస్తు ఆలోచనలు లేకుండానే క్షీరభాగ్య, అక్షర దాసోహ పథకంలో ఒకరోజు గోధుమ సంబంధ పదార్థాలను విద్యార్థులకు ఇవ్వడం ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. పాలు కాచడానికికాని, గోధుమ పిండి, రవ్వ చేసి వాటి ద్వారా పదార్థాలు తయారు చేయడానికి కాని అవసరమైన పరికరాలు పాఠశాలకు అందించలేదన్నారు. దీని వల్ల లక్ష్యం నేరవేరడం లేదని కాగేరి వాపోయారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి వెంటనే సమీక్ష సమావేశం జరపాలని కాగేరి డివ ూండ్ చేశారు. -
ప‘రేషన్’
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారులతో ఆడుకుంటోంది. పేరుకు రేషన్‌కార్డులు ఇచ్చినా వాటికి సకాలంలో నిత్యావసర సరుకులు సరఫరా చేయడం లేదు. ఒకవేళ సరఫరా చేసినా ఎక్కువ మంది డీలర్లు వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. డీలర్లు నిర్ణీత వేళలు పాటించాలని ఆదేశాలున్నా..ఎక్కడా అమలు కావడం లేదు. దుకాణాల ముందు బోర్డులతో పాటు ధరల పట్టికలు విధిగా ఏర్పాటు చేయాలన్న నిబంధనలూ తుంగలో తొక్కారు. కొన్ని సమయాల్లో దుకాణాలకు తక్కువ సరుకులు కేటాయించినప్పుడు ఆ డీలర్ల పంట పండుతోంది. సరుకులు తక్కువగా విడుదల చేశారని చెప్పి కొంత వరకు సరఫరా చేసి మిగతావి పక్కదారి పట్టిస్తున్నారు. కిలో రూపాయి బియ్యం గురించి చెప్పనవసరం లేదు. ప్రభుత్వం సరఫరా చేసే ఈ బియ్యం నాసిరకంగా ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. ఆ బియ్యాన్ని ఆహారంగా వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువ. దీనిని కూడా కొంతమంది డీలర్లు చక్కగా సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలించి నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 2107 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి పరిధిలో 8 లక్షల 563 తెల్లకార్డులు, 52 వేల 152 అంత్యోదయ అన్నయోజన కార్డులు, 1032 అన్నపూర్ణ కార్డులు, 56 వేల 946 రచ్చబండ-3 కార్డులు ఉన్నాయి. 9 లక్షల 10 వేల 693 కార్డులకు 10089.343 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం, 1825.355 మెట్రిక్ టన్నుల అన్నపూర్ణ అంత్యోదయ యోజన కింద బియ్యం, 10.340 మెట్రిక్ టన్నులు అన్నపూర్ణ కార్డులకు సంబంధించి బియ్యం కేటాయింపులు జరుగుతుంటాయి. గత ఏడాది మార్చి వరకు పంచదార 426.329 టన్నులు, గోధుమలు 60 వేల టన్నులు, పామాయిల్ నూనె 8 లక్షల 53 వేల 52 లీటర్ల మేర విడుదల చేశారు. ఏప్రిల్ నుంచి అమ్మహస్తం పథకాన్ని అమలు చేయడంతో తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను *185కు విక్రయించేలా రూపకల్పన చేశారు. అయితే అమ్మహస్తంలో అందించే సరుకుల్లో నాణ్యత లోపించడంతో ఎక్కువ మంది రెండు మూడు సరుకులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగిలిన ఆరు వస్తువులను తీసుకునేందుకు వెనుకాడటంతో డీలర్లు కూడా వాటికి సంబంధించి డీడీలు కట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అధికారులు మాత్రం అమ్మహస్తంకు సంబంధించిన అన్నిరకాల వస్తువులకు డీడీలు కట్టాలంటూ ఒత్తిడి చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న చౌకధరల దుకాణాలపై శుక్రవారం నిర్వహించిన ‘సమరసాక్షి’ లో కార్డుదారుల కష్టాలు వెలుగు చూశాయి. బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులు ఒకేసారి సరఫరా చేయాల్సి ఉండగా, గోడౌన్ల నుంచి సకాలంలో రాకపోవడంతో ఒకేసారి ఇవ్వడం లేదు. ఒంగోలులో వేళలు లేవు... ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని చౌకధరల దుకాణాల డీలర్లు వేళలు పాటించడం లేదు. ప్రస్తుతం దుకాణాలకు బియ్యం సరఫరా చేసినప్పటికీ, అమ్మహస్తం సరుకులు రాకపోవడంతో బియ్యం నిల్వలు అలాగే ఉంటున్నాయి. ఒంగోలు నగరంతోపాటు ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కందుకూరు బియ్యం నెల్లూరుకు... కందుకూరు నియోజకవర్గ పరిధిలోని రేషన్ బియ్యం యథేచ్ఛగా నెల్లూరు తరలుతోంది. ఇటీవల కాలంలో గుడ్లూరు వద్ద రెండుసార్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ బియ్యాన్ని పట్టుకున్నారు. అయితే ఎక్కువ భాగం నెల్లూరుకు వెళుతోంది. అక్కడ నుంచి రీ సైక్లింగ్ చేసి ఆ బియ్యాన్నే బయట మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. అమ్మహస్తం సరుకులకు కొరత ఉండటంతో డీడీలు తీసేందుకు డీలర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. సంతనూతలపాడులో బినామీలే ఎక్కువ.. సంతనూతలపాడు నియోజకవర్గంలో బినామీ డీలర్లే ఎక్కువగాా ఉన్నారు. ఒకే వ్యక్తి మూడు నాలుగు దుకాణాలు నిర్వహిస్తుండటంతో వేళలు పాటించడం లేదు. నిత్యావసర సరుకుల కోసం కార్డులు తీసుకొని అక్కడకు వెళితే తాళాలు వేసే ఉంటాయి. పెపైచ్చు కొన్ని దుకాణాలు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో కొంతమంది పనులు మానుకొని నిత్యావసర సరుకులు తెచ్చుకోవలసిన దుస్థితి నెలకొంది. కొండపిలో బియ్యం దొడ్డిదారిన... కొండపి నియోజకవర్గంలో బియ్యం దొడ్డిదారిన వెళుతోంది. వాటి గురించి సమాచారం అందినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు మొక్కుబడి దాడులు కూడా చేయడం లేదు. బియ్యం నిల్వలున్నా స్టాక్ తక్కువగా వచ్చిందన్న సాకును చూపించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. సమయ పాలనకు ఎక్కువ మంది డీలర్లు తిలోదకాలిస్తున్నారు. యర్రగొండపాలెంలో మూడురోజులు దాటితే ఒట్టు.. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని చౌకధరల దుకాణాలు మూడురోజులకు మించి తెరవడం లేదు. బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులు పూర్తి స్థాయిలో వచ్చినా ఎక్కువ మంది డీలర్లు మూడు రోజులే గడువుగా పెట్టుకుంటున్నారు. మూడు రోజులు దాటిన తరువాత ఎవరైనా కార్డుదారులు వెళితే నో స్టాక్ అని బోర్డులు పెట్టేస్తున్నారు. ఇదేమని అడిగితే తమకు తక్కువ కేటాయింపులు వచ్చాయని తాపీగా సమాధానం చెబుతున్నారు. అద్దంకిలో అమ్మహస్తం లేదు అద్దంకి నియోజకవర్గంలో అమ్మహస్తం సరుకుల్లో కీలకమైనవి రెండు నెలల నుంచి లేవు. చింతపండు, కారం, గోధుమలకు డిమాండ్ ఉన్నప్పటికీ వాటిని అందుబాటులో ఉంచలేదు. చింతపండులో నాణ్యత లేకపోవడంతో ఎక్కువ మంది దానిని పడవేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కూడా బియ్యం పక్కదారి పడుతోంది. దర్శిలో దయనీయం... దర్శి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో బియ్యం, అమ్మహస్తం సరుకులు వచ్చినప్పటికీ ఎక్కువ మంది డీలర్లు వాటిని కార్డుదారులకు అందించడం లేదు. పెపైచ్చు కొంతమంది డీలర్లు స్టాక్ రాలేదంటూ చెబుతున్నారు. దాంతో వాటి పరిధిలోని కార్డుదారులు దుకాణాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. నియోజకవర్గ పరిధిలో ఇన్చార్జి డీలర్లు ఎక్కువగా ఉండటంతో కొన్నింటికి వేసిన తలుపులు వేసినట్లే ఉంటున్నాయి. పర్చూరులో పట్టుతప్పిన కేంద్రాలు పర్చూరు నియోజకవర్గంలో చౌకధరల దుకాణాలు పట్టు తప్పుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో దుకాణదారులు కార్డుదారులకు అందుబాటులో ఉండటం లేదు. దాంతో నిత్యావసర సరుకుల కోసం దుకాణాల చుట్టూ కార్డుదారులు తిరుగుతూ ఉన్నారు. స్టాక్ వివరాలను నోటీసు బోర్డులో ఉంచడం లేదు. దాంతో కొంతమంది దుకాణాలకు రావడమే మానేశారు. ఇది అనేక మంది డీలర్లకు వరంగా మారింది. కార్డుదారులు రాకపోయినా వచ్చినట్లు చూపించి దానిని సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్‌కు చీరాల బియ్యం.. చీరాల నియోజకవర్గంలో చౌకధరల దుకాణాలకు సంబంధించిన బియ్యం టూ వీలర్ల ద్వారా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. గతంలో ట్రాక్టర్లు, ఆ తరువాత ఆటోల్లో వాటిని తరలిస్తూ ఉండేవారు. అడపా దడపా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి వాటిని పట్టుకున్నారు. దీంతో అక్రమార్కులు బియ్యం తరలించేందుకు టూ వీలర్లను ఎన్నుకొన్నారు. ఇక్కడ నుంచి గుంటూరు జిల్లా కర్లపాలెంకు బియ్యం తరలిపోతున్నాయనేది బహిరంగ రహస్యమే. మార్కాపురంలో వెతుకులాటే.. మార్కాపురంలో నిత్యావసర సరుకులు బ్లాక్‌ల వారీగా విక్రయించాల్సి ఉంటుంది. ఒక్కో నెల ఒక్కో బ్లాక్‌లో డీలర్లు విక్రయిస్తుండటంతో వాటిని కనుగొనడం కార్డుదారులకు కష్టంగా మారుతోంది. ఇదేమని అడిగితే వారి నుంచి సమాధానం ఉండటం లేదు. గిద్దలూరులో అధిక ధరలు గిద్దలూరు నియోజకవర్గంలో నిత్యావసర సరుకులను కొంతమంది డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇదేమని అడిగితే తామింతేనంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. గిద్దలూరు పట్టణంలోని కొన్ని దుకాణాల్లో పంచదార కేజీ *14కు విక్రయించాల్సి ఉండగా అదనంగా రెండు రూపాయలు వసూలు చేస్తున్నారు. పంచదారకు డిమాం డ్ ఎక్కువగా ఉండటంతో కార్డుదారులు వారు చెప్పిన ధరకు కొనుగోలు చేస్తూ నష్టపోతున్నారు. కనిగిరిలో నెలల తరబడి ఎదురుచూపులే.. కనిగిరి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో కార్డుదారులు నిత్యావసర సరుకుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. అమ్మహస్తం పథకానికి సంబంధించి చింతపండు, గోధుమలు, ఉప్పు నాలుగు నెలల నుంచి అందడం లేదు. పామాయిల్ రెండు నెలల నుంచి అందించడం లేదు. దుకాణదారులు సమయపాలన పాటించకపోవడంతో ఎక్కువ మంది కార్డుదారులు వాటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
నో స్టాక్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: చౌకధరల దుకాణాల్లో నిత్యావసర సరుకులకు కొరత వచ్చింది. బియ్యం మినహా మిగతా వాటికోసం కార్డుదారులు దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం సరుకులకూ కోత పడింది. డీలర్లు డీడీలు చెల్లించినప్పటికీ వారికి నిత్యావసర సరుకులు సకాలంలో చేరడం లేదు. కొన్నిరకాల సరుకులు విడుదల కాకపోవడంతో దుకాణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్‌కార్డు తీసుకొని వచ్చేవారికి సమాధానాలు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. పెపైచ్చు డిమాండ్ ఉన్న వస్తువులకు నో స్టాక్ కోత విధించడం, డిమాండ్ లేనివాటిని ఇబ్బడి ముబ్బడిగా దించుతుండటంతో వాటిని ఏం చేయాలో తెలియక డీలర్లు తెల్లమొహం వేస్తున్నారు. జిల్లాలో 2108 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి పరిధిలో 8,53,866 రేషన్ కార్డులున్నాయి. అమ్మహస్తం పథకానికి ముందు బియ్యం, పామాయిల్, చక్కెర, గోధుమలు అందించేవారు. అమ్మహస్తం పేరుతో బియ్యం పక్కనపెట్టి తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వడం ప్రారంభించారు. 185 రూపాయలకే కందిపప్పు, పంచదార, నూనె, ఉప్పు, గోధుమలు, గోధుమపిండి, చింతపండు, పసుపు, కారం ప్రతినెలా అందిస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే ఆ సరుకుల్లో నాణ్యత లేకపోవడంతో పాటు వచ్చిన సరుకుల్లో కోత పడుతోంది. అమ్మహస్తంలో డిమాండ్ ఉన్న సరుకులను తగ్గించి ఇస్తున్నారు. కందిపప్పు, పామాయిల్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. నవంబర్ కోటాలో ఈ రెండింటికీ కోత పడింది. జిల్లాకు పూర్తి స్థాయి కోటా విడుదల కాకపోవడంతో కొన్ని ప్రాంతాలకే వాటిని పరిమితం చేశారు. దాంతో ఎక్కువ మంది కందిపప్పు, పామాయిల్ అడుగుతున్నారు. కారం, పసుపు, ఉప్పు వంటివి లోడ్ చేస్తుండటంపై చౌకధరల దుకాణదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా డీడీలు కట్టించుకున్నా.. జిల్లాలోని చౌకధరల డీలర్ల నుంచి నిత్యావసర వస్తువులకు సంబంధించి ఒక నెల ముందుగానే 16 నుంచి 20వ తేదీలోపు డీడీలు కట్టించుకుంటారు. 20 నుంచి నెలాఖరు వరకు నిత్యావసర సరుకులను చౌకధరల దుకాణాలకు చేర్చాల్సి ఉంటుంది. 1 నుంచి 16వ తేదీ వరకు కార్డుదారులకు సరుకులు అందిస్తారు. రేషన్ షాపుల పరిధిలోని కార్డుల సంఖ్యను బట్టి డీడీలు కట్టినప్పటికీ అందుకు అనుగుణంగా సరుకులు విడుదల చేయడం లేదు. ప్రతినెలా ఏదో ఒక వస్తువుకు కొరత వస్తూనే ఉందని డీలర్లు వాపోతున్నారు. ఈ విషయాన్ని కార్డుదారులకు చెబితే సరుకులు ఉంచుకొని కూడా లేవని చెబుతున్నారని తమను నిలదీస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని అధికారులతో చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. డీడీలు ముందస్తు ‘క్యాష్’... ఒక నెలకు ముందుగానే చౌకధరల దుకాణ దారులు నిత్యావసర సరుకుల కోసం డీడీలు చెల్లిస్తారు. సరుకులు చేరిన తరువాత ఆ డీడీలను క్యాష్ చేసుకోవాలి. జిల్లాలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. చౌకధరల దుకాణాలకు సరుకులు రాకపోయినప్పటికీ డీడీలను మాత్రం క్యాష్ చేసుకుంటున్నారు. దీనివల్ల దుకాణదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. సరుకు ఆలస్యమైతే ఆ డీడీలను మరో దానికి ఉపయోగించుకునేందుకు వీలులేకుండా క్యాష్ చేసుకోవడాన్ని దుకాణ దారులు తప్పుపడుతున్నారు. ఆ నెల సరుకులు రాకపోయినా మరుసటి నెలకు సంబంధించి ఠంఛనుగా డీడీలు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, డబ్బులు ఎక్కడ నుంచి తేవాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక్క కందిపప్పుకే ఒక్కో డీలర్ 25 వేల రూపాయల వరకు చెల్లిస్తుంటారు. దీన్ని బట్టి మిగతా వస్తువులకు ఎంత మొత్తంలో ముందస్తుగా చెల్లిస్తారో అర్థం చేసుకోవచ్చు. -
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం
=గిరిజన హాస్టళ్లపై పీవో దృష్టి =విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం =విస్తృత తనిఖీలకు రంగం సిద్ధం పాడేరు, న్యూస్‌లైన్: ఐటీడీఏ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న గిరిజన విద్యాలయాల పై ప్రాజెక్టు అధికారి దృష్టి సారించారు. చాలా కాలంగా ఐటీడీఏకు రెగ్యులర్ పీవో లేకపోవడంతో మన్యంలోని వివిధ శాఖల పనితీరులో తీవ్ర నిర్లక్ష్యం నెల కొందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా రెగ్యులర్ పీవోగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి వి.వినయ్‌చంద్ అన్ని శాఖల పనితీరుపై దృష్టి సారిస్తున్నారు. ఏజెన్సీలో విద్యా వ్యవస్థను చ క్కదిద్దడంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించేందుకు ఆయన కార్యాచరణ సిద్ధం చేసినట్టు సమాచారం. ఏజెన్సీలో 103 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, 11 కస్తూర్భాగాంధీ విద్యాలయాలు, 10 గిరిజన గురుకుల విద్యాలయాల్లో సుమారు 30 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి విద్యతోపాటు నాణ్యమైన ఆహారం, ఇతర వసతి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చుపెడుతోంది. వసతి సౌకర్యాల మాట ఎలావున్న విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆహారం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొందనే భావన పీవోలో వ్యక్తమవుతోంది. కొన్ని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదనే ఆరోపణలు ఆయన దృష్టికి వెళ్లాయి. మారుమూల ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితి మరింత దారుణం గా ఉందన్న ఫిర్యాదులు కూడా ఉన్నా యి. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు విద్యాలయాలను తనిఖీ చేస్తున్నప్పటికీ కొన్ని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం అందించడం లేదు. ఇటీవల పీవో స్వయంగా హుకుం పేట, పెదబయలు మండ లాల్లోని ఆశ్ర మ పాఠశాలలను తనిఖీ చేయగా పలు అక్రమాలు వెలుగు చూశాయి. దీంతో మొదటి తప్పు గా భావించి నోటీసుల తోనే సరిపెట్టారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలోని గిరిజన విద్యాలయాలను పూర్తిస్థాయిలో తనిఖీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆశ్రమ పాఠశాలలకు జీసీసీ ద్వారా సరఫరా అవుతున్న నిత్యావసర సరుకుల నాణ్యతపై కూడా పీవో దృష్టిసారించారు. ఇటీవల ఐటీడీఏలో నిర్వహించిన టెండర్ల కార్యక్రమంలో కూడా ఆయన వ్యాపారులను ఇదే హెచ్చరించా రు. ప్రతి హాస్టల్‌కు నాణ్యమైన నిత్యావసర వస్తువులు సకాలంలో పంపిణీ చేయాలని ఆదేశించారు. ఏటీడబ్ల్యూవోలు మండల కేంద్రాలకే పరిమితం కాకుండా రోజువారి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా పీవో తీసుకుంటున్న చర్యలను పలువురు స్వాగతిస్తున్నారు. -
అవినీతి డొంక కదిలింది
గూడెంకొత్తవీధి, న్యూస్‌లైన్: గిరిజన సహకార సంస్థ(జీసీసీ)లో చాపకింద నీరులా సాగుతున్న అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల రంగ ప్రవేశంతో అక్రమాలకు పాల్పడిన వారు కట కటాల వెనక్కు వెళ్లారు. ఆలస్యంగా కళ్లు తెరచిన సంస్థ ఆదిలోనే సమస్యను పట్టించుకుని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. పర్యవేక్షణలోపంతో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అవినీతికి అదుపులేకుండా పోతోంది. నిత్యం అందుబాటులో ఉంటూ గిరిజనులకు నిత్యావసర సరుకులను క్రమం తప్పకుండా అందించాల్సిన అధికారులు, సిబ్బంది అందినకాడికి దోచుకుంటున్నారు. ఒక్క జీకేవీధి బ్రాంచి పరిధిలోనే రూ.71 లక్షల అవినీతి బట్టబయలు కావడం ఆ సంస్థ పనితీరుకు అద్దం పడుతోంది. ఈ బ్రాంచికి పూర్తిస్థాయి మేనేజర్ లేకపోవడంతో గోడౌన్ సూపరింటెండెంట్ కన్నయ్యకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన హయాంలో అటవీ ఉత్పత్తులకు సంబంధించి రూ.10.30 లక్షలు, ప్రభుత్వ పాఠశాలలు, డిపోలకు చేరవేయాల్సిన సరుకులకు సంబంధించి రూ.21 లక్ష లు, ీపీడీఎస్ బియ్యానికి సంబంధించి రూ.30 లక్షలు, కిరోసిన్, గోనె సంచులకు సంబంధించి రూ.9.71 లక్షలు దుర్వినియోగం అయ్యాయి. ఆలస్యంగా కళ్లు తెరిచిన ఆశాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైన దర్యాప్తు చేపట్టి బాధ్యుడైన కన్నయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే జీకేవీధి పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేశారు. ఈమేరకు స్థానిక సీఐ రామకృష్ణారావు, ఎస్ఐ విజయకుమార్‌లు దర్యాప్తు చేపట్టారు. ఆరు నెలలుగా పరారీలో ఉన్న ఇన్చార్జి బ్రాంచి మేనేజర్ ఎం.కన్నయ్యతోపాటు చింతపల్లికి చెందిన ఆమూరి రాజుబాబు, బల్లంకి శ్రీనివాసరావు, రాజమండ్రికి చెందిన పట్టెం పరుశరాంలను శుక్రవారం అరెస్టుచేశారు. కన్నయ్య హయాం లో వరుస అక్రమాలు చోటుచేసుకున్నట్టు తమ విచారణలో తేలిందని పోలీసు అధికారులు తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించిన జీసీసీ నిధులు దుర్వినియోగానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేశామన్నారు. ఇది ఈ ప్రాంతంలో సంచలమైంది. ఇంతవరకూ ఏ జీసీసీ అధికారీ ఇలా అరెస్టు కాలేదు.