ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్ | Junior assistant nabbed while taking bribe | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

Published Wed, Jul 1 2015 2:39 PM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

Junior assistant nabbed while taking bribe

వరంగల్: వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక జూనియర్ అసిస్టెంట్ పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. తెలంగాణ సర్కార్ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం విడుదల చేసేందుకు రూ.10వేల రూపాయలు లంచం ఇవ్వాలని కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునిల్ డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీని ఆశ్రయించగా వారు వలపన్ని బుధవారం పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.10వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement