nabbed
-
పద్మ భూషన్ పతకం విక్రయానికి యత్నం.. ఐదుగురు అరెస్ట్!
దేశంలోనే మూడవ అత్యున్నత పౌర గౌరవ పురస్కార పతకం పద్మభూషణ్ చోరీకి గురైన ఉదంతం ఢిల్లీలో వెలుగు చూసింది. సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకం చోరీకి గురైంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ చోరీ విషయం మెడల్ అందుకున్న వ్యక్తికి కూడా తెలియలేదు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకాన్ని అతని సహాయకుడు దొంగిలించాడు. ఈ పద్మభూషణ్ పతకాన్ని ఒక దుకాణంలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా ఈ చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మెడల్‌పై పద్మభూషణ్ అని రాసి ఉన్నందున, ఈ పతకాన్ని కొనుగోలు చేసేందుకు స్వర్ణకారుడు దిలీప్ నిరాకరించాడు. దీంతో ఆ ముగ్గురూ మరో స్వర్ణకారుని సంప్రదించారు. ఆగ్నేయ జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ రాజేష్ దేవ్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ హరిసింగ్, రింకీ వేద్ ప్రకాష్ అనే ముగ్గురు స్నేహితులు పద్మభూషణ్ పతకాన్ని విక్రయించేందుకు కల్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో నగల దుకాణం నడుపుతున్న దిలీప్‌ను సంప్రదించారని తెలిపారు. అయితే దిలీప్ ఈ విషయాన్ని కల్కాజీ పోలీసులకు తెలియజేశాడు. పోలీసు బృందం అక్కడకి చేరుకునేలోపే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారుల అప్రమత్తమై ఆ ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. నిందితులంతా మదన్‌పూర్ ఖాదర్‌కు చెందినవారని దిలీప్ తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మదన్‌పూర్ ఖాదర్ నివాసి శ్రవణ్ కుమార్ (33), హరి సింగ్ (45), రింకీ దేవి (40), వేద్ ప్రకాష్ (39), ప్రశాంత్ బిస్వాస్ (49)గా గుర్తించారు. నిందితుడు శ్రవణ్ కుమార్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత జిసి ఛటర్జీ ఇంట్లో మెడికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. -
రైలులో తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన ఘటన..నిందితుడు అరెస్టు
కేరళలో తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో పరారీలో ఉన్న నిందితుల ఆచూకి కోసం మహారాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి మరీ ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. మంగళవారమే రత్నగిరి రైల్వే పోలీసులు నిదితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని షారుఖ్ సైఫీగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ.. ఆరోజు ఆ ఘటనకు పాల్పడిన తదనంతరం రైలు దిగుతుండగా నిందితుడు కింద పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయయ్యింది. చికిత్స కోసం ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు కానీ చికిత్స పూర్తి కాక మునుపే ఆస్పత్రి నుంచి పారిపోయాడు. దీంతో తాము రత్నగిరి ప్రాంతంలో తీవ్రంగా సోదాలు నిర్వహించి మరీ షారుఖ్‌ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు రత్నగిరి రైల్వే పోలీసులు అదుపులో ఉన్నాడని అధికారులు తెలిపారు. నిందితుడి విచారించేందుకు కేరళ పోలీసులు రత్నగిరికి వస్తున్నట్లు తెలిపారు అధికారులు. కాగా ఈ దారుణ ఘటన కోజికోడ్‌లో అలపుజా-కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకుంది. ఆ రోజు నిందితులు కదిలే రైలులో సహ ప్రయాణికుడికి నిప్పంటించడంతో ఎనిమిది మంది దాక గాయపడటమే గాక ఆ ఘటనలో మరో ముగ్గురు పట్టాలపై పడి చనిపోయారు. (చదవండి: ఆ విషయాల్లో మోదీని విడిచిపెట్టలేదు! ఐనా రివేంజ్ తీర్చుకోలేదు! గులాం నబీ అజాద్) -
రంగారెడ్డి: అబ్దుల్లాపుర్ మెట్లో చైన్‌స్నాచర్ వీరంగం
-
బండి కనిపిస్తే మాయం చేస్తారు
జియాగూడ: నగరంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి వాహనాలను స్వాదీనం చేసుకున్నట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డావిస్ అన్నారు. శనివారం షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో గోషామహాల్ ఏసీపీ ఆర్.సతీస్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. నగరంలోని వెస్ట్, సౌత్, ఈస్ట్, సెంట్రల్ జోన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు దొంగతనం జరుగుతున్నాయి. దీంతో షాహినాయత్ గంజ్ పోలీసుల క్రైమ్ టీమ్ నిందితులను పట్టుకున్నారన్నారు. జహనుమాకు చెందిన అబ్దుల్ వాహిద్(63), వారసిగూడలోని మహిమూద్‌గూడకు చెందిన మహ్మద్ సోయేల్ హుల్‌హక్ (28)లు రాత్రి వేళల్లో బస్తీలలో ఇంటి బయట పార్కు చేసిన యాక్టివా ద్విచక్ర వాహనాలను నకిలీ తాళాలతో ఓపెన్ చేసి ఎత్తుకువెళ్లేవారు. వాటిని మెకానిక్ షాపులు, స్క్రాబ్ దుకాణాలలో విక్రయించే వారు. అనుమానం రాకుండా కుటుంబ సభ్యులకు వైద్యం కోసం డబ్బులు అవసరం అయ్యాయని నమ్మిస్తూ ఆధార్‌కార్డు కూడా ఇచ్చేవారు. షాహినాయత్‌గంజ్ సీ.ఐ. వై.అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో డీఎస్ఐ. జి.రాజేశ్వర్ రెడ్డి, క్రైమ్ టీం సిబ్బందితో కలిసి బేగంబజార్ నుండి చంద్రాయణగుట్ట వరకు గల వివిధ దారుల్లో, బస్తీల్లో వందకు పైగా సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులు దొంగిలించిన వాహనాలను స్వాదీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ జోయల్ డావిస్ క్రైమ్ టీమ్‌ను అభినందించారు. -
రైతు మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు
చంఢీగడ్: వ్యవసాయ చట్టాల రద్దు కోసం చేస్తున్న ఉద్యమంలో పాల్గొన్న రైతు గుండెపోటుతో మరణించగా.. అతడి మృతదేహాన్ని ఎలుకలు పీక్కు తిన్నాయి. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచిన శవాన్ని ఎలుకలు కొరికి తినడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీనిపై కుటుంబసభ్యులతోపాటు రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన హరియాణా రాష్ట్రం సోనిపట్ జిల్లాలో చోటుచేసుకుంది. సోనిపట్ జిల్లాలోని బయాన్‌పూర్ గ్రామానికి చెందిన రైతు రాజేందర్ (72). దేశవ్యాప్తంగా సాగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొంటున్నాడు. అయితే బుధవారం ఆయన గుండెపోటుకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందాడు. దీంతో సానిపట్లోని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో రాజేందర్ మృతదేహం భద్రపర్చారు. గురువారం వచ్చిచూసేసరికి మృతదేహంపై గాట్లు.. గాయాలు ఉన్నాయి. దీనిపై కుటుంబసభ్యులు ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎలుకలు మృతదేహాన్ని కొరకడంతో గాట్లు పడ్డాయని వైద్యాధికారులు గుర్తించారు. అయితే ఆస్పత్రిలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వైద్యాధికారులు తెలిపారు. హరియాణా బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీదీప్ సూర్జేవాలా స్పందించారు. ఈ ఘటనపై ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 73 साल में ऐसा दर्दनाक मंजर शायद कभी ना देखा हो ! शहीद किसान के शव को चूहे कुतर जाएँ और भाजपा सरकारें तमाशबीन बनी रहें। शर्म से डूब क्यों नही मार गए भाजपाई !#FarmersProtests pic.twitter.com/7jE9yaNYfz — Randeep Singh Surjewala (@rssurjewala) February 19, 2021 -
సికింద్రాబాద్‌లో కరోనా అనుమానితుడి పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : చేతిపై హోం క్వారంటైన్ ముద్రతో జనబాహుళ్యంలో తిరుగుతున్న యువకుడిని ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. అతడి చేతిపై ముంబై అధికారులు 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని ముద్ర వేశారు. కరోనా అనుమానితుల ఎడమ చేతిపై స్వీయ నిర్భందంలోకి వెళ్లాలని సూచిస్తూ స్టాంప్ వేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు 74కు చేరగా, మృతుల సంఖ్య రెండుకు పెరిగింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి : వందేళ్లకో మహమ్మారి.. -
బామ్మర్దులను కత్తితో పొడిచిన బావ
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చిన భా ర్యను తనతో రమ్మని గొడవపడ్డాడు. బావను సముదాయించేందుకు ప్రయత్నించిన బామ్మర్దులను కత్తి తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో బామ్మర్దులు వేర్వేరు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి శనివారం 5వ టౌన్ ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాగారం ప్రాంతానికి చెందిన మహేష్ శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య భాగ్యలక్ష్మి తో గొడవపడ్డాడు. ఇలా తరుచుగా గొడవ చేస్తుండ టంతో భార్య భరించలేక అదే కాలనీలో నివాసం ఉండే తన తల్లి గంగామణి ఇంటికి వచ్చింది. అనం తరం మహేష్ అక్కడకు వచ్చి తనతో ఇంటికి రావాలని భార్యతో అక్కడ ఘర్షణకు దిగాడు. అక్కడే ఉన్న బామ్మర్దులు చంద్రబాబు, గంగాబాబుతో బావ మహేష్ గొడవకు దిగి కత్తితో బామ్మర్దుల కడుపులో పొడిచాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అ య్యాయి. శనివారం ఉదయం ఎస్ఐ శ్రీహరి ఘటన స్థలాన్ని సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు. భాగ్యలక్ష్మి తల్లి గంగామణి అల్లుడు మహేష్‌పై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శనివారం ఉదయం పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
భారీ ఉగ్రవాద కుట్ర భగ్నం
డిస్పూర్ : బుర్ద్వాన్ పేలుడు కేసులో దర్యాప్తు బృందాలు మంచి పురోగతి సాధించాయి. జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ (జేఎమ్బీ)కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను అసోంలో పోలీసులు అరెస్టు చేశారు. 2014 అక్టోబర్‌లో జరిగిన బుర్ద్వాన్ పేలుళ్లలో వీరు ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా వీరి కార్యకలాపాలపై దృష్టిసారించిన కోల్కత్తా పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఈ ఆరుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. ఈ ఆరుగురిలో ముగ్గురు బంగ్లాదేశ్‌కు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు ఇండియాకు చెందిన జమాత్-ఉల్-ముజాహుద్దీన్ ఉగ్రవాదులు. ప్రాథమిక రిపోర్టుల ప్రకారం బుర్ద్వాన్ పేలుడు ఘటనతో లింక్ ఉన్న ఈ ఆరుగురు టెర్రరిస్టులలో ఐదుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు కోరినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల నుంచి భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పాటు డిటోనేటర్లు, కేబుల్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సంయుక్త పోలీసు కమిషనర్ విశాల్ గార్గ్ తెలిపారు. అరెస్టు అయిన వారు, బంగ్లాదేశ్‌లో ఎంపికయ్యే ప్రభుత్వంపై, భారత సరిహద్దు రాష్ట్రాలలో దాడులకు పాల్పడేందుకు వ్యూహాలు పన్నుతున్నట్టు అధికారులు చెప్పారు. ఎన్ఏఐ అధికారులు వీరిని విచారిస్తారని, పేలుడు ఘటనతో సంబంధం ఉన్న మిగతా ఆధారాలను సేకరిస్తారని టాస్క్ ఫోర్స్ చెప్పింది. బుర్ద్వాన్‌లోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు బాంబులు తయారుచేస్తుండగా జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాటి ఘటనలో పేలుడు పదార్థాల తయారీలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు మృత్యువాత పడగా, మరొకరు గాయపడ్డారు. ఆ ఘటనపై స్పెషల్ టాస్క్ ఫోర్స్, జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. -
దొంగలు అరెస్ట్: భారీగా సొత్తు స్వాధీనం
కడప : వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7.5 లక్షలు విలువ చేసే నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ
కరీంనగర్: బెజ్జంకి పంచాయతీ రాజ్ ఏఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారుకు పట్టుబడ్డాడు. రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా బెజ్జంకి పంచాయతీ రాజ్ ఏఈ వెంకన్నని ఆదివారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు మాటు వేసిన ఏసీబీ అధికారులు రూ.5వేలు తీసుకుంటుండగా పంచాయతీ రాజ్ ఏఈని అదుపులోకి తీసుకున్నారు. వెంకన్న పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏసీబీ వలలో సాలూరు అటవీశాఖ రేంజర్
విజయనగరం: కలప పర్మిట్ కోసం రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా సాలూరు అటవీశాఖ రేంజర్ పి. ఏడుకొండలు ఏసీబీ అధికారులకు చిక్కాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆదివిష్ణు మూడు లారీల కలప తరలించేందుకు పర్మిట్ కోసం సాలూరు అటవీ శాఖ రేంజర్‌ను ఆశ్రయించాడు. రేంజర్ ఏడుకొండలు రూ.15వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆదివిష్ణు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. విజయనగరం ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి వలపన్ని లంచం తీసుకుంటున్న రేంజర్ ఏడుకొండలుతో పాటూ ఆయనకు సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్ నాగేశ్వరరావును ఆదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి చెప్పారు. -
ఏసీబీ వలలో వనస్థలిపురం విద్యుత్ ఏఈ
రంగారెడ్డి (వనస్థలిపురం): వినియోగదారుని నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ వనస్థలిపురంలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈ, ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఒక వినియోగదారుని వద్ద బుధవారం 20వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా విద్యుత్ ఏఈ అశోక్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 20వేలరూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు. -
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
వరంగల్: వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక జూనియర్ అసిస్టెంట్ పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. తెలంగాణ సర్కార్ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం విడుదల చేసేందుకు రూ.10వేల రూపాయలు లంచం ఇవ్వాలని కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునిల్ డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీని ఆశ్రయించగా వారు వలపన్ని బుధవారం పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.10వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులు, చైన్ స్నాచర్లు డిష్యూం డిష్యూం
యలహంక : నగరంలోని యలహంక పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఓ చైన్ స్నాచింగ్ ఘటనకు సంబంధించి పోలీసులు సకాలంలో స్పందించారు. తాము ఏ సమయంలోనైనా అప్రమత్తంగా ఉంటామని ఉద్యాన నగరి పోలీసులు చాటి చెప్పారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడి పారిపోతున్న స్నాచర్లను పట్టుకునే క్రమంలో వారు ఎదురుదాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో స్నాచర్ అప్పి అలియాస్ అప్పు అలియాస్ రాజు (27) అనే నిందితుడి ఎడమకాలి తొడలో బుల్లెట్ గాయమైందని బెంగళూరు అడిషనల్ కమిషనర్ రవి తెలిపారు. నిందితుడి దాడిలో గాయపడిన యలహంక సీఐ రాజీవ్‌గౌడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. వివరాలు... మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఇక్కడి కెంపేగౌడ విమానాశ్రయంలో పనిచేసే స్వాతి విధులకు వెళ్లడానికి వెంకటాల బస్టాప్ వద్ద వేచి ఉంది. అదే సమయంలో స్నాచర్ అప్పుతో పాటు మరో వ్యక్తి బైక్‌పై వచ్చి స్వాతి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. అప్రమత్తమైన బాధితురాలు వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చింది. గస్తీలో ఉన్న యలహంక సీఐ రాజీవ్ గౌడ, చిక్కజాల సీఐ మురళీధర్ స్నాచర్లను వెంటాడారు. కొత్తనూరు సమీపంలోని కేఎన్ఎస్ కళాశాల సమీపంలోని నీలగరి తోటలో స్నాచర్లను పోలీసులు అడ్డగించారు. దీంతో స్నాచర్లు కత్తితో సీఐ రాజీవ్ గౌడ చేతిపై దాడి చేశారు. అప్రమత్తమైన ఆయన తన సర్వీస్ రివాల్వర్‌తో ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. దీంతో ఒక బులెట్ అప్పు కాలిలో దూసుకుపోవడంతో అతను కుప్పకూలిపోయాడు. సిబ్బంది హుటాహుటిన రాజీవ్‌తో పాటు నిందితుడిని కూడా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ రవి, యలహంక ఎమ్మెల్యే ఆర్. విశ్వనాథ్ సీఐ రాజీవ్గౌడను పరామర్శించారు. స్నాచర్ అప్పుపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయని, పారిపోయిన మరో స్నాచర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.