తోట్లవల్లూరు పంచాయతీలో నిధుల దుర్వినియోగం వ్యవహారంలో డీపీవో చర్య
కంకిపాడు : ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిన జూనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా పంచాయతీ అధికారి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ సిబ్బంది బదిలీల్లో తోట్లవల్లూరు పంచాయతీ కార్యాలయం నుంచి కంకిపాడుకు మేరుగు రాజేష్, మరికొందరు వచ్చారు. తోట్లవల్లూరులో పంచాయతీ ఆదాయాన్ని రాజేష్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఆరోపణలపై ఈనెల ఎనిమి దో తేదీన డీపీవో విచారణ నిర్వహించారు. పంచాయతీలో నిధులు దుర్వినియోగానికి రాజేష్‌ను బాధ్యుడిని చేస్తూ డీపీవో శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కంకిపాడు పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి మైథిలి సస్పెన్షన్ ఉత్తర్వులను శనివారం రాజేష్‌కు అందించారు. తోట్లవల్లూరు పంచాయతీలో రూ 10,36,030 నగదు దుర్వినియోగం అయినట్లు అధికారులు తేల్చారని ఈవో తెలియజేశారు.
జూనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు
Published Sun, Feb 15 2015 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement
Advertisement