stealing
-
పద్మ భూషన్ పతకం విక్రయానికి యత్నం.. ఐదుగురు అరెస్ట్!
దేశంలోనే మూడవ అత్యున్నత పౌర గౌరవ పురస్కార పతకం పద్మభూషణ్ చోరీకి గురైన ఉదంతం ఢిల్లీలో వెలుగు చూసింది. సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకం చోరీకి గురైంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ చోరీ విషయం మెడల్ అందుకున్న వ్యక్తికి కూడా తెలియలేదు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకాన్ని అతని సహాయకుడు దొంగిలించాడు. ఈ పద్మభూషణ్ పతకాన్ని ఒక దుకాణంలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా ఈ చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మెడల్‌పై పద్మభూషణ్ అని రాసి ఉన్నందున, ఈ పతకాన్ని కొనుగోలు చేసేందుకు స్వర్ణకారుడు దిలీప్ నిరాకరించాడు. దీంతో ఆ ముగ్గురూ మరో స్వర్ణకారుని సంప్రదించారు. ఆగ్నేయ జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ రాజేష్ దేవ్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ హరిసింగ్, రింకీ వేద్ ప్రకాష్ అనే ముగ్గురు స్నేహితులు పద్మభూషణ్ పతకాన్ని విక్రయించేందుకు కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో నగల దుకాణం నడుపుతున్న దిలీప్‌ను సంప్రదించారని తెలిపారు. అయితే దిలీప్ ఈ విషయాన్ని కల్కాజీ పోలీసులకు తెలియజేశాడు. పోలీసు బృందం అక్కడకి చేరుకునేలోపే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారుల అప్రమత్తమై ఆ ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. నిందితులంతా మదన్‌పూర్ ఖాదర్‌కు చెందినవారని దిలీప్ తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మదన్‌పూర్ ఖాదర్ నివాసి శ్రవణ్ కుమార్ (33), హరి సింగ్ (45), రింకీ దేవి (40), వేద్ ప్రకాష్ (39), ప్రశాంత్ బిస్వాస్ (49)గా గుర్తించారు. నిందితుడు శ్రవణ్ కుమార్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత జిసి ఛటర్జీ ఇంట్లో మెడికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. -
ఫోన్ ఛార్జింగ్‌పై బాస్ ఆగ్రహం.. టాయిలెట్ ఫ్లష్ చేయద్దంటున్న నెటిజన్లు!
ఉద్యోగ జీవితంలో పలు సమస్యలు ఎదురవుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో తన ప్రొఫిషినల్ లైఫ్‌లో ఎదురైన ఒక అనుభవాన్ని వెల్లడించాడు. తాను తన కార్యాలయంలో విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాననని దానిలో పేర్కొన్నాడు. వైరల్ అవుతున్న రెడ్డిట్ పోస్టులో @Melodic-Code-2594 అనే ఖాతా కలిగిన యూజర్ తన బాస్ తాను ఆఫీసులో ఫోన్ ఛార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నాడు. ‘వ్యక్తిగత ఉపయోగం కోసం కంపెనీ విద్యుత్ చోరీ చేశానని’ బాస్ ఆరోపించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ యూజర్ తన పోస్టులో.. ‘ఆఫీసులో తాను ఫోన్ ఛార్జ్ చేసినందుకు మా బాస్ నాతో.. వ్యక్తి గత అవసరాలకు కంపెనీ విద్యుత్ చోరీ చేస్తున్నారు. మీ లాంటి వాళ్లకు ఎలా చెప్పాలి? నేనేమీ రోజంతా ఫోనులోనే మునిగిపోను. అప్పుడప్పుడు రాత్రి వేళ బెడ్‌మీదకు చేరేముందు ఫోన్ చార్జ్ చేయడం మరచి పోతుంటానంతే. ఇది డెస్క్ జాబ్’ అని బాస్ సీరియస్‌గా చెప్పాడని వివరించారు. ఈ పోస్టును చూసిన యూజర్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్..‘మీ బాస్ పెద్ద మూర్ఖుడు. ఫోన్ ఛార్జింగ్ పెడితే కంపెనీ కరెంట్ చోరీ చేసినట్లు అవుతుందన్నాడంటే.. అక్కడి గాలి పీల్చినా, నీటిని తాగినా చోరీ చేశావని అంటాడేమో’ అని కామెంట్ చేశాడు. మరో యూజర్..‘మీ బాస్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవద్దన్నాడంటే.. ఆఫీసులోని ఫోనుకు వచ్చిన ఏ కాల్‌ను రిసీవ్ చేసుకోకూడదు. ఎందుకంటే అప్పుడు కంపెనీ ఫోను టాక్‌టైమ్, బ్యాటరీ పవర్ చోరీ చేసినట్లువుతుందని’ పేర్కొన్నాడు. మరో యూజర్ ‘ఆఫీసులోని టాయిలెట్ యూజ్ చేసినప్పుడు ఫ్లష్ చేయవద్దని మీ బాస్‌కు చెప్పండి. ఎందుకంటే అలా చేస్తే కంపెనీకి చెందిన నీరు వృథా అవుతుందని వివరించండి’ అని సలహా ఇచ్చాడు. ఇది కూడా చదవండి: అందం.. నేర సామ్రాజ్యంలోకి అడుగిడితే.. లేడీ డాన్ లవ్ స్టోరీస్! -
షాకింగ్ ఘటన: దొంగతనం చేశాడని..కదులుతున్న రైలు నుంచి తోసేసి..
దొంగతనం చేశాడని ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి..కదులుతున్న ట్రైయిన్ నుంచి తోసేశారు. ఈ ఘటన అయోధ్య- ఢీల్లీ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఒక గుర్తు తెలియని 20 ఏళ్ల వ్యక్తి షాజహాన్‌పూర్‌లోని తిల్హర్ రైల్వే స్టేషన్ పట్టాలపై మృతి చెంది ఉన్నాడు. సదరు వ్యక్తి రైల్వే పట్టాల వద్ద ఉండే ఓవర్‌హెడ్ లైన్ పోల్కి తల ఢీకొట్టడంతో మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఐతే మృతుడికి సబంధించిన ఒక వైరల్ వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. ఆ వీడియోలో ఒక జనరల్ కంపార్ట్మెంట్ బోగిలో 40 ఏళ్ల నరేంద్ర దూబే అనే వ్యక్తి బాధితుడిని ఫోన్ దొంగలించినందుకు క్రూరంగా కొడుతున్నట్లు కనిపించింది. పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు నవ్వుతూ కనిపించాడు. ఆ తర్వాత బాధితుడిని పనిష్మెంట్ కింద కదులుతున్న ట్రైయిన్ నుంచి తోసేస్తున్నట్లు..సదరు బాధితుడు భయంతో అరుస్తున్న కేకలు ఆ వీడియోలో వినిపించాయి. దీంతో పోలీసులు సదరు ప్రయాణికుడు నరేంద్ర దూబేని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత ఒక మహిళన తన మొబైల్ ఫోన్ షాజహాన్‌పూర్ రైల్వేస్టేషన్లో పోయిందని ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేలింది. వాస్తవానికి బాధితుడు ఫోన్ దొంగలించి లక్నోలో ట్రైయిన్ ఎక్కినట్లు తేలింది. అయితే అక్కడ జనరల్ కంపార్ట్మెంట్లోని ఒక సముహం అతని వద్ద ఈ ఫోన్‌ని గుర్తించి దాడి చేసి రైలులోంచి తోసేశారని పోలీసలు చెబుతున్నారు. దొంగలించిన అరగంటలోనే బాధితుడు రైల్వే పట్టాలపై విగతజీవిగా పడిఉన్నట్లు తెలిపారు. A man suspected to have stolen a mobile phone in Ayodhya Delhi express was thrashed mercilessly and thrown off the running train. He died after his head hit against a pole near Tilhar railway station in Shahjahanpur Uttar Pradesh. pic.twitter.com/bCrREOD51o — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) December 18, 2022 (చదవండి: మరొకరితో సంబంధం.. ఏకంగా భర్త ఇంట్లోనే కాపురం.. మహిళను చెట్టుకు కట్టి) -
హలో మేము సైబర్ క్రైమ్ పోలీసులం అంటూ..రూ.35 వేలు కాజేశారు!
సాక్షి, శంషాబాద్ రూరల్: హలో.. మేము సైబర్ క్రైమ్ నుంచి మాట్లాడుతున్నాము.. మీ వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ అయింది.. వెంటనే తొలగించాలంటూ ఓ వ్యక్తిని మాటలతో మభ్య పెట్టి రూ.35,450 కాజేసిన సంఘటన మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఏ.శ్రీధర్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని బుర్జుగడ్డతండాకు చెందిన వాన భాస్కర్ గైడ్‌గా పని చేస్తున్నాడు. గత నెల 28న అతడికి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నీకు సంబందించిన వీడియో నెట్లో అప్లోడ్ అయ్యిందని, దీన్ని తొలగించుకోవాలని చెబుతూ అతనికి ఓ ఫోన్ నంబరు ఇచ్చారు. దీంతో బాధితుడు సదరు ఫోన్ నంబర్ కాల్ చేయగా వీడియో తొలగించడానికి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. దీంతో అతను తన ఫోన్‌పే ద్వారా రూ.21వేలు పంపించాడు. ఇలా పలు దఫాలుగా మొత్తం రూ.35,450 ముట్టజెప్పాడు. ఈ డబ్బులను తిరిగి చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు తర్వాత మరింత డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు.! ప్రియుడితో కలిసి భార్యే..) -
వైరల్ వీడియో: ఖెర్సన్ జూలో జంతువులను ఎత్తుకుపోతున్న రష్యా సేనలు
-
ప్చ్! పోరాడలేకపోయాం...కనీసం కొట్టేద్దాం: రష్యా బలగాలు
ఖెర్సన్ నుంచి రష్యా బలగాలు వైదొలగడంతో ఉక్రెయిన్‌లో పండగ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నగరమంతా రష్యా బలగాలను తరిమికొట్టేశాం అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఆనందంగా ప్రకటించారు. ఈ మేరకు వెనక్కు మళ్లుతున్న రష్యా సేనాలు ఎలాగో పోరాడలేకపోయం కదా పోతూపోతూ... ఖెర్సన్ ప్రాంతంలో జూలోని జంతువులను పట్టుకుపోతున్నారు. బహుశా ఎలాగో పోతున్నాం కదా అని దొంగతనం చేస్తున్నారు కాబోలు. ఈ క్రమంలో ఖెర్సన్ జూలోని ఏడు రకూన్లు అనే అమెరికన్ ఎలుగుబంటి జాతులను, లామా అనే ఒంటె, నెమళ్లు, రెండు ఆడ తోడేళ్లు, గాడిద వంటి జంతువులను బలవంతంగా పట్టుకుని వాహనంలో ఎక్కించారు. కేవలం జంతువులే కాదు అక్కడ ఆస్పత్రుల్లో ఉన్న వివిధ కళాఖండాలు, వైద్య పరికరాలు వంటివి పట్టుకుపోయారు. ఈ మేరకు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ జంతు ప్రదర్శనశాల నుంచి రష్యా బలగాలు జంతువులను పట్టుకుపోవడాన్ని తప్పపట్టారు. ఆర్ట్ గ్యాలరీ నుంచి పెయింటింగ్‌లు,మ్యూజియంల నుంచి పురాత వస్తువులు తదితరాలన్నింటిని దొంగలించినట్లు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు రష్యా బలగాలు ఉక్రెయిన్‌ని ఏమీ చేయలేక ఈ దొంగతనానికి ఒడిగట్టారంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: చర్చల ప్రసక్తే లేదు...తెగేసి చెప్పిన జెలెన్స్కీ) -
లేత దొంగ! సార్.. ఇదే మొదటి దొంగతనం!
ఖమ్మం అర్బన్: ఓ సినిమాలో ఆలీ లేత దొంగగా కనిపించి నవ్వించాడు. ఎప్పటికప్పుడు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం అనుకుని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతుంటాడు. సరిగ్గా ఇదే రీతిన ఖమ్మంలో ఓ యువకుడు చోరీ చేసి పట్టుబడ్డాడు. ఖమ్మం ఖానాపురం సెంటర్లోని తూము మోహన్‌రావు కిరాణం షాపు షట్టర్లను గతనెల 25న పగులగొట్టి సెల్‌ఫోన్, వెండిపట్టీలు, రూ.15 వేలు చోరీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణలో భాగంగా ఖమ్మం మంచికంటి నగర్‌కు చెందిన దేవెళ్ల మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకున్న అతను చోరీ చేసేందుకు గల కారణాలను వివరించాడు. తల్లిదండ్రులతో ఘర్షణ పడి వేరు కాపురం పెట్టానని, దీంతో అవసరమైన సరుకులు కొనుగోలు చేసేందుకు మొదటిసారి దొంగతనం చేశానని చెప్పాడు. చోరీ చేసిన నగదుతో గ్యాస్ సిలిండర్, వంటపాత్రలు కొనుగోలు చేసి సెల్‌ఫోన్, పట్టీలు ఇంట్లోనే ఉంచినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో ఆయా సరుకులను రికవరీ చేసిన ఖమ్మం అర్బన్ పోలీసులు మహేష్‌ను సోమవారం కోర్టులో హాజరుపరిచారు. (చదవండి: గద్వాలలో ‘డర్టీ పిక్చర్’!) -
పోలీసే దొంగలా కొట్టేస్తే ఏం చేసేది సామీ!
లక్నో: పోలీసే దొంగలా ఒక షాపు నుంచి ఎలక్ట్రిక్ బల్బ్‌ని కొట్టేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్ రాజేష్ వర్మ మూసేసి ఉన్న షాపు వద్ద బల్బుని తీసేసి జేబులో పెట్టకుని వెళ్లిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి రాజేష్‌కి అక్టోబర్ 6న దసరా సంబరాలు జరుగుతున్న రోజు ఆ ప్రాంతంలో నైట్ డ్యూటీ పడింది. అప్పుడే అతను ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఐతే మరసటి రోజు షాప్ యజమాని వచ్చి చూడగా..బల్బు కనిపించకపోవడంతో సీసీఫుటేజ్ చెక్ చేసి చూశాడు. ఆ వీడియో ఫుటేజ్ చూసి ఆ షాపు యజమాని ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఈ ఘటన తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు సదరు కానిస్టేబుల్ని విధుల నుంచి తొలగించారు. అతను ఈ మధ్యే ఫుల్పూర్ పోలీస్టేషన్‌కి బదిలిపై వచ్చాడు. ఐతే కానిస్టేబుల్ రాజేష్ మాత్రం తాను బల్బు దొంగలించ లేదని బల్బు ఊడిపోతుండటంతో తీసి మళ్లీ సరిచేసి పెట్టానంటూ సమర్థించుకనే యత్నం చేస్తున్నాడు. పైగా చీకటి కాబట్టి ఫుటేజ్ అలా కనిపిస్తుందని వాదిస్తున్నాడు. గతంలో యూపీలో ఇలానే ఒక పోలీసు మొబైల్ ఫోన్‌ని కొట్టేస్తూ పట్టుబడిన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. (చదవండి: కేరళ తరహా మరో నరబలి కలకలం.. మూడు రోజులుగా తాంత్రిక పూజలు చేస్తూ..) -
విచిత్రమైన దొంగ: పర్సు కొట్టేసి... సముద్రంలో ఈత కొట్టి ఎస్కేప్! కానీ...
చైన్‌స్నాచర్లు, పిక్ పాకెటర్స్ చాలా తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటారు. ఎంతో స్కెచ్ వేస్తే గానీ ఒకపట్టాన దొరకరు. ఔనా! ఐతే ఈ దొంగ మాత్రం పర్సు కొట్చేసి ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. వివరాల్లోకెళ్తే... ఫ్లోరిడాలో ఒక దొంగ ఒక హోటల్ పార్కింగ్ వద్ద ఉన్న ఒక మహిళ పర్సును కొట్టేశాడు. ఆ తర్వాత ఆ దొంగ తప్పించుకునేందుకు టంపా బేలో ఉండే బీచ్‌లోకి వెళ్లిపోతాడు. ఆ బీచ్ వద్దే ఉన్న కొంతమంది ఆ దొంగ సముద్రంలోకి వెళ్లడం చూస్తారు. ఆ దొంగ ఏకంగా సముద్రంలో ఈతకొట్టి తప్పించుకోవాలనుకున్నాడు. ఐతే సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగను వెతకడం కోసం హెలికాప్టర్‌తో రంగంలోకి దిగారు. అధికారులు హెలికాఫ్టర్‌తో ఆ వ్యక్తి కోసం సముద్రం అంతా జల్లెడపడతారు. పాపం ఆ దొంగ పోలీసలు తనను వదలేటట్లు లేరని డిసైడ్ అయ్యి తనను వెంబిడిస్తున్న హెలికాప్టర్ని చూసి లొంగిపోతున్నట్లు చేతులు పైకెత్తుతాడు. కానీ ఆ దొంగ తప్పించుకోవాలన్న ప్రయాసతో ఏకంగా 200 అడుగుల లోతు వరకు ఈత కొట్టేశాడు. పోలీసులు సదరు దొంగను డెవేన్ డీన్‌గా గుర్తించి, పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా గిన్నిస్ రికార్డు) -
కోతి తెలివి సల్లగుండ.. ఇలా కూడా చేస్తాయా!.. వైరలవుతున్న వీడియో
భూమ్మీద ఉన్న తెలివైన జంతువులలో కోతులు ఒకటి. కానీ వాటి చేష్టలు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని సార్లు అవి చేసే పనులు ప్రజల ఆగ్రహానికి గురిచేస్తాయి. దేవాలయాలు, పార్క్‌లు, బహిరంగ ప్రదేశాల్లో జనాల చేతుల్లో ఆహార పదార్థాలు, ఫోన్లు, పర్స్‌లు కనిపిస్తే చాలు తెలివిగా వాటిని ఎత్తుకెళ్లిపోతుంటాయి. ఇళ్లలోకి దూరి కిచెన్‌లోని వస్తువులను కూడా దొంగిలిస్తుంటాయి. చేతికి దొరికిన తీసుకొని పరారవుతుంటాయి. తాజాగా ఓ కోతి బ్యాగ్ నుంచి దొంగిలిస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో.. ఓ వ్యక్తి భుజానికి బ్యాగ్ వేసుకొని కూర్చొని ఉన్నాడు. ఈ బ్యాగ్ అక్కడున్న రెండు కోతుల కంట పడింది. కానీ అక్కడ కోతులు ఉన్నాయని ఆ వ్యక్తి గమనించుకోలేదు. వెంటనే కోతులు వ్యక్తి తగిలించుకున్న బ్యాగ్ వద్దకు చేరుకున్నాయి. అందులో ఓ కోతి మెల్లగా బ్యాగ్ జిప్ తీసింది. మొదటి జిప్‌లో ఏం దొరకలేదు. దీంతో మరో జిప్ తెరిచింది. అందులో దానికి ఒక యాపిల్ దొరికింది. ఇంకేముంది దానిని తీసుకొని పరుగో పరుగు తీసింది. దీనిని రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్.. వేలల్లో లైక్‌లు వచ్చి చేరుతున్నాయి. దొంగ కోతి, అది చికాగో, న్యూయార్క్ నుంచి వచ్చినా సరే కోతులన్నీ దొంగవే. కోతి తెలివి మామూలుగా లేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: అబ్బా! ఏం చేశాడ్రా... మూన్ వాకింగ్ స్టైల్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు View this post on Instagram A post shared by Waow Africa (@waowafrica) -
కన్నుపడితే లూటీ ! 40 ఏళ్లుగా దొంగతనాలే వృత్తి
బనశంకరి: 40 ఏళ్లకు పైబడి దొంగతనాలకు దోపిడీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను శనివారం రాజాజీనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. దొంగ ప్రకాష్ (54), కోలారు, శివమొగ్గ బళ్లారిలో మొత్తం మూడు వివాహాలు చేసుకోగా ఇతడికి 7 మంది సంతానం. ఇప్పటి వరకు ఇతనిపై 160 కి పైగా దొంగతనం కేసులు నమోదయ్యాయి. బెంగళూరు, కోలారు, బళ్లారి, శివమొగ్గ, చిత్రదుర్గ, గుల్బర్గా తో పాటు గోవా, కేరళలో చోరీలకు తెగబడ్డాడు. 20 సార్లకు పైగా జైలుకెళ్లి వచ్చాడు. 10 ఏళ్ల వయసులో తొలిసారి 1978లో ప్రకాష్ 10 ఏళ్ల బాల్యంలోనే తొలి చోరీ చేశాడు. తరువాత సహోదరుడు వరదరాజ్, పిల్లలు బాలరాజ్, మిథున్, అల్లుడు జాన్ కలిశారు. ఈ నెల 22 తేదీన రాజాజీనగరలో ప్రకాష్ చోరీకి పాల్పడి పోలీసులకు పట్టుబడ్డాడు. కేజీల కొద్దీ పసిడి దోపిడీ 1978–1986 వరకు 100 ఇళ్లలో చోరీలు చేశాడు. అప్పట్లో ప్రకాష్ కేరళ కొట్టాయంలో 2.5 కిలోల బంగారం చోరీ, శేషాద్రిపురంలో బంగారు దుకాణం గోడ కు కన్నం వేసి రెండున్నర కిలోల బంగారు నగల ఆభరణాలు దోపిడీ, మరో బంగారు షాపునకు కన్నం వేసి 4 కిలోల పసిడి నగలు లూటీ, 20 కిలోల వెండి చోరీకి పాల్పడ్డాడు. అనుచరులైన జోసెఫ్, ఆనందన్, బాషా సహకరించారు. దోచుకున్న నగదును పంచుకుని జల్సాలు చేసేవారు. వైరముడి, నాగేశ్ అనే అనుచరులతో కలిసి ప్రకాష్ 1989లో మైసూరులో 20 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 1992 లో నాగేశ్ తో కలిసి మహారాష్ట్ర కొల్హాపురలో రెండు బంగారు దుకాణాలకు కన్నంవేసి 17 కిలోల బంగారు ఆభరణాలు దోపిడీచేశారు. 1992లో శివమొగ్గ ఫైనాన్స్ కార్యాలయం నుంచి రూ.3 కోట్లు నగదు దోపిడీకి పాల్పడ్డాడు. 1997లో గోవాలో 7 కిలోల స్వర్ణాభరణాలను ఎత్తుకెళ్లాడు. 2006 నుంచి ప్రకాష్ తన పిల్లలైన మిథున్, బాలరాజ్ తో పాటు అల్లుడు, అతని పిల్లలతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. విలాసవంతమైన ఇళ్లు, జ్యువెలరీ దుకాణాలు, ఫైనాన్స్ కార్యాలయాలను ఎంచుకుని కొల్లగొడతాడు. ప్రతిసారి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లినప్పటికీ బయటికి వచ్చి కొత్త ముఠాను ఏర్పాటు చేసుకునేవాడు. (చదవండి: మహిళలను వేధించే పోకిరీలకు జైలు శిక్ష!) -
పల్నాడులో దొంగలు హల్ చల్..!!
-
ఆంటీ ఎంత చాకచక్యంగా ఫోన్ కొట్టేసిందో చూడండి: వీడియో వైరల్
దొంగతనాలకు సంబంధించిన ఎన్నో వైరల్ వీడియోలు చూసుంటాం. పాపం వాళ్లు దొంగతనం చేసేటప్పుడు ఎంతలా టెన్షన్ పడుతూ దొంగలించి పారిపోతుంటారో వంటివి చూశాం. ఎందుకింత హైరానా మంచిగా పనిచేసుకుని హాయిగా ఉండొచ్చు కదా అనుకుంటా. కానీ కొంతమంది కన్నింగ్ క్యాండిట్లు అసలు ఏ మాత్రం భయపడుకుండా భలే చోరి చేస్తారు. వాళ్ల ముఖంలో కాస్త కూడా గాభరా గానీ ఆందోళన గానీ కనిపించదు. అచ్చం అలానే ఇక్కడో ఆంటీ ఎంతలా దొంగతనం చేసిందో చూడండి. వివరాల్లోకెళ్తే... ఇద్దరు మహిళలు షాపింగ్ చేసి బిల్లు పే చేసేందుకు కౌంటర్ వద్దకు వచ్చారు. ఐతే అందులో ఒక మహిళ తెలివిగా తను ముందున్న మహిళ వద్దకు రాసుకుంటూ వస్తుంది. పైగా చాలా చాకచక్యంగా సదరు మహిళ పర్సులో పోన్ తీస్తూనే మరోవైపు బిల్ కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి ఏవేవో సందేహాలు అడుగుతుంది. ఇంతలో ఆ మహిళ ఫోన్‌ని తన బ్యాగ్‌లో వేసుకుని కామ్‌గా వెళ్లిపోతుంది. కనీసం తన ఫోన్ పోయిందని పాపాం ఆ మహిళకు కూడా ఇంకా తెలియదు. ఈ మేరకు ఘనటకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: నివాళి సభలో ‘పోకిరీ’ పాటకు బెల్లి డ్యాన్స్‌లు.. నోరెళ్లబెట్టిన బంధువులు.. వీడియో వైరల్) -
లగ్జరీ కార్లే టార్గెట్! విమానంలో వస్తాడు... దొంగిలించిన కారులో జారుకుంటాడు
బంజారాహిల్స్: ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో 61 లగ్జరీ కార్లు చోరీ చేశాడు.... నాలుగు సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు... అయినా ప్రవర్తన మార్చుకోకుండా ఈ సారి హైదరాబాద్‌పై కన్నేసిన అతను రెండు నెలల్లో అయిదు లగ్జరీ కార్లు తస్కరించి నగర పోలీసులకు సవాల్‌గా మారాడు. ఎట్టకేలకు బెంగళూరు పోలీసులు ఇటీవల ఈ సింగిల్ హ్యాండ్ కార్ల దొంగను పట్టుకోవడంతో గుట్టురట్టయింది. అంతర్రాష్ట్ర కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్‌ను బంజారాహిల్స్ పోలీసులు ఇక్కడ జరిగిన ఓ కారు దొంగతనం కేసులో కస్టడీకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది జనవరి 26న షెకావత్ బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్‌హయాత్ హోటల్లో కన్నడ నిర్మాత మేఘనాథ్ ఫార్చునర్ కారును దొంగిలించి పరారయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే దుండిగల్పోలీ స్ స్టేషన్ పరిధిలో ఒకటి, నాచా రం పీఎస్ పరిధిలో ఒక కారు, పేట్‌బషీరాబాద్ పరిధిలో రెండు కార్లు చోరీ చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరు గుతున్నాడు. ఏడాది వ్యవధిలోనే బెంగళూరు, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, తదితర ప్రధాన నగరాల్లో 21 లగ్జరీ కార్లను చోరీ చేశాడు. అతడిని అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు 21 కార్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో హైదరాబాద్‌లో దొంగిలించిన అయిదు కార్లు కూడా ఉన్నాయి. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో కూడిన డివైస్‌ను ఉపయోగించి కారు డోర్లు తెరుస్తూ కేబుల్ కనెక్ట్ చేసి ఎంచక్కా వాటిలో దూసుకెళ్లేవాడు. దొంగిలించిన కార్లను తక్కువ ధరకు అమ్మేస్తూ జల్సా చేసేవాడు. పార్క్‌హయత్‌లో కారు దొంగతనం చేసేందుకు అతను విమానంలో వచ్చాడు. అలాగే పేట్బషీరాబాద్లో కార్ల చోరీ సమయంలోనూ విమానంలోనే వచ్చిన షెకావత్ లగ్జరీ కార్ కొట్టేసి అందులోనే పరారయ్యాడు. కార్లు దొంగిలించేందుకు కేవలం జేబులో ఓ డివైస్ పెట్టుకొని ఫ్లైట్ ఎక్కి రయ్‌మంటూ వస్తాడు. కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 1, తమిళనాడులో 1, హైదరాబాద్‌లో అయిదు దొంగతనాలు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇప్పటి వరకు మొత్తం 61 కార్లు దొంగిలించి విక్రయించినట్లు తెలిపాడు. (చదవండి: రూ.1,700 కోట్ల హెరాయిన్ పట్టివేత) -
సినీ నటి ఇంట్లో చోరీ.. ధనుష్ అరెస్ట్
చెన్నై: నటి నిక్కీ గల్రాణి ఇంటిలో చోరీ జరిగింది. బహుభాషా నటి అయిన నిక్కీ గల్రాణి స్థానిక రాయపేటలో నివసిస్తున్నారు. నెల క్రితం కడలూరు జిల్లా విరుదాచలంకు చెందిన ధనుష్ (19) అనే యువకుడు ఆమె ఇంట్లో పనికి చేరాడు. ఈనెల 11న అతడు రూ.1.25 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు ధనుష్‌ను అన్నాశాల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. చదవండి: (ఆన్లైన్ టికెట్ల విధానంలో తప్పేముంది?) -
సెల్‌ఫోన్ దొంగిలించాడని కొట్టి చంపేశారు
దుండిగల్: సెల్‌ఫోన్ దొంగిలించాడనే నెపంతో ఓ వ్యక్తిని తల్లి కొడుకులు కలిసి తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు.. హత్యానేరం నుంచి తప్పించుకునేందుకు మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులు కూపీ లాగడంతో అసలు హంతకులు పట్టుబడిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురానికి చెందిన దండసాయి రమేష్ (35) వృత్తిరీత్యా హోటళ్లల్లో చెఫ్‌గా పని చేసేవాడు. నగరానికి వలస వచ్చిన అతను సూరారం కాలనీలో ఉంటూ స్థానికంగా ఉంటున్న హోటళ్లల్లో పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితం గండిమైసమ్మలోని జెఎంజే టిఫిన్ సెంటర్లో చెఫ్‌గా చేరాడు. అయితే డిసెంబరు 26న హోటల్లో సెల్‌ఫోన్, నగదు చోరీకి గురయ్యాయి. రమేష్‌పై అనుమానంతో హోటల్ నిర్వాహకుడు రాకేశ్, అతని తల్లి భాగ్యలక్ష్మి అతన్ని చేతులు కట్టేసి కొట్టారు. అయినా ఒప్పుకోకపోవడంతో వెదురు కట్టెలతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో హత్యానేరం నుండి తప్పించుకునేందుకు రాకేష్ అతని స్నేహి తులు వెంకటసాయి, వినయ్, మున్నా, సతీశ్, సంపత్, అజారుద్దీన్లు మృతదేహాన్ని బహదూర్‌పల్లి సాయినాథ్ సొసైటీలో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. పట్టుబడిందిలా.. సాయినాథ్ సొసైటీలోని రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దుండిగల్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేశారు. కాగా మృతుడి ప్యాంట్‌జేబులో లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రమేష్ పలు హోటళ్లలో చెఫ్‌గా పని చేసేవాడని తెలుసుకున్నారు. గండిమైసమ్మలోని జెఎంజే హోటల్లో పని చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు స్థానికులను విచారించగా గొడవ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా రమేష్‌ను కొడుతున్న దృశ్యాలు లభించాయి. దీంతో హోటల్ నిర్వాహకుడు రాకేశ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందాడని, మృతదేహాన్ని సాయినాథ్ సొసైటీ సమీపంలో పడేసినట్లు అంగీకరించాడు. దీంతో రాకేశ్‌తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా రాకేశ్ తల్లి భాగ్యలక్ష్మి పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
ట్రావెల్ బస్సు చోరీకి యత్నం.. ఇలా దొరికిపోయాడు!
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ద్విచక్ర వాహనాలు, ఆటోలను దొంగలించడం సర్వ సాధారణం. అయితే ఓ దొంగ ఏకంగా ట్రావెల్ బస్సునే చోరీకి యత్నించాడు. వివరాలిలా ఉన్నాయి. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని సింధూర గెస్ట్‌హౌస్ పక్కన ట్రావెల్ బస్సును మంగళవారం రాత్రి డ్రైవర్ నిలిపి భోజనానికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బస్సు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా.. అక్కడ అదృశ్యమైన బస్సు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైంది. టౌన్‌కొత్తరోడ్డు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఉండడాన్ని స్థానికులు గుర్తించి, ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ట్రాఫిక్ ఎస్ఐ కాళిదాసు, అదనపు ఎస్సై గణేష్, సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును రోడ్డు పక్కకు తరలించారు. బస్సు ముందు భాగం నుజ్జు అయింది. బస్సును తస్కరించిన వ్యక్తి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పరారై ఉంటాడని ట్రాఫిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: జంక్ సామ్రాజ్యం ‘సోటిగంజ్’.. చోర్ మాల్తో 30 ఏళ్ల దందా.. కోట్లకు కోట్లు వెనకేశారు -
సెల్‌ఫోన్ చోరుల కొత్త పంథా..
సెల్ఫోన్ల దొంగలు రూట్ మార్చారు. ఒకప్పుడు చోరీ చేసిన ఫోన్లను యథాతథంగా వినియోగించడం/విక్రయించడం జరిగేది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇలా తస్కరించిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను ట్యాంపరింగ్/క్లోనింగ్ చేసి వాడటం మొదలెట్టారు. ఆపై ఇతర రాష్ట్రాలు, దేశాలకు విదేశాలకు తరలించేయడం చేశారు. తాజాగా చోరీ ఫోన్లను స్పేర్ పార్ట్స్‌గా మార్చి అమ్మేస్తున్నట్లు నగర పోలీసులు గుర్తించారు. ఈ ముఠాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని పిక్‌పాకెటింగ్ గ్యాంగ్‌లు ఒకప్పుడు కేవలం పర్సుల్ని మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరిగిన తరవాత వీరి దృష్టి సెల్ఫోన్లపై పడింది. పీడీ యాక్ట్ ప్రయోగం ప్రారంభమయ్యే వరకు కరుడుగట్టిన రౌడీషీటర్లు కూడా ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ మరికొన్ని చోటా మోటా ముఠాలు ఈ దందాలో ఉన్నాయని అంటున్నారు. ఒకరి ‘ఏరియా’ల్లోకి మరోకరు ప్రవేశిస్తుండటంతో వీటి మధ్య అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగాయి. గల్లీ దుకాణాల కేంద్రంగానే.. అనధికారిక సమాచారం ప్రకారం రాజధానిలో ఏటా దాదాపు లక్ష వరకు సెల్ఫోన్లు చోరీకి అవుతున్నాయి. రాజధాని నగరంలో అనేక ఛోటామోటా ముఠాలు సెల్‌ఫోన్ పిక్‌పాకెటింగ్, స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని ఈ సెల్‌ఫోన్ నేరం అనేది కొనసాగుతోంది. వీరిబారిన పడే వారిలో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి ఫోన్లను స్పేర్‌పార్ట్స్‌గా మార్చడం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ దందాను పెద్ద దుకాణాలు, మార్కెట్లలో కాకుండా గల్లీల్లో ఉండే చిన్న చిన్న దుకాణాల కేంద్రంగా చేస్తున్నారనే సమాచారం ఉంది. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాం. – నగర పోలీసు ఉన్నతాధికారి గతంలో ఐఎంఈఐ నెంబర్ మార్చేసి... ప్రపంచంలో తయారయ్యే ప్రతి మొబైల్ ఫోన్కీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్(ఐఎంఈఐ) నెంబర్ ఉంటుంది. సదరు సెల్‌ఫోన్‌ను ఎవరు వాడుతున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐఎంఈఐ నెంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్ ఇంటర్నెట్లో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నెంబర్‌కు బదులు మరో ఐఎంఈఐ నెంబర్ కేటాయించేసేవారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్ బోర్డ్‌పై ఉన్న ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ వాటికి వేసేసే వారు. ఇలా చేస్తే సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. ఇలా విడగొట్టేసి.. అలా విక్రయాలు ఇటీవల కాలంలో చోరీ ఫోన్లను ఖరీదు చేసే నగర వ్యాపారుల పంథా పూర్తిగా మారిపోయినట్లు సిటీ పోలీసులు గుర్తించారు. వీటిని యథాతథంగా విక్రయిస్తే నిఘా సమస్య ఉంటోందని భావించారు. దీంతో స్పేర్‌పార్ట్స్‌గా మార్చేసి అమ్ముతున్నారు. ఐఎంఈఐ నెంబర్ అనేది ఫోన్ మదర్ బోర్డ్‌కు సంబంధించిన అంశం. ఈ నేపథ్యంలోనే దీన్ని మాత్రం అమ్మకుండా మిగిలిన అన్ని విడి భాగాలకు సెల్‌ఫోన్ దుకాణాలకు అమ్మేస్తున్నారు. ఇలా చేయడంతో లాభం తక్కువగా ఉన్నప్పటికీ రిస్క్ అనేది ఉండదన్నది చోరీ సొత్తు విక్రేతల ఉద్దేశం. కొందరు సెల్‌ఫోన్ రిపేరింగ్ షాపులతో పాటు ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లతో ఈ తరహా విక్రేతలకు సంబంధాలు ఉంటున్నాయని అధికారులు తేల్చారు. ఈ దందా చేస్తున్న వ్యాపారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ► కొన్నేళ్ల నుంచి కరోనా ముందు రోజుల వరకు ఈ చోరీఫోన్లు దేశం దాటేశాయి. ► ఈ ఫోన్లను వ్యవస్థీకృత ముఠాలు ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు తరలించేసిన సందర్భాలు అనేకం. ► ఐ–ఫోన్ల వంటివైతే ఒక్కో విడతలో నాలుగైదు ఫోన్లు చొప్పున బ్యాంకాక్ తీసుకువెళ్ళి అక్కడ మార్కెట్లో అమ్మేసి వచ్చిన చోరులు అనేక మంది ఉన్నారు. ► నగరంలో జగదీష్ మార్కెట్ మాదిరిగా ఆ దేశంలోనూ ఓ భారీ సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ ఉందని, అయితే ఐ–ఫోన్లకే గిరాకీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు గుల్బర్గాలో ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దేశంలో చోరీ మాల్‌కు కేరాఫ్ అడ్రస్ అని పోలీసులు గుర్తించారు. ఇలానే రిటర్న్ మాల్ పేరుతో చైనాకు చోరీ ఫోన్లు పంపిన సందర్భాలు అనేకం. -
ఐస్‌క్రీం కొనడానికి వచ్చి ఏం చేశాడో తెలుసా... నవ్వాగదు!
చాలా సార్లు దుకాణాల్లో అమ్మే వ్యక్తులను ఏదోరకంగా వస్తువులను పట్టుకువెళ్లిపోయే వాళ్లను చూసే ఉంటాం. అంతేందుకు చాలా మటుకు అమ్మేవాణ్ణి ఏదోరకంగా మాయ చేసి ఇచ్చిన రేటుకుంటే ఎక్కవ వస్తువులను తీసుకుపోయే వాళ్లను కూడా చూసి ఉంటాం. ఇలా బహిరంగంగా అందరూ చూస్తుండగా, అదీ కూడా షాపింగ్ మాల్లో ఒక టర్కీష్ ఐసీక్రీంని పట్టుకుపోతాడు. అది ఎక్కడ జరిగిందో ఏంటో అని ఆలోచింకండి చదివేయండి. (చదవండి: బంపర్ ఆఫర్....వ్యాక్సిన్ తీసుకో..బహుమతి పట్టు) ఒక షాపింగ్ మాల్లో ఒక టర్కిష్ ఐస్‌క్రీం దుకాణదారుడు అత్యంత నైపుణంగా ఐస్‌క్రీం కోన్‌పై ఐస్క్రీంని చాలా వెరైటీగా అలంకరిస్తాడు. అందుకోసం అని ఒక కస్టమర్ ఆ దుకాణదారుడు వద్దకు వచ్చి నిలబడతాడు. ఆ వ్యాపారి ఒక కోన్ తీసుకుని పట్టుకోమని సదరు వ్యక్తికి ఇస్తాడు. ఇంతలో సదరు వ్యాపారి చాలా నైపుణ్యంతో ఐస్క్రీ పెడదామని చూస్తుండగానే కొనడానికి వచ్చిన ఆ వ్యక్తి ఆ ఐస్క్రీంని మొత్తం తీసుకుని పట్టకుపోతాడు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా చప్పట్లు కొడతూ నవ్వుతుంటారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి చూడండి. (చదవండి: యాహూ! నేను పగలుగొట్టేశాను) -
ఇంట్లో చొరబడి యువతులపై లైంగిక దాడికి యత్నం
దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం పరిధిలోని రాజానుకుంట వద్ద అద్దిగానహళ్లి గ్రామంలో జూన్ 8వ తేదీ తెల్లవారుజామున ఒక కార్పెంటర్ ఇంట్లోకి నలుగురు దొంగలు చొరబడ్డారు. ఇంట్లో వారిని బెదిరించి రూ.10వేల నగదు, కొంత బంగారం దోచుకున్నారు. (చదవండి: విమానాలకు రన్‌వేగా..) కామంతో కళ్లుమూసుకుపోయిన చోరులు ఇంట్లో ఉన్న యువతులపై లైంగిక దాడికి ప్రయత్నించారు. అయితే వారు గట్టిగా కేకలు వేయడడంతో పరారయ్యారు. విచారణ జరిపిన పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.7 లక్షల విలువైన 151 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. (చదవండి: ఫల్గుణి నాయర్: స్వీయ నిర్మిత మహిళా బిలినీయర్) -
నీ దొంగ బుద్ధి తగలెయ్య!
-
నీ దొంగ బుద్ధి తగలెయ్య!...మరీ ఆ వస్తువా! ఎక్స్పీరియన్స్ లేనట్టుందే....
ఇటీవల కాలంలో దొంగలు రకరకాలు వస్తువులను ఎత్తుకెళ్లుతున్న సంఘటనలు గురించి చాలానే విని ఉంటాం. కొన్ని రకాలు వస్తువులను సైతం దొంగతనం చేసినపుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంటుంది. అంతెందుకు కొన్ని వస్తువులు దొంగతనం చేసేందుకు కూడ సాధ్యం కానివి అయినప్పటికీ కొంతమంది వాటిని కూడా దొంగతనం చేసి నవ్వులు పాలువుతుంటారు. అచ్చం అలాంటి పనే ఇక్కడొక మహిళ చేసింది. (చదవండి: చేతల్లో చూపించగలగేవాడికి చేతులతో పని ఏమి ?) అసలు విషయంలోకెళ్లితే...ఐరన్ వస్తువులకు సంబంధించిన ఒక పెద్ద స్టోర్‌లో ఒక మహిళ చైన్ సా (కటింగ్ సాధనం(రంపం))ని దొంగలిస్తుంది. నిజానికి దాన్ని దొంగతనం చేయడం పైగా ఎవ్వరికి కనిపించకుండా దాచిపెట్టి తీసుకెళ్లడమనేదే అసాధ్యం. అలాంటి వస్తువును ఆమె దాచడానికి తెగ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఆ స్టోర్ సీసీపుటేజ్‌లో ఆమె ఆ వస్తువును దాచడానికీ ప్రయత్నించే క్రమంలో ఫ్యాంటు వెనుకవైపు లోపలకి దూర్చడమే కాకా పైన వేసుకున్న కోటుతో కవర్ చేయడానికీ ప్రయత్నిస్తుంది. కానీ ఆమె భుజానికి తగలించిన బ్యాగ్‌ల మూలంగా ఆ వస్తువు బయటకీ కనిపిస్తోంది. దీనికీ సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు "ఆమె ఈ వస్తువును దాచిపెట్టగలనా లేదా అని చూస్తోంది" అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: వ్యాక్సిన్ వేయించుకుంది.. రూ 7.4 కోట్లు గెలుచుకుంది) -
సమోసా కోసం వెళ్లింది.. రూ.20 దొంగిలించిందని మైనర్‌ను తాళ్లతో కట్టేసి...
లక్నో: సమోసా కోసం దుకాణానికి వెళ్లిన బాలిక డబ్బులు దొంగతనం చేసిందనే కారణంతో తాళ్లతో మంచానికి కట్టేశారు. ఈ అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. హాపూర్ జిల్లాలో ఏడేళ్ల బాలిక సమోసాల కోసం షాప్‌కు వెళ్లింది. అక్కడ సమోసా కొనుక్కొని వస్తుండగా దుకాణంలో 20 రూపాయల నగదును బాలిక దొంగిలించిందని షాప్ యాజమాని రాకేష్ కుమార్ ఆమెపై ఆరోపణలు చేశాడు. అంతటితో ఆగకుండా మైనర్ బాలికను లాక్కెళ్లి రెండు చేతులను తాళ్లతో మంచానికి కట్టేశాడు. చదవండి: హైదరాబాద్: సినిమాలో చూసి కారు దొంగిలించిన బీటెక్ విద్యార్థి.. బాలికకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె అక్కడే ఏడుస్తూ ఉండిపోయింది. ఈ విషయంపై బాలిక తండ్రి మాట్లాడుతూ.. తన కూతురు సమోసాల కోసం దుకాణంలోకి వెళ్లిందని, దొంగతనం పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. బాలిక తరుపున మాట్లాడటానికి వచ్చిన వారిని యాజమాని అసిస్టెంట్ బయపెట్టినట్లు తెలిపారు. ఈ విషయం చివరికి పోలీసుల వరకు చేరడంతో నిందితుడిని అరెస్టు చేశారు. అతనితోపాటు షాప్ అసిస్టెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: పెళ్లైన రెండు నెలలకే భార్యను రూ. లక్షా 80 వేలకు అమ్మేసిన మైనర్ -
పావురాలను దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కిన యువకుడు
-
చిన్నారి ఊపిరి తీసిన ఊయల..
సాక్షి,బేతంచెర్ల: ఊయల తాడు బిగుసుకొని శుక్రవారం ఓ చిన్నారి మృతి చెందింది. డోన్ పట్టణం కోటపేట కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు, హేమలత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంటి ఆవరణలో పై భాగాన ఉన్న కొండికి చీరతో ఊయల కట్టారు. నాలుగో తరగతి చదువుతున్న చరణ్య(9) గురువారం మధ్యాహ్నం ఊయల ఊగుతుండగా పైభాగాన ఉన్న జారుముడి గొంతుకు బిగిసుకుంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ బాలాజీ సింగ్ తెలిపారు. కర్నూలులో దొంగల హల్చల్ కర్నూలు: నగర శివారు గుత్తి పెట్రోల్ బంక్సమీపంలోని ఉద్యోగ నగర్, శ్రీకృష్ణ కాలనీల్లో దొంగలు హల్చల్ చేశారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పగలు రెక్కీ నిర్వహించి రాత్రి చోరీకి తెగబడ్డారు. పక్కపక్క కాలనీల్లోని రెండు ఇళ్లలో చొరబడి సుమారు రూ. 4.50 లక్షల నగదు, 10 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలను మూటగట్టుకుని ఉడాయించారు. శ్రీకృష్ణ కాలనీలో నివాసముంటున్న షరాబు ప్రదీప్ ఇంట్లో దొంగలుపడి అందినకాడికి దండుకుని పరారయ్యారు. ప్రదీప్ ఒమెగాహాస్పిటల్లో పనిచేస్తున్నాడు. గురువారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఓర్వకల్లులోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ప్రధాన తలుపు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. పడక గదిలో ఉన్న బీరువాను ద్దలుగొట్టి అందులో ఉన్న రూ.4 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలు మూటగట్టుకుని ఉడాయించారు. ప్రదీప్ శుక్రవారం ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానంతో గదిలోకి వెళ్లి చూశాడు. బీరులోని సామానులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని 4వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
WestBengal: సువేందు బ్యాడ్ టైం స్టార్ట్!
బీజేపీ శాసనసభ పక్ష నేత సువేందు అధికారిపై టీఎంసీ రివెంజ్ మొదలైందా? తాజా పరిణామాలతో ‘అవుననే’ అంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు. రానున్న రోజుల్లో అది మరింతగా ఉండబోతుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. కోల్‌కతా : వెస్ట్ బెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ లీడర్ సువేందు అధికారిపై ఓ కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన సామాగ్రిని దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు సువేందు అధికారి, అతని సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ సభ్యుడు రత్నదీప్ మన్నా ఈ నెల 1న చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సువేందు అధికారి, మాజీ కంతి మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు అధికారి ఇద్దరూ మే 29న కార్యాలయ గోడౌన్‌లోకి అక్రమంగా చొరబడి లక్షలు విలువచేసే సామాగ్రిని దోచుకువెళ్లారు అని మన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనంలో బీజేపీ నేతలు కేంద్ర సాయుధ బలగాలను సైతం ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ తృణముల్ మాజీ నేత మమతపై నెగ్గిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తుపాన్ సమీక్షలో ఈయన కూడా పాల్గొనడంతోనే.. దీదీ ఎగ్గొట్టిందన్న వాదన వినిపించింది కూడా. ముఖ్య అనుచరుడీ అరెస్ట్ ఇక సువేందు అధికారి ముఖ్య అనుచరుడు రేఖాల్ బెరాను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వందల మంది నుంచి డబ్బులు వసూలు చేశారనేది రేఖాల్ పై ప్రధాన ఆరోపణ. ఇది 2019 జులై, సెప్టెంబర్‌లో జరిగిందని ఫిర్యాదులో సుజిత్ డే అనే వ్యక్తి పేర్కొన్నాడు. తన నుంచి రెండు లక్షల రూపాయలు రేఖాల్ తీసుకున్నారని సుజిత్ తెలిపాడు. కాగా, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఈ ఫేక్ జాబ్ రాకెట్ స్కాంలో మరికొంత మంది నిందితుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: రసవత్తరంగా కోల్డ్‌వార్ -
భార్య బిడ్డల్ని కలవడం కోసం బస్సు దొంగిలించాడు
తిరువనంతపురం: కరోనా కట్టడి కోసం దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఎక్కడి వారు అక్కడే ఉండాలి. కదలడానికి వీలు లేదు. రవాణా సదుపాయాలు కూడా ఉండవు. ఈ క్రమంలో లాక్డౌన్ వల్ల భార్యాబిడ్డల నుంచి వేరైన ఓ వ్యక్తి వారిని కలుసుకోవడం కోసం పెద్ద సాహసమే చేశాడు. బస్ స్టాప్‌లో ఆగి ఉన్న బస్‌ను దొంగిలించి మరి వారి వద్దకు చేరుకోవాలని ప్రయత్నించాడు. మరి కొన్ని గంటల్లో వారిని చేరతాననగా పోలీసులకు చిక్కాడు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పాపం పోలీసులకు కూడా జాలేసింది. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. కోజికోడ్‌కు చెందిన దినూప్(30) లాక్డౌన్ కారణంగా కుటుంబ సభ్యుల నుంచి వేరయ్యాడు. ప్రస్తుతం అతడి భార్య, బిడ్డలు పథనంతిట్ట జిల్లా తిరువల్లులో ఉండిపోయారు. వారిని చూడాలని ప్రాణం కొటుకులాడుతుంది. కానీ లాక్డౌన్ వల్ల ఎక్కడికి వెళ్లడానికి వీలు లేని పరిస్థితులు. ఏం చేయాలో అతడికి అర్థం కాలేదు. ఈ క్రమంలో దినూప్ తన ఇంటి సమీపంలో ఓ ప్రైవేట్ బస్ పార్క్ చేసి ఉండటం గమనించాడు. బస్‌కు సంబంధించిన వ్యక్తులెవరు అక్కడ లేకపోవడంతో ధైర్యం చేసి దానిలోకి ఎక్కాడు. ఇంధనం కూడా ఫుల్‌గా ఉంది. ఏది అయితే అది అవుతుంది అనుకుని ప్రయాణం ప్రారంభించాడు. కోజికోడ్ నుంచి తిరువల్లు 270 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నాలుగు జిల్లాలు దాటి వెళ్లాలి. లాక్డౌన్ కారణంగా పోలీసు పహారా కూడా బాగానే ఉంది. దాంతో రెండు సార్లు రాత్రి సమయంలో పోలీసులు అతడిని ఆపారు. ఎక్కడికి అని ప్రశ్నించారు. దానికి దినూప్ పథనంతిట్టలో వలస కార్మికులున్నారు.. వారిని తీసుకురావడం కోసం వెళ్తున్నాను అని చెప్పి.. అక్కడ నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అతడు పర్యాటకంగా బాగా ప్రసిద్ది చెందిన కుమారకోం వద్దకు చేరుకున్నాడు. అక్కడ పోలీసులు దినూప్‌ని ఆపి ఎక్కడని అడగ్గా గతంలో చెప్పిన కథే చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు లైసెన్స్ చూపించమని అడిగారు. దినుప్ ఇంట్లో మర్చిపోయాను.. తీసుకురాలేదని తెలిపాడు. దాంతో పోలీసులు బస్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆర్టీవో వెబ్సైట్లో సర్చ్ చేయగా.. ఆ బస్ యజమాని పేరు, మొబైల్ నంబర్ తదితర వివరాలు వచ్చాయి. ఈ క్రమంలో పోలీసులు ఆర్టీఓ సైట్లో వచ్చిన నంబర్‌కు కాల్ చేయగా.. బస్ అసలు యజమాని కాల్ లిఫ్ట్ చేశాడు. అతడిని బస్ గురించి ప్రశ్నించగా.. ఆ బస్ తనదేనని.. కోజికోడ్ బస్ స్టాప్‌లో పార్క్ చేశానని తెలిపాడు. ఇక పోలీసులు జరిగిన తతంగం అంతా బస్ యజమానికి వివరించగా.. అతడు దినూప్ ఎవరో తనకు తెలియదని.. అతడు దొంగతనంగా తన బస్ వేసుకుని వెళ్లాడని పోలీసులకు తెలిపాడు. అనంతరం పోలీసులు దినూప్‌ని అదుపులోకి తీసుకుని బస్సును యజమానికి అప్పగించారు. చదవండి: ఛీ..ఛీ మీకిదేం పాడు బుద్ది -
ఛీ..ఛీ మీకిదేం పాడు బుద్ది
ఇస్లామాబాద్: దౌత్యవేత్త అంటే ఎంతో బాధ్యతగా మెలగాలి. ఓ దేశ పరువు ప్రతిష్టలు వారి భుజాల మీద ఉన్నట్లు అర్థం. అందుకే వారు తమ మాటలు, చేతలు విషయంలో చాగా జాగ్రత్తగా ఉండాలి. స్వదేశంలో ఎలా ఉన్నా ఏం కాదు.. కానీ విదేశాలకు వెళ్లినప్పడు ఏ చిన్న తప్పు చేసినా.. దేశ ప్రతిష్టకు భంగం కలగకమానదు. అలాంటిది పాకిస్తాన్ దౌత్యవేత్తలు ఇద్దరు విదేశీ పర్యటనలో తన చేతివాటం చూపారు. చాక్లెట్స్, టోపీ దొంగిలించి అడ్డంగా బుక్కయ్యారు. దక్షిణ కొరియా పర్యటనలో సదరు అధికారులు ఈ పని చేశారు. కొరియా టైమ్స్ రిపోర్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు పాక్ దౌత్యవేత్తలు ఈ ఏడాది జనవరి 10న, ఫిబ్రవరి 23న దక్షిణ కొరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత కొరియా వెళ్లిన అధికారి సుమారు 750 రూపాయలు విలువ చేసే టోపి దొంగతనం చేయగా.. మరొకరు సుమారు వంద రూపాయలు విలువ చేసే చాక్లెట్స్ దొంగిలించినట్లు కొరియా అధికారులు తెలిపారు. ఇక అధికారుల చేతి వాటానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీకెమరాల్లో రికార్డయ్యాయి. ఇక దొంగతనం జరిగిన షాపు యమజానులు దీని గురించి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో సదరు అధికారుల చేతి వాటం బయటపడింది. దర్యాప్తు తరువాత, దౌత్యపరమైన ప్రోటోకాల్ కారణంగా అధికారులు సదరు నిందితులపై కేసు బుక్ చేయకుండా వదిలేశారు. దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ ప్రకారం, దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు తమ ఆతిథ్య దేశంలో అరెస్టు, నిర్బంధం, నేరారోపణల నుంచి మినాహాయింపు పొందవచ్చు. చదవండి: పావురంపై ఎఫ్ఐఆర్ నమోదు..ఎందుకో తెలుసా? -
550 కిలోల ఉల్లిని కొట్టేశారు..
ముంబై : దేశంలో ఒక్కసారిగా ఉల్లిధరలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల కిందట చౌకగా లభించిన ఉల్లి.. ఇప్పుడు సామాన్యుడి కొనలేని రేటుకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు దాదాపు 550 కిలోల ఉల్లిని దొంగతనం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకుంది. నిందితులను సంజయ్ పరాది, పొపట్ కాలేలుగా గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన నారాయణ్ గావ్ పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈసారి వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో సరఫరాకు కూడా అంతరాయం కలుగుతోంది.ఉల్లిగడ్డ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. ఇక, ఉల్లితో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో కూడా ధరలు పెరిగిన సందర్భాల్లో పలుచోట్ల ఉల్లి దొంగతనాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఉల్లి కోసం గొడవలు కూడా జరిగాయి. ధరల విషయంలో వినియోగదారులు, అమ్మకపుదారులు ఘర్షణకు దిగారు. -
‘ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటు’
-
‘ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటు’
న్యూఢిల్లీ : ఓ వ్యక్తి చేసిన నిర్వాకం నెటజన్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. అసలు ఎందుకిలా చేశాడంటూ అనేక మంది అతనిపై మండిపడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటీ అనుకుంటున్నారా? ఢిల్లీలోని రోడ్లపై ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్లో మొక్కల పెంచే కుండీలపై ఓ వ్యక్తి కన్నుపడింది. అవి అతనికి అందంగా కనిపించాయో? లేక అమ్ముకుందామనుకున్నాడో తెలియదు కానీ.. ఆ కుండీల్లోని మొక్కలను అక్కడే పడేసి ఒకటి కాదు రెండు కాదు అనేక కుండీలను దొంగలించి.. ఓ సంచిలో వేసుకొని ఎత్తుకెళ్లాడు. అతడి చేష్టలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇది గమనించిన సదరు దుండగుడు అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. ‘ఆల్వేజ్ దిల్ సే’ అనే ఫేస్బుక్ పేజీ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మొక్కలను నాశనం చేసి మరీ.. ప్లాస్టిక్ కుండీలను అతను ఎందుకు ఎత్తుకెళ్లాడో అర్థం కావడం లేదని ఈ వీడియోను పోస్టు చేసిన యూజర్ కామెంట్ చేశారు. దీనిని వీక్షించిన నెటిజన్లు మొక్కలను పెంచే కుండీలను దొంగిలించిన దుండగుడిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను అడ్డుకోలేనంత వరకు ఏ ప్రభుత్వాలను విమర్శించలేమని కామెంట్ చేస్తున్నారు. ‘ఇందుకే ఇండియా ఎప్పటికీ అభివృద్ధి చెందడం లేదు. ఇలాంటి చర్యలు సిగ్గుచేటు.. వీరిపై అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే అతన్ని పట్టుకొని స్థానిక అధికారులకు అప్పజెప్పానని, కానీ ప్రస్తుతానికి అతన్ని వదిలేయమని చెప్పానని ఫేస్బుక్ యూజర్ వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, పచ్చదనాన్ని పెంపొందించే ఉద్ధేశంతో ప్రభుత్వాలు రహదారుల మధ్యలో వర్టికల్ గార్డెన్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. -
గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు
లక్నో : సాధారణంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై భూ కబ్జాలు, అవినీతి, హత్యలు, హత్యాచారాలు లాంటి కేసులు నమోదు అవుతుంటాయి. వీటిల్లో ఏదో ఒక కేసు దాదాపు ప్రతి నాయకుడిపై ఉంటుంది. ప్రస్తుత రాజకీయాల్లో అది సర్వసాధారణం కూడా. కానీ ఓ ఎంపీపై వెరైటీగా దొంగతనం కేసు నమోదు అయింది. అది కూడా ఓ విచిత్రమైన దొంగతనం. ఆ ఎంపీ కోట్ల కొద్ది డబ్బులో లేదా తులాల కొద్ది బంగారమో దోపిడీ చేశాడని కేసు నమోదు కాలేదు. కేవలం ఓ గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు పెట్టారు. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. ఇక కేసు నమోదు అయిన ఎంపీ ఎవరో కాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తలో నిలిచే సమాజ్‌వాదీ పార్టీ ఫైర్ బ్రాండ్, రాంపూర్ ఎంపీ ఆజం ఖాన్. ఇప్పటికే భూకబ్జా, ల్యాండ్ మాఫియా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నఆజం ఖాన్‌కు తాజాగా ఈ విచిత్ర షాక్ తగలింది. ఎంజీ ఆజంఖాన్ రాంపూర్‌కు చెందిన అసిఫ్, జాకీర్ అనే వ్యక్తులు ఆజంఖాన్‌పై ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో కలిసి 2016 అక్టోబరు 15న రాంపూర్‌లోని తమ ఇంటిని ఆజంఖాన్ ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి ఆవరణలో ఉన్న గేదెతో పాటు రూ.25 వేల నగదును సైతం దొంగిలించారని ఆరోపించారు. ఇంటి స్థలాలన్ని ఇవ్వాలంటూ ఎంపీ అనచరులు తమపై దాడిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అజంఖాన్‌పైఎఫ్ఐఆర్ నమోదు చేశారు. .ఎంపీతో పాటుమరో 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. కాగా ఎంపీ అజంఖాన్‌పై ఇప్పటికే భూకబ్జా, వక్ఫ్ ఆస్తుల స్వాధీనం, రెచ్చగొట్టే వ్యాఖలు చేశారంటూ 50 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 28 కేసులు అలియాగంజ్ రైతులు పెట్టినవే కావడం గమనార్హం. -
ఫోన్ దొంగిలించాడని తలక్రిందులుగా వేలాడదీశారు
పాట్నా: సెల్‌ఫోన్ దొంగిలించాడని ఓ వ్యక్తిపై కిరాతంగా ప్రవర్తించారు కొందరు స్థానికులు. అతని కాళ్లను చైన్‌తో కట్టేసి చెట్టుపై నుంచి తలక్రిందులుగా వేలాడదీశారు. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహర్‌లోని దర్భాంగా సమీపం వద్దగల హింగోలీ గ్రామంలో అమ్రేశ్ అనే వ్యక్తి సెల్‌ఫోన్ దొంగిలించాడంటూ గ్రామస్తులు పట్టుకున్నారు. అతన్ని బాగా చితకబాదారు. అనంతరం అంతా కలిసి అతన్ని చైన్‌తో కట్టేసి పెద్ద చెట్టుపై నుంచి వేడాలదీశారు. ఇదంతా ఒకరు వీడియో తీశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అమ్రేశ్‌ను , మరో ముగ్గురు గ్రామస్తులను అరెస్ట్ చేశారు. -
మొబైల్ ఫోన్ దొంగిలించాడని..
-
అతనో దిగ్గజ కంపెనీ మేనేజర్.. చేసింది దొంగపని!
తైపీ : అతనో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫాక్స్ కాన్కి మాజీ సీనియర్ మేనేజర్. కానీ సుమారు రూ.10 కోట్ల విలువైన ఐఫోన్లను చోరి చేశాడు. ఈ విషయాన్ని తైవనీస్ ప్రాసిక్యూటర్లు శుక్రవారం వెల్లడించారు. అయితే అతను దొంగలించిన ఐఫోన్లెనో తెలుసా? దాదాపు 5700 ఫోన్లను దొంగతనం చేసి, వాటిని చైనా మార్కెట్లో విక్రయించాడు. ఫాక్స్ కాన్ ఆపిల్, సోనీ లాంటి అంతర్జాతీయ బ్రాండెడ్ ఉత్పత్తులన్నింటిన్నీ ఒకచోట చేర్చి, కాంట్రాక్ట్‌పై వీటిని తయారుచేస్తోంది. చైనాలో మిలియన్ల కొద్దీ వర్కర్లు ఈ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. టిసాయ్ కుటుంబ పేరుకు చెందిన ఇతను, తైవాన్ ఫాక్స్‌కాన్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసేవాడు. చైనీస్ నగరం షెన్జెన్ దక్షిణ ద్వీపకల్పంలో ఫాక్స్కామ్లో టెస్టింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎనిమిది మంది సహాయంతో, సుమారు 6వేల ఐఫోన్5, ఐఫోన్ 5ఎస్ ఫోన్లను స్మగుల్ చేయించాడు. టిసాయి, అతని సహచరులు కలిసి టెస్టింగ్‌కు వచ్చిన ఐఫోన్లను దొంగతనం చేసినట్టు తెలిసింది. కంపెనీ ఇంటర్నల్ ఆడిట్లో తైవనీస్ అధికారులు ఇది బయటపెట్టినట్టు ఫాక్స్ కాన్ చెప్పింది. నమ్మక ద్రోహం చేసినందుకు ఇతనికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇటీవల కాలంలోఇతను కార్మిక వివాదాలకు తెరతీస్తూ ఉద్యోగులపై దుష్ఫర్తనకు పాల్పడినట్టు కూడా విచారణలో తెలిసింది. -
దొంగతనం చేయడానికే ఈ గుడికి వెళ్లాలి!
రూర్కీ: గుడికి వెళ్లి దొంగతనం చేయాలని ఎవరూ అనుకోరు. కానీ అక్కడ గుడికి మాత్రం దొంగతనం చేయడానికే వెళ్లాలి. దొంగతనం చేస్తేనే అక్కడున్న అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. ఇంతకీ ఎక్కడా గుడి? ఏంటా ఆచారం అని అనుకుంటున్నారా? ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లాలోని చేడియాల అనే గ్రామంలో చూడామణి ఆలయం ఉంది. పిల్లలు లేని వాళ్లు ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. పిల్లలు కావాలని అనుకునేవారు అక్కడ దొంగతనం చేయాలి. దొంగతనం అంటే డబ్బూ నగలూ అనుకునేరు.. అవి కాదండి. దేవతానుగ్రహం పొందాలంటే అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఓ చెక్క బొమ్మను దంపతులు అపహరించాలి. అలా దొంగలించిన తరువాత పిల్లలు పుట్టగానే మళ్లీ ఆలయానికి వచ్చి ఆ బొమ్మతో పాటు మరో ప్రతిమను కూడా అక్కడే పెట్టాలి. వింతగా ఉంది కదూ ఆచారం. -
బాలీవుడ్ ప్రముఖుల కాల్ రికార్డులు దోచేసి..
పేరున్న వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్స్ కాల్ రికార్డులను సేకరిస్తూ పోలీస్ ఐటీ సెల్ విభాగం కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని గుడ్ గావ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు వివరాల ప్రకారం.. సెలబ్రిటీల కాల్ డేటాలను అందిస్తే ఉద్యోగం చూపుతానన్న వ్యక్తికి ప్రదీప్ కుమార్(30) సమాచారం చేరవేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఆ వ్యక్తి తన ఫేస్ బుక్ అకౌంట్ పేరును దీప్ బురాగా ఉంచినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇరువురి మధ్య దాదాపు 15 మంది సెలబ్రిటీల కాల్ డేటాలు చేతులు మారినట్లు వివరించారు. ఫోన్ నంబర్లు ఏ సెలబ్రిటీకి చెందినవో కూడా కుమార్ కు తెలియదని, కేవలం ముంబైకు చెందిన వ్యక్తి డేటాను అందించి అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటుంటాడని ఎస్సై సజ్జన్ కుమార్ చెప్పారు. కుమార్ నుంచి ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్, మొబైల్ ఫోన్, ఫేక్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బిలాస్ పూర్ లోని క్రైమ్ యూనిట్ 6 నుంచి అధికారిక ఈ మెయిల్ ఐడీ ద్వారా కాల్ రికార్డులు కావాలంటూ పంపడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. -
వింత దొంగను పట్టుకున్నారు...
టోక్యోః జపాన్ లోని టోక్యోలో ఓ వింత దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ ఫేస్ బుక్ ఖాతాలోకి అక్రమంగా చొరబడి, ఆమె లోదుస్తుల ఫోటోలను డౌన్లోడ్ చేసిన ఆరోపణలతో పోలీసులు ఆ వ్యక్తిని వలవేసి పట్టుకున్నట్లు తెలిపారు. వందలకొద్దీ అక్రమ ఖాతాలు, పాస్వర్డ్స్ సేకరించిన అతడి ఇంట్లో సోదాలు జరిపి డేటాను కూడ స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళ లో దుస్తుల ఫొటోలను అక్రమంగా దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్లు చేశారు. జపాన్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి, 25 ఏళ్ళ ర్యోసుకే కొగా.. బాధితురాలి ఫేస్ బుక్ ఖాతాలోకి చొరబడి, జనవరినుంచి మూడు నెలల సమయంలో సుమారు 17 సార్లు అక్రమంగా లాగిన్ అయ్యాడు. అంతేకాక ఆమె ఖాతానుంచి లోదుస్తుల ఫోటోలను డౌన్లోడ్ చేశాడని టోక్యో మెట్రోపాలిటన్ పోలీస్ అధికారులు వెల్లడించారు. ఐటీ సంస్థలో పనిచేస్తున్నసదరు వ్యక్తి సుమారు 770 ఫేస్ బుక్, ఐ క్లౌడ్ ఐడీలు కలిగి ఉన్నట్లు, వాటినుంచీ సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు స్థానిక మీడియా సహా, జిజి ప్రెస్ విచారణలో వెల్లడైంది. అక్రమంగా సామాజిక మాధ్యమాల్లో చొరబడి, సమాచారాన్ని దొంగిలిస్తున్న కొగాకు మూడేళ్ళ జైలు శిక్షతోపాటు, సుమారు 5.5 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అన్ని వందల లాగిన్ ఐడీలను.. కొగా ఎలా సేకరించాడన్న విషయాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఓ మహిళ అండర్ వేర్ ఫొటోలను డౌన్లోడ్ చేసిన సందర్భంలో ఆ చోరాసురుడి అసలు బండారం బయట పడినట్లు ఓ వార్తా పత్రిక వెల్లడించిన సమాచారంద్వారా తెలుస్తోంది. ఇతరుల అకౌంట్లలో చొరబడ్డమే కాక, కొన్నిలైంగిక చిత్రాలను పోస్టు చేసిన కొగా ఇంట్లో... సోదాలు నిర్వహించిన పోలీసులు.... అతడు సేకరించిన ఐడీ, పాస్వర్డ్ డేటాను కూడ స్వాధీనం చేసుకున్నారు. -
బిచ్చమెత్తుకుంటున్న హీరోయిన్
ముంబై: హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలని ఇంట్లో వాళ్లను సైతం లెక్కచేయకుండా ముంబై బాటపడుతున్న అమ్మాయిల విషాద గాథల్లో మరో నటి ఉదంతం తాజాగా వెలుగుచూసింది. వెండి వెలుగుల జాబిలిగా వెలిగిపోవాలన్న కలలు ఆవిరైపోవడంతో కొందరు ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తుండగా..మరి కొందరు మానసిక స్థిమితాన్ని కోల్పోయి, దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఓ భోజ్ పురి చిత్రంలో హీరోయిన్ గా నటించిన మిథాలి శర్మ (25)దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడుతూ.. మతి స్థిమితం కోల్పోయి ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ పోలీసుల కంటపడింది. ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మ సినిమాలమీద ఆసక్తితో ముంబైకి మకాం మార్చింది. మోడల్ గా కరియర్ స్టార్ట్ చేసింది. ఎట్టకేలకు భోజ్‌పురీ చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో హీరోయిన్గా నటించే అవకాశాలు రాలేదు. అటు సినిమాల్లో నిలదొక్కుకోలేక ఇటు తల్లిదండ్రులకు ముఖం చూపించలేక మిథాలీ జీవితం దుర్భరంగా మారింది. దీంతో ముంబైలోని లొకండ్ వాలా వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బతుకుతోంది. ఈక్రమంలో ఒష్విరా హౌసింగ్ సొసైటీలో ఆగి ఉన్న ఒక కారు అద్దాలను పగుల కొడుతుండగా ఆమెను మహిళా పోలీసులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆమె మానసిక స్థితి బాగాలేదని, ఆమె కుటుంబ సభ్యల వద్దకు చేర్చడానికి ప్రయత్నిస్తున్నామని సీనియర్ పోలీస్ అధికారి సుభాష్ చెప్పారు. ఆమె కోలుకోవడానికి , తిరిగిసాధారణ స్థితికి చేరడానికి కనీసం పది రోజులు పడుతుందని మిథాలీకి చికిత్సం అందిస్తున్న మానసిక వైద్యులు తెలిపారు. -
ఆకాశంలో ఆడ దొంగ..
ఉన్నత చదువులు, ఆధునిక వస్త్రధారణ, మంచి జీతం, మరెన్నో అలవెన్సులు, అందరిలో గుర్తింపు.. వీలైనంతమేరలో హైఫై జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ సంతృప్తి చెందని ఎయిర్ ఇండియా మహిళా ఉద్యోగిని.. అప్పనంగా దొరికినకాడికి దోచేసుకునే ప్రయత్నం చేసింది. విమానంలో ప్రాయాణికులకు అందించాల్సిన ఆహార పదార్థాలు, లిక్కర్ బాటిళ్లను ఎంచక్కా బ్యాగులో తోసేసి దొంగతనానికి పాల్పడింది. చివరికి ఎయిర్ పోర్టు విజిలెన్స్ అధికారులకు పట్టుబడి ఉద్యోగం పోగొట్టుకుంది. చెన్నై విమానాశ్రయంలో జనవరి 27న పట్టుబడ్డ ఆ ఆడ దొంగ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా 274 (కొలంబో- ఢిల్లీ- చెన్నై) సర్వీసులో విధులు నిర్వహించిన మహిళా ఉద్యోగి.. ట్రిప్ పూర్తయిన వెంటనే భారీ బ్యాగుతో విమానంలోనుంచి దిగింది. ఆమె తీరును అనుమానించిన ఎయిర్ పోర్ట్ విజిలెన్స్ అధికారులు బ్యాగును తనిఖీ చేయగా అందులో పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, లిక్కర్ బాటిళ్లు కనిపించాయి. అవన్నీ ప్రయాణికులకు అందజేయాల్సినవే కావటం గమనార్హం. మహిళా సిబ్బంది చర్యను తీవ్రంగా పరిగణించిన ఎయిర్ ఇండియా వెంటనే ఆమెను విధుల నుంచి తొలిగించింది. సిబ్బంది ఇలా దొంగతనాలకు పాల్పడిన వార్తలు గతంలోనూ వెలుగుచూసినప్పటికీ ఇంత భారీ మొత్తంలో వస్తువులు లభించడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు. -
నగరంలో కార్ల చోరి.. కోలార్ లో ఎర్రచందనం స్మగ్లింగ్
కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న బీటెక్ విద్యార్ధి, డ్యాన్సర్ తోపాటు మరోకరిని బహద్దూర్ పురాలో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో కార్లను దొంగలించి కర్నాటకలోని కోలార్ ప్రాంతానికి తేజ మోహన్ రాజు, వినాయక, ప్రసాద్ ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్టు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. నరేశ్, నయీం, జాకీర్ ల నుంచి ఎర్రచందనం కొనుగోలు చేస్తున్నట్టు డీసీపీ పళ్లం రాజు మీడియాకు తెలిపారు. తొలుత కడపకు చెందిన తేజ అనే బీటెక్ విద్యార్ధి విలాసాలకు అలవాటు పడి ట్రావెలింగ్ ఏజెన్సీల నుంచి కార్లను అద్దెకు తీసుకుని తిరిగేవాడని పోలీసులు తెలిపారు. ఆతర్వాత కార్లకు అద్దె చెల్లించలేక తేజ తన సహచరులతో కలిసి మూడు కార్లను దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. దొంగిలించిన కార్లతో వినాయక్, ప్రసాద్ కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్టు పోలీసులు వివరించారు. కోలార్ లోని చోటా భాయ్ అనే స్మగ్లర్ కు ఎర్రచందనం అమ్మినట్టు కూడా పోలీసులు విచారణలో వెల్లడైంది. వీరివద్ద నుంచి మూడు కార్లను, 60 కేజీల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.