జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలపై ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ల వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ తదితర ఉద్యోగాలకు ‘ప్రొఫిషియెన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్‌వేర్’ పరీక్షలో అర్హత సాధించడాన్ని తప్పనిసరి చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీపీఎస్సీ/డీఎస్సీ రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారినే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పరీక్ష సిలబస్‌ను ఏపీపీఎస్సీ ప్రకటిస్తుంది.
కంప్యూటర్ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి
Published Tue, May 13 2014 4:18 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement