సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నెల 4న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను జేఎన్టీయూ–హెచ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సింగరేణి డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ శనివారం రాత్రి విడుదల చేశారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను సింగరేణి సంస్థ వెబ్‌సైట్ www.scclmines.comలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
98,882 మంది అభ్యర్థులకు 77,898 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. నెగిటివ్ మార్కింగ్ విధానంలో పరీక్ష నిర్వహించగా.. 49328 మంది అభ్యర్థులు మాత్రమే కనీస అర్హత మార్కులు సాధించారు. 28,570 మంది పరీక్షలో అర్హత పొందలేదు. మూడు ప్రశ్నలకు సరైన సమాధానం నాలుగు ఆప్షన్లలో లేదని నిపుణులు తేల్చడంతో అభ్యర్థులకు మూడు మార్కులు కలపాలని నిర్ణయించారు. వారం రోజుల్లో ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను సంస్థ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, వారు సమర్పించిన అన్ని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాక తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
చదవండి: ఆ కోరిక తీరకుండానే మరణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు!
Comments
Please login to add a commentAdd a comment