ముంబయి:మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ శివసేన (ఉద్ధవ్) పార్టీ ఐదుగురు రెబెల్ నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్‌లను ఉపసంహరించుకోకపోవడం వల్లే వేటు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది.పార్టీ టికెట్ దక్కని నేతలు ఆయా నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.
వీరందరినీ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పార్టీ ఆదేశించింది. ఈ ఆదేశాలను వారు పెడచెవిన పెట్టడం వల్లే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పార్టీ ఆదేశించింది. కాగా,మహారాష్ట్రలో నవంబరు 20న మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.23న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలు.. తులసేంద్రపురంలో పూజలు
Comments
Please login to add a commentAdd a comment