![Fraud In Cyber Crime Police Rs 35 Thousand Stolen At Shamshabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/7/Cyber.jpg.webp?itok=lu-IuTxg)
సాక్షి, శంషాబాద్ రూరల్: హలో.. మేము సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నాము.. మీ వీడియో ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ అయింది.. వెంటనే తొలగించాలంటూ ఓ వ్యక్తిని మాటలతో మభ్య పెట్టి రూ.35,450 కాజేసిన సంఘటన మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఏ.శ్రీధర్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని బుర్జుగడ్డతండాకు చెందిన వాన భాస్కర్ గైడ్‌గా పని చేస్తున్నాడు.
గత నెల 28న అతడికి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నీకు సంబందించిన వీడియో నెట్‌లో అప్‌లోడ్ అయ్యిందని, దీన్ని తొలగించుకోవాలని చెబుతూ అతనికి ఓ ఫోన్ నంబరు ఇచ్చారు. దీంతో బాధితుడు సదరు ఫోన్ నంబర్ కాల్ చేయగా వీడియో తొలగించడానికి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో అతను తన ఫోన్‌పే ద్వారా రూ.21వేలు పంపించాడు. ఇలా పలు దఫాలుగా మొత్తం రూ.35,450 ముట్టజెప్పాడు. ఈ డబ్బులను తిరిగి చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు తర్వాత మరింత డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..)
Comments
Please login to add a commentAdd a comment