junior assistant
-
అనుమానాస్పద స్థితిలో జూనియర్ అసిస్టెంట్ మృతి
ఎమ్మిగనూరు రూరల్: గురురాఘవేంద్ర ప్రాజెక్ట్ డివిజన్–2 జూనియర్ అసిస్టెంట్ సురేష్‌బాబు మంగళవారం గుడేకల్ చెరువులో శవమై తేలాడు. అనుమానాస్పద స్థితిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. మద్దికెర మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన గొల్ల చిన్నహనుమంతు, భాగ్యమ్మకు సురేష్‌బాబు(32), మనోహర్ అనే ఇద్దరు కుమారులు. గురురాఘవేంద్ర ప్రాజెక్ట్ డివిజన్–2లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే గొల్ల చిన్నహనుమంతు కరోనా సమయంలో మృతి చెందడంతో కుమారుడు సురేష్‌బాబుకు జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. విధుల నిమిత్తం ఎమ్మిగనూరులోని టీబీపీ కాలనీలో గది అద్దెకు తీసుకున్న ఈ యువకుడు శుక్రవారం స్వగ్రామానికి వెళ్లాడు. సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లాల్సి ఉందని ఇంట్లో చెప్పి ఎమ్మిగనూరుకు వచ్చిన సురేష్‌బాబు ఆ తర్వాత తల్లి భాగ్యమ్మ ఫోన్‌కు స్పందించలేదు. అనుమానం వచ్చిన ఆమె ఆఫీస్‌కు ఫోన్ చేయగా డ్యూటీకి రాలేదని చెప్పడంతో వెంటనే ఎమ్మిగనూరుకు వచ్చి ఆచూకీ కోసం గాలిస్తుండగా మంగళవారం ఉదయం ఎల్ఎల్సీ కాలువ నుంచి గుడేకల్ చెరువులోకి ఓ మృతదేహం కొట్టుకొచ్చిందని తెలిసింది. అక్కడికి వెళ్లి చూడగా మృతదేహం కుమారుడిదై ఉండటంతో బోరున విలపించారు. పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. ఎల్ఎల్సీలో ప్రమాదవశాత్తు పడ్డాడా..లేక తానే దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనేది విచారణలో తెలియాల్సి ఉంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. -
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నెల 4న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ–హెచ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సింగరేణి డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ శనివారం రాత్రి విడుదల చేశారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను సింగరేణి సంస్థ వెబ్సైట్ www.scclmines.comలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 98,882 మంది అభ్యర్థులకు 77,898 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. నెగిటివ్ మార్కింగ్ విధానంలో పరీక్ష నిర్వహించగా.. 49328 మంది అభ్యర్థులు మాత్రమే కనీస అర్హత మార్కులు సాధించారు. 28,570 మంది పరీక్షలో అర్హత పొందలేదు. మూడు ప్రశ్నలకు సరైన సమాధానం నాలుగు ఆప్షన్లలో లేదని నిపుణులు తేల్చడంతో అభ్యర్థులకు మూడు మార్కులు కలపాలని నిర్ణయించారు. వారం రోజుల్లో ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను సంస్థ వెబ్సైట్లో ప్రకటిస్తామని చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, వారు సమర్పించిన అన్ని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాక తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. చదవండి: ఆ కోరిక తీరకుండానే మరణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు! -
లంచం అడిగి అడ్డంగా దొరికాడు.. ఇంటికి వెళ్లి వస్తాను సార్ వదలండి!
సాక్షి,కాశీబుగ్గ(శ్రీకుకుళం): కాశీబుగ్గ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం(కాశీబుగ్గ సర్కిల్)లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బాడ లక్ష్మీపతి మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. రూ.8వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వెల్లడించిన వివరాల మేరకు.. కవిటి మండల కేంద్రానికి చెందిన ఓ వ్యా పారి జీఎస్టీ నిబంధనల మేరకు ట్యాక్స్‌లు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో తనకు ప్రభుత్వం నుంచి రూ.82 వేలు రిఫండ్ రావాల్సి ఉందని తెలుసుకున్నారు. ఏప్రిల్ నెలలో తన రిటర్న్స్ చూసు కుని రూ.82వేలు అందాల్సిందిగా నిర్ధారించుకు ని తనకు రావాల్సిన నగదు కోసం కాశీబుగ్గ జీఎస్టీ కార్యాలయం, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న బాడ లక్ష్మీపతిని సంప్రదించారు. అయితే ఈ ఫైలు ముందుకు పంపించాలంటే తనకు రూ.10వేలు లంచం ఇవ్వాలని లక్ష్మీపతి డిమాండ్ చేశారు. ఆ వ్యాపారి లంచం ఇవ్వడం ఇష్టం లేక మూడు నెలలుగా తనకు రావాల్సిన రిఫండ్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా రు. అయితే ఎంతకూ ఫైలు ముందుకు కదలకపోవడంతో శ్రీకాకుళంలోని అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారులతో మాట్లాడిన తర్వాత ఆ వ్యాపారి జూనియర్ అసిస్టెంట్ వద్దకు వెళ్లి రూ.10వేలు ఇవ్వలేనని రూ.8వేలు ఇస్తానని చెప్పారు. ఫోన్ పే చేయాలని లక్ష్మీపతి సూచించగా.. అలా చే యకుండా ఏసీబీ అధికారులు చెప్పినట్లు మంగళవారం జూనియర్ అసిస్టెంట్ చాంబర్లోకి వెళ్లి రూ.8వేలు ఇచ్చారు. సరిగ్గా అదే సమయానికి అక్కడే మాటు వేసి ఉన్న డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ బృందం అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ మేరకు వ్యాపారి నుంచి వాంగ్మూలం తీసుకొని జూనియర్ అసిస్టెంట్‌ను విచారించి అక్కడున్న పెండింగ్ ఫైల్స్ పరిశీలించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మిపతిని అరెస్టు చేశామని, బుధవారం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ప్రకటించారు. ఇంటికి వెళ్లి వస్తాను.. విడిచి పెట్టండి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో 20వ వార్డు శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న బాడ లక్ష్మీపతికి 2013లో వివాహం జరగ్గా భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన తండ్రి జీఎస్టీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ అనారోగ్యంతో మరణించారు. ఈ క్రమంలో తండ్రి ఉద్యోగం ఆయనకు 2017 లో వచ్చింది. లంచం తీసుకుంటూ దొరికిపోయిన తర్వాత లక్ష్మీపతి ఇంటికి వెళ్తానంటూ, ఇంటి వారితో ఫోన్లో మాట్లాడతానంటూ ఏసీబీ అధికారులను కోరగా.. వారు దానికి అనుమతి ఇవ్వలేదు. వాంగ్మూలం తీసుకున్నాక కారులో తరలించారు. -
నవ్విపోదురు గాక..!
విజయనగరం ఫోర్ట్: విద్యుత్‌శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను విజయనగరంలో ఉన్న తన సొంత ఇంటికి అక్రమంగా వినియోగించుకుంటున్నారు. విద్యుత్‌శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూడా ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను తన సొంత ఇంటికి మూడేళ్లుగా వాడుకుంటున్నారు. విద్యుత్‌శాఖలో జూనియర్ అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన సొంత ఇంటికి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారు. ఈ ముగ్గురు ఉద్యోగులే కాదు. అనేక మంది ఉద్యోగులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ లబ్ధిని అక్రమ మార్గాన పొందుతూ ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల్లో అధికశాతం మంది విద్యుత్ బిల్లులు కూడా చెల్లించుకోలేని పరిస్థితి. అటువంటి వారికి చేయూత నివ్వాలనే ఉద్దేశ్యంతో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అయితే కంచే చేను మేసినట్లు విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను పొందుతుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిపొందుతున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 1,00,987మంది జిల్లాలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ పథకం కింద లబ్ధిదారులు 1,00,987 మంది. వారికి ఏడాదికి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు చెల్లిస్తున్న నిధులు రూ.10.95 కోట్లు. గుర్తించిన అనర్హులు 19,996 మంది జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ పథకాన్ని అక్రమంగా పొందుతున్న వారు 19, 996 మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి జాబితాను విద్యుత్ శాఖ అధికారులకు పంపించింది. 2019 నుంచి ఉచిత విద్యుత్ పొందుతున్న వీరికి ప్రభుత్వం వెచ్చించింది రూ.6 కోట్లు. అనర్హులపై జాబితాపై సర్వే ప్రభుత్వం అందించిన అనర్హుల జాబితా ప్రకారం విద్యుత్‌శాఖ అధికారులు ఇప్పటివరకు 2,880 మందిని సర్వే చేశారు. ఇంకా 17,116 మందిని సర్వే చేయాల్సి ఉంది. సర్వేలో విస్తుగొల్పే విషయాల్లో వెల్లడవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలు కాని బీసీ, ఓసీ వర్గాల వారు కూడా ఉచిత విద్యుత్ పొందుతుండడం గమనార్హం. నెలాఖరు లోగా సర్వే పూర్తి అనర్హుల జాబితా ప్రకారం ఇప్పటి వరకు 2,880 మందిని సర్వే చేశాం. ఈ నెలాఖరు లోగా పూర్తి చేస్తాం. అనర్హుల్లో ఉద్యోగులు ఉంటే వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటాం. – పి.నాగేశ్వరావు, విద్యుత్‌శాఖ ఎస్ఈ (చదవండి: సారా రహిత పార్వతీపురమే లక్ష్యం...) -
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
భారత ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్.. జూనియర్ అసిస్టెంట్(క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 120(ఎస్సీ–08, ఎస్టీ–14, ఓబీసీ–32, ఈడబ్ల్యూఎస్–12, అన్రిజర్వ్డ్–54) ► అర్హత: కనీసం 40శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్(10+2)ఉత్తీర్ణతతోపాటు కనీసం 6 నెలల వ్యవధితో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా సర్టిఫికేట్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్‌పాయింట్, ఎంఎస్ ఎక్స్ఎల్లో మంచి నాలెడ్జ్ ఉండాలి. ► వయసు: 15.08.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం: నెలకు రూ.26,600 నుంచి రూ.90,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. ► ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్/అవేర్నెస్, ఆయిల్ ఇండియాపై ప్రశ్నలకు 20 శాతం మార్కులు కేటాయిస్తారు. ► రీజనింగ్, అర్థమేటిక్/న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 20శాతం మార్కులు కేటాయిస్తారు. ► డొమైన్/సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్(సంబంధిత పోస్టు విద్యార్హతల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి)కు 60శాతం మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నలు మల్టిఫుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ లే దు. పరీక్ష ఇంగ్లిష్, అస్సామీ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షాసమయం రెండు గంటలు. తుది ఎంపిక రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.08.2021 ► వెబ్సైట్: https://www.oil-india.com/Current_openNew.aspx -
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్: జూనియర్ అసిస్టెంట్ కొలువులు
పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ(పీవీఎన్ఆర్టీవీయూ), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ)ల్లో కొలువుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ).. ఆయా వర్సిటీల్లో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఉద్యోగార్థులకు ఉపయోగపడేలా పూర్తి సమాచారం... ► మొత్తం పోస్టుల సంఖ్య: 127 ► పోస్టుల వివరాలు: సీనియర్ అసిస్టెంట్(పీవీన్ఆర్టీవీయూ): 15; జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్(పీవీన్ఆర్టీవీయూ): 10; జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్(పీజేటీఎస్ఏయూ): 102. అర్హతలు ► డిగ్రీతోపాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్/బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్/కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్ టైప్ రైటింగ్(లోయర్ గ్రేడ్)లో ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు ► జూలై 1, 2021 నాటికి 18–34 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు వయోసడలింపు ఉంటుంది. వేతనం ► సీనియర్ అసిస్టెంట్: రూ.22,460–రూ.66,330 ► జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపింగ్: 16,400–రూ.49,870 పరీక్ష విధానం సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కొలువులకు సంబంధించి పరీక్ష విధానం కింది విధంగా ఉంటుంది. ప్రశ్నప్రతం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2లోని సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో, కంప్యూటర్ అప్లికేషన్ విభాగం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. సిలబస్ ఇలా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ► కరెంట్ అఫైర్స్–రీజనల్ నేషనల్ ఇంపార్టెన్స్. ► అంతర్జాతీయ సంఘటనలు, సమావేశాలు. ► జనరల్ సైన్స్: సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ ఘనత. ► పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ. ► భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలు. ► భారత భౌగోళిక శాస్త్రం(తెలంగాణ భౌగోళిక అంశాలకు ప్రాధాన్యత). ► తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం. ► తెలంగాణ రాష్ట్ర విధానాలు. ► ఆధునిక భారతదేశ చరిత్ర(భారత స్వాతంత్రోద్యమం ప్రాధాన్యం). ► తెలంగాణ చరిత్ర(తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంపై ప్రత్యేక దృష్టి). ► ప్రాథమిక ఇంగ్లిష్ (పదోతరగతి స్థాయి). సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్–డిప్లొమా స్టాండర్డ్ ► మెంటల్ ఎబిలిటీ(వెర్బల్, నాన్ వెర్బల్). ► లాజికల్ రీజనింగ్. ► కాంప్రహెన్షన్ అండ్ రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ► న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్. ► బేసిక్ కంప్యూటర్స్. ► మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్: ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్. ► ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్. ► బేసిక్స్ ఆఫ్ డేటాబేస్. ముఖ్యసమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 25, 2021 ► దరఖాస్తు ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల అభ్యర్థులకు రూ.80. ► వెబ్సైట్: https://www.tspsc.gov.in/index.jsp -
ఏపీ, విశాఖపట్నంలో 21 దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం విభిన్న ప్రతిభావంతుల(దివ్యాంగులకు)కు కేటాయించిన బ్యాక్లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 21 » పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్–03, ల్యాబ్ టెక్నీషియన్–01, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫిమేల్)–03, వర్క్ ఇన్స్పెక్టర్–03, షరాఫ్–01, స్వీపర్–01, ఫిట్టర్ హెల్పర్–02, ఆఫీస్ సబార్డినేట్–06, కుక్–01. » అర్హత: పోస్టును అనుసరించి చదవడం, రాయడం, ఏడు, పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్లు ఉండాలి. » దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సహాయ సంచాలకులు, దివ్యాంగులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమశాఖ,రాణి చంద్రమణిదేవి ఆసుపత్రి ప్రాంగణం, పెద్ద వాల్తేర్ జంక్షన్, విశాఖపట్నం–530017 చిరునామాకు పంపించాలి. » దరఖాస్తులకు చివరి తేది: 18.03.2021 » వెబ్సైట్: visakhapatnam.ap.gov.in ఏపీ–కడప పశుసంవర్ధక శాఖలో ల్యాబ్ అటెండెంట్లు -
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
సాక్షి, పటమట(విజయవాడ తూర్పు) : నగరపాలక సంస్థ సర్కిల్ కార్యాలయంలో అవినీతికి పాల్పడిన ఓ జూనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పేరు మార్పునకు వచ్చిన దరఖాస్తుదారుడి నుంచి రూ.9 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించడంతో వారు వల పన్ని ఉద్యోగిని పట్టుకున్నారు. వివరాల మేరకు పటమట సర్కిల్–3 కార్యాలయ పరిధిలోని ఎన్ఎంఎం స్కూల్ వద్ద ఉండే కోనేరు శైలజ పటమటలోని శ్రీరామ్స్ కోనేరు ఎన్క్లేవ్ అపార్టుమెంటులో ఆస్తి పన్నుకు మ్యుటేషన్ (పేరు మార్పు) కోసం దరఖాస్తు చేసుకున్నారు. సర్కిల్–3 కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పొన్నపల్లి సూర్యభగవాన్ రూ.9 వేలు డిమాండ్ చేశారు. సుమారు ఆరు నెలలుగా నిత్యం తనకు లంచం ఇస్తేనే పని పూర్తి చేస్తానని వే«ధింపులకు గురి చేయడంతో బాధితురాలు ఏసీబీని ఆశ్రయించింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏసీబీ డీఎస్పీ ప్రసాదరావు వ్యూహాత్మకంగా లంచం ఇచ్చే సమయంలో అవినీతి ఉద్యోగిని వలపన్ని పట్టుకున్నారు. బాధితురాలి నుంచి తీసుకున్న రూ.9 వేలు, సూర్యభగవాన్ టేబుల్ సొరుగులో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ప్రకటించారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరి చారు. కాగా, బిల్ కలెక్టర్‌గా అడుగిడిన సూర్యభగవాన్ రెండేళ్లలో రిటైర్డ్ కాబోతున్నాడు. బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలో పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు అయిన మొత్తంలో కొంత స్వప్రయోజనాలకు వినియోగించుకునేవాడని, ఈ విషయం వెలుగులోకి రావటంలో అప్పట్లో అకౌంట్స్ సెక్షన్‌కు బదిలీ చేశారని తెలిసింది. అక్కడా తన పద్ధతిని మార్చుకోకపోవటంతో సర్కిల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా బదిలీ చేశారని, అయినా తన ప్రవర్తనలో మార్పు లేకపోవడం శోచనీయమని వీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అకౌంట్స్ విభాగంలో పని చేసిన సమయంలో కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరుకు ముడుపులు తీసుకునే వారని సమాచారం. కాంట్రాక్టర్లకు ప్రతి నెల టార్గెట్ పెట్టి మరీ వసూలు చేసే వారని, వీరపాండ్యన్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన సమయంలో సూర్యభగవాన్‌ను సర్కిల్ కార్యాలయంలో రెవెన్యూ విభాగానికి సరెండర్ చేశారని వీఎంసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. -
బార్గా మారిన మున్సిపల్ ఆఫీస్
-
అక్రమాలు రాజేశాడు!
కర్నూలు(అగ్రికల్చర్): ఆయన కేవలం జూనియర్ అసిస్టెంట్. ఉద్యోగంలో చేరి పదేళ్లు మాత్రమే అయ్యింది. ఈ వ్యవధిలోనే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి.. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసులో పది రోజుల క్రితమే బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయన సాగించిన అక్రమాలు ఒక్కసారిగా వెలుగు చూడటంతో అధికారులు అవాక్కయ్యారు. ఏకంగా రూ.28.65 లక్షలు భార్య పేరుతో ఏర్పాటు చేసిన బోగస్ ఏజెన్సీలకు మళ్లించుకున్నారు. కర్నూలులోని అపూర్వ సరోవర్‌లో ఆస్తులు కూడా కొన్నారు. మొత్తమ్మీద వ్యవసాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ జి.రాజేష్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిధుల స్వాహాపై కలెక్టర్ ఆదేశాల మేరకు జేడీఏ ఠాగూర్‌నాయక్ కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెనువెంటనే పోలీసులు రాజేష్‌ను, ఆయన భార్య స్వాతిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో అధికారుల బాధ్యతారాహిత్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై జేడీఏ విచారణకు ఆదేశించారు. ‘కారుణ్యం’ చూపితే..కన్నం వేశాడు! నందికొట్కూరు పట్టణానికి చెందిన సాయి వెంకటరమణ పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మరణించారు. దీంతో ఆయన కుమారుడు రాజేష్‌కు కారుణ్య నియామకం కింద వ్యవసాయ శాఖలో ఉద్యోగం వచ్చింది. 2008 జూలై 1న నందికొట్కూరు ఏడీఏ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా చేరారు. అక్కడి నుంచి బదిలీపై 2013 మే 21న కర్నూలు జేడీఏ కార్యాలయానికి వచ్చారు. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే అభియోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 8న ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆయన నెలసరి వేతనం రూ.35,903 మాత్రమే. కానీ రూ.1.40 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది. జేడీఏ కార్యాలయానికి బదిలీ అయినప్పటి నుంచి ఒకే సీటులో కొనసాగడం బాగా కలిసొచ్చింది. జాతీయ ఆహార భద్రత మిషన్, ఎన్‌ఎంఓఓపీ (జాతీయ నూనె గింజల అభివృద్ధి పథకం) వ్యవహారాలు చూసేవారు. జాతీయ ఆహార భద్రత మిషన్ కింద రైతులకు ఆయిల్ ఇంజిన్లు, వాటర్ క్యారియింగ్ పైపులు 50 శాతం సబ్సిడీపై ఇస్తారు. వీటిని సంబంధిత ఏడీఏ సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసి .. ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడానికి వీలుగా జేడీఏ కార్యాలయానికి నివేదికలు పంపుతారు. ఏడీఏలు ఇచ్చిన బిల్లుల ఆధారంగా జేడీఏ కార్యాలయంలో ప్రొసీడింగ్ తయారు చేసి.. ఆర్టీజీఎస్ ద్వారా ఏజెన్సీలకు నగదు బదిలీ చేస్తారు. ఇక్కడే రాజేష్ తెలివి ప్రదర్శించారు. భార్య పేరుతో బోగస్ ఏజెన్సీలు తన భార్య స్వాతి పేరుతో స్వాతి ఏజెన్సీస్, స్వాతి పైప్ ప్రైయివేటు లిమిటెడ్ అనే సంస్థలు ఏర్పాటు చేశారు. భార్య పేరుతోనే కర్నూలు శ్రీనగర్ కాలనీలోని ఎస్బీఐలో సేవింగ్ ఖాతా 20215151833 తెరిచారు. రెండు సంస్థలకూ ఇదే ఖాతా నంబర్ ఇచ్చారు. ఏడీఏల నుంచి వచ్చిన బిల్లులకు ప్రొసీడింగ్స్ ఇచ్చి సబ్సిడీ మొత్తాన్ని వాటికి విడుదల చేసిన తర్వాత అవే బిల్లులకు స్వాతి ఏజెన్సీస్ పేరుతో మళ్లీ ప్రొసీడింగ్స్ తయారు చేసి.. సాంకేతిక అధికారి, జేడీఏలను తప్పుదోవ పట్టించి సంతకాలు చేయించారు. ఆర్టీజీఎస్ ద్వారా నిధులు భార్య ఖాతాకు మళ్లించారు. 2018–19కి సంబంధించి ఆగస్టులో ఒకటి, నవంబరు 2, డిసెంబరు 1, ఫిబ్రవరిలో 1 ప్రకారం ప్రొసీడింగ్స్ సృష్టించి పీడీ అకౌంట్ నుంచి మొత్తం రూ.28.65 లక్షలు కొల్లగొట్టారు. 286 మంది రైతుల పేర్లను పేర్కొని.. సబ్సిడీ మొత్తాన్ని స్వాతి ఏజెన్సీస్‌కు రూ.28.25 లక్షలు, స్వాతి పైప్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు రూ.40 వేలు చొప్పున మళ్లించారు. ప్రస్తుతానికి బయటకు వచ్చింది ఇంతే! 2018–19కి ముందు కూడా అక్రమాలు భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. అధికారుల నిర్లక్ష్యం ఎక్కువే రాజేష్ వ్యవహారాలపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి పెట్టలేదు. కేవలం సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం 2018–19కి సంబంధించి స్కీమ్‌లను ఆడిట్‌కు సిద్ధం చేస్తుండగా...రాజేష్ అక్రమాలు బయట పడ్డాయి. అధికారులు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు వెళ్లి బోగస్ బిల్లులపై సంతకాలు చేయించినట్లు తెలుస్తోంది. ఆయనపై అంతవరకు ఎలాంటి ఆరోపణలు లేనందున అధికారులు కూడా ముందూ వెనుక చూడకుండా సంతకాలు పెట్టినట్లు సమాచారం. తీరా రూ.28.65 లక్షలు కాజేసి సంతకాలు పెట్టిన అధికారులను కూడా అక్రమాల ఊబిలోకి లాగారు. స్వాతి ఏజెన్సీస్, స్వాతి పైప్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఒకే ఖాతా నంబరు ఉన్నా అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. సమగ్ర విచారణకు ఆదేశం జూనియర్ అసిస్టెంట్ రాజేష్ అక్రమాలపై జేడీఏ ఠాగూర్ నాయక్ సమగ్ర విచారణకు ఆదేశించారు. రాజేష్ జేడీఏ కార్యాలయానికి వచ్చినప్పటి నుంచి ఆయన చూసిన వ్యవహారాలను క్షుణంగా పరిశీలించేందుకు ఐప్యాడ్ డీపీడీ వెంకటేశ్వరరెడ్డిని విచారణాధికారిగా నియమించారు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
అవినీతి@100కోట్లు
-
అతనో చిరుద్యోగి.. రూ. కోట్ల ఆస్తికి యజమాని..
తణుకు: అతనో చిరుద్యోగి.. రూ. కోట్ల ఆస్తికి ఆయన యజమాని.. అత్యంత విలాసవంతమైన జీవితం.. ఖరీదైన కార్లు... కళ్లు చెదిరిపోయే ఇల్లు.. సినిమా హాల్‌ను తలపించే భారీ తెర.. ఒక్కోటి రూ. లక్షలు విలువ చేసే చేతి గడియారాలు.. ఇలా అతని ఆర్థిక వ్యవహారాలను చూస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయం.. జిల్లా కేంద్రం ఏలూరులోని పంచాయతీరాజ్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న రాంపల్లి సత్యఫణి దత్తాత్రేయ దివాకర్‌కు చెందిన అక్రమ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలోని దివాకర్ నివాసంతోపాటు తణుకులోని ఆయన కార్యాలయంలో, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని ఆయన బంధువుల ఇంటిపైనా ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాల మేరకు అడిషినల్ ఎస్పీ ఎ.రమాదేవి స్వయంగా ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ దాడుల్లో దివాకర్‌తోపాటు అతని తల్లి రాంపల్లి వెంకట సుబ్బలక్ష్మి, సోదరుడు రాంపల్లి శ్రీనివాస రామకృష్ణ కిరణ్‌కుమార్ పేర్లపై సుమారు రూ. 100 కోట్లు ఆక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2012 నుంచి 2017 వరకు ఐదేళ్ల వ్యవధిలోనే ఈ ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఏడాదిగా దివాకర్ సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగి నుంచి రియల్టర్‌గా... ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామానికి చెందిన దివాకర్ పంచాయతీరాజ్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ విభాగం చింతలపూడిలో 2009 జూన్ 15న జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. ఇతని తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మృతి చెందడంతో దివాకర్‌కు ఉద్యోగం ఇచ్చారు. అయితే కొద్ది కాలంలోనే రియల్టర్‌గా అవతారం ఎత్తిన దివాకర్ డెప్యూటేషన్‌పై ఏలూరు ఎస్ఈ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఏడాదిగా సెలవులో కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాలతో అడిషినల్ ఎస్పీ ఎ.రమాదేవి స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం వేకువజామున పాలంగిలోని దివాకర్ నివాసానికి వచ్చిన ఏసీబీ అధికారులు ఇంట్లోని నగదు, బంగారు, వెండి ఆభరణాలు, అత్యంత ఖరీదైన చేతిగడియారాలు, విలాసవంతమైన ఐదు కార్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తణుకులోని రాఘవేంద్ర రెసిడెన్సీలోని దివాకర్‌కు చెందిన కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ గుర్తించిన అక్రమాస్తులు ఇవే... దివాకర్ కుటుంబానికి వ్యవసాయ భూమి 85.62 ఎకరాలు, బంగారం అరకిలో, వెండి 5 కిలోలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. హౌస్ ఫ్లాట్లు, 19, ఫామ్ హౌస్ 1, జీప్లస్2 నివాసగృహం 1, కమర్షియల్ జీప్లస్3 భవనం, గోదాం 1 ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇంట్లో నగదు రూ. 6.25 లక్షలు, విదేశీ కరెన్సీ రూ. 60 వేలు, బ్యాంకు నిల్వ రూ. 3 లక్షలు, ఇంట్లోని ఫర్నీచర్ రూ. 30 లక్షలు, కార్లు 5, మోటారుసైకిళ్లు 2 ఉన్నట్టు గుర్తించారు. పెద్దలే బినామీలు ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న దివాకర్ అక్రమార్జనతోనే ఇన్ని ఆస్తులు కూడబెట్టారా? లేక ఎవరికైనా ఇతను బినామీగా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం చిరుద్యోగిగా జీవితం ప్రారంభించిన దివాకర్ కొద్దికాలంలోనే పెద్ద ఎత్తున ఆస్తులు ఎలా కూడబెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులకు ఇతను బినామీగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధి అత్యంత సమీప బంధువుతో ఇతను కొంతకాలంగా ఆర్థిక వ్యవహారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఇటీవల మనస్పర్థలు తలెత్తడంతోనే దివాకర్ ఆర్థిక వ్యవహారాలపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించారు. దివాకర్‌ను అరెస్టు చేశారు. సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు బి.సుదర్శన్‌రెడ్డి, ఎల్.సన్యాసినాయుడు, భాస్కరరావు, మోహన్, సిబ్బంది పాల్గొన్నారు. -
లుంగీతో ఆఫీస్‌కు.. ఉద్యోగినుల ఫిర్యాదు!
మధిర : మహిళల అభివృద్ధికోసం ఏర్పాటుచేసిన ఐసీడీఎస్ శాఖలో ఉద్యోగినులకు భద్రత కరువైంది. పద్ధతి మార్చుకోమని సూచించిన పై స్థాయి అధికారిపై జూనియర్ అసిస్టెంట్ దురుసుగా ప్రవర్తించిన సంఘటన గురువారం మధిర ఐసీడీఎస్ కార్యాలయంలో చోటుచేసుకుంది. మధిర ఐసీడీఎస్ కార్యాలయ ఇన్చార్జ్ సీడీపీఓగా కనకదుర్గ విధులు నిర్వరిస్తున్నారు. గతంలో మధిర ఐసీడీఎస్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం వహించేవారు. దాన్ని కనకదుర్గ గ్రహించి పనితీరును మార్చుకోవాలని వారికి సూచించారు. అదే సమయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న దేవకుమార్ను సైతం మందలించారు. అయితే దేవకుమార్ ఆమె మాటలను పెడచెవినపెట్టి లుంగీతో కార్యాలయానికి రావడం ప్రారంభించారు. దీంతో తమకు ఇబ్బందిగా ఉందని మహిళా ఉద్యోగులు సీడీపీఓకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇది సరైన విధానం కాదని, పద్ధతి మార్చుకోవాలని మరోసారి తీవ్రంగా దేవకుమార్ను సీడీపీఓ మందలించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ కేంద్రాల అద్దె చెల్లింపు విషయంపై ఉన్నతాధికారులకు ఆన్‌లైన్‌ద్వారా సమాచారం అందిస్తుండగా.. అప్పుడే కార్యాలయానికి వచ్చిన దేవకుమార్ తన కంప్యూటర్ను ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ ఉన్నతాధికారిణి అనికూడా చూడకుండా దుర్భాషలాడాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సిబ్బంది.. దేవకుమార్ వ్యవహార శైలిపై ఖమ్మం పీడీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సీడీపీఓ కనకదుర్గ కన్నీటి పర్యంతమై.. ఈ ఉద్యోగి తమకొద్దని.. ఉన్నతాధికారులకు దండం పెడతానని ఇక్కడినుంచి పంపించాలంటూ విలేకరుల ఎదుట వాపోయారు. -
ఏసీబీ వలలో ఇద్దరు లంచావతారులు
నెల్లూరు(క్రైమ్): రెండేళ్ల ప్రొబేషనరీ కాలం అనంతరం సర్వీసు రెగ్యులరైజ్ చేసేందుకు క్లారిఫికేషన్ ఉన్నతాధికారులకు పంపడానికి జూనియర్ అసిస్టెంట్ నుంచి లంచం తీసుకుంటున్న ఇద్దరు నెల్లూరు డీఎంహెచ్ఓ కార్యాలయ ఎస్టాబ్లిష్మింట్ విభాగ ఉద్యోగులను ఏసీబీ అధికారులు గురువారం రెడ్‌హ్యాండ్‌గా పట్టుకొన్నారు. ఏసీబీ అధికారుల సమాచారం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన కె.వెంకట మహేష్‌బాబు తండ్రి జిల్లా వైద్యారోగ్యశాఖలో వాహన డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ 2009లో మృతి చెందారు. తండ్రి మరణించే నాటికి మహేష్ మైనర్ కావడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందలేకపోయాడు. మైనార్టీ తీరిన తర్వాత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. ట్రిబ్యునల్ 2013లో మహేష్‌బాబుకు జూనియర్ అసిస్టెంట్ లేదా అందుకు సమాన ఉద్యోగం ఇవ్వాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. మహేష్ కారుణ్య నియామకం కింద నెల్లూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో 2014 డిసెంబర్ 26వ తేదీన అకౌంట్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. 2016 డిసెంబర్లో ఆయన ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయింది. సర్వీసు రెగ్యులర్ అయితే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వస్తాయి. దీంతో సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని మహేష్ డీఎంహెచ్ఓను కోరారు. రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించి క్లారిఫికేషన్‌ను పంపాలని కార్యాలయ ఎస్టాబ్లిష్మెంట్ విభాగ సూపరింటెండెంట్ పయ్యావుల శ్రీనివాసులను డీఎంహెచ్ఓ ఆదేశించారు. మహేష్ సూపరింటెండెంట్‌ను కలిసి అందుకు సంబంధించిన వివరాలన్నింటిని అందజేశారు. రోజులు గడుస్తున్నా సూపరింటెండెంట్ రెగ్యులరైజేషన్‌కు సంబంధించి పట్టించుకోకపోగా అందుకు సంబం ధించిన పత్రాలు కనిపించడం లేదనీ మరోమారు పత్రాలను ఇవ్వాలని సూచించాడు. దీంతో మహేష్ తిరిగి పత్రాలన్నింటిని అందజేశారు. అయినా చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల మహేష్ ఏడాదిన్నర గడుస్తున్నా ఇంత వరకూ ఎందుకు క్లారిఫికేషన్ పంపరని సూపరింటెండెంట్‌ను నిలదీశారు. దీంతో సూపరింటెండెంట్ రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రూ 25 వేలు ఇస్తానని మహేష్ అంగీకరించాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని మహేష్ రెండు రోజుల కిందట ఏసీబీ డీఎస్పీ పి. పరమేశ్వర్‌రెడ్డికి సూపరింటెండెంట్‌పై ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు గురువారం మహేష్ డీఎంహెచ్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్టాబ్లిష్మెంట్ విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసులను కలిసి లంచంగా రూ. 25 వేలు ఇవ్వబోగా శ్రీనివాసులు ఆ నగదును సీనియర్ అసిస్టెంట్ గోపాల్‌కు ఇవ్వాలని సూచించాడు. సీనియర్ అసిస్టెంట్‌కు నగదు ఇవ్వగా అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ శివకుమార్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి గోపాల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. శ్రీని వాసులు, గోపాల్‌ను అదుపులోకి తీసుకుని వారికి రసాయన పరీక్షలు నిర్వహించారు. లంచం తాలు కు నగదును స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం స్టోన్‌హౌస్‌పేటలోని శ్రీనివాసులు ఇంట్లో, డీఎం హెచ్ఓ కార్యాలయ సమీపంలోని గోపాల్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇది ఇలా ఉంటే శ్రీనివాసులుపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అన్ని అంశాలపై ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేస్తున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు శివకుమార్‌రెడ్డి, దిలీప్‌లు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి జలగ..!
-
ఏసీబీ వలలో అవినీతి జలగ..!
ఖమ్మం : ఖమ్మంలోని వీడీవోస్ కాలనీలోగల మహిళ, శిశు సంక్షేమ–అభివృద్ధి శాఖ కార్యాలయంలోనే ఒక పక్కన వికలాంగులు–వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం ఉంది. వికలాంగులకు రుణాలు మంజూరు చేసేందుకు ఇక్కడ ఒక జూనియర్ అసిస్టెంట్, మరొక ఔట్‌సోర్సిం గ్ ఉద్యోగి ఉన్నారు. ఆ జూనియర్ అసిస్టెంట్ పేరు రేగళ్ల వేణుగోపాల్. ఆయన నెలసరి వేతనం 40 – 50వేల రూపాయలు ఉంటుంది. పాపం.. అది చాల్లేదేమో..! లంచాలకు అలవాటుపడ్డాడు. రుణం మంజూరైన లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేస్తున్నాడు. ఏ ఆసరా లేకనే రుణం కోసం ఇక్కడిదాకా వచ్చిన ఆ వికలాంగులు.. లంచం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు..? ఆ జూనియర్ అసిస్టెంట్ లంచం అడుగుతున్న విషయాన్ని ఆ శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. ప్చ్.. వారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇలా వేధించాడు... తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లికి చెందిన నాగలక్ష్మికి 90 శాతం అంగవైకల్యముంది. జీవనాధారం కోసం పిండి మర పెట్టుకుంటానంటూ రుణం కోసం ప్రభుత్వానికి 2016లో దరఖాస్తు చేసుకుంది. 2017 చివరిలో ఆమెకు లక్ష రూపాయలు మంజూరయ్యాయి. చెక్కు తీసుకునేందుకు జూనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ వద్దకు తన భర్త శ్రవణ్‌తో కలిసి నాగలక్ష్మి వచ్చింది. అతడు ఐదువేల రూపాయలు లంచం అడిగాడు. వారు ఇవ్వలేకపోయారు. తమ ఆర్థిక పరిస్థితిని వివరించారు. కష్టాల్లో ఉన్నమన్నారు. కరుణించాలని వేడుకున్నారు. వేణుగోపాల్ చెవికి ఇవేవీ ఎక్కలేదు. ‘‘ప్రభుత్వం నుంచి రుణం మంజూరు కావడమంటే మాటలా..? ఎంత కష్టపడితే వస్తుంది..? నన్ను ఆమాత్రం చూసుకోలేరా..? ఐదువేలు ఇస్తేనే చెక్కు ఇస్తాను’’ అని చెప్పాడు. అయినప్పటికీ, వారు దాదాపు రెండు నెలల నుంచి ఆ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. విసిగిపోయారు. చివరకు, ఏసీబీ సీఐ రమణమూర్తిని ఆశ్రయించారు. ఇలా చిక్కాడు... ఏసీబీ సీఐ రమణమూర్తి స్పందించారు. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మరో సీఐ రామలింగారెడ్డితో కలిసి పథకం వేశారు. వేణుగోపాల్ వద్దకు నాగలక్ష్మి దంపతులు శుక్రవారం వెళ్లారు. ఐదువేలు ఇచ్చుకోలేమని, రెండువేలు ఇస్తామని బేరమాడారు. వేణుగోపాల్ ఒప్పుకున్నాడు. అప్పటికే ఏసీబీ అధికారులు రసాయనం పూసి ఇచ్చిన నోట్లను ఆ దంపతులు వేణుగోపాల్‌కు ఇచ్చారు. వాటిని అతడు అలా తీసుకోవడం, ఏసీబీ అధికారులు లోపలికి దూసుకురావడం, ఆ నోట్లను లాక్కోవడం.. అంతా కేవలం కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది. అతడిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదివరకే ఫిర్యాదులు లంచం కోసం వేధిస్తున్నాడంటూ వేణుగోపాల్‌పై గతంలోనే కారేపల్లికి చెందిన వెంకన్న అనే వికలాంగుడు కలెక్టర్‌కు, ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. వెంకన్న డబ్బులు ఇస్తుండగా పట్టుకుందామని ఏసీబీ అధికారులు పథకం వేశారు. కానీ, అది విఫలమైంది. అప్పటి నుంచి అతడిపై నిఘా పెట్టారు. చివరకు ఇలా పట్టుబడ్డాడు. ‘‘వేణుగోపాల్‌కు కార్యాలయంలో ఎవరెవరు సహకరిస్తున్నారు..? గతంలో కూడా ఫిర్యాదులు వచ్చినప్పటికీ పై అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు..? వీటన్నిటిని విచారిస్తున్నాం’’ అని, విలేకరులతో ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ చెప్పారు. -
ఇంటి దొంగల పనే !
సాక్షి, తెనాలి: నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో తెనాలిలోని ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ జూనియర్ అసిస్టెంట్ తుమ్మల కిరణ్‌కుమార్ పాత్ర స్పష్టమైంది. విజయవాడలోని ట్రాన్స్‌పోర్టు కార్యాలయాల్లో భారీ మొత్తంలో పట్టుబడిన రెక్టిఫైడ్ స్పిరిట్ (ఆర్ఎస్) దిగుమతి చేసుకోవటం ఇందుకు నిదర్శనం. రేపల్లె ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని తుమ్మల పంచాయతీ శివారు గాదెవారిపాలెంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం కోసమే ఆర్ఎస్ను తెప్పిస్తున్నట్టు రూఢీ అయినట్టే. గాదెవారిపాలెంలో నకిలీ మద్యానికి కీలకమైన పూర్ణిమ వైన్స్ లైసెన్సుదారుడు గుమ్మడి సాంబశివరావు, కిరణ్‌కుమార్ బినామీగా, నకిలీ మద్యం తయారీ సూత్రధారి అతడేనన్న లింకూ స్పష్టమైనట్టే. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు అక్కడ నుంచి విజయవాడకు ఆర్ఎస్ను తెప్పిస్తూ నకిలీ మద్యాన్ని యథేచ్ఛగా తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఏజెంటు సాధుల ఆదిత్యను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు, అతడికి సప్లయి చేస్తున్న మహారాష్ట్ర స్మగ్లర్ వేటకు బయలుదేరి వెళ్లారు. పట్టిచ్చిన ఫోన్ కాల్ జాబితా... నకిలీ మద్యం సూత్రధారి తుమ్మల కిరణ్‌కుమార్‌కు డిపార్టుమెంటులో సంబంధాలు బలంగా ఉన్నాయి. నకిలీ మద్యం రాకెట్‌ను పట్టుకున్న రోజున, తెనాలి జూనియర్ అసిస్టెంట్ ఫోన్ కాల్ జాబితాను పరిశీలించిన అధికారులకు ఈ విషయం స్పష్టమైంది. అతడి నుంచి రేపల్లె సర్కిల్ కార్యాలయానికి దాదాపుగా అరవై కాల్స్ వెళ్లాయి. మళ్లీ అటువైపు నుంచి అదే సంఖ్యలో కాల్స్ ఇతడికీ వచ్చినట్టు తెలుసుకున్నారు. నకిలీ మద్యం సూత్రధారికి, సర్కిల్ కార్యాలయంతో ఉన్న అనుబంధంతోనే రెస్క్యూ కోసం పడరానిపాట్లు పడ్డారని ఫోన్ కాల్స్ జాబితా చెబుతోంది. పూర్వ భాగస్వామి సమాచారంతోనే..! తెనాలి జూనియర్ అసిస్టెంట్ కిరణ్‌కుమార్, దుగ్గిరాల సర్కిల్లో పని చేస్తూ ‘సిండికేట్ కింగ్’గా పేరు తెచ్చుకున్న కానిస్టేబుల్, తెనాలి డివిజనులో మద్యం వ్యాపారాన్ని తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారు. మద్యం వ్యాపారంలో వీరితో గత కాలంలో భాగస్వామిగా వ్యవహరించిన ఒకరి పక్కా సమాచారంతోనే తుమ్మల పంచాయతీ నకిలీ మద్యం రాకెట్‌ను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్/ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఛేదించగలిగారని సమాచారం. కొంచెం అప్రమత్తమైతే నాడే వెలుగులోకి.. కొల్లూరు మండలం క్రాపలో అనధికార దుకాణం పట్టుబడ్డ కేసును పట్టించుకున్నట్టయితే ఆనాడే నకిలీ మద్యం బాగోతం వెల్లడయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెనాలికి సమీపంలోని వేమూరులో లైసెన్సు దుకాణం నుంచి క్రాపలో అనధికార దుకాణం నడుపుతున్నారు. దుగ్గిరాల ఎక్సైజ్ సర్కిల్ పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడ 4–5 కేసుల మద్యం, బస్తా కొత్త మూతలు దొరికాయి. అక్కడ అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ప్రశ్నిస్తే, తెనాలి ఓవర్ బ్రిడ్జి దగ్గర్లోని వైన్స్‌లో పని చేసే శంకర్ అనే యువకుడు, తానూ కలిసి సీసాలకు మూతలు వేసి బెల్టు షాపులకు వేస్తున్నట్టు చెప్పాడు. దీనికి ముందు గతేడాది దుగ్గిరాల సర్కిల్లోని ఈమని గ్రామంలో టాస్క్‌ఫోర్స్ దాడిలో సుమారు 20 కేసుల మద్యం, బస్తా కొత్త మూతలు దొరికాయి. ఈ రెండు ఘటనల్లోనూ కీలకమైన యువకుడిని విచారిస్తే తుమ్మలకు చేరుతున్న ఆర్ఎస్, ఈ చివరకూ మద్యం రూపంలో అందుతోందని రూఢీ అయ్యేదనే వాదన ఉంది. తుమ్మల ఘటన తర్వాతనైనా అటుకేసి దృష్టి సారిస్తారో? లేదో? వేచి చూడాలి. -
ఒంగోలులో ఏసీబీకి పట్టుబడ్డ అధికారి
సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లాలో ఓ అవినీతి అధికారి వ్యవహారం వెలుగు చూసింది. గురువారం ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. జూనియర్ అసిస్టెంట్‌గా పని చేసే రావిపాటి పూర్ణ చందర్రావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం అధికారులు అతన్ని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
గుంటూరు: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ జిల్లా కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్ ఏసీబీ అధికారుకు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ. 3 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు బషీర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు. -
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు
కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ శాఖకు ప్రభుత్వం 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను మంజూరు చేసినట్లు జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌బాబు, గిరికుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని తహసీల్దారు కార్యాలయాలకు ఒక్కో పోస్టు రానుందన్నారు. ప్రస్తుతం తహసీల్దారు కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు హవా నడుపుతున్నారని.. అనేక అక్రమాలకు వీరే బాధ్యులు అవుతున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వం తహసీల్దార్లకు సహాయకంగా ఉండేందుకు కొత్త పోస్టులు మంజూరు చేసిందన్నారు. ఇన్ని పోస్టుల మంజూరుకు రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కృషి కారణమని వివరించారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా నాయకులు రామన్న, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రొయ్యూర్ పీహెచ్సీ జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
ఏటూరునాగారం : మండలంలోని రొయ్యూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఫయాజ్ను సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్ఓ సాంబశివరావు శనివారంఉత్తర్వులుజారీ చేశారు. శుక్రవారం రొయ్యూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఫయాజ్ ఆస్పత్రి గదిలో పడుకొని ఉన్నాడు. పీఓ వెళ్లి ఎం దుకు పడుకున్నావని ప్రశ్నించగా మీరు ఎవరు నన్ను అడుగుతున్నారని అమర్యాదగా ప్రవర్తించాడు. దీంతో పీఓ ఇచ్చిన సిఫారసు మేరకు సస్పెండ్ చేసినట్లు సాంబశివరావు పేర్కొన్నారు. -
ఏసీబీ అదుపులో జూనియర్ అసిస్టెంట్
మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నం డీసీహెచ్ఎస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నతస్లీమ్ బేగ్ శానిటేషన్ కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేయడానికి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు తస్లీమ్ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. -
'రాత పరీక్షలో అవకతవకల్లేవు'
హైదరాబాద్: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామక పరీక్ష పూర్తి పారదర్శకంగా జరిగిందని సింగరేణి, జేఎన్టీయూ అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో అవినీతి ఆరోపణలపై జరుగుతున్న ప్రచారం నిరాధారమైనవని వారు చెప్పారు. అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్ రాతపరీక్షలో అవకతవకలు జరిగినట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వివరణ ఇవ్వడానికి సింగరేణి అధికారులు, జేఎన్టీయూ అధికారులతో కలిసి గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కానీ సీఐడీ విచారణకు సిద్ధమేనా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. -
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల
గోదావరిఖని: సింగరేణిలో 471 జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్) ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను ఆదివారం ప్రకటించారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈనెల 11న ఈ పరీక్ష నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జేఎన్టీయూ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ విశ్వనాథ్ సింగరేణి రిక్రూట్మెంట్ సెల్ జీఎం సి.మల్లయ్యపంతులుకు ఫలితాలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 170 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 70,509 మంది హాజరుకాగా, వీరిలో 96% మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లో మొత్తం 150 మార్కులకు 90.66 మార్కులు సాధించి ఆది లాబాద్ జిల్లాకు చెందిన మాటేటి కృష్ణ మొదటి స్థానంలో నిలిచాడు. ఫలితాలను సింగరేణి వెబ్సైట్లో పెట్టామని రిక్రూట్మెంట్ సెల్ జీఎం తెలిపారు. తప్పొప్పులపై తమ విజ్ఞప్తులను ఈ నెల 28 వరకు రిక్రూట్మెంట్ సెల్ దృష్టికి తీసుకురావాలని కోరారు. వీరు ఈ నెల 10కి ముందు తీసిన సర్టిఫికెట్ల ఆధారాలతో రావాలని సూచించారు. ఆ తర్వాతే తుది జాబితా విడుదల చేస్తామన్నారు. -
సింగరేణి పరీక్షకు 70 వేల మంది హాజరు
కొత్తగూడెం: సింగరేణిలో ఖాళీగా ఉన్న 471 జూనియర్ అసిస్టెంట్ (క్లరికల్) పోస్టులకు ఆరు జిల్లాల్లోని 170 కేంద్రాలలో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. మొత్తం 83,225 మందికి హాల్ టిక్కెట్లు పంపిణీ చేయగా 70,561 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో జరిగిన కార్యక్రమంలో సింగరేణి సంస్థ డెరైక్టర్ (ఫినాన్స్, పా) పవిత్రన్‌కుమార్ లాటరీ ద్వారా పరీక్ష పత్రాన్ని ఎంపిక చేశారు. ఆదిలాబాద్‌లో 22 పరీక్ష కేంద్రాల్లో 7,915 మందికి గాను 6,271, హైదరాబాద్‌లో 6 కేంద్రాల్లో 5,277 మందికి 3,787 మంది, కరీంనగర్లో 53 పరీక్ష కేంద్రాల్లో 25,429 మందికి గాను 21,895 మంది, వరంగల్‌లో 21 కేంద్రాల్లో 14,576 మందికి గాను 12,366 మంది, ఖమ్మంలో 41 కేంద్రాల్లో 20,799 మందికి గాను 17,810 మంది, మంచిర్యాలలో 27 పరీక్ష కేంద్రాల్లో 9,229 మందికి గాను 8,432 మంది హాజరయ్యారు.