
సాక్షి, కోనసీమ: ఏపీలో మహాసేన రాజేష్‌పై పోలీసు కేసు నమోదైంది. సోషల్ మీడియాలో మహాసేన రాజేష్, ఆయన అనుచరులు వేధిస్తున్నారని మహిళ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లాలో టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్‌పై కేసు నమోదుచేశారు పోలీసులు. మహాసేన రాజేష్, అతడి అనుచరులు వేధిస్తున్నారని శంకరగుప్తం గ్రామానికి చెందిన శాంతి ఫిర్యాదుతో కేసు నమోదైంది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, రాజేష్‌తో పాటు నలుగురు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments
Please login to add a commentAdd a comment