DCP Narayana Reddy Revealed Details Of Apsara Murder Case - Sakshi
Sakshi News home page

ఇద్దరికీ బంధుత్వం లేదు.. అక్కడే కలిశారు.. మాటలు కలిపి ప్రేమలోకి.. డీసీపీ వివరణ ఇదే..

Published Fri, Jun 9 2023 7:56 PM | Last Updated on Fri, Jun 9 2023 8:08 PM

DCP Narayana Reddy Revealed Details Of Apsara Murder Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ పరిధిలో నర్కుడ వద్ద అప్సర అనే యువతిని పూజారి సాయికృష్ణ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, హత్య కేసు వివరాలను శంషాబాద్‌ డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్బంగా వారి మధ్య శారీరక సంబంధమే హత్యకు కారణమని స్పష్టం చేశారు. 

కాగా, డీసీపీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళనాడులోని చెన్నైకి చెందిన అప్సర హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అ‍ప్సర డిగ్రీ పూర్తి చేసింది. సినీ రంగంలో కొద్దిరోజులు పనిచేసింది. 2022లో ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. అప్సర తండ్రి కాశీ ఆశ్రమంలో నివసిస్తున్నారు. కోనసీమ జిల్లా గన్నవరానికి చెందిన సాయికృష్ణ మార్కెటింగ్‌లో ఎంబీఏ చేశాడు. 2010లో సాయికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం పూజారిగా ఉన్నాడు. బిల్డింగ్‌ కాంట్రాక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. 

అయితే, ఇద్దరికీ బంధుత్వం లేదు, ఒక్కటే కమ్యూనిటీ. అప్సర సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయానికి వచ్చేది. అదే ఆలయంలో సాయి పూజరిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆమెతో సాయి పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఇదే వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. ఇటీవలే సాయికి వివాహం జరిగినట్టు అప్సరకు తెలిసింది. దీంతో, తనను పెళ్లి చేసుకోవాలని 2023 మార్చి నుంచి సాయిపై ఒత్తిడి చేసింది. ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతోనే సాయి.. అప్సరను హత్య చేశాడు. 

ఈనెల 3వ తేదీన కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను సాయి తన కారులో ఎక్కించుకున్నాడు. ఆరోజు రాత్రి 8.15 గంటలకు సరూర్‌ నగర్‌ నుంచి కారులో స్టార్ట్‌ అయ్యారు. 11 గంటలకు శంషాబాద్‌ సరిహద్దుల్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే అప్సర కారు ముందు సీటులో పడుకుని ఉంది. ఈ క్రమంలో సుల్తాన్‌పూర్‌వద్ద ఉన్న గోశాల వైపు కారును మళ్లించాడు. ముందు సీటులో ఉన్న అప్సర ముఖంపై కారు కవరింగ్‌ షీట్‌ సాయంలో బలవంతంగా నొక్కాడు. దీంతో, అప్సర ప్రతిఘటించింది. అయితే, సాయి అప్పటికే తన వద్ద ఉన్న రాయితో అప్సర తలపై కొట్టాడు. ఇలా అప్సర తలపై 10సార్లు కొట్టడంతో ఆమె చనిపోయింది’ అని తెలిపారు.  

మరోవైపు.. సరూర్ నగర్  తహసీల్దార్  కార్యాలయ సమీపంలోని మ్యాన్ హోల్‌లో నుండి అప్సర మృతదేహన్ని  పోలీసులు  వెలికితీశారు. డెడ్ బాడీని  పోస్టుమార్టం కోసం  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె రెండోసారి గర్భం దాల్చిందని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇతరులతో చనువుగా ఉన్న అప్సర.. వాళ్ల ద్వారా గర్భం దాల్చి ఉంటుందని సాయికృష్ణ అనుమానించినట్టు తెలుస్తోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వస్తే.. ఈ చిక్కుముడి వీడే అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి: హాయ్‌ డియర్‌.. హోటల్‌లో కలుద్దామా.. యువకులతో మాటలు కలిపి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement