కేరళలో తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో పరారీలో ఉన్న నిందితుల ఆచూకి కోసం మహారాష్ట్ర పోలీసులు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి మరీ ప్రధాన నిందితుడిని పట్టుకున్నారు. మంగళవారమే రత్నగిరి రైల్వే పోలీసులు నిదితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని షారుఖ్ సైఫీగా గుర్తించారు.
ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ.. ఆరోజు ఆ ఘటనకు పాల్పడిన తదనంతరం రైలు దిగుతుండగా నిందితుడు కింద పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయయ్యింది. చికిత్స కోసం ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు కానీ చికిత్స పూర్తి కాక మునుపే ఆస్పత్రి నుంచి పారిపోయాడు. దీంతో తాము రత్నగిరి ప్రాంతంలో తీవ్రంగా సోదాలు నిర్వహించి మరీ షారుఖ్‌ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం నిందితుడు రత్నగిరి రైల్వే పోలీసులు అదుపులో ఉన్నాడని అధికారులు తెలిపారు. నిందితుడి విచారించేందుకు కేరళ పోలీసులు రత్నగిరికి వస్తున్నట్లు తెలిపారు అధికారులు. కాగా ఈ దారుణ ఘటన కోజికోడ్‌లో అలపుజా-కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకుంది. ఆ రోజు నిందితులు కదిలే రైలులో సహ ప్రయాణికుడికి నిప్పంటించడంతో ఎనిమిది మంది దాక గాయపడటమే గాక ఆ ఘటనలో మరో ముగ్గురు పట్టాలపై పడి చనిపోయారు.
(చదవండి: ఆ విషయాల్లో మోదీని విడిచిపెట్టలేదు! ఐనా రివేంజ్ తీర్చుకోలేదు! గులాం నబీ అజాద్)
Comments
Please login to add a commentAdd a comment