సోనియా ఆకుల.. బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్‌లో సెన్సేషన్ అయిన పేరు. నిర్భయంగా, నిర్మొహమాటంగా తనకు ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది. ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా నచ్చింది చేసుకుంటూ పోతుంది. బిగ్‌బాస్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన పృథ్వీ, నిఖిల్‌తో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడింది. ఆ ఇద్దరినీ తన గుప్పిట్లో పెట్టుకుందన్న విమర్శలు కూడా మూటగట్టుకుంది. కట్ చేస్తే షో నుంచి ఎలిమినేట్ అయ్యాక తనపై నెగెటివిటీ వచ్చిందని తెలుసుకుని దాన్ని ఎలాగోలా కవర్ చేసేయాలనుకుంది.
నిఖిల్‌కు ఆహ్వానం.. కానీ!
అందుకుగానూ తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దోడు అలియాస్ నిఖిల్‌నే నామినేట్ చేసింది. సోషల్ మీడియాలోనూ అతడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టింది. ఇప్పుడు షో పూర్తయింది కాబట్టి అంతా కలిసిపోయారు. తన పెళ్లికి రమ్మని శుభలేఖ ఇచ్చిందట. ఆమెపై అలిగాడో, కోపమో, పనివల్లో కానీ సోనియా వివాహానికి నిఖిల్ డుమ్మా కొట్టాడు. అయితే గత సీజన్ విజేత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం సోనియా రిసెప్షన్‌కు హాజరై ఆమెను ఆశీర్వదించాడు.
పుష్ప లెవల్‌లో ఎంట్రీ
ఈమేరకు తన గ్రాండ్ ఎంట్రీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ చుట్టూ ఇద్దరు, ముగ్గురు బౌన్సర్లు కూడా ఉన్నారు. కొత్త జంటను కలిసిన అనంతరం బిగ్‌బాస్ సెలబ్రిటీలందర్నీ పలకరించాడు. ఇక ఈ వీడియోకు పుష్ప 2 మూవీలోని గంగో రేణుక తల్లి పాటను యాడ్ చేయడం గమనార్హం. ఇది చూసిన జనాలు ఇతడేంటి? హీరోలా ఫీలైపోతున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment