గోదావరిఖని: సింగరేణిలో 471 జూనియర్ అసిస్టెంట్ (క్లర్క్) ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను ఆదివారం ప్రకటించారు. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఈనెల 11న ఈ పరీక్ష నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జేఎన్‌టీయూ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ విశ్వనాథ్ సింగరేణి రిక్రూట్‌మెంట్ సెల్ జీఎం సి.మల్లయ్యపంతులుకు ఫలితాలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 170 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 70,509 మంది హాజరుకాగా, వీరిలో 96% మంది ఉత్తీర్ణులయ్యారు.
ఈ ఫలితాల్లో మొత్తం 150 మార్కులకు 90.66 మార్కులు సాధించి ఆది లాబాద్ జిల్లాకు చెందిన మాటేటి కృష్ణ మొదటి స్థానంలో నిలిచాడు. ఫలితాలను సింగరేణి వెబ్‌సైట్‌లో పెట్టామని రిక్రూట్‌మెంట్ సెల్ జీఎం తెలిపారు. తప్పొప్పులపై తమ విజ్ఞప్తులను ఈ నెల 28 వరకు రిక్రూట్‌మెంట్ సెల్ దృష్టికి తీసుకురావాలని కోరారు. వీరు ఈ నెల 10కి ముందు తీసిన సర్టిఫికెట్ల ఆధారాలతో రావాలని సూచించారు. ఆ తర్వాతే తుది జాబితా విడుదల చేస్తామన్నారు.
సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల
Published Mon, Oct 19 2015 4:02 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement