breaking news
Saikrishna
-
బాబూ.. చరిత్రలో ఇది చీకటి అధ్యాయం!
ఎంతటి పెద్ద కేసు అయినా దానిని మేనేజ్ చేయడం ఒక ఆర్ట్. అలాగే ఎంత చిన్న కేసు అయినా దానిని పెద్దదిగా చూపించడం కూడా ఓ కళే. ఇది అందరివల్ల సాధ్యం అయ్యే పని కాదు. కాని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ విషయంలో ఉన్న నేర్పరితనం బహుశా దేశంలోనే ఇంకెవ్వరికి ఉండదేమో! దీనిని ప్రశంసగా అయినా తీసుకోవచ్చు. లేదా విమర్శగా అయినా భావించవచ్చు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా పలు ఎన్ కౌంటర్ ఘటనలు జరిగాయి. వాటిపై పెద్ద వివాదాలు చెలరేగాయి. అయినా వాటిలో తన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చేసుకోగలిగిన తెలివి ఆయనది అని చెప్పాలి. అత్యంత సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అనే యువకుడి లాకప్ డెత్ కేసును చంద్రబాబు ఎలా హాండిల్ చేశారో చూడండి. సాయి కృష్ణ తల్లికాని, ఇతర కుటుంబ సభ్యులు కాని తొలుత మాట్లాడినదానికి, చంద్రబాబును కలిసిన తర్వాత చెప్పిన విషయాలకు ఎంత తేడా ఉందో గమనించి అంతా ఆశ్చర్యపోవలసి వచ్చింది.ఆ కుటుంబ సభ్యులకు ఏమి న్యాయం జరిగిందో ఎవరికి తెలియదు కాని,వారు చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌లతో పాటు లోకేష్‌కు కూడా ధన్యవాదాలు తెలిపిన వైనం ఆసక్తికరంగా మారింది. వారికి నిజంగా ఏదైనా న్యాయం జరిగి ఉంటే అది ఏరకంగా జరిగిందో చెప్పి ఉండేవారు. బహిర్గతం చేయలేదంటే భయపడ్డారేమో అన్న సందేహం వస్తుంది. లేదా వారికి ఏమైనా ఇతరత్రా సాయం అందించడానికి అవగాహన కుదిరిందేమో అన్న సంశయం కలుగుతుంది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు దీనిపై వ్యాఖ్యానిస్తూ సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండవచ్చని, అయినా తాము ఈ కేసుపై పోరాటం ఆపబోమని అన్నారు. జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మరింత గట్టిగా మాట్లాడుతూ సాయికృష్ణ కుటుంబం రాజీ పడినా, తాము వెనక్కి తగ్గబోమని, ఈ హత్య ఏపీ సమాజంపై జరిగిన దాడిగా తాము పరిగణించి ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తామని తెలిపారు. అంతేకాక ఆ కేసులోఎవరెవరి ప్రమేయం ఉండే అవకాశం ఉందో తెలుపుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఎల్లో మీడియా కాని ,టీడీపీ పక్షాన ప్రచారం చేసే డిజిటల్ మీడియా కాని, తొలుత సాయికృష్ణపైన, ఆయన కుటుంబాన్ని పరామర్శించిన జగన్,వైఎస్సార్సీపీ నేతలపై అడ్డగోలుగా ప్రచారం చేశాయి.ఆ కుటుంబాన్ని కలవడం ద్వారా జగన్ చాలా పెద్ద తప్పు చేశారని, రౌడీషీటర్ కుటుంబాన్ని కలుస్తారా అని టీడీపీ నేతలు దూషించారు. సాయి తల్లిని పరామర్శించి జగన్ ధైర్యం చెప్పాక, పరిస్థితి తీవ్రతను గమనించిన చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆమెను,ఇతర కుటుంబ సభ్యులను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఆ తర్వాత వీరి స్వరం మారింది. ఈ ఉదంతంతో ఎల్లో మీడియా పరువుపోయినట్లయింది. చంద్రబాబు భేటీ తర్వాత ఎల్లో మీడియా ఫ్లేట్ ఫిరాయించేసింది. చంద్రబాబు ఎందుకు ఇంత కంగారుపడి ఆ కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారన్నదానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ కేసు కేవలం సిఐ నాగరాజుకే పరిమితం కాదని,ఆ పైన ఉన్న అధికారులకు,ప్రభుత్వంలో కీలకమైన పదవులలో ఉన్నవారికి కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న భావనతో చంద్రబాబు ఈ జాగ్రత్త తీసుకుని ఉండవచ్చు. సాయి కుటుంబం వారు జనసేన పార్టీవారని, కాపు సామాజిక వర్గంవారని వెల్లడైంది. ఇటీవలి కాలంలో పలు ఘటనలలో కాపు వర్గానికి చెందినవారు కూడా ఇబ్బంది పడుతుండడం ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేస్తోంది. ఈ నేపధ్యంలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను తన వైపునకు తిప్పుకుంటే మొత్తం కేసు బలహీనపడిపోవచ్చని అనుకుని ఉండవచ్చని అంటున్నారు.ఈ కేసు బహిర్గతం అయిన తర్వాత,ఏపీలో పలు ఇతర పోలీస్ స్టేషన్ లలో ఇలాంటి లాకప్ హింసలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మరిన్ని వెలుగులోకి రావడం కూడా ఆందోళన కలిగించి ఉండవచ్చు.కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే హింసను తాళలేక ఒక దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్న కేసు కూడా ప్రజలలోకి వెళ్లింది. వైఎస్సార్సీపీ నేతలు అతని కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి తీవ్రమైన విమర్శలు చేశారు. తెనాలి, కౌతాళం, విజయనగరం తదితర చోట్ల కూడా మరికొన్ని వేధింపుల కేసులు మీడియాలో రిపోర్టు అయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ రెడ్ బుక్ పేరుతో జరిగినన్ని అరాచకాలు ఇన్నీ అన్నీ కావు. ప్రభుత్వం అరాచకాలు నిర్వహించడానికి ఒక శాఖను ఏర్పాటు చేసిందా అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. సుమారు ఏభై రోజులపాటు సాయికృష్ణ కేసును ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలీసు అధికారుల చుట్టూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎన్ని రోజులు తిరిగినా ఫలితం దక్కలేదు. చివరికి వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ కేసులో అనేక విషయాలను వెలుగులోకి తీసుకురావడంతో కలకలం ఏర్పడింది.ఆ తర్వాత విజయలక్ష్మి తన బిడ్డ బూడిదైనా ఇవ్వండి అని వాపోయిన కధనం సాక్షి మీడియాలో వచ్చినప్పుడు హృదయమున్న ప్రతి వ్యక్తికి ఆవేదన కలిగించింది. హింసించి హతమార్చడమే కాకుండా, ఆ యువకుడిని కాల్చి బూడిద చేయడమేమిటని అందరూ మాట్లాడుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి ,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రాజకీయాలకు అతీతంగా, కులాలతో సంబంధం లేకుండా సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించి,ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించడంతో ఒక్కసారిగా చంద్రబాబు ప్రభుత్వం ఉలిక్కిపడింది.తదుపరి అర్ధరాత్రి వేళ కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో వైపు విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన ఇన్ చార్జీ అమ్మిశెట్టి వాసు ఈ బాధిత కుటుంబంతో రాయబేరాలు చేసి డబ్బు ఆఫర్ చేశారన్న ఆరోపణ వచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగిందన్న అనుమానం బలపడింది. ఈ సంగతిని సాయి మేనమామే తెలిపారు.జనసేన నేతలకు ఈ ఘోరం గురించి చెప్పినా పట్టించుకోలేదని,అందువల్లే తాము అంబటి రాంబాబుకు వివరాలు అంందిచామని ఆయన చెప్పారు. వరంగల్ లో ఒక బాలుడి పలకరించడానికి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లకపోవడం కూడా విమర్శలకు దారి తీసింది. చంద్రబాబు ఒక సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ,డిజిపిలతో దీని గురించి చర్చించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సర్కిల్ ఇన్ స్పెక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక ఎసీపీ స్థాయి అధికారిని దర్యాప్తునకు తొలుత నియమించినా,ఆ తర్వాత ఐపిఎస్ లతో కూడిన ఒక సిట్ ను ఏర్పాటు చేశారు.అయినా కేసులో న్యాయం జరుగుతుందా?లేదా?అన్న సందేహాలపై చర్చలు జరుగుతున్నాయి. సీబీఐ విచారణకు విపక్షం డిమాండ్ చేస్తోంది. కేవలం ఒక్క సిఐ మాత్రమే ఇలాంటి ఘోరం చేయలేరని, ఉన్నతాధికారుల ప్రమేయం కూడా కచ్చితంగా ఉందని జడ శ్రావణ్ ఆరోపించారు.ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వంలోని పెద్దలకు కూడా ముందే తెలుసని,వాటిని బయటపెడతానని ఆయన అన్నారు..సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడ సీపీ ఆధ్వర్యంలో ఉండే టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకు రావడం,కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లోను, తదుపరి ఒక ప్రైవేటు హోటల్ లోను పెట్టి తీవ్రంగా హింసించడం, గాయపడ్డ అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లడం, ప్రాణం కోల్పోయిన సాయికృష్ణు బస్టాండ్ లో అనాధ శవంగా చూపే ప్రయత్నం చేసి, ఆ తర్వాత స్మశానవాటికలో దహనం చేయడం వంటి ఘట్టాలను జడ శ్రవణ్ పూసగుచ్చినట్లు వివరించారు.కాగా తన కుమారుడిని పోలీసులు పొట్టన పెట్టుకున్నారని ఆరోపించి పలు ప్రశ్నలు వేసిన సాయికృష్ణ తల్లి,ఆమె సోదరులు శుక్రవారం నాడు చంద్రబాబును కలిసిన తర్వాత తమకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని అంటూ,ఆయన వంటి మహోన్నత వ్యక్తి,పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి నాయకులు తమకు న్యాయం చేసి చూపించి ప్రభుత్వ పాలన సరిగ్గా ఉందని చాటారని మేనమామ నవరంగ్ అనడం పలు సందేహాలకు తావిచ్చింది. ప్రభుత్వం అంత గొప్పగా పని చేసి ఉంటే, ఒకరోజు ముందు ఇదే నవరంగ్ తమను ఎవరూ పట్టించుకోలేదని ఎందుకు విమర్శించారో తెలియదు. ఈ కేసులో వారికి ఎలాంటి న్యాయం జరిగిందో క్లారిటీగా సాయి కుటుంబ సభ్యులు చెప్పలేదు. ప్రభుత్వమూ వివరణ ఇవ్వలేదు. చంద్రబాబు పద్దెనిమిదేళ్ల పాలనకాలంలో ఇలాంటివి పలు ఘటనలు జరిగాయి.నక్సైలైట్ల ఉద్యమ ప్రభావం అధికంగా ఉన్న రోజులలో కొన్ని ఎన్ కౌంటర్లు జరిగాయి. గత టరమ్ లో తిరుమలలో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు ఇరవై మంది ఎదురుకాల్పులలో మరణించారు. పుష్కరాలలో తొక్కిసలాట లో 29 మంది మరణించిన విషయంలో సిసిటీవీ ఫుటేజీ మిస్ అవడం మిస్టరీ అని అప్పట్లో విపక్షాలు విమర్శించేవి. ఇలాంటి ఘటనలలో ఎన్ని ఆరోపణలు వచ్చినా తన ప్రభుత్వానికి,తన పదవికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆయన జాగ్రత్తపడగలిగారు. గతంలో కోడెల శివప్రసాద్ ఆస్పత్రిలో బాంబులు పేలి నలుగురు మరణించినప్పుడు సీబీఐ విచారణ జరగకుండా చూసుకోగలిగారు. చింతమనేని ప్రభాకర్ తో సహా పలువురు టీడీపీ,జనసేన ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు వచ్చినా పోలీసులు నిశ్చేష్టులై ఉంటున్నారన్న విమర్శ ఉంది. బలహీనవర్గాలవారిపైన ప్రత్యర్ది పార్టీవారిపైన మాత్రం పోలీసులు రెచ్చిపోతున్నారు.ఈ టరమ్ లో ఎన్ని వందలమందిని రెడ్ బుక్ పేరుతో వేధించారో లెక్కలేదు.తెనాలిలో ముగ్గురు యువకులను నడిరోడ్డులో కూర్చోబెట్టి అరికాళ్లపై దారుణంగా పోలీసులు కొట్టడం మొదలు , పలు కేసుల్లో తీవ్రంగా హింసించడం, చిన్న,చిన్న కేసులలో సైతం వైఎస్సార్సీపీవారైతే నడిరోడ్డుపై నడిపించి అవమానించడం, అదే టీడీపీ వారు ఎన్ని దౌర్జన్యాలు చేసినా నామమాత్రంగా కేసు పెట్టడం వంటివి చేస్తున్నారు. అంబటి రాంబాబు,జోగి రమేష్ ,నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి మాజీ మంత్రుల ఇళ్లపై గంటల తరబడి టీడీపీ క్యాడర్ దాడి చేస్తే మాత్రం పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించారు.దీనితో ఏపీలో పోలీసు రాజ్యం ప్రజలను ఎలా పీడిస్తోందో వివరిస్తూ జగన్ దేశం అంతటికి తెలియచేసే యత్నం చేశారు. చంద్రబాబు ఎంత మేనేజ్ మెంట్ నేర్పరి అయినా ,ఎన్ని కేసుల్లో ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చినా,ఈ సాంకేతిక యుగంలో అన్నీ తెలిసిపోతున్నాయి.చరిత్రలో ఇదో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందన్న సంగతి ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పవన్ కల్యాణ్‌పై అంబటి సంచలన వ్యాఖ్యలు..
సాక్షి, తాడేపల్లి: గాదె సాయికృష్ణ కేసుకు సంబంధించి పోలీసులు మూతికి ప్లాస్టర్ వేసుకున్నారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయరు?. సీఐ నాగరాజును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు వైఎస్సార్సీపీ భయపడదు. సమాజానికి పట్టిన చీడ పురుగు పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చ అయ్యాయి. సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్‌ఫోర్స్ తీసుకొచ్చింది. సీపీ ఆదేశాలు లేకుండా టాస్క్‌ఫోర్స్ అడుగు కూడా ముందుకు వేయదు. సీపీ ప్రమేయంతోనే మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చారు. చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రవేశపెట్టాలి. కోర్టులో ప్రవేశపెట్టకపోతే అక్రమంగా నిర్బంధించినట్టే అవుతుంది. టాస్క్‌ఫోర్స్ తీసుకొచ్చి హింసించి చంపారంటే గూడుపుఠాణి ఉందనుకోవాలి.సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ.. సీఐ నాగరాజే కాదు సాయికృష్ణ లాకప్ డెత్‌లో చాలా మంది ప్రమేయం ఉంది. ఈ కేసులో విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ చేయాలి. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయరు?. సీఐ నాగరాజును విచారిస్తే పెద్దల పేర్లు బయటకు వస్తాయని భయం. లాకప్ డెత్ కేసులో పోలీసులు నాటకాలు ఆడుతున్నారు. సీఐ నాగరాజును వెంటనే అరెస్ట్ చేయాలి. బాధ్యతల నుంచి సీఎం, హోంమంత్రి తప్పించుకోలేరు. విజయవాడ పోలీసు స్టేషన్లలో చట్టాలు అమలు కావడం లేదు. విజయవాడ సీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలి. సీపీని సస్పెండ్ చేసి విచారణ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి. సాయికృష్ణ కోసం వెళ్లి టాస్క్‌ఫోర్స్ పోలీసుల పేర్లు బయటపెట్టాలి.సాక్షులను బెదిరిస్తున్నారు..సాయికృష్ణ లాకప్ డెత్‌పై పోలీసులు మాట్లాడటం లేదంటే కుట్ర ఉందని అనుకోవాలి. పోలీసులు నేరం చేస్తే పోలీసులే విచారణ చేయమేంటి?. సాయికృష్ణ, క్రాంతి కుమార్ కుటుంబాలకు రక్షణ కల్పించాలి. సాయికృష్ణ కేసులో సాక్షులను బెదిరిస్తున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు.. సాయికృష్ణ తల్లిని పిలిపించి మాట్లాడుతున్నారు. మరోవైపు.. సాయికృష్ణ క్రిమినల్ అంటూ పవన్ కల్యాణ్ మాట్లాడుతారు. కాపు నేతల సమావేశానికి ముందు మీటింగ్‌లో పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అసలు కులం పేరు ఎత్తిందే పవన్. కాపులను క్రిమినల్స్‌గా ముద్రవేసే కుట్ర జరుగుతోంది.పవన్ కల్యాణ్‌కు ఏం తెలియదు..వైఎస్సార్సీపీలో గూండాలు లేరు.. జనసేలోనే గూండాలు ఉన్నారు. పవన్ కల్యాణ్ ఉడత ఊపులకు వైఎస్సార్సీపీ భయపడదు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరించకు పవన్. రక్షించాల్సిన వారే భక్షించారు.. ఇలా చాలా పెద్ద తప్పు. పవన్ కల్యాణ్‌కు ఏం తెలియదు.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సమాజానికి పట్టిన చీడ పురుగు పవన్. జనసేన నేత తాతాజీ.. వైఎస్ జగన్ గురించి ఏం మాట్లాడారో విన్నావా పవన్?. పవన్ కల్యాణ్‌కు బుర్రలేదు, సిగ్గులేదు. తాతాజీ, చింతమనేని ప్రభాకర్ ఇలాంటి వారిని ఏం చేయాలో చెప్పు పవన్. అడ్వకేట్ శ్రీనివాస్ ఇంటి మీద దాడి చేసి ఆయన మీదనే కేసు పెట్టారు. హోంమంత్రి అనితను కించపరిచే విధంగా పవన్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌కు హోంమంత్రి ఇవ్చొచ్చుగా. పవన్ మాటలు, చేష్టలు, వైఖరి.. ద్వంద్వ వైఖరితో ఉన్నాయి. పోలీసు స్టేషన్లో హత్యలు చేసి బూడిత చేసే హక్కు ఎవరికీ లేదు. పవన్ గుర్తుందా. పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్‌ను చట్ట ప్రకారమే ఉరి తీశారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
పోలీసులే హంతకులైతే.. సీబీ‘ఐ’తోనే న్యాయం
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ రాష్ట్ర పోలీసుల క్రూరత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది. పౌరులను, చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే హంతకులుగా మారినప్పుడు జరిగే ఘోరానికి.. తమిళనాడులోని తూత్తుకుడి (సాతాన్‌కుళం), ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ (కృష్ణలంక)లలో జరిగిన రెండు భయంకరమైన లాకప్‌డెత్‌లు ప్రత్యక్ష నిదర్శనాలు. తమిళనాడులో కరోనా సమయం 2020 జూన్‌లో పాన్ షాపు మూసివేతకు సంబంధించిన ఒక చిన్న వ్యవహారంలో జయరాజ్–బెన్నిక్స్ అనే తండ్రి కొడుకులను దారుణంగా కొట్టి లాకప్‌డెత్ చేసిన 9 మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. బాధిత కుటుంబానికి రూ.1.40 కోట్లు పరిహారంగా చెల్లించింది. సదరు కేసులో ఎన్ని ఒత్తిడులు ఎదురైనా అప్పట్లో జరిగిన ఆ దారుణంపై రేవతి అనే ఒక మహిళా కానిస్టేబుల్ కోర్టులో చెప్పిన సాక్ష్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జయరాజ్–బెన్నిక్స్ కేసు తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటనపై సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, పోలీసు దర్యాప్తుతో ఏమాత్రం న్యాయం జరగదని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. హైకోర్టుకు ఇచ్చే సమాధానంపై ఆసక్తి విజయలక్ష్మి తరఫు న్యాయవాది ఆదిత్య చౌదరి వాదనలు వినిపిస్తూ పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై సాయికృష్ణ మరణించి ఉంటాడని తల్లి ఆందోళన చెందుతోందన్నారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణను తమ ముందు హాజరుపరచి తీరాల్సిందేనని కృష్ణలంక పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇందుకు 29వ తేదీ వరకూ గడువు పొడిగించిన హైకోర్టు, కేసు తదుపరి విచారణనూ అదే రోజుకు వాయిదా వేసింది. ఇప్పటి వరకు సాయికృష్ణ ఆచూకీ తెలియకపోవడం, అతడి శవాన్ని మాయం చేసి కాల్చి బుడిద చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు 29వ తేదీన హైకోర్టుకు ఏం చెబుతారు? దీనిపై ధర్మాసనం ఎలా స్పందిస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
అదిరిపడి.. ఆగమేఘాలపై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/కృష్ణలంక (విజయవాడ తూర్పు): రాష్ట్రంలో సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసులో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగడంతో ప్రభుత్వం తత్తరపాటుకు గురైంది. ఆలస్యం చేస్తే మరింతగా మెడకు చుట్టుకునేలా ఉందని బెంబేలెత్తిన ప్రభుత్వం.. వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలరింగ్ ఇచ్చింది. కృష్ణలంక సీఐని బలిపశువును చేసి, మిగతా పెద్దలందరూ బయటపడేలా పన్నాగం పన్నింది. వైఎస్ జగన్ గురువారం సాయికృష్ణ తల్లిని పరామర్శించగానే, ప్రభుత్వం ఆగమేఘాలపై కదిలింది. విజయవాడ నగర పోలీసు కమిషనర్ గురువారం రాత్రి 11 గంటలకు సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులను పిలిపించుకొని ఫిర్యాదు తీసుకొని, అప్పటికప్పుడు కేసు నమోదు చేశారు. విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మహిళా పోలీసు స్టేషన్ ఏసీపీ వై.దైవ ప్రసాద్‌ను విచారణాధికారిగా నియమించారు. అందులోనూ కృష్ణలంక సీఐ ఒక్కడినే బలిపశువును చేసి, మిగతా పెద్దలను తప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కృష్ణలంక సీఐ నాగరాజుపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైమ్ నంబరు 107/2026గా నమోదైన ఈ కేసులో బీఎన్ఎస్ సెక్షన్ 127(4), 127(6), 103(1) తోపాటు బీఎన్ఎస్ సెక్షన్ 238 కింద అభియోగాలు నమోదు చేశారు. ఏ క్షణంలోనైనా సీఐ నాగరాజును ఆరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లాకప్‌డెత్ వ్యవహారం ప్రభుత్వ పెద్దలు, హోంమంత్రి, పోలీసు బాస్, అందరికీ తెలిసినా మభ్యపెట్టే యత్నం చేశారు. మిగతా పెద్దలంతా కేసు నుంచి బయట పడేందుకు సీఐ ఒక్కడిపైనే కేసు నమోదు చేయడాన్ని పలు పార్టీలు, ప్రజా సంఘాలు, న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. రెండు గంటలు కుటుంబ సభ్యుల విచారణ విచారణాధికారి వై.దైవప్రసాద్ శుక్రవారం ఉదయమే ఇతర సిబ్బందితో కృష్ణలంకలోని సాయికృష్ణ ఇంటికి వచ్చి విచారణ చేపట్టారు. తల్లి విజయలక్ష్మి, మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు, పిన్ని కనకదుర్గ నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. రెండు గంటలపాటు వారిని విచారించారు. మే 9న పోలీసులు తన వద్ద ఫోన్ లాక్కుని వెళ్లి, సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకు వచ్చిన నాటి నుంచి జరిగిన పరిణామాలను అతని తల్లి వివరించారు. సీఐ నాగరాజుతో పాటు, అదే స్టేషన్‌లోని కానిస్టేబుళ్ల పాత్ర గురించి కూడా ఆమె వివరించారు.సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత విచారించిన టాస్‌్కఫోర్స్ ఏసీపీ లతాకుమారిని విచారణాధికారి దైవప్రసాద్ సాయంత్రం కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కాగా, సాయికృష్ణ తల్లి మరో ఆరుగురు కానిస్టేబుళ్లపై ఆరోపణలు చేస్తుండగా, వారంతా అదే పోలీస్ స్టేషన్లో దర్జాగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాంటప్పుడు విచారణ సక్రమంగా ఎలా జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విధుల నుంచి తప్పించి విచారణ జరిపించాలని కోరుతున్నారు. స్టేషన్లో క్లూస్ టీమ్ తనిఖీలు కాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందాలు శుక్రవారం తనిఖీలు చేశాయి. స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించాయి. సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకొచ్చినప్పుడు చేయించుకున్న సంతకాల రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. నిందితులకు శిక్ష పడే వరకు నిద్రపోము: సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చి, అదృశ్యం చేసిన నాటి నుంచి మాకు మానవ హక్కుల సంఘాలు, పౌర సంఘాలు అనేక సార్లు సహకరించారు. మా కేసు వెలుగులోకి రావడంలో మీడియా కీలకంగా వ్యవహరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి శిక్ష పడేవరకూ నిద్రపోము. ఈ నెల 29న హైకోర్టు వాయిదా ఉంది. సీఐతో పాటు మిగతా వారి వివరాలు కూడా విచారణాధికారికి ఇచ్చాం -
హోటల్లో చంపేసి.. బస్టాండ్‌లో పారేసి!
సాక్షి ప్రతినిధి, విజయవాడ, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కృష్ణలంకకు చెందిన యువకుడు సాయికృష్ణది లాకప్ డెత్ కానే కాదని, ఇది ముమ్మాటికీ పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన హత్యే అని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. విజయవాడ బందరు రోడ్డు రమేష్ హాస్పిటల్ సమీపంలోని ఓ హోటల్లో సాయికృష్ణను నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని చెప్పారు. ఇందులో పోలీసులతోపాటు చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారమే ఈ హత్యకు కారణమని, దీనికి సంబంధించి తన వద్ద ప్రాథమిక సమాచారం ఉందని వెల్లడించారు.సాయికృష్ణను హత్య చేసి అనాథ శవంగా చిత్రీకరించి స్వర్గపురిలో శవ దహనం పూర్తి చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారం పోలీసుల కనుసన్నల్లోనే జరిగిందన్నారు. జడ శ్రావణ్‌కుమార్ శుక్రవారం విజయవాడ గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన అంశాలను వెల్లడించారు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ తమ పార్టీ కాపు యువజన విభాగం అధ్యక్షుడు దాడిశెట్టి వీరబాబు ద్వారా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు.ఈ కేసు తేలాలంటే సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తాన్ని భద్రపరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు.. స్టేషన్లలో సీసీ కెమెరాలు ఉన్నాయని నిందితులను హోటళ్లలో పెట్టి కొడుతున్నారన్నారు. జైభీమ్.. అంతకు మించిన సినిమాలను తలదన్నే రీతిలో జరిగిన ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు వ్యవస్థ, ఉన్నతాధికారులు పాల్గొన్నారని తెలిపారు. ఆ ఘటన జరిగిన క్రమం జడ శ్రావణ్‌కుమార్ మాటల్లోనే.. » గత నెల 8వతేదీన సాయంత్రం టాస్క్‌ఫోర్స్ సీఐ, కృష్ణలంక పోలీసు స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్, ఏఎస్సై, బ్లూ కోట్ కానిస్టేబుల్ కలిసి మార్కాపురంలో మిత్రుడితో కలిసి ఒక రూంలో ఉంటున్న సాయికృష్ణను కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు.» ఆ రాత్రి అక్కడే ఉంచి 9వతేదీ ఉదయం స్టేషన్ నుంచి టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.» అక్కడ ఒక రోజు ఉంచి.. ఆ తర్వాత రమేష్ హాస్పిటల్ సమీపంలోని ప్రముఖ హోటల్‌కు తరలించారు. హోటల్ రూమ్ నంబరు 302లో సాయికృష్ణను చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, రాత్రంతా సీఐ నాగరాజు హింసించారు. సీఐ నాగరాజు పేరుమీదే హోటల్ బుక్ అయింది. » విపరీతంగా కొట్టడం వల్ల సాయికృష్ణకు రక్తస్రావం అయ్యింది. కిడ్నీలు పగిలిపోయాయి. దవడ పగిలింది.. » సాయికృష్ణను వైద్యం కోసం 14వ తేదీన ప్రజావైద్యశాలకు తీసుకొచ్చారు. అయితే బతికే అవకాశం లేదని, ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. » అక్కడి నుంచి 15వతేదీన మణిపాల్ హాస్పిటల్ సివిల్ సర్జన్ వద్దకు తీసుకెళ్లారు. » అక్కడ కూడా వైద్యుడు చేతులెత్తేయడంతో 16, 17వ తేదీలలో మళ్లీ హోటల్ రూంకు తరలించారు. » హోటల్ రూంలో ఆర్ఎంపీతో రెండు రోజులు ట్రీట్మెంట్ చేయించారు. » 23వ తేదీ సాయంత్రం సాయికృష్ణ చనిపోయాడు. » డెడ్‌బాడీని 24వ తేదీన ఆర్టీసీ బస్టాండ్ 43వ నంబర్ ప్లాట్ఫారం వద్ద అనాథ యువకుడి శవంలా పడవేశారు. » అనంతరం తమకు ఏమీ తెలియనట్లుగా.. బస్టాండ్‌లో అనాథ శవం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లి అనాథ శవాన్ని తగలబెట్టాలని టాస్క్‌ఫోర్స్ సీఐకి అత్యంత సన్నిహితుడైన మేనేజర్ ద్వారా వీఎంసీకి రిక్విజేషన్ ఇచ్చారు. » అనాథ శవంగా సీఐ నాగరాజు సర్టిఫై చేసిన తర్వాత బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న స్వర్గపురిలో ఇద్దరు కానిస్టేబుల్స్ ద్వారా 24వ తేదీన 5.45 గంటలకు సాయికృష్ణ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.పవన్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదు కూటమి సర్కారు డెడ్‌బాడీ నో డెలివరీ ప్రభుత్వంగా పేరు సాధించిందని జడ శ్రావణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడితే నీకు జైలు జీవితం ఖరారైనట్లే అంటూ మంత్రి లోకేశ్ రెడ్ బుక్ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో న్యాయం నాలుగు పాదాల మీద కాదు.. 40 పాదాల మీద నడుస్తోందని వ్యాఖ్యానించారు. ‘సాయికృష్ణ మృతిపై హోం మినిస్టర్ మాట్లాడలేదు..! ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ బాధిత కుటుంబాన్ని కలవలేదు..’ అని విమర్శించారు. చేతి గీతలు అరగదీస్తామని, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారని గుర్తు చేశారు. ఆదిత్య నాథ్ ట్రీట్మెంట్ అంటే ఎన్‌కౌంటరేనని, అక్కడ 400కిపైగా జరిగాయని, పవన్ మాటల్లో అర్థం కూడా అదేనన్నారు. పవన్ కళ్యాణ్ ఆ విధంగా మాట్లాడితే పోలీసులు అలా ఎందుకు ప్రవర్తించకుండా ఉంటారని ప్రశ్నించారు. గబ్బర్ సింగ్ సినిమా చూసే సీఐ నాగరాజు ఆ విధంగా తయారయ్యాడన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కు ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ‘ఎమ్మెల్యేలు అమ్మాయిలను రేప్ చేస్తే మాట్లాడరా? ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను ఢిల్లీలో పక్కన కూర్చోపెట్టుకుంటావా? నువ్వేం సనాతన ధర్మ సారధివి?’ అని మండిపడ్డారు.కేసును నీరు గార్చే కుట్రలు సాయికృష్ణ కేసులో ఇంత మంది పోలీసులు పాల్గొంటే కేవలం సీఐ నాగరాజు ఒక్కరిపై మాత్రమే కేసు నమోదు చేశారని జడ శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. సీఐపై నమోదు చేసిన హత్య కేసును నీరు గార్చే కుట్రలో తొలి అడుగు పడిందన్నారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆధారాలు సేకరించిన తర్వాత అందులో భాగస్వాములైన వారిని చేర్చి హత్య కేసుగా మార్చాల్సి ఉండగా .. డెడ్‌బాడీ ఎక్కడుందో తెలియకుండా హత్య కేసుగా నమోదు చేశారన్నారు. ఇది కేసు మొత్తాన్ని నీరు గార్చే కుట్రలో భాగమేనని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై తమ పార్టీ తరపున చివరి వరకు న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. -
అవి సర్కారు హత్యలే!
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదే సాయికృష్ణ లాకప్‌లోనే ‘కనుమరుగు’...! పోలీసుల థర్డ్‌డిగ్రీ వేధింపులు తట్టుకోలేక దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్య... ! ఈ రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలే!! టీడీపీ కూటమి సర్కారు అరాచక కాండే. ఆ ఇద్దరి కుటుంబ సభ్యులు నెల రోజులపాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా న్యాయం కాదు కదా కనీసం ఓదార్పు దక్కకపోవడం చంద్రబాబు ప్రభుత్వం రాక్షసత్వాన్ని బట్టబయలు చేస్తోంది. లాకప్‌లోనే సాయికృష్ణ అదృశ్యం... క్రాంత్రి కుమార్ ఆత్మహత్య..! ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని దేశవ్యాప్తంగా న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణ మారణకాండపై జాతీయస్థాయిలో న్యాయ, రాజ్యాంగ నిపుణులు, పౌర హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. న్యాయస్థానం జోక్యం... మీడియా క్రియాశీలతో చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు బయటపడ్డాయని స్పష్టం చేస్తున్నారు. ఇంత బరి తెగింపా బాబూ...! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విజయవాడ పోలీస్ లాకప్‌లో మరణాలు... దారుణాలు కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలే! విజయవాడ పోలీసులు ఇంతటి అమానుషానికి బరితెగించి లాకప్‌లలో మరణమృదంగం మోగిస్తున్నా కూటమి ప్రభుత్వం దాదాపు నెల రోజులపాటు కప్పిపుచ్చేందుకు యత్నించడం... అసలు ఏమీ జరగలేదని నిస్సిగ్గుగా బుకాయించేందుకు యత్నించడమే నివ్వెరపరుస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసు లాకప్‌లలో మరణాలను ఇంత బరితెగించి కప్పిపుచ్చేందుకు యత్నించలేదని న్యాయ నిపుణులు మండిపడుతున్నారు. ఆ తల్లి గోడు పట్టని ప్రభుత్వం... బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంతగా తల్లడిల్లిపోతారన్నది పాషాణ చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టలేదు. గాదే సాయికృష్ణను పోలీసులు మార్కాపురంలో అక్రమంగా నిర్బంధించి తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీతో వేధించారు. ఆ విషయం తెలిసిన ఆయన తల్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ... విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరిగి తన బిడ్డ కోసం పరితపించారు. అయినా సరే పోలీసుల మనసు ఏమాత్రం కరగలేదు. తన బిడ్డను న్యాయస్థానంలో హాజరుపరచాలని... ప్రాణాలతో అప్పగించాలని ఆమె విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంది. ఇంతటి విస్తృత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబుగానీ, హోంమంత్రి అనిత గానీ ఏమాత్రం స్పందించలేదు. అసలు సాయికృష్ణ విషయంలో ఏం జరిగిందన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. చివరికి ఆమె తన కుమారుడిని అప్పగించాలని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగానే వ్యవహరించింది. సాయికృష్ణ సంగతి తమకు తెలియదని... అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోలేదని న్యాయస్థానానికి సైతం అవాస్తవాలు చెబుతూ వచ్చింది. న్యాయస్థానం జోక్యం... తన కుమారుడు సాయికృష్ణ ఆచూకీ తెలపాలని బాధితుడు తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో డొంక కదిలింది. సాయికృష్ణను పోలీసులే అక్రమంగా నిర్బంధించి అదృశ్యం చేశారని సాక్షి పత్రిక సహేతుక వాదనతో వెలుగులోకి తీసుకువచ్చింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ తగిలింది. దీంతో హైకోర్టు ఈ కేసులో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతవరకు సాయికృష్ణ విషయమే తెలియదని బుకాయించిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. కేవలం కృష్ణలంక సీఐ నాగరాజు మీద తూతూ మంత్రంగా చర్యలతో విషయాన్ని కప్పిపుచ్చాలని చూసింది. ఆయన్ను వీఆర్‌కు పంపించి చేతులు దులిపేసుకుంది. వైఎస్ జగన్ రాకతో... తప్పనిసరై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం, పోలీసుల దమనకాండపై మండిపడ్డారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నివాసానికి గురువారం వెళ్లిన వైఎస్ జగన్ పరామర్శించి భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర పోలీసు అధికారులు అంతా కలిసే ఈ దారుణానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయపోరాటం చేస్తామన్నారు. దాంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విధిలేని పరిస్థితుల్లో ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. అప్పటివరకు సాయికృష్ణ గురించే తెలియదు అని బుకాయించిన చంద్రబాబు సర్కారు... అతడిని పోలీసులే లాకప్‌లో అదృశ్యం చేశారని అంగీకరించక తప్పలేదు. కానీ విచారణను కేవలం సీఐ పాత్ర వరకే పరిమితం చేసి డీజీపీ, విజయవాడ సీపీలను రక్షించేందుకు ఎత్తుగడ వేశారు. దీనిపై వైఎస్సార్సీపీ మండిపడింది. మొత్తం సూత్రధారులు, పాత్రధారులకు శిక్ష పడేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. బుకాయించి.. బెదిరించి! ఇక విజయవాడకు చెందిన దళిత యువకుడు క్రాంతి కుమార్ ఉదంతంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అంతే అమానవీయంగా వ్యవహరించింది. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్నారని ఆయన తండ్రి వెంకటేశ్వరరావు రోజుల తరబడి మొత్తుకున్నారు. తన కుమారుడిని అప్పగించాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. కానీ అటు ప్రభుత్వంగానీ ఇటు పోలీసులుగానీ ఏమాత్రం స్పందించలేదు. అసలు క్రాంతి కుమార్ సంగతి తమకు తెలియదని ప్రభుత్వం... ఆయన తమ వద్ద లేరని పోలీసులు బుకాయించారు. ఆ తండ్రిని బెదిరించి వెనక్కి పంపేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నా సరే ఖాకీల తీరు ఏమాత్రం మారలేదు. ఆయన తండ్రి వెంకటేశ్వరరావును బెదిరించి మౌనం వహించేలా చేశారు. గుట్టుచప్పుడు కాకుండా క్రాంతికుమార్ అంత్యక్రియలు పూర్తి చేయించారు. దమనకాండపై ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధం.. దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టింది. పోలీసులు మూడు నెలలపాటు తనను భౌతికంగా హింసిస్తున్నారని... ఆ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. సెల్ఫీ వీడియో తీస్తూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో వెలుగులోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణం బహిర్గతమైంది. రాష్ట్రమే కాదు జాతీయ స్థాయిలో టీడీపీ కూటమి ప్రభుత్వ అమానుష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.లాకప్‌లోనే సాయికృష్ణ అదృశ్యం.. పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య.. ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కర్కశ కూటమి ప్రభుత్వం ఇటువంటివి ఇంకెన్ని దారుణాలు పాల్పడిందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. పోలీసుల అండతో ప్రభుత్వం సాగిస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. -
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక సీఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరామర్శ తర్వాతే ఈ కేసులో.. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగాల్లో కదలికలు రావడం గమనార్హం. గురువారం రాత్రి 11గం. సమయంలో బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నుంచి పిలుపు వెళ్లింది. ఆ తర్వాతే సీఐ నాగరాజుపై ఆమె ఫిర్యాదు ఇవ్వగా.. అప్పటికప్పుడే నాగరాజుపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఫిర్యాదును కమిషనర్ స్వయంగా స్వీకరించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు ఫిర్యాదు కాపీని విజయలక్ష్మికి అందజేశారు.ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించినట్లు విజయలక్ష్మితో సీపీ రాజశేఖర్ చెప్పినట్లు సమాచారం. అలాగే సీఐ నాగరాజుపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం గమనార్హం. క్రైమ్ నంబర్ 107/2026గా నమోదైన ఈ కేసులో .. బీఎన్ఎస్ సెక్షన్ 127(4), 127(6), 103(1)తో పాటు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 238 కింద అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఒక పోలీసు అధికారిపైనే కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ పరిణామం కేసు విచారణను మరింత కీలక దశకు తీసుకెళ్లింది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లడంతోనే ఉలిక్కిపడ్డ కూటమి ప్రభుత్వం.. ఆగమేఘాల మీద పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు చర్చ నడుస్తోంది. మరోవైపు.. సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్ట్ తప్పదని.. ఆ తర్వాత ఈ కేసులో మరికొంత మంది ఖాకీలపైనా చర్యలు ఉంటాయంటూ లీకులు వస్తున్నాయి. ఈ కేసులో సాయికృష్ణ అదృశ్యంపై దర్యాప్తు అధికారిగా నియమితులైన రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిశోర్ ఇవాళ విజయవాడ రానున్నారు. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, విజయవాడ సీపీ రాజశేఖర బాబులను కలిశాకే.. కృష్ణలంక స్టేషన్‌కు వెళ్తారని సమాచారం. ఇదీ చదవండి: సీఐ నాగరాజు.. మాములోడు కాదు! -
సర్కారు అండతో ఖాకీల క్రౌర్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ఖాకీ కర్కశం వికట్టాహాసం చేస్తోంది. పోలీసు లాఠీ రాజ్యమేలుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీసు థర్డ్ డిగ్రీ రాష్ట్రాన్ని శాసిస్తోంది. రక్షకభట నిలయాలు మానవ వథశాలలుగా మారుతున్నాయి. చంద్రబాబు అండదండలతో టీడీపీ వీరవిధేయ ఐపీఎస్‌లు రెచ్చిపోయి అరాచకం ప్రదర్శిస్తున్నారు. రోజులు, నెలల తరబడి యువకులను అక్రమంగా నిర్బంధించి.. చిత్రహింసలకు గురిచేస్తూ వారి పాలిట పోలీసులే యమకింకరులుగా మారుతున్నారు. అందుకు విజయవాడ కేంద్రబిందువుగా మారడం గమనార్హం. విజయవాడ పోలీస్ బాస్, బిగ్‌బాస్ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్లోనే పోలీస్ థర్డ్ డిగ్రీ వికృత రూపం దాల్చింది. విజయవాడ పోలీసులు కాపు యువకుడు గాదె సాయికృష్ణను చిత్రహింసలకు గురిచేసి ‘కనుమరుగు’ చేసిన ఉదంతం సంచలనంగా మారగా... అంతలోనే విజయవాడ పోలీసులు నెలల తరబడి చిత్రహింసలకు గురి చేయడంతో పోగు క్రాంతికుమార్ అనే దళిత యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఈ రెండు ఘటనలపైనా కాపు సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతుండగా.. దళిత సంఘాలు సైతం పోలీస్, ప్రభుత్వ తీరుపై ఆగ్రహోదగ్రమవుతున్నాయి. పోలీస్ దందాకు ఎదురు తిరగడంతో.. తాజా ఉదంతంలో విజయవాడకు చెందిన దళిత యువకుడు పోగు క్రాంతికుమార్ ఆత్మహత్య ముందు రికార్డు చేసిన మరణ వాంగ్మూలం సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. విజయవాడ పోలీసుల వేధింపులు తట్టుకోలేకే తాను పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తన ఆత్మహత్యకు కృష్ణలంక సీఐ నాగరాజు బాధ్యుడని కూడా స్పష్టం చేస్తూ క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడిన తీరు అందర్నీ కలచి వేస్తోంది. ఈ ఉదంతంతో క్రాంతికుమార్‌ను పోలీసులు ఎంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశారన్నది వెలుగులోకి వచ్చింది.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పోగు వెంకటేశ్వరరావు కుమారుడైన క్రాంతికుమార్ వివిధ పనులు చేసుకుంటూ జీవించేవారు. అతడిని కృష్ణలంక పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. తాము చెప్పిన పనులన్నీ చేయాలని వేధించారు. తమకు అనుకూలంగా నేరాలు చేసేలా.. తమ సెటిల్మెంట్లకు సహకరించేలా పోలీసులు ఆయన్ని వాడుకున్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్ల తరువాత పోలీసుల దందాకు తాను సహకరించలేనని క్రాంతికుమార్ ఎదురుతిరిగారు. దాంతో పోలీసులు ఆయనను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి లాఠీమార్కు వేధింపులకు గురి చేశారు. విచారణ పేరుతో రోజూ స్టేషన్‌కు పిలిపించి వేధించడమే కాకుండా ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇలా మూడు నెలలపాటు పోలీసుల అరాచకం సాగింది. వేధింపులు తట్టుకోలేక.. పోలీసులు థర్డ్ డిగ్రీకి తన శరీరం ఇక ఏమాత్రం సహకరించదని భీతిల్లిన క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో రికార్డు చేసి మే 21న ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ట్విస్ట్ ఇదీ కాపు యువకుడు గాదె సాయికృష్ణను విజయవాడ పోలీసులు మే 9న అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తీవ్రంగా చిత్రవథకు గురిచేశారు. కాళ్లూ చేతులూ కట్టేసి లాఠీలతో విరుచుకుపడుతుండటంతో సాయికృష్ణ హాహాకారాలు చేశాడు. పోలీసులు రోజుల తరబడి ఈ అరాచకం కొనసాగించారు. అదే సమయంలో దళిత యువకుడు క్రాంతికుమార్‌ను సైతం పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. సాయికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో అతడు అచేతనంగా పడిపోయాడు. అనంతరం సాయికృష్ణను ఏం చేయాలనే దానిపై పోలీసులు మంతనాలు సాగించారు. పోలీస్ బాస్తోను, మరికొందరు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడటాన్ని క్రాంతికుమార్ గమనించారు. పక్కా పన్నాగంతోనే సాయికృష్ణను ‘కనుమరుగు’ చేయడాన్ని క్రాంతి ప్రత్యక్షంగా చూసినట్టు సమాచారం. తనను కూడా ఇదేవిధంగా చేస్తారని.. సాయికృష్ణలా కనుమరుగైపోతే.. కనీసం తన మృతదేహం కూడా తన కుటుంబ సభ్యులకు దక్కదని క్రాంతికుమార్ భావించారు. పోలీసుల చేతిలో చావుదెబ్బలు తింటూ ప్రాణాలు విడిచేకంటే ఆత్మహత్యకు పాల్పడితే మంచిదని నిర్ణయించుకున్నారు. తన మరణానికి కారణమేమిటనే దానిపై సెల్ఫీ వీడియో రికార్డు చేసి.. పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు పెడితే పోలీసు మార్క్ బెదిరింపులు పోలీసుల చిత్రహింసలు భరించలేక క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. తప్పనిసరి కావడంతో పోలీసులు మే 22న కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసు బాస్, ఇతర అధికారులు వెంకటేశ్వరరావుపై తమదైన శైలిలో ఒత్తిడి తెచ్చారు. ఈ కేసును పట్టించుకోవద్దని.. కాదని మొండికేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తమ మాట వింటే తృణమో ఫణమో ఇస్తామని కూడా ప్రలోభపెట్టారు. లేకపోతే క్రాంతికుమార్‌కు పట్టిన గతే ఇతరులకూ పడుతుందని హెచ్చరించారు. దాంతో వెంటేశ్వరరావు మౌనం వహించినట్టు తెలుస్తోంది. పోలీసులే దగ్గరుండి క్రాంతికుమార్ మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేయించారు. ఆ విధంగా తమ అరాచకాన్ని గుట్టుచప్పుడు కాకుండా కప్పిపుచ్చామని భావించారు. ఆ తరువాత సాయికృష్ణ లాకప్‌లోనే కనుమరుగైన విషయం వెలుగులోకి రాగా.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనివెనుక విజయవాడ పోలీస్ బాస్, బిగ్‌బాస్ సూత్రధారులనే విషయం బయటపడింది. దాంతో బాధిత కుటుంబం ధైర్యం చేసి క్రాంతికుమార్ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. అన్ని వేళ్లూ బాస్.. బిగ్బాస్వైపే పోలీసుల చిత్రహింసలతో సాయికృష్ణ లాకప్‌లోనే కనుమరుగు కావడం, దళిత యువకుడు క్రాంతికుమార్ పోలీసుల థర్డ్ డిగ్రీ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాలను పోలీసులు నిస్సిగ్గుగా కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం వారి దమనకాండకు పరాకాష్టగా నిలుస్తోంది. ఈ రెండు ఉదంతాలను సీఐ నాగరాజు వరకే పరిమితం చేసి ఉన్నతాధికారులను తప్పించేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది. అయితే.. ఈ రెండు దారుణాల వెనుక అన్ని వేళ్లూ విజయవాడ పోలీస్ బాస్, బిగ్‌బాస్ వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే.. ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి అచేతనంగా మారిన తరువాత కనుమరుగు చేయడం అన్నది సీఐ స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదన్నది పోలీసు శాఖ వ్యవహారాల గురించి అవగాహన ఉన్న అందరికీ తెలిసిందే. పోలీస్ కమిషనరేట్‌కు అల్టిమేట్ బాస్ పోలీస్ కమిషనరే. ఆయనకు చెప్పకుండా సాయికృష్ణను కనుమరుగు చేయడం సాధ్యం కాదు. ఇక రాజధాని ప్రాంతంలో ఓ కాపు యువకుడిని పోలీసులే అదృశ్యం చేసిన విషయాన్ని నగర బాస్.. బిగ్ బాస్ దృష్టికి ముందుగా తీసుకువెళ్లకుండా ఉంటారా అంటే.. కచ్చితంగా కాదని స్పష్టం చేస్తున్నారు పోలీస్ శాఖలో పనిచేసి రిటైరైన అధికారులు. అంటే ఈ విషయాలపై బిగ్ బాస్‌కు ముందుగానే తగిన సమాచారం ఉండి ఉంటుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీఎంవో అండదండలు ఉన్న పోలీస్ బాస్, బిగ్‌బాస్ స్వయంగా కథ నడపించారు కాబట్టే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఎంతగా ఆవేదన వెళ్లగక్కినా, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. పోలీసుల అరాచకాన్ని నిస్సిగ్గుగా వెనకేసుకువచ్చింది. ఐజీపై విచారణకు ఎస్పీనా?! సాయికృష్ణను లాకప్‌లో అదృశ్యం చేసిన దారుణాన్ని చాకచక్యంగా కప్పిపుచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా కుట్రకు తెర తీసింది. ఈ ఉదంతాన్ని పక్కదారి పట్టించేందుకు కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్‌కు పంపించి సరిపెట్టాలని యత్నించింది. చివరకు ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో ఈ ఉదంతంపై విచారణకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డీఎన్ కిశోర్‌ను నియమించడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. ఎందుకంటే సాయికృష్ణ అదృశ్యం వెనుక కేవలం సీఐ నాగరాజు మాత్రమే కాదు.. విజయవాడ టాస్‌్కఫోర్స్ విభాగంలో ఇద్దరు ఎస్పీస్థాయి మహిళా అధికారులు, పోలీస్ బాస్ పాత్ర ఉందనేది స్పష్టమవుతోంది. ఈ వ్యవహారం తెలిసినా పోలీస్ బిగ్‌బాస్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారన్నది కీలకంగా మారింది. అంటే సాయికృష్ణ కనుమరుగైపోయిన ఉదంతంపై విచారించాలంటే.. ప్రాథమికంగా కృష్ణలంక సీఐ నుంచి నగర బాస్ వరకు అధికారులను విచారించాలి. నగర బాస్ ఐజీ ర్యాంక్ అధికారి. ప్రభుత్వం మాత్రం ఎస్పీస్థాయి అధికారి డీఎన్ కిశోర్‌ను నియమించడం గమనార్హం. నిజానికి ఎస్పీస్థాయి అధికారి ఐజీ స్థాయి అధికారి చేసిన అరాచకం, అక్రమాలపై విచారించలేరు. అది పోలీస్ ప్రోటోకాల్ కూడా కాదు. అయినా సరే ప్రభుత్వం ఎస్పీస్థాయి అధికారినే విచారణాధికారిగా నియమించింది. అంటే విచారణ వ్యవహారాన్ని సీఐ వరకే పరిమితం చేయాలన్నది ప్రభుత్వ కుతంత్రమనే విషయం స్పష్టమవుతోంది. టీడీపీ వీరవిధేయ ఐపీఎస్‌గా రెడ్‌బుక్ కుట్రలను అమలు చేస్తున్న రాజశేఖరబాబుకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. సీబీఐ విచారణతోనే న్యాయం: న్యాయ నిపుణులు ‘సాయికృష్ణ ఉదంతంపై వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలి. ఎందుకంటే పోలీస్ అత్యున్నత అధికారుల పాత్ర ఉందని భావిస్తున్న ఈ కేసును దిగువస్థాయి అధికారి అయిన ఎస్పీ డీఎన్ కిశోర్ విచారించడం నిబంధనలకు విరుద్ధం. ఆయన నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించడం సాధ్యం కాదు’ అని న్యాయనిపుణులు, పౌర హక్కుల సంఘాల నేతలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. అందుకే.. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. ‘తూత్తుకుడి’ తీర్పు రిపీట్ కావచ్చు సాయికృష్ణ ఉదంతం నేపథ్యంలో తమిళనాడులోని తూత్తుకుడి దారుణ ఉదంతాన్ని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. తూత్తుకుడి పోలీసులు తండ్రీకొడుకులను పోలీస్ స్టేషన్లో అత్యంత భయంకరంగా హింసించడంతో ఇద్దరూ మరణించారు. ఈ కేసును విచారించిన మధురై న్యాయస్థానం ఆ దారుణంలో భాగస్వాములైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 6న సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుతం విజయవాడ పోలీసులు పాల్పడిన దారుణం కూడా అటువంటిదేనని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేను ప్రత్యక్షంగా చూశా: మహంకాళి చందు గాదె సాయికృష్ణను పోలీసులు చిత్రహింసలకు గురి చేయడాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని మహంకాళి చందు అనే యువకుడు వీడియో విడుదల చేశారు. తనను కూడా పోలీసులు ఆ రోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారని ఆయన చెప్పాడు. ‘కృష్ణలంక పోలీసులు నన్నూ ఓ కేసులో అదుపులోకి తీసుకుని లాకప్‌లో పెట్టారు. అదే లాకప్‌లో ఉన్న సాయికృష్ణపై పోలీసులు విచక్షణా రహితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయన్ని చిత్రహింసలకు గురిచేశారు. అవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను. పోలీసులు అంతటి దారుణానికి పాల్పడ్డారు. సాయికృష్ణ చేసిన నేరాన్ని ఒప్పుకున్నా.. చేయని ఇతర నేరాలు కూడా ఒప్పుకోవాలని పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి అతడిని వేధించారు’ అని ఆ వీడియోలో మహంకాళి వివరించాడు. -
నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదు: జడ శ్రవణ్
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ కేసుపై ప్రముఖ న్యాయవాది, జైభీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై, ప్రభుత్వ పెద్దలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏదైనా కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాల్సిన నిబంధన ఉందని అన్నారు. అయితే గాదె సాయికృష్ణ వ్యవహారంలో ఆ నిబంధనలు పాటించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.ఇంకా ఆయన ఏమన్నారంటే.. సాయికృష్ణ కేసులో కూటమి ప్రభుత్వ పనితీరు.. ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చ. భారతదేశ చరిత్రలో ఇంత హీనమైన, హేయమైన ఘటన ఎప్పుడూ లేదు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మూటకట్టి అటకపై పడేశారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఏ రాజ్యాంగం ప్రకారమైనా తప్పు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచాలి. రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండే కొందరు పోలీసులు చేసేదే లాకప్ డెత్. చట్టాలు అప్ గ్రేడ్ అయినట్లు పోలీసులు కూడా అప్ గ్రేడ్ అయినట్లున్నారుఏపీ హోంమంత్రికి ఓ కత్తెర మంత్రి. ఇన్ విజిబుల్ పోలీసింగ్ అని ఏదో ఒక్క అర్ధం చెబుతున్నారామె. నా పాతికేళ్ల న్యాయవృత్తిలో ఇలాంటి పదాలు నేనెప్పుడూ వినలేదు. లాకప్ డెత్ లు జరిగినపుడు పోలీసులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారుసాయికృష్ణను చంపేసి బూడిద చేశారని అతని తల్లి ఆరోపిస్తోంది. తన కొడుకుని చూపించమని పోలీసులను సాయికృష్ణ తల్లి వేడుకుంది. సాయికృష్ణ కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేవరకూ నేను అండగా ఉంటా. న్యాయపరంగా అవసరమైతే సాయం అందిస్తా. సాయికృష్ణకు జరిగిన అన్యాయం పై కులమతాలకు అతీతంగా అండగా నిలవాలిహోంమంత్రికి చిత్తశుద్ధి ఉంటే.. మే 9 నుంచి ఈరోజు వరకూ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని బయటపెట్టాలి. స్టేషన్ మొత్తం సిసి కెమెరాలు ఉంటే.. సీఐ రూమ్‌లో సీసీ కెమెరాలు ఎందుకు లేవు. ఏపీలో ప్రతీ స్టేషన్లో ఇంటరాగేషన్ కోసం వ్యక్తిగత రూమ్ లు ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణలంక సీఐ వ్యక్తిగత రూమ్‌లో కూడా ఇలాంటివే జరుగుతున్నాయిసాయికృష్ణ మృతి కేసులో ఏ1 ముద్దాయి మంత్రి లోకేష్. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన రోజే ఏపీలో లా అండ్ ఆర్డర్ పాతరేశారు. ఏ2 ముద్దాయి సీఎం చంద్రబాబు. చంద్రబాబు కళ్లుండి చూడలేని దృతరాష్ట్రుడు. లోకేష్ దుర్యోధనుడి మాదిరి రెడ్ బుక్ పాలన చేస్తున్నాడు. ఈ కేసులో ఏ3 ముద్దాయి పవన్ కళ్యాణ్. పవన్ తనకు దేవుడిచ్చిన అన్న అని లోకేష్ అంటున్నాడు. పదేళ్లక్రితం ఇదే దేవుడిచ్చిన అన్నను పచ్చి బూతులు తిట్టించింది లోకేష్ కాదా?. కౌరవులకు ఉన్న ఏకైక సోదరి హోంమంత్రి అనిత*తెనాలిలో ఎన్డీపీఎస్ కేసులో ముగ్గురు యువకులను నడిరోడ్డు పై పోలీసులు చితకబాదారు. తెనాలి ఘటన చూశాక న్యాయవాదులు, న్యాయ మూర్తులు నీళ్లులేని బావిలో దూకి చావాలి. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది న్యాయవ్యవస్థ.. పోలీసులు కాదు. కాపీ కొట్టి పాసై టీచర్ అయిన హోంమంత్రి ఈ విషయం తెలుసుకోవాలి. సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పడానికి కాదు నీకు హోంమంత్రి పదవి ఇచ్చింది. హెరిటేజ్ మీద ఎవరైనా మాట్లాడగానే సీఎఫ్ఓ మాదిరి హోంమంత్రి తెరపైకి వస్తారు. ఎందుకు సాయికృష్ణ అంశం పై హోంమంత్రి మాట్లాడలేదు. ఎందుకు హోంమంత్రి సీఐపై మాట్లాడలేదు. జడ్జీలను సైతం కొనేద్దామని భావన ఈ పోలీసులు, మంత్రులది.సాయికృష్ణ చనిపోయిన రోజునే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకి తెలుసు. సీఎం, హోంమంత్రి మనల్ని కాపాడతాడని సీఐకి సీపీ భరోసా ఇచ్చారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని తక్షణమే సస్పెండ్ చేయాలి. సీపీతో పాటు ఆరోజే హోంమంతికి కూడా ఈ విషయం తెలుసు. వారం రోజుల తర్వాత సీఎం,డిప్యూటీ సీఎంకు కూడా తెలుసు.. హోంమంత్రిని తక్షణమే బర్త్ రఫ్ చేయాలి. రాజశేఖర్ బాబు ఇక్కడ ఉండగా విచారణ సజావుగా సాగదు. కాబట్టి సీపీగా రాజశేఖర్ బాబును సస్పెండ్ చేయాలి. క్రైమ్ రేట్ తగ్గిందని హోంమంత్రి అద్భుతంగా అబద్ధాలు ఆడుతున్నారు. పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని చెబుతున్నారు. ఇలా లాకప్ డెత్ లు చేయడమేనా పోలీస్ వ్యవస్థ అద్భుత పనితీరు?. రెండు కేసులున్న వ్యక్తిని లాకప్ డెత్ చేస్తే.. 40 కేసులున్న చంద్రబాబును ఏ స్టేషన్‌కు పంపిస్తారు?. వందల కోట్లు దోచుకున్నాడని ఆరోపణలున్న లోకేష్ ను ఏ స్టేషన్ కు పంపిస్తారు?. హోంమంత్రి మేకప్ మీద పెట్టిన శ్రద్ధలో కొంచెమైనా నీ శాఖ పై పెడితే బాగుంటుందిఈ రెండేళ్లలో ఆడపిల్లల పై ఏపీలో జరిగిన నేరాల సంఖ్య 44,586. శిక్షలు పడింది కేవలం 541 కేసుల్లో మాత్రమే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం నాలుగు కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. మీరు ప్రెస్ మీట్ లో చెప్పిన డేటా 10 క్లాస్ ఫెయిల్ అయిన మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చాడా?. హోం శాఖ నిర్వహిస్తున్న హోంమంత్రికి.. డీజీపీకి సిగ్గుండాలిసీఎం సొంత జిల్లాలో కేవలం 10 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. డిప్యూటీ సీఎం జిల్లాలో శిక్షపడింది 14 కేసుల్లో మాత్రమే. రాష్ట్రంలో 46 వేల మంది ఆడిపిల్లలకు అన్యాయం జరిగితే ఏనాడైనా వారి ఇంటికి వెళ్లారా డిప్యూటీ సీఎం?. ఉపముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏంపీకారు?. పోలీసు వ్యవస్థ పనిచేసే తీరు ఇదేనాగతంతో పోల్చుకుంటే 24 శాతం ఆడపిల్లల పై నేరాలు పెరిగాయి. పోలీస్ డిపార్ట్ మెంట్‌కు క్రెడిట్ ఇవ్వాలని అడగడానికి సిగ్గుందా?. సాయికృష్ణ మృతదేహాన్ని కాని..అతని బూడిదను కానీ ఇచ్చి అప్పుడు క్రెడిట్ తీసుకోండి. సాయికృష్ణ తల్లి కన్నీళ్లకు సమాధానం చెప్పి క్రెడిట్ తీసుకోండి. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికీ బ్రతికేహక్కుంది. మోకీళ్లు తీసేస్తా ... అరచేతిలో రేఖలు చెరిపేస్తానని డిప్యూటీసీఎం చెబుతుంటే పోలీసులకు ఏం ఇండికేషన్ ఇచ్చినట్లు?. సిగ్గులేకుండా సోషల్ మీడియాలో సాయికృష్ణ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. సాయికృష్ణ తల్లి కడుపుకోతతో బాధపడుతోంది. ఆ తల్లికి దళితసోదరులంతా అండగా నిలవాలి. కాపుల ఓట్లు వేయించుకుని పవన్ కాపులను గాలికి వదిలేశారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు అని జడ శ్రవణ్ మండిపడ్డారు.ఇదిలా ఉండగా.. గాదె సాయికృష్ణ ఏమయ్యాడు? అనే అంశం ఏపీలో తీవ్ర చర్చకు దారితీసింది. విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా పోలీసు శాఖ నుండి పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా వెలువడాల్సి ఉంది. -
లాకప్‌డెత్‌తో సర్కారు ఉక్కిరిబిక్కిరి
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో సంచలనం రేసిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు ప్రజలను మభ్యపెట్టి, ఈ ఘటనను తాము సీరియస్‌గా తీసుకున్నట్లు ప్రభుత్వం కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. నెల రోజులుగా సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంపై ఏమాత్రం స్పందించని ప్రభుత్వం.. లాకప్‌డెత్ అని బయట పడగానే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు సమీక్ష నిర్వహించి, కంటి తుడుపు చర్యగా సీఐ నాగరాజును సస్పెండ్ చేయడం డ్రామాలో భాగమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి సీఐ సస్పెన్షన్ ద్వారా బాధితులను శాంతపరిచే ఎత్తుగడ వేసినట్లు.. సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారా విచారణ పేరుతో నిదానంగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే యత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తెలివిగా తప్పుకున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాపులు రగిలిపోతున్నారని, కాపుల్లో చీలిక వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారాన్ని పవన్‌కళ్యాణ్ చూస్తారని, అన్ని విషయాలు ఆయనకే వివరించాలని సీఎం చంద్రబాబు.. డీజీపీకి సూచించడం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తద్వారా ఈ వివాదం నుంచి చంద్రబాబు తెలివిగా తప్పుకొని, పవన్ కళ్యాణ్‌కు అంట గట్టినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో వైపు ఎవరి ప్రోద్బలం లేకుండానే ఒక సీఐ.. కాపు యువకుడిని కొట్టి చంపి, శవాన్ని తగలబెట్టేంత సాహసం ఎలా చేస్తారని పోలీసు వర్గాల్లో సైతం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం ఇంకా ముదరకుండా చూసుకోవాలంటూ అటు డీజీపీకి, ఇటు పవన్ కళ్యాణ్‌కు సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు కాపు ప్రముఖులతో మాట్లాడాలంటూ పవన్‌కు సూచించినట్లు తెలిసింది. అయితే మొన్నటిదాక కులం అవసరం లేదంటూ చెబుతూ వచ్చిన వపన్ కళ్యాణ్, ఇప్పుడు ఉన్నట్లుండి కాపులను బుజ్జగించాల్సి రావడం తలనొప్పేనని జనసేన వర్గాలు అంతర్మథనం చెందుతున్నాయి. జనసేనలో కలకలం‘అన్యాయంగా మా బిడ్డను తీసుకొచ్చి చంపేస్తే, జనసేన తూర్పు ఇన్చార్జి అమ్మిశెట్టి వాసు వచ్చి రూ.50 లక్షలు ఇప్పిస్తా.. రాజీ చేసుకుందామని బేరం పెట్టారని బాధిత కుటుంబం వెల్లడించడం జనసేనలో కలకలం రేపుతోంది. ఇక్కడ లాకప్‌డెత్ అయింది కాపు యువకుడు, జనసేన కుటుంబ సభ్యుడు. అయితే బాధిత కుటుంబం వద్దకు కేసు రాజీ కోసం ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా వచ్చింది కాపు నేత కావడం జనసేనలో కలకలం రేపుతోంది. బాధిత కుటుంబం తరఫున గట్టిగా నిలబడి పోరాటం చేయాల్సిందిపోయి.. చంద్రబాబుకు, టీడీపీకి ఊడిగం చేసేలా ఇదేం పనంటూ ఆ పార్టీ శ్రేణుల్లో.. ప్రత్యేకించి కాపుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ‘మేమూ జనసేనకు చెందిన వాళ్లమే’ అంటూ కుటుంబ సభ్యులు ఐడీ కార్డులతో ప్రెస్ మీట్ పెట్టడం జనసేనకు ఇబ్బందిగా మారింది. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పందించాలంటూ సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్ చేసిన వ్యాఖ్యలు జనసేనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా కేసు రాజీ చేసుకోకపోతే జనసేన పార్టీకి ఇబ్బందులు తప్పవని గ్రహించి, రాజీ కోసం కొత్త దారులు వెతుకుతున్నట్లు తెలిసింది.ప్రభుత్వంపై మండిపడుతున్న కాపులుసాయికృష్ణ ఉదంతంతో చంద్రబాబు ప్రభు త్వంపై కాపు సామాజిక వర్గం మండిపడుతోంది. అధికారంలోకి రావడం కోసం 2024 ఎన్నికల్లో తమను వాడుకున్న చంద్రబాబు, లోకేశ్‌లు.. అధికారంలోకి వచ్చాక కరివే పాకులా తీసిపారేశారని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో టీడీపీ నేతలు, కాపు వర్గీయులపై దాడులకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంతో కళ్లుమూసుకుపోయి వ్యవహ రిస్తున్నారని కాపు నేతలు ధ్వజమెత్తుతున్నారు. కాపు సామాజిక వర్గాన్ని చూపించి, చంద్రబాబుతో పొలిటికల్ డీల్ కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన తరు వాత రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని చెబుతున్నారు. ఆయన రాజ కీయ అధికారం కోసం ఉపయోగపడిన కాపు లను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.ఇప్పుడేం చేద్దాం?సాయికృష్ణ వ్యవహారంపై సీఎం, డిప్యూటీ సీఎం మంతనాలుఆందోళనల నేపథ్యంలో డీజీపీతో చర్చసాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంపై ఆందోళనలు వెల్లువెత్తడంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటన నుంచి బుధవారం తిరిగి వచ్చిన చంద్రబాబు.. వెలగపూడి సచివాలయానికి చేరుకుని పవన్‌తో కలిసి ఈ ఘటనపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబులతో ఏం చేద్దామని చర్చించినట్లు తెలిసింది. విజయవాడ నగరంలో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వం ఇరుకున పడాల్సి వస్తుందని తెలియదా.. అని పోలీస్ కమిషనర్‌ను సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. ఘటనకు కారణమైన సీఐ నాగరాజును ఇప్పటికే వీఆర్‌కు పంపామని చెప్పగా, సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ అధికారితో దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులు ఎవరో తేల్చాలని చెప్పారు. ఈ వ్యవహారంలో నాగరాజు ఎందుకు అంత దూకుడుగా వ్యవహరించాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లు తెలిసింది. సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అతని మేనమామ జనసేన పార్టీ కీలక కార్యకర్త కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇకపై ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రతి అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చెప్పాలని డీజీపీకి సూచించినట్లు తెలిసింది. రాజకీయంగా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఎలా స్పందించాలనే దానిపైనా పవన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. మీడియా ద్వారా ప్రభుత్వ వాదన వినిపిస్తే ఎలా ఉంటుందని చర్చించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు మాట్లాడితే ప్రజల్లో ఇంకా ఆగ్రహం పెల్లుబికే అవకాశం ఉందని, ఆచితూచి వ్యవహరిద్దామని నిర్ణయించారు. మీడియాకు మాత్రం ఈ ఘటనపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు, నిష్పాక్షికంగా విచారణ జరపాలని చెప్పినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్టు సీఎంవో వర్గాలు బుధవారం రాత్రి అధికారికంగా వెల్లడించాయి. సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ నిర్వహించాలని కూడా సీఎం ఆదేశించినట్టు తెలిపాయి. -
Director Thallada: 80 లక్షలు పెట్టి సినిమా తీస్తే వచ్చింది 80 వేలు..!
-
తెలుగు యువ దర్శకుడికి కోడిరామకృష్ణ అవార్డ్
టాలీవుడ్ యువ దర్శకుడు తల్లాడ సాయి కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనను కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్ వరించింది. ఈ ఏడాది ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికృష్ణకు యువ ప్రతిభ డైరెక్టర్ అవార్డ్ అందజేశారు. ప్రతి ఏటా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తెలుగు సినీ రంగంలో తనదైన శైలిలో కథలతో సాయికృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ అవార్డు, ఆయన కథ రచన, దిశానిర్దేశం, స్క్రీన్‌ప్లే రంగాల్లో చూపించిన సృజనాత్మకతకు గుర్తింపుగా దక్కించుకున్నారు. ఇటీవల ఆయన రూపొందించిన నమస్తే సేట్ జీ, దక్ష, మిస్టరీ సినిమాలకి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు ద్వారా యువ దర్శకులలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన కోడిరామకృష్ణ ఫిల్మ్ ఫౌండేషన్‌కు, తుమ్మలపల్లి రామసత్య నారాయణకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ – "ఇది కేవలం ఒక అవార్డ్ కాదు.. నా మీద ఉన్న నమ్మకానికి గుర్తింపు.. తెలుగు సినిమా కోసం ఇంకా ఎన్నో వినూత్న ప్రయోగాలు చేయాలని ఉంది. నా టీమ్, నటీనటులు, టెక్నీషియన్లు, ప్రేక్షకులందరికీ ఇది అంకితం." అని తెలిపారు. కాగా.. ఈ కార్యక్రమానికి హీరో సుమన్, డైరెక్టర్ రేలంగి, నీహారిక కొణిదెల కూడా హాజరయ్యారు. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘మిస్టరీ’..షూటింగ్ షురు
తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, సుమన్, అలీ, తనికెళ్ల భరణి, సత్య శ్రీ, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక పాత్రల్లో ‘మిస్టరీ’ సినిమా షురూ అయింది. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నెల 21 వరకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్‌ని పూర్తి చేస్తాం. సెప్టెంబర్ చివరి వారంలో ‘మిస్టరీ’ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్ తవ్వ, కెమెరా: సుధాకర్, శివ రాథోడ్. పవర్ ఫుల్ పోలీస్‌గా రవిరెడ్డి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటుడు ‘రవి రెడ్డి’ చేస్తున్నట్లు టీం సభ్యులు తెలిపారు. గతంలో వి, విరాటపర్వం, గాలోడు లాంటి సినిమా లలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు రవిరెడ్డి. ఈ చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నానని, రిలీజ్ తర్వాత మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. -
అప్సర కేసులో పోలీసులు కీలక నిర్ణయం సాయి కృష్ణను..!
-
చెన్నై టూ హైదరాబాద్: అప్సర కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్‌లు..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ పరిధిలో నర్కుడ వద్ద అప్సర అనే యువతిని పూజారి సాయికృష్ణ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, హత్య కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్బంగా వారి మధ్య శారీరక సంబంధమే హత్యకు కారణమని స్పష్టం చేశారు. కాగా, డీసీపీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళనాడులోని చెన్నైకి చెందిన అప్సర హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అప్సర డిగ్రీ పూర్తి చేసింది. సినీ రంగంలో కొద్దిరోజులు పనిచేసింది. 2022లో ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. అప్సర తండ్రి కాశీ ఆశ్రమంలో నివసిస్తున్నారు. కోనసీమ జిల్లా గన్నవరానికి చెందిన సాయికృష్ణ మార్కెటింగ్‌లో ఎంబీఏ చేశాడు. 2010లో సాయికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం పూజారిగా ఉన్నాడు. బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అయితే, ఇద్దరికీ బంధుత్వం లేదు, ఒక్కటే కమ్యూనిటీ. అప్సర సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయానికి వచ్చేది. అదే ఆలయంలో సాయి పూజరిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆమెతో సాయి పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఇదే వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. ఇటీవలే సాయికి వివాహం జరిగినట్టు అప్సరకు తెలిసింది. దీంతో, తనను పెళ్లి చేసుకోవాలని 2023 మార్చి నుంచి సాయిపై ఒత్తిడి చేసింది. ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతోనే సాయి.. అప్సరను హత్య చేశాడు. ఈనెల 3వ తేదీన కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను సాయి తన కారులో ఎక్కించుకున్నాడు. ఆరోజు రాత్రి 8.15 గంటలకు సరూర్ నగర్ నుంచి కారులో స్టార్ట్ అయ్యారు. 11 గంటలకు శంషాబాద్ సరిహద్దుల్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే అప్సర కారు ముందు సీటులో పడుకుని ఉంది. ఈ క్రమంలో సుల్తాన్‌పూర్‌వద్ద ఉన్న గోశాల వైపు కారును మళ్లించాడు. ముందు సీటులో ఉన్న అప్సర ముఖంపై కారు కవరింగ్ షీట్ సాయంలో బలవంతంగా నొక్కాడు. దీంతో, అప్సర ప్రతిఘటించింది. అయితే, సాయి అప్పటికే తన వద్ద ఉన్న రాయితో అప్సర తలపై కొట్టాడు. ఇలా అప్సర తలపై 10సార్లు కొట్టడంతో ఆమె చనిపోయింది’ అని తెలిపారు. మరోవైపు.. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని మ్యాన్ హోల్లో నుండి అప్సర మృతదేహన్ని పోలీసులు వెలికితీశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె రెండోసారి గర్భం దాల్చిందని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇతరులతో చనువుగా ఉన్న అప్సర.. వాళ్ల ద్వారా గర్భం దాల్చి ఉంటుందని సాయికృష్ణ అనుమానించినట్టు తెలుస్తోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే.. ఈ చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: హాయ్ డియర్.. హోటల్లో కలుద్దామా.. యువకులతో మాటలు కలిపి.. -
అప్సరను పూజారి సాయికృష్ణ అందుకే చంపాడు
సాక్షి, క్రైమ్: శంషాబాద్ పరిధిలో నర్కుడ వద్ద జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు చేధించారు. పక్కా క్రిమినల్ ఆలోచనతోనే అప్సర(30)ను పూజారి సాయికృష్ణ(36) చంపాడని పోలీసులు వెల్లడించారు. అప్సరను గాఢంగా ప్రేమించానని చెప్పుకుని తిరిగిన సాయికృష్ణ ఎందుకు చంపాల్సి వచ్చింది?, చంపి ఆపై సాక్ష్యాలను మాయం చేసేందుకు ఏం చేశాడనే వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. నిందితుడు సాయికృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు.. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఉన్న గుడిలో సాయికృష్ణ పెద్దపూజారి. ఆ దగ్గర్లోనే శ్రీ వెంకటేశ్వరకాలనీలో అతను ఉంటున్నాడు. ఇక ఈ గుడి పక్కనే ఉండే ఇంటిలో అప్సర ఉంటోంది. గుడికి వచ్చే క్రమంలో అప్సరతో సాయికృష్ణకు పరిచయం ఏర్పడింది. శంషాబాద్ గోశాలకు ఇద్దరూ కలిసి వెళ్లేవారు. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. నిందితుడు సాయికృష్ణకు ఇదివరకే వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా అప్సర సాయికృష్ణను ఇష్టపడింది. గతంలో అప్సర గర్భం దాల్చడంతో.. అబార్షన్ చేయించినట్లు సాయికృష్ణ చెప్పాడు. ఇతరులతో చనువుగా ఉండడం, పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతోనే ఘాతుకానికి పాల్పడ్డాడని ఇప్పుడు అంటున్నాడు. శంషాబాద్ సీఐ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 5వ తేదీన తన అక్క కూతురు కనిపించకుండాపోయిందని సాయికృష్ణ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. అయితే.. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఈ కేసును ఛేదించాం. జూన్ 3వ తేదీన నర్కుడ దగ్గర్లో చంపేశాడు. ఆపై మృతదేహాన్ని ఓ కవర్లో చుట్టి కారులో వేసుకుని.. సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వెనకాల ఉన్న డ్రైనేజీలో పడేశాడు. ఈ విషయం అప్సర కుటుంబ సభ్యులెవరికీ తెలియదు. అప్సర మిస్సింగ్ కేసులో అనుమానం రావడంతోనే సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నాం. విచారణలో.. నిజం ఒప్పుకున్నాడు. రెండోసారి గర్భం? సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని మ్యాన్ హోల్ లో నుండి అప్సర మృతదేహన్ని పోలీసులు శుక్రవారంనాడు వెలికితీశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె రెండోసారి గర్భం దాల్చిందని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇతరులతో చనువుగా ఉన్న అప్సర.. వాళ్ల ద్వారా గర్భం దాల్చి ఉంటుందని సాయికృష్ణ అనుమానించి ఉంటాడని, దీనికి తోడు ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే.. ఈ చిక్కుముడి వీడే అవకాశం ఉంది. సాయికృష్ణ అలా చెప్పాడు: అప్సర తల్లి పూజారి ఘాతుకంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పూజారి అయ్యి ఉండి ఇలా చేస్తాడని ఊహించలేదని అప్సర తల్లి వాపోతోంది. అప్సర గతంలో తమిళ చిత్రంలో నటించింది. అయితే ఆవైపు వద్దని చెప్పి చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చేశాం. ఆ తర్వాత గుడిలో అప్సర-సాయికృష్ణకు పరిచయం ఏర్పడింది. సాయికృష్ణ తరచూ మా ఇంటికి వస్తుండేవాడు. మా అమ్మాయితో సాయికృష్ణకు ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియదు. అయితే.. జూన్ 3వ తేదీన మా అమ్మాయి కోయంబత్తూరు వెళ్తున్నట్లుగా చెప్పి వెళ్లింది. సాయి తనను శంషాబాద్‌లో దించుతాడని చెప్పింది. కానీ, మరుసటి రోజున మా అమ్మాయి నుంచి ఎలాంటి సమాచారం లేదు. సాయి కృష్ణని అడిగితే.. తన స్నేహితులతో అప్సర భద్రాచలం వెళ్లిందని చెప్పాడు. అంబేద్కర్ స్టాచ్యూ వద్ద దించానని అన్నాడు. కానీ, ఆమె భద్రాచలం వెళ్లిన ఆనవాలు లభించలేదు. మా అమ్మాయిని ఎవరితో భద్రాచలం పంపావని నిలదీశాను. కానీ, అతని దగ్గరి నుంచి బదులు రాలేదు. సాయికృష్ణని పోలీసులు గట్టిగా నిలదీస్తే.. అప్పుడు అప్సరను చంపానని చెప్పాడు. వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే అప్సరను చంపానని సాయి కృష్ణ అంటున్నాడు. అందులో వాస్తవం ఉండకపోవచ్చు. సాయికృష్ణకు ఉరి శిక్ష పడాల్సిందే అని అప్సర తల్లి డిమాండ్ చేస్తోంది. అప్సర మంచిది ఈ ఏరియాలోనే సాయికృష్ణ పెద్ద పూజారి. అప్సరతో అతనికి మంచి స్నేహం ఉంది. సాయికృష్ణ రాత్రి 11 గంటల వరకు అప్సర ఇంట్లోనే ఉండేవాడు. ఒక్కోసారి ఇద్దరూ కలిసి రాత్రి 12 తర్వాత కూడా బైక్ మీద బయటకు వెళ్లేవాళ్లు. కానీ, అప్సర చాలా మంచిది. పూజారి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నాం అని అప్సర ఉంటున్న ఇంటి యజమాని చెప్తున్నాడు. వెలుగులోకి కీలక విషయాలు కోయంబత్తూరు వెళ్తున్నానని, సాయికృష్ణ తనను డ్రాప్ చేస్తాడని తల్లికి చెప్పి ఇంట్లో చెప్పి బయల్దేరింది అప్సర. ఇద్దరూ కలిసి ఫోర్డ్ కారులో శంషాబాద్ రాళ్ల గూడ వైపు వెళ్లారు. అక్కడ భోజనం చేశారు. ఆపై కారులో ఫ్రంట్ సీట్లో రిలాక్స్ మోడ్‌లో పడుకుంది అప్సర. ఇదే అదనుగా హత్య కోసమే తెచ్చిన బెల్లం దంచే దుడ్డుకర్రను బయటకు తీశాడు సాయికృష్ణ. ఆ కర్రతోనే ఆమె తలపై బాది చంపేశాడు. ఆపై కవర్లో ఆమె డెడ్‌బాడీని ఉంచి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కారు రోజంతా ఇంటి ముందే పార్క్ చేశాడు. ఆ మరుసటి రోజు మ్యాన్‌హోల్‌లో అప్సర మృతదేహాన్ని పడేసి.. పైన మట్టి కప్పి వెళ్లిపోయాడు. హత్యకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. -
పట్టుదల ఉంటే.. కోచింగ్ అక్కర్లే
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో పేద, ధనిక తేడాలేదు. ప్రతిభ ఉన్న ఎవరైనా కల నెరవేర్చుకోవచ్చు. ఏ పోటీపరీక్షకైనా ఆన్లైన్లో బోలెడు కంటెంట్, మెటీరియల్ ఉంది. ప్రణాళిక, పట్టుదల ఉంటే కోచింగ్ అక్కర్లేదు. దినపత్రికలు చదవాలి. నోట్స్ తయారు చేసుకోవాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి.’ అని సివిల్స్ విజేత సాయికృష్ణ అన్నారు. కరీంనగర్‌కు తొలిసారిగా వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. లక్ష్యసాధనకు ఏడేళ్ల తపస్సు సివిల్స్ నా చిన్ననాటి కల. దాని కోసం ఏడేళ్లు తపస్సు చేశా. నేను పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. సివిల్స్‌లో 94వ ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. నాలుగో తరగతిలో ఉన్నప్పుడు జిల్లాకు కలెక్టర్‌గా సుమితా డావ్రా వచ్చారు. ఆమె గురించి అందరూ గొప్పగా చెబుతుంటే విని స్ఫూర్తి పొందాను. కరీంనగర్‌పై ఆమె రాసిన ‘పూర్ బట్ స్పిరిటెడ్ కరీంనగర్’ పుస్తకం నాకు ప్రేరణనిచి్చంది. ఆన్లైన్లో మెటీరియల్ ఎక్కువే.. ఇంటర్నెట్లో అన్ని పరీక్షల మెటీరియల్ దొరుకుతుంది.ఆ మెటీరియల్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంగ్లిష్ వస్తేనే సివిల్స్ సాధిస్తామనే అపోహను వీడాలి. మన మాతృభాషలో కూడా పరీక్ష రాసే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ సైతం మాతృభాషలోనే నిర్వహిస్తారు. కోచింగ్ తీసుకోవాలనే అపోహ, ఇంగ్లిష్ రాదనే భయం వీడితే ఎవరైన సివిల్స్ సాధించవచ్చు. కుటుంబమే పెద్ద అండ సివిల్స్ ప్రిపరేషన్లో కుటుంబ ం అండగా నిలిచింది. నాన్న, మామయ్యలు, అత్తయ్యలు ఎనిమిది మంది వరకు ప్రభుత్వ టీచర్లే.వారి ద్వారా స్ఫూర్తి పొందేవా డిని. 2015లో క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వస్తే చేరకున్నా ఎవరూ ఏమీ అనలేదు.ఇంటికే పేపర్ వస్తుండడంతో చిన్నప్పటి నుంచే దినపత్రికలు చదవడం అలవాటుగా మారింది. ఈ అలవాటు సివిల్స్‌కు ఎంతో ఉపయోగపడింది. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నా.. వరంగల్ ఎన్ఐటీలో 2015లో బీటెక్ పూర్తయ్యింది. ఢిల్లీకి వెళ్లి సివిల్స్ కోచింగ్ తీసుకున్న. సొంతంగా నోట్స్ త యారు చేసుకున్న. 2017 సివిల్స్‌లో 728వ ర్యా ంకుతో ఐసీఎల్ఎస్ వచ్చింది. నా లక్ష్యం ఐఏఎస్ కావడంతో మళ్లీ ప్రిపేర్ అయ్యాను. రోజుకు 5 నుంచి 7 గంటలు చదివాను. ఈ క్రమంలో మా సీనియర్ తక్కల్లపల్లి యశ్వంత్‌రావు ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయి. సోషల్ మీడియాకు దూరం సోషల్‌మీడియాకు దూరంగా ఉన్నాను. కంటెంట్ కోసమే ఆన్లైన్లో సెర్చ్ చేశాను. లక్ష్య సాధనకు అవసరమైన సమాచారం కోసమే యూ ట్యూబ్, గూగుల్‌లో సెర్చ్ చేశాను. అది నాకు ఎంతగానో ఉపయోగపడింది. అప్పుడప్పుడు సినిమాలు కూడా చూశాను. కానీ పరిమితంగానే చూశాను. ఈ కాలం తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠశాల దశలోనే ఐఏఎస్, ఐఐటీ కోర్సులు అంటూ నేర్పిస్తున్నారు. ఇది కొంత ఇబ్బందికరమే. పాఠశాల, ఇంటర్ స్థాయిలో ఐఐటీ, ఐఏఎస్ కోచింగ్‌లు ఇప్పించడం సరికాదు. ప్రతీ విద్యార్థి తనకంటూ ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. అది తెలుసుకొని అటువైపు వెళ్తే సక్సెస్ అవుతారు. అయితే కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవడం ప్రతీ విద్యార్థికి అవసరమే. ఏ పోటీ పరీక్షలోనైన కరెంట్ అఫైర్స్‌పై పట్టు ఉంటేనే రాణించగలుగుతారు. తన కలనే మా కల సాయి చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెరిగాడు. అందుకోసం నిరంతరం శ్రమించాడు. తన కలను మా కలగానే అనుకుని అన్ని విధాలా సహకరించాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతను అడిగినవన్నీ సమకూర్చాం. 2017లోనే ఐసీఎల్ఎస్ వచ్చినా సంతృప్తి చెందలేదు. తన స్వప్నం సాకారం కోసం రాత్రింబవళ్లు శ్రమించాడు. చివరికి సాధించాడు. – ఆవుల లక్ష్మయ్య ప్రైవేటు ఉద్యోగాన్ని వదులుకున్నాడు 2015లోనే నా కుమారుడు క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్టయ్యాడు. తల్లిదండ్రులుగా మేమెంతో ఆనందపడ్డాం. ఆకర్షణీయమైన ప్యాకేజీ చేతికి అందినా పక్కనబెట్టాడు. తన కలల వైపు అడుగులేశాడు. చివరికి నా కొడుకు తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ రోజు ఇంకా సంతోషిస్తున్నాం. – ఆవుల సునీత -
విషాదంగా మారిన ఫ్రెండ్షిప్ డే
నందిపేట్(ఆర్మూర్): స్నేహితుల దినోత్సవం రోజే ఓ స్నేహితుల బృందంలో విషాదం నెలకొంది. సరదాగా గడిపేందుకు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లిన మిత్రులలో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి గ్రామానికి చెందిన సాయికృష్ణ, రోహిత్, రాజేందర్, బూర్గుల రాహుల్(19), ఉదయ్(20), శివ(19) స్నేహితులు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నందిపేట మండలంలోని జీజీ నడ్కుడ గ్రామ సమీపంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. స్నానం చేసేందుకు నీటిలోకి దిగారు. అయితే, ఆ ప్రాంతంలో గతంలో జేసీబీతో మట్టి తీసిన పెద్ద పెద్ద గుంతలున్నాయి. ఆ సంగతి తెలియని శివ మరింత ముందుకు వెళ్లడంతో కాలు జారి గుంతలోకి జారిపోయాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన రాహుల్, సాయికృష్ణ, ఉదయ్ కూడా నీటమునిగిపోయారు. గమనించిన రోహిత్, రాజేందర్ గట్టిగా కేకలు వేయగా, సమీపంలో ఉన్న ఓ పశువుల కాపారి పరిగెత్తుకొచ్చాడు. వాటర్‌పైపును నీటిలోకి వేయగా, సాయికృష్ణ చాకచక్యంగా దానిని పట్టుకుని బయటకు వచ్చాడు. మిగతా ముగ్గురు రాహుల్, ఉదయ్, శివ నీటిలోనే గల్లంతయ్యారు. సమాచారమం దుకున్న పోలీసులు, గ్రామస్తులు బ్యాక్ వాటర్ ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అర ్ధరాత్రి వరకూ గాలించినా ఆ ముగ్గురి ఆచూకీ లభిం చలేదని తహసీల్దార్ అనిల్ కుమార్, ఎస్సై శోభన్‌బాబు తెలిపారు. -
శ్రావణి కేసులో కస్టడీకి దేవరాజ్, సాయికృష్ణ
సాక్షి, హైదరాబాద్: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో అరెస్టయి చంచలగూడ జైలులో ఉన్న ఇద్దరు నిందితులు సాయి కృష్ణ, దేవరాజ్ రెడ్డిని ఎస్సార్ నగర్ పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రేమిస్తున్నట్లు నటించి శ్రావణిని బ్లాక్మెయిల్ చేసి తీవ్రంగా వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలతో దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో పాటు సినీ నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దేవరాజ్, సాయిలను తిరిగి పోలీసు కస్టడీకి తీసుకున్నారు. వీరిని మూడు రోజుల పాటు విచారించి శ్రావణి ఆత్మహత్యకు గల మరిన్ని కారణాలు తెలుసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ముగ్గురు నిందితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. అయితే ఈ కేసులో మూడో నిందితుడు అయిన అశోక్ రెడ్డిని మాత్రం పోలీసులు ఇంకా కస్టడీకి తీసుకోలేదు. -
పవన్ క్షమాపణలు చెప్పాలి : కోట సాయికృష్ణ
సాక్షి, విజయవాడ : హిందూ మతంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ ఖండించారు. పవన్ కల్యాణ్‌వి అపరిపక్వ రాజకీయాలని విమర్శించారు. పవన్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. హిందువుల మనోభావాలను పవన్ అవమానించారని తెలిపారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ పూర్తిగా ఖండిస్తోందన్నారు. హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలను పవన్ వెనక్కి తీసుకోని.. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై పవన్ బహిరంగ చర్చకు సిద్దమా అని సవాలు విసిరారు. మరోవైపు వీహెచ్‌పీ నేతలు కూడా పవన్ వ్యాఖ్యలను ఖండించారు. పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. పవన్‌కు పిచ్చిపట్టినట్లుందని వ్యాఖ్యానించారు. హిందువులను అగౌరవపరిచేలా మాట్లాడటం సరికాదని సూచించారు. చదవండి: హిందూ మతంపై పవన్ సంచలన వ్యాఖ్యలు -
ఏపీ రాజధానిలో టీడీపీ నేతల రౌడీయిజం
-
నోయిడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
-
నోయిడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
నోయిడా: ఉత్తరప్రదేశ్‌లో ఓ తెలంగాణ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయం వసతి గృహంలో సాయికృష్ణ అనే విద్యార్థి ఉరి వేసుకుని మృతి చెందాడు. బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్న అతడు శనివారం ఈ ఘటనకు పాల్పడ్డాడు. సాయికృష్ణ నాలుగు నెలల క్రితం ఈ కోర్సులో జాయి అయ్యాడు. ఘటనా స్థలంలో తెలుగులో రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కళాశాలలో సాయికృష్ణకు ఎలాంటి సమస్య లేదని యాజమాన్యం తెలిపింది. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కళాశాల యాజమాన్యం సాయికృష్ణ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాగా గతంలోనూ సుశాంత్ రోహిల్లా అనే న్యాయ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
సత్యనారాయణ వ్రతం కోసం వెళ్లి..
చెన్నూర్ : సత్యనారాణయ వ్రతం కోసం వెళ్లిన అన్నాతమ్ముడు గోదావరిలో నీట మునిగి చనిపోయిన సంఘటన చెన్నూర్‌లో విషాదాన్ని నింపింది. ఓ చిన్నారిని కాపాడి తన కొడుకులను రక్షించుకుకోలేకపోయిన ఆ తండ్రి గుండె విలవిల్లాడింది. ‘స్వామి వత్రం కోసం వస్తే మీ ఇద్దర్ని తీసుకెళ్లాడా కొడుకా’ అంటూ తల్లి రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన పేరాల రామారావు స్థానిక అభయాంజనేయ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్నాడు. రామారావు ప్రజావైన్స్లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రామారావు ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న ఆర్యవైశ్యులు పట్టణ సమీపంలోని గోదావరి నదిలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. వ్రతానికి వీరిని ఆహ్వానించడంతో రామారావు, భార్య లావణ్యతోపాటు ఇద్దరు కుమారులు సాయికృష్ణ (11), సాయి వర్షిత్ (6) వెళ్లారు. అక్కడి వెళ్లిన రామారావు పిల్లలతో గోదావరి స్నానాలు చేస్తున్నారు. వీరికి కొంత దూరంలో కొంత మంది చిన్నారులు స్నానాలు చేస్తున్నారు. అందులోంచి ఓ చిన్నారి గోదావరిలో మునిగిపోతుండగా రామారావు పరుగెత్తుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చాడు. ఒడ్డుకు వచ్చి చూసే సరికి తన కొడుకులు ఇద్దరు కన్పించలేదు. తండ్రి వెంటనే వెళ్లిన సాయికృష్ణ (11), సాయివర్షిత్(6) గోదావరి నదిలో గల్లంతయ్యారు. చిన్నారులు గల్లంతైన ప్రదేశం లోతుగా ఉండడంతో జాలర్లు గాలింపు చర్యలు చేపట్టి పిల్లల మృతదేహాలను బయటికి తీశారు. సత్యనారాయణ స్వామి వత్రాలను చూసేందుకు వస్తే ఆ స్వామి మీ ఇద్దర్ని తీసుకెళ్లాడా కొడుకా అంటూ తల్లి లావణ్య రోధించిన తీరు పలువురిని కలచివేసింది. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై శివప్రసాద్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూలరాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కరుణసాగర్‌రావు సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా సాయికృష్ణ స్థానిక ఎస్జీబీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 4వ తరగతి, సాయివర్షిత్ ఎల్కేజీ చదువుతున్నారు. బంధువుల ఆందోళన సత్యనారాయణ వత్రాలు నిర్వహించే సమీపంలోనే ఇద్దరు చిన్నారులు మృతి చెంది బాధిత కుటుంబ సభ్యులు రోధిస్తుంటే పూజలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని మృతుల బంధువులు గోదావరి తీరం వద్ద ఆందోళన చేశారు. వెంటనే పూజలు నిలిపివేయాలని ఆర్యవైశ్య సంఘం నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఎస్సై శివప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన కారులకు నచ్చజెప్పారు. -
నువ్వే నా బంగారం పాటలు
‘‘కొడుకులు, కూతుళ్లకన్నా.. మనవళ్లు, మనవరాళ్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతోనే తన మనవడి కోసం కృష్ణంరాజు ఈ సినిమా తీశాడు. ఈ పాటలు, ట్రైలర్స్ బాగున్నాయి. ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసి, ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చేలా చేయండి’’ అని డా. దాసరి నారాయణరావు అన్నారు. సాయికృష్ణ, షీనా జంటగా రామ్‌వెంకీ దర్శకత్వంలో పేరిచర్ల కృష్ణంరాజు నిర్మించిన చిత్రం ‘నువ్వే నా బంగారం’. యాజమాన్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను దాసరి ఆవిష్కరించి వీవీ వినాయక్‌కి ఇచ్చారు. ఈ పాటలు, ట్రైలర్స్ బాగున్నాయని, సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని వినాయక్ అన్నారు. ఈ తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నానని నిర్మాత చెప్పారు. యూత్, ఫ్యామిలీకి నచ్చే అంశాలతో ఈ సినిమా చేశామని, ఫీల్ గుడ్ మూవీ అని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్, వి.సాగర్, సుమన్, బెల్లంకొండ సురేష్, వాసు తదితరులు పాల్గొన్నారు.


