
గుంటూరు, సాక్షి: చిలకలూరిపేటకు చెందిన సుధారాణి దంపతులను వేధిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని పలు చోట్ల కేసులు పెట్టారని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
‘‘సుధారాణి దంపతులతోపాటు పిల్లలను కూడా తీసుకెళ్లారు. ఈ నెల 4న తీసుకెళ్లి నిన్న జడ్జిముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ముందు సుధారాణి జరిగిందంతా చెప్పారు.పోలీసులు కొట్టిన గాయాలను న్యాయమూర్తికి చూపించారు సుధారాణి. ఒక మహిళను ఉగ్రవాదిని హింసించినట్టు హింసించారు. మహిళను ఐదు రోజులు చిత్ర హింసలు పెట్టారు. సుధారాణి దంపతులను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎస్పీతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేస్తాం. పోలీసు యంత్రాంగం చంద్రబాబు, లోకేష్ గుప్పిట్లోకి వెళ్లింది. పోలీస్ అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. పోలీసు యంత్రాంగం మానవహక్కులు హరిస్తున్నారు. పోలీసు దౌర్జన్యాలపై ఐఎస్సార్‌సీపీ న్యాయపోరాటం చేస్తుంది’’ అని అన్నారు.

Comments
Please login to add a commentAdd a comment