పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ(పీవీఎన్‌ఆర్‌టీవీయూ), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ)ల్లో కొలువుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ).. ఆయా వర్సిటీల్లో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఉద్యోగార్థులకు ఉపయోగపడేలా పూర్తి సమాచారం...
► మొత్తం పోస్టుల సంఖ్య: 127
► పోస్టుల వివరాలు: సీనియర్ అసిస్టెంట్(పీవీన్‌ఆర్‌టీవీయూ): 15; జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్(పీవీన్‌ఆర్‌టీవీయూ): 10; జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్(పీజేటీఎస్‌ఏయూ): 102.
అర్హతలు
► డిగ్రీతోపాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్/బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్/కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్ టైప్ రైటింగ్(లోయర్ గ్రేడ్)లో ప్రభుత్వం నిర్వహించిన టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు
► జూలై 1, 2021 నాటికి 18–34 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు వయోసడలింపు ఉంటుంది.
వేతనం
► సీనియర్ అసిస్టెంట్: రూ.22,460–రూ.66,330
► జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపింగ్: 16,400–రూ.49,870
పరీక్ష విధానం
సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కొలువులకు సంబంధించి పరీక్ష విధానం కింది విధంగా ఉంటుంది.
ప్రశ్నప్రతం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2లోని సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో, కంప్యూటర్ అప్లికేషన్ విభాగం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.
సిలబస్ ఇలా
జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
► కరెంట్ అఫైర్స్–రీజనల్ నేషనల్ ఇంపార్టెన్స్.
► అంతర్జాతీయ సంఘటనలు, సమావేశాలు.
► జనరల్ సైన్స్: సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ ఘనత.
► పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ.
► భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలు.
► భారత భౌగోళిక శాస్త్రం(తెలంగాణ భౌగోళిక అంశాలకు ప్రాధాన్యత).
► తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం.
► తెలంగాణ రాష్ట్ర విధానాలు.
► ఆధునిక భారతదేశ చరిత్ర(భారత స్వాతంత్రోద్యమం ప్రాధాన్యం).
► తెలంగాణ చరిత్ర(తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంపై ప్రత్యేక దృష్టి).
► ప్రాథమిక ఇంగ్లిష్ (పదోతరగతి స్థాయి).
సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్–డిప్లొమా స్టాండర్డ్
► మెంటల్ ఎబిలిటీ(వెర్బల్, నాన్ వెర్బల్).
► లాజికల్ రీజనింగ్.
► కాంప్రహెన్షన్ అండ్ రీ అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్.
► న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్.
► బేసిక్ కంప్యూటర్స్.
► మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆటోమేషన్: ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్.
► ఇంటర్నెట్ అండ్ నెట్‌వర్కింగ్ బేసిక్స్.
► బేసిక్స్ ఆఫ్ డేటాబేస్.
ముఖ్యసమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 25, 2021
► దరఖాస్తు ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల అభ్యర్థులకు రూ.80.
► వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/index.jsp
Comments
Please login to add a commentAdd a comment