Kammam
-
ఆలయంలో చోరీ
-
పొలిటికల్ కారిడార్ : తెలంగాణ లో కాషాయ పార్టీ నెక్స్ట్ టార్గెట్ పై చర్చ
-
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో మమతా అనే బాలింత మృతి
-
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల దందా...
-
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు
-
ఖమ్మం లో ఐటీహబ్ ఫేజ్ -2 పనులకు మంత్రి కే టీ ఆర్ శంకుస్థాపన
-
కరోనా టెస్టుల కోసం ప్రజలు క్యూ
-
రేషన్ బియ్యానికి రెక్కలొస్తున్నాయ్..!
ఇల్లెందు(ఖమ్మం): ఇల్లెందు ఏరియాలో రేషన్ బియ్యానికి రెక్కలొస్తున్నాయి. రేషన్ వినియోగదారుల ఇళ్లలో ని ఈ బియ్యం.. గ్రామం దాటి, మహబూబాద్ వెళుతోంది. ఆ తరువాత కాకినాడకు చేరుతోంది. అక్కడి నుంచి సముద్రం దాటి విదేశాలకు వెళుతోంది. మాణిక్యారంలో పట్టివేత ఇల్లెందు మండలం మాణిక్యారం గ్రామం నుంచి 20టన్నుల రేషన్ బియ్యాన్ని లారీలో ఇద్దరు వ్యక్తులు (రామారావు, నర్సయ్య) తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఇల్లెందు పట్టణంలోని చెరువు కట్ట ప్రాంతంలో మాటు వేశారు. రాత్రివేళ అటుగా వచ్చిన ఆ లారీని అడ్డుకున్నారు. విజయవాడకు చెందిన ఏపీ16టీవై 4389 నంబర్ లారీలో మాణిక్యారం గ్రామానికి ఎరువుల బస్తాలు వచ్చాయి. అదే లారీలో బియ్యం తరలిస్తున్నారు. అందులోని 20టన్నుల బియ్యాన్ని స్వా ధీనపర్చుకున్నారు. లారీడ్రైవర్ యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు. అధికారుల అండదండలు...! ఇల్లెందు ఏరియా నుంచి అర్ధరాత్రి అక్రమంగా రేషన్ బియ్యం తరలుతోంది. ఈ దందా వెనుక సంబంధిత అధికారుల హస్తం కూడా ఉందని, దీనికి ప్రతిగా వారికి దండిగానే డబ్బు ముడుతోందని సమాచారం. నెల రోజుల్లో నాలుగు లారీల్లో రేషన్ బియ్యం తరలించారు. ఇల్లెందు, గార్ల, సత్యనారాయణపురం, మాణిక్యారం కేంద్రాలుగా ఈ దందా సాగుతోంది. ఐదారుగురు సభ్యులున్న నాలుగు ముఠాలు ఇలా బియ్యం తరలిస్తున్నాయి. ప్రతి నెల 1వ నుంచి 20వ తేదీ వరకు ఈ ముఠాలు గ్రామాల్లో కేజీ రేషన్ బియ్యాన్ని నాలుగు నుంచి ఆరు రూపాయల చొప్పున కొని ఒకచోట నిల్వ చేస్తున్నాయి. డోర్నకల్,మహబూబాబాద్‌లోని రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి 25 కిలోల సంచుల్లో ప్యాకింగ్ చేసి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. తాజాగా, మాణిక్యారం గ్రామం వద్ద 20 టన్నుల బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. 15 రోజుల ముందు కూడా ఇదే గ్రామం నుంచి మూడు లారీల బియ్యాన్ని మహబూబాబాద్‌కు తరలించారు. సత్యనారాయణపురం గ్రామం నుంచి ట్రాక్టర్ల ద్వారా నిజాంపేట అటవీ ప్రాంతంలోని రహస్య ప్రదేశంలోకి చేర్చారు. అక్కడి నుంచి వాహనంలో మహబూబాబాద్‌కు తరలించారు. గార్ల మండలానికి చెందిన ఒక ముఠా, మాణిక్యారం గ్రామానికి చెందిన ఇంకొక ముఠా, సత్యనారాయణపురం గ్రామానికి చెందిన మూడు ముఠాలు ఇలా బియ్యం తరలిస్తున్నాయి. వీరు స్థానికంగా కిలో నాలుగు నుంచి ఆరు రూపాయలకు కొని, మహబూబాబాద్‌లోని మిల్లర్లకు పది రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఆ మిల్లర్లు రీసైక్లింగ్ చేసి కిలో 20 రూపాయల చొప్పున కాకినాడలో విక్రయిస్తున్నారు. ప్రతి నెల 1 నుంచి 20వ తేదీ వరకు ఈ దందా సాగుతోంది. ఇన్ని ముఠాలు ఇంత యథేచ్ఛగా, దర్జాగా బియ్యం సేకరిస్తుంటే.. తరలిస్తుంటే సివిల్ సప్లై శాఖకు తెలియడం లేదా...? తెలిసినా పట్టించుకోవడం లేదా..? కావాలనే పట్టుకోవడం లేదా...? ఈ అక్రమ దందాకు వారి సహకారం కూడా ఉందా...? ఇన్ని ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ప్యాసింజర్ రైలులో పట్టివేత మధిర: ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ప్యాసింజర్ రైలులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు మంగళవారం మధిరలో పట్టుకున్నారు. నాగులవంచ రైల్వేస్టేషన్లో ముగ్గురు మహిళలు రేషన్ బియ్యాన్ని ప్యాసింజర్ రైల్లో మొత్తం 16 బియ్యం మూటలను ఎక్కించారు. దీనిని సివిల్ సప్లై జిల్లా పర్యవేక్షక కమిటీ సభ్యుడు వేమిరెడ్డి రోసిరెడ్డి గమనించారు వివరాలు అడుగుతుండగానే ఆ ముగ్గురు మహిళలు పరారయ్యారు. ఆ మూటలను మధిర రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులకు, పోలీసులకు అప్పగించారు. ఈ విషయాన్ని సివిల్ సప్లైస్ జిల్లా అధికారి సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లారు. ఆ బియ్యాన్ని రైల్వే పోలీసుల నుంచి సివిల్ సప్లై అధికారులు స్వాధీనపర్చుకున్నారు. కార్యక్రమంలో మధిర రైల్వే స్టేషన్ మాస్టర్ ఆర్వి.కాశిరెడ్డి, జీఆర్పీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ప్లాట్‌ఫాం టీసీ ఎస్ఎస్ కిషోర్‌బాబు, పాయింట్స్‌మెన్ రమణ, తూములూరి మనోజ్ పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి జలగ..!
-
పరిహారమివ్వండి ఊరొదిలిపోతాం
మణుగూరుటౌన్(భద్రాద్రికొత్తగూడెం) : మణుగూరు ఓసీ నుంచి వచ్చే దుమ్ము, ధూళి తో ఇళ్లల్లో ఉండలేకపోతున్నాం.. అని రాజుపేట గ్రామస్తులు మంగళవారం గ్రామంలోని రహదారిపై ఆందోళనకు దిగారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... లారీల మితిమీరిన వేగంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు. లారీలకు కనీసం పట్టాలు కట్టకుండా బొగ్గును రవాణా చేయడం ద్వారా బొగ్గు చూర ఇళ్లల్లోకి చేరుతోందన్నారు. బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు ధ్వంసం అవుతున్నాయని వాపోయారు. తమకు పరిహారం చెల్లిస్తే ఊరు ఖాళీ చేస్తామన్నారు. మణుగూరు ఓసీ రహదారికి బైపాస్ ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యానికి ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, సమస్య పరిష్కారించే వరకు వెళ్లేది లేదని భీష్మించారు. సుమారు నాలుగు గంటల పాటు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న మణుగూరు సీఐ మొగిలి, ఎస్సై జితేందర్ సింగరేణి ఎస్వోటు జీఎం ఎం.సురేష్, గని ఏజెంట్ లలిత్‌కుమార్, సెక్యూరిటీ అ«ధికారి నాగేశ్వర్రావు అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఇళ్ల తొలగింపు విషయం హెడ్ ఆఫీస్ పరిధిలోనిదని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. 11 మందిపై కేసు నమోదు అనుమతులు లేకుండా రోడ్డుపై ఆందోళన చేపట్టారంటూ రాజుపేటకు చెందిన 11 మంది వ్యక్తులపై మణుగూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మణుగూరు ప్రాజెక్టు అధికారి లలిత కుమార్ ఫిర్యాదు మేరకు రాజుపేటకు చెందిన సాంబశివరావు, తార, అక్బర్, పన్నాలాల్, చంద్రశేఖర్, యాణోత్ సతీష్ నాగరాజు, తులసీరాం, భూక్యా వినోద్, బాణోత్ సతీష్, లక్పతి, మంగమ్మలపై కేసు నమోదు చేసినట్లు మణుగూరు సీఐ మొగిలి తెలిపారు. -
తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి
► తొమ్మిది క్రషర్ గేట్లను ఎత్తివేసిన అధికారులు ► ఆనందం వ్యక్తం చేస్తున్న ఏజెన్సీ రైతులు చర్ల(భద్రాచలం): ఏజెన్సీ ప్రాంత రైతాంగ కల్పతరువుగా పేరొందిన తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్ జలకళతో ఉట్టిపడుతోంది. నాలుగు రోజుల క్రితమే ప్రాజెక్ట్ మెయింటినెన్స్ పనుల పూర్తి చేసిన అధికారులు గేట్లను దించి సాగునీటి రాక కోసం ఎదురు చూడడం మొదలు పెట్టగా గేట్లు దించిన రోజు నుంచే ప్రాజెక్ట్‌లోకి సాగునీటి రాక ఆరంభమయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంతో పాటు ప్రాజెక్ట్ ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాలోని వాగుల ద్వారా ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండగా ఆదివారం మధ్యాహ్నం వరదనీటి ఉధృతి పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా 73.10 మీటర్లు ఉంచుతూ ఆదివారం మధ్యాహ్నం 25 క్రషర్ గేట్లలో 9 గేట్లను రెండేసి అడుగుల చొప్పున ఎత్తి 11 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాలుగు రోజుల వరకు ప్రాజెక్ట్‌లోకి నీరు వస్తుందో రాదోనని ఆయకట్టు రైతులు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరడంతో అధికంగా వస్తున్న వరదనీటిని దిగువకు విడుదల చేస్తుండగా ప్రాజెక్ట్ నిండుకుం డలా కళకళలాడుతుంది. ప్రాజెక్ట్‌లోని పూర్తి స్థాయిలో సాగునీరు చేరుకుం దన్న వార్తను తెలుసుకున్న రైతాంగం ఆనందదం వ్యక్తంచేస్తున్నారు. -
మావోయిస్టుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
ఖమ్మం : ఆంధ్రా, తెలంగాణ సరిహద్దులో గల ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని దండకారణ్య గ్రామంలో మావోయిస్టులు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళా దళ కమాండర్ల నేతృత్వంలో జన చేతన నాట్య మండలి కళాకారులు పాటలు , నృత్యాలతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు పాల్గొన్నారు. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు దక్కాలని మావోయిస్టు నేతలు అభిప్రాయపడ్డారు. మావోయిస్టు పార్టీలో పెద్ద ఏరియాల దళ కమాండర్ బాధ్యతలు మహిళలకు ఇవ్వాలని నిర్ణయించారు. -
గులాబీయింగ్
► బేగ్‌కు నామినేటెడ్ పోస్టుతో ఆశావహుల ఎదురుచూపు ► ప్రజాబలం ఉన్న నేతలకే ఇవ్వాలని ఆ పార్టీలో చర్చ ► వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు సాక్షి, ఖమ్మం: అధికార పార్టీ జిల్లా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుంది..? ప్రజాబలం ఉన్న నేతలకే ఇస్తారా..? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రథసార«థి బాధ్యతలు కట్టబెడతారా..? లేక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు దక్కించుకున్న ప్రస్తుత అధ్యక్షుడు బేగ్‌నే ఈ పదవిలో కొనసాగిస్తారా..? అన్న దానిపై టీఆర్ఎస్లో చర్చసాగుతోంది. ఒకవేళ బేగ్‌ను మారిస్తే ఎవరిని జిల్లా అధ్యక్షుడిని చేయాలనే దానిపై ఆపార్టీ నేతలు కసరత్తు మొదలుపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో పార్టీ పదవుల విషయంలో జిల్లాలో పోటీనే లేదు. మిగతా జిల్లాలతో పోలిస్తే ఆపార్టీకి ఇక్కడ తగిన బలం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగాయి. తాము టీఆర్ఎస్లో చేరకముందు ఇతర పార్టీల్లో ప్రాముఖ్యత ఉన్న పదవుల్లో కొనసాగామని, పార్టీ పదవి లేకపోతే నామినేటెడ్ పోస్టు అయినా ఇవ్వాలని రాష్ట్ర స్థాయిలో చేరికల సమయంలోనే హామీలు తీసుకున్నారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీలో జిల్లాకు తగిన ప్రాధాన్యత దక్కింది. అదేవిధంగా జిల్లాలోనూ పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలు భర్తీ చేయడంతో పదవుల కోలాహలం నెలకొంది. ఇంకా జిల్లాలో కొన్ని మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు త్వరలో భర్తీ చేస్తామన్న ఆపార్టీ నేతల ప్రకటనలతో.. ఈపదవులు తమకు దక్కవని నిరాశతో ఉన్నవారు కనీసం జిల్లా, మండల స్థాయిలో పార్టీ పదవులు దక్కుతాయోనన్న ఆశలో ఉన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న బుడాన్బేగ్ను ఇటీవల ప్రభుత్వం రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించడంతో.. జిల్లా పార్టీ అధ్యక్ష పీఠం తమకే దక్కుతుందని ఆపార్టీలోని కొంతమంది నేతలు ధీమాగా ఉన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆశీస్సులు తమకంటే తమకే ఉన్నాయని, పార్టీ అధ్యక్ష పదవి నియామకం చేపడితే ..తమకు పదవి ఖాయమేనని ఆశావహులు భావిస్తున్నారు. జిల్లా పార్టీని నడిపించే సత్తా ఎవరికి ఉంది..? ఫలానా నేత అయితే ఎలా ఉంటుంది, ప్రజాబలం ఎవరికి ఉంది..? అన్న కోణంలో పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ద్వితీయ శ్రేణి నేతల ద్వారా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికలను కీలకంగా తీసుకొని.. 2019లో వచ్చే సార్వత్రిక ఎన్నికలను కీలకంగా తీసుకొని పార్టీ అధ్యక్ష పదవుల నియామకాలు చేపడతామని కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు సభలు, సమావేశాల్లో ప్రకటించారు. అయితే బుడాన్‌బేగ్‌కు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇవ్వడంతో మిగతా జిల్లాల మాదిరిగానే జిల్లాకు కూడా కొత్త రథసారథి కోసం అన్వేషణను రాష్ట్ర నేతలు ప్రారంభించినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కేడర్ జిల్లా అధ్యక్షుడి సూచనల మేరకే నడవాలంటే బలమైన నేతకు ఈ బాధ్యతలు అప్పగించాలన్న యోచనలో ఉన్నారు. బేగ్‌ను కొంతకాలం పాటు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిస్తారా..? లేక కొత్త వారికి సారథ్య బాధ్యతలపై పార్టీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటదోనని ఆశావహులు ఎదురుచూస్తున్నా రు. బేగ్‌కు నామినేటెడ్ పోస్టు ఇవ్వడంతో పార్టీ అధ్యక్ష పీఠం మార్పు ఖాయమని అనుకుంటు న్న వారు మాత్రం జిల్లాతో పాటు రాష్ట్ర నేతలు, మంత్రులను ప్రసన్నం చేసుకుంటున్నారు.