సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన 10 నిమిషాల సీసీటీవి ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. పుష్ప2 ప్రీమియర్స్ సమయంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఫైర్ అయ్యారు.
ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ గురించి సీఎం పలు వ్యాఖ్యలు చేశారు. వాటికి కౌంటర్‌గా అల్లు అర్జున్ కూడా సంఘటన జరిగిన రోజు సంధ్య థియేటర్ వద్ద ఏమైంది అనేది తన వర్షన్‌ను పంచుకున్నారు. అయితే, తాజాగా పోలీసులు కూడా ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ క్రమంలో చిక్కడపల్లి ఏసిపీ రమేష్ కుమార్ ఘటనరోజు జరిగిన విషయాలను మీడియాతో పంచుకున్నారు.
థియేటర వద్దకు భారీగా ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగిందని, అక్కడ రేవతి అనే మహిళ చనిపోవడమే కాకుండా బాబు పరిస్థితి కూడా సివియర్‌గా ఉందని అల్లు అర్జున్ మేనేజర్‌కు చెప్పాం. ఇదే విషయాన్ని అల్లు అర్జున్‌కు చెప్పాలని మేము ప్రయిత్నం చేశాం. కానీ సంతోష్ మమ్మల్ని కలవనివ్వలేదు. నాకు చెప్పండి నేను అల్లు అర్జున్‌కు చెబుతా అని సంతోష్ చెప్పారు. ఆ సమయంలో నేను ఇదే విషయాన్ని మా డీసీపీకి తెలియజేశాను.
ఆ సమయంలో డీసీపీ ఆదేశాలు మేరకు నేను క్రౌడ్‌ను నెట్టుకుంటూ అల్లు అర్జున్ వద్దకు వెళ్లి విషయం చెప్పాను. మీరు థియేటర్ నుండి వెళ్లి పోవాలి అని ఆయనకు సూచన చేశాను. కానీ, సినిమా చూసి వెళ్తాను అని అల్లు అర్జున్ చెప్పారు. డీసీపీ, నేను వెళ్లి గట్టిగా చెప్పడంతో సుమారు 15 నిమిషాల తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చారు.' అని ఏసిపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment