
తల్లాడ సాయికృష్ణ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘నమస్తే సేట్‌జీ..’. అమ్మినేని స్వప్న హీరోయిన్. తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు రామసత్యనారాయణ, మహంకాళి దివాకర్ పాల్గొని ట్రైలర్, ఆడియోలను లాంచ్ చేశారు. సాయికృష్ణ మాట్లాడుతూ– ‘‘కిరాణా షాపు యజమానుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. కరోనా టైమ్‌లో నన్ను కలచివేసిన వాస్తవ ఘటనలతో సందేశాత్మకంగా ఈ సినిమా తీశాను’’ అన్నారు. ‘‘ప్రతి కిరాణా షాపు యజమాని చూడాల్సిన చిత్రమిది’’ అన్నారు తల్లాడ శ్రీనివాస్.
Comments
Please login to add a commentAdd a comment