rama rao
-
మత్స్యకారుల్లో ‘తండేల్’ చిచ్చు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఎలక్షన్ ముందు మాయ మాటలు చెబుతారు. కానీ జగన్ గారు గెలవక ముందే మా కుటుంబాల వారికి మాటిచ్చి నిలబెట్టుకున్నారు. వైఎస్ జగన్ గెలిస్తే మా బతుకుల్లో వెలుగులు వస్తాయని అనుకున్నాం. అలాగే ఆయన గెలిచాక మమ్మల్ని పాకిస్తాన్ జైలు నుంచి విడుదల చేయించారు. ఒక్కొక్కరికీ రూ.5లక్షల సాయం అందజేశారు. 14 నెలల కష్టాలు సీఎం జగన్‌ను చూడగానే మటుమాయమయ్యాయి. మాకు ఊపిరి పోసి, పునర్జన్మ ఇచ్చారు. మా కుటుంబాల్లో ఎవరెన్ని చెప్పినా, ఏమన్నా జగన్ పార్టీకి జీవితాంతం సేవ చేస్తా. ఆయన రుణం ఈ జన్మలోనే తీర్చుకుంటా.’ పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యాక మీడియాతో గనగళ్ల రామారావు అన్న మాటలివి..కానీ తండేల్ సినిమా విడుదలయ్యాక ఎందుకో రామారావు స్వరం మారిపోయింది. వైఎస్ జగన్ హయాంలో జరిగిన మేలును చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇతర దేశాల్లో ఉన్న వారిని విడిపించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది కదా.. ఇప్పుడు కొన్ని బుర్రలకు ఆ విషయం అర్థం కావడం లేదు.. ఏదో పట్టినట్టు కొంతమంది అదే పనిగా వైఎస్ జగన్ ప్రభుత్వం గొప్పతనమని చెబుతున్నారంటూ.. తోటి మత్స్యకారులనుద్దేశించి కొన్ని మీడియాల్లో మాట్లాడటం వివాదాస్పదంగా మారింది. అలాగే తండేల్ సినిమా యూనిట్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా.. నాడు జరిగిన మేలు గురించి చెప్పకపోవడం కూడా మిగతా 21 మత్స్యకార కుటుంబాలకు ఆగ్రహం తెప్పించింది. అసలు నిజమిది.. వాస్తవానికి రామారావు ఒక్కడే తండేల్ కాదని, సినిమాలో అలా కథ రాసుకున్నారు గానీ.. పాకిస్తాన్‌కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండేళ్లు ఉన్నారని 21 మత్స్యకార కుటుంబాల వారు తెలిపారు. తండేల్ సినిమాతో రామారావు ఒక్కరికే లబ్ధి చేకూరిందని అన్నారు. అప్పుడేం జరిగిందో తమకు తెలుసని, ఎవరి వల్ల విడుదలయ్యామో తమకు ఇంకా గుర్తుందని అన్నారు. వైఎస్ జగనే పునర్జన్మ ఇచ్చారని ఆనాడు చెప్పిన వ్యక్తి ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతున్నాడని అన్నారు. తాము స్టేజీ ఎక్కితే ఎక్కడ వాస్తవాలు చెబుతామో అని ఆ ఆవకాశం ఇవ్వకుండా చేశారని, రామారావు, కథా రచయిత తమను మోసం చేశారని మండిపడ్డారు. ఇదేనా కృతజ్ఞత.. రామారావు వ్యవహార శైలి వల్ల డి.మత్స్యలేశంలో చిచ్చు రేగింది. రామారావుకు అవకాశవాదం తప్ప కృతజ్ఞత లేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యాక రామారావు ఏమన్నాడు.. ఇప్పుడేం మాట్లాడుతున్నారు...అంతా మీడియాలో రికార్డయి ఉంది.. మరిచిపోయి మాట్లాడితే పాత వీడియాలు గుర్తు చేస్తాయి...’ అని అంటున్నారు. సినిమా యూనిట్‌ను తప్పుదారి పట్టించి, తమకు కనీసం గుర్తింపు లేకుండా చేశారని కూడా వాపోతున్నారు. ఆ గ్రామంలో ప్రస్తుతం రామారావు ఒక వైపైతే.. మిగతా వారంతా మరో వైపు ఉన్నారు. ఢీ అంటే ఢీ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ప్రెస్‌మీట్ పెట్టి ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో నాడు జరిగిన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఎవరి గొప్పతనమేంటో, ఎవరి చేసిన మేలు ఏంటో చర్చకు వస్తోంది. -
‘అల’పెరుగని గుండెల్
పురాణాల నుంచి వర్తమానం వరకు పతిప్రాణాలు రక్షించుకోవడం కోసం మహిళలు పడిన కష్టాలు, చేసిన పోరాటం మనకు కొత్త కాదు. నూకమ్మ చేసిన పోరాటం ఆ కోవలోకే వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన నూకమ్మ భర్త, అతడి బృందం గుజరాత్లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్టు గార్డుల చేతికి చిక్కారు. పాకిస్తాన్ జైల్లో పద్నాలుగు నెలలు మగ్గారు. అప్పట్లో ‘ప్రజా సంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల... నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. నాగచైతన్య కథానాయకుడిగా వస్తున్న ‘తండేల్’ సినిమాకు మూలం రామారావు– నూకమ్మల జీవితకథ.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పంచాయతీ పరిధిలోని గ్రామాలు డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం. గనగళ్ల రామారావుది కె.మత్స్యలేశం. నూకమ్మది డి.మత్స్యలేశం గ్రామం. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు కూడా వీరి ప్రేమను ఆమోదించారు. పెళ్లి చేశారు. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారో లేదో, ఎన్ని కష్టాలు ఎదురవుతాయో! అనుకున్నారు. హమ్మయ్య... ఎలాంటి కష్టం లేకుండానే వారి పెళ్లి జరిగింది. అయితే సినిమా ట్విస్ట్‌లా అసలు కష్టాలు ఆ తరువాతే మొదలయ్యాయి. తన బృందంతో కలిసి చేపల వేట కోసం రామారావు గుజరాత్‌లోని వెరావల్‌కు వెళుతుండేవాడు. గుజరాత్లో వేటకెళ్లిన మత్స్యకారుల నాయకుడిని ‘తండేల్’ అని పిలుస్తారు.ఆరోజు....శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది రామారావు నాయకత్వంలో మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తున్నారు. ఎదురుగా దట్టమైన మంచు. ఏమీ కనిపించడం లేదు. పయనిస్తున్న పడవ దిశ మారిపోయింది. దీంతో పాకిస్థాన్‌ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. బోట్లలో వైర్లెస్ సెట్లు కూడా పనిచేయకపోవడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ తరువాత పాకిస్తాన్ కోస్టు గార్డులు చేతికి చిక్కారు. వీరి ఫొటోలు తీసుకుని ఏప్రాంతానికి చెందిన వారని ఆరా తీశారు. పొరపాటున వచ్చిన మిమ్మల్ని విడిచి పెడతాం’ అని కోస్టు గార్డులు హామీ ఇవ్వడంతో ‘బతికిపోయినం దేవుడా’ అనుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు. కథ మలుపు తిరిగింది...కానీ తరువాత కథ మలుపు తిరిగింది. ‘భయపడకండి... విడిచి పెడతాం’ అన్న వాళ్లే ఆ తరువాత ‘విడిచిపెట్టేదే లేదు’ అంటూ మాట మార్చారు. ఆ మాట వారి గుండెల్లో గునపంలా దిగింది. వేలిముద్రలు తీసుకుని కరాచీ సబ్‌జైలులో బంధించారు. వీరందరినీ ఒకే బ్లాక్‌లో ఉంచారు. జైలులో వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన ఆహారం అందకపోవడం, జైలు సిబ్బంది నానా రకాలుగా ఇబ్బంది పెట్టడంతో చిత్రహింసలు అనుభవించారు. ఎవరికి ఎవరూ ధైర్యం చెప్పుకునే పరిస్థితి లేదు. అందరి కళ్ల ముందు దుఃఖసముద్రం.పద్నాలుగు నెలలు... ప్రతి రోజూ నరకమే వేటకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకి దొరకకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పాకిస్తాన్ కోస్టు గార్డులకు పట్టుబడ్డారనే వార్త తెలిసి కుప్పకూలిపోయారు. ‘ఎన్ని కష్టాలొచ్చినా సరే నా భర్తను జైలు నుంచి విడిపించుకుంటాను’ ఏడుస్తూనే దృఢంగా అన్నది నూకమ్మ. ‘నీ భర్త విజయనగరంలో ఉన్నాడనుకున్నావా? విశాఖపట్నంలో ఉన్నాడనుకున్నావా?... అక్కడెక్కడో పాకిస్తాన్ జైలులో ఉన్నాడు’ అన్నారు ఒకరు. ఆ మాటకు అర్థం... ఇక ఆశ వదులుకోవాల్సిందేనని!పాక్ జైల్లో బందీలుగా వున్న మత్స్యకారుల గురించి పాదయాత్రలో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి వివరిస్తున్న నూకమ్మ తదితరులు అయితే చివరి శ్వాస వరకు అయినా పోరాడాలని నిర్ణయించుకుంది నూకమ్మ. ఆమెకు ఎర్రమ్మ భార్య శిరీష జత కలిసింది. నిండు గర్బిణీగా ఉన్న నూకమ్మ, ఎర్రయ్య సతీమణి శిరీష కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. అప్పట్లో ‘ప్రజాసంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల, నాడు ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. భర్తను జైలు నుంచి విడిపించటం కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు నూకమ్మ చేసిన పోరాటం, గర్భిణిగా, పాపకు జన్మనిచ్చిన తల్లిగా తను ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అంతులేని నిస్సహాయతలో కూడా చిన్న ఆశ మనిషిని బతికిస్తుంది. పోరాటశక్తిని ఇస్తుంది. విజయాన్ని చేతికి అందిస్తుంది. నూకమ్మ విషయంలో అదే జరిగింది.పాకిస్తాన్ నుంచి విడుదలైన తర్వాత తనను కలిసిన రామారావుకు స్వీట్ తినిపించిన నాటి సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అదృష్టం కాదు...అంతా ఆమె కష్టమే!పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కుటుంబం గుర్తుకొచ్చి నాలో నేను కుమిలిపోయేవాడిని. నెల గర్భిణిగా ఉన్న నా భార్య నేను విడుదలయ్యే నాటికి మూడు నెలల పాపతో కనిపించింది. ఎన్నో నెలల పాటు నా కుటుంబానికి దూరంగా బతికాను. నా విడుదల కోసం నా భార్య చేసిన పోరాటం, పడిన కష్టాలు ఎంతోమంది ద్వారా విన్నాను. ఆమె పడిన కష్టం వల్లే విడుదలయ్యాను.– గనగళ్ల రామారావుఆందోళనలో బతికానా భర్త పాకిస్తాన్‌కు పట్టు పడినట్లు తెల్సుకున్నాక ఆందోళన చెందా. గుజరాత్ మరి వెళ్లనని సంక్రాంతికి వచ్చి ఇక్కడే ఉండి పోతానని అన్నారు. అంతలో పాకిస్తాన్లో చిక్కుకుపోయారు. పాకిస్తాన్ మన శత్రుదేశం కావటం వల్ల ఎంతో ఆందోళన చెందాను. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాటం చేశాను. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిశాను. ఆయన జైలులో ఉండగా పాప పుట్టింది. మా కథ సినిమాగా వస్తుండటం సంతోషంగా ఉంది. – నూకమ్మ– కందుల శివశంకరరావు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం -
యువకుడితో వివాహేతర సంబంధం.. మరొకరితో చనువుగా ఉంటోందని..
సాక్షి, శ్రీకాకుళం: వరుసకు వదినయ్యే మహిళతో అవివాహిత యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ మరో యువకుడితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమెతోపాటు మరో యువకుణ్ణి కూడా దారుణంగా హతమార్చాడు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డపనస గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదడ్డపనస గ్రామానికి చెందిన వెలమల ఎర్రమ్మ (40) అనే మహిళకు అదే గ్రామానికి చెందిన భాస్కరరావుతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. కాగా, వరుసకు మరిదయ్యే ముద్దాడ రామారావు (30) అనే అవివాహిత యువకుడు ఎర్రమ్మతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. మరొకరితో చనువుగా ఉంటోందని.. ఇదిలావుండగా.. ఎర్రమ్మ అదే గ్రామానికి చెందిన ముద్దాడ సంతోష్ (26)తో కొంతకాలంగా చనువుగా ఉంటోంది. ఎర్రమ్మ తనతోపాటు సంతోష్‌తో కూడా అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రగిలిపోతున్న ముద్దాడ రామారావు వారిద్దరిపైనా కక్ష పెంచుకున్నాడు. మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న వంశధార ఎడమ కాలువలో స్నానం చేస్తున్న సంతోష్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అదే కత్తి తీసుకుని సమీపంలోని పొలంలో పనిచేస్తున్న ఎర్రమ్మపైనా దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 9 స్థానాలనూ కైవసం చేసుకుంది. వీటిలో 5 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన మిగతా 4 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ నాలుగు స్థానాలకు ఈనెల 13న పోలింగ్ జరిగింది. గురువారం ఓట్లు లెక్కించారు. శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి నర్తు రామారావు, కర్నూలు జిల్లా నుంచి మధుసూదన్, పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి వంకా రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్ ఘనవిజయం సాధించారు. ఈ నాలుగు స్థానాల్లోనూ సంఖ్యా బలం లేకపోయినా స్వతంత్రుల ముసుగులో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. కాగా, 3 పట్టభద్రుల నియోజకవర్గాలు, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. స్థానిక సంస్థల కోటాలో అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి.. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కటి, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు స్థానాలు మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎస్.మంగమ్మ, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సిపాయి సుబ్రమణ్యం, మేరుగ మురళీధర్, కుడిపూడి సూర్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పశ్చిమలో రెండు స్థానాలూ వైఎస్సార్సీపీకే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలు జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు అధికార వైఎస్సార్సీపీ దక్కించుకుంది. గురువారం ఏలూరులో జరిగిన ఓట్ల లెక్కింపులో గంటన్నరలోనే ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 1105 ఓట్లకు గాను 1088 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 25 చెల్లుబాటు కాలేదు. వాటిలో 20 టీడీపీవికాగా, మరో 5 వైఎస్సార్‌సీపీవి. వాస్తవబలం కంటే వైఎస్సార్సీపీకి అదనంగా 50 ఓట్లు రావడం గమనార్హం. చెల్లుబాటైన 1063 ఓట్లలో మొదటి ప్రాధాన్యతలోనే వైఎస్సార్సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్‌కు 481 ఓట్లు, వంకా రవీంద్రనాథ్‌కు 460 ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 122 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అధికారులు వంకా రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్‌లను విజేతలుగా ప్రకటించారు. కర్నూలులో వైఎస్సార్సీపీకి బలానికి మించి ఓట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ బోయ మధుసూదన్ ఘన విజయం సాధించారు. కర్నూలులో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, 9.30 గంటలకే పూర్తయింది. ఇక్కడ మొత్తం 1,178 ఓట్లలో 1,136 పోలయ్యాయి. 53 ఓట్లు చెల్లలేదు. ఉన్న బలం కంటే ఎక్కువ ఓట్లు వైఎస్సార్సీపీకి పోలయ్యాయి. వాస్తవానికి వైఎస్సార్సీపీకి 959 ఓట్లు బలం ఉండగా, 988 ఓట్లు వచ్చాయి. అధికంగా నమోదైన 29 ఓట్లనుబట్టి చూస్తే టీడీపీ, బీజేపీ, వామపక్షాల ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీకే మద్దతు పలికినట్లు స్పష్టమవుతోంది. స్వతంత్ర అభ్యర్థులు ఎన్.మోహన్‌రెడ్డికి 85, భూమా వెంకట వేణుగోపాల్‌రెడ్డికి 10 ఓట్లు వచ్చాయి. శ్రీకాకుళంలో రామారావు ఘన విజయం శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయ ఢంకా మోగించారు. మొత్తం 752 ఓట్లు పోలవగా.. అందులో నర్తు రామారావుకు 632 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎ.రామకృష్ణకు 108 ఓట్లు వచ్చాయి. 12 ఓట్లు చెల్లలేదు. దీంతో 524 ఓట్ల ఆధిక్యతతో నర్తు విజయం సాధించారు. -
అందుకే తమన్నాను తీసుకున్నాం: నిర్మాత
చాలామంది తమ జీవితంలో కొన్ని జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్‌లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి సంఘటనలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో తెరకెక్కిన చిత్రమే 'గుర్తుందా శీతాకాలం". హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోహీరోయిన్లుగా కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహసిని తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ సక్సెస్ఫుల్ దర్శకుడు, నటుడైన నాగశేఖర్ ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చినబాబు, ఎం.సుబ్బారెడ్దిల సమర్పణలో వేదాక్షర ఫిలింస్ నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబులు నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ► చిన్నప్పుడు చిరంజీవి గారి నెగిటివ్ ఫిల్మ్స్ తీసుకొని తెరమీద వెయ్యడం.. అలాగే ఆ నెగిటివ్ ఫిల్మ్ షర్ట్ కింద పెట్టి ఐరన్ చేస్తే షర్ట్ మీద చిరంజీవి బొమ్మ పడేది. ► సుబ్బారెడ్డితో కలసి ఆడు మగాడ్రా బుజ్జీ కు అసోసియేట్ గా వర్క్ చేశాను. ఆ తరువాత గజకేసరీ, సమంతతో టెన్ వంటి సినిమాలు డబ్బింగ్ సినిమాలు చేసిన తరువాత ఇప్పుడు "గుర్తుందా శీతాకాలం"’ వంటి స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాను. ► ఈ సినిమాకు భాగస్వామ్యం గా ఉన్న సుబ్బారెడ్డి 120 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా చేశాడు.వారి సలహాలు తీసుకున్నాను. ప్రతి నిర్మాతకు మొదట కొంత ఇబ్బంది అనిపించినా అనుభవంతో అంతా సెట్ అయ్యి అలవాటు అవుతుంది. ► సత్యదేవ్ చాలా మంచి వ్యక్తి. మొదట నుంచి చివర వరకు కూడా నేను సెట్స్‌కు సరిగా వెళ్ళక పోయినా అకౌంట్స్ తో సహా ప్రతి విషయంలో మాకు అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుండి నడిపించాడు. తమన్నా ప్రొఫెషనల్ యాక్టర్. అంతా కొత్త వారితో చేస్తే మా సినిమా బిజినెస్ కూడా జరగాలి కాబట్టి తనను తీసుకున్నాం. ► డిసెంబర్ 9 న సుమారు 12 సినిమాలు రిలీజ్‌కు ఉన్నా కూడా మా సినిమాను మాత్రం రెండు రాష్ట్రాల్లో 600 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాము. ► కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించాడు. తను కన్నడలో చాలా హిట్ సినిమాలు చేశాడు.అయితే ఈ సినిమాకు కూడా చాలా కేర్ తీసుకొని బాగా చేశాడు. తనకు కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుంది. ► ఈ సినిమా చూస్తుంటే నాగార్జున గారి "గీతాంజలి" సినిమాకు దగ్గరగా ఉంటుంది ► నాకు రివాల్యూషనరీ, సామాజిక అంశాల మీద జరిగే షోషల్ ఎలిమెంట్స్ ఉన్న కథలు, హార్రర్,క్రైమ్ థ్రిల్లర్ సినిమా కథలు అంటే ఇష్టం. ► కృష్ణ వంశీ గారి రంగ మార్తాండ సినిమాకు ఫైనాన్సియల్ అసోసియేట్ అయ్యాము, సినిమా పూర్తైంది. ఎన్టీఆర్ బావమరిదితో శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా చేస్తున్నాము. ఫిబ్రవరి లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాము.ఇవి కాకుండా ఇంకా కొన్ని కొత్త కథలు లైనప్ లో ఉన్నాయి అని ముగించారు. చదవండి: ఆ స్టార్ హీరోని నేను పెళ్లి చేసుకోవడం లేదు: కృతీసనన్ రష్యాలో ల్యాండైన పుష్ప టీమ్ -
టాలీవుడ్లో విషాదం:సీనియర్ దర్శకుడు కన్నుమూత
-
టాలీవుడ్లో విషాదం: సీనియర్ దర్శకుడు కన్నుమూత
చెన్నై: తెలుగు, హిందీ సినిమాల సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు (84) కన్నుమూశారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. రామారావు 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించాడు. 1966 నుంచి సినీ రంగానికి సేవలందించిన రామారావు దాదాపు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తొలి సినిమా నవరాత్రి. దర్శకునిగా పనిచేయడానికి ముందు ఆయన తన కజిన్ తాతినేని ప్రకాశ్‌రావు వద్ద, కోటయ్య ప్రత్యగత్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. -
ఆన్ డ్యూటీ: స్పెయిన్‌లో ల్యాండ్ అయిన రవితేజ
మాస్‌రాజా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్‌డ్యూటీ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్నారు.సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సాంగ్ షూటింగ్ కోసం చిత్ర బృందం స్పెయిన్ వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి అందమైన లొకేషన్స్‌లో పాటలను చిత్రీకరించనున్నారు. ఈ సాంగ్స్ మూవీకి హైలైట్‌గా నిలుస్తాయని డైరెక్టర్ శరత్ మండవ తెలిపారు. ఇక ఈ సినిమాతో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇస్తున్నారు. నాజర్, నరేష్, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజ రవితేజ- శరత్ మందవ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఎల్ ఎల్ పి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ లేటెస్ట్ అప్డెట్ను వదిలారు. సాలిడ్ పోస్టర్‌తో మార్చి 1నే టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. Teaser on 1st March! 👊🏻#RamaRaoOnDuty pic.twitter.com/PhUK3XoAMt — Ravi Teja On Duty (@RaviTeja_offl) February 26, 2022 -
రవితేజ దూకుడు..‘రామారావు ఆన్ డ్యూటీ’ పోస్టర్ వైరల్
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌డ్యూటీ’. రవితేజ 68వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రవితేజ పుట్టినరోజు(జనవరి 26) సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. యాక్షన్‌తో కూడిన ఈ పోస్టర్లో రవితేజ దూకుడుగా కనిపిస్తున్నాడు. అతనిలో దాగిఉన్న వివిధ భావోద్వేగాలను కూడా చూపిస్తుంది. ఒక చోట తన భార్యతో కనిపిస్తే, మరొక చోట ఫ్యామిలీతో కనిపిస్తున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ అనేది అన్ని ఎమోషన్స్‌తో కూడిన చిత్రమని, అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలు ఉంటాయని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన మజిలీ బ్యూటీ దివ్యాన్ష కౌశిక్, రజిషా విజయన్లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 25న ఈ చిత్రం విడుదల కానుంది. Team #RamaRaoOnDuty wishes Mass Maharaja @RaviTeja_offl a very Happy Birthday 💥💥#HappyBirthdayRaviteja#RamaRaoOnDutyFromMarch25 @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @sathyaDP @SamCSmusic @sahisuresh @RTTeamWorks pic.twitter.com/ZeyryNDGWo — SLV Cinemas (@SLVCinemasOffl) January 26, 2022 -
మారేడుమిల్లి అడవుల్లో రామారావు..ఆన్ యాక్షన్
అడవిలో ఫైట్స్ చేస్తున్నారు రామారావు. మరి.. రామారావు పోరాటం ఎందుకు అనేది తెలియాలంటే కొంత కాలం వేచి ఉండక తప్పదు. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు: ఆన్ డ్యూటీ’. ఈ చిత్రంలో దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లి అటవీ పాంత్రాల్లో జరుగుతోంది. థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సెస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత పాటల చిత్రీకరణ కోసం చిత్రబృందం విదేశాలకు వెళుతుంది. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్రా లోకేష్, సురేఖా వాణి కీలక పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: సామ్ సీఎస్. -
రీఎంట్రీకి సిద్ధమైన నటుడు వేణు తొట్టెంపూడి
Venu Thottempudi comeback : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం శరత్ మండవ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా తెరెకెక్కుతున్న ఈ చిత్రంతో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో మజిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్‌తో పాటు రజిష విజయన్ హీరోయిన్లుగా నటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ను వదిలారు మేకర్స్. కొన్నాళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న హీరో వేణు తొట్టెంపూడి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. గురువారం ఇందుకు సంబంధించి 'వెల్కమ్ అబోర్డ్ వేణు' అంటూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. కాగా 1999లో వచ్చిన 'స్వయంవరం' సినిమాతో హీరోగా పరిచయం అయిన వేణు ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే 'గోపి గోపిక గోదావరి' సినిమా అనంతరం సినిమాలకు దూరమైన వేణు 2012లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము చిత్రంలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు రవితేజ సినిమాతో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు వేణు. Team #RamaRaoOnDuty takes privilege in welcoming back everyone's favorite #VenuThottempudi garu to be ON DUTY again to flare the screen.@RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @Cinemainmygenes @sathyaDP @sahisuresh @SamCSmusic @RTTeamWorks pic.twitter.com/QYWRbdFNxy — SLV Cinemas (@SLVCinemasOffl) July 29, 2021 -
'రామారావు ఆన్ డ్యూటీ' : ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం శరత్ మండవ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ కెరీర్లో 68వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇటీవలె రామారావు అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్‌తో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందబోతుంది. ఈ మూవీలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో ఇప్పటికే మజిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్‌తో పాటు రజిష విజయన్ హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. -
'రామారావు'గా రవితేజ..ఫోటోలు వైరల్
మాస్ మహారాజా రవితేజ జోరుమీదున్నాడు. ఈ ఏడాది క్రాక్ చిత్రంతో హిట్ కొట్టిన రవితేజ ఆ తర్వాత ఖిలాడి అనే సినిమాలో నటించారు. కరోనా కారణంగా ఈ మూవీ రిలీజ్‌కు బ్రేక్ పడింది. ఇటీవలె మరో సినిమాకు సైన్ చేసిన రవితేజ ఇటీవలె షూటింగ్‌ను మొదలు పెట్టారు. రవితేజ కెరీర్లో 68వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు రామారావు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్‌తో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో శరత్ మండవ డైరెక్టర్‌గా పరిచయం కానున్నాడు. రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందబోతుంది.ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపించబోతోన్నట్లు తెలుస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మజిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించనుంది. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. -
హిందీభాషకు దక్షిణ వారధి పీవీ
బహుముఖి అయిన మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావును ఎలా అంచనాకట్టాలో తెలియడానికి జనం ఆయనకు ఇచ్చిన పేర్లో, బిరుదులో పరిశీలిస్తే చాలు. అపర చాణక్యుడు, మౌనముని, సంస్కరణల పితామహుడు, ఇంకా సాహితీవేత్త, బహుభాషావేత్త. అయితే ఆయన్ని పరిశీలించడానికి ఇంకోకోణం ఉంది. ఒక దక్షిణాదివాడు ఉత్తరాది భాష అయిన హిందీలో జెండా ఎగరేయడం. అక్కడి గొప్ప రచయితలు మెచ్చేంత అపర పండితుడిగా వెలగడం. ‘వేయిపడగలు’ లాంటి తెలుగు మహారచనను హిందీలోకి అనువదించడంతోపాటు, సాక్షాత్తూ దేశ రాజ్యాంగాన్నే ఆయన హిందీలోకి తర్జుమా చేశారు. ఆయన శతజయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్న సందర్భంగా తెలుగువాడైన పీవీ ఠీవీని మరోసారి గుర్తుచేసుకుందాం.పీవీ నరసింహారావు పేరు తలవగానే వెంటనే స్ఫురించేది ఆయన బహుభాషా అధ్యయనశీలత. భాషాపిపాస, అయనకు బాల్యంతోనే అంకురించింది. హైస్కూలు చదువు పూర్తయ్యేసరికి తెలుగుతో పాటు పర్షియన్, ఉర్దూ, ఇంగ్లిష్ భాషలలో మంచిపట్టు సాధించారు. ఇంటర్ మొదలు ‘లా’ వరకు మహారాష్ట్రలో చదవడం వలన మరాఠీ భాషలో ప్రావీణ్యం సంపాదించారు. నాటి నిజాం రాష్ట్రంలోని దక్కనీ ఉర్దూకు హిందీ భాషతో చాలా సారూప్యత ఉండటం మూలాన, పీవీకి హిందీ పట్ల ఆసక్తి కలిగింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో జాతీయ నాయకులైన గాంధీజీ, నేతాజీ, నెహ్రూ లాంటివాళ్లు హిందీలో చేసిన ప్రసంగాలు, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లిన నాగపూర్‌లో తరచూ జరిగే హిందీకవి సమ్మేళనాలు మరింత ఆకర్షణ కలిగించాయి. అలా 1946 సంవత్సరంలో అలహాబాద్ యూనివర్సిటీ నుండి హిందీ ‘సాహిత్యరత్న’ (ఎంఏ) పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. హిందీలో పరిశోధన చేయాలని అభిలషించి, సుప్రసిద్ధ కవ యిత్రి మహాదేవి వర్మ రచనలను లోతుగా అధ్యయనం చేశారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొనకుండా వుంటే, హిందీలో డాక్ట రేటు పట్టా సాధించి అలహాబాద్‌లో యూనివర్సిటీ ఆచార్యుడై వుండే వారు. జీవితం ఎంతో విచిత్రమైనది. అనుకొనేవి జరగవు. ఆశించి నవి లభించవు. పీవీ విషయంలోనూ జరిగిందదే! ‘ర్యాంగ్లర్’ కావాలనుకున్నాడు. ఆస్ట్రానమీ అందలేదు. హిందీ ఆచా ర్యుడు కాలేదు. వకీలుగా కూడా స్థిరపడలేదు. ఆయన ఐచ్ఛికాంశం సైన్సు. స్మరించింది సాహిత్యాన్ని. కానీ ఆయనను వరించింది పాలిటిక్స్. స్వామి రామానంద తీర్థ ఆదేశాన్ని శిరసావహించిన పీవీ 1948లో హైదరాబాద్ స్టేటు భారత యూనియన్‌లో విలీనమయ్యాక రాజకీయాలకు దూరంగా, సమాజానికి దగ్గరగా ఉండాలని భావించారు. జర్నలిజంపై మనసు పడి, కాకతీయ వార్తాపత్రికను మూడేళ్ల పాటు నిర్వహించి, తొలి సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ నుంచి పిలుపు రావడంతో, పత్రికను మూసివేసి ప్రజాసేవపై దృష్టి పెట్టారు. 1952 ఎన్నికలలో ఓడిపోయాక, తిరిగి హిందీ భాషా, సాహిత్య సేవపై దృష్టిపెట్టి, తుది శ్వాస వరకు కొనసాగించారు. భారత రాజ్యాంగాన్ని ‘భారతీయ సంవిధాన్’ శీర్షికన ఆంగ్లంలోంచి హిందీలోకి అనువదించి తన హిందీ రచనకు శ్రీకారం చుట్టారు. విశ్వనాథ సత్యనారాయణ అనుమతితో ‘వేయిపడగలు’ నవలను, ‘సహస్రఫణ్’ పేరిట అనువాదానికి పూనుకొన్నది 1955–56 మధ్యకాలంలోనే! పద్నాలుగు సంవత్సరాల కృషి ఫలంగా వెలువ డిన ‘సహస్రఫణ్’ యావత్ భారతంలోని హిందీ సాహిత్య అభిమా నులను అలరించడమే కాదు, పీవీకి ‘కేంద్ర హిందీ నిర్దేశాలయ్’ వారి పురస్కారాన్నీ ప్రసాదించింది. పీవీ తొలుత విశ్వనాథ ‘ఏకవీర’ను కొంతభాగం అనువ దించారు. తదుపరి ‘చెలియలి కట్ట’ను పూర్తిగా తర్జుమా చేశారు. కానీ ప్రేమ, శృంగారంతో కూడిన రచనలుగా భావించి ప్రచురణకు అంగీకరించలేదనీ, సంస్కృతీ సాంప్రదాయాలకు, సామాజిక విలువ లకు అద్దం పట్టిన ‘వేయి పడగలు’ నవలనే ఇష్టపడి హిందీసేత చేశారని హిందీ సాహితీవేత్త ఆచార్య భీమ్సేన్ నిర్మల్ అన్నారు. హిందీ సాహితీ ప్రక్రియలలో పీవీ కవిత్వాన్నే ఎక్కువగా ప్రేమించారు. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వాన్ని, హిందీలోని ఛాయావాద కవిత్వాన్ని తులనాత్మకంగా పరిశీలించారు. మహాదేవి వర్మ కవిత్వంలోని ఛాయావాదం, దుఃఖవాదం, రహస్యవాదం మొదలైన విభిన్న పార్శా్వలను ఆవిష్కరిస్తూ ఆమె షష్టిపూర్తి అభినందన సంచిక కొరకు రాసిన ఇరవై ఐదు పేజీల సుదీర్ఘ వ్యాసం, పీవీ సిద్ధాంత వ్యాసానికి సంగ్రహపత్రంగా భావించవచ్చు. వివిధ సందర్భాలలో పీవీ చేసిన హిందీ ప్రసంగాలు, వివిధ సంచికలు, పత్రికలకు రాసిన వ్యాసాలు కూడా ఎన్నదగినవి. ఈ ప్రసంగ వ్యాసాలు, ఆయన హిందీ భాషా సాహిత్య దృక్పథాన్ని మాత్రమే కాదు, భారతీయ భాషలలో హిందీ స్థానాన్ని, భారతీయ సంస్కృతీ విలువల పరిరక్షణలో హిందీ సాహితీవేత్తల కవుల కృషిని విస్పష్టం చేశాయి. భారతీయ భాషల ఆదాన ప్రదానాలకు హిందీ వారధి వంటిదనీ, స్వాతంత్య్రోద్యమ కాలంలోనే హిందీ సాంస్కృతిక సమైక్యతకు నాంది పలికిందనీ సోదాహరణంగా వివరించారు. హిందీ కథా రచయిత ప్రేమ్‌చంద్ శతజయంతి సందర్భంగా ‘గగనాంచల్’ పత్రికకు రాసిన వ్యాసంలో ప్రేమ్‌చంద్ సాహిత్యం సమకాలీనతను సార్వకాలీనతను ప్రతిబింబించాయని తెలిపారు. పంజాబీ భాషలో కొత్తగా కవిత్వం రాసే వారెవరైనా సరే, వారు అమృతాప్రీతమ్ కవిత్వాన్ని ప్రేమించకుండా రాస్తే వాళ్లు కవులే కాలేరని వ్యాఖ్యానించారు. 1983లో తృతీయ ప్రపంచ హిందీ మహాసభల సందర్భంగా హిందీని అంతర్జాతీయ భాషగా పరివ్యాప్తి చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పీవీకి హిందీ భాషా సాహిత్యాల పైనే కాదు, హిందీ సాహిత్య చరిత్ర పట్ల ఎంతో సాధికారత ఉన్నది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హిందీ సాహిత్య చరిత్ర గ్రంథానికి రాసిన 35 పేజీల ముందుమాట ఇందుకు నిదర్శనం. చివుకుల పురుషోత్తం ‘ఏది పాపం’? తెలుగు నవలను అలహాబాద్‌కు చెందిన సూర్యనాథ్ ఉపాధ్యాయ ‘క్యాహై పాప్’ శీర్షికను హిందీలోకి అనువదించారు. దీనికి పీవీ రాసిన పీఠిక కూడా విలువైనదే. భారత ప్రధానమంత్రిగా హిందీ భాషలో ప్రమాణస్వీకారం చేసి ఆ భాష పట్ల తన ప్రేమను వెల్లడించారు. ఇందిరాగాంధీ దక్షిణ భారత ప్రచార సభకు అధ్యక్షులుగా ఉన్నప్పటికీ, పీవీని ఉపాధ్యక్షులుగా నియమించి కార్యక్రమాలు సజావుగా సాగేటట్లు చేశారు. ఈ హిందీ ప్రచార సభకు విశ్వవిద్యాలయ స్థాయి ఏర్పడినాక, పీవీయే వైస్ ఛాన్స్‌లర్‌గా వ్యవహారించారు. ఆయన వీసీగా ఉన్నప్పుడే సాహిత్య ప్రధానమైన ఎంఏను పాఠ్యక్రమాన్ని తొలిసారిగా భాషా ప్రధాన పాఠ్యక్రమంగా అమలు చేశారని నాటి రిజిస్ట్రార్ వేమూరి ఆంజనేయ శర్మ ఒక చోట వివరించారు. కేవలం ఎంఏ సాహిత్యం చదివితే వారు టీచర్లుగా పనిచేయడానికే పనికొస్తారు. ఫంక్షనల్ హిందీగా సిలబస్ తయారు చేసి శిక్షణ ఇస్తే వివిధ ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు కూడా ఉపకరిస్తారన్నది ఆయన సమున్నత భావన. ఈ ఆలోచనను అనంతరం అన్ని యూనివర్సిటీలు అమలు చేశాయి. హిందీ మాతృభాష కాని హిందీ రచయితలను ఎంతో ప్రోత్స హించారు. అఖిల భారత హిందీ సంస్థాన్ అధ్యక్షుడిగా ఉంటూ ‘సమవేత్ స్వర్’ హిందీ ద్వైమాసిక పత్రిక ప్రచురణను ప్రోత్సహిం చారు. ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో (1991– 96) దక్షిణ హిందీ ప్రచార సభకు గౌరవాధ్యక్షులుగా వ్యవహరించి, హిందీయేతర ప్రాంతాలలో హిందీభాష కోసం జరుగుతున్న కృషిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రధానిగా ఉన్నప్పుడే వాజ్‌పేయి కవితా సంకలనం ‘మేరీ ఇక్యావన్ కవితాయే’ను ఆవిష్కరించి, కూలంకషంగా విశ్లేషించారు. భారతీయ భాషల ద్వారా కంప్యూటర్ నడపటం సాధ్యం కాదని కంప్యూటర్ విశేషజ్ఞులే తేల్చిన తరుణాన పీవీ పూనుకుని హిందీలో సిద్ధార్థ వర్డ్ ప్రాసెసర్‌ను తయారు చేయించారు. అనంతరం లిపి వర్డ్ ప్రాసెసర్‌తో హిందీలో డి.సి.ఎ. ప్రారంభించారు. తరువాత జిస్టు కార్డు మార్కెట్లోకి వచ్చాక, ఎం.సి.ఎ. కూడా ప్రారంభించారు. భారతీయ భాషలలో కంప్యూటర్ నడుస్తుందని నిరూపించిన సాఫ్ట్వేర్ మేధావి పీవీ! డా‘‘ వి.వి.రామారావు వ్యాసకర్త ప్రముఖ రచయిత -
నిర్మాత పోకూరి రామారావు మృతి
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఈతరం ఫిలింస్’ పతాకంపై ఎన్నో చిత్రాలకు సమర్పకునిగా వ్యవహరించిన పోకూరి రామారావు (65) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆçస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు సోదరుడు ఆయన. కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావటంతో రామారావు హస్పిటల్లో చేరారు. పది నెలల క్రితం ఆయనకు గుండె సంబంధిత చికిత్స జరిగిందని తెలిసింది. గోపీచంద్ హీరోగా నటించిన ‘యజ్ఞం’, ‘రణం’, ‘ఒంటరి’ తదితర చిత్రాలకు రామారావు సమర్పకుడిగా వ్యవహరించారు. రామారావుకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రామారావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన మెగాస్టార్
-
‘అరుణోదయం’ రామారావు గళం
అరుణోదయ రామారావు మరణ వార్త అశనిపాతం లాంటిది. ఊహిం చలేనిది. గత నెల 12న హైదరాబాదులో కొండపల్లి సీతారామయ్య వర్ధంతి సభ రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కలిసి మాట్లాడుకున్నాం. ఆ సభలో కానూరి రాసిన ‘విప్లవాగ్రణి కొండపల్లి’ అనే పాటను రామారావు పాడారు. ఆయన నోటినుండి విన్న ఆఖరి పాట అదే అవుతుందని ఎలా అనుకోగలం? 70వ దశకం చివర గుంటూరు గాంధీపార్క్‌లో కానూరి, రామారావులు ప్రదర్శించిన బుర్రకథ అనంతరం మొదటిసారి వారిరువురినీ కలిసి మాట్లాడా. 1990 నుండి 2004లో ముంబైలో జరి గిన వరల్డ్ సోషల్ ఫోరం దాకా అనేక సాంస్కృతిక వేదికల మీద రామారావుతో కలిసి ఎన్నో ప్రదర్శనల్లో పాల్గొన్నాను. రామారావు ప్రధాన కార్యదర్శిగా, ఉదయ్ కార్యదర్శిగా, చిన్న విమల, గోరటి వెంకన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉండిన ఒక అరుణోదయకు నేను అధ్యక్షుడిగా ఉండిన కాల మది. గుంటూరు జిల్లా కాజ నుండి కర్నూలు జిల్లా వెలుగోడు, బొల్లవరం దాకా, నల్లగొండ జిల్లా నకిరేకల్లు నుండి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, గోదావరి ఖని తదితర చోట్ల అనేక శిక్షణా శిబిరాలలో రామారావుతో కలిసి మేము పాల్గొన్నాం. నంద్యాల ఎంపీ స్థానంలో 1991 చివర, పీవీ నరసింహారావు పోటీ చేసినప్పుడు, అప్పటికే ఆయన ప్రధానిగా డంకెల్ ప్రతిపాదనలపై సంత కంపెట్టి, సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు దేశాన్ని లోబరిచినందుకు నిరసనగా మేము ‘అప్పుల భారతం‘ అనే కళారూపాన్ని ప్రదర్శిస్తూ ప్రచారం చేశాం. దాని సూత్రధారుడు రామారావు. ప్రధాన పాత్రధారుణ్ణి. ‘పరమవీర నారసింహ మహరాజ్’ని నేను. నంద్యాల ఎంపీ స్థానం లోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు ప్రతి మండల కేంద్రంలో మండ్ల సుబ్బారెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతుగా మా ప్రదర్శన ఉండేది. నాటి ఉమ్మడి ఏపీలో దాదాపు 19 జిల్లాల్లో అప్పుల భారతం ప్రదర్శనలు ఇచ్చాం. ముంబైలో తెలుగువారున్న ప్రాంతాలలో రోజుకి రెండు మూడు ప్రదర్శనలు చొప్పున ఐఎఫ్టియు ఏర్పాటుకై గట్టి ప్రచారం చేశాం. 1993 సెప్టెంబర్‌లో లక్నో ‘మతోన్మాద వ్యతిరేక సదస్సు’లో ‘రామ జన్మభూమి కాదురో’ వీధి నాటకాన్ని, 1993 డిసెం బర్ నెలాఖరులో కోల్‌కతలో జరిగిన మావో శత జయంతి ముగింపు సభలో ‘ఎత్తిన జెండా దించకో య్’ అనే నిశ్చలన దృశ్యరూపకాన్నీ ప్రదర్శించాం. అరుణోదయ సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా శ్రీకాకుళం నుండి కరీంనగరం దాకా జిల్లా సంఘాల నిర్మాణం కొరకు కలసి పని చేశాం. నాలుగైదు పాటల క్యాసెట్ రికార్డింగ్‌లలో రామారావుతో కలిసి పాల్గొన్నాము. వాటిలో చుండూరు నరమేధం జరిగిన కొద్ది రోజుల్లోనే విజ యవాడ సువార్త వాణిలో రికార్డు చేసిన ‘దళిత పోరాట పాటలు’ మొదటిది. ఆ తర్వాత అంగడి చెన్నయ్యమీద ఒక పాటల క్యాసెట్టు, విశ్వ మోహన్ రెడ్డిమీద మరొక పాటల క్యాసెట్టు రూపొందిం చాము. మా తంతి–తపాలా కార్మిక ఉద్యమ నాయకుడు పి.పురుషోత్తం రాజు మీద మరొక క్యాసెట్‌ని కూడా రూపొందించాము. దళిత పోరాట పాటలు లోని కేవై ఏసుదాసు రాసిన ‘చిందింది రక్తం చుండూరులోన’ పాటకు రామారావు, పల్లవికంటే ముందు ఆలపించిన సాకీ, నాటి చుండూరు విషాదాన్ని మన గుండెలను తాకేలా చేస్తుంది. రామారావు లాంటి అరుదైన గాయకుడు ప్రజా కళారంగానికి అంకితమై 45 సంవత్సరాలకు పైగా నిబద్ధతతో పని చేయడం వల్ల తెలుగునాట పీడిత ప్రజానీకాన్ని, విద్యార్థి యువజనులను విప్లవోద్యమం తన వైపుకి ఆకట్టుకోగలిగింది. ఏ రాగాన్నయినా, ఏ శృతిలోనైనా పాడగలిగిన నైపుణ్యం కలవాడు. ఒక్కొక్కసారి అతను రాగాన్ని ఎప్పుడు ఆపుతాడో, ఇంకెంతసేపు ఆలపిస్తాడోనని శ్రోతలకి గొప్ప ఉత్కంఠతని కలిగించే విధంగా ఉండేది. ఒకసారి నేను తనతో మాట్లాడుతూ మిమ్మల్ని నడిపించిన జీవశక్తులు రెండు అని చెప్పాను. అందులో కళాశక్తి కానూరిది అయితే, జీవన గమనాన్ని నడిపించిన శక్తి జీవిత సహచరి అరుణమ్మది అన్నాను. 45 ఏళ్ల పాటు తన జీవితాన్ని విప్లవోద్యమానికి, ప్రజా సాంస్కృతిక కళా రంగాలకు అంకి తం చేసి, పాలకుల వ్యామోహాల వలలో చిక్కుకోకుండా, ఆఖరి శ్వాస దాకా ప్రజలకే తన కళా ఉద్యమ నైపుణ్యాలను అంకితం చేసిన అరుణోదయ రామారావు మృతికి నివాళులర్పిస్తున్నాను. దివికుమార్ వ్యాసకర్త అధ్యక్షుడు, జనసాహితి మొబైల్ : 94401 67891 -
గుండెపోటుతో అరుణోదయ రామారావు మృతి
-
కొత్త కలెక్టర్ నివాస్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కలెక్టర్ మళ్లీ మారారు.ఈ నెల9నే బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం.రామారావు రెండు వారాలు కూడా గడవక ముందే బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయవాడమున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న జె.నివా స్ను నియమించారు. రామారావును విజయవాడకు బదిలీ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం 409 జీఓను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. నివాస్ డైరెక్ట్ ఐఏఎస్ కేడర్‌కు చెందిన ఉద్యోగి. ఆయన గతంలో జేసీగాను, ఇతర హోదాల్లో పనిచేశారు. అయి తే రామారావు బదిలీ జిల్లాలో చర్చనీయాం శంగా మారింది. ఎన్నికల సమయంలో ఇప్పటికప్పుడు ఇద్దరి కలెక్టర్లను మార్చడం రాష్ట్ర ప్రభుత్వం అస్థిరత్వానికి నిదర్శనమనే వ్యాఖ్య లు వినిపిస్తున్నాయి. అయితే రామారావు చు రుగ్గా లేరని, ఎన్నికల సమయంలో ఆయన తర్వాత కేడర్‌లో ఉన్న ఉద్యోగులు రామారా వును డామినేట్ చేస్తారని, అందుకే ఆయనను బదిలీ చేశారనే ప్రచారమూ ఉంది. ఇటీవల జి ల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు కూ డా బదిలీపై ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. -
ట్యాంపర్ రామారావు మళ్లీ అరెస్టు
సాక్షి, విశాఖపట్నం/భీమునిపట్నం: ట్యాంపరింగ్‌కు పాల్పడిన మాజీ తహసీల్దార్ బీటీవీ రామారావు మరోసారి కటకటాలపాలయ్యారు. అడ్డగోలుగా రికార్డులను ట్యాంపర్ చేసి వందల వేల కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతమయ్యేందుకు కారణమైన ఈయన రాజకీయ పలుకుబడితో తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేయించుకోవడమే కాదు.. ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి విశాఖలోనే వరుసగా మూడు సార్లు పోస్టింగ్ పొందారు. అయితే ‘మా కొద్దీ అధికారి’అంటూ జిల్లా అధికారులు తిప్పి పంపగా ఎన్నికల వంకతో శ్రీకాకుళంలో పోస్టింగ్ పొందారు. నేడో రేపో బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో మరో కేసులో మరోసారి జైలు పాలయ్యారు. భీమిలి తహసీల్దారుగా పనిచేసిన సమయంలో రికార్డుల ట్యాంపరింగ్‌లతో పాటు పలు అవకత వకలకు పాల్పడగా అరెస్టయిన సంగతి తెలిందే. కాగా తాజాగా మరో కేసులో ఆయన మళ్లీ అరెస్ట్ కావడం కలకలం రేపుతోంది. విశాఖలో ఉంటున్న రామారావును భీమిలి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసు వివరాలను భీమిలి సీఐ ఎం.వెంకటనారాయణ శుక్రవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. విశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న బడే నరసింహారావు 2007లో చేపలుప్పాడులోని సర్వే నంబర్ 31/7లో 30 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. అడంగల్, వన్–బీ, పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ పొందారు. 2016 వరకు రెవెన్యూ రికార్డులన్నింటిలోనూ ఈ భూమి ఆయన పేరు మీదే ఉండేది. 2016 జనవరి 12న కారి సత్తెన్న పేరిట మారిపోయింది. సత్తెన్న చనిపోయాడంటూ కొద్ది రోజులకు వారి కుమారులు కారి అప్పారావు, ఆనంద్‌ల పేరిట అడంగల్, 1బీలు మార్చారు. వాటిని భీమిలి కోర్టులో సమర్పించి మేజిస్ట్రేట్‌ను కూడా తప్పుదారి పట్టించి 2017 డిసెంబర్లో తమకు అనుకూలంగా ఆర్డర్స్ పొందారు. ఆ వెంటనే ఆ భూమిలో భారీ నిర్మాణాలు చేపట్టడంతో పాటు విద్యుత్ కనెక్షన్ తీసుకుని, వారి పేరిట ఇంటి పన్నులు కూడా చెల్లించారు. అయితే తనకు జరిగిన అన్యాయాన్ని నరసింహారావు స్థానిక రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యల్లేవు. చివరకు అప్పటి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆశ్రయించగా ఎస్డీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విచారణలో బీటీవీ రామారావు తహసీల్దార్‌గా ఉన్న సమ యంలో రికార్డులు ట్యాంపర్ చేసి పేర్లు మార్చేసినట్టుగా నిర్ధారించారు.ఆ మేరకు కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. దాన్ని ఆధారంగా చేసుకుని బీటీవీ రామారావుపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేస్తూ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. గ్రీవెన్స్‌లో వినతితో కదలిక 2018 డిసెంబర్ 27న ఈ స్థలానికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఇక్కడ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఉద్దేశ పూర్వకంగా రికార్డులు మార్చిన బీటీవీ రామారావుతో పాటు తన భూమిలోకి చొరబడిన కారి అప్పారావు, ఆనంద్‌లపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలేదంటూ ఈ నెల 21న గ్రీవెన్స్‌లో కలెక్టర్ కాటంనేని భాస్కర్ దృష్టికి నరసింహారావు తీసుకెళ్లారు. పది రోజుల్లో ఫ్రెష్ అడంగల్, వన్‌బీ ఇచ్చి, ఈ మేరకు తనకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అంతే కాకుండా రికార్డులను ట్యాంపర్ చేసిన రెవెన్యూ అధికారులు, కబ్జాకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు సూచించారు. కాగా క్రైం నంబర్ 339/2018 కింద నమోదైన ఈ కేసులో బీటీవీ రామారావు చేసిన తప్పిదం వల్లనే ఇదంతా జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు రామారావుతో పాటు కారి అప్పారావు, కారి ఆనంద్ తదితరులపై సెక్షన్లు 465, 468, 4 71 కింద కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు శు క్రవారం ఉదయం విశాఖలోని అక్కయ్యపాలెం నందగిరినగర్‌లో ఉంటున్న రామారావు నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. భీమిలి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్టుగా సీఐ తెలిపారు. -
చంద్రబాబు ఆస్తులపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ ఆస్తులపై ఫిర్యాదు దాఖలైంది. ఆయన కుటుంబ ఆస్తులు, కంపెనీల ఆదాయంపై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్ఓసీ)కు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. అమాంతంగా పెరిగిన చంద్రబాబు కుటుంబ ఆస్తులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. హెరిటేజ్ ఫ్రెష్‌కు చెందిన 14 కంపెనీల్లో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ద్వారా దర్యాప్తు జరిపించాలని రామారావు తన ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు స్వీకరించిన ఆర్ఓసీ తదుపరి చర్యలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు అని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) ఈ ఏడాది ఫిబ్రవరిలో వెల్లడించింది. ఆయన ఆస్తులు రూ. 177 కోట్లుగా ఏడీఆర్ పేర్కొంది. చంద్రబాబు వ్యక్తిగత ఆస్తులు కేవలం రూ. 34 లక్షలు మాత్రమేనని ఆయన కుమారుడు నారా లోకేశ్ గతంలో ప్రకటించారు. తనకు రూ. 25.25 కోట్లు, బ్రాహ్మణి ఆస్తి రూ. 25 కోట్లు, తల్లి భువనేశ్వరి పేరుతో రూ. 25 కోట్ల ఆస్తులున్నట్టు వెల్లడించారు. విచిత్రం ఏమిటంటే చంద్రబాబు మనవడు దేవాన్ష్ పేరుతో మాత్రం రూ. 11.54 కోట్ల ఆస్తులున్నాయి. -
ఎన్టీఆర్ పేరుతో ఆడేసుకుంటున్నారు..!
నందమూరి వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ఎన్టీఆర్... తాతకు తగ్గ మనవడిగా వెండితెర మీద సత్తా చాటుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్టీఆర్ తన పేరును నందమూరి తారక రామారావుగానే తెర మీద వేసుకుంటూ వస్తున్నాడు. అయితే తాజాగా రాజమౌళి సినిమా కోసం మాత్రం ఎన్టీఆర్ పేరును రామారావు అని మాత్రమే వేశారు. రాజమౌళి, రామ్‌చరణ్‌ల పేరుతో రైమింగ్ కలిసేలా ఎన్టీఆర్ పేరును రామారావు అని వేశారు. ముగ్గురి పేర్లు కలిసేలా ఆర్ఆర్ఆర్ (#RRR) అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. తాజాగా మరో సినిమా కోసం ఎన్టీఆర్ పేరును కట్ చేసి వాడేస్తున్నారు. ఎన్టీఆర్‌ను సన్నిహితులు తారక్ అని పిలుస్తుంటారు. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం ఎన్టీఆర్ పేరు తారక్ అని వాడేస్తున్నారు. రాజమౌళి సినిమా తరహాలో టీటీటీ (#TTT) అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్ల పేర్లతో కలిసేలా ఎన్టీఆర్ పేరు తారక్ అని వేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైన విషయాన్ని తెలియజేస్తూ టీటీటీ అంటూ ట్వీట్ చేశాడు. #TTT 👍🏽#tarak#trivikram #thaman Compositions started today ♥️✨💪🏼 — thaman S (@MusicThaman) 25 March 2018 The much awaited confirmation you all have been waiting for since November 18th 2017... Its OFFICIAL.. The Massive Multi Starrer is ON!#RRR .. It's not the TITLE.. Just the TITANS coming together! @ssrajamouli @tarak9999 #RamCharan https://t.co/PTENUB7pwV — RRR Movie (@RRRMovie) 22 March 2018 -
సృష్టియొక్క నాటకరంగంలో నీవు ఒక పాత్రవు, నేను ఒక పాత్రను
పొట్లపల్లి రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా పాలపిట్ట ప్రత్యేక సంచిక వెలువరించింది. ఇందులో పొట్లపల్లి సాహిత్యాన్నీ, వ్యక్తిత్వాన్నీ తెలియబరిచే 22 వ్యాసాలున్నాయి. ‘పేరు తెచ్చుకోవాలనుకునే రచయితకు ఒక పథకం వుంటుంది. తన మనసు చెప్పినట్లు రాసుకుంటూ పోయిన రామారావుకు అట్లాంటి పథకం ఏదీలేదు. కనుక అన్ని ప్రక్రియలను, ఏ ప్రక్రియలోకి చేర్చాలో తెలియని పద్ధతి రచనలు కూడా రాసుకుంటూ పోయారు’ అని పొట్లపల్లి ఏ విధంగా ప్రత్యేకమైన రచయితో విశ్లేషించారు అమ్మంగి వేణుగోపాల్. రామారావు కాంగ్రెస్ స్వాతంత్య్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. జైలుక్కూడా వెళ్లారు. కానీ ఆ ప్రచారానికి ప్రాముఖ్యత ఇవ్వని మనిషని టి.శ్రీరంగస్వామి అంటారు. పొట్లపల్లి రాసిన సర్ బరాహి, పగ, పాదధూళి, న్యాయం నాలుగు నాటికల్లోనూ ‘వస్తువైవిధ్యం, చెప్పడంలో డొంకతిరుగుడులేని సూటిదనం ప్రస్ఫుటంగా కనిపిస్తా’యని తాటికొండల నరసింహారావు వివరించారు. ‘నా జీవన సహచరీ! ఈ సృష్టి ఏనాడు ఏర్పడ్డదో ఆనాడే నీవు నేను ఈ భూమిపై జన్మించాము. స్త్రీ ధర్మం నిర్వహిస్తూవున్నా నీవు స్త్రీవి కావు పురుషధర్మం నిర్వహిస్తూవున్నా నేను పురుషుడినీ కాను. సృష్టియొక్క నాటకరంగంలో నీవు ఒక పాత్రవు, నేను ఒక పాత్రను’... ఇలా స్ట్రే రైటింగ్స్, మ్యూజింగ్స్లా కనబడే ‘చుక్కలు’– ‘పసుపురాసిన గడపకు కుంకుమబొట్ల నద్దినట్లు భావార్థ శబలతతో, తాత్విక గాఢతతో శోభాయమానంగా’ ప్రజ్వలిస్తాయని థింసా విశ్లేషించారు. ఉర్దూ కవిత్వం తనను వయసు పైబడ్డాక వరించిందని చమత్కరించిన పొట్లపల్లి ‘జవానీ గుజర్ గయీ మేరీ సరాఫా బుఢాపా ఆగయా హై’ని ఉదాహరించారు నాగిళ్ల రామశాస్త్రి. ‘పట్టు పాగపై మరియొక పట్టు పాగ చుట్టినట్టుగా నీ పేరు తట్టునోయి’ అని తన పేరును గురించి చెప్పిన పద్యాన్ని గుర్తుచేసుకున్నారు దేవరాజు మహారాజు. వర్కింగ్ ఎడిటర్: కె.పి.అశోక్ కుమార్; పేజీలు: 82(ఏ4 సైజ్); వెల: 30; ప్రతులకు: పాలపిట్ట బుక్స్, ఫ్లాట్ నం. 2, బ్లాక్ –6, ఏపీహెచ్, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్–44. ఫోన్: 040–27678430 -
ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలి
ఓసీ సంఘం రాష్ట్ర ఇన్చార్జి రామారావు టవర్‌సర్కిల్: రాజకీయ పార్టీల నాయకులు ఓటుబ్యాంకు రాజకీయాలు మానుకుని పేదలందరికీ సమన్యాయం చేసేవరకూ ఓసీ సంక్షేమ సంఘాల సమాఖ్య నిరంతరం పోరాటం చేస్తుందని ఓసీ సంక్షేమ సంఘాల తెలుగు రాష్ట్రాల ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఇన్చార్జి పోలాడి రామారావు పేర్కొన్నారు. ఈనెల 27న నల్లగొండలో నిర్వహించే ఓసీ మహాగర్జన సభ ఏర్పాట్లపై జిల్లా ఓసీ ఐకాస సంఘాల నాయకులతో నగరంలోని సంఘం కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు విద్య, ఉద్యోగాల్లో అమలవుతున్న రిజర్వేషన్లను అగ్రకుల నిరుపేదలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఏడు దశాబ్దాలుగా 80 శాతం ఓసీ నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందక విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్ర అన్యాయానికి గురై దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లకు ముగింపు పలకాల్సిన రిజర్వేషన్లను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకపక్షంగా ఏటేటా పెంచుతూ అగ్రకుల పేదలను తీవ్రంగా నిర్లక్ష్యానికి గురిచేస్తున్నాయన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, కుల, మతాల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా విద్య, ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు వర్తింపజేసి సమన్యాయం జరిపేందుకు ప్రత్యేక చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల రిజర్వేషన్లు కల్పించే విధానాన్ని రద్దు చేసి ప్రతిభ, సీనియార్టీ ఆధారంగా పదోన్నతులు కల్పించాలన్నారు. రూ.వెయ్యి కోట్లతో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించి స్వయం ఉపాధి పథకాల కోసం 80 శాతం రాయితీతో రుణాలు అందించాలన్నారు. ఓసీ ఐకాస సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 27న నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఓసీ మహాగర్జన సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. -
హైదరాబాద్ లో విద్యార్థి అదృశ్యం
ఓ విద్యార్థి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన రామారావు కుమారుడు వినయ్‌కుమార్(18) కూకట్‌పల్లిలోని ఓ కళాశాలలో విద్యానభ్యసిస్తున్నాడు. ఈ నెల 11న కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
టైలరింగ్ నేర్చుకునేందుకు వెళ్లి యువతి అదృశ్యం
మూడున్నర నెలల క్రితం ఫిలింనగర్‌లోని బీజేఆర్ నగర్ బస్తీలో అదృశ్యమైన సంతోష్‌కుమారి(20) జాడ ఇంకా తెలియకపోవడంతో తల్లిదండ్రులు కె. రామారావు, చంద్రావతి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తప్పిపోయిన తమ కూతురిని వెతికిపెట్టాలంటూ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులను మరోమారు ఆశ్రయించారు. ఏప్రిల్ 12వ తేదీన సంతోష్‌కుమారి టైలరింగ్ నేర్చుకోవడానికి సమీపంలోని లేడీస్ టైలర్ శేఖర్ షాప్‌నకు వెళ్లింది. అయితే, రాత్రి 7 దాటినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. అయితే తన కూతురిని లేడీస్ టైలర్ శేఖర్ బలవంతంగా తీసుకెళ్లాడని అతడి కుటుంబసభ్యులను విచారిస్తే ఆమె జాడ దొరుకుతుందని తండ్రి రామారావు మంగళవారం ఎస్ఐ గోవర్ధన్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సంతోష్‌కుమారి కోసం గాలింపు చేపట్టారు. -
అసలేం జరిగింది..
పట్టుకోండి చూద్దాం పొద్దుటి పూట ఆ వార్త దావనాలంలా వ్యాపించింది.... ‘రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు’ ‘ఎందుకు చేసుకున్నాడు?’ అనే ప్రశ్నకు ఒకదానికొకటి పొంతనలేని సమాధానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని... ‘పిల్లలిద్దరూ ఫారిన్లో సెటిలయ్యారు. భార్య చనిపోయింది. ఈ ఒంటరితనాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు’ ‘రామారావు ముక్కోపి. తనకు తాను హాని చేసుకుంటాడు. ఎవరితోనైనా గొడవ పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడేమో!’ ‘పరులకు మేలు చేయాలనే స్పృహ రామారావులో ఎక్కువ. తన ఆస్తినంతా అనాథ శరణాలయాలకు రాస్తానని పిల్లలకు చెప్పడంతో వాళ్లు మండిపడ్డారు. పిల్లలకు రామారావుకి పెద్ద గొడవ జరిగింది. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఆత్మహత్య చేసుకున్నారు’ ‘రామారావుకి డ్రింక్ తీసుకునే అలవాటు ఉంది. ఆ సమయంలో ఆయన ఏం చేస్తారో ఆయనకే తెలియదు. బాగా తాగిన మత్తులో ఆత్మహత్య చేసుకుని ఉంటాడు’ ‘నిన్న రాత్రి ఆయనతో చాలాసేపు మాట్లాడాను. గొంతులో ఎక్కడా బాధ కనిపించలేదు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఏమైందో ఏమో... నాకైతే షాకింగ్‌గా ఉంది’ ‘ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు రామారావు... ఎవరైనా డిప్రెషన్లో ఉంటే నాలుగు మంచి మాటలు చెప్పి వారిని ఉత్తేజితులను చేస్తాడు. అలాంటి మనిషి ఆత్మహత్య చేసుకున్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది’ రామారావు ఎందుకు ఆత్మహత్య చేసుకొని ఉంటాడు? ఒంటరితనమా? పిల్లలతో తగాదా? మద్యమా? రామారావు కిటికీ నుంచి దూకి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఇన్స్పెక్టర్ నరసింహ సంఘటన స్థలికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్లను కొన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ‘‘ఈ ఇంట్లో ఎందరు ఉంటారు?’’ ‘‘రామారావుగారితో పాటు రాజు అనే పనిమనిషి ఉంటాడు’’ ‘‘రాజు ఎక్కడ?’’ ‘‘కొద్ది రోజుల క్రితమే... చెప్పాపెట్టకుండా పని మానేశాడు’’ ‘‘రాజు ఎలాంటి వాడు?’’ ‘‘రామారావుకి నమ్మినబంటులా ఉండేవాడు. వాడు ఉన్నప్పుడు ఈ ఇల్లు కాస్త సందడిగా ఉండేది’’ ఇన్స్పెక్టర్ నరసింహ బిల్డింగ్ అంతా కలియతిరిగి చూస్తున్నాడు.... ఆ బిల్డింగ్‌లో బాల్కానీలు లేవనే విషయం అర్థమైంది. ‘అందుకే కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటాడు’ అనుకున్నాడు మనసులో. బిల్డింగ్‌లో ఉన్న కిటికీలను పరిశీలిస్తూ ఒక రౌండ్ వేశాడు. రామారావు శవాన్ని, చుట్టూ పరిసరాలను మరోసారి పరిశీలించాడు. అప్పుడు... ‘రామారావుది ఆత్మహత్య కాదు. హత్య’ అని ప్రకటించాడు. కారణమేమిటో కూడా చెప్పాడు. అక్కడ ఉన్నవాళ్లు ఆశ్చర్యంతో, షాక్‌తో నోరెళ్లబెట్టారు! ఇప్పుడు చెప్పండి... రామారావుది ఆత్మహత్య కాదని... హత్యేనని ఇన్స్పెక్టర్ నరసింహ ఎలా కనిపెట్టాడు? Ans: ఇన్స్పెక్టర్ నరసింహ బిల్డింగ్‌లోని పెద్ద కిటికీతో సహా అన్ని కిటికీలను పరిశీలించాడు... అయితే ఏ కిటికీ కూడా తెరుచుకొని లేదు. అన్ని కిటికీలు మూసే ఉన్నాయి. ఒకవేళ పెద్ద కిటికీ నుంచి రామారావు దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటే... ఆ కిటికీ తలుపు తెరుచుకొని ఉండేది కదా! -
బంధువుల ఇంటికే కన్నం వేశాడు..!
ఇంట్లో ఉన్న వారంతా శుభకార్యానికి హాజరుకాగా దగ్గరి బంధువే చోరీకి పాల్పడ్డ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎన్.రామారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. బండ్లగూడ ఇస్మాయిల్ నగర్‌కు చెందిన సయ్యద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 3వ తేదీన రాత్రి జహంగీరాబాద్‌లోని కూతురు ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వెళ్లాడు. కాగా, ఈ విషయాన్ని గమనించిన ఇబ్రహీం అల్లుడి తమ్ముడు తాజుద్దీన్(27) దొంగతనానికి ప్లాన్ వేశాడు. ఇంటి తాళం పగులకొట్టి, అల్మారాలో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.21,300 నగదు చోరీ చేశాడు. ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికి వెళ్లి, బంధువులతో కలిసి పోయాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వెళ్లి చూసిన ఇబ్రహీం దొంగతనం జరిగిందని గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా తాజుద్దీనే నిందితుడని తేలింది. దీంతో అతడిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు స్వాదీనం చేసుకున్నారు. కాగా, ఇబ్రహీం కూడా తన ఇంట్లో నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ.1.2 లక్షల నగదు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అది వట్టిదేనని తేల్చటం కొసమెరుపు. -
ఆటో నుంచి జారిపడి గిరిజనుడి మృతి
పాడేరు మండలంలోని కొత్తపొలం గ్రామం వద్ద ప్రమాదవశాత్తూ ఆటోలో నుంచి జారిపడి మర్రి రామారావు(40) అనే గిరిజనుడు మృతిచెందాడు. కొత్తపొలం గ్రామం నుంచి సొంతూరు ముంతమామిడి గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
18న లె జండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు 20వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 18న లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణలోని 200 ప్రాంతాల్లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం చేసి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌పై 40 మంది సెలబ్రిటీల ప్రచారంతో కూడిన వీడియోలను ప్రదర్శించారు. సమావేశంలో ట్రస్ట్ సీఈవో టి. విష్ణువర్ధన్ పాల్గొన్నారు. -
తప్పతాగి పాఠశాలకు..
పలాస రూరల్: భావిభారత పౌరులను దిద్దవలసిన ఓ ప్రధాన ఉపాధ్యాయుడు తప్పతాగి పాఠశాలకు వచ్చాడు. మద్యం మత్తులో పాఠశాలలో వీరంగం సృష్టించి చివరికి సస్పెండ్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే...గరుడుఖండి పంచాయతీ పాత జగదేవుపురం ప్రాథమిక పాఠశాలలో దాసరి రామారావు ఆరేళ్లుగా ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. రోజూ తప్పతాగి పాఠశాలకు వస్తున్నాడు. తరగతి గదిలోనే మద్యం మత్తులో జోగుతుండడం నిత్య కృతమయింది. ఈ వ్యవహారంపై విద్యాశాఖాధికారులకు విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ రామారావు రాజకీయ పలుకుబడి చూపించి కుటుంబ సభ్యులతో అధికారుల కాళ్లవేళ్లా పడి బతిమాలి అధికారుల చర్యల నుంచి తప్పించుకుంటున్నాడు. గతంలో ఇలా పలుమార్లు జరిగింది. శనివారం కూడా తాగి వచ్చి తరగతి గతిలో వీరంగం సృష్టించడంతో గ్రామస్తులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఎంఈవో సుడియా సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వచ్చి పరిశీలించిన ఎంఈవో పరిస్థితిని డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవో కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో పాఠశాలలో 40 మంది విద్యార్థులు చదువుకునేవారని.. రామారావు చేష్టలతో సగం మంది విద్యార్థులు బడి మానేశారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల్లో చదివించే స్థోమతలేక ప్రభుత్వ బడికి తమ పిల్లలను పంపుతున్నాం.. ఓ హెచ్ఎం ఇలా తాగి వచ్చి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే పిల్లలు ఎలా చదువుకుంటారు.. ఎలా బాగుపడతారని అని పశ్నిస్తున్నారు. -
డీలర్లను వేధిస్తే ఆందోళనలు తప్పవు
వైఎస్ఆర్సీపీ నేత ఎల్ఎం కళ్యాణదుర్గం : అధికారపార్టీ నేతలకు తలొగ్గి చౌక దుకాణం డీలర్లను వేధింపులకు గురిచేస్తే సహించబోమని, ఆందోళనలు చేపడతామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి తెలిపారు. కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకున్న వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైన డీలర్లను తనిఖీల పేరుతో వేధించడం అన్యాయమన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఆర్డీవో రామారావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఎల్ఎం మాట్లాడుతూ అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు అధికారులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇట్లంపల్లి డీలర్ అనంతమ్మ చౌకడిపోను తొమ్మిదిసార్లు సీజ్ చేయడం ఏం న్యాయమని ప్రశ్నించారు. వేధింపులు తాళలేక డీలర్లు ఆత్మహత్యలకు పాల్పడితే అధికారులతో పాటు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పట్టణంలో రోడ్ల విస్తర్ణ విషయంలో అధికారులు, మునిసిపాలిటీ పాలక వర్గం చిత్త శుద్ధితో వ్యవహరించాలన్నారు. రోడ్ల విస్తరణ విషయంలో అన్ని వర్గా వారితో సంప్రదించకపోతే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి భవన యజమానులతో కలిసి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని తీసుకొచ్చి రోడ్ల విస్తరణ చేపట్టాలన్నారు. ఎఫ్ఎంబీ పేరుతో సర్వేలు ఒక్కొచోట ఒక్కో రకంగా ఆక్రమణలను గుర్తించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. నియోజకవర్గంలో చెరువులను నింపే కార్యక్రమం పై ప్రజాప్రతినిధులు మాటలకే పరిమితమయ్యారన్నారు. అనేక చెరువులు మరమ్మతులకు నోచుకోలేదని, వర్షపు నీరు మొత్తం వృథా అయ్యే పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ రఘునాథ్‌రెడ్డి, వైఎస్స్రాసీపీ మండల కన్వీనర్ దొణస్వామి, పట్టణ కన్వీనర్ జయరాం పూజారి, నాయకులు కిరణ్‌చౌదరి, రోషన్, ఒంటిమిద్ది ఎర్రిస్వామి, హనుమంతరాయగౌడ్, బొమ్మయ్య, వెంకటేశులు, తదితరులు పాల్గొన్నారు. -
ఆందోళన అవసరం లేదు!
విజయనగరం కంటోన్మెంట్ : స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, అప్రమత్తం గా ఉన్నామని స్వైన్ ఫ్లూ నివారణ రాష్ట్ర నోడల్ అధికారి జి. వాసుదేవరావు అన్నారు. శనివారం ఆయన జిల్లాలో ని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం సాయంత్రం ఇన్చార్జి కలెక్టర్ బి. రామారావుకు పరిస్థితి వివరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో చికిత్స పొందుతున్న భోగాపురానికి చెందిన మహిళ కో లుకుంటోందన్నారు. ఆమెకు ఏ ప్రమాదమూ లేదని చెప్పారు. ఆమెతో పాటు ప్రయాణించిన సహ ప్రయాణికులను గుర్తించి పరీక్షలు నిర్వహించామన్నారు. అలాగే ఆమె బంధువులకు కూడా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఎవరికీ స్వైన్ ఫ్లూ లక్షణాలు లేవన్నారు. భో గాపురం మండలంలో 8 క్లస్టర్ బృందాలను గుర్తించి 24 మందితో సర్వే చేయించామన్నారు. ప్రతి ఒక్కరినీ పరీ క్షించామన్నారు. జిల్లా కేంద్రాసుపత్రిలో ఆరు పడకలు ఇందుకోసం సిద్ధం చేశామన్నారు. అలాగే రెండు వెంటిలేటర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎవరికైనా వ్యాధి సోకినట్టు అనుమానంగా ఉన్నా.. వెంటనే ఇక్కడ చేర్చేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నా రు. ప్రైవేటు ఆసుపత్రులకు ఎటువంటి అనుమానిత కేసులు వచ్చినా.. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. మాస్కులు సిద్ధం చేస్తున్నాం ఎన్-95 మాస్కులను కొనుగోలు చేస్తామని డీఎంహెచ్ ఓ స్వరాజ్యలక్ష్మి ఇన్చార్జి కలెక్టర్‌కు చెప్పారు. అలాగే ఇప్పటికే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లాలో అనుమానిత కేసులు లేవన్నారు. దాసన్నపేటలో మహిళ మృతికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారిస్తున్నామన్నారు. పరీక్షలు నిర్వహించలేదన్న విషయం తెలియడంతో మృతదేహాన్ని దహనం కాకుండా పూడ్చిపెట్టే విధంగా బంధువులను ఒప్పించామన్నారు. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న హోమియో మందులు స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రజల్లో భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. పట్టణంలోని హోమియో వైద్య శాలలన్నీ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా కేం ద్రంలో సుమారు పది హోమియో వైద్యశాలలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సీసాలో ఇద్దరు వ్యక్తులకు సరిపడే గు లికలను హోమియో వైద్యశాలల యజమానులు విక్రయిస్తున్నారు. ఇద్దరికి సరి పడ మం దులు రూ. 20 కాగా మ రికొన్ని చోట్ల రూ. 60 కూ డా లభిస్తున్నాయి. అదును బట్టి ధరలు కూ డా పెంచేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇతరుల బిడ్డను కాపాడి.. ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న అభాగ్యుడు
నదిలో కొట్టుకుపోయి చిన్నారుల మృతి చెన్నూర్: గోదావరిలో మునిగిపోతున్న ఓ చిన్నారిని పరుగున వెళ్లి కాపాడాడు ఆ తండ్రి.. తిరిగి వచ్చి చూడగా తన ఇద్దరు బిడ్డలు గల్లంతయ్యా రు. వెతికితే శవాలుగా మారి కనిపించిన ఉదం తం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో ఆదివారం జరిగింది. వివరాలు.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెంది న పేరాల రామారావు చెన్నూర్‌లోని ఓ వైన్స్‌లో పని చేస్తున్నారు. ఆదివారం చెన్నూరు సమీపంలోని గోదావరి వద్ద నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వత్రాలకు రామారావు, భార్య లావణ్య, ఇద్దరు కుమారులు సాయికృష్ణ(11) సాయి వర్షిత్(6)లు వెళ్లారు. పిల్లలు గోదావరిలో స్నానాలు చేస్తుండగా, వీరికి కొద్ది దూరంలో ఓ చిన్నారి నదిలో మునిగిపోతూ కనిపించాడు. దీంతో రామారావు వెళ్లి ఆ చిన్నారిని కాపాడాడు. తిరిగి వచ్చి చూడగా, తన ఇద్దరు కుమారులు కనిపించకుండా పోయారు. గాలించగా, ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. సాయికృష్ణ నాలుగో తరగతి, సాయి వర్షిత్ ఎల్కేజీ చదువుతున్నారు. -
పత్రికలే పట్టుగొమ్మలు
విజయనగరం మున్సిపాలిటీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు పట్టుగొమ్మలు వంటివని, వాటిలో పని చేసే వారంతా జిల్లాను మంచి మార్గంలో నడిపించాలని విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాసరావు సూచించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గురజాడ వంటి ఎందరో మహనీయులు నడయాడిన విజయనగరాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచాలని కోరారు. ప్రెస్ ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోలు పోలీసులకు కీలకంగా ఉపయోగపడతాయన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ మాట్లాడుతూ ప్రజల నాడి తెలుసుకునే వైద్యులు జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లని వాఖ్యానించారు. ప్రజల అవసరాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా అధికారులమైన తాము వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సాహితీరాజధానిగా వెలుగొందుతున్న విజయనగర కీర్తిని కొనసాగించే బాధ్యత పత్రికలపై ఉందన్నారు. అనంతరం జిల్లాలో ఫొటోగ్రఫీ సేవలందిస్తున్న కాండ్రేగుల రామారావు, జీవీఎస్ఆర్ మూర్తి, ఎం.సీతారామ్, పి.రాజేశ్వరరావు, డి.సత్యనారాయణమూర్తి, కాళ్ల శ్రీనివాసరావు, జంపు నాయుడు, గిడిజాల శ్రీను, ఎ.కిశోర్, ఆర్ దాలిరాజులను ఘనంగా సత్కరించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు జరజాపు శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్‌ఎస్‌వీ ప్రసాదరావు, మహాపాత్రో, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి సముద్రాల గురుప్రసాద్ పాల్గొన్నారు. -
అన్నీ పంచేసుకుంటున్నారు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘ డబ్బులు తీసుకుని పెద్దాస్పత్రి పారిశుద్ధ్యం కాంట్రాక్ట్‌ను వేరొకరికి అప్పగిం చారు. జేఎల్ఎం, విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు. అంగన్వాడీ సరుకుల కాంట్రాక్ట్ విషయంలోనూ అదే చేశారు. ఏదొచ్చినా పంచేసుకుంటున్నారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు వర్కులిచ్చి, కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు.’ అంటూ తోటి టీడీపీ నేతల తీరుపై ఆరోపణలు గుప్పిస్తూ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు వద్ద విజయనగరం పట్టణం 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావు దుమ్మెత్తిపోశారు. అంతటితో ఆగకుండా అశోక్ బంగ్లాలో తిష్ఠవేసిన ఓ రాజు కాంట్రాక్టర్‌గా అప్పటి షాడో నేత, ఇతర కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కై కోట్లాది రూపాయ ల వర్కులు చేశారని, అడ్డగోలుగా బిల్లులు చేసుకున్నారని, ఇప్పుడు కూడా అదే దందాను సాగిస్తున్నారని, దారికి రాని ఇంజినీరింగ్ అధికారులను బదిలీ చేయిస్తానంటూ బెదిరిస్తున్నారని కూడా అశోక్ వద్ద గట్టిగా విన్పించారు. ఇలాంటి వాటిని అరికట్టి, పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలకు ఉపాధి కల్పించే పనులు చేపట్టాలని అశోక్‌కు విన్నవించారు.దీంతో అశోక్ అవాక్కయ్యారు. సోమవారం ఉదయం బంగ్లాలో పట్టణంలోని కౌన్సిల ర్లతో అశోక్ గజపతిరాజు సమావేశమయ్యారు. ఈ సం దర్భంగా కౌన్సిలర్లు తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, వీధి లైట్లు వెలగడం లేదని తదితర సమస్యలను ఆయ న దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు విడుదల చేయించాలని, పార్టీ కౌన్సిలర్లకు వర్కులొచ్చేలా నిధులు విడుదల చేయించాలని కోరారు. ఈ సందర్భంగా 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావు మధ్యలో జోక్యం చేసుకుని మన పార్టీ నేతల తీరు బాగోలేదని, వారి తీరు దారుణమని ఏకిపారేశారు. ఇప్పుడు వాటి కోసం మాట్లాడొద్దని చెప్పినా ఆగకుం డా నేతల తీరును దుయ్యబట్టారు. అలాగే కార్యకర్తలు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టాలని, గతంలో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయంటూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వా టిని రద్దుచేసి ఆపార్టీ కార్యకర్తలకు ఇప్పించుకున్నారని, ఇప్పుడలాగే పలు కాలనీల్లో ఖాళీగా ఉన్న స్థలాలను రద్దుచేసి టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, వీధిలైట్ల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అశోక్ మాట్లాడుతూ అంతా నిబంధనల మేరకు జరుగుతుం దని, మార్గదర్శకాలుంటాయని తన సహజ ధోరణిలో భూమిగుండ్రంగా తిరుగుతుందంటూ చెబుతుండగా రామారావు ఆవేదనకులోనై సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటికొచ్చేశారు. అంతటితో ఆ గకుండా లోపల సమావేశం జరగుతుండగానే బయట పెద్ద పెద్ద కేకలు వేసి నేతలను తీరును ఆక్షేపించారు. ఇలాగైతే సామా న్య కార్యకర్తలకు న్యాయం జరగదని, పదవులొచ్చాయ ని నాయకుల ఆనందంతో కష్టపడిన కార్యకర్తలను ప ట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తాని కి జరుగుతున్న భాగోతాలను వివరిస్తూ టీడీపీనేతలపై తోటి పార్టీ నేత, కౌన్సి లర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. ఆయనంతే అని కొందరు తేలికగా తీసుకున్నా, మరి కొందరు అవన్నీ ఆలోచించాల్సిన అంశాలే అంటూ గుసగుసలాడుకోవడం కన్పించింది. -
రైతు బజార్ల ద్వారా ఇక నిత్యావసరాలు
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని రైతు బజార్ల ద్వారా నిత్యావసర సరుకులను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో పా టు జిల్లాలోని ఇతర వ్యాపారులు కూడా సహకరించాలని జేసీ రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మి నీ కాన్ఫరెన్స హాల్లో శుక్రవారం సాయంత్రం జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన వినియోగదార్ల సంఘాల ప్ర తినిధులు, వర్తక సంఘాలను నిత్యావసరాలను త క్కువ ధరలకే విక్రయించేలా ఒప్పించారు. ప్రజలకు అందుబాటు ధరలకు నిత్యావసర సరుకులను అందించాలన్నారు. బియ్యంతో పాటు మంచినూనె, పంచదార, చింతపండు, పప్పులు తదితర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడానికి అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. పట్టణంలోని మూ డు రైతుబజార్లతో పాటు పార్వతీపురం రైతుబజార్లో కూడా శనివారం నుంచి అందుబాటు ధరల్లో నిత్యావసరాలు విక్రయించాలన్నారు. వర్తక సంఘాల ఒప్పం దం మేరకు కిలో రూ.70 నుంచి 80 రూపాయలు పలుకుతున్న కందిపప్పు కిలో 67 రూపాయలకు విక్రయిస్తామన్నారు.అదేవిధంగా *90 పలుకుతున్న మినపగుళ్లను కిలో *75కు సరఫరా చేస్తామన్నారు. పెసరపప్పును కిలో *86కు ఇస్తామన్నారు. ఈ ధరలు వ్యాపారులు రైతుబజార్లకు విక్రయించగా వాటిని వినియోగదారులకు మహిళా సంఘాలు 50 పైసల మార్జిన్‌తో విక్రయిస్తారన్నారు. అలాగే పామాయిల్‌ను కిలో *58 కు విక్రయిస్తారన్నారు. టమోటాను *26కు, సన్నబి య్యం *30లకు విక్రయిస్తున్నామనీ, వీటిని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామన్నారు. బంగాళాదుంపల ధర అధికంగా ఉన్నప్పటికీ రెండు రోజుల్లో తగ్గే అవకాశముండటంతో వాటిని మినహాయించారు. చింతపం డు జీసీసీ ద్వారా *25కు సరఫరా అవుతోందనీ, దాన్ని విక్రయించడానికి వర్తకులు ముందుకు వస్తే వారికి మార్జిన్ మనీ అందిస్తామన్నారు. అలాగే ఎక్కువ ధర ఉన్న ఎండుమిర్చిని భద్రాచలం నుంచి తెప్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను కూడా సబ్సిడీపై అందిస్తున్నట్టు జేసీ తెలిపారు. జిల్లాలో ప్ర స్తుతానికి ఎరువుల కొరతలేదన్నారు. మార్క్‌ఫెడ్, ఇతర డీలర్ల ద్వారా కూడా ఎరువులు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 5,300 టన్నుల యూరియా, 4వేల టన్నుల డీఏపీ, 1300 టన్నుల ఎంఓసీ, 2200 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వరి విత్తనాలు కిలోకి *5, వేరుశనగ విత్తనాలు కిలోకు *15, పెసర, మినుము, కంది, పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందిస్తామన్నారు. ధరల నియంత్రణకు సహకరించి రైతుబజార్లలో విక్రయాలకు అంగీకరించిన వర్తక సంఘాలకు జేసీ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ జే వెంకటరావు, వ్యవసాయ శాఖ జేడీ డి.ప్రమీల, డీఎస్ఓ హెచ్వీ ప్రసాద్, పౌరసరఫరాల సంస్థ డీఎం రమేష్‌రెడ్డి, చాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు జి శివకుమార్, ఎంవీ చలం,పప్పులు, నూనెల వర్తక సంఘాల ప్రతినిధులు సంతోష్, కె.సతీష్, అనీష్, ఉల్లి వ్యాపార సంఘం ప్రతినిధి డి.రమేష్‌కుమార్, బియ్యం వర్తక సంఘ ప్రతినిధి పి.నాగేశ్వరరావు, ధరల నియంత్రణ కమిటీ సభ్యుడు జే.సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్యంనుంచి పార్టీ అధినేత దాకా
కామారెడ్డి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కామారెడ్డి ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. కేసీఆర్ తోబుట్టువుతోపాటు మేనమామలు ఈ ప్రాంతంలోనే ఉంటున్నారు. కేసీఆర్ పూర్వికులు కూడా దోమకొండ మండలం కోనాపూర్(పోసానిపల్లె)లో ఉండేవారు. దీంతో కేసీఆర్‌కు చిన్ననాటి నుంచి ప్రాంతంతో అనుబంధమేర్పడింది. కేసీఆర్ అక్కను దోమకొండ మండలం అంబారిపేటకు చెందిన న్యాయవాది రామారావ్‌కు ఇచ్చారు. కేసీఆర్ చిన్న వయసులోనే అక్క వివాహం కావడంతో అప్పటినుంచి ఆయన అంబారీపేటకు పలుమార్లు వచ్చివెళ్లారని వారి బంధువులు తెలిపారు. అంబారీపేట నుంచి వారి కుటుంబం కామారెడ్డికి మకాం మార్చాక ఇక్కిడికి చాలాసార్లు వచ్చివెళ్లారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో అక్క ఇంటికి, ఇతర బంధువుల ఇళ్లకు వచ్చివెళ్తుండేవారు. టీఆర్ ఎస్ పార్టీని స్థాపించాక కామారెడ్డి నియోజకవర్గం ఆ పార్టీకి పట్టుగొమ్మలా మారింది. దీంతో ఎన్నో పర్యాయాలు వచ్చారు. పార్టీ సభలు, సమావేశాలతోపాటు, టీఆర్ఎస్ సభల కోసం కూలి పనిలో భాగంగా కామారెడ్డిలో ఆయన కూలీగా పని చేశారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మొన్నటి ఎన్నికల ప్రచారం దాకా ఆయన కామారెడ్డి ప్రాంతంలో 20 పర్యాయాలు పర్యటించారు. ఈ ప్రాంతంలో ప్రజల జీవన విధానంతోపాటు, ప్రజలు పడుతున్న సమస్యలపై ఆయనకు అవగాహన ఉంది. నియోజకవర్గంలో ఎక్కడా సభలు, సమావేశాలు జరిగినా ఈ ప్రాంత ప్రజల కష్టాలు, కన్నీళ్లను గురించి మాట్లాడుతుండేవారు. దీంతో సీఎంగా ఎన్నికైన కేసీఆర్ వాటిపై దృష్టిసారిస్తారని ఇక్కడివారు భావిస్తున్నారు. కేసీఆర్‌పై ఎన్నో ఆశలు.. కామారెడ్డి ప్రాంతం గురించి పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ సీఎం పీఠంపై కూర్చున్న నేపథ్యంలో ఆయనపై ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సాగు, తాగునీటి కష్టాలు తీర్చేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తారన్న ఆశతో ఉన్నారు. అలాగే విద్య, వైద్యం వంటి వసతుల విషయంలో కూడా కేసీఆర్ చొరవ చూపుతారని భావిస్తున్నారు. అసంపూర్తిగా మిగిలిన *140 కోట్ల తాగునీటి పథకం, ప్రాణహిత-చేవెళ్ల పథకం పనులపై కేసీఆర్ దృష్టి సారించి వాటిని పూర్తి చేయించేందుకు చొరవ చూపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. -
పెద్ద సారొచ్చారు
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : చదువులమ్మ ఒడిలో ఉన్న జిల్లా విద్యాశాఖకు ఎట్టకేలకు పూర్తిస్థాయి డీఈవో సత్యనారాయణరెడ్డి నియామకమయ్యారు. గతంలో పూర్తిస్థాయి అధికారిగా పనిచేసిన అక్రముల్లాఖాన్ జనవరి 31న ఉ ద్యోగ విరమణ చేయడంతో సీనియర్ అధికారి రామారావును తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగ విరమణ నేపథ్యంలో అక్రముల్లాఖాన్ శాఖను పెద్దగా పట్టించుకోక పోవడంతోపాటు, తాత్కాలికంగా పనిచేసిన రామారావు కఠిన చర్యల వైపు అడుగు వేయకపోవడంతో విద్యాశాఖ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో పదో తరగతి ఫలితాలు ఊహించని రీతిలో చివరి స్థానం రాక తప్పలేదు. కొత్త డీఈవోకు సమస్యల మాల కొత్తగా వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారికి అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మారుమూల ప్రాంతంలో పాఠశాలలు ఎక్కువగా ఉండటంతోసమస్యలు కూడా అక్కడ ఎక్కువగానే ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. రెండేళ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియ నిలిచింది. సకాలంలో పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందకపోవడంతో సమయం వృథా అవుతోంది. పదో తరగతి వార్షిక పరీక్షలకు కొద్ది రోజుల ముందు డిప్యూటేషన్ ఇచ్చి ఆ తరగతి విద్యార్థులకు బోధించమంటూ అదనపు భారం ఉపాధ్యాయులపై వేస్తున్నారు. జూన్‌లోనే ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఇచ్చినచో సకాలంలో పాఠ్యాంశాలు పూర్తి చేసి ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. ఇన్‌చార్జీలే అధికం జిల్లాలో 48 మండలాలకు పీజీ హెచ్ఎంలే ఇన్చార్జి మండల విద్యాధికారులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీరు పనిచేస్తున్న పాఠశాలల్లో వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వీరిలో 15 మంది అధికారులు ఈ ఇన్చార్జి బాధ్యతలు తాము మోయలేమని, బాధ్యతలను తప్పించాల్సిందిగా మొరపెట్టుకుంటున్నా కనికరించడంలేదు. అదే విధంగా 38 ఉన్నత పాఠశాలలకు పీజీ హెచ్ఎంలు లేక పోవడంతో ఆ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంటులే ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారు. వారు అటు పాఠాలు చెప్పలేక, ఇటు పాఠశాల బాధ్యతలను నిర్వర్తించలేక సతమత మవుతున్నారు. ఉన్నత పాఠశాలల్లో 350 స్కూల్ అసిస్టెంటు పోస్టులు కోర్టు జోక్యంతో పదోన్నతులు నిలిచాయి. దీంతో ఆ పాఠశాలల్లోని విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. కుంటుపడుతున్న విద్య డీఎస్సీ ద్వారా భర్తీ కావాల్సిన సుమారు 1200 భర్తీ కాకపోవడంతో ప్రాథమిక, ప్రాథమికోన్న త, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులతోపాటు ఉపాధ్యాయులకు అదనపు బారం పడుతోంది. గడిచిన విద్యాసంవత్సరంలో పదో తరగతి తరగతుల నిర్వహణతో పాటు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల ప్రగతిపై ఏ ఒక్క సమీక్ష జరిగిన సందర్భం లేదని, ఈ నేపథ్యంలోనే పదో తరగతి ఫలితాలు ఆశించిన మేరకు రాలేదని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం ఆరంభంకు ముందుగానే విద్యాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డిని విద్యార్థులు, వారి తల్లి దండ్రులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
గంగూరు పెట్రోలు బంకు వద్ద ఘటనలో ఇద్దరు.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు జూపూడి వద్ద ట్రక్ ఆటో ఢీకొని మహిళ.. పెనమలూరు మండలం గంగూరు, ఇబ్రహీపట్నం మండలం జూపూడిలో శుక్రవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాద ఘటనల్లో ముగ్గురు మరణించారు. గంగూరు పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. జూపూడి మినీ ట్రక్ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న వ్యవసాయ కూలీ మృతిచెందింది. గంగూరు(పెనమలూరు), న్యూస్‌లైన్ : గంగూరు పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాయ్యాయి. పెనమలూరు పోలీసులు తెలి పిన సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి కొందరు వ్యక్తులు గురువారం పొక్లెయిన్‌ను లారీపై లోడ్ చేసి కానూరుకు బ యలుదేరారు. లారీని వడుగు వీర్రాజు నడుపుతుండగా విజయనగరం జిల్లా పాంచాలి గ్రామానికి చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ ఉద్దంటి సత్యనారాయణ(25), హెల్పర్ రేపల్లి రామారావు(రేపల్లె), సాలాది సూర్య అనే వ్యక్తులు అందులో ఉన్నారు. లారీ శుక్రవారం వేకువజామున నా లుగు గంటల సమయంలో విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారిపై గంగూరు పెట్రోల్ బంకు వద్దకు వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఆగి ఉన్న కొబ్బరికాయల లోడు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో పొక్లెయిన్ ఆపరేటర్ సత్యనారాయణ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన హెల్పర్ రేపల్లె రామారావును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ వీర్రాజు, సూర్యను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో బందరురోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళా కూలీ ఉసురు తీసిన ట్రక్ ఆటో జూపూడి(ఇబ్రహీంపట్నం రూరల్) : రెక్కాడితే గాని డొక్కాడని వ్యవసాయ మహిళా కూలీని గుర్తుతెలియని ఆటో ఢీకొట్టింది. శుక్రవారం సా యంత్రం జూపూడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణిం చింది. సేకరించిన వివరాల ప్రకారం.. జూపూడి భీమేశ్వర కాలనీకి చెందిన కన్నా వెంకటేశ్వరమ్మ(45) కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈమె భర్త కొంతకాలం కిందట మరణించాడు. శుక్రవారం సాయంత్రం తన పాడిగేదెకు గడ్డిని తీసుకువస్తూ జాతీయ రహదారి దా టుతుండగా విజయవాడ వైపు నుంచి వస్తున్న ట్రక్ ఆటో ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించింది. దీనిపై సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల ప్రయోజకత్వాన్ని చూడకుండానే.. వెంకటేశ్వరమ్మ పెద్దకుమారుడు ప్రైవేటు ఎలక్ట్రీషియన్. ఈ ప్రాంతంలోని ప్రైవేటు ఇంజి నీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. వెంకటేశ్వరమ్మ తన కాయకష్టంతో చిన్నకుమారుడిని ఇంజినీరింగ్ చదివిస్తోంది. తల్లి మృతదేహం వద్ద కుమారులు రోదిస్తున్న తీరు స్థానికుల కంటతడి పెట్టించింది. పిల్లలు చేతికంది వస్తున్న తరుణంలో వారి ఉన్నతిని చూడకుండానే వెంకటేశ్వరమ్మ అకాల మరణం చెందిందని స్థాని కులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉడా రాజకీయం.. రాజధానికి..
చైర్మన్ ప్రమేయం లేకుండానే వీసీ బదిలీ రిలీవ్ కాని వైస్ చైర్మన్ రామారావు పోస్టింగ్ కోసం హైదరాబాదులో మకాం రేపు ఉషాకుమారి బాధ్యతల స్వీకరణ! ఉడా వైస్ చైర్మన్ బదిలీ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. విజయవాడలోనే పోస్టింగ్ కోసం మకాం వేసిన ఐఏఎస్ అధికారిణి ఉషాకుమారి ఉడా వైస్ చైర్మన్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం వీసీగా ఉన్న రామారావుకు ఎక్కడా పోస్టింగ్ కేటాయించకుండానే ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో రామారావు శనివారం బదిలీ కాకుండా నేరుగా హైదరాబాద్ వెళ్లటం చర్చనీయాంశమైంది. మరోవైపు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించటానికి ఉషాకుమారి సిద్ధమయ్యారు. సాక్షి, విజయవాడ : జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన ఉషాకుమారి గత ఏడాది అక్టోబర్‌లో బదిలీ అయ్యారు. పలు కారణాలతో రిలీవ్ కాకుండా ఈ ఏడాది జనవరి వరకు ఇక్కడే జేసీగా కొనసాగారు. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధుల్లో చేరాల్సి ఉన్నప్పటికీ అక్కడ చేరకుండా ఉండి విజయవాడలో పోస్టింగ్ కోసం విశ్వప్రయత్నాలు చేసి రాజకీయ సహకారంతో అనుకున్నది సాధించారు. దీంతో అకారణంగా వైస్ చైర్మన్‌పై బదిలీ వేటు పడింది. ఉడా వైస్ చైర్మన్ పోస్టింగ్ కోసం దాదాపు ఆరు నెలలు రామారావు ఎదురుచూశారు. చివరకు పోస్టింగ్ వచ్చిన వెంటనే పంచాయతీ ఎన్నికల కోసం పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లారు.. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంతో రెండున్నర నెలలు ఉడా సిబ్బంది విధులకు గైర్హాజరయ్యారు.. అనంతరం ఎన్నికల విధుల నిమిత్తం వీసీ మధ్యప్రదేశ్‌కు వెళ్లారు.. ఇలా నిత్యం ప్రత్యేక విధులే ఆయనకు సరిపోయాయి. చివరకు బదిలీ జరిగిన శుక్రవారం కూడా పామర్రులో ఓటర్ల గుర్తింపు కార్డుల్లో అవకతవకలపై విచారణ కోసం ప్రత్యేక డ్యూటీలో వెళ్లారు. ఇలా ఎనిమిది నెలల పదవీకాలంలో ఎక్కువ రోజులు ప్రత్యేక సేవల్లోనే కొనసాగిన ఆయనపై అకస్మాత్తుగా బదిలీ వేటు పడింది. అదీ అకారణంగా కావటం ఉడాలో చర్చనీయాంశమైంది. మరోవైపు ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి అభిప్రాయంతో నిమిత్తం లేకుండానే ప్రభుత్వం వీసీని బదిలీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీసీగా రామారావు రిలీవ్ కాకుండా శనివారం హైదరాబాద్ వెళ్లారు. చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి కూడా హైదరాబాద్‌లోనే ఉండటంతో ఉడా రాజకీయం రాజధానికి చేరినట్లయింది. రాజధానిలో మకాం... వీసీ రామారావు హైదరాబాద్‌లో మకాం వేశారు. కనీసం పోస్టింగ్ కూడా ఎక్కడ కేటాయించకపోవటంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి పోస్టింగ్ కేటాయించాల్సిదిగా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అవకాశం ఉంటే ఉడాలోనే కొనసాగించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉషాకుమారి శ్రీకాకుళంలో జేసీగా విధుల్లో చేరలేదు. దీంతో అక్కడ ఆయన్ని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నూతన విసీగా నియమితులైన ఉషాకుమారి ఈ నెల మూడున బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. వాస్తవానికి శనివారమే చార్జ్ తీసుకుంటారని అందరూ భావించినా వీసీ రామారావు రిలీవ్ కాకపోవటంతో సోమవారం బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసింది. మరోపక్క బదిలీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 6- 10 నుంచి వీరమ్మ తల్లి ఉత్సవాలు ఉయ్యూరు, న్యూస్‌లైన్ : కోర్కేలు తీర్చే కొంగుబంగారం ఉయ్యూరు శ్రీ కనకచింతయ్య సమేత వీరమ్మతల్లి ఉత్సావాలు 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా మాఘశుద్ధ(భీష్మ) ఏకాదశి పర్వదినాన ప్రారంభమై 15రోజులపాటు అంగరంగ వైభవంగా తిరునాల జరుగుతుంది. ఈ ఏడాది భీష్మ ఏకాదశి రోజు సోమవారం రాత్రి 8.30గంటల తరువాత అమ్మవారి తిరునాల ప్రారంభమవుతుంది. ఆనవాయితీ ప్రకారం ఉయ్యూరు టౌన్ పోలీసులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, సారే సమర్పిస్తారు. అనంతరం పారపూడి వంశస్తులు పూజా కార్యక్రమాలు పూర్తిచేసి తల్లిని మెట్టినింటి నుంచి బయటకు తీసుకొచ్చి పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగింపు నిర్వహిస్తారు. అమ్మవారు మెట్టినింటి నుంచి ఊరే గింపుగా బయలుదేరగా, వేలాది మంది భక్తులు అఖండ(ఎదురు గండ) దీపాలతో హారతులిచ్చి స్వాగతం పలికి మొక్కుబడి తీర్చుకుంటారు. తిరుగుడు గండ దీపాల భక్తులు వెంటరాగాపట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుంది. 11వ తేదీ సాయంత్రం ప్రధాన సెంటర్లో ఊయల స్తంభాల వద్ద అమ్మవారు ఊరేగి ఆదే రోజు రాత్రి ఆలయ ప్రవేశం చేస్తారు. అక్కడ నుంచి ఆలయంలో భక్తుల పూజలు అందుకుంటారు. ఉత్సవాల్లో 11వ రోజు శిడిబండి ఉత్సవం జరుగుతుంది. ఈ వేడుక ఉత్సావాల్లో ప్రధానమైనది. పెళ్లి కాని ఓ దళిత యువకుడు శిడి బుట్టలో కూర్చుని వేడుక నిర్వహిస్తుండగా భక్తులు ఆ యువకుడు, శిడి బుట్టపై అరటిపండ్లు విసురుతూ భక్తిపారవశ్యం చెందుతారు. ఉత్సవాలకు జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. రంగుల ఉత్సవానికి తరలిన అమ్మవారు... ప్రతి రెండేళ్లకోసారి అమ్మవారి రంగుల ఉత్సవాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రంగుల ఉత్సవానికి శనివారం శ్రీకారం చుట్టారు. శ్రీ కనకచింతయ్య సమేత వీరమ్మతల్లి విగ్రహాలకు అనాధిగా మచిలీపట్నంలో రంగులు వేయటం, ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీ. దీంతో శనివారం వేకువజామున మెట్టినింటిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లారు. రంగుల ఉత్సవానికి వెళ్తున్న తల్లికి మార్గమధ్యంలో దారి పొడవున భక్తులు పసుపు నీళ్లు వారపొసి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజుపేటకు చెందిన స్వర్ణకారుడు దిలీప్ ఈ ఏడాది సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవ విగ్రహాలను ముస్తాబు చేయనున్నారు. రంగుల ఆలంకరణ 7వ తేదీ లోగా పూర్తి చేసి 9వ తేదీవరకు బందరులోని పురవీధులో అమ్మవారు ఊరేగింపు పూర్తి చేసుకొని 10వ తేదీ ఉదయానికి మెట్టినింటిలోకి ప్రవేశిస్తుందని నిర్వాహకులు తెలిపారు. -
ఉచితం కాదు.. అనుచితం
దొమ్మేరు (కొవ్వూరు రూరల్), న్యూస్‌లైన్ :ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రూ.5 వేలు కట్టించుకుని ఓ రైతుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మం జూరు చేశారు. ఆ కనెక్షన్‌పై వ్యవసాయూనికి వినియోగించే విద్యుత్‌ను జీవితకాలం ఉచి తంగా ఇస్తామన్నారు. ఆ తరువాత ఆయన భార్య పేరిట మరో విద్యుత్ కనెక్షన్ మంజూ రైంది. యూనిట్‌కు 50 పైసలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఉచితంగా ఇవ్వాల్సిన విద్యుత్‌కు వేలల్లో బిల్లు పంపిస్తున్నారు. రైతు భార్య పేరిట ఉన్న సర్వీసుపై యూనిట్‌కు 50 పైసలకు బదులు రూ.3.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే.. ‘మీరు ఆదాయ పన్ను పరిధిలో ఉన్నారు’ అంటున్నారు. పథకాల అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, వాటిని అమలు చేసే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సామాన్యులకు ఇలాంటి ఇబ్బందులు తప్పటం లేదు. వివరాల్లోకి వెళితే... కొవ్వూరు మండలం దొమ్మేరులో నివాసముంటున్న ముదునూరి హనుమంతరాజు, అన్నపూర్ణ దంపతులు సామాన్య రైతు కుటుంబానికి చెందిన వారు. అన్నపూర్ణకు 92సెంట్ల పంటభూమి ఉండగా, 2649 సర్వీస్ నంబర్‌తో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. హనుమంతరాజుకు ధర్మవరం పరిధిలో 97 సెంట్ల భూమి ఉండటంతో 318 సర్వీస్ నంబర్‌తో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. అన్నపూర్ణ పేరుతో ఉన్న సర్వీస్‌కు యూనిట్‌కు రూ.3.50 వరకు బిల్లు వసూలు చేస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ పొందే సమయంలో యూనిట్‌కు 50 పైసలు వరకు బిల్లు పడుతుందని చెప్పారు. ఇంత ఎక్కువగా ఎందుకు బిల్లు వస్తోందని విద్యు త్ అధికారులను ప్రశ్నిస్తే మీరు ఇన్‌కం టాక్స్ పరిధిలో ఉన్నారని చెప్పడంతో భార్యాభర్తలు అవాక్కయ్యారు. బిల్లు తగ్గాలంటే ఇన్‌కంటాక్స్ కార్యాలయం నుంచి పన్ను చెల్లించడం లేదంటూ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని కోరారు. ఇన్‌కం టాక్స్ కార్యాలయానికి వెళితే టాక్స్ చెల్లించకుండా తామెలాంటి పత్రాలు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. తప్పని పరి స్థితుల్లో 2012 జనవరి నుంచి ఆ దంపతులు ఐదు దఫాలుగా విద్యుత్ శాఖకు రూ.26 వేల వరకు చెల్లించారు. మూడు నెలల క్రితం మరో రూ.4 వేలు చెల్లించాలంటూ అధికారులు బిల్లు పంపారు. ఆ మొత్తం చెల్లించకపోవడంతో మోటారుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈనెల 17న అప్పుచేసి మరీ రూ.3,738 చెల్లించారు. హనుమంతరాజు పేరిట ఉన్న సర్వీసును 1989లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా తీసుకున్నారు. రూ.5 వేలు చెల్లిస్తే జీవిత కాల మంతా విద్యుత్ బిల్లు చెల్లించనవసరం అప్పట్లో చెప్పారని ఆ దంపతులు తెలిపారు. ఇప్పుడు దానికి కూడా విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేసినా స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఆ దంపతులు వాపోతున్నారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన తాము తరచూ వేలాది రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టేదని ఆవేదన చెందుతున్నారు. -
అప్పుడు ఆ నలుగురు...ఇప్పుడు ఆ అయిదుగురు
ప్రేమ్‌కుమార్ పట్రా.. ఈ పేరు వినగానే ఆ నలుగురు, వినాయకుడు సినిమాలు గుర్తొస్తాయి. ప్రేమ్‌కుమార్ అభిరుచికి ఈ రెండు సినిమాలు దర్పణాలు. ముచ్చటగా మూడోసారి ఆయన సమర్పణలో ‘ఆ అయిదుగురు’ అనే చిత్రం రూపొందింది. ‘అతడే సీఎం’ అనేది ఉపశీర్షిక. తన గత చిత్రాల్లాగే విలువలతో కూడిన కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని ప్రేమ్‌కుమార్ చెప్పారు. సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు చేతుల మీదుగా ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్ చెబుతూ ‘‘పోలీస్ అకాడమీ నుంచి బయటకొచ్చిన అయిదుగురు కుర్రాళ్లు ఏం చేశారు? అనేది ఈ చిత్రం కథాంశం. రాజకీయ నేపథ్యంలో సాగే అర్థవంతమైన సినిమా ఇది. ఇందులోని కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. జనవరి తొలివారంలో పాటల్ని, అదే నెల 26న సినిమాను విడుదల చేస్తాం.’’ అని తెలిపారు. అయిదుగురు యువకుల జీవితమే ఈ సినిమా అని, సుద్దాల అశోక్‌తేజ ఈ చిత్రం ద్వారా మాటల రచయితగా పరిచయం అవుతున్నారని దర్శకుడు అనిల్ జాసన్ గూడూరు తెలిపారు. సమాజానికి యువత ఉపయోగపడే తీరును తెలిపే సినిమా ఇదని నటుడు వెంకట్ చెప్పారు. చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో క్రాంతి, తనిష్క్‌రెడ్డి, క్రాంతికుమార్, కృష్ణతేజ, శశికాంత్, అస్మితాసూద్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: ‘మంత్ర’ ఆనంద్, కెమెరా: పి.జి.విందా, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత: సరిత పట్రా. -
పత్రికి వెళ్లి ప్రమాదానికి బలి
దోసకాయలపల్లి (మధురపూడి), న్యూస్‌లైన్ :కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో జరుగుతున్న పూజకు పత్రిని తీసుకు వచ్చేందుకు వెళ్లిన వ్యక్తి లారీ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు.ఈ సంఘటనతో దోసకాయలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామానికి చెందిన ఉరుము రామారావు(48) ఆదివారం పత్రి తెచ్చేందుకు బూరుగుపూడి గేట్ సమీపంలోని మర్రి చెట్ల వద్దకు వచ్చాడు. మర్రి, ఇతర చెట్ల ఆకులు కోసుకుని వాటిని పోగు చేస్తూ ఉండగా క్వారీ క్రషర్ నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఉంది. కూలిపనే జీవనాధారంగా అతడు కుటుంబాన్ని పోషిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. రామారావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పండుగ పూట ఆ ఇంట దారుణమైన దుఃఖం నెలకొనడం బాధాకరమని పలువురు వాపోయారు. కోరుకొండ ఎస్సై బి.వేంకటేశ్వరరావు సంఘటన స్ధలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. లారీని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. డ్రైవర్ పరారీలో వున్నాడు. సర్పంచ్ సూర్యకుమారి తదిరతరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని రాజమండ్రి తరలించారు. రాజమండ్రి-కోరుకొండ-రాజానగరం రోడ్లలో క్వారీ రాళ్లను రవాణా చేసే లారీలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. నాగంపల్లి నుంచి రాజమండ్రి రోడ్లలో రాత్రి పగలు తేడా లేకుండా క్వారీలారీలు నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.అధికారులు వీటిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
పంట నష్టం సర్వేలో రైతులకు అన్యాయం
=టీఆర్ఎస్ నేతల నిరసన =జేడీఏకు వినతిపత్రం వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తుపాన్‌తో నష్టపోయిన పత్తి, మొక్కజొన్న రైతులకు సర్వే స్థాయిలోనే అన్యాయం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. హన్మకొండలోని జేడీఏ కార్యాలయం వద్ద సోమవారం టీఆర్ఎస్ ప్రతినిధులు నిరసన తెలియజేశారు. తుపాన్ ప్రభావం తగ్గిన పది రోజుల తర్వాత సర్వే చేపట్టడాన్ని వారు తప్పుబట్టారు. పంట చేలలో నీళ్ళుంటేనే పరిహారానికి అర్హులుగా భావించడం సరికాదన్నారు. ఈ మేరకు జేడీఎ రామారావుకు టీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని జేడీఎ రామారావు వారికి హామీ ఇచ్చారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా ఇంచార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, డాక్టర్ రాజయ్యలు విలేకరులతో మాట్లాడారు. సర్వేలో లోపాలు నెలకొంటే పరిహారం రాకుండా పోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఇప్పటికే నీలం తుపాన్ వల్ల రైతులు నష్టపోయినా పరిహారం రాకుండా పోయిందని గుర్తుచేశారు. తక్షణం స్పందించి సర్వేలో లోపాలు లేకుండా గట్టి చర్యలు చేపట్టాలని కోరారు. 50శాతం పంట నష్టం వాటిల్లితేనే పరిహారం లభిస్తుందంటూ సర్వే బృందాలు చెప్పడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్వే బృందాలను నిర్బంధించిన విషయాన్ని వివరించారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన చేపడుతామని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో కరువొచ్చినా..తుపానొచ్చినా ఈ ప్రభుత్వాలు ఆదుకోవడంలో వివక్ష కనబరుస్తున్నారని విమర్శించారు. పరిహారానికి అర్హత పొందకుండా నిబంధనలు పెట్టి సర్వే స్థాయిలోనే పట్టించుకోవడం లేదన్నారు. పత్తి రైతులకు ఈ దఫా అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకోకుంటే గ్రామాలకు వచ్చే అధికారులను, సిబ్బందిని నిర్బంధిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జి ఆరూరి రమేష్, జిల్లా నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మార్నేని రవీందర్రావు, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు సెవెల్ల సంపత్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, టీఆర్ఎస్ నాయకుడు శంకర్‌నాయక్, యూత్ అర్బన్ నాయకులు చాగంటి రమేష్ తదితరులు ఉన్నారు. -
వాన నష్టం రూ 710 కోట్లు
వరంగల్, న్యూస్‌లైన్ : రైతులకు వరుస కష్టాలు తప్పలేదు. గత ఏడాది వానలు లేక విలవిల్లాడిన రైతులకు... ఈసారి అధిక వర్షాలు శాపంగా మారాయి. ఈనెల 23 నుంచి వరుసగాకురిసిన వానలు వారిని కోలుకోలేని దెబ్బ తీసింది. చేతికి అంది వచ్చిన పంటలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం గుర్తించిన ప్రకారం 35 మండలాల్లోని 640 గ్రామాల్లో 3,60.497 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు నష్టపోయూరు. జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట, ములుగు, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, వరంగల్ రూరల్‌తో సహా పలు మండలాల్లో నష్టపోయిన పంటల విలువ ప్రభుత్వ అంచనాల ప్రకారం ’ 686 కోట్లు ఉంటుందని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. ఆదివారం ఉదయం నుంచి గ్రామాల వారీగా మండల వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పంటల నష్టంపై లెక్క తేల్చినట్లు జేడీఏ రామారావు చెప్పారు. మొత్తం 2,30,460 మంది రైతులకు వర్షాలతో నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. 1,44,199 హెక్టార్ల(3,60,497.5 ఎకరాలు)లో పంట నష్టం జరిగినట్లు వెల్లడించారు. పంటలన్నీ నీటిపాలు జిల్లావ్యాప్తంగా 5.10 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేశారు. ఖరీఫ్ ఆరంభం నుంచే వర్షాలు సమృద్ధిగా కురువడం, జలాశయాలు నిండడంతో పంటలపై రైతులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పత్తి కాయలు పగిలి మొదటి దఫా ఏరే సమయం వచ్చింది. వరి పొట్ట దశలో ఉంది. ఈ క్రమంలో కురిసిన వర్షాలు రైతులను కొలుకునే అవకాశం లేకుం డా దెబ్బకొటాయి. కాస్తొకూస్తో మిగిలిన పంట లకు తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉండడంతో రైతుల రోదన మిన్నంటుతోంది. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం 2,80,467.5 ఎకరాల్లో పత్తి పూర్తిగా నాశనమైంది. వర్షం నీటిలో మొక్కలుండగా... కాయలు మొత్తం రాలిపోయాయి. ఏరే స్థితిలో ఉన్న పత్తి బుగ్గలునల్లబడిపోయాయి. అదే విధంగా 69,897.5 ఎకరాల వరి నేల వంగింది. పొట్ట దశలో ఉన్న వరి గొలుసులు వరద నీటిలో కొట్టుకుపోయా యి. 7,857.5 ఎకరాల్లో మొక్కజొన్న పంట అక్కరకు రాకుండా పోయింది. 2,275 ఎకరాల్లో వేరుశనగ నాశనమైంది. వరద నీటిలో వేరుశనగ మొలకలు కొట్టుకుపోయాయి. 70 ఎకరాల్లో మిర్చి తోటలు దెబ్బతిన్నాయి. తెగిన రోడ్లు ఆర్అండ్బీ పరిధిలోని 121 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. వరంగల్, మహబూబాబాద్ డివిజన్లలో అధిక నష్టం వాటిల్లింది. రోడ్లకు అత్యవసరంగా తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు ’2.30 కోట్లు అవసరమని, శాశ్వత మరమమతులకు ’ 22 కోట్లు అవసరమని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. ఇక వరంగల్ కార్పొరేషన్లో నాలాలు, డ్రెరుునేజీలు, అంతర్గత రోడ్ల మరమ్మతులకు ’ 54 లక్షలు అవసరమని ప్రతిపాదనలు అందజేశారు. లోతట్టు ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టేందుకు ’ 6 లక్షలు అవసరమని ఈ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నిధుల నుంచి గ్రామాల్లో తాగునీటిని క్లోరినేషన్ చేయూలని కలెక్టర్ కిషన్ ఆదేశాలిచ్చారు. చెరువులకు గండ్లు మైనర్ ఇరిగేషన్ పరిధిలోని గండ్లు పడిన చెరువులకు రూ 3 లక్షలతో మరమ్మతు చేయాలని ప్రభుత్వానికి నివేదించారు. వర్ధన్నపేటలో ఒక టి, నర్సంపేటలో 7, పరకాలలో 4, డోర్నకల్ లో ఒకటి, భూపాలపల్లిలో 6, ములుగులో 7, ఏటూరునాగారంలో 5 చెరువులకు బుంగలు పడినట్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 245 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని, 473 తీవ్రస్థాయిలో ధ్వంసమైనట్లు, మరో 1081 పా క్షికంగా దెబ్బతిన్నట్లు సర్వేలో తేలింది.