విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని రైతు బజార్ల ద్వారా నిత్యావసర సరుకులను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో పా టు జిల్లాలోని ఇతర వ్యాపారులు కూడా సహకరించాలని జేసీ రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మి నీ కాన్ఫరెన్‌స హాల్‌లో శుక్రవారం సాయంత్రం జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన వినియోగదార్ల సంఘాల ప్ర తినిధులు, వర్తక సంఘాలను నిత్యావసరాలను త క్కువ ధరలకే విక్రయించేలా ఒప్పించారు.
ప్రజలకు అందుబాటు ధరలకు నిత్యావసర సరుకులను అందించాలన్నారు. బియ్యంతో పాటు మంచినూనె, పంచదార, చింతపండు, పప్పులు తదితర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడానికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. పట్టణంలోని మూ డు రైతుబజార్లతో పాటు పార్వతీపురం రైతుబజార్లో కూడా శనివారం నుంచి అందుబాటు ధరల్లో నిత్యావసరాలు విక్రయించాలన్నారు. వర్తక సంఘాల ఒప్పం దం మేరకు కిలో రూ.70 నుంచి 80 రూపాయలు పలుకుతున్న కందిపప్పు కిలో 67 రూపాయలకు విక్రయిస్తామన్నారు.అదేవిధంగా *90 పలుకుతున్న మినపగుళ్లను కిలో *75కు సరఫరా చేస్తామన్నారు. పెసరపప్పును కిలో *86కు ఇస్తామన్నారు. ఈ ధరలు వ్యాపారులు రైతుబజార్లకు విక్రయించగా వాటిని వినియోగదారులకు మహిళా సంఘాలు 50 పైసల మార్జిన్‌తో విక్రయిస్తారన్నారు.
అలాగే పామాయిల్‌ను కిలో *58 కు విక్రయిస్తారన్నారు. టమోటాను *26కు, సన్నబి య్యం *30లకు విక్రయిస్తున్నామనీ, వీటిని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామన్నారు. బంగాళాదుంపల ధర అధికంగా ఉన్నప్పటికీ రెండు రోజుల్లో తగ్గే అవకాశముండటంతో వాటిని మినహాయించారు. చింతపం డు జీసీసీ ద్వారా *25కు సరఫరా అవుతోందనీ, దాన్ని విక్రయించడానికి వర్తకులు ముందుకు వస్తే వారికి మార్జిన్ మనీ అందిస్తామన్నారు. అలాగే ఎక్కువ ధర ఉన్న ఎండుమిర్చిని భద్రాచలం నుంచి తెప్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు
రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను కూడా సబ్సిడీపై అందిస్తున్నట్టు జేసీ తెలిపారు. జిల్లాలో ప్ర స్తుతానికి ఎరువుల కొరతలేదన్నారు. మార్క్‌ఫెడ్, ఇతర డీలర్ల ద్వారా కూడా ఎరువులు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 5,300 టన్నుల యూరియా, 4వేల టన్నుల డీఏపీ, 1300 టన్నుల ఎంఓసీ, 2200 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
వరి విత్తనాలు కిలోకి *5, వేరుశనగ విత్తనాలు కిలోకు *15, పెసర, మినుము, కంది, పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందిస్తామన్నారు. ధరల నియంత్రణకు సహకరించి రైతుబజార్లలో విక్రయాలకు అంగీకరించిన వర్తక సంఘాలకు జేసీ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ జే వెంకటరావు, వ్యవసాయ శాఖ జేడీ డి.ప్రమీల, డీఎస్‌ఓ హెచ్‌వీ ప్రసాద్, పౌరసరఫరాల సంస్థ డీఎం రమేష్‌రెడ్డి, చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు జి శివకుమార్, ఎంవీ చలం,పప్పులు, నూనెల వర్తక సంఘాల ప్రతినిధులు సంతోష్, కె.సతీష్, అనీష్, ఉల్లి వ్యాపార సంఘం ప్రతినిధి డి.రమేష్‌కుమార్, బియ్యం వర్తక సంఘ ప్రతినిధి పి.నాగేశ్వరరావు, ధరల నియంత్రణ కమిటీ సభ్యుడు జే.సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.
రైతు బజార్ల ద్వారా ఇక నిత్యావసరాలు
Published Sat, Aug 9 2014 5:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement