Brother in law attack
-
కాపు కాసి కడ తేర్చారు..
జీడిమెట్ల: తన అక్కతో తరచు గొడవ పడుతున్నాడనే నెపంతో బావమరుదులు బావతో పాటు అతని సోదరుడిని విచక్షణ రహితంగా కత్తితో పొడిచి హత్య చేశారు. గురువారం రాత్రి జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో చోటు చేసుకున్న సంఘటన స్థానికులను భయాందోళను గురిచేసింది. ►జీడిమెట్ల ఇన్స్పెక్టర్ కె.బాలరాజు వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన మోక వెంకటేష్(32) ఏడేళ్ల క్రితం ఉప్పల్ చిలకానగర్‌కు చెందిన తనకంటే పెద్దదైన రేఖ(40)ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక పాప(4), బాబు(2) ఉన్నారు. వెంకటేష్ పెయింటర్‌గా పని చేస్తుండగా రేఖ ఇంటి వద్దనే ఉంటుంది. కాగా వీరిద్దరి మద్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ►గురువారం ఉదయం వెంకటేష్ రేఖల మధ్య గొడవ జరిగింది. ఆమెపై చేయి చేసుకుని సుభాష్‌నగర్‌లోనే ఉండే తల్లి వద్దకు వెళ్లాడు. తన భర్త వెంకటేష్ గొడవపడి తనను కొట్టాడని రేఖ చిలుకానగర్‌లో ఉండే తన తమ్ముళ్లకు చెప్పింది. ►దీంతో బావ వెంకటేష్‌పై కోపంతో రగిలిపోయిన రేఖ సోదరులు వినయ్(25), మధు(22)లు రాత్రి సుభాష్‌నగర్‌కు వచ్చి వెంకటేష్ కోసం కాపు కాస్తున్నారు. అదే సమయంలో వెంకటేష్ తన సొంత సోదరుడైన పోతురాజు(25), తన చెల్లెలి భర్త కృష్ణ(25)లతో కలిసి మద్యం తాగి రాత్రి 10గంటలకు ఇంటికి వస్తున్నాడు. వీరు ముగ్గురు సుభాష్‌నగర్ పోచమ్మ గుడి వద్దకు చేరుకోగానే వినయ్ వారిస్తూ ఒక్కసారిగా దాడికి దిగాడు. ►తన వెంట తెచ్చుకున్న కత్తితో వెంకటేష్ కడుపులో పొడుస్తుండగా అతని తమ్ముడు మధు వెంకటేష్‌ను పట్టుకున్నాడు. తన అన్న వెంకటేష్‌ను పొడుస్తుండగా అడ్డుగా వెళ్లిన వెంకటేష్ సోదరుడు పోతురాజును సైతం వినయ్ విచక్షణ రహితంగా పొడిచాడు. అక్కడే ఉన్న వెంకటేష్ బావ కృష్ణను సైతం పొడవడానికి ప్రయత్నించగా వెంకటేష్ సోదరి అనిత తన భర్తను చంపవద్దని ప్రాధేయపడింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన పోతురాజు అక్కడికి అక్కడే మృతిచెందగా వెంకటేష్ అస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసుల అదుపులో నిందితులు.. ఘటనాస్థలికి వెళ్లిన జీడిమెట్ల సీఐ బాలరాజు, ఎస్సైలు మన్మద్, గౌతమ్‌లు పంచనామా నిర్వహించి వినయ్, మధు, రేఖలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పోతురాజుపై 32కేసులు.. హత్య కాబడ్డ వెంకటేష్ సోదరుడు మృతుడు పోతురాజుపై వివిధ పోలీస్స్టేషన్లలో 32కేసులు ఉన్నాయి. ఇతను తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ జైలు నుంచి వచ్చి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నాడు. ఇంటి ఆడపడుచు పసుపుకుంకాలతో సంతోషంగా ఉండాలని ఏ అన్నదమ్ములైన కోరుకుంటారు. కానీ వీరి విషయంలో అది రివర్స్‌గా ఉంది. అక్కను కొట్టాడనే కోపంతో రగిలిపోయిన బావమర్దులిద్దరూ కలసి సొంత బావ ఉసురుతీశారు. అంతేకాకుండా అడ్డుకోవడానికి వచ్చిన బావ తమ్ముడిని సైతం కడ తేర్చారు. బంధాలు, బాంధవ్యాలు మరచి సొంతవాళ్లను చంపుకుంటున్న నేటి సమాజంలో మానవత్వం చచ్చిపోతున్నదనడానికి ఈ ఘటనే నిదర్శనం. -
బావను హతమార్చిన బామ్మర్ది
వంగూరు (కల్వకుర్తి): ఇంటికి వచ్చిన బావ (అక్క భర్త)కు సకల మర్యాదలు చేయాల్సిన ఓ బామ్మర్ది.. అక్కతో తరచూ గొడవపడుతున్నాడనే నెపంతో కట్టెతో కొట్టడంతో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని డిండిచింతపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బంగారమ్మతో బిజినపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన రాములు(40)కి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు వస్తుండడంతో గత కొన్నిరోజులుగా బంగారమ్మ తల్లి గ్రామమైన డిండిచింతపల్లిలోనే ఉంటుంది. భార్యాపిల్లలను తీసుకెళ్లడానికి రెండు రోజుల క్రితం వచ్చిన రాములుకు బామ్మర్ది రమేష్‌కు మధ్య సోమవారం గొడవ జరిగింది. ఈ క్రమంలో కట్టె తీసుకుని రాములు మెడపై కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో బంధువులు నీళ్లు తాపి పడుకోబెట్టారు. ఆ సమయంలోనే మృతిచెందాడు. పెళ్లయిన నాటి నుంచి భర్తతో ఉన్న గొడవలు చివరికి భర్త ప్రాణాలు పోయేవరకు వెంటాడడంతో భార్య బంగారమ్మ కన్నీరుమున్నీరయ్యింది. ఈ సంఘటన గ్రామస్తులకు తెలియడంతో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న కల్వకుర్తి సీఐ సురేందర్‌రెడ్డి, వెల్దండ, చారకొండ ఎస్ఐలు వీరబాబు, బాలకృష్ణలు ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను ఇతర వివరాలను తెలుసుకుని పంచనామా నిర్వహించారు. ఇందుకు సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు. రాములుకు భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
బామ్మర్దులను కత్తితో పొడిచిన బావ
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్) : భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వచ్చిన భా ర్యను తనతో రమ్మని గొడవపడ్డాడు. బావను సముదాయించేందుకు ప్రయత్నించిన బామ్మర్దులను కత్తి తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో బామ్మర్దులు వేర్వేరు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి శనివారం 5వ టౌన్ ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాగారం ప్రాంతానికి చెందిన మహేష్ శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య భాగ్యలక్ష్మి తో గొడవపడ్డాడు. ఇలా తరుచుగా గొడవ చేస్తుండ టంతో భార్య భరించలేక అదే కాలనీలో నివాసం ఉండే తన తల్లి గంగామణి ఇంటికి వచ్చింది. అనం తరం మహేష్ అక్కడకు వచ్చి తనతో ఇంటికి రావాలని భార్యతో అక్కడ ఘర్షణకు దిగాడు. అక్కడే ఉన్న బామ్మర్దులు చంద్రబాబు, గంగాబాబుతో బావ మహేష్ గొడవకు దిగి కత్తితో బామ్మర్దుల కడుపులో పొడిచాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అ య్యాయి. శనివారం ఉదయం ఎస్ఐ శ్రీహరి ఘటన స్థలాన్ని సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు. భాగ్యలక్ష్మి తల్లి గంగామణి అల్లుడు మహేష్‌పై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శనివారం ఉదయం పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పట్ట పగలే తమ్ముడి భార్యపై...
చెళ్లకెరె రూరల్ : తాగిన మైకంలో పట్ట పగలే తమ్ముడి భార్యపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన పట్టణంలోని బీఈఓ కార్యాలయం ప్రాంగణంలో శనివారం సాయంత్రం చోటు చేసకుంది. తాలూకాలోని హెగ్గెరె గ్రామానికి చెందిన శివణ్ణ తన తమ్ముడి భార్య నీలమ్మపై కత్తితో దాడి చేసిన గాయపరిచాడు. వివరాలిలు... హెగ్గెరె గ్రామానికి చెందిన శివణ్ణ, దాదణ్ణ అన్నదమ్ములు. ఇద్దరు గ్రామంలో వేర్వేరుగా జీవిస్తున్నారు. దాదణ్ణ, నీలమ్మల కూతురు రూపాను ఇదే గ్రామంలో ఉన్న మేనమామ కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. అయితే రూపా భర్తను వదలి ఇదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తితో కలిసి వెళ్లింది. అయితే రూపా భర్త తనకు భార్య కావాలని అత్తమామలతో ఘర్షణ పడి నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చే యడానికి గ్రామస్తులతో కలిసి శనివారం వచ్చాడు. అయితే గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని, పంచాయతీ పెట్టించడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కాని రూపా తాను భర్తతో కలిసి ఉండటానికి నిరాకరించింది. దాంతో దాదణ్ణ, నీలమ్మలు తమ కూతురును తమ ఇంట్లోనే ఉంచుకుంటామని తెలిపారు. దీంతో ఆగ్రహించిన దాదణ్ణ అన్న శివణ్ణ తమ్ముడు దాదణ్ణ భార్యను టీ తాగుదాం రమ్మని బయటకు తీసుకు వచ్చాడు. అక్కడ బీఈఓ కార్యాలయ ప్రాంగణంలో నీలమ్మతో గొడవ పడ్డాడు. ఇంటి నుంచి వేరొక వ్యక్తితో వెళ్లిన రూపాను ఎలా ఇంట్లో ఉంచుకుంటారని నిలదీశాడు. గొడవ తారస్థాయికి చేరడంతో నీలమ్మపై తన వద్ద ఉన్న కత్తితో కడుపుపై పలుమార్లు పొడిచాడు. స్థానికులు పరిస్థితి గమనించిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.