Vikarabad: ‘ప్రియురాలిలో అమ్మా నాన్నల ప్రేమను చూశా.. కానీ’ | Young Man Commits Suicide Due To Girl Friend Cheating saroornagar | Sakshi
Sakshi News home page

Vikarabad: ప్రియురాలిలో అమ్మా నాన్నల ప్రేమను చూశా.. వేరొకరితో ప్రేమలో పడటాన్ని జీర్జించుకోలేక!

Published Mon, Feb 13 2023 1:29 PM | Last Updated on Mon, Feb 13 2023 1:29 PM

Young Man Commits Suicide Due To Girl Friend Cheating saroornagar - Sakshi

ప్రవీణ్‌కుమార్‌ (ఫైల్‌) 

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని ప్రేమించి వివాహం చేసుకుంటుందన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాలప్పడ్డాడు. ఈ సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మాధవరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ గ్రామానికి చెందిన కటిక కృష్ణాజీ కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ (26) బీఈడీ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు సరూర్‌నగర్‌ శ్రీనివాస కాలనీలోన ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. బీఈడీ చదివే సమయంలో పరిచయమైన ఓ యువతిని ప్రేమించాడు. నాలుగు సంవత్సరాలుగా వీరు కలిసిమెలసి ఉంటున్నారు.

అయితే కొంత కాలంగా తనను కాదని వేరే యువకుడిని యువతి ప్రేమిస్తుండటంతో ప్రవీణ్‌కుమార్‌ మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం తెల్లవారు జామున ఒక సెల్ఫీ వీడియా తీసి, సూసైడ్‌ నోట్‌ రాసుకున్నాడు. సెల్ఫీ వీడియోను తన స్నేహితులు, బంధువులకు పంపంచి..వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టాడు. అనంతరం నైలాన్‌ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.

వాట్సాప్‌ స్టేటస్‌లో వీడియో చూసిన స్నేహితులు ప్రవీణ్‌  ఉండే గదికి చేరుకుని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వా«దీనం చేసుకున్నారు.  

తనతోనే జీవితం ఊహించుకున్నా
‘చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాను. బీఈడీలో పరిచయం అయిన యువతిని మనసారా ప్రేమించాను. ఇద్దరం నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నాం. అమ్మ, నాన్నల ప్రేమను తాను చూపించింది. నా జీవితం మొత్తాన్ని తనతో ఊహించుకున్నాను. ఆ అమ్మాయి లేకుండా బతకలేను. వేరొకరితో ప్రేమలో పడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నా... అందుకే చనిపోతున్నా. నన్ను క్షమించండి.  మిస్‌ యూ ఫ్రండ్స్‌...నా చివరి చూపు చూసేందుకు రండి..బై.’ అని ప్రవీణ్‌కుమార్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.  
చదవండి: Hyderabad: నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement