Sai Krishna
-
హైడ్రా కూల్చివేతలు.. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
-
తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి...
-
ఒక అపార్ట్మెంట్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు..
-
‘మిస్టరీ’ పాట బాగుంది: చంద్రబోస్
అలీ, తనికెళ్ల భరణి, సుమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ థ్రిల్లర్ ‘మిస్టరీ’. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటిస్తున్నాడు. స్నప్ప చౌదరి హీరోయిన్. అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదల కాబోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి 'ఎదురయ్యే సవాళ్లు' పాట ను ఆస్కార్ అవార్డ్ విజేత పాటల రచయిత చంద్ర బోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్ తవ్వ స్వరపరిచిన 'ఎదురయ్యే సవాళ్లు' చాలా బాగుంది. ఈ పాటకి సాహిత్యం అందించిన శ్రీనివాస్ సూర్య కి, పాడిన మనోజ్ కి అభినందలు. ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని ఆశిస్తున్నాను’అని అన్నారు. ‘ఇదొక కామెడీ థ్రిల్లర్. ఔట్పుట్ బాగొచ్చింది. పాటలతో పాటు సినిమా కూడా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’అని డైరెక్టర్ సాయికృష్ణ అన్నారు. నేను అడగగానే మా సినిమా లోని పాటని చంద్రబోస్ గారు విడుదల చేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను’అని హీరోయిన్ స్వప్న చౌదరి అన్నారు. -
డబ్బింగ్ పనుల్లో ‘మిస్టరీ’
తల్లాడ సాయికృష్ణ హీరోగా స్వీయదర్శకత్వంలో టించిన చిత్రం మిస్టరీ. స్వప్న చౌదరి హీరోయిన్. అలీ, సుమన్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలపాత్రల్లో నటించారు. పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్రంలోని తన పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ‘ఇదొక థ్రిల్లర్ కామెడీ సినిమా. సాయి అనుకున్న కథని అనుకున్నట్లుగా తీశాడు. నా పాత్ర డబ్బింగ్ పూర్తయింది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికి నచ్చుతుంది. టీమ్ అందరికి నా అభినందనలు’అని అన్నారు. -
అప్సర హత్యకు 15 రోజుల ముందే గొయ్యి తవ్వి..
సాక్షి, హైదరాబాద్: అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడు వెంకట సాయికృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న శంషాబాద్ పోలీసులకు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. ఆమె హత్యకంటే 15 రోజుల ముందే సాయి ఎలాంటి స్కెచ్ వేశాడనే విషయం తెలిసి పోలీసులు సైతం కంగుతిన్నారు. అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణ కస్టడీ లోకి తీసుకున్న పోలీసులు.. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ ప్రారంభించారు. జూన్ 3వ తేదీన హత్య జరిగిన ఘటనాస్థలి నర్కూడ ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ ఘటన హత్య జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆమెను హత్య చేసేందుకు ముందుగా సాయి వేసుకున్న ప్లాన్ సైతం తెలిసింది. ఇదీ చదవండి: అప్సర చేసింది కరెక్ట్ కాదు-సాయి భార్య అప్సర వేధింపులను సాయి తట్టుకోలేకపోయాడు. ఆమెను చంపడం ఒక్కటే మార్గమని భావించాడు. ఈ క్రమంలో ఎలా చంపాలనేది గూగుల్‌లో వెతికి మరీ స్కెచ్ వేసుకున్నాడు. సరూర్ నగర్లో తాను పూజారిగా పని చేసే గుడి వెనుక ఉన్న ఆస్పత్రి వద్ద ఖాళీ జాగా ఉంది. అప్సరను చంపేశాక.. ఆ స్థలంలో ఆమెను పాతిపెట్టాలని సాయి భావించాడట. అందుకోసం 20 అడుగుల పెద్ద గొయ్యి తవ్వించాడు. అయితే, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకోవడంతో ఆ గుంతను పూడ్చేయించాడు. దీంతో సాయికృష్ణ.. ఎమ్మార్వో కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ వద్ద స్థలం ఉందని గురించి తన ప్లాన్‌ను అమలు చేశాడు. ఇదిలా ఉంటే.. నర్కూడలో క్రిమినల్ సీన్ రీకన్స్ట్రక్షన్ ముగిశాక.. సరూర్ నగర్లో అప్సర మృతదేహాన్ని పూడ్చేసిన మ్యాన్ హోల్ దగ్గరికి తీసుకెళ్లారు. రంగారెడ్డి కోర్టు రెండురోజుల పోలీస్ కస్టడీకి అనుమతించడంతో.. ఇవాళ, రేపు అప్సర కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అప్సర కేసు.. అప్సర మాజీ భర్త తల్లి సంచలన ఆరోపణలు -
అప్సర కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన అప్సర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాలానంతరం కేసులో ప్రధాన నిందితుడైన సాయికృష్ణను శుక్రవారం రెండురోజుల కస్టడీకి తీసుకున్నారు శంషాబాద్ పోలీసులు. అప్సర హత్య చేయాల్సిన పరిణామాలపై విచారించడంతో పాటు హత్యా ప్రదేశంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సాయిని కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి కోర్టులో శంషాబాద్ పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. ఇవాళ రెండు రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇవాళ, రేపు అప్సర హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగే అవకాశం ఉంది. సరూర్ నగర్ నుంచి బయల్దేరిన దగ్గరి నుంచి తిరిగి.. శవాన్ని పూడ్చిపెట్టిన క్రమం మొత్తం ఎలా జరిగిందనేది పోలీసులు సాయి ద్వారా తేల్చనున్నారు. కేసు పూర్వాపరం చెన్నై నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చి సరూర్ నగర్లో స్థిరపడింది అప్సర కుటుంబం. తండ్రి కాశీలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లితో పాటు ఉంటూ అప్సర సినిమా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఆలయంలో పూజారిగా పని చేసే సాయికృష్ణతో అప్సరకు పరిచయం ఏర్పడింది. సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తానంటూ ఆమెకు దగ్గరయ్యాడు సాయికృష్ణ. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి తిరగడం, ఆ చనువు కాస్త వివాహితుడైన సాయితో శారీరక సంబంధానికి దారి తీసింది. జూన్ 3వ తేదీన తాను కొయంబత్తూరు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లిన అప్సర.. జాడ లేకుండా పోయింది. చివరకు పోలీసుల దర్యాప్తులో ఆమెను శంషాబాద్ సమీపంలో చంపి.. సరూర్‌నగర్‌లోని ఓ మ్యాన్‌హోల్‌లో పూడ్చిపెట్టినట్లు సాయి అంగీకరించాడు. అయితే అప్సర తనను బ్లాక్మెయిల్ చేయడంతో భరించలేకే తాను ఆమెను హత్య చేసినట్లు సాయి చెబుతున్నాడు. అరెస్ట్.. ఆపై జ్యూడీషియల్ రిమాండ్ అనంతరం సాయికృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. ఇదీ చదవండి: అప్సర హత్యకు ముందు సాయికృష్ణ.. షాకింగ్ విషయాలు వెలుగులోకి! -
అప్సర కేసు.. కలకలం రేపుతున్న కార్తీక్ రాజా తల్లి ఆడియో
సాక్షి, హైదరాబాద్: అప్సర కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అప్సరకు ఇప్పటికే పెళ్లయినట్లు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అప్సరను ప్రేమ వివాహం చేసుకున్న చెన్నైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తీక్ రాజా.. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్సర హత్య తర్వాత కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి ఆడియో విడుదల సంచలనం రేపుతోంది. తన కుమారుడిని మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే కార్తీక్ రాజా ఆత్మహత్య చేసుకున్నాడంటూ ధనలక్ష్మీ చెబుతోంది. పెళ్లయిన కొద్ది రోజులకే లగ్జరీగా బతకాలని, టూర్లకు తీసుకెళ్లాలంటూ అప్సర, ఆమె తల్లి అరుణ వేధింపులకు గురి చేశారన్న ధనలక్ష్మి.. తన కుమారుడితో రోజు గొడవలు పడే వారని, తన కుమారుడిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయాడన్నారు. కార్తీక్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో మానసికంగా కృంగిపోయాడు. ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి చావుకు అప్సర, ఆమె తల్లినే కారణం. అప్పటి నుంచి ఇద్దరూ కనిపించలేదు. అప్సర హత్యకు గురైందని మీడియాలో వార్తను చూసి తెలుసుకున్నాను. అప్సర, ఆమె తల్లి హైదరాబాద్‌లో ఉన్నట్లు కూడా తమకు తెలియదు. అప్సరకు సినిమాల్లో నటించాలని కోరిక ఉండేది. అందు కోసమే అప్సరను తీసుకొని హైదరాబాద్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నానని కార్తీక్ తల్లి అన్నారు. కస్టడీకి సాయికృష్ణ.. పోలీసుల పిటిషన్ అప్సర హత్య కేసులో వారం రోజుల పాటు సాయికృష్ణను కస్టడీ కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ నేడు కోర్టు విచారించనుంది. చదవండి: బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్.. -
‘కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం.. పరువును బజారుకీడ్చొద్దు’
సాక్షి, హైదరాబాద్: ‘అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు చనిపోయింది. ఆ బాధలో నుంచి ఇప్పటికీ మా కుటుంబం బయటికి రాలేదు. హంతకుడు సాయికృష్ణ కుటుంబ సభ్యులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. నా కూతురు ఆత్మశాంతికి భంగం కలిగిస్తున్నారు’ అంటూ మృతురాలు అప్సర తల్లి అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. కూతురు చనిపోయిన బాధలో తాము ఉంటే.. తమ పరువును బజారుకీడ్చే పనులు చేయడమేంటని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల 3న సాయికృష్ణ చేతిలో హత్యకు గురైన అప్సరకు గతంలోనే వేరే వ్యక్తితో వివాహమైనట్లు ఫొటోలు, వీడియోలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలిసి అప్సర తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. సంబంధం లేని ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయించి తమ కుమార్తె క్యారెక్టర్‌ను తప్పుబట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సాయికృష్ణను కఠినంగా శిక్షించాల్సింది పోయి తన కుమార్తెనే తప్పు పడతారా అని అన్నారు. ఇదిలాఉండగా అప్సర మొదటి భర్త వివాహమైన కొంత కాలానికే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. చదవండి: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తు.. ‘పింక్ వాట్సాప్’! -
బిగ్ ట్విస్ట్.. అప్సరకు గతంలోనే వివాహం?..పెళ్లి ఫోటోలు వైరల్..
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన కనుగంటి అప్సర (30) హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమెకు గతంలోనే వివాహం జరిగినట్లుగా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయికృష్ణ విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. కాగా, హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వృత్తిరీత్యా ఆలయ పూజారి అయిన నిందితుడు అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణ అప్సరను తొలుత సుల్తాన్‌పూర్‌లోని గోశాలలో అంతమొందించాలని భావించాడు. అయితే, గోశాలలో రక్తం చిందిస్తే పాపం చుట్టుకుంటుందని భావించి.. కారును 2 కి.మీ. దూరం తీసుకెళ్లి నర్కుడలోని ఓ వెంచర్లో హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. హత్య ఎలా చేయాలో గూగుల్‌లో సెర్చ్ చేసి సాయికృష్ణ ప్రణాళిక వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్సర హత్యకు మూడుసార్లు విఫలయత్నం చేసిన సాయికృష్ణ.. నాలుగోసారి ఆమెను అంతమొందించాడు. కోయంబత్తూరు టూర్ అడ్డుపెట్టుకొని.. సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ గుడికి వెళ్తున్న క్రమంలో సాయికృష్ణ, అప్సరలకు పరిచయం ఏర్పడింది. రోజూ ఇద్దరు ఫోన్లో కాల్స్‌తోపాటు వాట్సాప్‌లో చాటింగ్ చేసుకునే వాళ్లు. గత నవంబర్‌లో అప్సర, సాయికృష్ణ గుజరాత్‌లోని సోమనాథ్, ద్వారక ఆలయాలను దర్శించుకుని, అక్కడే ఇద్దరూ ఒక్కటైనట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో తనను పెళ్లి చేసుకోకపోతే వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని, సంఘాల్లో చెప్పి పరువు తీస్తానని అప్సర బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. దీంతో ఆమెను అంతమొందించాలని సాయికృష్ణ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కోయంబత్తూరుకు తీసుకెళ్లాలని పలుమార్లు అప్సర కోరడంతో హత్యకు ఇదే అదనుగా భావించాడు. ఈనెల 3న శంషాబాద్ నుంచి కోయంబత్తూరుకు ఆఖరి బస్సు రాత్రి 11 గంటలకు ఉందని, టికెట్ కూడా బుక్ చేశానని నమ్మించి, ఆమెను ఇంటి నుంచి కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. రెండు గంటలపాటు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో తిప్పాడు. కోయంబత్తూరుకు వెళ్లడం ఏమైందని అప్సర ప్రశ్నించడంతో.. తాను టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. సుల్తాన్‌పల్లిలోని గోశాలకు వెళ్దామని ఆమెను ఒప్పించాడు. తర్వాత నర్కుడ వైపు వెళ్లి కారు కవర్‌ను అప్సర తలకు చుట్టి ఊపిరాడకుండా చేసి, బండరాయితో తలపై మోది హత్య చేశాడు. చదవండి: అప్సర కేసు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందంటే? తర్వాత కారు కవర్, అప్సర చెప్పులు, బండరాయిని నిర్మానుష్య ప్రాంతంలో విసిరేశాడు. అప్సర మృతదేహాన్ని పాతిపెట్టిన మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తుండటంతో ఎల్బీనగర్ నుంచి రెండు టిప్పర్ల ఎర్ర మట్టిని తెప్పించి పోశాడు. తమ్ముడు అయ్యవారి సత్యప్రసాద్ ద్వారా టిప్పర్ డ్రైవర్ అశోక్‌కు నగదు ఫోన్ పే ద్వారా రూ.16 వేలు వేశాడు. మరుసటి రోజు కూడా మ్యాన్‌హోల్ వద్ద దుర్వాసన వస్తుండటంతో మ్యాన్‌హోల్ కాంక్రీట్ మూతతో పూడ్చేశాడు. 14 రోజులు రిమాండ్‌కు.. పోలీసులు సాయికృష్ణను రాజేంద్రనగర్ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజి్రస్టేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు. సాయికృష్ణ కస్టడీ కోరుతూ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ వేయనున్నారు. అప్సర తల మీద బండరాయితో బలంగా మోదడంతో అధికంగా రక్తస్రావం జరిగి మరణించిందని ఉస్మానియా వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సీసీటీవీ కెమెరాలతో దొరికాడు.. అప్సరను హత్య చేసిన తర్వాత సాయికృష్ణ అమాయకుడిలా ఆర్జీఏఐ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన మేనకోడలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. అనుమానం వచి్చన పోలీసులు శంషాబాద్ బస్టాండ్ వద్ద సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. దీంతో హంతకుడు సాయికృష్ణనే అని నిర్ధారణకు వచ్చారు. అయితే పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేయాలని భావించారు. ఈనెల 3న కోయంబత్తూరు వెళ్తున్నామని అప్సరను కారులో తెచ్చిన సాయికృష్ణ రాత్రి 10 గంటల సమయంలో శంషాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద కారు ఆపి కిందికి దిగాడు. ఇంతలోనే ఓ బస్సు అటుగా వెళ్లడంతో కారు ఎటువైపు వెళ్లిందనేది సీసీ ఫుటేజీ తొలుత లభించలేదు. ఆ తర్వాత రాళ్లగూడ వరకు వెళ్లి ఒక్కడే ఫాస్ట్‌ఫుడ్ తిన్నాడు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద కూడా అప్సర ఓసారి కారు దిగింది. వాంతి చేసుకున్న తర్వాత తిరిగి కారులో కూర్చున్నట్లు అక్కడి సీసీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా నమోదైంది. హత్య చేసిన తర్వాత తిరిగొస్తున్న క్రమంలో కారులో ఒక్కడే ఉన్న సీసీ ఫుటేజీ కూడా పోలీసులకు దొరికింది. అప్సర నుంచి చివరి ఫోన్ కాల్ సాయికృష్ణకు చేసినట్లు పోలీసులు గుర్తించారు. -
అప్సర హత్యకు ముందు.. గూగుల్‌లో సాయికృష్ణ
సాక్షి, హైదరాబాద్: అప్సర హత్య కేసులో రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగు చూశాయి. వాళ్లిద్దరి పరిచయం దగ్గరి నుంచి సాయికృష్ణ అరెస్ట్ దాకా పరిణామాలు పోలీసులు అందులో పేర్కొన్నారు. ఏడాది కాలంలో వాళ్ల మధ్య బంధం ఎలా బలపడింది?.. చివరకు తాను ఆమెను హత్య ఎలా చేసింది సాయికృష్ణ చెప్పిన విషయాల ఆధారంగా నివేదిక రూపొందించారు. గత ఏడాది ఏప్రిల్ నుండి సాయి కృష్ణ అప్సర మధ్య పరిచయం ఏర్పడింది. సాయికృష్ణ పెద్ద పూజారిగా పని చేసిన సరూర్ నగర్ బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సాయి కృష్ణ మెసేజ్‌లు పంపేవాడు. ఈ క్రమంలో కిందటి ఏడాది నవంబర్‌లో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. అదే టైంలో.. ఇద్దరి మధ్య బంధం మరింత బలపడి.. ఆమె వాట్సాప్ ద్వారా సాయికృష్ణకు లవ్ ప్రపోజ్ చేసింది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయయడం ప్రారంభించింది అప్సర. లేకుంటే రోడ్డుకు ఈడుస్తానని బ్లాక్ మెయిలింగ్‌కు దిగింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసినట్లు సాయికృష్ణ అంగీకరించాడు. గూగుల్‌లో సెర్చింగ్.. హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్లో సాయి కృష్ణ నేరాలు ఎలా చేయాలనే వివరాలను సెర్చ్ చేశాడు. "How to Kil human being" అని గూగుల్‌లో వెతికి చూసినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని అప్సర పలుమార్లు సాయి కృష్ణను కోరింది. ఇదే అదనుగా భావించి ఆమె అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ డిసైడ్ అయ్యాడు. టికెట్ కొనలేదని చెప్పి మరీ.. జూన్ 3 వ తేదీ రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్ కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించాడు సాయి కృష్ణ. సరూర్ నగర్ నుండి కారులో అప్సరను తీసుకుని.. 8:15గంటల సమయంలో బయల్దేరాడు. 9 గంటలకు శంషాబాద్ అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నాక.. టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. ఆపై గోశాలకు వెళ్దామని చెప్పి.. రాళ్లగూడ వైపు తీసుకెళ్లాడు. డిన్నర్ కోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు. అప్పటికే ఆరోగ్యం బాగోలేక అప్సర ఒకసారి వాంతి చేసుకుంది. సాయికృష్ణ ఒక్కడే భోజనం చేసి.. 12 గంటల ప్రాంతంలో సుల్తాన్ పల్లి గోశాల వద్దకు చేరుకున్నారు. అక్కడ బెల్లం దంచే రాయిని అప్సరకు తెలియకుండా కారులో దాచేశాడు. అటుపై అర్ధరాత్రి 3:50 కు వెంచర్ సైడ్ వెళ్లారు. కారు ఫ్రంట్ సీట్లో నిద్రలో ఉన్న సమయంలోనే అప్సరను హత్య చేశాడు సాయి కృష్ణ. ఇదీ చదవండి: నా భర్త అమాయకుడు.. తప్పు అప్సరదే! -
అప్సర కేసు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందంటే?
సాక్షి, హైదరాబాద్: తన కూతురు అలాంటి అమ్మాయి కాదని.. చాలా కిరాతకంగా చంపాడంటూ కాశీ నుంచి ఇంటికి చేరుకున్న అప్సర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. తమకు, సాయికృష్ణ కుటుంబానికి ఎటువంటి రిలేషన్ లేదని, ఇలా అవుతుందనుకోలేదన్నారు. తెలిసిన వెంటనే ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చానన్నారు. పూజారి అయి ఉండి ఇలా చేశాడని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని అప్సర తల్లిదండ్రులు కోరారు. కాగా, ఉస్మానియా మార్చురీలో అప్సర మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు.. ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తలకు బలమైన గాయాలు కావడంతోనే అప్సర మృతి చెందినట్లు అప్సర ప్రిలిమినరీ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది. జరిగింది ఇదే.. గుడికి వచ్చిన అప్సరతో వివాహితుడైన పూజారికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లు బాగానే గడిపారు. తీరా తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం నగర శివార్లలోకి తీసుకువెళ్లి దారుణంగా హతమార్చాడు. చదవండి: అప్సర కేసు: సాయికృష్ణ అమాయకుడా? మృతదేహాన్ని సరూర్‌నగర్ మండల ఆఫీసు వెనుక ఉన్న పాత సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి ఉప్పు, ఎర్రమట్టి నింపాడు. వాసన బయటకు రాకుండా దానికి ఉన్న రెండు మ్యాన్‌హోల్స్‌కు కాంక్రీట్ చేశాడు. తర్వాత ఆమె అదృశ్యమైనట్లు ఆర్జీఐఏ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో ముందుకు వెళ్లిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తేల్చారు. అప్సరను దారుణంగా హతమార్చిన నిందితుడు, పూజారి సాయికృష్ణను పోలీసులు, శుక్రవారం అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్ 201, 302 ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. -
అప్సర కేసు: సాయికృష్ణ అమాయకుడా?
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం, ఆపై గొడవల నేపథ్యంలో అప్సరను దారుణంగా హతమార్చిన నిందితుడు, పూజారి సాయికృష్ణను పోలీసులు, శుక్రవారం అర్ధరాత్రి జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఐపీసీ సెక్షన్ 201, 302 ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు అప్సర మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో ఇంకా శవ పరీక్ష(అటాప్సీ) పూర్తి కాలేదు. ఆ ఆలస్యానికి గల కారణాలను అధికారులు ప్రకటించాల్సి ఉంది. చాలాకాలం కిందట చెన్నై నుంచి హైదారాబాద్‌కు వలస వచ్చింది అప్సర కుటుంబం. ఆమె తండ్రి కాశీలో స్థిరపడిపోగా.. తల్లితో కలిసి సరూర్‌నగర్‌లో అద్దె ఇంట్లోంది అప్సర. ఈ క్రమంలో స్థానికంగా ఓ ఆలయంలో పెద్దపూజారిగా పని చేస్తున్న సాయికృష్ణతో గుడిలో అప్సరకు పరిచయం ఏర్పడింది. శంషాబాద్‌లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు ఆ పూజారి. ఈ క్రమంలో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు సాయికృష్ణ. అప్సర తల్లిని అక్కా అని పిలుస్తూ.. ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. వివాహితుడు అని తెలిసి కూడా అప్సర అతనితో చనువుగా ఉంటూ వచ్చింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఒత్తిడి చేయడాన్ని టార్చర్‌గా భావించి.. అప్సరను హత్య చేశానని నిందితుడు సాయికృష్ణ అంగీకరించాడు. సాయికృష్ణ అమాయకుడు! ఇక ఈ కేసులో తన కొడుకు సాయికృష్ణ అమాయకుడని అంటున్నాడు అతని తండ్రి. అప్సరతో సంబంధం ఉన్నట్లు తమకు, అంతెందుకు సాయికృష్ణ భార్యకు సైతం తెలియదని అంటున్నాడు. కేవలం డబ్బు కోసమే తన కొడుకును అప్సర కుటుంబం ట్రాప్ చేసి ఉంటుందని ఆయన అరోపిస్తున్నాడు. కూతురిని కంట్రోల్లో పెట్టుకోవాల్సింది తల్లే కదా అంటున్నాడాయన. ఓసారి అప్సర బ్యాంక్ అకౌంట్లను పరిశీలించండి.. ఆమె కుటుంబానికి ఆదాయం ఎలా వస్తుంది? అంటూ నిలదీస్తున్నాడాయన. మరోవైపు సాయికృష్ణ భార్య సైతం తన భర్తను వెనకేసుకొస్తోంది. ‘‘నా భర్తకు అప్సరతో సంబంధం లేదు. అప్సర చేసింది కరెక్ట్ కాదు. ఆమెకు ఎవరివల్ల గర్భం వచ్చిందో?. బహుశా నా భర్తను అప్సర నిజంగానే టార్చర్ చేసి ఉండొచ్చ’’ని అంటోందామె. -
కామెడీ హారర్‌గా ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’
తల్లాడ సాయికృష్ణ, మాధురి చిగురు జంటగా నటిస్తున్న కామెడీ హారర్ మూవీ ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ ,శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిలిమ్స్, క్రియేటివ్ థింగ్స్ గ్యాంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మదర్స్ డే సందర్భంగా నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. నేను చేసే ప్రతి సినిమా టైటిల్ ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉన్న పేరు నే తీసుకుంటాను. అలానే మనం చిన్నప్పటి నుండి వింటున్న టైటిల్ ఇది. హారర్ కామెడీ అంశాలు జోడించి సినిమా తీయడం జరిగింది. పిల్లలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది’ అన్నారు. (చదవండి: నా నిజాయతీని అపహాస్యం చేశారు.. ‘ది కేరళ స్టోరీ’పై అదా శర్మ ఆసక్తికర పోస్ట్) ‘నా యాక్టింగ్ కి చాలా స్కోప్ ఉన్న కథ ఇది. ఈ మధ్య అసలు హారర్ కామెడీ నేపథ్యంలో సినిమాలు రాలేదు, మా సినిమా పక్క అందరికి నచ్చుతుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు’ అని హీరోయిన్ మాధురి చిగురు అన్నారు. కామెడీతో పాటు ఈ సినిమాలో మంచి మెజేజ్ ఉంది’అని దర్శకుడు జానీ అన్నారు. -
యశస్వీకి పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరం లేదు : సింగర్
సింగర్ యశస్వి కొండెపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జాను చిత్రంలోని లైఫ్ ఆఫ్ రామ్ పాటతో ఓవర్‌నైట్ స్టార్డమ్ సంపాదించుకున్న యశస్వి తాజాగా ఓ వివాదంలో చిక్కకున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఓ షోలో యశస్వి తాను చేసిన సేవా కార్యక్రమాల గురించి వెల్లడించాడు.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రోమోలో హైలైట్‌గా నిలిచాయి. దీనిపై కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఫరౌ కౌసర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. యశస్వీ నుంచి తమకు ఎలాంటి సహాయం అందలేదని, ఏమీ చేయకుండా అబద్దపు ప్రచారాలు చేసి తమ సంస్థ పేరును వాడుకొని ఫేమ్, ఓటింగ్ పెంచుకోవాలని చూస్తున్నాడంటూ యశస్వీపై ఆరోపణలు గుప్పించింది. తాజాగా ఈ కాంట్రవర్సీపై సింగర్ శ్రీకృష్ణ స్పందించారు. 'యశస్వీ కేవలం పబ్లిసిటీ కోసం ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఎందుకంటే తాను వివిధ ఎన్జీవోలకు పెద్ద మొత్తంలో సహాయం చేయడం నేను స్వయంగా చూశాను. అతను ఆల్రెడీ అందరికి తెలిసిన సింగర్. అలాంటప్పుడు ఇలా పబ్లిసిటీ స్టంట్లు చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి నిజం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఈ పోస్ట్ చేస్తున్నాను. నేను యశస్వికి సపోర్ట్ చేస్తున్నా' అంటూ ఇన్‌స్టాలో సుధీర్ఘ పోస్టులో రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Srikrishna Vishnubhotla (@music.srikrishna) View this post on Instagram A post shared by yasaswi_fanpage (@yasaswi_girl_fanpage) -
వాస్తవ ఘటనలతో సందేశాత్మకంగా ‘నమస్తే సేట్జీ’
తల్లాడ సాయికృష్ణ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘నమస్తే సేట్జీ..’. అమ్మినేని స్వప్న హీరోయిన్. తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు రామసత్యనారాయణ, మహంకాళి దివాకర్ పాల్గొని ట్రైలర్, ఆడియోలను లాంచ్ చేశారు. సాయికృష్ణ మాట్లాడుతూ– ‘‘కిరాణా షాపు యజమానుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. కరోనా టైమ్‌లో నన్ను కలచివేసిన వాస్తవ ఘటనలతో సందేశాత్మకంగా ఈ సినిమా తీశాను’’ అన్నారు. ‘‘ప్రతి కిరాణా షాపు యజమాని చూడాల్సిన చిత్రమిది’’ అన్నారు తల్లాడ శ్రీనివాస్. -
విపత్తు నిర్వహణ శాఖ నిర్లక్ష్యంపై ఫిర్యాదు
నాంపల్లి: రాష్ట్రంలో పిడుగుపాటుతో మరణించిన బాధిత కుటుంబాలను ఆదుకుని, వారికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ శనివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. పిడుగుపాటు నివారణ చర్యలు చేపట్టడంతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశంలో పిడుగుపాటు ప్రమాదాల్లో తెలంగాణ 14వ స్థానంలో ఉందని, గడచిన ఆరేళ్లలో ఇక్కడ 398 మంది మృత్యువాతపడ్డారని, ఇందుకు సంబంధించి ‘సాక్షి’లో పూర్తి వివరాలు ప్రచురితమయ్యాయని వివరించారు. ప్రమాదాలకు గురైనవారిలో అధికంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవించే రైతులు, రైతుకూలీలు ఉన్నట్లు తెలియజేశారు. పిడుగుపాటుకు బలైన నిరుపేద కుటుంబాల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రోడ్డునపడ్డ కుటుంబాలను ఆదుకోవడం, పిడుగుపాటు నివారణ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, పుణే ఐఐటీ దామిని అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ఇది 20 కిలో మీటర్ల నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుపాటు ప్రమాదంపై ముందే హెచ్చరికలను జారీ చేస్తుందని తెలిపారు. అధునాతన పరికరాల సహాయంతో అనేక రాష్ట్రాల్లో, మండలాల్లో, గ్రామాల్లో వీటి సందేశాలతో ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తం చేస్తున్నాయని తెలిపారు. ఇక్కడ మాత్రం విపత్తుల నిర్వహణ శాఖ నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పిడుగుపాటు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టేలా చూడాలని, పిడుగుపాటుకు గురై మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది తన ఫిర్యాదులో కోరారు. -
జమిలి ఎన్నికల ఆలోచన బీజేపీకి లేదు
సాక్షి, విజయవాడ: జమిలి ఎన్నికల ఆలోచన బీజేపీకి లేదని ఆ పార్టీ ఏపీ అధికార ప్రతినిధి సాయికృష్ణ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జమిలి ఎన్నికలపై చంద్రబాబు చేస్తోన్న ప్రచారాన్ని ఆయన తప్పబట్టారు. చంద్రబాబు ఆలోచన ఏమిటో అర్థం కావడంలేదన్నారు. దేశాన్ని ఐదేళ్లు పరిపాలించమని నరేంద్ర మోదీ సారథ్యంలో నడుస్తున్న బీజేపీని ప్రజలు గెలిపించారు. అదే విధంగా ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు గెలిపించారని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రాలేని చంద్రబాబు.. ఏకంగా ఏపీ గద్దె పై కూర్చోవాలని కలలు కంటున్నారని, పేలపిండి సామెతలా చంద్రబాబు తీరు ఉందని దుయ్యబట్టారు. (చదవండి: ‘చంద్రబాబు ఏమైనా దేవదూతనా..’) ‘‘దేశం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం, సరిహద్దుల్లో ఉన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య పాకిస్తాన్, చైనాకు దీటుగా బదులిచ్చే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. జమిలి వంటి ఆలోచన ప్రధాని మోదీకి లేదు. రాజకీయ నిరాశ్రయుడిగా చంద్రబాబు మారారు. రాజకీయ నిరాశ్రయులకు ఎక్కడో ఒకచోట అశ్రయం కావాలి. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో అశ్రయం పొందుతున్నారు. తిరిగి ఏపీలో అశ్రయం కోరుకుంటూ కలలు కంటున్నారని’’ ఆయన ఎద్దేవా చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాట్లాడుకుంటుంటే కిటికీలోంచి చంద్రబాబు విన్నట్టుగా మాట్లాడుతున్నారని, అవి అసంబద్ధ రాజకీయ ప్రేలాపనలని.. వాటి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. (చదవండి: సీఎం జగన్ సంకల్పం.. ఏపీ నెంబర్‌వన్) -
నరుడి బ్రతుకు నటన
తల్లాడ సాయికృష్ణ, మాధురి చిగురు జంటగా తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. జానీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ అన్నపూర్ణ క్రియేష¯Œ ్స పతాకంపై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం 70శాతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ‘‘హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. శివ కాకు అందించిన కథ ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మరొక షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది’’ అన్నారు శ్రీనివాస్. ‘‘జర్నలిస్ట్‌గా వృత్తి నిర్వహిస్తున్న నాకు దర్శకత్వం చేయాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరింది.’’ అన్నారు జాని. ‘‘నేను నటించిన మూడు సినిమాలు వైవిధ్యమైన కథలతోనే ఉంటాయి. ఈ చిత్రం కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ చివరి షెడ్యూల్‌ను షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యాం–శ్రీకాంత్. -
ఆంధ్ర 173 ఆలౌట్
నాదౌన్: బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగా హిమాచల్ ప్రదేశ్‌తో శుక్రవారం మొదలైన రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే ఆలౌటైంది. సాయికృష్ణ (74; 9 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా... చివర్లో మనీశ్ (47 బంతుల్లో 32; 6 ఫోర్లు) కొన్ని పరుగులు చేశాడు. హిమాచల్ బౌలర్లు పంకజ్ జైస్వాల్ (5/50), అర్పిత్ (2/43), రిషి ధావన్ (2/47) ధాటికి ఆంధ్ర బ్యాట్స్‌మెన్ ఎదురు నిలువలేకపోయారు. ఓపెనర్ ప్రశాంత్ (0), జ్ఞానేశ్వర్ (19) రికీ భుయ్ (10) భరత్ (1), కెప్టెన్ సుమంత్ (9), గిరినాథ్ రెడ్డి (2), షోయబ్ ఖాన్ (5) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం హిమాచల్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 51 పరుగులు చేసింది. ప్రశాంత్ చోప్రా (32 బ్యాటింగ్), ప్రవీణ్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
తెలంగాణ, ఏపీ మధ్య గొడవ సృష్టించాలని..
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ప్రజలను రెచ్చగొట్టడం అలవాటుగా మారిందని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఓటుకు నోటు కేసు సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య గొడవ సృష్టించాలని ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణా ఎన్నికల్లో లబ్ది కోసమే నాన్‌బెయిలబుల్ వారంట్ అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, అమిత్ షాపై చంద్రబాబు చేస్తోన్న అబద్ధపు విమర్శలను ప్రజలను గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. 20 సీట్లు కూడా రావు: బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబుపై కేసు నమోదైందని, కేసు పెట్టిన కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీపై విమర్శలు చేయడం చంద్రబాబుకు తగదన్నారు. చంద్రబాబు కోర్టుకు వెళ్లకపోవడం వల్లనే నోటీసులు వచ్చాయని స్పష్టం చేశారు. మోదీపై విమర్శలు చేయడం వల్ల తెలంగాణ ఎన్నికల్లో, ఏపీ ప్రజల్లో సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 22 సార్లు చంద్రబాబుకు కోర్టుకు హాజరుకాకపోవడం వల్లే నోటీసులు వచ్చాయని తెలిపారు. జాతీయ స్థాయిలో మోదీ గ్రాఫ్ పడిపోతుందని అనే వారికి నిన్నటి సర్వేలు చెంపపెట్టు లాంటివన్నారు . ఏపీలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో వ్యక్తమవుతోందని, ఇదేవిధంగా ప్రజా వ్యతిరేకత టీడీపీపై కొనసాగితే వచ్చే ఎన్నికల్లో 20 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. టీడీపీకి వైఎస్సార్సీపీకి సర్వేల్లో 5 నుంచి 6 శాతం ఓట్ల తేడా ఉంది..రానున్న రోజుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను గ్రాఫిక్స్‌తో భ్రమలలో ముంచుతున్నారని ఎద్దేవా చేశారు. -
నటుడు శివాజీది తప్పుడు ప్రచారం
విజయవాడ: బీజేపీ నాయకత్వంపై సినీ నటుడు శివాజీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై ప్రజల దృష్టిని మరల్చేందుకే శివాజీతో చంద్రబాబు ఆపరేషన్ గరుడ అంటూ మాట్లాడిస్తున్నారని విమర్శించారు. మతి భ్రమించిన శివాజీ, బాబు డైరెక్షన్లో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదు నెలల క్రితం శివాజీ ఇదే ఆపరేషన్ గరుడ గురించి మాట్లాడారు..అందులో ఏ ఒక్కటైనా నిజమైందా అని సూటిగా ప్రశ్నించారు. ఆపరేషన్ గరుడ అనేది బీజేపీపై తప్పుడు ప్రచారం చేసేందుకు ఎత్తుకున్న విషయమని, అది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా తయారు చేసిందని ఆరోపించారు. టీడీపీ కాంగ్రెస్ పొత్తు అపవిత్రమైంది..కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో సోనియాను దెయ్యం అన్న చంద్రబాబు ఇప్పుడు అదే సోనియా గాంధీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని సూటిగా అడిగారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిదన్న చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ధ్వజమెత్తారు. -
‘వీడు అసాధ్యుడు’ షూటింగ్ ప్రారంభం
కమర్షియల్ అంశాలతో పాటు సోషల్ మెసెజ్ సినిమా అంటే ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి కోవకు చెందిన ఓ కొత్త సినిమా గురువారం ప్రారంభమైంది. ఫిలింనగర్లో మొదలైన సినిమాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా హాజరయ్యారు. ‘వీడు అసాధ్యుడు’ సినిమాతో మరో కొత్త హీరో టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ముహుర్తపు సన్నివేశానికి శివాజీ రాజా క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. ‘ఒక కమర్షియల్ అంశానికి సోషల్ మెజేస్ జోడించి రూపొందిస్తోన్నాం. ఇందులో లవ్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలుంటాయి. హీరో అడ్వకేట్ గా నటించారు. హీరోయిన్ ఒక ఎన్నారై పాత్రలో నటిస్తోంది. వీరిద్దరికీ ఎలా పరిచయం అయింది. ఆ పరిచయం ఎలాంటి మలుపులకు దారి తీసిందనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందుకుంటోన్న చిత్రమ’ని దర్శకుడు పియస్ నారాయణ తెలిపారు. తాను హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని హీరో కృష్ణ సాయి కోరారు. ఈ సినిమాలో జహీదా శామ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని ఎమ్మెస్కే రాజు నిర్మించగా, శంభు ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. -
నడిరోడ్డుపై కర్రలతో టీడీపీ నేత దాదాగిరి..
సాక్షి, అమరావతిబ్యూరో : రాజధాని అమరావతిలో సామాన్య ప్రజలకు రక్షణ కరువైంది. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోంది. తాము చెప్పిందే వేదం... చెప్పినట్లు వినాల్సిందే.. లేదంటే దాడే.. అన్న రీతిలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. సచివాలయానికి కూతవేటు దూరంలో రోడ్డు పైనే సాధారణ జనాన్ని చితకబాదుతున్నారంటే రాజధానిలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మందడానికి చెందిన టీడీపీ నేత గుర్రం సాయికృష్ణ ఓ హోటల్ మేనేజర్‌పై నడిరోడ్డుపైనే కర్రలతో దాడికి పాల్పడ్డాడు. పాత బకాయి చెల్లించి బిర్యానీ తీసుకెళ్లాలని సూచించడంతో... నన్నే డబ్బులు అడుగుతావా అంటూ మేనేజర్‌పై ఒక్కసారిగా కర్రలతో దాడికి దిగాడు. ఈ ఘటన ఈ నెల 17వ తేదీ జరగగా 18వ తేదీ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి జరిగిన రోజే బాధితుడు జి. నాగసురేష్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసేందుకు జంకినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీడీపీ నేతలు హెచ్చరించినా బాధితుడు వెనక్కి తగ్గకపోవడంతో ఎట్టకేలకు 18వ తేదీ దాడికి పాల్పడిన గుర్రం సాయి, శశిధర్, శ్రీనివాసరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిని కేసు నుంచి ఎలాగైనా తప్పించేందకు ఓ జెడ్పీటీసీ సభ్యుడితో సహా నియోజకవర్గ టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నారని తుళ్లూరు పోలీసులు చెబుతున్నారు. మందడం టీడీపీ నేతలపైనే ఫిర్యాదులు స్థలం విషయమై తాను చెప్పినట్లు వినకపోవడంతో ఈ ఏడాది జనవరిలో మందడం గ్రామానికి చెందిన టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడ్డాడు. మందడం పంచాయతీ కార్యాలయంలోనే తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ, భౌతికంగా దాడి చేశాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే టీడీపీ నేతపై కేసు నమోదు చేయకుండా అప్పట్లో నియోజకవర్గ నేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే పంచాయతీ కార్యదర్శి వెనక్కితగ్గకపోవడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. టీడీపీ హయాంలో ప్రజలకు రక్షణ కరువు ఈ ఏడాది ఫిబ్రవరిలో తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రెండో దశ నీరు – ప్రగతి కార్యాక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా జి.కొండూరు మండలానికి చెందిన రామాంజనేయులు సీఎం ముందు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో జల సంరక్షణ కాదు.. జనానికి రక్షణ కరువైందని వాపోయాడు. మందడం గ్రామానికి చెందిన మాదల సుబ్బయ్య కుమారుడు తనపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదని కన్నీటిపర్యంతమయ్యాడు. దీంతో సీఎం కల్పించుకుని రామాంజనేయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులకు వంతపాడేలా మాట్లాడారు. అనంతరం రామాంజనేయులుకు న్యాయం చేయాలని రూరల్ ఎస్పీ అప్పలనాయుడును ఆదేశించారు. ఇది జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంత వరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అలాగే అనంతవరంలో మట్టి తరలింపులో టీడీపీ నేతల మధ్యే బేదాభిప్రాయాలు తలెత్తడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. రాజధాని గ్రామాల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని వారు కోరుతున్నారు. -
పల్లెటూరి ప్రేమకథ
ప్రముఖ దర్శకులు రాజమౌళి వద్ద ‘మగధీర’ చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేసిన సాయికృష్ణ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘అనగనగా ఒక ఊళ్ళో’. అశోక్ కుమార్, ప్రియాంక శర్మ జంటగా చంద్ర బాలాజీ ఫిల్మ్స్ పతాకంపై కె.చంద్రరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. సాయికృష్ణ మాట్లాడుతూ –‘‘రాజమౌళిగారి స్ఫూర్తితో దర్శకునిగా మారా. అశోక్ కుమార్ కొత్తవాడైనా అనుభవం ఉన్నవాడిలా తన పాత్రలో జీవించాడు. సినిమా విడుదల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు మరో యువ హీరో వచ్చాడని అంటారు. నాకు దర్శకునిగా అవకాశమిచ్చిన చంద్రరావుకు జీవితాంతం రుణపడి ఉంటా’’ అన్నారు. ‘‘ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఇది. పల్లెటూరి నేపథ్యంలో ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి’’ అన్నారు అశోక్ కుమార్. ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్ యస్, సంగీతం: యాజమాన్య, సహనిర్మాత: శ్రీతేజ్ మనోజ్ పాలిక.