కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న బీటెక్ విద్యార్ధి, డ్యాన్సర్ తోపాటు మరోకరిని బహద్దూర్ పురాలో నగర పోలీసులు అరెస్ట్ చేశారు.
నగరంలో కార్ల చోరి.. కోలార్ లో ఎర్రచందనం స్మగ్లింగ్
Published Tue, Jul 29 2014 3:37 PM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM
కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న బీటెక్ విద్యార్ధి, డ్యాన్సర్ తోపాటు మరోకరిని బహద్దూర్ పురాలో నగర పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో కార్లను దొంగలించి కర్నాటకలోని కోలార్ ప్రాంతానికి తేజ మోహన్ రాజు, వినాయక, ప్రసాద్ ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్టు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. నరేశ్, నయీం, జాకీర్ ల నుంచి ఎర్రచందనం కొనుగోలు చేస్తున్నట్టు డీసీపీ పళ్లం రాజు మీడియాకు తెలిపారు.
తొలుత కడపకు చెందిన తేజ అనే బీటెక్ విద్యార్ధి విలాసాలకు అలవాటు పడి ట్రావెలింగ్ ఏజెన్సీల నుంచి కార్లను అద్దెకు తీసుకుని తిరిగేవాడని పోలీసులు తెలిపారు. ఆతర్వాత కార్లకు అద్దె చెల్లించలేక తేజ తన సహచరులతో కలిసి మూడు కార్లను దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు.
దొంగిలించిన కార్లతో వినాయక్, ప్రసాద్ కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్టు పోలీసులు వివరించారు. కోలార్ లోని చోటా భాయ్ అనే స్మగ్లర్ కు ఎర్రచందనం అమ్మినట్టు కూడా పోలీసులు విచారణలో వెల్లడైంది. వీరివద్ద నుంచి మూడు కార్లను, 60 కేజీల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement