బామ్మర్దులను కత్తితో పొడిచిన బావ | Brother In Law Attacked Their Relatives | Sakshi
Sakshi News home page

బామ్మర్దులను కత్తితో పొడిచిన బావ

Published Sun, Apr 8 2018 10:36 AM | Last Updated on Sun, Apr 8 2018 10:36 AM

Brother In Law Attacked Their Relatives - Sakshi

చికిత్స పొందుతున్న చంద్రబాబు, గంగబాబు

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌ అర్బన్‌) : భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చిన భా ర్యను తనతో రమ్మని గొడవపడ్డాడు. బావను సముదాయించేందుకు ప్రయత్నించిన బామ్మర్దులను కత్తి తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో బామ్మర్దులు వేర్వేరు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి శనివారం 5వ టౌన్‌ ఎస్‌ఐ శ్రీహరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాగారం ప్రాంతానికి చెందిన మహేష్‌ శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య భాగ్యలక్ష్మి తో గొడవపడ్డాడు.

ఇలా తరుచుగా గొడవ చేస్తుండ టంతో భార్య భరించలేక అదే కాలనీలో నివాసం ఉండే తన తల్లి గంగామణి ఇంటికి వచ్చింది. అనం తరం మహేష్‌ అక్కడకు వచ్చి తనతో ఇంటికి రావాలని భార్యతో అక్కడ ఘర్షణకు దిగాడు. అక్కడే ఉన్న బామ్మర్దులు చంద్రబాబు, గంగాబాబుతో బావ మహేష్‌ గొడవకు దిగి కత్తితో బామ్మర్దుల కడుపులో పొడిచాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అ య్యాయి. శనివారం ఉదయం ఎస్‌ఐ శ్రీహరి ఘటన స్థలాన్ని సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు. భాగ్యలక్ష్మి తల్లి గంగామణి అల్లుడు మహేష్‌పై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శనివారం ఉదయం పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement