సంధ్య థియేటర్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. తొక్కిసలాట ఘటన గురించి తనకు పోలీసులు సమాచారం అందించలేదని అల్లు అర్జున్ చెప్తోంటే.. ఒక మహిళ చనిపోయిందన్న విషయం కూడా హీరోకు తెలియజేశామని పోలీసులు అంటున్నారు. అయినా సరే పట్టించుకోకుండా తన సినిమా పూర్తయ్యేవరకు అల్లు అర్జున్ అక్కడే ఉంటానన్నాడని తెలిపారు.
బౌన్సర్లకు వార్నింగ్
పదిహేను నిమిషాల తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడన్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పది నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం సంధ్య థియేటర్ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేనన్నారు. అలాగే బౌన్సర్లకు, బౌన్సర్ల ఏజెన్సీలకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులనే తోసుకుని వెళ్తున్న బౌన్సర్లకు అడ్డుకట్ట వేసే అవసరం ఉందన్నారు.
(చదవండి: ఒకరు చనిపోయారని చెప్పినా అల్లు అర్జున్ సినిమా చూశాకే వెళ్తానన్నారు: ఏసీపీ)
వారిదే పూర్తి బాధ్యత
పోలీసులపై, పబ్లిక్‌పై చేయి వేసినా, ముట్టుకున్నా వారిని వదిలిపెట్టమన్నారు. జనాలను తోసేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా ఓవరాక్షన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లను పెట్టుకున్న వారిదే పూర్తి భాధ్యత అని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
చదవండి: ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ రిక్వెస్ట్.. అప్రమత్తంగా ఉండాలని ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment