దేశంలోనే మూడవ అత్యున్నత పౌర గౌరవ పురస్కార పతకం పద్మభూషణ్ చోరీకి గురైన ఉదంతం ఢిల్లీలో వెలుగు చూసింది. సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకం చోరీకి గురైంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ చోరీ విషయం మెడల్ అందుకున్న వ్యక్తికి కూడా తెలియలేదు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకాన్ని అతని సహాయకుడు దొంగిలించాడు. ఈ పద్మభూషణ్ పతకాన్ని ఒక దుకాణంలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా ఈ చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మెడల్‌పై పద్మభూషణ్ అని రాసి ఉన్నందున, ఈ పతకాన్ని కొనుగోలు చేసేందుకు స్వర్ణకారుడు దిలీప్ నిరాకరించాడు. దీంతో ఆ ముగ్గురూ మరో స్వర్ణకారుని సంప్రదించారు.
ఆగ్నేయ జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ రాజేష్ దేవ్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ హరిసింగ్, రింకీ వేద్ ప్రకాష్ అనే ముగ్గురు స్నేహితులు పద్మభూషణ్ పతకాన్ని విక్రయించేందుకు కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో నగల దుకాణం నడుపుతున్న దిలీప్‌ను సంప్రదించారని తెలిపారు. అయితే దిలీప్ ఈ విషయాన్ని కల్కాజీ పోలీసులకు తెలియజేశాడు. పోలీసు బృందం అక్కడకి చేరుకునేలోపే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారుల అప్రమత్తమై ఆ ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.
నిందితులంతా మదన్‌పూర్ ఖాదర్‌కు చెందినవారని దిలీప్ తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మదన్‌పూర్ ఖాదర్ నివాసి శ్రవణ్ కుమార్ (33), హరి సింగ్ (45), రింకీ దేవి (40), వేద్ ప్రకాష్ (39), ప్రశాంత్ బిస్వాస్ (49)గా గుర్తించారు. నిందితుడు శ్రవణ్ కుమార్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత జిసి ఛటర్జీ ఇంట్లో మెడికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment