Computer test
-
ఒక్కో పోస్టుకు పది మంది
సాక్షి, అమరావతి: సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న గ్రామ పశు సంవర్ధక సహాయకుల (వీఏహెచ్ఏ) పోస్టుల కోసం 19,323 మంది దరఖాస్తు చేశారు. ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న 1,896 వీఏహెచ్ఏ పోస్టుల భర్తీకి గత నెల 20వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీతో దరఖాస్తు గడువు ముగియగా, ఒక్కో పోస్టుకు సగటున 10 మంది దరఖాస్తు చేశారు. అనంతపురం జిల్లాలో 473 పోస్టులకు 1,079 మంది దరఖాస్తు చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో 13 పోస్టులకు 1,539 మంది దరఖాస్తులు సమర్పించారు. దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి ఈ నెల 27వ తేదీ నుంచి హాల్‌టికెట్లు జారీ చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన జిల్లా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష రెండు విభాగాలుగా మొత్తం 150 మార్కులకు ఉంటుంది. పార్ట్ ‘ఏ’లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50 మార్కులకు, పార్ట్ ‘బీ’ పశు సంవర్ధక సంబంధిత సబ్జెక్టు 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కుల నిబంధన కూడా ఉంది. ఒక్కో తప్పు సమాధానానికి 1/3వ వంతు చొప్పున మార్కులు తగ్గిస్తారు. ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న వారికి వెయిటేజ్ మార్కులు కూడా కేటాయిస్తారు. గోపాలమిత్ర, గోపాలమిత్ర సూపర్వైజర్లు, 1,962 వెట్స్, ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి ప్రతి ఆర్నెల్ల సర్విసుకు ఒకటిన్నర మార్కుల చొప్పున గరిష్టంగా 15 మార్కుల వరకు కేటాయిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా జిల్లాల వారీగా జాబితాలను విడుదల చేస్తారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా ఎంపిక కమిటీల ఆధ్వర్యంలో రిజర్వేషన్ల దామాషా ప్రకారం తుది జాబితాలను రూపొందించి నియామక పత్రాలు జారీ చేస్తారు. -
4 నుంచి మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–4లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్ స్టెనో, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్థులకు వచ్చే నెల 4 నుంచి 7 వరకు మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. వెరిఫికేషన్ హైదరాబాద్‌లోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఉంటుందని పేర్కొంది. అలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరైన అభ్యర్థులకు మార్చి 8న కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు నిర్వహిస్తామని తెలిపింది. అభ్యర్థులు పోస్టులు, జోన్ల ప్రాధాన్యతలను బట్టి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. వెబ్ ఆప్షన్ల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది. -
9న రైల్వే లోకోపైలట్, టెక్నీషియన్ పరీక్ష
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 26,502 అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ పోస్టులకు ఆగస్టు 9న మొదటి విడత కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. ఈ పరీక్షకు నాలుగురోజుల ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చంది. సాధారణ అభ్యర్థులకు 60 నిమిషాలు, దివ్యాంగులకు అదనంగా 20 నిమిషాల సమయాన్ని కేటాయించనున్నట్లు పేర్కొంది. -
కంప్యూటర్ పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలపై ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్ల వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ తదితర ఉద్యోగాలకు ‘ప్రొఫిషియెన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్’ పరీక్షలో అర్హత సాధించడాన్ని తప్పనిసరి చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీపీఎస్సీ/డీఎస్సీ రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు కంప్యూటర్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారినే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పరీక్ష సిలబస్‌ను ఏపీపీఎస్సీ ప్రకటిస్తుంది.