సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘మిస్టరీ’..షూటింగ్‌ షురు | Mystery movie Shooting starts ay hyderabad | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘మిస్టరీ’..షూటింగ్‌ షురు

Published Sat, Jul 8 2023 4:06 AM | Last Updated on Sat, Jul 8 2023 1:13 PM

Mystery movie Shooting starts ay hyderabad - Sakshi

తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, సుమన్, అలీ, తనికెళ్ల భరణి, సత్య శ్రీ, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక పాత్రల్లో ‘మిస్టరీ’ సినిమా షురూ అయింది. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో పీవీ ఆర్ట్స్‌ పతాకంపై వెంకట్‌ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ నెల 21 వరకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుగుతుంది. సింగిల్‌ షెడ్యూల్‌లో షూటింగ్‌ని పూర్తి చేస్తాం. సెప్టెంబర్‌ చివరి వారంలో ‘మిస్టరీ’ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్‌ తవ్వ, కెమెరా: సుధాకర్, శివ రాథోడ్‌.

పవర్ ఫుల్ పోలీస్‌గా రవిరెడ్డి

ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో  నటుడు ‘రవి రెడ్డి’ చేస్తున్నట్లు టీం సభ్యులు తెలిపారు. గతంలో వి, విరాటపర్వం, గాలోడు లాంటి సినిమా లలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు రవిరెడ్డి. ఈ చిత్రంలో  మంచి పాత్ర పోషిస్తున్నానని, రిలీజ్‌ తర్వాత మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement