జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు
Published Fri, Jan 20 2017 12:28 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ శాఖకు ప్రభుత్వం 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను మంజూరు చేసినట్లు జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌బాబు, గిరికుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని తహసీల్దారు కార్యాలయాలకు ఒక్కో పోస్టు రానుందన్నారు. ప్రస్తుతం తహసీల్దారు కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు హవా నడుపుతున్నారని.. అనేక అక్రమాలకు వీరే బాధ్యులు అవుతున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వం తహసీల్దార్లకు సహాయకంగా ఉండేందుకు కొత్త పోస్టులు మంజూరు చేసిందన్నారు. ఇన్ని పోస్టుల మంజూరుకు రాష్ట్ర రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కృషి కారణమని వివరించారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా నాయకులు రామన్న, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement