నోయిడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య | Amity student from Telangana allegedly hangs himself in university hostel in Noida | Sakshi

నోయిడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

Published Sat, Nov 5 2016 5:57 PM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM

నోయిడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య - Sakshi

నోయిడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్లో ఓ తెలంగాణ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నోయిడా: ఉత్తరప్రదేశ్లో ఓ తెలంగాణ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయం వసతి గృహంలో సాయికృష్ణ అనే విద్యార్థి  ఉరి వేసుకుని మృతి చెందాడు.  బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్న అతడు శనివారం ఈ ఘటనకు పాల్పడ్డాడు.

సాయికృష్ణ నాలుగు నెలల క్రితం ఈ కోర్సులో జాయి అయ్యాడు. ఘటనా స్థలంలో తెలుగులో రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కళాశాలలో సాయికృష్ణకు ఎలాంటి సమస్య లేదని యాజమాన్యం తెలిపింది. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కళాశాల యాజమాన్యం సాయికృష్ణ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాగా గతంలోనూ సుశాంత్ రోహిల్లా అనే న్యాయ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement