
ఇతరుల బిడ్డను కాపాడి.. ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న అభాగ్యుడు
నదిలో కొట్టుకుపోయి చిన్నారుల మృతి
చెన్నూర్: గోదావరిలో మునిగిపోతున్న ఓ చిన్నారిని పరుగున వెళ్లి కాపాడాడు ఆ తండ్రి.. తిరిగి వచ్చి చూడగా తన ఇద్దరు బిడ్డలు గల్లంతయ్యా రు. వెతికితే శవాలుగా మారి కనిపించిన ఉదం తం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో ఆదివారం జరిగింది. వివరాలు.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెంది న పేరాల రామారావు చెన్నూర్‌లోని ఓ వైన్స్‌లో పని చేస్తున్నారు.
ఆదివారం చెన్నూరు సమీపంలోని గోదావరి వద్ద నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వత్రాలకు రామారావు, భార్య లావణ్య, ఇద్దరు కుమారులు సాయికృష్ణ(11) సాయి వర్షిత్(6)లు వెళ్లారు. పిల్లలు గోదావరిలో స్నానాలు చేస్తుండగా, వీరికి కొద్ది దూరంలో ఓ చిన్నారి నదిలో మునిగిపోతూ కనిపించాడు. దీంతో రామారావు వెళ్లి ఆ చిన్నారిని కాపాడాడు. తిరిగి వచ్చి చూడగా, తన ఇద్దరు కుమారులు కనిపించకుండా పోయారు. గాలించగా, ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. సాయికృష్ణ నాలుగో తరగతి, సాయి వర్షిత్ ఎల్‌కేజీ చదువుతున్నారు.