ఆందోళన అవసరం లేదు!
విజయనగరం కంటోన్మెంట్ : స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, అప్రమత్తం గా ఉన్నామని స్వైన్ ఫ్లూ నివారణ రాష్ట్ర నోడల్ అధికారి జి. వాసుదేవరావు అన్నారు. శనివారం ఆయన జిల్లాలో ని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం సాయంత్రం ఇన్‌చార్జి కలెక్టర్ బి. రామారావుకు పరిస్థితి వివరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో చికిత్స పొందుతున్న భోగాపురానికి చెందిన మహిళ కో లుకుంటోందన్నారు. ఆమెకు ఏ ప్రమాదమూ లేదని చెప్పారు.
ఆమెతో పాటు ప్రయాణించిన సహ ప్రయాణికులను గుర్తించి పరీక్షలు నిర్వహించామన్నారు. అలాగే ఆమె బంధువులకు కూడా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఎవరికీ స్వైన్ ఫ్లూ లక్షణాలు లేవన్నారు. భో గాపురం మండలంలో 8 క్లస్టర్ బృందాలను గుర్తించి 24 మందితో సర్వే చేయించామన్నారు. ప్రతి ఒక్కరినీ పరీ క్షించామన్నారు. జిల్లా కేంద్రాసుపత్రిలో ఆరు పడకలు ఇందుకోసం సిద్ధం చేశామన్నారు. అలాగే రెండు వెంటిలేటర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎవరికైనా వ్యాధి సోకినట్టు అనుమానంగా ఉన్నా.. వెంటనే ఇక్కడ చేర్చేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నా రు. ప్రైవేటు ఆసుపత్రులకు ఎటువంటి అనుమానిత కేసులు వచ్చినా.. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
మాస్కులు సిద్ధం చేస్తున్నాం
ఎన్-95 మాస్కులను కొనుగోలు చేస్తామని డీఎంహెచ్ ఓ స్వరాజ్యలక్ష్మి ఇన్‌చార్జి కలెక్టర్‌కు చెప్పారు. అలాగే ఇప్పటికే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లాలో అనుమానిత కేసులు లేవన్నారు. దాసన్నపేటలో మహిళ మృతికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా విచారిస్తున్నామన్నారు. పరీక్షలు నిర్వహించలేదన్న విషయం తెలియడంతో మృతదేహాన్ని దహనం కాకుండా పూడ్చిపెట్టే విధంగా బంధువులను ఒప్పించామన్నారు.
హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న హోమియో మందులు
స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రజల్లో భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. పట్టణంలోని హోమియో వైద్య శాలలన్నీ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా కేం ద్రంలో సుమారు పది హోమియో వైద్యశాలలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సీసాలో ఇద్దరు వ్యక్తులకు సరిపడే గు లికలను హోమియో వైద్యశాలల యజమానులు విక్రయిస్తున్నారు. ఇద్దరికి సరి పడ మం దులు రూ. 20 కాగా మ రికొన్ని చోట్ల రూ. 60 కూ డా లభిస్తున్నాయి. అదును బట్టి ధరలు కూ డా పెంచేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.