18న లె జండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ | 18th lezendery blood donation drive | Sakshi
Sakshi News home page

18న లె జండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్

Published Tue, Jan 12 2016 3:35 AM | Last Updated on Sun, Sep 3 2017 3:29 PM

18న లె జండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్

18న లె జండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్

ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి
 సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు 20వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 18న లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణలోని 200 ప్రాంతాల్లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం చేసి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌పై 40 మంది సెలబ్రిటీల ప్రచారంతో కూడిన వీడియోలను ప్రదర్శించారు. సమావేశంలో ట్రస్ట్ సీఈవో టి. విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement