Thallada Saikrishna's 'Mystery' Movie Latest Update - Sakshi
Sakshi News home page

డబ్బింగ్‌ పనుల్లో ‘మిస్టరీ’

Published Tue, Aug 1 2023 2:14 PM | Last Updated on Tue, Aug 1 2023 3:03 PM

Mystery Movie Latest Update - Sakshi

తల్లాడ సాయికృష్ణ హీరోగా స్వీయదర్శకత్వంలో టించిన చిత్రం మిస్టరీ. స్వప్న చౌదరి హీరోయిన్‌. అలీ, సుమన్‌, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలపాత్రల్లో నటించారు. పీవీ ఆర్ట్స్‌ పతాకంపై వెంకట్‌ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది.

తాజాగా ఈ చిత్రంలోని తన పాత్రకు అలీ డబ్బింగ్‌ చెప్పారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ‘ఇదొక థ్రిల్లర్‌ కామెడీ సినిమా. సాయి అనుకున్న కథని అనుకున్నట్లుగా తీశాడు. నా పాత్ర డబ్బింగ్‌ పూర్తయింది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికి నచ్చుతుంది. టీమ్‌ అందరికి నా అభినందనలు’అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement