తల్లాడ సాయికృష్ణ, మాధురి చిగురు జంటగా నటిస్తున్న కామెడీ హారర్ మూవీ ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ ,శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిలిమ్స్, క్రియేటివ్ థింగ్స్ గ్యాంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మదర్స్ డే సందర్భంగా నేడు విడుదల చేశారు.
ఈ సందర్భంగా తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. నేను చేసే ప్రతి సినిమా టైటిల్ ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉన్న పేరు నే తీసుకుంటాను. అలానే మనం చిన్నప్పటి నుండి వింటున్న టైటిల్ ఇది. హారర్ కామెడీ అంశాలు జోడించి సినిమా తీయడం జరిగింది. పిల్లలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది’ అన్నారు.
(చదవండి: నా నిజాయతీని అపహాస్యం చేశారు.. ‘ది కేరళ స్టోరీ’పై అదా శర్మ ఆసక్తికర పోస్ట్)
‘నా యాక్టింగ్ కి చాలా స్కోప్ ఉన్న కథ ఇది. ఈ మధ్య అసలు హారర్ కామెడీ నేపథ్యంలో సినిమాలు రాలేదు, మా సినిమా పక్క అందరికి నచ్చుతుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు’ అని హీరోయిన్ మాధురి చిగురు అన్నారు. కామెడీతో పాటు ఈ సినిమాలో మంచి మెజేజ్ ఉంది’అని దర్శకుడు జానీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment