విజయనగరం: కలప పర్మిట్ కోసం రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా సాలూరు అటవీశాఖ రేంజర్ పి. ఏడుకొండలు ఏసీబీ అధికారులకు చిక్కాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆదివిష్ణు మూడు లారీల కలప తరలించేందుకు పర్మిట్ కోసం సాలూరు అటవీ శాఖ రేంజర్‌ను ఆశ్రయించాడు. రేంజర్ ఏడుకొండలు రూ.15వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆదివిష్ణు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. విజయనగరం ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి వలపన్ని లంచం తీసుకుంటున్న రేంజర్ ఏడుకొండలుతో పాటూ ఆయనకు సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్ నాగేశ్వరరావును ఆదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి చెప్పారు.