సమస్యలు ఉన్నా సర్దుకుపోండి! | problems adjusted Kamineni Srinivas in srikakulam | Sakshi
Sakshi News home page

సమస్యలు ఉన్నా సర్దుకుపోండి!

Published Wed, Aug 6 2014 2:45 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

సమస్యలు ఉన్నా సర్దుకుపోండి! - Sakshi

సమస్యలు ఉన్నా సర్దుకుపోండి!

 శ్రీకాకుళం/రిమ్స్ క్యాంపస్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో వైద్యసేవలు సక్రమంగా అందకపోవడానికి ప్రభుత్వ లోపం కూడా కారణమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకుని రోగులకు సేవలందించాలని వైద్యులకు సూచిం చారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల పనితీరు సంతృప్తికరంగా లేదని, పొరపాట్లను సరిదిద్దుకోవాలని సూచించారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ఎక్కువని, దీనిపై తక్షణమే సర్వే చేరుుస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో అన్ని ఆరోగ్యశాఖలను డైరక్టర్ ఆఫ్ హాస్పిటల్స్ పేరిట ఓ గొడుగు కిందకు తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రతి జిల్లాకూ ఒక  ఐఏఎస్ స్థాయి అధికారిని కో-ఆర్డినేటర్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు.  
 
 సిగ్గుచేటు...
 మంత్రి స్థాయిలో జరిగిన సమీక్షల్లో వైద్యాధికారులు, కిందిస్థాయి సిబ్బంది పనితీరు బాగులేదన్న ఆరోపణలపై మాట్లాడుకోవాల్సి రావడం సిగ్గు చేటని కార్మికశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సిబ్బందిపై ఫిర్యాదులు వస్తున్నా  ఎందుకు స్పందించడం లేదని డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌లను నిలదీశారు. ఇటువంటి వాటిపై కలెక్టర్ దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
 సిబ్బంది, మౌలిక వసతుల కొరతపై ఫిర్యాదు...
 ఆస్పత్రుల్లో సిబ్బంది, మౌలిక వసతుల కొరత ఉందని, ఆముదాలవలస  ఆస్పత్రిలో రెండేళ్లుగా శస్త్ర చికిత్సలు జరుగలేదని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ చెప్పడంతో వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  హిరమండలం, కొత్తూరు, పాతపట్నం ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో అధికారులకు తెలిసి వైద్యులు, సిబ్బంది గైర్హాజరు అవుతుండడాన్ని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హిరమండలంలో జూనియర్ అసిస్టెంట్ తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నట్టు వైద్యాధికారి జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని డీఎంహెచ్‌వోను మంత్రులు నిలదీశారు. అనేక సందర్భాల్లో డీసీహెచ్‌ఎస్, డీఎంహెచ్‌వోలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోగా సరికాదని హితవు పలికారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ పాలకొండ ఆస్పత్రిని జిల్లా స్థాయికి పెంచుతామని చెప్పినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదన్నారు.
 
 సీతంపేటతో పాటు గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.  రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాజాం ఆస్పత్రి స్థాయి పెంచినా పోస్టులను పెంచకపోవడంతో వైద్యసేవలు సక్రమంగా అందడం లేదని, భవనాల మరమ్మతులు, సీజనల్ వ్యాధులకు సంబంధిం చిన మందులు అందించాలని కోరారు. తాను ఇటీవలే జిల్లాకు రావడం వలన ప్రస్తుత సమావేశంలో వచ్చిన సమస్యలేవీ తన దృష్టికి రాలేదని తక్షణం వీటిని పరిశీలించి సరిచేస్తామని   కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. దీనికి స్పందిం చిన మంత్రులు కేవలం సరిచేయడమే కాదని ఎవరిదైనా తప్పనుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, బెం దాళం అశోక్, బగ్గు రమణమూర్తులు కూడా ప్రసంగించగా  రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ అరుణకుమారి డీఎంహెచ్‌వో డాక్టర్ గీతాం జలి, డీసీహెచ్‌ఎస్ సునీలా పాల్గొన్నారు.
 
 రిమ్స్ పరిశీలన...
 రిమ్స్ ఆస్పత్రిలోని పలు ఓపీ విభాగాలు, వార్డులను మంత్రి కామినేని పరిశీలించారు. ముందుగా  గైనిక్ ఓపిని పరిశీలించారు. సేవలపై ఆరా తీశారు. నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన బ్లాకులను పరిశీలించి, అక్కడ నెలకొన్న అపారిశుద్ధ్యం నెలకొని ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆపరేషన్ థియేటర్, డయాలసిస్ సెంటర్‌ను పరిశీలించి అక్కడి సేవలను తెలుసుకున్నారు. అనంతరం ఆరోగ్యశ్రీ వార్డు ను పరిశీలించారు. అక్కడ తక్కువ మంది రోగులు ఉండటంతో ఆరోగ్యశ్రీ సేవలను విసృ్తతం చేయాలని సూచించారు. రిమ్స్ తీరును మార్చాలని డెరైక్టర్‌ను ఆదేశించారు.
 
 పలు ప్రారంభోత్సవాలు
 రిమ్స్‌లో పునర్నిర్మించిన అత్యవసర విభాగాన్ని తొలుత మంత్రి ప్రారంభించారు. క్యాజువాల్టికే రంగులు వేసి, పునర్నిర్మించినట్టు శిలాఫలకం ఏర్పాటు చేసి మంత్రితో ప్రారంభోత్సవం జరిపించడంతో విమర్శలు వినిపించాయి. తరువాత రిమ్స్ ఆడిటోరింయలో స్టాఫ్ అండ్ స్టూడెంట్ క్యాంటీన్‌ను ప్రారంభించారు. అక్కడే కాఫీ పాయింట్‌ను, రిమ్స్ ఉద్యోగుల కోసం ‘మ్యూచ్యువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ స్టోర్సు’ను ప్రారంభించారు.
 
 అన్నపూర్ణ పథకం బాగుంది
 రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీసత్యసాయి ఆన్నపూర్ణ నిత్యఅన్నదాన సేవా పథ కం నిర్వహణ బాగుందని మంత్రి కితా బిచ్చారు. వీటి నిర్వహణపై సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు గంగుల రమణబాబుని అడిగి తెలుసుకున్నారు.
 
 ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు శ్రీనివాస్‌కు మంత్రి పరామర్శ...
 రిమ్స్ ఆస్పత్రి ఆరోగ్యశ్రీ వార్డులో చికిత్స పొందుతున్న రాష్రీయ స్వయం సేవక సంఘం(ఆర్.ఎస్.ఎస్) నాయకులు శ్రీనివాస్‌ను మంత్రి పలకరించారు. కళ్లు తిరిగి కిందపడిన ఘటనలో శ్రీనివాస్‌కు రెండు చేతులు భుజాలు తప్పిపోవటంతో శస్త్రచికిత్స చేశారు. దీంతో ఆయన్ను పరామర్శించారు.
 
 కిడ్నీ వ్యాధులపై జిల్లాకు ప్రత్యేక బృందం
 అరసవల్లి:     జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధులపై త్వరలో ప్రత్యేక బృందం రానుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కా మినేని శ్రీనివాసరావు అన్నారు. బీజేపీ నాయకులతో స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కమిటీలోనూ పార్టీ సభ్యుడు ఒక్కరైనా ఉండేలా కృషి చేస్తానన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి వేణుగోపాలం, పూడి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement