ఖమ్మంలోని వీడీవోస్ కాలనీలోగల మహిళ, శిశు సంక్షేమ–అభివృద్ధి శాఖ కార్యాలయంలోనే ఒక పక్కన వికలాంగులు–వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం ఉంది. వికలాంగులకు రుణాలు మంజూరు చేసేందుకు ఇక్కడ ఒక జూనియర్ అసిస్టెంట్, మరొక ఔట్‌సోర్సిం గ్ ఉద్యోగి ఉన్నారు. ఆ జూనియర్ అసిస్టెంట్ పేరు రేగళ్ల వేణుగోపాల్. ఆయన నెలసరి వేతనం 40 – 50వేల రూపాయలు ఉంటుంది. పాపం.. అది చాల్లేదేమో..! లంచాలకు అలవాటుపడ్డాడు. రుణం మంజూరైన లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేస్తున్నాడు. ఏ ఆసరా లేకనే రుణం కోసం ఇక్కడిదాకా వచ్చిన ఆ వికలాంగులు.. లంచం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు..? ఆ జూనియర్ అసిస్టెంట్ లంచం అడుగుతున్న విషయాన్ని ఆ శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. ప్చ్.. వారు ఏమాత్రం పట్టించుకోలేదు.
ఏసీబీకి చిక్కిన అవినీతి జలగ..!
Published Sun, Feb 11 2018 8:18 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
Advertisement